బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డుకు ఎంపిక అయ్యారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ 2022న ఫిబ్రవరి 6న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు, సమాజానికి సేవలందిస్తున్న వారికి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ పురస్కారాన్ని అందజేస్తున్నారు. తొలుత ఈ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు.
ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే ఈ పురస్కారం అందుకున్నారు. 2024కి గాను అమితాబ్ బచ్చన్‌కి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డు ఇవ్వనున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు ప్రకటించారు. అదే విధంగా భారతీయ సంగీతానికి చేసిన కృషికిగానూ ఏఆర్ రెహమాన్ కూడా ఈ పురస్కారం అందుకుంటారు. అలాగే సామాజిక సేవా రంగంలో ‘దీప్‌స్తంభ్ ఫౌండేషన్’ మనోబల్‌కు కూడా ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఈ నెల 24న లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి. అదే రోజు ఈ పురస్కారాల పంపిణీ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment