lata mangeshkar
-
నా బిడ్డవు కదూ..!
రేఖ ‘క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా’! లత ‘క్వీన్ ఆఫ్ మెలడీ’! ఈ ఇద్దరు రాణుల మధ్య దూరం వయసులో 25 ఏళ్లు. ఇప్పుడైతే ఇంకా దూరం. లత రెండేళ్ల క్రితం నింగికేగారు. ఆ దేవరాగానికి ఒక ‘శ్రావ్యరూపం’గా రేఖ ఈ భువిని వెలిగిస్తూ ఉన్నారు. ‘‘కానీ అది దూరం కాదు. మరింతగా దగ్గరితనం’’ అంటారు రేఖ!‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ నెల 7న స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ‘ఎవర్గ్రీన్ ఐకాన్ రేఖ’ అనే ఎపిసోడ్లో ప్రేక్షకులకు కనువిందు చేసిన అందాల నటి రేఖ.. గాయని లతా మంగేష్కర్తో తనకున్న ‘రక్త సంబంధాన్ని’ గుర్తు చేసుకున్నారు. ‘‘ఒకసారి లతాజీ నన్ను తన బర్త్‌డే పార్టీకి ఆహ్వానించారు. ఆ పార్టీలో నేను స్టేజి ఎక్కి, ‘లతా అక్కా.. నేను మీకు బిగ్ ఫ్యాన్‌ని’ అని గట్టిగా అరిచి చెప్పాను. ఆ వెంటనే, ‘దేవుడా, నువ్వు కనుక వింటున్నట్లయితే నాదొక కోరిక. వచ్చే జన్మలోనైనా లతా అక్కను నాకు కూతురిగా పుట్టించు..’’ అని వేడుకున్నాను. అందుకు లతాజీ వెంటనే, ‘వచ్చే జన్మ దాకా ఎందుకు. ఈ జన్మలో కూడా నేను నీ కూతురిని కాగలను’ అంటూ.. నేరుగా స్టేజి పైకి వచ్చి నన్ను ‘మమ్మా.. మమ్మా’ అని పిలిచారు. ఆ పిలుపు ఈనాటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది’’.. అని లతకు, తనకు మధ్య ఉన్న ‘తల్లీకూతుళ్ల బంధం’ గురించి కపిల్ షోలో.. చెప్పారురేఖ. లతకు, రేఖకు మధ్య ఉన్న గాన మాధుర్య బాంధవ్యం గురించైతే చెప్పే పనే లేదు. ‘తేరే బినా జియా జాయే నా’, ‘నీలా ఆస్మాన్ సో గయా’, ‘ఆజ్కల్ పాన్ జమీ పర్ నహీ పడ్తే’, ‘సలామే ఇష్క్ మేరీ జాన్’, ‘దేఖా ఏక్ ఖాబ్’ వంటి మనోహరమైన గీతాలను రేఖ కోసం లత పాడారో, లత కోసం రేఖ అభినయించారో చెప్పటం అంటే.. ఎన్ని జన్మలకైనా వాళ్లిద్దరిలో తల్లెవరో, కూతురెవరో గుర్తు పట్టే ప్రయత్నమే! -
ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
బాలీవుడ్ దిగ్గజ లెజండరీ గాయని లతా మంగేష్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన మధురమైన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు గొప్ప క్రికెట్ అభిమాని కూడా. భారతదేశం ప్రపంచ క్రికెట్లో సూపర్ పవర్‌గా లేని రోజల్లో అనూహ్యంగా టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలుచుకుని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఆ ఘట్టం చరిత్రలో మర్చిపోని గొప్ప రోజు. అయితే ఆ రోజుల్లో బీసీసీఐ వద్ద సరిపడ నిధులు కూడా లేవు. ఇంతటి ఘన విజయం అందించిన ఆటగాళ్లుకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. ఆ టైంలో మన క్రికెటర్లను సత్కరించేందుకు తన వంతుగా మద్దతు ఇస్తూ ఏం చేశారో తెలుసా..!జూన్ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో ఆ రోజును ఎవరు మర్చిపోలేరు. ఇంగ్లండ్ గడ్డపై భారత్ నిలిచి అందరికి షాక్ ఇచ్చింది. ఆ రోజు చిరస్మరణీయమైనది, ప్రత్యేకమైనది. భారత్‌లో క్రికెట్ ఉన్నంత కాలం ఆ రోజుని ఎప్పటికీ మరిచిపోలేం. కపిల్ దేవ్(Kapil Dev) సారథ్యంలో టీమిండియా తొలి ప్రపంచకప్ గెలిచి ఇప్పటికీ 40 ఏళ్లు. జూన్ 25, 1983న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్(World Cup) సాధించి మంచి ఊపుమీద ఉన్న వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 43 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచే భారత క్రికెట్లో కొత్త శకం మొదలైంది. ఈ వన్డే ప్రపంచకప్ గెలవడానికి ముందు, టీమ్ ఇండియా 1975 మరియు 1979 ప్రపంచకప్‌లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీల్లో భారత్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ రెండు టోర్నీల్లో వెస్టిండీస్(West Indies) ఛాంపియన్‌గా నిలిచింది. అయితే హ్యాట్రిక్ విజయంపై ఆశలు పెట్టుకున్న వెస్టిండీస్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. నిజానికి భారత్ లీగ్‌లోనే స్వదేశానికి చేరుకుంటారనేది అందరి ఊహగానాలు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ..ఈ టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలిచి తొలి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది. ఆ ఏడాది ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్(World Cup Final) జరిగింది. తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేసింది. కానీ ఆశించినంత స్థాయిలో స్కోర్ చేయలేదు. కేవలం 54.4 ఓవర్లలో 183 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్‌కు ఈ లక్ష్యం పెద్దది కాదు. మంచి మంచి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే బౌలర్లు మదన్ లాల్, మొహిందర్ అమర్నాథ్ ధాటికి విండీస్ 140 పరుగులకే ఆలౌటైంది. భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయి సంబరాలు చేసుకుంది. ఈ ఘన విజయంతో భారత్‌లో యువత ఆసక్తి క్రికెట్ వైపు మళ్లింది. అభిమానుల సంఖ్య పెరిగింది. గల్లీ గల్లీలో క్రికెట్ ఆడేంతగా ఆ ఆటపైక్రేజ్ పెరిగిపోయింది. అయితే అప్పట్లో బీసీసీ వద్ద నిధులు లేవు. కనీసం భారత్‌కి ఇంత ఘన కీర్తిని తెచ్చిపెట్టిన ఆటగాళ్లను సత్కరించేందుకు కూడా బీసీసీఐ వద్ద డబ్బులు లేవు. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్‌కేపీ సాల్వే, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న రాజ్‌సింగ్ దుంగార్పూర్లు లతా మంగేష్కర్‌ను సంప్రదించి ఈ విషయాన్ని చెప్పారు. అందుకు మద్దుతు ఇవ్వడంతో దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో లతా మంగేష్కర్ కచేరిని ఏర్పాటు చేసి ఫండింగ్‌ని కలెక్ట్ చేశారు. ఈ కచేరీ ద్వారా అప్పట్లో దాదాపు రూ. 20 లక్షలు దాక నిధులను బీసీసీఐ సేకరించింది. జీవితకాల పాస్..ఆ మొత్తం నుంచి 14 మంది ఆటగాళ్లకు వారి అత్యుత్తమ ప్రదర్శనకు గానూ ప్రోత్సాహకంగా రూ. 1 లక్ష చొప్పున అందించారు. ఇక సంగీత కచేరి కోసం లతా మంగేష్కర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సమయంలో తమకు సహాయం చేసిన లతా మంగేష్కర్‌కు బీసీసీఐ పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా భారత క్రికెట్ జట్టు మ్యాచ్ జరుగుతున్నా.. లతా మంగేష్కర్ చూసేందుకు ఉచిత పాస్ అందించారు. అంటే జీవితకాల పాస్ అన్నమాట. ఆమె జీవితకాలం ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆమె ఉచితంగా చూడొచ్చు. కానీ ఆమె ఎప్పుడూ ఆ పాస్ ఉపయోగించలేదు. కానీ బీసీసీఐ మాత్రం ఆమె సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. లతా మంగేష్కర్ గౌరవ సూచకంగా భారతదేశంలో ఆడే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌కు బోర్డ్ ఎప్పుడూ రెండూ టికెట్లను లతా మంగేష్కర్ కోసం రిజర్వు చేసింది. ముఖ్యంగా ప్రపంచ కప్ గెలిచిన కపిల్ దేవ్ బృందం కోసం లతా మంగేష్కర్ సోదరుడు పండిట్ హృద్యనాథ్ ప్రత్యకంగా ఓ పాటే రాయడం విశేషం.ఇలాంటి వాళ్లు తమ కళతోనే గొప్పగొప్ప సేవకార్యక్రమాలు చేసి చరిత్రలో నిలిచిపోవడమే గాక భావితరాలకు గొప్ప స్ఫూర్తిగా ఉంటారు.(చదవండి: యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్‌గా ప్రమాణ స్వీకారం..!) -
అమితాబ్.. రెహమాన్‌లకు లతా మంగేష్కర్ అవార్డు
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డుకు ఎంపిక అయ్యారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ 2022న ఫిబ్రవరి 6న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు, సమాజానికి సేవలందిస్తున్న వారికి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ పురస్కారాన్ని అందజేస్తున్నారు. తొలుత ఈ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే ఈ పురస్కారం అందుకున్నారు. 2024కి గాను అమితాబ్ బచ్చన్‌కి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డు ఇవ్వనున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు ప్రకటించారు. అదే విధంగా భారతీయ సంగీతానికి చేసిన కృషికిగానూ ఏఆర్ రెహమాన్ కూడా ఈ పురస్కారం అందుకుంటారు. అలాగే సామాజిక సేవా రంగంలో ‘దీప్‌స్తంభ్ ఫౌండేషన్’ మనోబల్‌కు కూడా ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఈ నెల 24న లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి. అదే రోజు ఈ పురస్కారాల పంపిణీ ఉంటుంది. -
బిగ్ బీకి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్ ప్రకటన!
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకోనున్నారు. అమితాబ్ బచ్చన్‌ను లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించనున్నట్లు మంగేష్కర్ కుటుంబం మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 6, 2022న మరణించిన లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డును అందజేస్తున్నారు. లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 24న ఈ పురస్కారంతో అమితాబ్‌ను సత్కరించనున్నారు. కాగా.. 2023లో ఈ అవార్డ్‌ను మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లేకు బహుకరించారు. అంతేకాకుండా భారతీయ సంగీతానికి చేసిన కృషికి గానూ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కూడా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందుకోనున్నట్లు వారి కుటుంబం వెల్లడించింది. సామాజిక సేవా రంగంలో సేవలకు గాను లాభాపేక్షలేని సంస్థ దీప్‌స్తంభ్ ఫౌండేషన్ మనోబల్‌కు కూడా ఈ అవార్డును అందజేయనున్నారు. వీరితో పాటు మరికొంత మంది ప్రముఖులు సైతం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి హృదయనాథ్ మంగేష్కర్ అధ్యక్షత వహిస్తారని.. ఆశా భోంస్లే చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. -
'ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని అస్సలు చేయను'..స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ గురించి తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది చంద్రముఖి-2 అలరించిన ముద్దుగుమ్మ.. ఈ ఏడాదిలో ఎమర్జన్సీ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఇందిరాగాంధీ ప్రధాని ఉన్న సమయంలో విధించిన ఎమర్జన్సీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా పెట్టిన తాజా పోస్ట్ వైరల్‌గా మారింది. తనకు తాను లతా మంగేష్కర్తో పోల్చుకున్న కంగనా.. డబ్బుల కోసం సెలబ్రిటీల వివాహాల్లో డ్యాన్స్ చేయనని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్‌పై నెట్టింట చర్చ మొదలైంది. తనకు డబ్బుల కంటే.. ఆత్మ గౌరవమే ముఖ్యమని తెలిపింది. కాగా.. స్టార్ సింగర్ లతా మంగేష్కర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంత డబ్బిచ్చినా పెళ్లిళ్లలో పాడనని చెప్పారు. అయితే ఇటీవల అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు డ్యాన్స్‌లు వేస్తూ కనిపించారు. అంతే కాదు ఈ వేడుకల్లో డ్యాన్స్ చేసినందుకు భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కంగనా వారిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కంగనా చేసిన పోస్ట్‌కు కొందరు నెటిజన్స్ మద్దతుగా నిలవగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. -
ఏడేళ్ల వయసులోనే పాటతో దోస్తీ.. లెజెండరీ సింగర్ జర్నీ..
లతా మంగేశ్కర్ రాకతో గానానికి జ్ఞానం వచ్చింది! ఆ జ్ఞానం సినిమా గానాన్నే కాదు మొత్తం సంగీత క్షేత్రాన్నే సుసంపన్నం చేసింది; ఆ జ్ఞానం గాన, సంగీత అభిమానుల్ని పరవశింపజేసింది. శాస్త్రీయ సంగీత గానం, సినిమా గానం, లలిత గానం అనే వర్గీకరణలకు అతీతంగా లతా మంగేశ్కర్ ఒక మహోన్నతమైన గాయని. సంగీత క్షేత్రంలో లత గానం, గాత్రం మహోన్నతంగా వెల్లివిరిశాయి. Rounded even, clear resonant voice లతా మంగేశ్కర్ది. లత Timbre ఆమె వచ్చిన సమయానికి మన దేశంలో న భూతో; సంగీత దర్శకుడు గులాం హైదర్ ఈ విషయాన్ని ముందుగా పసిగట్టారు. తరువాత ఆ Timbre న భవిష్యతి కూడా అయింది. విశిష్టమైన గాత్రం లత గాత్రం. Verve ఉంటుంది లత గాత్రంలో. లత గాత్రం సహస్రాబ్ధి గాత్రం (Voice Of Millennium). ఖేంచంద్ ప్రకాష్ సంగీతంలో మహల్ సినిమాలో "ఆయేగా ఆయేగా..." పాటతో ఊపందుకున్న లత గానం ఆ పాట వచ్చిన సంవత్సరం (1949)లోనే శంకర్-జైకిషన్ సంగీతంలో బర్సాత్ సినిమాలో "జియా బేకరార్ హై...", "బర్సాత్ మే హంసే మిలే...", "హవామే ఉడ్తా జాయే..." పాటలతో మొత్తం దేశాన్నే ఊపేసింది. నాణ్యత, రంజన రెండూ లత గానంలో రాజిల్లాయి. లత స్థాయి నాణ్యమైన, ఆమెలా రాణించిన మఱొక గాయని మనదేశంలో లేరు. Lata has unerring sense of pitch and rhythm. "లతా సుర్ కా అవ్తార్" అని అన్నారు బడే గులామ్ అలీఖాన్. సినిమా పాటలంటే చిన్నచూపు ఉన్న శాస్త్రీయ సంగీత విద్వాన్ బడే గులామ్ అలీఖాన్. ఆయన లతా మంగేశ్కర్ గాత్రానికి, గానానికి ముగ్ధులయ్యారు. "శ్రుతి అవతారం లత" అని అంటూ అలా, అంతలా ప్రస్తుతించారు. ఠుమ్రీ గాన విధానానికి బడే గులామ్ అలీ ఖాన్ మార్గ దర్శకుడు. ఆయన స్ఫూర్తితో బాజూబంద్ (1954) హిందీ సినిమాలో లత గొప్పగా ఒక ఠుమ్రీ పాడారు. మన దేశ చలన చిత్ర గానంలో bel canto పురుషుల పరంగా మొహమ్మద్ రఫీ, మహిళల పరంగా లత తోనే మొదలయింది! స్వర సమం (తాళ సమం కాదు), mood, balance, diction, modulation, expression వీటిపై లతా మంగేశ్కర్కు గొప్ప అవగాహన ఉంది. "Lata sings others make miserable effort" అని అన్నారు మన దేశంలోనే ప్రశస్తమైన చలన చిత్ర సంగీత దర్శకుడు సజ్జాద్ హుస్సైన్. హల్చల్ చిత్రంలో సజ్జాద్ హుస్సేన్ సంగీతంలో "ఆజ్ మేరే నసీబ్..." పాటలో లత గానం metronomical balanceతో ఉంటుంది. మదన్ మోహన్ సంగీతం చేసిన అన్పధ్ సినిమాలోని "ఆప్ కీ నజ్ రోనే సంఝా..." గానం balance అన్నదానికి సరైన అభివ్యక్తి. రుస్తమ్ సొహరాబ్ చిత్రంలో సజ్జాద్ హుస్సేన్ సంగీతంలో "ఏ దిల్ రుబా..." పాట ఒక్క లత మాత్రమే అంత గొప్పగా పాడగలరు. శంకర్-జైకిషన్ సంగీతంలో "జా జారే జా బాలమ్..." (సినిమా: బసంత్ బహార్), "ఓ బసంతీ పవన్..." (సినిమా: జిస్ దేశ్ మే గంగా బహ్ తీ హై), "రసిక్ బల్ మా..."( సినిమా: చోరీ చోరీ), "ఏ షామ్కీ తన్ హాయియా..."(సినిమా: ఆహ్) వంటి ఎన్నో అద్భుతాల్ని పాడారు లత. నౌషాద్ సంగీతంలో బైజుబావ్రా సినిమాలో పాడిన "మొహెభూల్ గయె సావరియా" పాట మరెవరు పాడినా అంత గొప్ప పాట కాకుండా పోయేది. భారతదేశ చలన చిత్రాలలోనే అత్యుత్తమమైన జోల పాట సి. రామచంద్ర సంగీతం చేసిన అల్బేలా సినిమాలో లత పాడిన "ధీరేసే ఆజా..." పాట. అటు తరువాత ధోభీగా జమీన్ సినిమాలో సలిల్ చౌధురీ సంగీతం చేసిన "ఆజారీ ఆ నిందియా...", సన్సార్ సినిమాలో రోషన్ సంగీతం చేసిన "హన్సే టిమ్ టిమ్...", పూనమ్ సినిమాలో శంకర్- జైకిషన్ సంగీతం చేసిన "ఆయీ ఆయీ రాత్ సుహానీ...", కట్పుత్లీ సినిమాలో శంకర్-జైకిషన్ సంగీతం చేసిన "సోజా రే సోజా మేరీ..." వంటి దేశంలో వచ్చిన గొప్ప జోల పాటలు లత పాడడంవల్ల మరింత గొప్ప జోల పాటలయ్యాయి. సలిల్ చౌధురీ సంగీతంలో లత పాడిన "ఓ సజ్ నా..." , టాంగా వాలీ సినిమాలో "మే లుట్ గయీ దునియా వాలో..." అంటూ పాడిన పాట, అన్నదాత సినిమాలో " రాతో మే క్యా క్యా.." పాట విశేషమైనవి. ఎస్.డి. బర్మన్ సంగీతంలో "మేఘా ఛాయా ఆధీ రాత్..." (సినిమా: షర్మిలీ) వంటి పలు ఉదాత్తమైన పాటలు పాడారు లత. "సునో సజ్నా..." (సినిమా: ఆయే దిన్ బహార్ కే) అంటూనూ, "జీవన్ డోర్ తుమ్ హీ..." (సినిమా: సతీ సావిత్రీ) అంటూనూ, "సత్యమ్ శివమ్ సుందరమ్..." (సినిమా: సత్యమ్ శివమ్ సందరమ్) అంటూనూ లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ సంగీతంలో గొప్ప పాటలు పాడారు లత. ఆర్.డి.బర్మన్ సంగీతంలో లత పాడిన "రేనా బీతి జాయే షామ్ న ఆయే..." పాట గాన కళకు ఉచ్చ స్థితి. గాన కళను మెఱుగు పఱుచుకుంటే పోతే ఒక దశలో రేనా బీతి జాయే పాటలాగా వస్తుంది. ఆర్.డి.బర్మన్ సంగీతంలో "క్యా జానూ సజన్..." ( సినిమా: బహారోంకే సప్నే), "సీలీ హవా ఛూ గయే..."( సినిమా: లిబాస్), "నా కోయీ ఉమంగ్ హై..." (సినిమా: కటీ పతంగ్), "తేరే లియే పల్కోంకీ ఝాలర్..." (సినిమా: హర్జాయీ) వంటి ప్రతేకమైన పాటలు పాడారు లత. "తుమ్ క్యా జానో తుమ్హారీ యాద్..." అంటూ సి. రామచంద్ర సంగీతంలో (సినిమా: శిన్ శినాకీ బూబ్లబూ) లత చేసిన గానం మరో గాయని అందుకోలేని ఔన్నత్యం. భావ యుక్తంగా బాగా పాడడం అన్నదానికి మించి Mood (మనోధర్మం), spirit, అతీతమైన మేలిమి(super fineness), profoundity, శ్రుతి శుభగత్వం వీటితో ఈ పాటలో లత గానం అత్యుదాత్తంగా ఉంటుంది. ఇలా అత్యుదాత్తంగా రోషన్ సంగీతంలో "ఇస్ దిల్ కీ హాలత్ క్యా కహి యే..." (సినిమా: అన్హోనీ), పండిత్ రవి శంకర్ సంగీతంలో "హాయ్ రే వొ దిన్..." (సినిమా: అనూరాధా), నౌషాద్ సంగీతంలో "మొహే పన్ఘట్..."(సినిమా: ముఘల్-ఎ-ఆజమ్), "తోడ్ దియా దిల్ మేరా..." (సినిమా: అందాజ్) హేమంత్ కుమార్ సంగీతంలో "కుచ్ దిల్ నే కహా..." (సినిమా: అనుపమ), హృదయానాథ్ మంగేశ్కర్ సంగీతంలో "యారా సీలీ సీలీ..." (సినిమా: లేకిన్), ఖయ్యామ్ సంగీతంలో "బహారో మేరా జీవన్ భీ సవారో..." (సినిమా: ఆఖ్రీకత్), ఎస్. డి. బర్మన్ సంగీతంలో "థండీ హవాయే..." (సినిమా: నౌజవాన్) చిత్రగుప్త సంగీతంలో "దిల్ కా దియా జలా కే గయా..." (సినిమా: ఆకాశ్ దీప్) మదన్ మోహన్ సంగీతంలో "లగ్ జాగలే కే ఫిర్ హసీ రాత్..."(సినిమా: వో కౌన్ థీ), "న తుమ్ బేవఫా హో న హమ్ బేవఫా హై..."(సినిమా: ఏక్ కలీ ముస్కాఈ) సజ్జాద్ హుస్సైన్ సంగీతంలో "వొ రాత్ దిన్ వొ చాందినీ..." (సినిమా: సైయా), "కిస్మత్ మే ఖుషీ కా నామ్ నహీ..." (సినిమా: సైయా), వంటి పాటలూ, ఇంకా పలు పాటలూ పాడారు లత. తెలుగులో సుసర్ల దక్షిణామూర్తి సంగీతంలో "నిద్దుర పోరా తమ్ముడా అంటూ గొప్పగా పాడారు లత. అంతకు ముందు తెలుగువారైన ఈమని శంకర శాస్త్రి సంగీతంలో బహుత్ దిన్ హుఎ సినిమాలో "చందా చమ్కే నీల్ గగన్ మే..." అంటూ గొప్పగా పాడారు లత. ఆఖరి పోరాటం సినిమాలో ఇళయరాజా సంగీతంలో "తెల్లచీరకు తకధిమి తపనలు..." అంటూ చక్కగా పాడారు ఆమె. ఎ.ఆర్. రహ్మాన్‌తో సహా పలువురు సంగీత దర్శకులకు పలు భాషల్లో పలు ఉన్నతమైన పాటలు పాడారు లత. 1929 సెప్టెంబర్ 28న పుట్టిన లత తన 7వయేట తండ్రి మరాఠీ నాటకం సుభద్రాలో నారదుడి వేషంలో పాడుతూ నటించారు. ఆ తరువాత 13యేళ్ల వయసులో మరాఠీ సినిమా పహిలీ మంగల్ గౌర్ (1945) సినిమాలో నటిస్తూ తనకు "నటాలీ చైత్రాచి నవలాయీ" అన్న మరాఠీ పాట పాడుకున్నారు. లత తన మొదటి హిందీ పాట "హిందూస్థానీ లోగో..." అంటూ గజభావూ(1945) అన్న మరాఠీ సినిమాలో నటిస్తూ పాడుకున్నారు. 1945లో వచ్చిన బడీమా హిందీ సినిమాలో నటించి తనకు తాను "తుమ్ హో బడీ మా..." అంటూ ఒక పాట పాడుకున్నారు. ఈ బడీమా సినిమాలో "నట్ కట్ హటీ లే గోపాల్..." అంటూ లత తొలిసారి నేపథ్య గానం చేశారు. ఆ తరువాత 1946లో వచ్చిన ఆప్ కీ సేవా మే హిందీ సినిమాలో "ఏక్ నయే రంగ్ మే...", "పా లాగూ కర్ జోరి రే..." పాటలు పాడారు. ఈ ఆప్ కీ సేవా మే పాటలు బొంబాయిలో రికార్డ్ అయిన లత తొలి పాటలు. ఇవి ఆమె నేపథ్య గానం చేసిన తొలి పాటలు కావు. పూణేలో రికార్డ్ అయిన బడీమా సినిమాలోని "నట్ కట్ హటీ లే గోపాల్..." పాట నేపథ్య గాయనిగా లత పాడిన తొలి పాట. 2019లో "సౌగంధ్ ముఝే ఇస్ మిట్టి కీ..." అంటూ మన దేశ సైన్యానికి నివాళిగా తన చివరి పాట పాడారు లత. సినిమా పాటలు, భజన్లు, గజళ్లు, లలిత గీతాలు, అభంగ్లు, బెంగాలీ సంగీతం, జానపద సంగీతం ఇలా పలు ధోరణుల్లో లత గానం ప్రవహించింది. అన్ని భాషల్నీ కలుపుకుని 6,550 పైచిలుకు సినిమా పాటలూ, ఇంచు మించు 1,000 ఇతర పాటలూ లత పాడారని తెలుస్తోంది. ఎంత ఎక్కువగా ఊహించుకున్నా ఈ సంఖ్య 8,000 పైచిలుకు దాటకపోవచ్చు. లత 40,000 లేదా 30,000 పాటలు పాడారని చెప్పబడుతూండడం సరి కాదు. పాడడం అన్న కళ లతా మంగేశ్కర్వల్ల పరిపుష్టమైంది, పరిఢవిల్లింది, పరిపూజనమైంది. Rendition-intensity లేదా ప్రగాఢమైన గానం లత వైశేష్యం. Profound singingతో, rounded even singingతో లత ఒక గాన శకం అయ్యారు. లతా మంగేశ్కర్ 'ఒక ప్రకృతి అద్భుతం' అన్న మాట ఉంది. సంగీత ప్రపంచానికి ప్రకృతి ఇచ్చిన వర వరం లత. 'Lata, a boon and boost to the world of music". ఎనెన్నో పురస్కారాలు, బిరుదులు ఆమెను దక్కించుకున్నాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారత్ రత్న ఆమెవయ్యాయి. రత్నానికి అరగడం ఉండదు; రత్నం ఎప్పటికీ వాడిపోదు. లత గానం శ్రేష్ఠమైన రత్నం. అది ఎల్లప్పుడూ మనలో మెఱుస్తూనే ఉంటంది; మనకై మెఱుస్తూనే ఉంటుంది. 6/2/2022 న లత తుది శ్వాస విడిచారు. లతా మంగేశ్కర్కు వర్ధంతులు వస్తూ ఉంటాయి. కానీ ఆమె గానానికి వర్ధంతులు ఉండవు! ఎందుకంటే ఆ గానం మరణించలేదు కాబట్టి; ఆ గానానికి మరణం రాదు కాబట్టి. ఇవాళ మనతో లత శరీరం లేదు. కానీ ఆమె శారీరం ఈ మట్టిలో, ఈ మట్టి ప్రజలో, సంగీత ప్రపంచంలో ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఎల్లప్పుడూ నిలిచి ఉండే గాన తటిల్లత లత. - రోచిష్మాన్, 9444012279 -
లతా మంగేష్కర్ ఆఖరి రామ శ్లోకాన్ని షేర్ చేసిన ప్రధాని మోదీ!
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న అభిజీత్ లగ్నంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమం పలువురు ప్రముఖుల సమక్షంలో జరగనుంది. ప్రముఖ బాలీవుడ్ నటులు, గాయకులు, దర్శకులు, కళాకారులను ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఆహ్వానించారు. ప్రధాని మోదీ తన ట్విట్టర్ హ్యాండిల్లో అయోధ్యకు సంబంధించిన అప్డేట్లను తరచూ షేర్ చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ గాయని లతామంగేష్కర్‌కు సంబంధించిన ఒక వీడియోను ‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో షేర్ చేశారు. అయోధ్యలో జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో గాయని లతా మంగేష్కర్‌ను మిస్ కావడం విచారకరమని అన్నారు. As the nation awaits 22nd January with great enthusiasm, one of the people who will be missed is our beloved Lata Didi. Here is a Shlok she sung. Her family told me that it was the last Shlok she recorded. #ShriRamBhajanhttps://t.co/MHlliiABVX — Narendra Modi (@narendramodi) January 17, 2024 లతా మంగేష్కర్ కీర్తనలలో ఒకదానిని ‘ఎక్స్’లో షేర్ చేసిన ప్రధాని.. ఇది లతా మంగేష్కర్ పాడగా, రికార్డ్ చేసిన చివరి శ్రీరాముని శ్లోకమని తెలిపారు. ఈ శ్లోకం పేరు ‘శ్రీ రామ్ అర్పణ్’. దీనిలో లతా మంగేష్కర్ మధురమైన గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇది కూడా చదవండి: నాలుగేళ్లలో పదింతల అభివృద్ధి! -
లతా మంగేష్కర్‌కు ఆ విధంగా నివాళి అర్పించిన రెహమాన్ కుమార్తె
వారంతా స్త్రీలే. 26 దేశాల మహిళలు కలిసి దుబయ్‌లో ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా’గా ఏర్పడ్డారు. తమ ప్రదర్శనలతో అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా లతా మంగేష్కర్‌కు నివాళిగా ఆమె పాడిన ఐదు పాటలను ‘కుహు కుహు’ పేరుతో ఆల్బమ్‌గా విడుదల చేశారు. ఏ.ఆర్. రెహమాన్ కుమార్తె ఖతిజా రెహమాన్ ఈ ఐదు పాటలు పాడింది. ‘లతా ఒక శక్తి. మేమందరం ఈ ఆల్బమ్ ద్వారా స్త్రీ శక్తిని చాటాం’ అని తెలిపింది ఖతిజా.శ్రోతలకు ఇదో శ్రావ్యమైన కానుక. ‘ఆర్కెస్ట్రా అనగానే రికార్డింగ్ స్టుడియోలో, స్టేజ్ మీద మగవారు నిండిపోయి ఉంటారు. కండక్టర్‌గా ఎప్పుడూ సూట్ వేసుకున్న మగవాడే కనిపిస్తాడు. ఈ స్టీరియోటైప్ మారాలి. ప్రపంచంలో ఉత్తమమైన మ్యుజీషియన్స్‌గా స్త్రీలు ఉన్నారు. వారంతా తమ ప్రతిభను చూపాలి. మేమంతా అందుకే ఒక వేదిక మీదకు వచ్చి పెర్ఫామ్ చేస్తున్నాం’ అంటారు దుబయ్‌లోని ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా’ సభ్యులు. 26 దేశాల నుంచి 51 మంది మహిళా సంగీతకారులు ఇక్కడ తమ సంగీతాన్ని వినిపిస్తున్నారు. ప్రోగ్రామ్‌లు ఇస్తున్నారు. వీరికి ఇక్కడ రికార్డింగ్ స్టుడియో ఉంది. ఇందులో సినిమాలకూ పని చేస్తున్నారు. ఎమిరేట్స్ మహిళా మంత్రి రీమ్ అల్ హష్మి ఏ.ఆర్.రెహమాన్‌ను మహిళలను ప్రోత్సహించే ఆర్కెస్ట్రాను దుబాయ్‌లో ఏర్పాటు చేయమని కోరారు. రెహమాన్ ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేయడంలో సాయపడి పర్యవేక్షిస్తున్నారు. వారితో రికార్డింగ్స్ కూడా చేస్తున్నారు. పొన్నియన్ సెల్వమ్ 2’ రీ రికార్డింగ్ ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలోని మహిళలే చేశారు. అరెబిక్ సౌందర్యం ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలో వివిధ దేశాల మహిళా సంగీతకారులు పని చేస్తున్నా ఈ ఆర్కెస్ట్రా ముఖ్య ఉద్దేశం అరబిక్ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో మిళితం చేసి కొత్త అందాన్ని తీసుకురావడమే. ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా లో తమతమ దేశాలకు చెందిన నేటివ్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు అరేబియాలో ఉపయోగించే సంగీత పరికరాలు కూడా వాడి గొప్ప మిళిత సంగీతాన్ని సృష్టిస్తున్నారు. ‘మేమంతా వేరువేరు జీవితాలు, వేరు వేరు సంగీత ధోరణుల నుంచి వచ్చాం. కాని రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టి ఒక్కటిగా మారి సమష్టిగా సంగీతాన్ని సృష్టిస్తాం. ఈ అనుభూతి అద్భుతంగా ఉంటుంది’ అంటారు ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా సభ్యులు. వీరికి కండెక్టర్‌గా మోనికా ఉమ్మెన్ అనే మహిళ పని చేస్తోంది. లతాకు నివాళి తండ్రి పర్యవేక్షణలో సాగుతున్న ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాతో కలిసి పని చేయడానికి ముందుకొచ్చింది ఖతిజా రెహమాన్. ‘నేను వారితో పని చేసినప్పుడు వారు చూపిన ప్రేమ చాలా నచ్చింది’ అంటుందామె. గాయని అయిన ఖతిజా ఇటీవల తమిళ సినిమాలకు సంగీతం కూడా అందిస్తోంది. లతా మంగేష్కర్‌కు నివాళిగా ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాతో కలిసి ‘కుహు కుహు’ ఆల్బమ్ తయారు చేసింది. ‘మేమందరం లతా పాటలను పునఃసృష్టించాలనుకున్నాం’ అంది ఖతీజా. లతా పాడిన ఐదు పాటలను ఎంపిక చేసుకుని ఖతీజా ఈ ఆల్బమ్‌లో పాడింది. అవి 1. పియా తోసే నైనా లాగేరే (గైడ్), 2.ఆప్ కీ నజరోనే సంఝా (అన్పడ్), 3. ఓ సజ్నా బర్ఖా బహార్ ఆయీ (పరఖ్), 4. కుహు కుహు బోలే కోయలియా (సువర్ణ సుందరి), 5. బేకస్ పె కరమ్ కీజియే (మొఘల్ ఏ ఆజమ్). ఈ ఐదు పాటలకు ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలోని మహిళలు సంగీతం అందించారు. బాణీలు యధాతథంగా ఉన్నా ఆర్కెస్ట్రయిజేషన్లో తమ సృజనను ప్రదర్శించారు. సాధారణంగా పాత పాటలు కొత్త తరహాగా పాడితే నచ్చవు. కాని ఖతీజా గళం, ఫిర్దౌస్ సంగీతం శ్రోతలకు శ్రావ్యమైన అనుభూతిని ఇచ్చాయి. గొప్ప గాయని లతా మంగేష్కర్‌కు ఇది ఒక మంచి నివాళిగా నిలిచిపోతుంది. -
నేను పాడుతుంటే మధ్యలోనే ఆపించేసింది లతా మంగేష్కర్ గారు
-
బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం (ఫొటోలు)
-
బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం (ఫొటోలు)
-
ఆమె వల్లే వాణీ జయరాం మద్రాస్‌కు వచ్చేశారు..!
వాణీ జయరాం గొంతు దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని అలరించింది. దేశంలోని పలు భాషల్లో ఆమె తన గాత్రాన్ని వినిపించింది. ఇటీవలే ఆమె కృషికి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించి గౌరవించింది. అయితే ఆమె హఠాన్మరణంతో అవార్డు స్వీకరించకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఇవాళ చెన్నైలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఏలిన వాణీ జయరాం గురించి తెలుసుకుందాం. మూడుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా పురస్కారాలు అందుకున్న వాణీ జయరాం 1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరులో ఓ సంగీత కుటుంబంలో వాణీ జయరాం జన్మించారు. పద్మావతి, దొరైస్వామి ఆమె తల్లిదండ్రులు. వాణీ పుట్టగానే ఆమె తండ్రి ఓ సిద్ధాంతిని కలిసి జాతకం చూపించగా.. ‘మీ పాప భవిష్యత్తులో సుమధుర గాయని అవుతుంది. అందుకే కలైవాణి అని పేరు పెట్టమని చెప్పారట. ఆ మాట వినగానే అప్పుడు వాణీ తండ్రి నవ్వుకున్నారు కానీ.. ఆ మాటలు నిజమని తేలడానికి ఎన్నో ఏళ్లు పట్టలేదు. ఆమె దాదాపు 19 భాషల్లో పాటలు పాడింది. 1971లో జయా బచ్చన్ చిత్రం గుడ్డితో అరంగేట్రం చేసిన బోలే రే పాపిహరా పాటతో జైరామ్ సంగీతంలోకి ప్రవేశించారు. అప్పట్లో బాలీవుడ్లో లతా మంగేష్కర్, తెలుగులో సుశీల, జానకి లాంటి గాయకురాలు జోరు కొనసాగుతోంది. అదే సమయంలో తన ప్రత్యేకమైన కంఠస్వరంతో గుర్తింపు సాధించింది వాణీ. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు పదేళ్లపాటు సంగీత ప్రపంచాన్ని శాసించారు. వాణీ జయరాం కెరీర్ హిందీలోనే ప్రారంభమైంది. అందువల్లే ఆమె హీందీ పాటలంటే మొదటి నుంచి ఇష్టం. ఆమె పాటలకు మంచి ఆదరణ రావడంతో తనకు ఎక్కడా పోటీగా వస్తుందేమోనని లతా మంగేష్కర్ చాలా భయపడ్డారు. తొలి చిత్రం గుడ్డితో పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో లతా ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లింది వాణీ జయరాం. కానీ ఆమెను కలిసేందుకు లతా నిరాకరించారు. లతా మంగేష్కర్తో వైరం ఆ తర్వాత 1979లో విడుదలైన మీరా సినిమాతో వారిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది. మీరా సినిమాకు రవిశంకర్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు గుల్జార్. అయితే అది లతా మంగేష్కర్‌కు నచ్చలేదు. తన సోదరుడిని సంగీత దర్శకునిగా తీసుకోకపోతే తాను పాటలు పాడేది లేదని తేల్చి చెప్పారు. దీంతో వాణీ జయరాంతో పాటలన్నీ పాడించారు గుల్జార్. అలా వాణీపై లతా మధ్య వైరం పెరిగింది. కొన్నాళ్ల తర్వాత బాలీవుడ్లో రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేశారు వాణీ. తెలుగులో 'అభిమానవంతులు' సినిమాలో 'ఎప్పటివలె కాదురా' అనే పాటతో నన్ను ఎస్పీ కోదండపాణి పరిచయం చేశారు. తెలుగులో పాడిన పాటలు తక్కువే అయినా.. అవన్నీ సూపర్ హిట్ సాంగ్సే. -
సుమన్ గొంతు లతాతో సమానం! అయినా ఆమెను ఎదగనివ్వలేదా? ఇన్నాళ్లకు
సుమన్ కల్యాణ్‌పూర్, లత ఒక విధంగా ఒకే మెట్టు మీద ఉండాలి. లత అభిమానులు కూడా సుమన్ కల్యాణ్‌పూర్ గొంతు లతాతో సమానం అంటారు. కాని సుమన్‌కు చాలా కొద్ది పాటలు లభించాయి. ఆమెను కొందరు ఎదగనివ్వలేదని అంటారు. బిడియం, హుందాతనం ఉన్న సుమన్ కల్యాణ్‌పూర్ అవకాశాల కోసం కలబడకుండా తప్పుకుని నిలబడింది. కాని ఆమె పాటలు నిలబడే ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున ఆమె ఉండే అపార్ట్మెంట్ భవంతిలో అగ్నిప్రమాదం. అదే రోజు పద్మభూషణ్ ప్రకటన.జనవరి 28 ఆమె 87వ పుట్టినరోజు. ఇన్ని సందర్భాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇన్నాళ్లకైనా తమ అభిమాన గాయనికి గౌరవం దక్కినందుకు అభిమానులు యూ ట్యూబ్‌లో ఆమె పాటల ప్లే బటన్ నొక్కుతున్నారు. నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే న తుమ్ హమే జానో – న హమ్ తుమే జానే మగర్ లగ్తా హై కుచ్ ఐసా మేరా హమ్దమ్ మిల్గయా... 1962. ‘బాత్ ఏక్ రాత్ కీ’ సినిమాలో దేవ్ ఆనంద్– వహీదా రెహమాన్ మీద చిత్రించిన ఈ పాట పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత రేడియోలో శ్రోతలు తెగ ఫర్మాయిష్ చేయసాగారు... ఈ పాట ప్లే చేయమని. గాయకుడు హేమంత్ కుమార్ అందరికీ తెలుసు. గాయని లతా మంగేష్కర్... అని అందరూ అనుకున్నారు. కాదు. ఆ గొంతు సుమన్ కల్యాణ్‌పూర్‌ది. చెప్తే తప్ప తెలియదు. అదే మాధుర్యం. అదే తీపి. అదే పూలరెక్క సౌకుమార్యం. అదే అగరుపొగ ధూపం. అవునా... అని అందరూ నోరు తెరిచారు. లతాలా పాడుతున్న గాయని, లతా అంత బాగా పాడుతున్న గాయని సుమన్ కల్యాణ్‌పూర్ తెర మీదకు వచ్చిన సందర్భం అది. దానికి కారణం లతానే. అవును. ‘బాత్ ఏక్ రాత్‌కీ’కి సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్. ఆ సినిమా చేస్తున్నప్పుడు లతాకీ, బర్మన్కూ మాటలు లేవు. లతా లేకపోతే సినీ సంగీతమే లేదు అనుకుంటున్న రోజులు అవి. కాని బర్మన్కు పట్టుదల జాస్తి. సుమన్‌ను వెతికాడు. పాట చేశాడు. హిట్ కొట్టాడు. కాని లతా ఉండగా ఇతర గాయనులకు సంగీతమే ఉండదు అని మెల్లగా ఆ తర్వాత అర్థమైంది. సుమన్ పాట మీద ఎంత ప్రేమ ఉన్నా అది వినిపించక పోతే ఏమిటి చేయడం? నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే కర్నా థా ఇన్కార్ మగర్ ఇక్రార్ తుమ్హీసే కర్ బైఠే (జబ్ జబ్ ఫూల్ ఖిలే) సుమన్ కల్యాణ్‌పూర్‌ది బెంగాల్. వాళ్ల కుటుంబం ఆమె తండ్రి కాలంలో ఢాకా మీదుగా ముంబైకి చేరుకుంది. తండ్రి బ్యాంక్ ఉద్యోగి. ఐదుమంది అమ్మాయిల్లో సుమన్ పెద్దది. ఆ రోజుల్లో అమ్మాయిలను ఆ నాటి తల్లిదండ్రులు ఎలా పెంచారో అలానే సుమన్‌ను పెంచారు. దానికి సుమన్ స్వభావసిద్ధ సిగ్గు, బిడియం తోడైంది. అది ప్రవర్తనలోనే. కాని గొంతు విప్పితే పక్షి రెక్క విప్పినట్టు ఆమె పాట హాయిగా తరంగాలు సృష్టించేది. ఠెహరియే హోష్‌మే ఆలూ తొ చలే జాయియేగా... ఆప్కో దిల్ మే బిఠావూ తో చలే జాయియేగా... (మొహబ్బత్ ఇస్కో కెహెతే హై) ముంబైలో డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజీ వేదిక మీద ఒక పాట పాడితే ఆ వేడుకకు గెస్ట్‌గా హాజరైన తలత్ మెహమూద్ ఎంతో మెచ్చుకున్నాడు. అప్పుడు సుమన్ వయసు 16. అయినా సరే సుమన్‌ను హెచ్.ఎం.వి.కి రికమండ్ చేశాడు. ఆ తర్వాత సంగీత దర్శకుడు షఫీ ఆమెకు మొదటి అవకాశం ఇచ్చాడు. 1954లో వచ్చిన ‘దర్వాజా’ సుమన్ మొదటి సినిమా. కాని 1962లో ‘న తుమ్ హమే జానో’ పాటతో ఆమెకు గుర్తింపు వచ్చింది స్టార్ అయ్యింది. కాని అప్పటికే లతా ఏకఛత్రాధిపత్యం సాధించింది. ఆశా భోంస్లే కూడా కూడదీసుకుంది. వీరిద్దరి కారణాన గీతా దత్, షంషాద్ బేగం... వంటి గాయనులే అవకాశాలు లేని స్థితికి చేరుకున్నారు. సుమన్ గొంతు లతా గొంతులా ఉండటంతో లతా దృష్టి ఈమె మీద ఎక్కువగా పడిందని అంటారు. సుమన్‌తో పాడిస్తే ఆ సంగీత దర్శకులకు లతా పాడటం కష్టం అయ్యేది. ఆ భయంతో సుమన్‌కు అవకాశాలు రాలేదు. కాని లతా మంగేష్కర్, రఫీలు రాయల్టీ విషయంలో భేదాభిప్రాయాలతో ఒకరికి మరొకరు పాడటం మానుకున్నారు. పాట ఒకసారి పాడి డబ్బు తీసుకున్నాక ఇక రాయల్టీ అవసరం లేదని రఫీ అభిప్రాయం. ఒక పాట తాలూకు రికార్డులు అమ్ముడయినంత కాలం గాయనీ గాయకులకు రాయల్టీ ఇవ్వాల్సిందేనని లతా అభిప్రాయం. ఈ తగాదా సుమన్‌కు కొద్దిగా లాభించింది. లతా పాడకపోవడం వల్ల రఫీ, సుమన్ కలిసి చాలా డ్యూయెట్లు పాడారు. షమ్మీ కపూర్ కోసం చేసిన ఈ పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆజ్ కల్ తేరె మేరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్ సబ్కో మాలూమ్ హై ఔర్ సబ్కో ఖబర్ హోగయి (బ్రహ్మచారి) తుమ్ నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే దిల్ హతేలీ మే లే ఆయేరే (రాజ్ కుమార్) అదొక్కటే కాదు... సుమన్‌కు చొరవ లేకపోవడం వల్ల తన సామర్థ్యానికి తగ్గ డిమాండ్ చేయలేకపోవడం వల్ల ఆమె ‘పేదవాడి లత’గా మారింది. అంటే లతా మంగేష్కర్‌కు ఇచ్చేంత డబ్బు లేనివారు సుమన్ చేత పాడించేవారు. దాంతో చిన్న సినిమాలకు సుమన్ పాడాల్సి వచ్చేది. వాటిలో పాటలు ఎంత బాగా ఉన్నా ప్రచారం పొందేవి కావు. సుమన్‌కు 1958లో పెళ్లి అయ్యింది. ఆమె నేరుగా సంగీత దర్శకులతో, నిర్మాతలతో మాట్లాడేది కాదు. భర్త అవన్నీ చూసేవాడు. దాని వల్ల కూడా ఆమెకు సంగీత ప్రపంచంలో ఏమి జరుగుతున్నదో తెలియలేదు. కొన్నిసార్లు ఆమె బాగా పాడిన పాటలు సినిమాల్లో తొలగించబడేవి. లేదా అవే పాటలు మరొకరి గొంతులో వినిపించేవి. చాలా సున్నిత స్వభావం ఉన్న సుమన్ ఇదంతా నాకు అవసరమా అనుకుంది. కాని అభిమానులు మాత్రం ఆమె గొంతు అవసరమే అనుకున్నారు. షరాబీ షరాబీ ఏ సావన్ కా మౌసమ్ ఖుదాకీ కసమ్ ఖూబ్సూరత్ న హోతా... (నూర్ జహాన్) సుమన్‌కు ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు డాక్టరు. అందరూ ముంబై లోఖండ్ వాలాలోని ఒకే అపార్ట్మెంట్లో వేరు వేరు ఫ్లాట్లలో ఉంటారు. మొన్న బుధవారం ఆ బిల్డింగ్‌లో షార్ట్ సర్క్యూట్ అయితే అందరినీ తీసుకుని ఆమె రోడ్డు మీద గడపాల్సి వచ్చింది. కాని అదే రోజు ఆమెకు పద్మభూషణ్ ప్రకటన అందింది. జనవరి 28 ఆమె పుట్టినరోజు. ఇది ఒక అందమైన పుట్టినరోజు కానుక. సుమన్ ఎంతో ప్రతిభావంతురాలు. ఎన్ని వందల పాటలో పాడి ఉండాలి. కాని ఆమె గొంతు మీద నీడ కదలాడుతూనే ఉండిపోయింది. ఇప్పుడు ఇది కొద్దిగా వెలుతురు. కాని తీరం చేరిపోయాక పడవకు దొరికిన ఓదార్పు. ‘మమత’ (1966)లో ఈ పాటను లతా పాడింది. చాలా ఫేమస్. కాని ఇదే పాటను రఫీతో (లతా పాడదు కనుక) సుమన్ కల్యాణ్‌పూర్ డ్యూయెట్గా పాడింది. లతా ఎంత మార్దవంగా పాడిందో సుమన్ కూడా. వినండి. ఈ పాట ఆ సిగ్గరి గొంతుకు బంగారు తొడుగు. రహేనా రహే హమ్ మెహ్కా కరేంగే బన్కే కలి బన్ కే సబా బాగ్ ఏ వఫా మే.... చదవండి: శెభాష్.. ఒకేసారి ఇద్దరు మహిళా డీజీపీలు -
లతా మంగేష్కర్ నా సినిమా జీవితానికి ఆమె వీసా ఇచ్చింది
‘మన జీవితంలో పండగ వచ్చినా, నిశ్చితార్థం జరిగినా, పెళ్లి వేడుక, పిల్లాడు పుట్టినా, సుప్రభాత పూజ చేస్తున్నా... ప్రతి సందర్భానికి లతా పాడిన పాట ఉంటుంది. వింటాము. లతా అలా మన జీవితంలో మనకు తెలియకుండానే నిండి పోయింది. అందుకనే ఆమె ఎప్పటికీ వినపడుతూనే ఉంటుంది’ అని గీత రచయిత గుల్జార్ అన్నారు. శనివారం జరిగిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో లతా మంగేష్కర్ మీద వెలువడ్డ తాజా పుస్తకం ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ ఆవిష్కరణ సందర్భంగా గుల్జార్ మాట్లాడారు. ‘బందినిలో మొర గోర అంగ్ లైలే... నా మొదటి పాట. కాని దానికి మూడేళ్ల ముందు నుంచి లతా దీదీ సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్తో మాట్లాడటం లేదు. ఎస్.డి.బర్మన్ కూడా ఆమెతో మాట్లాడదలుచుకోలేదు. నేనేమో పాట రాశాను. లతా నా పాటను మెచ్చి మొత్తం మీద పాడి నాకు సినిమా రంగంలో ప్రవేశానికి వీసా ఇచ్చింది. ఆ తర్వాత తను ప్రొడ్యూసర్‌గా నా దర్శకత్వంలో ‘లేకిన్’ నిర్మించింది. నేను ఆమె మీద అభిమానంతో ‘నామ్ గుమ్ జాయేగా’ (కినారా) పాట రాశాను. ఆ పాటలోని ‘మేరి ఆవాజ్ హీ పెహెచాన్ హై’ అనే లైన్‌ను మీరు ఆటోగ్రాఫ్ చేసేప్పుడు మెన్షన్ చేసేందుకు వీలుగా రాశాను అని లతాతో చెప్పాను. ఆ లైనే ఆమె బతికి ఉండగానేగాక మరణించాక ఒక అస్తిత్వంగా మారింది’ అన్నాడు. ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ పుస్తక రచయిత యతీంద్ర మిశ్రా మాట్లాడుతూ ‘ఇవాళ గాయనీ గాయకులు పొందుతున్న రాయల్టీ సౌకర్యాలకు, అవార్డులకు లతా మొదలెట్టిన పోరాటమే కారణం. ఫిల్మ్‌ఫేర్ అవార్డు కొత్తల్లో గాయనీ గాయకులకు ఇచ్చేవారు కాదు. సంగీత దర్శకులకే ఇచ్చేవారు. ‘చోరి చోరి’ సినిమాలోని ‘రసిక్ బల్మా’ పాటకు శంకర్ జైకిషన్కు ఫిల్మ్‌ఫేర్ వచ్చింది. ఆ వేడుకలో ఆ పాట పాడమని జైకిషన్ లతాను పిలిచాడు. అవార్డు మీకు వచ్చింది... వెళ్లి ట్యూన్ వాయించండి సరిపోతుంది అందామె. గాయని లేకుండా పాట ఎలా? టైమ్స్ గ్రూప్ అధినేత రంగంలో దిగి ఫోన్ చేసి బతిమిలాడినా పాడలేదు. దాంతో ఇంకో రెండేళ్లకు గాయనీ గాయకులకు ఫిల్మ్‌ఫేర్ ప్రవేశపెట్టారు. రాయల్టీ విషయంలో కూడా లతా పట్టుదల వల్లే గాయనీ గాయకులకు డబ్బులు వచ్చాయి’ అని తెలియచేశాడు. లతా పాడిన పాటల వెనుక కథలు, విశేషాలతో ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ వెలువడింది. -
అయోధ్యలో లతామంగేష్కర్ పేరు మీద చౌక్...7.9 కోట్లతో భారీ వీణ ఏర్పాటు..
అయోధ్య: లెజండరీ సింగర్ దివగంత లతామంగేష్కర్ 93వ జయంతి పురస్కరించుకుని ఆమె పేరు మీద అయోధ్యలో ఒక కూడలిని ఏర్పాటు చేశారు. దీన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. ఈమేరకు సరయు నది వద్ద ఉన్న కూడలిలో దాదాపు రూ. 7.9 కోట్ల వ్యయంతో భారీ వీణను ఏర్పాటు చేశారు. ఈ వీణ దాదాపు 40 అడుగుల పొడవు, 12 మీటర్ల ఎత్తులో 14 టన్నుల బరువు ఉంటుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వట్టర్లో...లతా దీదీ జయంతి సందర్భంగా ఆమెని స్మరించుకోవడమే గాక ఆమె తనపై చూపిన ఆప్యాయతను మరువలేనిదన్నారు. ఈ రోజు అయోధ్యలోని చౌక్‌కి ఆమె పేరు పెట్టడం అనేది భారతీయ దిగ్గజాలలో ఒకరిగా పేరుగాంచిని లతా దీదీకి దక్కిన తగిన నివాళి అని అన్నారు. ఈ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఈ భారీ సంగీత వాయిద్యం సంగీత ప్రియులకు గొప్ప ఆకర్షణగా ఉండటమే గాక ఇంత బారీ సంగీత పరికరాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రధమమని అధికారులు తెలిపారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఈ ప్రాజెక్టుకి సుమారు 7.9 కోట్లు ఖర్చు అయ్యిందని తెలిపారు. ఈ భారీ సంగీత వీణను పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ తయారు చేశారని, సుమారు రెండు నెలల సమయం పట్టిందని తెలిపారు. అందంగా తీర్చిదిద్దిన ఈ వీణపై సరస్వతి చిత్రం కూడా చెక్కబడి ఉందని అన్నారు. (చదవండి: రాహుల్‌ని చూసి భావోద్వేగం.. వెక్కి వెక్కి ఏడ్చిన యువతి: వీడియో వైరల్) -
ఆస్కార్ అవార్డు కమిటీపై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్, కారణం ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు 2022 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా ముగిసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనీ ప్రముఖులు పాల్గొన్నారు. క్రిస్ రాక్ చెంపను విల్ స్మిత్ పగలగొట్టడం లాంటి చిన్న చిన్న వివాదాలు మినహా.. కార్యక్రమం అంతా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఆస్కార్ అవార్డు కమిటీపై ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణంగా.. ఆస్కార్ అవార్డ్స్ ‘ఇన్ మెమోరియమ్’ విభాగంలో దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్, దివంగత ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ పేర్లను ప్రస్తావించకపోవడమే. 93వ ఆస్కార్ అవార్డ్స్ (2021) సమయంలో రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌లకు ఆస్కార్ ‘ఇన్ మెమోరియమ్’లో స్థానం కల్పించిన నేపథ్యంలో ఈ ఏడాది లతా మంగేష్కర్, దిలీప్ కుమార్‌లను విస్మరించడంతో ఆస్కార్ కమిటీ మెమరీ (జ్ఞాపక శక్తి) లో వీళ్లిద్దరూ లేరా? అనే చర్చ మొదలైంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ వచ్చిన చిత్రాలకు ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉంది. ‘ఇన్ మెమోరియమ్’ని కూడా ఆ ప్రాతిపదికన తీసుకుంటే... లతా మంగేష్కర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్ను మూశారు కాబట్టి ఆమె పేరుని ప్రస్తావించలేదని ఆస్కార్ వివరణ ఇచ్చుకోవడానికి లేదు. ఎందుకంటే గత ఏడాది జూలైలో మరణించిన దిలీప్ కుమార్‌ని అయినా ప్రస్తావించాలి కదా.. సో.. ఆస్కార్ చేసినది ముమ్మాటికీ తప్పిదమే అన్నది నెటిజన్ల మాట. -
క్రికెటర్‌ను ప్రేమించిన లతా మంగేష్కర్, పెళ్లెందుకు చేసుకోలేదంటే?
ఇది గాయని లతా మంగేష్కర్ ప్రేమ కథ. ‘ఇంటికి పెద్ద కూతురు.. చిన్న వయసులోనే తోబుట్టువుల మంచి,చెడులు చూసుకోవాల్సి వచ్చింది. ఆ బాధ్యతకే జీవితాన్ని అంకింతం చేసి ఒంటరిగా మిగిలిపోయింది’ అని లతా మంగేష్కర్ గురించి తెలిసిన కొందరు చెబుతారు. ‘సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ల చేష్టలు .. వాటి పర్యవసానాలు పిల్లలకు పాఠాలవుతాయి. కానీ లతా విషయంలో అది రివర్స్ అయింది. ప్రేమ, పెళ్లికి సంబంధించి లతా చెల్లెలు ఆశా భోంస్లే తీసుకున్న తొందరపాటు, ఆవేశపూరిత నిర్ణయాలు.. వాటి తాలూకు ఫలితాలు లతాను జీవితాంతం అవివాహితగానే ఉంచాయి’ అనేది ఇంకొందరు సన్నిహితుల అభిప్రాయం. ‘ఆమె ఇష్టపడ్డ మనిషి.. ఆ ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లకపోవడంతో ఏ తోడు లేకుండానే జీవితాన్ని గడిపేసింది’ అని మరికొందరి ఆప్తుల మాట. లతా మంగేష్కర్ ప్రేమించిన వ్యక్తి.. క్రికెటర్, దుంగార్పూర్(రాజస్థాన్) సంస్థానాధీశుడు లక్ష్మణ్ దుంగార్పూర్ కుమారుడు.. రాజ్ సింగ్ దుంగార్పూర్. రంజీల్లో రాణించాడు. బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా)కు ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. అభిమాని.. లతా మంగేష్కర్‌ను, రాజ్ సింగ్ దుంగార్పూర్ను కలిపింది క్రికెటే. ఆమెకు క్రికెట్ మీద చక్కటి అవగాహన ఉంది. ఆ ఆటకు వీరాభిమాని కూడా. లతా ఒక్కరే కాదు మంగేష్కర్ కుటుంబమంతా క్రికెట్ అభిమానులే. దాంతో ఆమె తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్‌కి రాజ్ సింగ్ దుంగార్పూర్ మధ్య స్నేహం బలపడింది. అలా మంగేష్కర్ కుటుంబానికే ఆత్మీయుడిగా మారిపోయాడు అతను. ఆ సాన్నిహిత్యమే లతా, రాజ్ సింగ్ ఒకరంటే ఒకరు ఇష్టపడేలా చేసింది అంటారు ఇద్దరినీ ఎరిగిన మిత్రులు. పెళ్లిదాకా ఎందుకు రాలేదు? ‘మా తాత, మా అమ్మ, పిన్ని ఒప్పుకోకపోవడం వల్లే’ అంటుంది రాజ్ సింగ్ దుంగార్పూర్ మేనకోడలు రాజశ్రీ కుమారి. ‘సినిమా గాయని రాజ కుటుంబపు కోడలెలా అవుతుందనేది వాళ్ల అభ్యంతరం. నాకింకా గుర్తు.. నా చిన్నప్పటి విషయం ఇది.. ఒకసారి బాంబేలోని బికనీర్ హౌస్‌కి లతా మంగేష్కర్ని పిలిచారు. మా అమ్మ, పిన్ని.. తమ తమ్ముడిని వదిలేయమని, అప్పుడే అతను తమకు తగినట్టుగా ఏ రాజ్‌పుత్ అమ్మాయినో లేదంటే ఏ రాజవంశస్తురాలినో చేసుకుంటాడు అని లతాకు చెప్పారు. కానీ లతాతో రిలేషన్షిప్ వదులుకోవడానికి మామయ్య ఇష్టపడలేదు’ అని రాజశ్రీ కుమారి తన ‘ది ప్లేస్ ఆఫ్ క్లౌడ్స్’ అనే పుస్తకంలో రాసింది. ఆమె రాసిన ఈ విషయాన్ని దుంగార్పూర్ వంశస్తులు ఖండించారు. రాజ్ సింగ్ కుటుంబ సభ్యుడొకరు ‘రాజ్ సింగ్ మొదటి నుంచీ సర్వస్వతంత్రుడిగానే ఉన్నాడు. ఎవరో కట్టడి చేస్తే ఆగే మనిషి కాదు అతను. రాజ్ సింగ్ కన్నా లతా ఆరేడేళ్లు పెద్ద. వాళ్లది లేట్ వయసు ప్రేమ. బహుశా ఈ కారణాలతో వాళ్లిద్దరూ పెళ్లిచేసుకోకపోయుండొచ్చు’ అంటాడు. ఇలా వాళ్ల ప్రేమ గురించి వాళ్లిద్దరి సన్నిహితులు చెప్పడమే కానీ ఇటు లతా మంగేష్కర్ కానీ.. అటు రాజ్ సింగ్ కానీ ఎప్పుడూ నిర్ధారించలేదు. అయితే తనకు అత్యంత ఆప్తుల్లో రాజ్ సింగ్ దుంగార్పూర్ ఒకరని చాలా సార్లు చాలా ఇంటర్వ్యూల్లో లతా మంగేష్కర్ చెప్పారు. ఆమె కోసం రాజ్ సింగ్ లార్డ్స్ స్టేడియం గ్యాలరీలోని సీట్‌ను పర్మినెంట్‌గా రిజర్వ్ చేయించారనేది ప్రచారంలో ఉంది. ‘నిజమేనా?’ అని లతాని అడిగారు నస్రీన్ కబీర్ మున్ని.. ‘లతా మంగేష్కర్ .. ఇన్ హర్ ఓన్ వాయిస్’ పుస్తక రచయిత. దానికి లతా నవ్వుతూ ‘కాదు. లార్డ్స్‌లో నాకెలాంటి రిజర్వేషన్ లేదు. సామాన్య ప్రేక్షకుల్లాగే ఆ స్టేడియంలో మ్యాచ్‌లు చూస్తా’ అని జవాబిచ్చారు. ‘రాజ్ సింగ్, లతా మంగేష్కర్లది పరిణతి చెందిన ప్రేమానుబంధం. దానికి లేనిపోని కల్పనలు జోడించొద్దు. ఆమెకు అతని ఆస్తి అవసరం లేదు. అతనికి ఆమె కీర్తితో సంబంధం లేదు. ఆ ఇద్దరికీ వాళ్లకు మాత్రమే సొంతమైన ప్రత్యేకతలున్నాయి. వాళ్ల సహజీవనానికి ఉన్న అడ్డంకులను అర్థం చేసుకున్నారు. ఒకరికొకరు బలమయ్యారు.. పెళ్లితో కలవకపోయినా.. ప్రేమకు గౌరవమిచ్చారు ’ అని చెప్తారు ఇరు కుటుంబ సభ్యులు. రాజ్ సింగ్ కూడా అవివాహితుడిగానే నిష్క్రమించాడు. ప్రపంచానికేం అవసరం? ‘చాలా కాలంపాటు నేను డైరీలు రాశాను. కొన్ని కథలు, పాటలూ రాశాను హిందీలో. కానీ ఓ రోజు అనిపించింది.. అలా రాయడం వల్ల ఉపయోగమేంటీ అని. అందుకే వాటన్నిటినీ చించేశాను. ఆత్మకథ రాసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఆత్మకథ రాసేప్పుడు నిజాయితీగా ఉండాలని నమ్ముతాను. అయితే ఆ నిజాయితీ చాలా మందిని బాధపెట్టొచ్చు. ఇతరులను బాధపెట్టే రాతలెందుకు? నా జీవితం.. అదిచ్చిన అనుభవాలు నా వ్యక్తిగతం. వాటిని రాయడమెందుకు? నా వ్యక్తిగత జీవితాన్ని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు కదా!’ అని చెప్పారు లతా మంగేష్కర్. - ఎస్సార్ -
లతా మంగేష్కర్ ను గుర్తు చేస్తూ సింగర్ యశస్వి పాట
-
లత చితాభస్మ నిమజ్జనం
నాసిక్: పవిత్ర గోదావరి ఒడ్డున ఉన్న రామ్‌కుండ్‌లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చితాభస్మాన్ని గురువారం నిమజ్జనం చేశారు. లత సోదరి ఉష, మేనల్లుడు అదినాథ్, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు నాసిక్ వాసులు కూడా లతకు నివాళి అర్పించేందుకు వచ్చారు. గాయని లతా మంగేష్కర్(92) ఫిబ్రవరి 6న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. -
లతా మంగేష్కర్ స్మారక నిర్మాణంపై దుమారం
Lata Mangeshkar Brother On Shivaji Park Memorial Controversy: దివంగత దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పేరిట స్మారక చిహ్నం నిర్మించే విషయం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన.. ముంబై శివాజీ పార్క్ వద్దే మెమోరియల్ నిర్మించాలంటూ బీజేపీ పట్టుబడుతుండగా.. అధికార శివసేన అందుకు సుముఖంగా లేదు. శివాజీ పార్క్ వద్ద మెమోరియల్ నిర్మించాలంటూ ఆమె కుటుంబ సభ్యుల కోరికగా మొదలైన ప్రచారం.. ఈ రగడకు కారణమైంది. బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు ఓ లేఖ రాశారు. ఎక్కడైతే ఆమె అంత్యక్రియలు నిర్వహించారో.. అక్కడే స్మారకం నిర్మించాలంటూ డిమాండ్ చేశాడు. ఇది ఆమె కుటుంబ సభ్యుల కోరిక అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆ వెంటనే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్.. ఈ డిమాండ్‌కు మద్దతు ఇచ్చారు. ఆౕ వెంటనే మిత్రపక్షం(మహా వికాస్ అగాధి) శివసేన ఒత్తిడితో ఆ డిమాండ్‌పై స్వరం మార్చారు నానా. ఇక బీజేపీ డిమాండ్‌పై అధికార శివసేన సుముఖంగా లేదు. అందుకు కారణం.. ఆ పార్క్‌తో ఉన్న అనుబంధం. బాల్ థాక్రే హయాం నుంచే సుమారు 28 ఎకరాల ఈ పార్క్ నుంచి దసరా ర్యాలీని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈ సెంటిమెంట్ నేపథ్యంలోనే లతాజీ మెమోరియల్ నిర్మాణం డిమాండ్‌పై మౌనం పాటిస్తోంది. ఇక ఈ డిమాండ్..అభ్యంతరాల నడుమ పలు పార్టీలు సైతం స్పందిస్తున్నాయి. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేనా9MNS) నేత సందీప్ దేశ్‌పాండే ఈ వ్యవహారంలో రాజకీయాలు తగవని అంటున్నారు. దాదర్ ప్రజలు ఈ పార్క్ ఆక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు.. సంరక్షించుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు తగవు అంటూ సందీప్ ట్వీట్ చేశారు. ఎందరో క్రికెటర్లను తీర్చిదిద్దిన ఈ మైదానంపై రాజకీయం తగదని పలు సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ పట్టువీడడం లేదు. ఇక శివసేన ప్రభుత్వం మాత్రం లతా మంగేష్కర్ గౌరవార్థం కాళినలో ఒక అంతర్జాతీయ సంగీత అకాడమీని నెలకొల్పేందుకు నిర్ణయించుకుంది. ఇందుకోసం 2.5 ఎకరాల స్థలం, సుమారు 1,200 కోట్ల ఖర్చును అంచనా వేసింది. ఈ నిర్ణయం ఆమెకు సరైన నివాళి అంటున్నారు ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్. లతా మంగేష్కర్ మెమోరియల్ డిమాండ్‌పై ఆమె సోదరుడు, సంగీతకారుడు హృదయనాథ్ మంగేష్కర్ స్పందించారు. శివాజీ పార్క్ వద్ద మెమోరియల్ నిర్మించాలన్నది తమ కుటుంబ డిమాండ్ కాదని, దయచేసి వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని ఆయన కోరారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం దయచేసి ఆపండి. అలాంటి డిమాండ్ మా కుటుంబం నుంచి రాలేదు. అది మా అభిమతం కూడా కాదు అని ఆయన స్పష్టం చేశారు. -
సంగీత సరస్వతి... స్వర సామ్రాజ్ఞి
సరస్వతీ దేవిని ఆరాధించే ‘వసంత పంచమి’ ఘడియల్లో సప్త స్వరాలు మూగబోయాయి. లతా మంగేష్కర్తో పాటు సాక్షాత్ సరస్వతీ స్వరూపం మరో లోకానికి మరలిపోయింది. దేశ సంస్కృతి, చరిత్రల్లో లతాజీ ఒక అంతర్భాగం. అఖండ భారత దేశంలో తన గాన యాత్ర ప్రారంభించి, ఏకంగా 7 దశాబ్దాల పాటు అవిరామంగా ఆ యాత్రను సాగించిన సాంస్కృతిక సమున్నత చిహ్నం ఆమె. మరాఠీ నాటక రంగంలో గాయక– నటుడు దీనా నాథ్ ఐదుగురి సంతానంలో ప్రథమ సంతానం లత. తండ్రి ఆకస్మిక మరణంతో 13వ ఏట తన ముగ్గురు సోదరీమణులు, సోదరుడు హృదయనాథ్ల పోషణ, కుటుంబభారాన్ని ఆమె తనపై వేసుకున్నారు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తోబుట్టువులంతా సంగీత రంగంలోనే రాణించడం విశేషమే. లత తన తండ్రి స్నేహితుడు, నటి నందా తండ్రి అయిన మాస్టర్ వినాయక్ (సంగీత దర్శ కుడు, దర్శకుడు) మార్గదర్శనంలో మరాఠీ సినిమాలలో నటించారు. పాటలు పాడడం మొదలు పెట్టారు. అప్పట్లో నూర్జహాన్, షంషాద్ బేగమ్‌ల తారస్థాయిలో పాడే విధానంతో పోలిస్తే, లత గొంతు కొంత పీలగా ఉందని సంగీత దర్శకులు నిరుత్సాహపరిచిన సందర్భాలున్నాయి. క్రమంగా జోహ్రాబాయి, అమీర్బాయి కర్నాటకీ, షంషాద్, సురయ్యాల మధ్య... సంగీత దర్శకుడు గులామ్ హైదర్ ప్రోద్బలం, ప్రోత్సాహంతో లత పాటలు పాడారు. సంగీత దర్శకులు అనిల్ బిశ్వాస్, నౌషాద్, హుస్న్‌లాల్ – భగత్రామ్ ద్వయం కూడా లతా మంగేష్కర్ ప్రతిభను గుర్తించి, పాడించారు. 1949లో బాంబే టాకీస్ నిర్మాణం ‘మహల్’లో పాట ‘ఆయేగా ఆయేగా’ పాట దేశమంతటా మారు మోగింది. అప్పట్లో సిలోన్ రేడియోలో ప్రతి రోజూ హిందీ సర్వీస్‌లో ఈ పాట ప్రసారం చేయమంటూ వేలల్లో ఉత్తరాలు వస్తుండేవట! ఆ ఉత్తరాల్లో గాయకురాలి పేరు కనుక్కోవడానికి వచ్చినవే ఎక్కువ. ఎందుకంటే, అప్పట్లో గ్రామ్‌ఫోన్ రికార్డులలో సినిమాలోని పాత్రధారి పేరే ఉండేది. (చదవండి: వంద వసంతాల హేతువాది) ఆ తరువాత రాజ్‌కపూర్ సొంత నిర్మాణంలో వచ్చిన ‘బర్సాత్’ చిత్రగీతాలతో దేశమంతా లతా ప్రభంజనం మొదలైంది. నాయికలు తమకు లతానే ప్లేబ్యాక్ పాడాలనే షరతు కాంట్రాక్ట్‌లో పెట్టడం వరకూ వెళ్లింది. సంగీత దర్శకులందరూ లత రికా ర్డింగ్ కోసం వేచి చూడడం, ట్రాక్ సింగర్లతో రికార్డ్ చేసి, పాట షూట్ చేసి, ఆ తర్వాత లతాజీతో ఒరిజినల్ వెర్షన్ పాడించిన సందర్భాలు కోకొల్లలు. మాతృభాష మరాఠీపై అభిమానంతో, ‘ఆనంద్ ఘన్’ అనే మారుపేరుతో సంగీత దర్శకత్వంతో పాటు కొన్ని సినిమాలను స్వయంగా నిర్మించి, తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారామె. అది జోల పాట కానీ, భజన గీతం కానీ, విషాద గీతం కానీ, ప్రబోధ గీతం కానీ లత ఏర్పరిచిన ప్రమాణాలను వేరెవ్వరూ అందుకోలేనంతగా అన్ని భారతీయ భాషలలో పాడారు. అనిల్ బిశ్వాస్ చొరవతో శ్వాసను ఎక్కువ సేపు నిలిపేలా చేసిన సాధనతో ఆమె సాధించిన విజయాలెన్నో! భారత్–చైనా యుద్ధానంతరం ఆమె పాడిన ‘ఆయ్ మేరే వతన్ కే లోగో’ పాట దేశ ప్రధాని నెహ్రూతో పాటు యావత్ దేశాన్ని కన్నీరు పెట్టించింది. ఒక జాతీయ గీతం అంతటి స్థాయిని సాధించింది. ఈ పాటను కానీ, ‘ఆనంద్ మఠ్’లోని వందేమాతరం కానీ వినని భారతీయుడు ఉండడు! ప్రముఖ హిందుస్తానీ విద్వాంసుడు ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ ఒకానొక సందర్భంలో ‘అసలీవిడ అపశ్రుతిలో పాడదా?’ అంటూ ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఆమెకు ‘ఉస్తాదోంకా ఉస్తాద్’గా కితాబిచ్చారు. ఫిలింఫేర్ అవార్డులు, అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పుర స్కారం, జాతీయ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో పాటు దాదాపు అన్ని సంగీత, సాంస్కృతిక అవార్డులకూ లత ఓ చిరునామా. (చదవండి: ఆదర్శ జీవితానికి కొలమానం) క్రికెట్ అంటే లతాజీకి వీరాభిమానం. అందుకే, 1983లో ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు నజరానాలు అందించడానికి భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వద్ద నిధులు లేకపోవడంతో తనే పూను కొని, ఒక సంగీత విభావరి నిర్వహించారు. రూ. 20 లక్షలకు పైగా సేకరించడమే కాక, ఎల్పీ రికార్డును విడుదల చేసి, రాయల్టీ కూడా బీసీసీఐకి అందించిన ఔదార్యం లతాజీది. తరాలు మారినా 7 దశాబ్దాల పాటు అన్ని ట్రెండ్లలో తన ఉనికి చాటుకున్నారు. రోషన్–రాజేష్ రోషన్, చిత్రగుప్త– ఆనంద్ మిళింద్, ఎస్డీ బర్మన్ – ఆర్డీ బర్మన్ల తరాలను దాటి నేటి ఏఆర్ రెహమాన్ వరకూ స్వరాన్ని అందించారు. ‘ఆన్’, ‘ఉడన్ ఖటోలా’ చిత్రాలు తమిళంలో డబ్ అయినప్పుడు ఆ చిత్రంలోని పాటలన్నీ లతానే పాడారు. ఇక, తెలుగులో ‘సంతానం’ చిత్రంలోని అనిసెట్టి రచన ‘నిదురపోరా తమ్ముడా’, ‘ఆఖరి పోరాటం’లో ‘తెల్లచీరకు...’ పాటలు పాడారు. దర్శ కుడు వంశీ ‘గాలికొండాపురం రైల్వేగేటు’ నవలను సినిమాగా తీయాలనుకున్నప్పుడు, ఇళయరాజా సంగీతంలో లతాజీతో పాట రికార్డింగ్ చేయిం చారు. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవ డంతో అందులోని ఆమె పాట వినే అదృష్టం తెలుగు అభిమానులు కోల్పోయారు. ఆమె తన 80వ ఏట అన్నమాచార్య కీర్తనలను టీటీడీ కోసం ఆలపించి, పారితోషికం స్వామికే సమర్పించడం విశేషం. హిందీ, బెంగాలీ, మరాఠీ, ప్రైవేట్ భజన్స్ ఏవైనా లతాజీ పాటల్లో అత్యుత్తమమైనవి ఎంపిక చేయడ మంటే సంద్రాన్ని దోసిట పట్టాలనుకోవడమే!‘నాకు ఒక హార్మోనియం, లతాని ఇవ్వండి. సంగీతం కంపోజ్ చేసిచ్చేస్తా’ అన్నది ఎస్డీ బర్మన్ మాట. నటి నర్గీస్ – ‘లతాజీ పాడిన విషాద గీతం అభినయించా లంటే గ్లిజరిన్ అవసరం రాలేదు. లతాజీ గొంతులో పలికే ఆ భావమే నాకు అప్రయత్నంగా కన్నీళ్ళు తెప్పించేది’. చలనచిత్ర సంగీతంలో లతాజీ ముద్ర చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు కొల్లలు. కవి జావేద్ అఖ్తర్ అన్నట్లు ‘ఈ భూగ్రహానికి ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, ఒకటే లతా!’ – రవి పాడి, రైల్వే ఉన్నతాధికారి అరుదైన గ్రామ్‌ఫోన్ రికార్డుల సేకర్త -
లతా మంగేష్కర్‌కు ఐరాస కార్యదర్శి నివాళి
న్యూయార్క్: ప్రఖ్యాత బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుట్టెరస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత ఉపఖండ గొంతు లత అని అభివర్ణించారు. లతా మంగేష్కర్ మరణం భారత్‌కు తీర్చలేని నష్టమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత కుటుంబానికి కూడా పూడ్చలేని లోటన్నారు. ఆమె ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉంటారన్నారు. ఐరా స ఉన్నతోద్యోగి అనితా భాటియా తదితరులు కూడా లత మృతికి తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. విదేశాల్లోని భారతీయ సంఘాలు లత మరణంపై విచారం వ్యక్తం చేశాయి. (చదవండి: బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం!... ఏకంగా రూ. 7 కోట్లు భారీ నష్టం) -
ఐశ్వర్యరాయ్‌పై అగ్గిమీద గుగ్గిలమవుతున్న నెటిజన్లు
గానకోకిల, భారతరత్న గ్రహీత లతా మంగేష్కర్ మరణవార్త సంగీతప్రియులనే కాదు యావత్ ప్రజానీకాన్ని శోకసంద్రంలో ముంచివేసింది. ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరంటూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కాస్త ఆలస్యంగా నివాళులు అర్పించింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ ఆమె ఫోటోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. లతాజీ ఆదివారం నాడు (ఫిబ్రవరి 6న) మరణిస్తే ఇంత ఆలస్యంగా స్పందిస్తారా? అని నెటిజన్లు ఆమెను చెడామడా తిడుతున్నారు. ఏంటి, ఇప్పుడు నిద్ర లేచారా? మీకీవార్త ఇప్పుడు తెలిసిందా? అని ఫైర్ అవుతున్నారు. అయితే ఐశ్వర్య ఫ్యాన్స్ మాత్రం ఆమెను వెనకేసుకొస్తున్నారు. తను ఎక్కువగా ఫోన్ వాడదని, అందువల్లే లేట్‌గా పోస్ట్ పెట్టి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
షారుక్ వీడియోపై నటి ఊర్మిళ స్పందన, ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా?
లెజెండరి సింగర్, గాన కొకిల లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్ నివాళులు అర్పిస్తుండగా ఉమ్మివేసిన వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రయల్లో తన మేనేజర్‌తో కలిసి హజరైన షారుక్ లతాజీ భౌతికఖాయం వద్ద ముస్లిం పద్దతిలో నమస్కారం చేస్తూ ప్రార్థించాడు. అనంతరం మాస్క్ తీసి ఉమ్మాడు. దీంతో షారుక్‌పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. చదవండి: అవును.. బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు, అతనెవరో చెప్పేస్తా.. కానీ: హీరోయిన్ లతాజీ కాళ్ల వద్ద ఉమ్మి షారుక్ ఆమెను అవమాన పరిచారంటూ నెటిజన్లు ఆయనను విమర్శించడం ప్రారంభించారు. దీంతో ఈ ట్రోల్స్‌పై స్పందించిన కొందరు ఇది ముస్లిం ప్రార్థనలో భాగమంటూ అసలు సంగతి వివరించారు. ఈ క్రమంలో షారుక్‌కు పలువురు నటీనటులు మద్దతుగా నిలుస్తారు. తాజాగా సీనియర్ నటి ఊర్మిళ మాటోండ్కర్ కూడా షారుక్‌కు మద్దతుగా నిలిచింది. చదవండి: వెనక్కి తగ్గిన సరయూ, కాసేపట్లో పోలీస్ స్టేషన్‌కు పిటిషనర్.. ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఊర్మిళా మాట్లాడుతూ... ప్రార్థనను కూడా ఉమ్మివేయడం అనుకునే సమాజంలో మనం బ్రతుకుతున్నామంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇండియన్ సినిమాను అంతర్జాతీయ ఫార్మేట్లో నిలబెట్టిన షారుక్‌పై ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడం బాధించిందంటూ ఊర్మిళ వ్యాఖ్యానించింది. కాగా ఇండియన్ నైటింగల్‌గా పేరు తెచ్చుకున్న గాయని లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. Shah Rukh Khan paying his respects at the last rites of #LataMangeshkar Ji 🙏 pic.twitter.com/b0gAt8ztDQ — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) February 6, 2022 -
కన్నీరు పెట్టిస్తున్న లతా మంగేష్కర్ ఓల్డ్ వీడియో..
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణవార్తను ఆమె అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. లతా జీ మృతితో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన లతా జీ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా గత రెండు రోజులుగా లతా మంగేష్కర్‌కు సంబంధించిన పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లతా జీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న లతా మంగేష్కర్ ఓ ఇంటర్వ్యూలో.. మళ్లీ జన్మంటూ ఉంటే లతా మంగేష్కర్‌గా పుట్ట కూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే లతా మంగేష్కర్ జీవితంలో ఎన్ని కష్టాలున్నాయన్నది ఆమెకు మాత్రమే తెలుసు అంటూ లతాజీ చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. చదవండి: లతా మంగేష్కర్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? View this post on Instagram A post shared by Gaurav Ogale (@patranimacchi) -
లతకు పార్లమెంటు నివాళి
న్యూఢిల్లీ: అమర గాయని లతా మంగేష్కర్ స్మృత్యర్థం పార్లమెంటు ఉభయసభలు సోమవారం గంటపాటు వాయిదా పడ్డాయి. లత మరణం సంగీతానికి, కళా రంగానికి తీరని లోటని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా అన్నారు. ‘‘పాటల ఆత్మతో తాదాత్మ్యం చెందడం లతకే సొంతమైన విద్య. అందుకే ఆమె పాటలన్నీ మాస్టర్‌పీస్‌లుగా నిలిచిపోయాయి’’ అంటూ కొనియాడారు. లత స్వరం దశాబ్దాల పాటు దేశాన్ని మంత్రముగ్ధం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘దేశ ఐక్యతను, సాంస్కృతిక వారసత్వాన్ని లత బలోపేతం చేశారు. ఆమె 36 భాషల్లో పాడిన తీరే దేశ ఐక్యతకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ’’ అని కొనియాడారు. మెలోడీ క్వీన్ మరణం దేశ సంగీత రంగానికి తీరని లోటని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఇండోర్‌లో లత అకాడమీ లత జ్ఞాపకార్థం మధ్యప్రదేశ్‌లో ఆమె జన్మస్థలం ఇండోర్‌లో సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ మొక్క నాటారు. ఇండోర్‌లో లత విగ్రహం, ఆమె పాటలతో మ్యూజియం, ఆమె పేరిట కాలేజీ, మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏటా లత జయంతి నాడు ఆమె పేరుతో అవార్డు ఇస్తామని చెప్పారు. లత అస్థికలను అల్లుడు ఆదినాథ్ సేకరించారు. వాటిని ఎక్కడ కలుపుతారనే దానిపై స్పష్టత లేదు. -
లతా మంగేష్కర్ మృతి పట్ల నాట్స్ సంతాపం
ఎడిసన్, న్యూ జెర్సీ: భారతరత్న లతా మంగేష్కర్ మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసింది. భారతీయ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మరణం అమెరికాలోని తెలుగువారితో పాటు యావత్ ప్రవాస భారతీయులందరిని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఓ ప్రకటనలో నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి తెలిపారు. తామంతా లతామంగేష్కర్ పాటు వింటూ పెరిగామని అరుణ అన్నారు. లతా జీ హాస్పిటల్ నుంచి క్షేమంగా తిరిగి వస్తారని ఆశించామని.. కానీ ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరిని కలిచివేసిందని నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే పేర్కొన్నారు. లతా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు నాట్స్ తెలిపింది. ఆమె కుటుంబానికి నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలియచేసింది. -
Lata Mangeshkar: అజరామరం.. లతాతో ప్రేమలో పడ్డ రాజ్ సింగ్.. అవివాహితుడిగానే...
లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు. ప్రధాన కారణం కుటుంబం. లతా తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ పోలియో బాధితుడు. తండ్రిని ఆ తమ్ముడిలో చూసుకునేది లతా. అతనంటే ప్రాణం. అతణ్ణి చూసుకుంటే చాల్లే అనుకుని ఉండొచ్చు. తాను కుదురుకునే లోపు ఆశా భోంస్లే పెళ్లి చేసుకోవడం ఆ పెళ్లి పెటాకులు కావడం చిన్న ప్రభావం కాదు. అలాగని ఆమె జీవితంలో పురుషులు తారసపడలేదని కాదు. ఆ రోజుల్లో ప్లేబ్యాక్ సింగర్లు తప్పక క్లాసికల్ నేర్చుకోవాల్సి వచ్చేది. లాహోర్‌కు చెందిన అద్భుత గాయకుడు సలామత్ అలీ ఖాన్ దగ్గర లతా పాఠాలు నేర్చుకునేది. అతని గానం ఆమెకు వెర్రి. పెళ్లి ఆలోచన వరకూ వెళ్లింది. కాని అప్పటికే సలామత్ అలీ ఖాన్‌కు పెళ్లయ్యింది. పైగా దేశ విభజన తాజా గాయాలు జనాన్ని వీడలేదు. ఈ సమయంలో తమ పెళ్లి వివాదానికి దారి తీయకూడదని సలామత్ వెనక్కు తగ్గాడు. ఇక సంగీత దర్శకుడు సి.రామచంద్ర, లతా వృత్తిరీత్యా సన్నిహితులు. కాని ఆ స్నేహం చెదిరింది. లతా తమ్ముడు హృదయనాథ్ మిత్రుడైన రాజ్‌సింగ్ దుంగాపూర్ (క్రికెట్) లతాతో ప్రేమలో పడ్డాడని అంటారు. అయితే లతాతో పెళ్లికి రాజ్ సింగ్ రాజ కుటుంబం అంగీకరించలేదు. దాంతో అతడు అవివాహితుడిగా ఉండిపోయాడు. లతా కూడా. ఇదొక కథనం. లతాను ఆరాధించిన వారిలో గీత రచయిత సాహిర్ లుధియాన్వీ, గాయకుడు భూపేన్ హజారికా కూడా ఉన్నారు. అజరామర ప్రేమ కథ.. రాజస్తాన్‌లోని దుంగాపూర్ రాజకుటుంబానికి చెందిన రాజ్‌సింగ్ ‘లా’ చదవడానికి 1959లో ముంబైకి వెళ్లారు. ఆయన క్రికెట్ ప్లేయర్. లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్‌కు కూడా క్రికెట్ అంటే ఇష్టం. ఆట వాళ్లిద్దరినీ స్నేహితులను చేసింది. హృదయనాథ్ కోసం రాజ్ సింగ్ మంగేష్కర్ ఇంటికి వెళ్లేవారు. అక్కడే తొలిసారిగా లతాను కలిశారు. పరిచయం స్నేహంగా మారింది. స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. చదువు పూర్తి చేసుకుని దుంగాపూర్‌కు వెళ్లిన తర్వాత రాజ్ సింగ్ లతాతో పెళ్లి విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కానీ రాజ కుటుంబానికి చెందిన అమ్మాయినే పెళ్లాడాలన్న షరతు ముందుంచడంతో ఆయనకు నిరాశ తప్పలేదు. అయితే, లత మీద ప్రేమను చంపుకోలేని ఆయన చివరి వరకు అవివాహితుడిగానే మిగిలిపోయారు. ఈ విషయాలను రాజ్‌సింగ్ బంధువు, బికనీర్ రాకుమారి రాజశ్రీ పుస్తకంలో రాశారు. రాజ్ సింగ్ లతాను ఆప్యాయంగా మిథూ అని పిలిచేవారని, వారి ప్రేమ అజరామరమని పేర్కొన్నారు. కాగా 2009లో రాజ్ సింగ్ మరణించగా.. కడచూపు కోసం లతా రహస్యంగా దుంగాపూర్ వెళ్లారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక బీసీసీఐ అధికారిగా పనిచేసిన రాజ్ సింగ్... 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ప్రోత్సాహకం అందించేందుకు లతాతో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఒక్క పైసా కూడా ఆశించకుండా ఆమె అందుకు సమ్మతం తెలపడం.. తన పాట ద్వారా 20 లక్షలు సేకరించడం.. తద్వారా ఒక్కో సభ్యుడికి బీసీసీఐ లక్ష రూపాయలు ముట్టజెప్పడం జరిగింది. చదవండి: Lata Mangeshkar: ప్రేమ గుడ్డిదని తెలుసు.. చెవిటిదని మొదటిసారి తెలుసుకున్నా అని లతా ఎందుకన్నారు? -
Lata Mangeshkar: లతా పాట.. టీమిండియా సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష!
లతా మంగేష్కర్ క్రికెట్‌కు వీరాభిమాని. క్రికెట్‌తో ఆమె అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఘటన మాత్రం 1983లో జరిగింది. భారత జట్టు ఇంగ్లండ్‌లో వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకొని స్వదేశానికి తిరిగొచ్చింది. విజేతలను అభినందించి నగదు పురస్కారం అందించాలని బీసీసీఐ భావించింది. కానీ బోర్డు నాటి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ప్రపంచ కప్ జరిగిన సమయంలో క్రికెటర్లకు రోజూవారీ ఖర్చులకు తలా 20 పౌండ్లు ఇచ్చేందుకే అధికారులు కిందా మీదా పడ్డారు. అలాంటిది ప్రోత్సాహకం ఏమిస్తారు? బీసీసీఐ అధికారి రాజ్‌సింగ్ దుంగార్పూర్ ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆ సమయంలో భారత సినీ సంగీతాన్ని శాసిస్తున్న తన స్నేహితురాలు లతా మంగేష్కర్తో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న దుంగార్పూర్ విజ్ఞప్తికి వెంటనే ‘ఓకే’ చెప్పిన లతా పైసా కూడా తీసుకోకుండా వేదికపై పాడేందుకు ముందుకు వచ్చింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఆ కచేరీకి భారీస్థాయిలో అభిమానులు తరలి వచ్చారు. దాని ద్వారా సుమారు రూ. 20 లక్షలు పోగయ్యాయి. భారత జట్టు సభ్యులు 14 మందికి ఒక్కొక్కరికీ కనీసం రూ. లక్ష చొప్పున బహుమతిగా ఇచ్చేందుకు ఆ డబ్బు సరిపోయింది. అప్పటినుంచి లతాకు, భారత క్రికెట్‌కు మధ్య అనుబంధం విడదీయరానిదిగా మారిపోయింది. నాటినుంచి ఇప్పటి వరకు భారత్‌లో జరిగే ఏ అంతర్జాతీయ మ్యాచ్‌కైనా రెండు వీఐపీ సీట్లు లతా మంగేష్కర్ కోసం రిజర్వ్ చేయడం బీసీసీఐ రివాజుగా మార్చేసింది! చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
నరేంద్రమోదీ తల్లికి గుజరాతీ భాషలో లేఖ రాసిన లతా మంగేష్కర్!
బాలీవుడ్ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తన మాతృభాష మరాఠీ అయినప్పటికీ గాయనిగా తన కెరీర్లో అనేక భాషల్లో పాడారు. ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్‌కి లతా దీదీ తొలిసారిగా గుజరాతీ భాషలో లేఖ రాశారు. ఆ లేఖలో లతా దీదీ..."జూన్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ అఖండ విజయం సాధించి వరుసగా రెండోసారి ప్రధాన మంత్రి అయినందుకు మీ కొడుకు, నా సోదరుడికి అభినందనలు. నేను గుజరాతీలో తొలిసారిగా లేఖ రాస్తున్న ఏదైన తప్పు ఉంటే నన్ను క్షమించండి" అని గాయని లతా మంగేష్కర్ గుజరాతీలో లేఖ రాశారు. లతా ఆ లేఖలో ప్రధాని మోదీని సోదరుడిగా తనను హీరాబెన్ పెద్ద కూమార్తెగా సంభోదించడం విశేషం. 2013లో ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తన తండ్రి దీనానాథ్ మంగేష్కర్ స్మారకార్థం నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించేందుకు లతా మంగేష్కర్ మోదీని ఆహ్వానించారు. అంతేకాదు ఆ కార్యక్రమంలో మోదీని ప్రధానిగా చూడాలనుకుంటున్నాను అని అన్నారు. పైగా 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా అదే మాట అన్నారు. ఈ మేరకు ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రధాని అధికారిక వెబ్సైట్ పోస్ట్ చేయడమే కాక నరేంద్ర మోదీతో లతా మంగేష్కర్‌కు గల అనుబంధానికి సంబంధించిన విషాయాలను వెల్లడించింది. లతా దీదీకి ప్రధాని మోదీ అంటే చాలా ఇష్టం అని వెబ్సైట్ పేర్కొంది. ఆమె అతన్ని ముద్దుగా 'నరేంద్ర భాయ్' అని పిలిచేదని, ఇద్దరూ ఒకే నెలలో పుట్టినరోజు జరుపుకున్నారని తెలిపింది. ఆమె ప్రతి సంవత్సరం రక్షా బంధన్ రోజు శుభాకాంక్షలు తెలపడమే కాక రాఖీని పంపిచేవారు. అయితే 202లో కరోనా మహమ్మారీ కారణంగా మోదీకి రాఖీ పంపలేకపోతున్ననంటూ లతా మంగేష్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మోదీ స్పందనగా ..."మీ హృదయపూర్వక సందేశం నాకు అనంతమైన శక్తిని ప్రసాదిస్తుంది. మీరు ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని అన్నారు. (చదవండి: రాజ్యసభలో లతా మంగేష్కర్‌కు నివాళి) -
లతా మంగేష్కర్‌కు నివాళి అర్పించిన ప్రధాని మోదీ
► రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్‌కు ప్రధాని నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో భారత్ లీడర్‌గా ఎదుగుతోందన్నారు. అయితే మోదీ ప్రసంగాన్ని కాంగ్రెస్ సభాపక్షనేత అధిర్ రంజన్ అడ్డుకున్నారు. దీంతో కొందరు ఇంకా 2014లోనే ఉన్నారని అధిర్ రంజన్‌ను ఉద్దేశించి మోదీ పంచ్ వేశారు. 1972లో చివరిసారి బెంగాల్లో కాంగ్రెస్ గెలిచిందంటూ అధిర్‌కు కౌంటర్ వేశారు. ► తెలంగాణ ఇచ్చినా కూడా అక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వలేదని మోదీ చురకలంటించారు. ఎన్ని ఓటములు ఎదురైనా కాంగ్రెస్ తీరు మారడం లేదని విమర్శించారు. గత రెండేళ్లుగా భారత్ కోవిడ్‌తో పోరాడుతోందని, కోవిడ్‌ను కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ► వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్లో కళ్లు తిరిగిపడిపోయారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. షుగర్ లెవల్స్ తగ్గడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. ►కేంద్రం కేటాయించిన జడ్ కేటగిరి భద్రతను స్వీకరించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకిహోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఒవైసీ కాన్యాయ్‌పై జరిగిన కాల్పుల ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. రాజ్యసభలో దీనిపై ప్రకటన చేసిన షా.. ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేశామని, ఆల్టో కారు, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ► రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ విషప్రచారాన్ని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి బలంగా తిప్పికొట్టారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అవాస్తవాలను వల్లేవేశారు .సినిమా టికెట్లు సహా పలు అంశాలపై తప్పుడు ప్రచారం చేయడానికి కనకమేడల ప్రయత్నించారు. దీనిపై స్పందించిన వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ పాలన కంటే వైఎస్సార్సీపీ పాలన వెయ్యిరెట్లు గొప్పగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ► గాయిని లతా మంగేష్కర్‌కు మృతిపట్ల నివాళిగా ఉభయ సభలను గంటపాటు వాయిదా వేశారు. లోక్‌సభ బడ్జెట్‌పై చర్చలో భాగంగా.. గిరిజన వ్యవహారాల కేంద్ర మంత్రి అర్జున్ ముండా త్రిపురలోని షెడ్యూల్డ్ తెగల జాబితాను సవరించే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో భారత రత్న, దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభలో లతా మంగేష్కర్ సంతాప సందేశాన్ని చదివి వినిపించారు. -
Fact Check: షారుక్ లతాజీ పాదాల దగ్గర ఉమ్మివేశాడా?
గాన కోకిల లతా మంగేష్కర్ గొంతు శాశ్వతంగా మూగబోయింది. ఇక సెలవంటూ అందరికీ వీడ్కోలు చెప్తూ ఫిబ్రవరి 6న ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఆమె ఇంటికి చేరుకుని లతా మంగేష్కర్ పార్థివదేహానికి కడసారి నివాళులు అర్పించారు. చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా లెజెండరీ సింగర్‌కు చివరిసారి వీడ్కోలు పలికేందుకు వచ్చాడు. అయితే నివాళులు అర్పించే సమయంలో ఆయన చేసిన పనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షారుక్ తన మేనేజర్‌తో కలిసి లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించేందుకు వచ్చాడు. ఆ సమయంలో సింగర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, మాస్క్‌ను కిందకు దించి ఆమె పాదాల దగ్గర ఊదాడు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న కొందరు షారుక్ లతా పాదాల దగ్గర ఉమ్మేసినట్లు కామెంట్లు చేస్తున్నారు. షారుక్ ప్రవర్తనను ఎండగడుతూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై పలువురు నెటిజన్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ.. షారుక్ ఉమ్మేయలేదని, భౌతిక కాయం దగ్గర ఊదడం అనేది ఒక ప్రార్థనా విధానమని ట్రోలర్లపై మండిపడుతున్నారు. Shah Rukh Khan paying his respects at the last rites of #LataMangeshkar Ji 🙏 pic.twitter.com/b0gAt8ztDQ — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) February 6, 2022 Srk did not spit, he blew to ward off evil for Lataji as per his religion & if people read more like I did, they would understand. As for can Hindus pray at funeral of someone from a Muslim faith, then the answer is Yes. Because, I have & no one had a problem with it. 🙏🏾🕉 — Kr1shna (@krishna_Ind1an) February 6, 2022 Fringe targetting @iamsrk by falsely accusing him of spitting at #LataMangeshkar Ji’s funeral should be ashamed of themselves. He prayed & blew on her mortal remains for protection & blessings in her onward journey. Such communal filth has no place in a country like ours 🤲🏼🙏🏼 pic.twitter.com/xLcaQPu1g8 — Ashoke Pandit (@ashokepandit) February 6, 2022 -
ఆ మాటలను లతా మంగేష్కర్ ఎప్పుడూ మరవలేదట!
ప్రపంచమంతా పడి చచ్చే తన గాత్రం నిజానికి అంత గొప్పదేమీ కాదని వినమ్రంగా చెప్పేవారు లతా మంగేష్కర్. ‘‘నేనో మంచి గాయనిని. అంతే. నాలో అసాధారణ ప్రతిభా పాటవాలేమీ లేవు. నాకంటే గొప్పగా పాడే చాలామంది కన్నా పేరు ప్రఖ్యాతులు దైవదత్తంగా నాకొచ్చాయంతే. అందుకే విజయాన్ని ఎప్పడూ నెత్తికెక్కించుకోకూడదు’’అని చెప్పేవారామె. ‘‘చిన్నప్పుడు సంగీత శిక్షణను తప్పించుకునేందుకు తలనొప్పి, కడుపు నొప్పి అంటూ నాన్నకు చాలా సాకులు చెప్పేదాన్ని. సాధన చేయిస్తుంటే పారిపోయేదాన్ని. ఆయన వెంటపడి పట్టుకుంటే నీ ముందు పాడటానికి సిగ్గేస్తోందంటూ పెనుగులాడేదాన్ని. దాంతో ‘నేను నాన్నను మాత్రమే కాను, నీ గురువును కూడా. ఎప్పటికైనా గురువును మించాలని తపించాలి. అంతే తప్ప పాడటానికి సిగ్గేస్తోందని అనకూడదు’అని ఓ రోజు అనునయించారు. ఆ మాటలను ఎప్పుడూ మరవలేదు’’అని చెప్పారు. సంగీతమంటే అయిష్టం నాన్నతో సహా ఇంట్లో ఎవరికీ సినీ సంగీతం పెద్దగా నచ్చేది కాదని, వాళ్లకు కర్ణాటక సంగీతమే ఇష్టమని లతా మంగేష్కర్ అంటారు. ‘‘నాన్నకు సినిమాలే ఇష్టం లేదు. మమ్మల్ని సినిమాలు కూడా చూడనిచ్చేవారు కాదు’’అని ఆమె పలుమార్లు గుర్తుచేసుకున్నారు. ఫొటోగ్రఫీ అంటే లతకు చాలా ఇష్టం. క్రికెట్ అన్నా అంతే. వెస్టిండీస్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, రోహన్ కన్హాయ్ నుంచి గవాస్కర్, సచిన్ దాకా అందరినీ బాగా ఇష్టపడేవారు. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ సంతకం చేసిచ్చిన ఫొటోను ప్రాణంగా దాచుకున్నారు లత. -
Lata Mangeshkar: లత పాటకు పాకిస్తాన్ నియంత కూడా ఫిదా అయ్యాడు!
సుమధుర గాయని, భారత రత్న లతా మంగేష్కర్ గాత్రానికి ముగ్దుడు కానీ సినీ ప్రియుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.పాకిస్తాన్లో సంగీతం, లలిత కళలపై కఠిన నిషేధం విధించిన నాటి కరడుగట్టిన నియంత జనరల్ జియా ఉల్ హక్ కూడా లత గాన మాధుర్యానికి ఫిదా అయ్యాడు. తానామె అభిమానినని 1982లో ప్రఖ్యాత జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 1977లో సైనిక తిరుగుబాటు ద్వారా జుల్ఫికర్ అలీ భుట్టో సర్కారును కూలదోసి జియా అధికారంలోకి రావడం తెలిసిందే. తర్వాత భుట్టోను హత్య కేసులో ఉరి తీయించాడు. దానిపై దేశమంతటా వెల్లువెత్తిన నిరసనలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా మహిళలు పాల్గొనే సంగీత, సాహిత్య ప్రదర్శనలపై నిషేధం విధించాడు. అందుకే తన అభిమాన గాయని లతతో కూడిన భారత గాయక బృందం పాకిస్తాన్లో పర్యటించేందుకు అనుమతించలేదు! గోవాలో మూలాలు లత మూలాలు గోవాలో ఉన్నాయి. అక్కడి మంగేషీ గ్రామం ఆమె పూర్వీకుల స్వస్థలం. అక్కడి మంగేషీ ఆలయంలో మంగేశుని పేరుతో కొలువైన శివుడు లత కుటుంబీకుల కులదైవం. ఆయన పేరిటే ఈ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం ఇంటి పేరు మంగేష్కర్‌గా స్థిరపడింది. లత తండ్రి అయిన సంగీత దర్శకుడు, రంగస్థల నటుడు దీనానాథ్ మంగేష్కర్ అసలు పేరు దీనానాథ్ అభిషేకీ. తమ ఊరిపై మమకారంతో ఇంటిపేరును మంగేష్కర్‌గా మార్చుకున్నారు. ఆ ఇంటి పేరుకు పెద్ద కూతురు లత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. -
శ్రీవారికి స్వర‘లతా’ర్చన
తిరుపతి తుడా: లతామంగేష్కర్ పలుమార్లు తిరుమల శ్రీవారిని దర్శించి తన భక్తిని చాటుకున్నారు. అన్నమయ్య సంకీర్తనల ద్వారా శ్రీవారి ప్రచారకురాలిగా, శ్రీవారి ఆస్థాన విద్వాంసురాలుగా గుర్తింపు పొందారు. శ్రీవారి ముందు తన మధుర గాత్రంతో స్వామి వారిని కీర్తించి అనుగ్రహం పొందారు. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన సంస్కృత సంకీర్తనలను గానం చేశారు. 2010 సంవత్సరంలో ఎస్వీ సంగీత నృత్యకళాశాలలోని ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్‌లో ఆ సంకీర్తనలను రికార్డు చేసి సంగీత ప్రపంచానికి అందించారు. అన్నమయ్య స్వర లతార్చన పేరుతో సీడీని రూపొందించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆ సీడీని నాటి సీఎం రోశయ్య, గవర్నర్ నరసింహన్, టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు ఆవిష్కరించారు. ఈ సీడీలో మొత్తం 10 సంకీర్తనలు రికార్డు చేశారు. -
భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారన్నారు. ఆమె మృతి భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశానికి లతా మంగేష్కర్ ద్వారా గంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని అన్నారు. లతాజీ మరణంతో పాట మూగబోయిందని, సంగీత మహల్ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ‘20 భాషల్లో 1,000 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లతాజీ.. సరస్వతీ స్వర నిధి. ఆమె పాటల మహల్. వెండితెర మీది నటి హావభావాలకు అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్లు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్యగాయని. పాటంటే లతాజీ .. లతాజీ అంటేనే పాట. సప్త స్వరాల తరంగ నాదాలతో శ్రోతలను తన్మయత్వంలో వోలలాడించిన లతా మంగేష్కర్, ఉత్తర దక్షిణాదికి సంగీత సరిగమల వారధి. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన పురస్కారాలకు లతాజీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావచ్చు కానీ లతాజీ లేని లోటు పూరించలేనిది’అని సీఎం స్మరించుకున్నారు. లతా మంగేష్కర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన దివ్యగాత్రంతో ఆమె శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశారని ఆదివారం ఒక ప్రకటనలో ఆమె కొనియాడారు. లత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సినీరంగానికి తీరని లోటు: కేటీఆర్ లతా మంగేష్కర్ మరణంపట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలపాటు ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించిన లతా మంగేష్కర్ మరణం తీరని లోటని ఆయన అన్నారు. కాగా, లతా మంగేష్కర్ మరణంపట్ల రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, వి. శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, రాష్ట్ర ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ అర్వింద్ కుమార్ తదిత రులు సంతాపం వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ మరణం దేశ సంగీత లోకానికి తీరని లోటని, సంగీత ప్రియుల గుండెల్లో ఆమె చిరస్థాయిలో నిలిచిపోతారని వేర్వేరు ప్రకటనల్లో వారంతా కొనియాడారు. లత మరణం దేశ ప్రజలందరినీ కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
వాళ్లు అలా అనేసరికి లతా మంగేష్కర్ ఒక్కరోజే బడికెళ్లింది
ముంబై: పదినెలల చెల్లిని బడిలోకి తీసుకురావద్దన్నారన్న కోపంతో బడి ముఖమే చూడకూడదని పంతం పట్టింది ఒక చిన్నారి. అలా బడి మానేసిన చిన్నారి భారతరత్నగా ఎదగడంలో స్వయం కృషి ఎంతో ఉంది. లతా మంగేష్కర్ చిన్నతనంలో చెల్లెలు ఆశాను తీసుకొని స్కూలుకు వెళ్లింది. అయితే పసిపిల్లను బడిలోకి తేవద్దంటూ టీచర్ అభ్యంతరం పెట్టడంతో కోపంతో వెనక్కు వెళ్లిన లత మళ్లీ బడి ముఖం చూడలేదు. చిన్నప్పుడు మరాఠీ అక్షరాలు చదవడం, రాయడం ఇంట్లోనే పనిమనిషి సాయంతో నేర్చుకున్నట్లు లతా మంగేష్కర్.. ఇన్ హర్ ఓన్ వాయిస్ పుస్తకంలో చెప్పారు. మరీ పసితనంలో నర్సరీ క్లాసులకు వెళ్లానని, బోర్డు మీద రాసిన శ్రీ గణేశ్ జీ అనే అక్షరాలను అచ్చుగుద్దినట్లు దింపినందుకు అప్పుడు తనకు పదికి పది వచ్చాయని చెప్పారు. తన బంధువు వసంతి మ్యూజిక్ క్లాసులకు వెళ్లేదని, ఆమెతో పాటు వెళ్లిన తనను పాట ఆకర్షించిందని ఆమె చెప్పారు. తనకు నాలుగేళ్ల వయసున్నప్పుడు తన ఆసక్తిని గమనించి అందరు టీచర్ల ముందు మ్యూజిక్టీచర్ పాడమన్నారని, అప్పుడు హిందోళంలో పాట పాడానని చెప్పారు. ఆ తర్వాత తనను బడికి రమ్మన్నారని, అక్కడకు ఆశాను తీసుకొని వెళ్లిన తనను టీచర్ అడ్డుకోవడంతో వెనక్కు వచ్చానని వివరించారు. కాలక్రమంలో బంధువులు, ప్రైవేట్ టీచర్ల సాయంతో హిందీ నేర్చుకున్నానన్నారు. తర్వాత కాలంలో ఉర్దూ, బెంగాలీ, కొంత మేర పంజాబీ నేర్చుకున్నానని, సంస్కృతం అర్థమవుతుందని, తమిళ్ అవగాహన చేసుకునే యత్నం చేశానని లత చెప్పారు. -
Lata Mangeshkar Last Rites: లతా మంగేష్కర్ అంత్యక్రియలు ఫొటోలు
-
లతా మంగేష్కర్ కడసారి వీడ్కోలు.. బారీగా వచ్చిన అభిమానులు
-
గగన కోకిల - లతా మంగేష్కర్
-
మీరెక్కడ ఉన్న.. మా కోవెలే..మా ఇంటి కోకిలే
-
లతా మంగేష్కర్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు? తొలి రెమ్యునరేషన్ ఎంతంటే..
Lata Mangeshkar Total Net Worth: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లతాజీ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నివేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన ఆమె 92ఏళ్ల వయసులో కన్నుమూసింది. అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఐదేళ్ల ప్రాయంలోనే గాయనిగా ప్రస్థానం ప్రారంభించిన లతా మంగేష్కర్ అతి తక్కువ కాలంలోనే విశేష గుర్తింపు సంపాదించుకున్నారు. హిందీ, మరాఠీ, తెలుగు సహా వివిధ భాషల్లో సుమారు 50వేల పైచిలుకు పైగా పాటలు పాడి శ్రోతలను విశేషంగా అలరించారు. అలా సుధీర్ఘమైన కెరీర్లో ఎన్నో వేల పాటలు పాడిన లతాజీ రెమ్యునరేషన్ కూడా అత్యధికంగానే తీసుకునేవారు. 1950ల కాలంలో ఒక్కో పాటకు సుమారు 500రూపాయల పారితోషికాన్ని అందుకునేవారట. అప్పట్లో ఆశా భోస్లే సహా పేరున్న సింగర్స్‌కి సైతం 150 రూపాయలు ఇచ్చేవారట. కానీ ఆ సమయంలో కూడా లతాజీకి అందరికంటే అత్యధికంటే రెమ్యునరేషన్ ఇచ్చేవారని స్వయంగా ఆశా భోస్లే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొదట్లో 25 రూపాయలతో ప్రారంభమైన లతా జీ సంపాదన. ఇప్పుడు వంద కోట్లకు పైగా చేరుకుంది. ఆమెకు ముంబై సహా పలు కొన్ని నగరాల్లో విలసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. అలా చనిపోయే నాటికి లతా మంగేష్కర్ ఆస్తుల విలువ సుమారు రూ. 200 కోట్లకు పైగానే ఉందని సమాచారం. -
తన ఆరాధ్య గాయనికి కన్నీటి నివాళులర్పించిన క్రికెట్ గాడ్
Sachin Tendulkar Pays Tribute To Lata Mangeshkar: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సతీసమేతంగా.. తన ఆరాధ్య గాయని లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని దర్శించుకుని కన్నీటి నివాళులర్పించాడు. ముంబైలోని శివాజీ పార్క్‌లో లతా మంగేష్కర్ అంతిమ సంస్కారాల సమయంలో సచిన్ కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం ట్విటర్ వేదికగా సచిన్ తన సంతాప సందేశాన్ని షేర్ చేశాడు. I consider myself fortunate to have been a part of Lata Didi’s life. She always showered me with her love and blessings. With her passing away, a part of me feels lost too. She’ll always continue to live in our hearts through her music. pic.twitter.com/v5SK7q23hs — Sachin Tendulkar (@sachin_rt) February 6, 2022 "లతా ఆయీ (మరాఠీలో అమ్మ అని అర్థం) జీవితంలో నాకు కొంత భాగం దక్కినందుకు గర్వపడుతున్నా. ఆమె ఎల్లప్పుడూ నాపై అమితమైన ప్రేమ చూపించేవారు. ఆమె మరణం నాకు తీరని లోటు. ఆమె తన గాత్రంతో ఎల్లప్పుడూ మన హృదయాల్లో బతికే ఉంటుంది" అంటూ సచిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా, సచిన్‌కు లతా మంగేష్కర్తో ఆత్మీయ అనుబంధం ఉంది. ఆయన తరుచూ ఆమెను కలిసి యోగక్షేమాలు తెలుసుకునేవాడు. లతాజీని సచిన్ ప్రేమగా ‘ఆయీ’ అని పిలిచేవాడు. ఇదిలా ఉంటే, గాన కోకిల, భారతరత్న లతా మంగేష్కర్(92) ఇవాళ ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం శివాజీ పార్క్‌లో జరిగిన ఆమె అంత్యక్రియలకు ప్రధాని మోదీ సహా పలు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చదవండి: IND VS WI 1st ODI: కోహ్లినా మజాకా.. పంత్‌ను కాదని మాజీ కెప్టెన్ సలహా కోరిన హిట్‌మ్యాన్ -
లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
-
గానకోకిల లతా మంగేష్కర్‌కు కన్నీటి వీడ్కోలు..
Lata Mangeshkar funeral live updates: ముగిసిన అంత్యక్రియలు ►కన్నీటి వీడ్కోలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో ఆమెకు ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ►లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. లతాజీ భౌతికకాయానికి మోదీ నివాళులు అర్పించారు. ►సచిన్ టెండ్కూర్ ఆయన సతీమణి లతా మంగేష్కర్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. లెజెండరీ సింగర్, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఎన్నో పాటలకు తన గొంతుతో ప్రాణం పోసిన ఆ గానకోకిల మూగబోయిందని తెలిసి అభిమానులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఇక చివరిసారిగా ఆమె పార్థివదేహాన్ని చూసి నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు సహా అభిమానులు తరలివచ్చారు. అంతకుముందు ముంబైలోని లతాజీ నివాసం నుంచి శివాజీ పార్కు వరకు అంతిమయాత్ర సాగింది. ఈ నేపథ్యంలో లెజెండరీ సింగర్‌కు తుది వీడ్కోలు పలికేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో సాయంత్రం 6.15 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అధికారింగా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ స్టార్ హీరోతో లతాజీకి వాగ్వాదం.. అయినా సరే నో చెప్పింది
When Lata Mangeshkar Refused To Sing Raj Kapoor Song: లతా మంగేష్కర్ లెగసీ గురించి వర్ణించడానికి పదాలు చాలవు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సంగీత సరస్వతి ఆవిడ. చిన్న వయసులోనే స్టార్ సింగర్‌గా ఫేమ్ తెచ్చుకున్నారు. తండ్రి మరణంతో తప్పనిసరై పాటలు పాడేందుకు చిత్ర పరిశ్రమలోకి రావాల్సి వచ్చిన లతాజీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలిచారు. లతా మంగేష్కర్ తొలిసారి ఓ మరాఠీ చిత్రంతో నేపథ్య గాయనిగా మారారు. అయితే ఎడిటింగ్‌లో ఆ పాటను తీసేశారు. కానీ ఆ తర్వాత ఆమె ప్రస్థానం ఊహించని రీతిలో మలుపు తిరిగింది. 'అజీబ్ దస్తాన్ హై యే', 'ప్యార్ కియా తో డర్నా క్యా', 'నీలా అస్మాన్ సో గయా', 'తేరే లియే' వంటి అనేక గీతాలకు ఆమె గాత్రంతో ప్రాణం పోశారు. అసలు ఆమె కాల్షిట్ల కోసం సంగీత దర్శకులు పోటీ పడేవారంటే ఆమె స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా తన కట్టుబాట్లు, సాంప్రదాయాలకు ఎంతో విలువిచ్చే లతాజీ సినిమాల్లో ద్వందర్థాలు వచ్చే పాటలు పాడేందుకు ససేమీరా నిరాకరించేవారు. అలా ఆమె పాడనని మొండికేయడంతో ఎన్నో పాటల లిరిక్స్‌ని సైతం మార్చాల్సి వచ్చింది. 1964లో సంగం సినిమా కోసం 'మై కా కరూ రామ్ ముఝే బుడ్డా మిల్ గాయా' పాట విషయంలో ప్రముఖ హీరో రాజ్‌కపూర్‌తో గంటన్నరకు పైగా లతాజీకి వాగ్వాదం జరిగింది. పాటలో సాహిత్యం బాగుందని ఎంతగా నచ్చజెప్పినా లతాజీ మాత్రం వినలేదట. దీంతో ఆ పాటను వేరే వాళ్లతో పాడించారట. అనూహ్యంగా ఆ పాట సూపర్‌హిట్‌గా నిలిచింది. కానీ ఇంతవరకు ఆ పాటను కానీ, ఆ సినిమాను కానీ చూడలేదని లతాజీ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. చదవండి: లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటో తెలుసా? -
కోకిలమ్మ- లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ జర్నీ
-
ముంబై శివాజీ పార్కుకు లతా మంగేష్కర్ పార్థివదేహం తరలింపు
-
లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటో తెలుసా?
Why Lata Mangeshkar Never Got Married Here Is The Reason: భారత సినీ సంగీత ప్రపంచంలో ఓ శిఖరం నేలకొరిగింది. దిగ్గజ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. లతా జీ మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కోట్లాది అభిమానుల సంగీత దేవతగా ఆమె ఆరాధించబడిన లతా మంగేష్కర్ జీవితం ఎంతో స్పూర్తిదాయకం. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన ఆమె కీర్తి ఎనలేనిది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఈ లెజెండరీ సింగర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్న అభిమానుల్లో మిగిలిపోయింది. దీనిపై ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లతాజీ సమాధానమిచ్చింది. 'జీవితంలో ప్రతిదీ దేవుడి నిర్ణయం ఆధారంగానే జరుగుతుంది. ఏం జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలి. పెళ్లి వద్దనుకునే ఆడపిల్లలు కూడా ఉంటారా? అనే ఈ ప్రశ్న ఓ నలభై ఏళ్ల క్రితం అడిగి ఉంటే నా సమాధానం మరోలా ఉండేదేమో. ఈ వయసులో అలాంటి ఆలోచలకు తావు లేదు.. అంటూ ఆమె సమాధానం చెప్పారు. ఈ ఇంటర్వ్యూ నాటికి లతాజీ వయసు 82 సంవత్సరాలు. అంతేకాకుండా పెళ్లిపై లతాజీ చేసిన మరొక కామెంట్ ఏంటంటే.. కుటుంబంలో పెద్ద అమ్మాయిని కావడం తండ్రి చనిపోయాక 13ఏళ్ల వయసు నుంచే కుటుంబ బాధ్యతని భుజాన వేసుకున్నాను. ఓ దశలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పటికీ ఈ కారణంగా కుదరలేదు' అని వివరించారు. -
ఆ దిగ్గజ గాయని గౌరవార్థం.. సీఎం అభ్యర్థి ప్రకటన పై సంబరాలు చేసుకోవద్దు!
చండీగఢ్: బాలీవుడ్ లెజండరీ గాయని లతా మంగేష్కర్ మరణించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ రోజు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనున్నారు. అయితే లతా మంగేష్కర్ గౌరవార్థం ఎటువంటి సంబరాలు చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరింది. ఇక పంజాబ్‌లో జరిగే ప్రచార ర్యాలిలో లత ఆలపించిన ‘ఏ మేరే వతన్ కే లోగోన్’ పాట ప్లే చేయనున్నారు. ఆమె మృతిపట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియంక వాద్రా ట్విట్టర్లో సంతాపం తెలిపారు. ‘ఆమె అనేక దశాబ్దాలుగా భారతదేశానికి అత్యంత ప్రియమైన గాయనిగా కమనీయమైన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మంగేష్కర్ బంగారు స్వరం అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తుంటుంది’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ప్రియాంక వాద్రా కూడా భారత మాజీ ప్రధాని ఇందిగాంధీతో దిగిన లతామంగేష్కర్ ఫోటోని షేర్ చేస్తూ.. "ఆమె మరణం భారతీయ కళా ప్రపంచానికి కోలుకోలేని లోటు కలిగించింది. ఆమె కుటుంబ సభ్యులకు ఆ బాధను భరించే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా." అని ట్వీట్ చేశారు. (చదవండి: ఇరవయ్యోస్సారి!.. తగ్గేదేలే..) -
మీకు తెలుసా? లతా మంగేష్కర్‌పై గతంలో విష ప్రయోగం జరిగింది!
ఆమె గొంతెత్తి పాడితే సినీ ప్రియులు పులకరించిపోయారు. గాన మాధుర్యానికి మంత్రముగ్ధులయ్యారు. ఎందుకంటే ఆమె గొంతులో అమృతం ఉంది. దానికి అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించగల సామర్థ్యం ఉంది. ఆ కోకిల స్వరం నుంచి జాలువారిన పాటలు వేలల్లోనే ఉన్నా తెలుగులో మాత్రం మూడంటే మూడు పాటలే పాడింది. ఇప్పుడేకంగా ఏ పాట పాడనంటూ శాశ్వతంగా మూగబోయింది. ఆదివారం ఉదయం లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో ఆమెపై విషప్రయోగం జరిగిన విషయాన్ని సైతం ప్రస్తావిస్తున్నారు. 1963లో లతా మంగేష్కర్‌పై విషప్రయోగం జరిగింది. దీంతో ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. వాంతులు కూడా చేసుకుంది. కాళ్లు సైతం కదపడానికి వీల్లేక నొప్పితో విలవిల్లాడుతూ మూడురోజుల పాటు మంచానికే పరిమితమైంది. ఆమెను పరీక్షించిన డాక్టర్.. ఎవరో ఆమెకు స్లోపాయిజన్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని లతాజీకి సన్నిహితంగా మెలిగే ప్రముఖ రచయిత్రి పద్మా సచ్దేవ్ ఓ పుస్తకంలో వెల్లడించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన లతా మంగేష్కర్ తర్వాత కోలుకున్నారు కానీ ఈ విషప్రయోగంతో చాలా నీరసపడిపోయారని అందులో పేర్కొన్నారు. చాలా రోజుల పాటు ఆమె మంచంపైనే ఉండిపోయారట. ఆ సమయంలో గేయ రచయిత సుల్తాన్ పురీ ప్రతిరోజు సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి సరదాగా కథలు, కవితలు, జోక్స్ చెప్పి ఆమెను నవ్వించేవారని, ఆమె తినే ప్రతి వంటనూ ముందు ఆయన తిని చెక్ చేసేవారట. ఇలా కొన్నాళ్లపాటు ఆమె వెన్నంటే ఉంటూ ఆమె కోలుకునేందుకు సుల్తాన్‌పురీ ఎంతగానో సాయపడినట్లు తెలుస్తోంది. -
లతా మంగేష్కర్ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం జగన్
-
గాన కోకిల లతా మంగేష్కర్ అరుదైన ఫోటోలు
-
లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ!
గాన గంధర్వురాలు, భారత రత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్(92) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆమె మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా ప్రజలు ఆమెకు నివాళులు అర్పించేందుకు వీలుగా నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలవరకు ఆమె పార్థివ దేహాన్ని తన నివాసంలో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. 1942లో గాయనిగా ఆమె కెరీర్ ప్రారంభించారు. నౌషాద్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకు.. ఎందరి సంగీతంలోనో ఆమె పాటలు పాడారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరున్న ఆమె.. దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు. కానీ మన దురదృష్టం.. తెలుగులో మూడు పాటలు పాత్రమే ఆలపించారు. -
హృదయం ముక్కలయ్యింది.. టాలీవుడ్ సెలబ్రిటీల సంతాపం
పాట మూగబోయింది. సంగీతం సవ్వడి చేయకుండా స్తబ్దుగా ఉండిపోయింది. గాత్రం లేకపోవడంతో నాట్యం నెమ్మదించింది. సంగీత ప్రపంచాన్ని కొన్ని ఏళ్లుగా ఏలిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అందరికీ సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె మృతితో సంగీత ప్రపంచంలోనే కాదు సినీ ప్రపంచంలోనూ భరించలేనంత నిశ్శబ్దం ఏర్పడింది. లెజెండరీ సింగ్ లతా మంగేష్కర్(92) ఆదివారం ఉదయం మరణించగా ఆమె మృతి పట్ల టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. భారత గాన కోకిల, దిగ్గజ గాయని లతా దీదీ ఇక లేరు. నా గుండె ముక్కలయ్యింది, ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఎంతో అసాధారణమైన జీవితాన్ని గడిపింది. సంగీతం సజీవంగా ఉన్నంతరవకు ఆమె పాటలు వినిపిస్తూనే ఉంటాయి అని మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. Nightingale of India, one of the greatest Legends #Lata Didi is no more.Heartbroken💔 The vacuum due to this colossal loss can never be filled. She lived an extraordinary life.Her Music lives on & will continue to cast a spell until Music is there! Rest in Peace #LataMangeshkar — Chiranjeevi Konidela (@KChiruTweets) February 6, 2022 Deeply saddened by Lata Mangeshkar ji's demise. A voice that defined Indian music for generations... Her legacy is truly unparalleled. Heartfelt condolences to the family, loved ones and all her admirers. Rest in peace Lata ji. There will never be another. 🙏🙏🙏 — Mahesh Babu (@urstrulyMahesh) February 6, 2022 మా గానకోకిల మూగబోయింది. మామధ్య మీరు లేకపోవచ్చేమో కానీ మీరందించిన పాటలు మాత్రం ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. పాటలో ఒకే ఒక్క లైన్‌తో మమ్మల్ని ఎన్నో అనుభూతులకు గురి చేశారు. మా అందరి మదిలో మీరెప్పటికీ నిలిచే ఉంటారు. Our nightingale has fallen silent. You are no more but your legendary contribution to the music industry will live on. The number of emotions you could make us feel with just a single line. R.I.P #LataMangeshkar Mam. You will always be in our hearts.Our National Treasure❤️ pic.twitter.com/FmyZnMjm2g — Pooja Hegde (@hegdepooja) February 6, 2022 Deeply saddened by the passing of Lata Ji. A truly irreparable loss for the nation indeed. The Queen of Melody will continue to reign in our hearts and minds and inspire a generation of singers. — Jr NTR (@tarak9999) February 6, 2022 Lata Ji's passing away is a huge and irreplaceable loss. She will live on in our hearts forever. My heartfelt tribute to the nightingale of India. May her soul rest in peace. Wishing the family strength and comfort in these difficult times. — rajamouli ss (@ssrajamouli) February 6, 2022 Love, respect and prayers 🌹 @mangeshkarlata pic.twitter.com/PpJb1AdUdc — A.R.Rahman (@arrahman) February 6, 2022 India has lost its nightingale! You will be terribly missed but your legacy will live forever 😍🙏🏻 Om Shanti ❤️#LataMangeshkar #immortal #legend pic.twitter.com/GndHbeKNEC — Kajal Aggarwal (@MsKajalAggarwal) February 6, 2022 💔 The GREATEST #LataMangeshkar pic.twitter.com/OewRVKK9CY — Adivi Sesh (@AdiviSesh) February 6, 2022 Legendary singer #LataMangeshkar garu is no more. A big loss to the Indian Film Industry. Our deepest Condolences to her family, friends & fans. May her soul rest in peace. pic.twitter.com/NEZGTXYsvs — Sri Venkateswara Creations (@SVC_official) February 6, 2022 Saddened at the sudden demise of #LataMangeshkar Garu, A voice that won millions of hearts. You'll always be remembered and immortal with your songs. Rest in Peace. Strength to her family and loved ones. — Sai Dharam Tej (@IamSaiDharamTej) February 6, 2022 End of an era in Indian Music ! Saddened by the demise of one of the most legendary singers of all time.. Her magical voice shall remain immortal..Sending my deepest condolences and strength to her family & billions of fans 🙏🏻#LataMangeshkar #NightingaleOfIndia pic.twitter.com/cstUlIzIOj — Pragya Jaiswal (@ItsMePragya) February 6, 2022 We lost a legend today. Truly an end of an era. May her soul rest in peace and glory. #LataMangeshkar 💔 pic.twitter.com/YK1TZ3oXXF — Tamannaah Bhatia (@tamannaahspeaks) February 6, 2022 R.I.p #LataMangeshkar ji You will always be India’s pride and your voice will always be part of our lives and homes forever and ever…💚💚💚 End of an Era 💔 pic.twitter.com/Lnr10aEZIA — Genelia Deshmukh (@geneliad) February 6, 2022 Lata ji 😢. Physically she might not be with us today, but she will live for generations to come through her songs. #LataMangeshkar — Vishnu Manchu (@iVishnuManchu) February 6, 2022 The Nightingale of India sleeps but her melodious voice shall always spread the soothing feel forever that she contributed into the world of music. India lost a Legend today 🙏 #LataMangeshkar #RIP pic.twitter.com/I74U7bMj2a — Mehreen Pirzada👑 (@Mehreenpirzada) February 6, 2022 Heartbreaking.. #LataMangeshkar ji…💔#OmShanti pic.twitter.com/wIG5UtWzjb — Daksha Nagarkar (@DakshaOfficial) February 6, 2022 -
లతాజీ పక్కన ఆ ఫీట్ ఒక్క బాలు వల్లే సాధ్యమైంది
‘మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై..’(గాత్రమే నా గుర్తింపు) లతా మంగేష్కర్ ఓ గొప్ప గాయని. ఆ గొప్పను ఆమె అస్సలు ఒప్పుకోరు. కానీ, ఆమె ఒక పర్ఫెక్షనిస్ట్. ఈ విషయం మాత్రం ఆమె కూడా ఒప్పుకుని తీరతారు. ఎందుకంటే.. ఒక పాట బాగా రావడానికి ఆమె ఎన్నిసార్లైనా సాధన చేస్తారట. వయసులో ఉన్నప్పుడు పాత తరం ఆర్టిస్టుల గొంతుకు తగ్గట్లే కాదు.. 60వ వడిలో మాధురి, కాజోల్ లాంటి యంగ్ ఆర్టిస్టులకూ ఆమె గాత్రం సూటయ్యేలా సాధన చేసేవారామే. రంగ్ దే బసంతిలో ‘లుకా చుప్పి’ పాట కోసం.. నాలుగు రోజులు సాధన చేశారంటే ఆమె డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి పర్ఫెక్షనిస్ట్ నుంచి మెప్పు పొందడం అంటే.. మాటలా? దిలీప్ కుమార్ ఒకసారి ఆమె పాడే విధానం మీద కామెంట్ చేశారు. దీంతో కొత్తల్లో ఆమె ఉర్దూ టీచర్‌ను పెట్టుకొని మరీ హిందీ పాటలు పాడింది. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా.. తనకు తానే హిందీ నేర్చుకుని తర్వాతెప్పుడో ఆమెతో గొంతు కలిపాడు. ఇద్దరూ ఉచ్ఛారణ విషయంలో తిరుగులేని నిబద్ధులు. మొండివాళ్లే. దక్షిణాది గాయకుల్లో ఎంతో మంది ఆమె పక్కన పాడినా.. సక్సెస్‌తోపాటు ఆమెతో ‘వాహ్.. శెభాష్’ అనిపించుకున్న ఏకైక సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే. లతా, బాలూల మధ్య ఒక పోలిక ఉంది. లతా భాషలో మరాఠీ స్వభావం ఉందని సంగీత దర్శకుడు నౌషాద్ ప్రోత్సహాంతో ఆమె ఉర్దూ నేర్చుకున్నారు. అలాగే తమిళం బాగా నేర్చుకుంటేనే పాడే అవకాశం ఇస్తానని బాలూను సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ఆదేశించారు. ఇద్దరూ ఆ భాషలను నేర్చుకున్నారు. పాటలో ఉచ్ఛారణకు పట్టం కట్టారు. ఒకరు గానగాంధర్వుడు.. మరొకరు గాన కోకిల.. వీళ్ల కాంబినేషన్ సూపర్‌హిట్. దేశమంతా పాడుకునే పాటలను వారు కలిసి పాడారు. లతా మంగేష్కర్ పక్కన గోల్డెన్ పిరియడ్‌లో రఫీ, కిశోర్, హేమంత్, తలత్, మన్నా డే వంటి ఉద్దండులు ఆలపించారు. కానీ, బాలు పక్కన పాడేప్పుడు మాత్రం ఆమె ఫుల్ ఎనర్జీ, జోష్‌తో పాడడం గమనించొచ్చు. తెలుగులో హిట్ అయిన ‘మరో చరిత్ర’ను దర్శకుడు కె.బాలచందర్ హిందీలో ‘ఏక్ దూజే కే లియే’ (1981)గా రీమేక్ చేయాలనుకున్నప్పుడు సంగీత దర్శకులుగా పీక్‌లో ఉన్న లక్ష్మీకాంత్–ప్యారేలాల్‌లను తీసుకున్నారు. లతా పక్కన బాలూ చేత పాడించాలని బాలచందర్ కోరారు. దీనికి లతా మంగేష్కర్ అభ్యంతరం చెప్పలేదు కానీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కొంత నసిగారట. ‘బాలూ పాడితే దక్షిణాది శ్లాంగ్ వచ్చినా పర్వాలేదు. పాడించండి. ఎందుకంటే నా హీరో తమిళుడు కదా సినిమాలో’ అన్నారు బాలచందర్. ఇక లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌లకు తప్పలేదు. ఎప్పుడైతే బాలు పాట విన్నారో.. ‘ఒక గాయకుడు పాటను ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే బాలూ చూసి నేర్చుకోండి’ అని ముంబైలో అందరికీ చెప్పడం మొదలెట్టారు లక్ష్మీకాంత్ ప్యారేలాల్. గతంలో బాలూ తన గొంతుకు సర్జరీ చేయించుకుంటున్నప్పుడు.. అది గాత్రానికే ప్రమాదం అని తెలిసి లతాజీ చాలా కంగారు పడటం, ‘వద్దు నాన్నా..’ అంటూ ఆమె వారించడం గురించి స్వయంగా బాలూనే పలు సందర్భాల్లో చెప్పడం చూశాం. అంతేకాదు.. హైదరాబాద్‌లో ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బాలూ ఆహ్వానం మీద లతా హైదరాబాద్ వచ్చారు. ‘ఏక్ దూజే కే లియే’లో లతా–బాలూ పాడిన పాటలు దేశాన్ని ఊపేశాయి. ‘తేరే మేరే బీచ్ మే’ పాట డ్యూయెట్గా, బాలూ వెర్షన్‌గా వినపడని చోటు లేదు. ‘హమ్ బనే తుమ్ బనే’, ‘హమ్ తుమ్ దోనో జబ్ మిల్ జాయేంగే’... ఈ పాటలన్నీ పెద్ద హిట్. ఈ సినిమాకు బాలూకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత రమేష్ సిప్పీ తీసిన ‘సాగర్’ (1985) కోసం లతాతో బాలూ ‘ఒమారియా ఒమారియా’ పాడి హిట్ కొట్టారు. కాని అన్నింటి కంటే పెద్ద హిట్ ‘మైనే ప్యార్ కియా’ (1989)తో వచ్చింది. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీల ఈ తొలి సినిమాలో సల్మాన్‌కు బాలూ, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్‌లక్ష్మణ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట పెద్ద హిట్‌గా నిలిచింది. యూత్ మెచ్చిన పాటలు.. కాలేజీ కుర్రకారు వీటి కోసం ఫిదా అయిపోయారు. ‘దిల్ దీవానా’, ‘ఆజా షామ్ హోనే ఆయీ’, ‘కబూతర్ జాజాజా’ లక్షలాది కేసెట్లు అమ్ముడుపోయాయి. ‘ఆయనతో పాడిన పాటల్లో నాకు ఆజా షామ్ హోనే ఆయీ ఇష్టం’ అని లతా అన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ (1994) కోసం లతా, బాలూ పోటీలు పడి పాడారు. లతాతో కలిసి బాలూ పాడిన ‘దీదీ తేరా దేవర్ దివానా’ పాట షామియానాలు, పెళ్లి మంటపాల్లో ఇష్టపాటగా మారింది. అందులోని ‘మౌసమ్ కా జాదు హై మిత్వా’, ‘జూతే దో పైసే లో’, ‘హమ్ ఆప్ కే హై కౌన్’... ఇవన్నీ ఆ సినిమాను భారతదేశ అతి పెద్ద హిట్‌గా నిలిపాయి. ‘హమ్ ఆప్ కే హై కౌన్’ రికార్డింగ్ సమయంలో వీళ్ల అల్లరి మామూలుగా ఉండేది కాదట. హమ్ ఆప్ కే హై కౌన్ అని లతా నోటి నుంచి రాగానే.. తర్వాతి లైన్ పాడకుండా ‘మై ఆప్ కా బేటా హూ’ అని బాలు అల్లరి చేసేవాడట. ఆమె పాడటం ఆపేసి– ‘‘చూడండి.. బాలూ నన్ను పాడనివ్వడం లేదు’’ అని ముద్దుగా కోప్పడేవారట. ఆ చనువుతోతో ఏమో ఆమె.. ఆ ముద్దుల కొడుకుని బాలాజీ అని పిలుచుకునేవారు. ఆ మధ్య లతా చనిపోయారనే పుకార్లు వచ్చినప్పుడు.. వాటిని ఖండిస్తూ బాలూ స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. ఆమె త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆశించారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన మరణవార్తను ముందుగా లతా వినాల్సి వచ్చింది. ‘ఆయన ప్రతి పాటలో ఏదో ఒక మెరుపు హఠాత్తుగా తెచ్చేవాడు. ఆయనతో రికార్డింగ్ అంటే ఈసారి పాటలో ఏం చేస్తాడా అనే కుతూహలం ఉంటుంది. ఒక విరుపో, నవ్వో, గమకమో. ఆయనతో నేను ముంబై, సింగపూర్, హాంకాంగ్‌లలో లైవ్ కన్సర్ట్లలో పాల్గొన్నాను. స్టేజ్ మీద ఒక ఎనర్జీని తెచ్చేవాడు. ఆయన చనిపోయారనే వార్త పుకారని అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఈ పుకారు నిజమని తేలింది’.. బాలూ మరణవార్త విని లతాజీ స్పందన. ఆమె తెలుగులో మొదట ‘నిదురపోరా తమ్ముడా’ (సంతానం) పాడినా.. అందులో రెండవ చరణం ఘంటసాల అందుకున్నా అవి విడి విడి రికార్డింగులే తప్ప కలిసి పాడిన పాట కాదు. దక్షిణాది నుంచి ఏసుదాస్‌తో లతా కొన్ని పాటలు పాడినా అవి ప్రత్యేక గుర్తింపు పొందలేదు. కానీ బాలూ అదృష్టం వేరు. తెలుగులో ‘ఆఖరి పోరాటం’ కోసం లతా ‘తెల్లచీరకు తకథిమి’ పాట పాడినప్పుడు బాలూయే ఆమెకు భాష నేర్పించారు. తమిళంలో కూడా వీరు కమలహాసన్ ‘సత్య’ (1988) సినిమాకు ‘వలయోసై’ అనే హిట్ డ్యూయెట్ పాడారు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ల అభిమానులకు మిగిలిన మధుర జ్ఞాపకాలు. – సాక్షి ఫ్యామిలీ, వెబ్ డెస్క్ -
లతా మంగేష్కర్ ఆలపించిన తెలుగు పాటలు.. అవేంటంటే ?
Lata Mangeshkar Death: See Her Top 3 All Time Best Telugu Songs: లెజండరీ గాయనీ లతా మంగేష్కర్ ఇక లేరు. కరోనాతో పోరాడుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ కొన్ని వారాల క్రితం స్వల్ప కొవిడ్ లక్షణాలతో ముంబైలోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన దక్కించుకోలేకపోయాం. సంగీత ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన లతా మంగేష్కర్ 20 భారతీయ భాషల్లో 980 చిత్రాలకు గాను సుమారు 50 వేలకుపైగా పాటలకు గానం అందించారు. అయితే వాటిలో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి. తెలుగులో కేవలం మూడంటే మూడు పాటలే పాడారు లతా మంగేష్కర్. తెలుగులో ఆమె ఎక్కువగా పాటలు పాడకపోవడానికి కారణం మాత్రం తెలియదు. ఇండియన్ నైటింగల్ పాడిన తెలుగు పాటల్లో ఒకటి 1955లో అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి నటించిన 'సంతానం' చిత్రంలోనిది. సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించిన 'నిదురపోరా తమ్ముడా' పాట లతా మంగేష్కర్ పాడిన తొలి తెలుగు పాట. తర్వాత 1965లో సీనియర్ నందమూరి తారక రామారావు, జమున జంటగా నటించిన 'దొరికితే దొంగలు' సినిమాలోది. ఇందులో 'శ్రీ వెంకటేశా' అనే గీతాన్ని ఆలపించారు లతా మంగేష్కర్. ఈ పాటను సాలూరి రాజేశ్వర రావు కంపోజ్ చేశారు. ఇక తెలుగులో లతా మంగేష్కర్ పాడిన మూడో పాట చివరి పాట 'తెల్ల చీరకు' అనే సాంగ్. ఈ పాట కింగ్ నాగార్జున, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించిన 'ఆఖరి పోరాటం' చిత్రంలోనిది. 1988లో వచ్చిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించగా, దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు లతా మంగేష్కర్. -
లతా మంగేష్కర్ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. 'లతా మంగేష్కర్ జీ ఇక మన మధ్య లేరని తెలిసి చాలా బాధపడ్డాను. ఆమె మధురమైన స్వరం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి' అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Deeply anguished to know that Lata Mangeshkar ji is no more with us. Her melodious voice will continue to echo for eternity. May her soul rest in peace. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 6, 2022 గవర్నర్ సంతాపం ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సంతాపం తెలియజేశారు. 'తన గాత్రంతో కోట్లాదిమందిని అలరించిన ఇండియన్ నైటింగేల్, భారతరత్న లతా మంగేష్కర్ మృతి సంగీత లోకానికి తీరని లోటు. లతా మంగేష్కర్ విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నా' అని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు. చదవండి: (గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత) -
లతా మంగేష్కర్‌కు ప్రముఖుల నివాళులు
ఎవరి పేరు చెప్తే కోకిల సైతం గర్వంగా తలెత్తి చూస్తుందో ఆమె గొంతు మూగబోయింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు అన్ని రంగాల సెలబ్రిటీలు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఆమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటని పేర్కొంటున్నారు. 'మాటల్లో చెప్పలేనంత వేదనలో ఉన్నాను. లతా దీదీ మనందరినీ వదిలి వెళ్లిపోయారు. రాబోయే తరాలు ఆమెను గుర్తుపెట్టుకుంటాయి. లతాజీ మరణం ఎంతగానో బాధించింది, ఆమె లేని లోటు పూడ్చలేదనిది. ఆమె మధురమైన స్వరం ప్రజలను మంతమగ్ధులను చేసింది. ఆమె ఎనలేని అసమాన సామర్థ్యం కలిగి ఉంది. సినిమాలకు అతీతంగా, ఆమె భారతదేశం అభివృద్ధిపై ఎల్లప్పుడూ మక్కువ చూపేది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కోరుకుంది. లతా దీదీ నుండి నేను అపారమైన ప్రేమను పొందడం నా గౌరవంగా భావిస్తున్నాను. ఆమెతో నా పరిచయం మరువలేనిది' అని ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్లో నివాళులు అర్పించారు. I am anguished beyond words. The kind and caring Lata Didi has left us. She leaves a void in our nation that cannot be filled. The coming generations will remember her as a stalwart of Indian culture, whose melodious voice had an unparalleled ability to mesmerise people. pic.twitter.com/MTQ6TK1mSO — Narendra Modi (@narendramodi) February 6, 2022 Lata Didi’s songs brought out a variety of emotions. She closely witnessed the transitions of the Indian film world for decades. Beyond films, she was always passionate about India’s growth. She always wanted to see a strong and developed India. pic.twitter.com/N0chZbBcX6 — Narendra Modi (@narendramodi) February 6, 2022 'దేశం గర్వించదగ్గ, సంగీత ప్రపంచంలో స్వర కోకిల, భారత రత్న గ్రహీత లతా మంగేష్కర్‌గారి మృతి బాధాకరం. ఆమె మృతి దేశానికి తీరని లోటు. ఆమె పవిత్ర ఆత్మకు హృదయపూర్వక నివాళులు అరిస్తున్నాను. ఆమె 30 వేలకు పైగా పాటలు పాడింది. సంగీత ప్రియులందరికీ ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచింది. దేశప్రజలందరితో పాటు నాకూ లతాజీ పాటలంటే చాలా ఇష్టం. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆమె పాటలు వింటూ ఉంటాను' అని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. लता दीदी प्रखर देशभक्त थी। स्वातंत्र्यवीर सावरकर जी की विचारधारा पर उनकी हमेशा ही दृढ़ श्रद्धा रही है। उनका जीवन अनेक उपलब्धियों से भरा रहा है। लता जी हमेशा ही अच्छे कामों के लिए हम सभी को प्रेरणा देती रही हैं। भारतीय संगीत में उनका योगदान अतुलनीय है। — Nitin Gadkari (@nitin_gadkari) February 6, 2022 'లతా మంగేష్కర్ మరణవార్త ఎంతగానో బాధిస్తోంది. ఆమె రాబోయే తరాలకు విలువైన పాటల వారసత్వాన్ని మిగిల్చింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఆమె కుటుంబ సభ్యులకు ఇదే నా ప్రగాఢ సానుభూతి' అని బోనీ కపూర్ సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యారు. Deeply saddened by the news of @mangeshkarlata Ji’s passing away. She leaves behind a huge legacy of songs which will be treasured for generations to come.May her soul rest in peace. Condolences to the family. #NightingaleofIndia #LataMangeshkar pic.twitter.com/svW9iZsQb4 — Boney Kapoor (@BoneyKapoor) February 6, 2022 There will be always only one Nightingale of India #LataMangeshkar ! Rest in Peace Lata Ji. pic.twitter.com/TDPescIdNw — Yo Yo Honey Singh (@asliyoyo) February 6, 2022 I am extremely saddened by the demise of Lata Mangeshkar Ji, the Nightingale of Indian Cinema and legendary singer. India has lost its voice in the death of Lata ji, who has enthralled music lovers in India & across the globe with her mellifluous & sublime voice for many decades. pic.twitter.com/C9m3PfexyP — Vice President of India (@VPSecretariat) February 6, 2022 जगभरातील कोट्यवधी संगीतप्रेमींच्या कानांना तृप्त करणारे अलौकिक स्वर आज हरपले. लतादीदींच्या आवाजाच्या परीसस्पर्शाने अजरामर झालेल्या गीतांच्या माध्यमातून हा स्वर आता अनंतकाळ आपल्या मनांमध्ये गुंजन करत राहील. गानसम्राज्ञी लता मंगेशकर यांना भावपूर्ण श्रद्धांजली! pic.twitter.com/U9Nhn1KrpE — Sharad Pawar (@PawarSpeaks) February 6, 2022 Short of words and will always be while saying anything about this LEGEND 💔 Learning to sing early on in my childhood, I was always told to follow your path by my father. I am blessed and honoured to have shared my birthday with you 🙏🏻❤️ OM SHANTI 🙏🏻 #LataMangeshkar pic.twitter.com/PbtKmSE2dN — Munmun Dutta (@moonstar4u) February 6, 2022 युग संपले... pic.twitter.com/prMUOK74oW — Sanjay Raut (@rautsanjay61) February 6, 2022 A very sad day and a huge loss for all of us, her fans. Your contribution will live on forever ma’am. My condolences to the family and all her fans across the world. Om Shanti 🙏 #LataMangeshkar pic.twitter.com/lEp50LL8CH — bhumi pednekar (@bhumipednekar) February 6, 2022 A huge loss to the nation... Our nightingale is no more! My heartfelt condolences to Lata Ji's family and near ones. #RestInPeace #LataMangeshkar 💔 pic.twitter.com/52Kc005emu — adaa khan (@adaa1nonly) February 6, 2022 The end of an era as the nightingale falls silent. Rest In Peace. 💐#LataMangeshkar pic.twitter.com/F8LtGm93Z7 — Nivin Pauly (@NivinOfficial) February 6, 2022 Deeply saddened to know about the passing away of legendary singer Bharat Ratna #LataMangeshkar ji. She was the melodious voice of India, who dedicated her life to enriching Indian music in her more than 7 decades long rich contribution. pic.twitter.com/oIXyl55Xl5 — Ashok Gehlot (@ashokgehlot51) February 6, 2022 Death of Lata Mangeshkar is end of a #goldenera of Indian music, which ruled the world. She was very good human being and world-class singer. She will always live with us through her music. My homage. Om Shanthi. #LataMangeshkar pic.twitter.com/zCtss5EP0m — Prakash Javadekar (@PrakashJavdekar) February 6, 2022 So sad to hear that Lataji is no more, going to miss her so much.End of an Era!Lataji,Nightingale of India,whose voice hs made generations sing,dance & cry wil forever feed our emotion.Heartfelt condolences to Ashaji,family & friends.Nation wil miss her. Om Shanti#LataMangeshkar pic.twitter.com/eIOUxydQYm — Sunny Deol (@iamsunnydeol) February 6, 2022 Legends remain immortal.. #RIP #LataMangeshkar thank you for the songs🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/RWyZqT5vM1 — TheFarahKhan (@TheFarahKhan) February 6, 2022 -
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూత
-
ఇండియన్ నైటింగేల్ సినీ ప్రస్థానం.. ఆమె ఫేవరెట్ సింగర్ ఎవరంటే ?
Nightingale of India Lata Mangeshkar reign of cinema: ప్రముఖ నేపథ్య గాయని, బారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ కన్ను మూశారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో నాలుగు వారాలుగా కరోనా చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు మెరుగైన చికిత్స చేసినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. అప్పుడే కోలుకొని అప్పుడే విజృంభించిన కరోనాతో పోరాడుతూ ఆదివారం (ఫిబ్రవరి 6) తుది శ్వాస విడిచారు. 13 ఏళ్లకే కేరీర్ ఆరంభం.. ఇండియన్ నైటింగేల్‌గా పేరొందిన లతా మంగేష్కర్ తన 13 సంవత్సరాల వయసులో 1942లో కెరీర్‌ను ప్రారంభించారు. సుమారు 20 భాషల్లో కలిపి మొత్తం 50 వేలకు పైగా పాటలు పాడిన ఘటికురాలు. ఆమె 7 దశాబ్దాల గాయనీ ప్రయాణంలో మరపురాని పాటలను ఆలపించారు. అందులో 'అజీబ్ దస్తాన్ హై యే', 'ప్యార్ కియా తో డర్నా క్యా', 'నీలా అస్మాన్ సో గయా', 'తేరే లియే' వంటి అనేక గీతాలకు ఆమె గాత్రంతో ప్రాణం పోశారు. 'పద్మ భూషణ్', 'పద్మ విభూషణ్', 'దాదా సాహెబ్ ఫాల్కే', 'బహుళ జాతీయ చలనచిత్ర' అవార్డులతో సహా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' అవార్డును పొందారు లతా మంగేష్కర్. ఐదేళ్లకే సంగీత శిక్షణ.. లతా మంగేష్కర్ సెప్టెంబర్ 28, 1929న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. 1942లో తన కళా ప్రయాణాన్ని ప్రారంభించి.. సుమారు 980 సినిమాల్లో పాటలు పాడి తన గానంతో అలరించారు. గాయనీగా కాకుండా నటిగా కూడా చేశారు లతా మంగేష్కర్. హిందీ సినిమా పాటల గాయనీ అంటే ముందుగా గుర్తు వచ్చేది లతా మంగేష్కర్ పేరే. హిందీ సినీ పరిశ్రమపై అంతలా తనదైన ముద్ర వేశారు. లతా మంగేష్కర్ సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా (ఐదుగురిలో) జన్మించారు. ఆమె తర్వాత వరుసగా ఆశా భోంస్లే, హృదయనాథ్, ఉషా, మీనా ఉన్నారు. ఐదో ఏటనే తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించారు లతా మంగేష్కర్, సంగీతాన్ని వినడం, పాడటం తప్ప మరొక ప్రపంచం లేదు. తాను చదువుకోకపోయినా తన చెల్లెళ్లు మాత్రం పెద్ద చదువులు చదువుకోవాలనుకున్నారు లతా మంగేష్కర్. కానీ వారు కూడా సంగీతంపైనే ఎక్కువ ఆసక్తి చూపడంతో కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది. పెద్ద కుమార్తెగా కుటుంబ పోషణ బాధ్యత లతా మంగేష్కర్‌కు 13 ఏళ్ల వయసులో తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దీంతో కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందుకే సినీ రంగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. 1942లో మరాఠీ చిత్రం 'పహ్లా మంగళ గౌర్'లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడారు. తర్వాత చిముక్లా సుసార్ (1943), గజెభావు (1944), జీవన్ యాత్ర (1946), మందిర్ 1948) తదితర చిత్రాల్లో లతా మంగేష్కర్ నటించారు. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సురైయాలు గాయనీలుగా వెలుగుతున్నారు. అయితే లతా మంగేష్కర్‌కు నచ్చిన గాయకుడు కె. ఎల్. సైగల్ అని తెలిపారు. -
గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) ఇక లేరు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఈ ఉదయం 8గం.12ని. తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. గత 29రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత నెల 8వ తేదీన కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆపై కరోనా నుంచి రికవరీ అయిన ఆమె.. వెంటిలేటర్‌పై కొన్నాళ్లు చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు ఈమధ్యే ప్రకటించారు కూడా. అయితే పరిస్థితి విషమించడంతో ఆమెకు మళ్లీ వెంటిలేటర్ మీదే చికిత్స అందించారు. 1942లో గాయనిగా ఆమె కెరీర్ ప్రారంభించారు. నౌషాద్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకు.. ఎందరి సంగీతంలో ఆమె పాటలు పాడారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరున్న ఆమె.. దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు. హిందీ చిత్రసీమలో లతా పాటలు నాటికి నేటికి శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఆమె లేరనే వార్తతో శోక సముద్రంలో మునిగిపోయారు సినీ సంగీత అభిమానులు. తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం తెలుగులో 1955 లో ఏఎన్నార్ ‘సంతానం’ కోసం నిదుర పోరా తమ్ముడా.. 1965 లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశ పాట. 1988 లో నాగార్జున ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీర కు పాట పాడారు. గానమే పరమావధిగా.. 1929 సెప్టెంబరు 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా జన్మించారు లత. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లత సంగీతమే మరోలోకంగా జీవించారు. చిన్న తనంలోనే తండ్రి మరణించడంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. దీంతో సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడారు. ఆ తరువాత పలు చిత్రల్లో నటించారు కూడా. గిన్నిస్ బుక్‌లోకి.. 1947లో మజ్ బూర్ చిత్రంతో గాయనిగా లత ప్రస్థానంమొదలైంది. మహల్‌తో స్టార్డమ్ సంపాదించుకున్నారు. అతి తక్కువకాలంలోనే తన ప్రతిభతో ఉన్న శిఖరాల్ని అధిరోహించారు. పలు భాషల్లో పాటలు పాడిన ఆమె జనం గుండెల్లో లెజెండరీ సింగర్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. తొలిసారిగా 1955లో రామ్ రామ్ పవ్హనే అనే మరాఠా సినిమాకు సంగీత సారధ్యం వహించారు లతా. సాధి మనసే సినిమాకు గాను ఆమె ఉత్తమ సంగీత దర్శకురాలిగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలోని ఐరనించియా దేవ తులా పాటకు ఉత్తమ గాయినిగా కూడ అవార్డు అందుకున్నారు లతా. 1948- 1978 వరకు 30వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు దక్కించుకున్న లతాజీ భారతీయ సినీ రంగానికి చేసినవిశిష్ట సేవలకు భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డుతో సత్కరించింది . అలాగే పద్మ భూషణ్ , పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పలు జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. ఎంఎస్ సుబ్బులక్ష్మి తరువాత భారత ప్రభుత్వం నుండి ఎక్కువ అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలిగా కీర్తి గడించారు. -
లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం!
ముంబై: సుప్రసిద్ధ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆమె ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వైద్యుడొకరు శనివారం చెప్పారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఆరోగ్యం చాలావరకు క్షీణించినట్లు సమాచారం. ఆమెకు కరోనా సోకడంతో స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి. దీంతో జనవరి 8న బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేరారు. డాక్టర్ ప్రతీత్ సందానీ, ఆయన బృందం లతకు చికిత్స అందిస్తోంది. చికిత్సకు లతా దీదీ చక్కగా స్పందిస్తున్నారని, వెంటిలేటర్‌పై ఉన్నారని శనివారం ఆసుపత్రి బయట సందానీ మీడియాతో చెప్పారు. అంతకుముందు ఉదయం మాట్లాడుతూ.. లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. జనవరి 29న మాట్లాడినప్పుడు ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, వెంటిలేటర్ తొలగించామని, ఐసీయూలోనే మరికొంత కాలం పరిశీలనలో ఉంచుతామని అన్నారు. 2019 నవంబర్‌లో లతా మంగేష్కర్‌కు శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. బ్రీచ్‌క్యాండీలో ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియా సోకినట్లు తేలింది. 28 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. 1942లో కేవలం 13 ఏళ్ల వయసులో గాయనిగా జీవనం ఆరంభించిన లతా మంగేష్కర్ వివిధ భారతీయ భాషల్లో 30,000కు పైగా పాటలు పాడారు. ‘మెలోడీ క్వీన్ ఆఫ్ ఇండియా’గా కీర్తి ప్రతిష్టలు పొందారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నతోపాటు సినీ రంగంలో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై ఆశా భోస్లే కీలక ప్రకటన
Asha Bhosle rushes to meet sister Lata Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే ఉంది. ఆరోగ్యం క్షీణించడంతో ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రతీత్ సంధాని తెలిపారు. లతా మంగేష్కర్ పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో హాస్పిటల్ పరిసరాల్లో పోలీసులు హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇక లతాజీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని తెలియగానే ఆమె సోదరి, ప్రముఖ గాయని ఆశా భోస్లే హుటాహుటిన బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మేమందరం ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నాం.ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు అని పేర్కొన్నారు. "We hope #Latadidi recovers soon. We are praying for her recovery. Doctors have informed us that she's stable.": #AshaBhosle on #LataMangeshkar's health! Read more here: https://t.co/x9KnspxXxB pic.twitter.com/7ggXJ46ygI — Pune Mirror (@ThePuneMirror) February 5, 2022 -
మళ్లీ విషమంగా సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి..
నైటింగెల్ ఆఫ్ ఇండియా, లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ముంబైలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రి వైద్యుడు ప్రతీత్ సంధాని చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది. ఏఎన్ఐ ప్రకారం 'వెటరన్ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు' అని డాక్టర్ ప్రతీత్ సంధాని పేర్కొన్నారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్‌కు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధరణ కాగా జనవరి 11న బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ ద్వారా న్యూమోనియా కూడా అటాక్ అయింది. అయితే ఇటీవల లతా మంగేష్కర్ కోవిడ్‌ను జయించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ మంత్రి తెలిపారు. న్యూమోనియా నుంచి కూడా కోలుకున్నట్లు వివరించారు. Veteran singer Lata Mangeshkar's health condition has deteriorated again, she is critical. She is on a ventilator. She is still in ICU and will remain under the observation of doctors: Dr Pratit Samdani, Breach Candy Hospital (file photo) pic.twitter.com/U7nfRk0WnM — ANI (@ANI) February 5, 2022 -
కోవిడ్‌ను జయించిన 92 ఏళ్ల లతా మంగేష్కర్.. కానీ!
Lata Mangeshkar Latest Health Update: ప్రముఖ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యంపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కీలక ప్రకటన చేశారు. కరోనా బారినపడిన చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్ తాజాగా కోవిడ్‌ను జయించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని, రెండు రోజుల క్రితమే వెంటిలేటర్ కూడా తీసేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా న్యూమోనియా నుంచి కూడా లతాజీ కోలుకున్నట్లు వివరించారు. అయితే మరికొన్ని రోజుల పాటు ఆమెను ఐసీయూలోనే వైద్యుల బృందం పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈనెల 8న కరోనాతో లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. I spoke with Dr Pratit Samdani who is treating singer Lata Mangeshkar. She's recovering, was on a ventilator for some days, but is better now. She is no more on ventilator. Only oxygen is being given to her. She is responding to the treatment: Maharashtra Minister Rajesh Tope pic.twitter.com/qOSP2H9OLl — ANI (@ANI) January 30, 2022 -
లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్: వెంటిలేటర్ తీసేసినా..
Lata Mangeshkar Latest Helath Update: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్ విడుదలైంది. ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్న ఆమెకు వెంటిలేటర్ తొలగించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వెంటిలేటర్ లేకుండా ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ ఉదయం కాసేపు వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నట్లు ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. డాక్టర్ ప్రతీత్ సందానీ నేతృత్వంలోని వైద్యబృందం లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం గమనిస్తోందని తెలిపారు. లతాజీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈనెల 8న కరోనాతో లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. pic.twitter.com/xDxD43SHsw — Lata Mangeshkar (@mangeshkarlata) January 27, 2022 -
లతా మంగేష్కర్ చికిత్స కోసం తన సంపాదన దానం చేసిన అభిమాని
లతా మంగేష్కర్ తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. పైగా ఆమెకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆమె ఆసుపత్రిలో చేరిన రోజు నుంచే అభిమానులు ఆమెకు అన్ని విధాలుగా మద్దతునిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఆటో డ్రైవర్.. లతా మంగేష్కర్ చికిత్స కోసం తన సంపాదనను దానం చేశాడు. ఈ మేరకు లతా మంగేష్కర్ గత 10 రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో నివసించే సత్యవాన్ గీతే లతా మంగేష్కర్‌కి పెద్ద అభిమాని. అంతేకాదు లతామంగేష్కర్‌ను అతను సరస్వతి దేవి రూపంగా కూడా భావిస్తాడు. పైగా అతను తన ఆటోను లతామంగేష్కర్ చిత్రాలతో అలంకరించాడు. ఈ మేరకు సత్యవాన్ లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారనే వార్త తెలుసుకున్నప్పటి నుంచి నిరంతరం ప్రార్థనలు చేస్తున్నాని చెప్పాడు. (చదవండి: 'ప్రైవసీ ఇవ్వండి.. దీదీ ఇంకా ఐసీయూలోనే') -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన..
Lata Mangeshkar Health Update: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికార ప్రతినిధి కీలక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించిందటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె అధికార ప్రతినిధి ఖండించారు. ఈ వదంతులను నమ్మవద్దంటూ క్లారిటీ ఇచ్చారు. లతా దీదీ ఇంకా ఐసీయూలోనే ఉంది. డాక్టర్ ప్రతీత్ సందానీ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దయచేసి పుకార్లను ప్రచారం చేయవద్దు. లతా మంగేష్కర్ కుటుంబానికి, వైద్యులకు ప్రైవసీ ఇవ్వాలి అంటూ ప్రకనటలో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దంటూ విఙ్ఞప్తి చేశారు. #LataMangeshkar health update: She's showing signs of improvement, still in ICUhttps://t.co/h5TekiPHOp — India Today Showbiz (@Showbiz_IT) January 22, 2022 -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. వివరించిన మంత్రి
Lata Mangeshkar Health Is Improving Says Maharashtra Health Minister: ఇండియన్ నైటింగల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 92 ఏళ్ల లతా స్వల్ప కరోనా లక్షణాలతో జనవరి 11న ముబయిలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు రిత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా ఆమె హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చారు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే. లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన వెల్లడించారు. లతా మంగేష్కర్ ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటున్న అభిమానుల కోసం జల్నాలో విలేకర్లతో సమావేశమై ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. 'లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నా. లతా మంగేష్కర్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఆమె కుటుంబ సభ్యులతో చర్చించాను. అలాగే ఆసుపత్రి అధికార ప్రతినిధి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేలా చూడాలని హాస్పిటల్ యాజామాన్యాన్ని కోరాను.' అని మంత్రి రాజేశ్ టోపే తెలిపారు. ఇదీ చదవండి: లతాజీ గొంతు బావుండదు.. -
లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్, స్వల్పంగా కోలుకున్న ఇండియన్ నైటింగల్
Lata Mangeshkar Latest Health Bulletin Released: ఇండియన్ నైటింగల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన పడిన సంగతి తెలిసిందే. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్న లతా మంగేష్కర్ రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు రిత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు వైద్యులు. చదవండి: బ్రేకప్ చెప్పుకున్న లవ్‌బర్డ్స్!, క్లారిటీ ఇచ్చిన హీరో లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. స్వల్పంగా కోలుకున్నారని లతా మంగేష్కర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ స్పష్టం చేశారు. కాగా 92 ఏళ్ల లతా మంగేష్కర్ గత రెండ్రోజుల క్రితం కరోనా లక్షణాలతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా తన పాటలతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. -
ఢిల్లీలో ప్రైవేట్ ఆఫీసుల మూసివేత
న్యూఢిల్లీ/ముంబై: ఢిల్లీలో కరోనా పడగ విప్పడంతో ప్రైవేటు కార్యాలయాన్ని మూసివేశారు. అత్యవసర ఆఫీసులు మినహాయించి అన్ని ప్రైవేటు కార్యాలయాలను మూసివేయాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) మంగళవారం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ప్రైవేటు ఆఫీసుల్లో 50% సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సిబ్బంది అందరికీ ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని కల్పించాలంది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఏకంగా 23 శాతం దాటింది. దేశంలో గత 24 గంటల్లో 1,68,063 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64% ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 8.85 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల విజృంభణతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోవిడ్ పరిస్థితులని సమీక్షించడానికి గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లో ఈసారి మకర సంక్రాంతికి గంగానది జలాల్లో పుణ్య స్నానాలు ఆచరించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. లతా మంగేష్కర్‌కు కరోనా ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌కు (92) కరోనా సోకింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బంధువులు చెప్పారు. ‘లక్షణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ లత‡ వయసును (92 ఏళ్లు) దృష్టిలో ఉంచుకొని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాలని వైద్యులు మాకు సూచించారు’ అని ఆమె మేనకోడలు రచన చెప్పారు. లత కోలుకోవడానికి వారం రోజులు పడుతుందని వైద్యులు చెప్పినట్టుగా రచన తెలిపారు. లత కరోనా మొదటి వేవ్‌లోనూ వైరస్ బారినపడి కోలుకున్నారు. -
మెలోడీ క్వీన్, లెజెండ్రీ సింగర్స్, ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు నేపథ్య సంగీతంలో ఆమె గళం అమరం. భావితరాలకు మెలోడీ క్వీన్ పాటే కొండంత వెలుగు..ఒక పాఠశాల. ఏ దేశమేగినా అని దేశభక్తిని పొంగించినా.. మీర జాలగలడా నా ఆనతి అని పాడినా.. వస్తాడు నా రాజు అంటూ ఆమె గళమెత్తినా, ‘ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీతోడ ఆనందం పొంగేనోయి దీపావళి’, ‘చీకటి వెలుగుల రంగేళి... జీవితమే ఒక దీపావళి’ అని రేడియోలో పాట ప్రసారం కాని లేని దీపావళి లేదు. ముత్యముంతా పసుపు ముఖమంతా ఛాయ అన్నా, ఝుమ్మంది నాదం సై అంది పాదం అని మురిపించినా ఆమెకు ఆమే సాటి. లతాజీతో గురుబంధం తనకు ఇష్టమైన గాయని లతా మంగేష్కర్ అని స్వయంగా సుశీలమ్మ గారే చాలా సందర్భంగా గర్వంగా ప్రకటించారు. ఆమె పాటలు వింటూ ఎదిగిన తాను, ఆమె గొంతును దొంగిలించాను అంటారామె. అలా లతాజీ తన మానసిక గురువు ఆమె అని చెబుతారు. అలాగే లతాజీ కూడా సుశీలమ్మను తన నాల్గవ చెల్లెలుగా భావిస్తారు. చెన్నై ఎప్పుడొచ్చినా సుశీలగారిని చూడకుండా వెనుదిరిగేవారు కాదు. అలాగే ముంబాయి వెళితే లతాజీని కలవకుండాక రారు సుశీలమ్మ. అంతటి స్నేహం, గురుభావం ఇద్దరి మధ్య ఉంది. హిందీ సినిమాలలో లతా మంగేష్కర్ ‘మహల్’ (1949) సినిమాతో స్టార్డమ్లోకి వస్తే పి.సుశీల ‘మిస్సమ్మ’ (1955) సినిమాతో స్టార్డమ్లోకి వచ్చారు. సుశీలమ్మను సౌత్ ఇండియా లతా మంగేష్కర్ అని కూడా పిలుచుకుంటారట. వీరిద్దరి మధ్య స్నేహం ఉండేదట. ముఖ్యంగా 1969లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి సంవత్సరమే జాతీయ ఉత్తమ గాయనిగా సుశీల ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చెన్నైలో ఏవీయం అధినేత మెయ్యప్పన్ చెట్టియార్‌గారు ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా లతామంగేష్కర్ విచ్చేశారు. తన తోటిగాయనిని ప్రత్యేకంగా సత్కరించడమే కాకుండా మరుసటిరోజు సుశీలగారి ఇంటికి వెళ్లి ఆమెకు బంగారు నెక్లెస్‌ను కూడా బహుకరించారు. అలాగే ఒకసారి చెన్నై వచ్చి సుశీలమ్మ తలుపు తట్టి ఆశ్చర్యపరిచారట లతా మంగేష్కర్. సుశీలమ్మ బయోపిక్, ఏ ఆర్ రహ్మాన్ సంగీత దర్శకుడు , ఆస్కార్ విన్నర్ ఏఆర్రహమాన్ ఇటీవల వెల్లడించారు. తొలి ప్రొడక్షన్ , క్లాసిక్ మూవీ ‘‘99 సాంగ్స్’’ ప్రమోషన్లో భాగంగా సుశీల తన బయోపిక్‌ను తీయాలనే తన కోరికను వ్యక్తం చేసినట్లు రెహమాన్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలైన అనంతరం దీనఇన ఓటీటీలో కూడా విడుదల చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌పై ఈఏడాది మేలో ట్విటర్ స్పేస్ సెషన్లో రెహమాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న 99 సాంగ్స్ చూశారా అని అడిగినపుడు చూడలేదని చెప్పారని, అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్‌ను చూడాలని కోరినట్టు తెలిపారు. తన కోరిక మేరకు సినిమా చూసిన సుశీలమ్మ సినిమా చాలా బాగుందని ప్రశంసించడంతోపాటు, తన తన కథను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, మీరు సహాయం చేస్తారా? అని అడిగారని ఆ సందర్భంగా రివీల్ చేశారు. అంతేకాదు తన ఫ్యావరెట్ సింగర్ తన సినిమాకి ఈ విధంగా ప్రతిస్పందించడం చాలా సంతోషంగా అనిపించిందన్నారు. దీంతో తమ అభిమాన గాయని బయోపిక్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జానకికి తొలి అవార్డు జానకితోపాటు, తోటిగాయనీ మణులందరితోనూ కూడా సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవారు సుశీల. ముఖ్యంగా తన పేరిట తీసుకొచ్చిన తొలి అవార్డును ఎస్ జానకికి ఇచ్చి సత్కరించడాన్ని ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకుంటారు. రెండో ఏడాది గానగంధర్వుడు ఎస్ పీ బాలూకి, మూడవ ఏడాది కేజే ఏసుదాసుగారికి ఇచ్చారు. అంతేకాదు కొన్నివేల మంది గాయకులకు 2 వేలు పెన్షన్ అందిస్తున్నారు. ఫ్యామిలీ సుశీలమ్మగారి సోదరుడి కోసం వచ్చిన మోహన్‌రావు గారు సుశీలమ్మను చూసి ఇష్టపడ్డారు. ఆయనకు లతా మంగేష్కర్ అంటే మహా ఇష్టం. అయితే అప్పటికే పాటలు పాడుతున్న సుశీలగారు అభిమాని కావడంలో ఆశ్చర్యమేముంది. అలా ఆ తరువాత భర్త అయ్యారు. వివాహం తరువాత ఆయనకు నేనే లతా మంగేష్కర్. సుశీల భర్త వృత్తిరీత్యా వైద్యుడైన మోహనరావు. వీరికి జయకృష్ణ అనే కుమారుడు.. జయశ్రీ- శుభశ్రీ అనే ఇద్దరు మనమరాళ్ళు ఉన్నారు. ఆమె కోడలు సంధ్య జయకృష్ణ `ఇరువర్` అనే తమిళ చిత్రంలో ఏఆర్ రహమాన్‌తో కలసి అరంగేట్రం చేశారామె. అలా రెహామాన్కి సుశీలమ్మ కుటుంబంతో గొప్ప అనుబంధం ఉంది. -
లతాజీ గొంతు బావుండదు..
‘బందర్ క్యా జానే అద్రక్ కా స్వాద్’ అంటూ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అద్నామ్ సమీ ట్వీట్ చేశారు. ఈ వాక్యానికి ఇంచుమించు ‘గాడిదకేం తెలుసు గంధపు వాసన’ అనే అర్థం వస్తుంది. ఇంతకూ కారణం కావేరీ అనే అమ్మాయి లతాజీ మీద చేసిన ట్వీట్. ‘‘ఆమె ఉమ్రావ్‌జాన్ సినిమాలో పాడనందుకు చాలా సంతోషంగా ఉంది. పాకీజా చిత్రం వరకు బాగానే పాడారు. అందుకే అప్పటి పాటల గురించి నేను పట్టించుకోలేదు. ఈ కామెంట్‌కు 6.8 వేల లైక్‌లు, 1.5 డిస్‌లైక్‌లు వచ్చాయి. ఆమె చేసిన ట్వీట్‌కి సమాధానంగా చాలా ట్వీట్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్లు పెట్టడం, విమర్శించటం ఒక అలవాటుగా మారిపోయింది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ‘లతా ఒంటి చేత్తో చాలామంది సింగర్ల కెరీర్‌ను నాశనం చేశారు. అందులో అనురాధా పొడ్వాల్ కూడా ఉన్నారు’ అంటూ మరొకరు స్పందించారు. ‘లతా మంగేష్కర్ గొంతు అద్భుతంగా ఉందంటూ భారతీయులకు బ్రెయిన్ వాష్ చేసేశారు’ అంటూ కావేరి మరో ట్వీట్ చేశారు. కొందరు ఆమె ట్వీట్‌కు అనుకూలంగా స్పందిస్తే, మరి కొందరు ఆమె ట్వీట్‌ను నిరసించారు. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అద్నాన్ సమీ, బాలీవుడ్ రచయిత వివేక్ అగ్నిహోత్రి మాత్రం కావేరీ మాటలను తోసి పుచ్చుతూ ఆమెను కోతిని చేశారు. ఈ అపవాదాలను తెలుగు పరిశ్రమలో ఘంటసాల, పి.సుశీల, బాలు కూడా తప్పించుకోలేకపోయారు. (చదవండి: సోనుసూద్ టైలర్ షాప్.. ప్యాంట్ కాస్త నిక్కర్ కావొచ్చు) -
బాలూ–లతా కాంబినేషన్ సూపర్‌హిట్
కొత్తల్లో ఆమె ఉర్దూ టీచర్‌ను పెట్టుకొని మరీ హిందీ పాటలు పాడింది. అతను తనకు తానే హిందీ నేర్చుకుని తర్వాతెప్పుడో ఆమెతో గొంతు కలిపాడు. ఇద్దరూ ఉచ్ఛారణ విషయంలో తిరుగులేని నిబద్ధులు. లతా మంగేష్కర్ పక్కన పాడి హిట్టయిన దక్షణాది గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే. వారి మధ్య అనుబంధం, వారి పాటలు, బాలూ చనిపోయాక ఆయన గురించి లతా చెప్పిన విశేషాలు లతా జన్మదినం సందర్భంగా... లతా, బాలూల మధ్య ఒక పోలిక ఉంది. లతా భాషలో మరాఠీ స్వభావం ఉందని సంగీత దర్శకుడు నౌషాద్ ఆమెను ఉర్దూ నేర్చుకోమన్నారు. తమిళం బాగా నేర్చుకుంటేనే పాడే అవకాశం ఇస్తానని బాలూను సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ఆదేశించారు. ఇద్దరూ ఆ భాషలను నేర్చుకున్నారు. పాటలో ఉచ్ఛారణకు పట్టం కట్టారు. ఉర్దూ భాష తెలిసినవారు కూడా ఒక్కోసారి ‘జరూరీ’ (jaroori)అంటారు. కాని బాలూ పాడితే సరైన ఉచ్ఛారణతో zaroori అంటాడు. ఉర్దూ పదాలు ‘ఖైర్’, ‘ఖయాల్’, ‘సమజ్దార్’ వంటివి కూడా వాటి సరైన ఉచ్ఛారణతో బాలూ పాడటం సంగీతాభిమానులకు తెలుసు. అందుకే ఆయన లతా మంగేష్కర్‌కు ఇష్టమైన గాయకుడయ్యారు. గొప్పపాటలు పాడగలిగారు. నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా ‘ఏక్ దూజే కే లియే’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకుంటున్న బాలు లతా మంగేష్కర్‌కు అందరు గాయకులతో పాడటం అంత సౌకర్యంగా ఉండదు. ఆమె గోల్డెన్ పిరియడ్ అంతా రఫీ, కిశోర్, హేమంత్, తలత్, మన్నా డే వంటి ఉద్దండ గాయకులతో గడిచింది. ఆమె తెలుగులో ‘నిదురపోరా తమ్ముడా’ (సంతానం) పాడినా అందులో రెండవ చరణం ఘంటసాల అందుకున్నా అవి విడి విడి రికార్డింగులే తప్ప కలిసి పాడిన పాట కాదు. దక్షిణాది నుంచి ఏసుదాస్‌తో లతా కొన్ని పాటలు పాడినా అవి ప్రత్యేక గుర్తింపు పొందలేదు. కాని బాల సుబ్రహ్మణ్యం అదృష్టం వేరు. బాలూ–లతా కాంబినేషన్ సూపర్‌హిట్. దేశమంతా పాడుకునే పాటలను వారు కలిసి పాడారు. తెలుగులో హిట్ అయిన ‘మరో చరిత్ర’ను దర్శకుడు కె.బాలచందర్ హిందీలో ‘ఏక్ దూజే కే లియే’ (1981)గా రీమేక్ చేయాలనుకున్నప్పుడు సంగీత దర్శకులుగా పీక్‌లో ఉన్న లక్ష్మీకాంత్–ప్యారేలాల్‌లను తీసుకున్నారు. లతా పక్కన బాలూ చేత పాడించాలని బాలచందర్ కోరారు. దీనికి లతా మంగేష్కర్ అభ్యంతరం చెప్పలేదు కాని లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కొంత నసిగారు. ‘బాలూ పాడితే దక్షిణాది శ్లాంగ్ వచ్చినా పర్వాలేదు. పాడించండి. ఎందుకంటే నా హీరో తమిళుడు కదా సినిమాలో’ అన్నారు బాలచందర్. ఇక లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌లకు తప్పలేదు. కాని ఆశ్చర్యకరంగా బాలూతో పని చేయడం మొదలెట్టాక వారు ఆయన మోహంలో పడిపోయారు. ‘ఒక గాయకుడు పాటను ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే బాలూ చూసి నేర్చుకోండి’ అని ముంబైలో అందరికీ చెప్పడం మొదలెట్టారు. లతా మంగేశ్కర్ కూడా ‘బాలూ ఒక ప్రత్యేక గాయకుడు’ అని మెచ్చుకున్నారు. ‘ఆయన ప్రతి పాటలో ఏదో ఒక మెరుపు హటాత్తుగా తెచ్చేవాడు. ఆయనతో రికార్డింగ్ అంటే ఈసారి పాటలో ఏం చేస్తాడా అనే కుతూహలం ఉంటుంది. ఒక విరుపో, నవ్వో, గమకమో. ఆయనతో నేను ముంబై, సింగపూర్, హాంకాంగ్‌లలో లైవ్ కన్సర్ట్లలో పాల్గొన్నాను. స్టేజ్ మీద ఒక ఎనర్జీని తెచ్చేవాడు. ఆయన చనిపోయారనే వార్త పుకారని అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఈ పుకారు నిజమని తేలింది’ అన్నారు లతా బాలూ మరణవార్త విని. ‘ఏక్ దూజే కే లియే’లో లతా–బాలూ పాడిన పాటలు దేశాన్ని ఊపేశాయి. ‘తేరే మేరే బీచ్ మే’ పాట డ్యూయెట్గా, బాలూ వెర్షన్‌గా వినపడని చోటు లేదు. ‘హమ్ బనే తుమ్ బనే’, ‘హమ్ తుమ్ దోనో జబ్ మిల్ జాయేంగే’... ఈ పాటలన్నీ పెద్ద హిట్. ఈ సినిమాకు బాలూకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత రమేష్ సిప్పీ తీసిన ‘సాగర్’ (1985) కోసం లతాతో బాలూ ‘ఒమారియా ఒమారియా’ పాడి హిట్ కొట్టారు. కాని అన్నింటి కంటే పెద్ద హిట్ ‘మైనే ప్యార్ కియా’ (1989)తో వచ్చింది. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీల ఈ తొలి సినిమాలో సల్మాన్‌కు బాలూ, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్‌లక్ష్మణ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట పెద్ద హిట్‌గా నిలిచింది. కాలేజీ కుర్రకారు వీటి కోసం ఫిదా అయిపోయారు. ‘దిల్ దీవానా’, ‘ఆజా షామ్ హోనే ఆయీ’, ‘కబూతర్ జాజాజా’ లక్షలాది కేసెట్లు అమ్ముడుపోయాయి. ‘ఆయనతో పాడిన పాటల్లో నాకు ఆజా షామ్ హోనే ఆయీ ఇష్టం’ అని లతా అన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ (1994) కోసం లతా, బాలూ పోటీలు పడి పాడారు. లతాతో కలిసి బాలూ పాడిన ‘దీదీ తేరా దేవర్ దివానా’ పాట షామియానాలు, పెళ్లి మంటపాల్లో ఇష్టపాటగా మారింది. అందులోని ‘మౌసమ్ కా జాదు హై మిత్వా’, ‘జూతే దో పైసే లో’, ‘హమ్ ఆప్ కే హై కౌన్’... ఇవన్నీ ఆ సినిమాను భారతదేశ అతి పెద్ద హిట్‌గా నిలిపాయి. ‘ఈ సినిమాలో పాట రికార్డింగ్ కోసం లతా పాడుతూ ‘హమ్ ఆప్ కే హై కౌన్’ అనగానే నేను తర్వాతి లైన్ పాడకుండా ‘మై ఆప్ కా బేటా హూ’ అని అనేవాణ్ణి. ఆమె పాడటం ఆపేసి– చూడండి.. బాలూ నన్ను పాడనివ్వడం లేదు’ అని ముద్దుగా కోప్పడేవారు’ అని బాలూ ఒక సందర్భంలో చెప్పారు. ‘బాలూని నేను చాలాసార్లు రికార్డింగ్ థియేటర్లలోనే కలిశాను. కాని ఒకటి రెండుసార్లు ఆయన మా ఇంటికి వచ్చి నాకు బహుమతులు తెచ్చారు. ఇవన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. ఆయనను నేను బాలాజీ అని పిలిచేదాన్ని’ అని లతా అన్నారు. లతా చనిపోయారనే పుకార్లు ఇటీవల వచ్చినప్పుడు వాటిని ఖండిస్తూ బాలూ వీడియో విడుదల చేశారు. దురదృష్టవశాత్తు ఆయన మరణవార్త లతా వినాల్సి వచ్చింది. గతంలో బాలూ తన గొంతుకు సర్జరీ చేయించుకుంటున్నప్పుడు అది గాత్రానికే ప్రమాదం అని తెలిసి లతా చాలా కంగారు పడటం గురించి బాలూ చెప్పుకునేవారు. హైదరాబాద్‌లో ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బాలూ ఆహ్వానం మీద లతా హైదరాబాద్ వచ్చారు. తెలుగులో ‘ఆఖరి పోరాటం’ కోసం లతా ‘తెల్లచీరకు తకథిమి’ పాట పాడినప్పుడు బాలూయే ఆమెకు భాష నేర్పించారు. తమిళంలో కూడా వీరు కమలహాసన్ ‘సత్య’ (1988) సినిమాకు ‘వలయోసై’ అనే హిట్ డ్యూయెట్ పాడారు. ఇవన్నీ ఇప్పుడు లతాకు మిగిలిన బరువైన గుర్తులు. లేదా మధుర జ్ఞాపకాలు. – సాక్షి ఫ్యామిలీ -
లతా మంగేష్కర్ బిల్డింగ్ సీల్
ముంబై: గాన కోకిల లతా మంగేష్కర్ నివాసాన్ని బీఎంసీ(బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు శనివారం సీల్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే ముంబైలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. అందులోనూ వైరస్ యుక్త వయసు వారికన్నా కూడా వృద్ధులకు ప్రమాదకరంగా పరిణమించింది. దీంతో లతా మంగేష్కర్ నివాసం ఉంటున్న ప్రభకుంజ్‌లో వయో వృద్ధులు ఎక్కువగా ఉండటంతో ఆ భవనాన్ని సీల్ చేశారు. కేవలం వారి సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: హీరోయిన్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు) ఈ విషయంపై గాయని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. "భవనాన్ని సీల్ చేసిన విషయాన్ని అధికారులు మాకు ఫోన్ చేసి చెప్పారు. మేమంతా క్షేమంగా ఉన్నాం. ముందుజాగ్రత్త చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవుడి దయ, అభిమానుల ఆశీర్వాదం వల్ల మా కుటుంబం అంతా సురక్షితంగా ఉంది అని చెప్పుకొచ్చారు". కాగా ఇప్పటికే బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అమితాబ్ భవనాన్ని కూడా కొద్దిరోజులపాటు అధికారులు సీల్ చేశారు. (చదవండి: ‘ఇండియా నైటింగేల్‌ను కోల్పోయామా?’) -
భారత నారీమణుల ఆశీర్వాదం దేశానికి బలం
న్యూఢిల్లీ: ‘ఈ దేశంలోని అనేక మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదంతో మన దేశం మరింత ఉన్నత శిఖరాలను చేరుకుని విజయాన్ని సాధిస్తుంది’అని ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్ సందర్భంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఈ దేశం కోసం పనిచేయగలగడం నాకు గర్వకారణం, భారత నారీమణుల ఆశీర్వాదాలు నాకు మరింత బలాన్నిస్తాయి’అని ట్వీట్ చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రధాని మోదీకి ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ఆధ్యాత్మికవేత్త అమృతానందమయి రాఖీ బంధన్ సందేశాలు పంపారు. ప్రధానిగా మోదీ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, మోదీతో కలిసి దిగిన ఫొటోలను, తన ఆడియో సందేశాన్ని 90 ఏళ్ల లతా మంగేష్కర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ప్రధానమంత్రి మోదీ పైవిధంగా ట్విట్టర్లో స్పందించారు. -
‘ఇండియా నైటింగేల్‌ను కోల్పోయామా?’
దిగ్గజ గాయని లతా మంగేష్కర్ (90) అనారోగ్యం గురించి వస్తున్న వదంతులపై ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పందించారు. లతాజీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆమె కోలుకుంటున్నారని శనివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా లతా ఇకలేరు అంటూ వస్తున్న వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వదంతులు ప్రచారం చేసి లతాజీ అభిమానులను, శ్రేయోభిలాషులను ఆందోళనకు గురిచేయవద్దని విఙ్ఞప్తి చేశారు. కాగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో లతా మంగేష్కర్ సోమవారం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందారు. ఈ క్రమంలో లతా అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. అయితే ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు శోభా డే చేసిన ట్వీట్ లతా అభిమానులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ‘ ఇది నిజం కాదని చెప్పండి. ఇండియా తన నైటింగేల్‌ను కోల్పోయిందా’అని ఆమె ట్విటర్లో పేర్కొనడం కలకలం రేపింది. శోభా డే తీరును పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. ఈ క్రమంలో విమర్శలపై స్పందించిన శోభా డే... ‘ ఇప్పుడే లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులతో మాట్లాడాను. దేవుడి దయ వల్ల మన ప్రియమైన నైటింగేల్ ఆరోగ్యంగానే ఉన్నారట అని మరో ట్వీట్ చేశారు. ఇక దిగ్గజ గాయనిగా పేరొందిన మంగేష్కర్ వెయ్యికి పైగా చిత్రాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. దాదాపు 70 ఏళ్లపాటు ఆమె గాయనిగా కొనసాగారు. చివరగా 75 ఏళ్ల వయసులో ఉండగా వీర్ జారా సినిమా కోసం గాత్ర దానం చేశారు. సంగీత రంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా... 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2001లో దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఆమెను వరించాయి. Just spoke to the family . By God's grace, our precious nightingale is fine.@mangeshkarlata — Shobhaa De (@DeShobhaa) November 16, 2019 -
కోలుకున్న లతా మంగేష్కర్
ముంబై: దిగ్గజ గాయని లతా మంగేష్కర్ (90) శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, మంగళవారం డిశ్చార్జ్ అవుతారని ఆమె సోదరి ఉషా మంగేష్కర్ తెలిపారు. వైరల్ ఇన్ఫెక్షన్తో ఆమెను ఆస్పత్రిలో ఉంచాలని భావించినట్లు తెలిపారు. మంగేష్కర్ వెయ్యికి పైగా చిత్రాల్లో వేలాది పాటలు పాడారు. దాదాపు 70 ఏళ్లపాటు ఆమె గాయనిగా కొనసాగారు. చివరగా 75 ఏళ్ల వయసులో ఉండగా వీర్ జారా సినిమా కోసం పనిచేశారు. 1989లో ఆమె దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, 2001లో దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను అందుకున్నారు. -
ఆ మహిళలకు సెల్యూట్ చేద్దాం!
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపి, దేశం గర్వించేలా చేసిన మహిళలకు సముచిత గౌరవం, ప్రచారం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాల కోసం అవిశ్రాంత కృషి చేస్తున్న ఆ భరతమాత బిడ్డల విజయాలను గుర్తించి, ప్రశంసించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మాసాంతపు రేడియో ప్రసంగం కార్యక్రమం మన్ కీ బాత్‌లో ప్రధాని ఈ రోజు పలు అంశాలను పంచుకున్నారు. జాగింగ్ చేస్తున్న సమయంలో దార్లోని చెత్తను ఏరివేసే ప్లాగింగ్(జాగింగ్ ప్లస్ పికింగ్ అప్ లిటర్)ను ఉద్యమ స్థాయిలో చేపట్టాలని పిలుపునిచ్చారు. దీనికి ప్రచారం కల్పిస్తున్న రిపుదమన్ బెల్వీని మోదీ ప్రశంసించారు. విదేశాల్లో ప్లాగింగ్ సాధారణమే కానీ భారత్‌లో బెల్వీ దీనికి ప్రాచుర్యం కల్పించారని మోదీ తెలిపారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వాడకాన్ని అడ్డుకునే కార్యక్రమాన్ని అక్టోబర్ 2 వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేరోజు ‘ఫిట్ ఇండియా ప్లాగింగ్ రన్’ను క్రీడాశాఖ నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమని, అందువల్ల ఈ – సిగరెట్ల వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని యువతను కోరారు. ఈ – సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం కాదన్న దురభిప్రాయం ఉందని, అయితే, అది సరి కాదని, ఈ – సిగరెట్లు కూడా సాధారణ పొగాకు ఉత్పత్తుల మాదిరిగానే హానికరమని వివరించారు. ఈ కొత్త తరహా వ్యసనం బారిన యువత పడకూడదనే ఈ– సిగరెట్లను నిషేధించామన్నారు. అలాగే, సెప్టెంబర్ 28న జన్మదినోత్సవాన్ని జరుపుకున్న ప్రముఖ గాయని లత మంగేష్కర్‌కు శుభాకాంక్షలు చెబుతూ చేసిన ఫోన్‌కాల్ వివరాలను మోదీ తెలియజేశారు. దీపావళి సందర్భంగా మిఠాయిలు, బహుమతులను పేదలతో పంచుకోవాలని కోరారు. మహిళా విజేతలను గౌరవించుకునే కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉందని ప్రధాని పేర్కొన్నారు. ‘భారత్‌కీలక్ష్మి’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో వారి గురించి ప్రచారం చేయాలన్నారు. ‘ఈ పండుగ సమయంలో బహుమతులు, మిఠాయిలు తీసుకోవడమే కాకుండా పంచుకోవడాన్ని ప్రారంభిద్దాం. మనకు పనికిరాని వస్తువులను అవసరమైన పేదలకు ఇద్దాం’ అని కోరారు. ఇటీవలి యూఎస్ ఓపెన్ ఫైనల్లో స్టార్ ప్లేయర్ నదాల్ చేతిలో ఓటమి పాలైన రష్యా టెన్నిస్ ఆటగాడు డానిల్ మెద్వదేవ్ చూపిన క్రీడా స్ఫూర్తిని మోదీ కొనియాడారు. లతకు శుభాకాంక్షలు.. అమెరికా పర్యటనకు వెళ్లే ముందే ప్రధాని మోదీ లతా మంగేష్కర్‌కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లతను తన సోదరిగా భావిస్తానన్నారు. ఆమెలోని నిరాడంబరత ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ‘మీ బర్త్‌డే రోజు నేను విమాన ప్రయాణంలో ఉండొచ్చు. అందువల్ల ముందే మీకు శుభాకాంక్షలు చెబుతున్నా. మీ ఆశీస్సులు మాకు కావాలి’ అని మోదీ కోరారు. అందుకు ప్రతిగా, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన లత.. దేశానికి ఎంతో సేవ చేసిన మీ ఆశీస్సులే తనకు కావాలంటూ ప్రధానికి సమాధానమిచ్చారు. దానికి, ‘మీరు, వయసులోను, దేశానికి చేసిన సేవలోను ఎంతో పై ఎత్తున ఉన్నారు. మీ ఆశీస్సులే మాకు కావాలి’ అని మోదీ జవాబిచ్చారు. ‘ఈ సారి ముంబై వచ్చి నప్పుడు మీ ఇంటికి వచ్చి గుజరాతీ వంటకాలను ఆస్వాదిస్తా’ అని లతా మంగేష్కర్‌కు ప్రధాని చెప్పారు. లతా మంగేష్కర్ తల్లిగారైన శేవంతి మంగేష్కర్ గుజరాత్‌కు చెందినవారే.