బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకోనున్నారు. అమితాబ్ బచ్చన్‌ను లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించనున్నట్లు మంగేష్కర్ కుటుంబం మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 6, 2022న మరణించిన లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డును అందజేస్తున్నారు. లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 24న ఈ పురస్కారంతో అమితాబ్‌ను సత్కరించనున్నారు.
కాగా.. 2023లో ఈ అవార్డ్‌ను మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లేకు బహుకరించారు. అంతేకాకుండా భారతీయ సంగీతానికి చేసిన కృషికి గానూ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కూడా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందుకోనున్నట్లు వారి కుటుంబం వెల్లడించింది. సామాజిక సేవా రంగంలో సేవలకు గాను లాభాపేక్షలేని సంస్థ దీప్‌స్తంభ్ ఫౌండేషన్ మనోబల్‌కు కూడా ఈ అవార్డును అందజేయనున్నారు. వీరితో పాటు మరికొంత మంది ప్రముఖులు సైతం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి హృదయనాథ్ మంగేష్కర్ అధ్యక్షత వహిస్తారని.. ఆశా భోంస్లే చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment