ఆమె వల్లే వాణీ జయరాం మద్రాస్‌కు వచ్చేశారు..! | Vani Jairam Meet Famous Singer Lata Mangeshkar Bollywood | Sakshi
Sakshi News home page

Vani Jairam: 'వాణీ ఆదరణ చూసి ఆమె భయపడ్డారట'..!

Feb 4 2023 9:20 PM | Updated on Feb 4 2023 9:28 PM

Vani Jairam Meet Famous Singer Lata Mangeshkar Bollywood - Sakshi

వాణీ జయరాం గొంతు దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని అలరించింది. దేశంలోని పలు భాషల్లో ఆమె తన గాత్రాన్ని వినిపించింది. ఇటీవలే ఆమె కృషికి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌ పురస్కారం ప్రకటించి గౌరవించింది. అయితే ఆమె హఠాన్మరణంతో అవార్డు స్వీకరించకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఇవాళ చెన్నైలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా  సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఏలిన వాణీ జయరాం గురించి తెలుసుకుందాం. 

మూడుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా పురస్కారాలు అందుకున్న వాణీ జయరాం 1945 నవంబరు 30న తమిళనాడులోని వేలూరులో ఓ సంగీత కుటుంబంలో వాణీ జయరాం జన్మించారు. పద్మావతి, దొరైస్వామి ఆమె తల్లిదండ్రులు. వాణీ పుట్టగానే ఆమె తండ్రి ఓ సిద్ధాంతిని కలిసి జాతకం చూపించగా.. ‘మీ పాప భవిష్యత్తులో సుమధుర గాయని అవుతుంది. అందుకే కలైవాణి అని పేరు పెట్టమని చెప్పారట. ఆ మాట వినగానే అప్పుడు వాణీ తండ్రి నవ్వుకున్నారు కానీ.. ఆ మాటలు నిజమని తేలడానికి ఎన్నో ఏళ్లు పట్టలేదు. ఆమె దాదాపు 19 భాషల్లో పాటలు పాడింది.  1971లో జయా బచ్చన్ చిత్రం గుడ్డితో అరంగేట్రం చేసిన బోలే రే పాపిహరా పాటతో జైరామ్ సంగీతంలోకి ప్రవేశించారు.

అప్పట్లో బాలీవుడ్‌లో లతా మంగేష్కర్, తెలుగులో సుశీల, జానకి లాంటి గాయకురాలు జోరు కొనసాగుతోంది. అదే సమయంలో తన ప్రత్యేకమైన కంఠస్వరంతో గుర్తింపు సాధించింది వాణీ. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు పదేళ్లపాటు సంగీత ప్రపంచాన్ని శాసించారు.  

వాణీ జయరాం కెరీర్‌ హిందీలోనే ప్రారంభమైంది. అందువల్లే ఆమె హీందీ పాటలంటే మొదటి నుంచి ఇష్టం. ఆమె పాటలకు మంచి ఆదరణ రావడంతో తనకు ఎక్కడా పోటీగా వస్తుందేమోనని లతా మంగేష్కర్ చాలా భయపడ్డారు. తొలి చిత్రం గుడ్డితో పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో లతా ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లింది వాణీ జయరాం. కానీ ఆమెను కలిసేందుకు లతా నిరాకరించారు.

లతా మంగేష్కర్‌తో వైరం

ఆ తర్వాత 1979లో విడుదలైన మీరా సినిమాతో వారిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది. మీరా సినిమాకు రవిశంకర్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు గుల్జార్. అయితే అది లతా మంగేష్కర్‌కు నచ్చలేదు. తన సోదరుడిని సంగీత దర్శకునిగా తీసుకోకపోతే తాను పాటలు పాడేది లేదని తేల్చి చెప్పారు. దీంతో వాణీ జయరాంతో పాటలన్నీ పాడించారు గుల్జార్. అలా వాణీపై లతా మధ్య వైరం పెరిగింది. కొన్నాళ్ల తర్వాత బాలీవుడ్‌లో రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేశారు వాణీ. తెలుగులో 'అభిమానవంతులు' సినిమాలో 'ఎప్పటివలె కాదురా' అనే పాటతో నన్ను ఎస్పీ కోదండపాణి  పరిచయం చేశారు. తెలుగులో పాడిన పాటలు తక్కువే అయినా.. అవన్నీ సూపర్ హిట్ సాంగ్సే.  
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement