Singer
-
వారసుడిని రెడీ చేస్తున్న సింగర్ శ్రేయా ఘోషల్ (ఫొటోలు)
-
స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాల్లో రచయిత చంద్రబోస్ (ఫోటోలు)
-
స్టార్ డైరెక్టర్‌పై కమెడియన్ దారుణ కామెంట్స్.. వాళ్లను ఆ జబ్బు వదలదేమో?
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ మూవీకి ఆయనే కథను అందించారు. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించగా.. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా బేబీ జాన్ టీమ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి హాజరైంది.అయితే ఈ షోలో డైరెక్టర్ అట్లీని ఉద్దేశించిన కపిల్ శర్మ అడిగిన ప్రశ్న వివాదానికి దారితీసింది. అట్లీ కలర్‌ను ఉద్దేశిస్తూ వ్యంగ్యమైన ప్రశ్న వేశాడు కపిల్. మీరు ఎవరైనా స్టార్‌ని కలిసినప్పుడు.. మీరు అతనికి కనిపిస్తారా? అంటూ అట్లీ కలర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనికి అట్లీ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు.దీనికి అట్లీ మాట్లాడుతూ...'ఒక విధంగా మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా. నా మొదటి సినిమాను నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సర్కి నేను చాలా కృతజ్ఞతలు. అతను నా స్క్రిప్ట్, నా సామర్థ్యం మాత్రమే చూశాడు. అంతేకానీ నేను ఎలా ఉన్నానో ఆయన అడగలేదు. అక్కడ ఆయనకు నా కథ నచ్చింది. ప్రపంచం అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు. మీ హృదయంతో మాత్రమే స్పందించాలి. ' అంటూ కపిల్ శర్మకు ఇచ్చిపడేశాడు.అయితే ఈ ప్రశ్నపై సింగర్ చిన్మయి శ్రీపాద సైతం స్పందించింది. ఈ షో అట్లీ కలర్ గురించి కపిల్ శర్మ జోక్ చేశాడని విమర్శించింది. కామెడీ పేరుతో అతని చర్మం రంగు గురించి మాట్లాడే ఈ విపరీతమైన హేళనలను వాళ్లు ఎప్పటికీ ఆపలేరేమో? అంటూ మండిపడింది. కపిల్ శర్మ లాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను నిరాశకు గురి చేసిందని చిన్మయి ట్వీట్ చేసింది. అయితే కపిల్ కామెంట్స్ తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Will they never stop these crass and racist jibes at his skin color in the name of ‘comedy’?Someone with the amount of influence and clout like Kapil Sharma saying something like this is disappointing and unfortunately, not surprising. https://t.co/63WjcoqHzA— Chinmayi Sripaada (@Chinmayi) December 15, 2024 -
హిజాబ్ లేకుండా పాట.. ఇరాన్ గాయని అరెస్ట్
టెహ్రాన్: హిజాబ్ ధరించకుండా పాట పాడి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఇరాన్ గాయని పరస్టూ అహ్మదీ(27)ని ఇరాన్ అధికారులు అరెస్ట్ చేశారు. సారి నగరంలో శనివారం అధికారులు పరస్టూను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తరఫు లాయర్ మిలాద్ చెప్పారు. ఆన్లైన్ కచేరీలో ఆమె హిజాబ్ ధరించలేదు. భుజాలు కనిపించే నల్ల రంగు డ్రెస్ వేసుకున్నారు. ఆమె అరెస్ట్‌కు కారణాలను, ఎక్కడ నిర్బంధంలో ఉంచిందీ అధికారులు వెల్లడించలేదు. కచేరి సమయంలో ఆమెతో కనిపించిన కళాకారుల్లో సొహైల్ నసిరీ, ఎహ్సాన్ బెయిరగ్ధార్లనూ అరెస్ట్ చేశారు. న్యాయ శాఖ అధికారులతో మాట్లాడి, నిర్బంధం గురించి తెలుసుకుంటామని లాయర్ చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ లేకుండా సోలోగా పాడటాన్ని ఇరాన్ నిషేధించింది. హిజాబ్ ధరించకుండా కనిపించిన అమినీ అనే యువతి పోలీసు నిర్బంధంలో ఉండగా చనిపోవడం 2022లో ఇరాన్ వ్యాప్తంగా అల్లర్లకు దారి తీయడం తెలిసిందే. -
హైదరాబాద్ నగరానికి పాప్ కింగ్ బ్రియాన్ ఆడమ్స్..
సాక్షి, హైదరాబాద్: సో హ్యాపీ ఇట్ హర్ట్స్ అంటూ నగరవాసుల హృదయాలను టచ్ చేయనున్నారు కెనడియన్ రాక్ స్టార్ బ్రియాన్ ఆడమ్స్. ప్రపంచవ్యాప్త టూర్లో భాగంగా మన దేశానికి వచ్చి గత 10న షిల్లాంగ్‌లో ప్రదర్శనతో ఇండియా టూర్ ప్రారంభించారు. బ్రియాన్ ఆడమ్స్ (Bryan Adams) గుర్‌గ్రామ్, ముంబయి, బెంగళూర్ల తర్వాత మన నగరంలో ఈ నెల 16న జరిగే ప్రదర్శనతో యాత్ర ముగించనున్నారు. ఇది కేవలం ఒక గాన ప్రదర్శనకు మాత్రమే పరిమితం కాదని, అహూతులతో సంపూర్ణ సంగీత యాత్ర చేయిస్తుందని నిర్వాహకులు అంటున్నారు.‘సమ్మర్ ఆఫ్ 69, ఎవ్రీ థింగ్ ఐ డూ ఐ డూ ఇట్ ఫర్ యూ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, రన్ టూ యూ, 18 టిల్ ఐ డై...తదితర తన సూపర్ హిట్ ఆల్బమ్స్‌తో పాటు తాజాగా వస్తున్న సో హ్యాపీ ఇట్ హర్ట్స్’ లతో శ్రోతలను అలరించనున్నాడు ఈ సింగర్ అండ్ రైటర్. నగరంలో ఎయిర్‌పోర్ట్‌లోని జీఎంఆర్ ఎరీనాలో ఈ సంగీత ప్రదర్శన రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. రాక్ సంగీత ప్రియులు బుక్ మై షో ద్వారా ఎంట్రీ పాస్‌లను కొనుగోలు చేయవచ్చు. చదవండి: 15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలిఇకపై డిజిటలైజ్డ్.. కాన్ఫరెన్స్‌లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సమావేశాల తీరుతెన్నులు సమూలంగా మారిపోనున్నాయని డిజిటల్ మీటింగ్స్ ఊపందుకోనున్నాయని ఆడియో, వీడియో నిపుణులు స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక ఆడియో ఉత్పత్తులకు పేరొందిన సెన్హీజర్, క్రెస్ట్రాన్ బ్రాండ్స్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌లో కాన్ఫరెన్స్‌లు– ఆడియో, వీడియో టెక్నాలజీ అంశంపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రకరకాల అత్యాధునిక పరికరాల పనితీరును వీడియో సహితంగా వివరించారు. నగరానికి చెందిన వందలాది మంది ఆడియో వీడియో పరికరాల నిపుణులు, వినియోగదారులు హాజరయ్యారు. -
శాస్త్రీయ సంగీతం నుంచి పాప్ వరకు ఏ పాటైనా వెన్నెలా రాగమే..!
బాలీవుడ్ సినిమా ‘స్త్రీ–2’లోని ‘ఆజ్ కీ రాత్; పాట ఇప్పటికీ హల్చల్ చేస్తూనే ఉంది. ‘బిల్బోర్డ్’ చాట్‌లో టాప్‌లో ఉంది. మధుబంటి బాగ్చీ ఆలపించిన ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ బెంగాలీ సింగర్, కంపోజర్ గురించి తెలుసుకుందాం. హిందుస్థానీ క్లాసికల్ వోకల్ మ్యూజిక్ ఆగ్రా ఘరానాలతో పరిచయం ఆమె ఆస్తి. మన శాస్త్రీయ సంగీతం నుంచి పాశ్చాత్య పాప్ వరకు ఆమె గొంతులో అలవోకగా వినిపిస్తాయి. పశ్చిమ బెంగాల్‌లోని బలూర్ఘూట్ ఆమె స్వస్థలం. తండ్రి ప్రొఫెసర్. తల్లి వ్యాపారవేత్త. కోల్‌కత్తాలోని ‘హెరిటేజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో డిగ్రీ, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ నుంచి లేజర్ అండ్ ఆప్టికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసింది. బెంగాలీ మ్యూజిక్ బ్యాండ్ ‘మృతిక’తో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించింది. బెంగాలీ చిత్రం ‘అమీ ఆర్ అమర్ గర్ల్‌ఫ్రెండ్స్’తో చిత్రరంగంలోకి అడుగుపెట్టింది. (చదవండి: ఇన్ఫోసిస్, విప్రోలాంటి సంస్థల్లో ఉద్యోగం కాదనుకుని కానిస్టేబుల్‌గా..!) -
ప్రియుడితో ప్రముఖ సింగర్ రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!
ప్రముఖ మలయాళ సింగర్ అంజు జోసెఫ్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. అయితే తన పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకుంది. తన ప్రియుడు ఆదిత్య పరమేశ్వరన్‌ను ఆమె పెళ్లాడింది. సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అంజు జోసెఫ్ అలప్పుజా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు.శుక్రవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అంజు.. ఆ తర్వాత శనివారం అతిథుల కోసం వివాహా రిసెప్షన్ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో పలువురు సినీతారలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా ఈ రిసెప్షన్‌కు హాజరయ్యారు.కాగా.. అంజు జోసెఫ్ డాక్టర్ లవ్ చిత్రంలోని చిల్లానే పాటతో సింగర్‌గా మాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె పలు మలయాళ సినిమాలో పదికి పైగా పాటలు పాడింది. తనదైన టాలెంట్‌తో అభిమానులను సంపాదించుకుంది. ఆమె తొలిసారిగా అర్చన 31 నాటౌట్ అనే చిత్రంలోనూ నటించింది. అయితే గతంలో అంజు స్టార్ స్టార్ మ్యాజిక్ సీరియల్ డైరెక్టర్ అనూప్ జాన్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Anju Joseph (@anjujosephofficial) -
'కిస్సిక్' సాంగ్ పాడింది ఈమెనే.. ఇన్ స్టాలో రీల్స్ నుంచి సినిమా పాటల వరకు (ఫొటోలు)
-
వావ్.. పదహారేళ్ల పడతిలా అబుదాబీ బీచ్‌లో స్టార్ సింగర్
-
మ్యూజిక్ వరల్డ్: విష్ జోష్
రియా దుగ్గల్(రి), సిమ్రాన్ దుగ్గల్(సిమ్), జో సిద్దార్థ్ (జో), సుచితా షిర్కే(సుచి)లతో కూడిన ‘విష్’ మ్యూజిక్ బ్యాండ్ కొత్త తరం ఆకాంక్షాలు, ప్రతిభ, కలలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘ప్రపంచ వేదికపై మన టాలెంట్ ఏమిటో చూపాలి’ అనే లక్ష్యంతో దూసుకుపోతుంది. పాపులర్ కె–పాప్ స్ఫూర్తితో ప్రయాణం ప్రారంభించిన ‘విష్’ తనదైన స్టైల్‌ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. ‘విష్’ సభ్యులలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. సంగీతానికి సంబంధించి తమదైన ప్రత్యేక శైలి ఉంది.చెన్నైకి చెందిన ‘జో’ తన హస్కీ వాయిస్‌తో సౌత్ ఫ్లెవర్‌ను వినుల విందు చేస్తుంది. ముంబైకి చెందిన రి, సిమ్ సిస్టర్స్ వాయిస్ ‘మాకు మాత్రమే ప్రత్యేకం’ అనేలా ఉంటుంది. ఈ బ్యాండ్‌లో అతి పిన్న వయస్కురాలైన సుచీ స్వీట్ వాయిస్‌కు మరోపేరు. ఈ బ్యాండ్ ఫస్ట్ సింగిల్ ‘లాజీజ్’‘లాజీజ్’ అంటే ఉర్దూలో ‘రుచికరమైనది’ అని అర్థం. స్త్రీ సాధికారత, స్త్రీ స్వాతంత్య్రం.... మొదలైన అంశాలను ప్రస్తావించే ‘లాజీజ్’కు మంచి స్పందన వచ్చింది. (చదవండి: వర్క్ లైఫ్ బ్యాలెన్స్: ఏ సంస్థ లేదా కార్యాలయం అలాంటి ఆఫర్ ఇవ్వదు..!) -
నా భార్య చూడకముందే బిడ్డను కప్పిపెట్టా.. సింగర్ ఎమోషనల్
పిల్లల్ని పోగొట్టుకోవడం కంటే పెద్ద దుఃఖం మరొకటి ఉండదు. తన జీవితంలోనూ అతి పెద్ద విషాదం రెండో కొడుకుని కోల్పోవడమే అంటున్నాడు సింగర్ బి ప్రాక్. నా కొడుకు మరణాన్ని నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. నేనేం పాపం చేశానని భగవంతుడు నాకు ఇంత పెద్ద శిక్ష విధించాడని బాధపడుతుంటాను.సమాధి చేశాం..చనిపోయిన శిశువును ఒక్కసారి చూస్తానని నా భార్య మీరా అడిగింది. తన బాధ రెట్టింపు చేయడం ఇష్టం లేక అందుకు ఒప్పుకోలేదు. తనకు చూపించకుండానే సమాధి చేశాం. ఇప్పటికీ ఈ విషయంలో తను నాపై కోప్పడుతూనే ఉంటుంది.. అని కన్నీళ్లుపెట్టుకున్నాడు.కెరీర్..కాగా బిప్రాక్, మీరా 2019 ఏప్రిల్ 4న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2020లో అదాబ్ అనే కుమారుడు జన్మించాడు. 2022లో మరో శిశువు జన్మించగా.. పురిట్లోనే కన్నుమూసింది. కాగా ప్రాక్.. పంజాబీ, హిందీ భాషల్లో అనేక సినిమాలకు సంగీత దర్శకుడిగా, సింగర్‌గా పని చేశాడు. ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్స్ కూడా చేస్తుంటాడు. కేసరి సినిమాలో తేరి మిట్టి పాటకుగానూ ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.చదవండి: ప్రియుడితో సినిమాకు.. కాబోయే అత్త కూడా వెంటే వచ్చేది: హీరోయిన్ -
ఖరీదైన అభిమానం.. సింగర్‌కు ఏకంగా కోట్ల రూపాయల గిఫ్ట్!
సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. అలాగే సింగర్స్ కూడా అభిమానులు ఉంటారు. అందులోనూ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. కానీ ఖరీదైన ఫ్యాన్స్ కూడా ఉంటారని ఇది చూస్తేనే తెలుస్తోంది. అసలేంటి ఖరీదైన ఫ్యాన్స్ అనుకుంటున్నారా? అదేంటో మీరు చూసేయండి.బెంగాల్‌కు చెందిన ఇండియన్ సింగర్ కమ్ రాపర్ మికా సింగ్ ఇటీవల యూఎస్‌లో సంగీత కచేరి నిర్వహించారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో పలు దేశాల నుంచి అభిమానులు పాల్గొన్నారు. అయితే ఈ కచేరికి హాజరైన పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగర్ మికా సింగ్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. కోట్ల విలువైన బహుమతులు ఇచ్చిన తమ అభిమానాన్ని చాటుకున్నారు.రూ.3 కోట్ల విలువైన గిఫ్ట్..మికా సింగ్‌కు ఏకంగా రూ.3 కోట్ల విలువైన బహుమతులు కానుకగా ఇచ్చాడు. అత్యంక ఖరీదైన బంగారు గొలుసు, రోలెక్స్ వాచ్, డైమండ్ రింగులను బహుకరించాడు. వీటి విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. మికా సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఇలాంటి ఖరీదైన ఫ్యాన్స్ కూడా ఉంటారా? కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. మికా సింగ్ బాలీవుడ్లో అనేక పాటలు పాడారు. ఆజ్ కి పార్టీ, అంఖియోన్ సే గోలీ మారే, చింతా టాటా చితా చితా లాంటి సాంగ్స్‌తో ఫేమస్ అయ్యారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మా అక్కను చూశాక పెళ్లంటేనే భయమేస్తోంది: నటి
మలయాళ నటి, సింగర్ అమృత సురేశ్.. నటుడు బాలాను 2010లో పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు కూడా పుట్టింది. కుటుంబంలో గొడవలు మొదలవడంతో 2019లో అమృత-బాలా విడిపోయారు. విడాకుల తర్వాత కూడా తనతో పాటు, కూతుర్ని వేధించాడని అమృత ఫిర్యాదు చేయగా పోలీసులు బాలను అరెస్ట్ చేశారు. అదృష్టం కూడా ఉండాలితర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నాడు. అమృత మాత్రం ఒంటరిగానే ఉంటోంది. ఇదంతా చూశాక తనకు పెళ్లంటేనే భయమేస్తోందంటోంది అమృత సోదరి, నటి అభిరామి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'విడాకులే లేని పెళ్లి కావాలి. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ.. అందుకు అదృష్టం కూడా కలిసిరావాలి. పెళ్లి అంటేనే భయంపెళ్లికి నేను విరుద్ధం కాదు. కానీ మా అక్క పడ్డ కష్టాలు చూశాక వివాహమంటేనే భయమేస్తోంది. ఆ భయం వల్లే ఇంకా పెళ్లి చేసుకోలేదు. అలా అని ఎప్పటికీ సింగిల్‌గానే ఉండిపోను. ఏదో ఒకరోజు కచ్చితంగా మూడు ముళ్లు వేయించుకుంటాను. అయితే గుడ్డిగా తప్పుడు వ్యక్తితో ప్రేమలో పడటం కంటే ప్రమాదకరం మరొకటి లేదు. మా అక్క పెళ్లయినప్పటినుంచి అంటే దాదాపు 14 ఏళ్లుగా మా కుటుంబం బాధ అనుభవిస్తూనే ఉంది' అని అభిరామి చెప్పుకొచ్చింది.చదవండి: ‘మట్కా’ మూవీ రివ్యూ -
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్.. స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్!
ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ పాటపాడిన అంధగాయకుడిపై తమన్ ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని ఆయన అన్నారు. అతని ప్రతిభకు ఫిదా అయిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలుగు ఇండియన్ ఐడల్‌లో పాడే అవకాశం కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. అతడితో కలిసి తానూ పాడుతానంటూ పోస్ట్ చేశారు.అంతకుముందు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆ బాలుడి వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..! ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై స్పందించిన ఎస్ఎస్ తమన్ ఆ బాలుడికి తెలుగు ఇండియన్ ఐడల్‌లో పాడే అవకాశమిస్తానని తమన్ ట్వీట్ చేశారు.తమన్‌కు సజ్జనార్ కృతజ్ఞతలుఆర్టీసీ బస్సులో పాటపాడిన బాలుడికి అవకాశమిచ్చినందుకు తమన్‌కు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తోన్న ఈ అంధ యువకుడికి తెలుగు ఇండియన్ ఐడల్‌లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. అలాగే ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్‌కు మరింతగా గుర్తింపు దక్కుతుందని అన్నారు. భవిష్యత్‌లో తన మధురమైన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దులను చేస్తూ ఈ యువకుడు ఉన్నతంగా ఎదుగుతారని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు. అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తోన్న ఈ అంధ యువకుడికి @ahavideoIN నిర్వహిస్తోన్న తెలుగు ఇండియన్ ఐడల్ లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు @MusicThaman గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్‌కు మరింతగా గుర్తింపు ద… https://t.co/9Z4HR44QFF— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 14, 2024 I will make sure he Performs in #TeluguIndianIdolS4@ahavideoIN pls consider as my request and order 📢❤️🎧⭐️▶️💥Will have his Special Performance and I will perform along with him ❤️✨🙌🏿What a Talent what perfect pitching 🖤God is sometimes harsh But we humans are there… https://t.co/CqjEU0QHfc— thaman S (@MusicThaman) November 13, 2024 -
50 వేల పాటలు పాడిన సుశీలకు ఇప్పటికీ ఆ పాట విషయంలో బాధే (ఫొటోలు)
-
సింగర్‌గా మారిపోయిన టాలీవుడ్ బ్యూటీ.. 'కంగువా'లో (ఫోటోలు)
-
‘స్వర కోకిల’ శారదా సిన్హా కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా(72) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. సోమవారం శారదా సిన్హా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆమెను వెంటిలేటర్ సపోర్టుపై ఉంచారు. ఆమెను బీహార్‌కు చెందిన ‘స్వర కోకిల’ అని కూడా పిలుస్తారు. బుధవారం పట్నాలో ప్రభుత్వ లాంఛనాలతో శారదా సిన్హా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.శారదా సిన్హా భర్త బ్రెయిన్ హెమరేజ్‌తో ఇటీవలే కన్నుమూశారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. ఇటీవలే శారదా సిన్హాకు బోన్ మ్యారో క్యాన్సర్ సోకింది. నాటి నుంచి ఆమె ఎయిమ్స్‌లోని ఆంకాలజీ మెడికల్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. శారదా సిన్హా 1952 అక్టోబర్ ఒకటిన బీహార్‌లోని సుపాల్ జిల్లాలోని హులాస్‌లో జన్మించారు. ఆమె సంగీతంలో ఎంఏ చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. కుమారుని పేరు అన్షుమన్ సిన్హా, కుమార్తె పేరు వందన.శారదా సిన్హా మృతికి ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ ఇలా రాశారు ‘సుప్రసిద్ధ జానపద గాయని శారదా సిన్హా మృతితో నేను చాలా బాధపడ్డాను. ఆమె పాడిన మైథిలి, భోజ్‌పురి జానపద పాటలు గత కొన్ని దశాబ్దాలుగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు’ అని పేర్కొన్నారు. सुप्रसिद्ध लोक गायिका शारदा सिन्हा जी के निधन से अत्यंत दुख हुआ है। उनके गाए मैथिली और भोजपुरी के लोकगीत पिछले कई दशकों से बेहद लोकप्रिय रहे हैं। आस्था के महापर्व छठ से जुड़े उनके सुमधुर गीतों की गूंज भी सदैव बनी रहेगी। उनका जाना संगीत जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस… pic.twitter.com/sOaLvUOnrW— Narendra Modi (@narendramodi) November 5, 2024ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాలు విడుదల : ఆధిక్యంలో ట్రంప్ -
మలయాళ రాక్‌స్టార్ పెళ్లి.. హాజరైన సెలబ్రిటీలు
మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ పెళ్లి పీటలెక్కాడు. ప్రేయసి, సింగర్ ఉత్తర కృష్ణన్ మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇకపోతే నటుడు పార్వతీ జయరామ్ చుట్టాలమ్మాయే ఉత్తర. బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి ప్రేమికులుగా..పార్వతి జయరాం కూతురి పెళ్లిలోనే సుశిన్-ఉత్తర ప్రేమాయణం బయటపడింది. మొదట బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న వీళ్లు తర్వాత ప్రేమికులుగా మారారు. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి భార్యాభర్తలుగా ఓ అడుగు ముందుకు వేశారు. ఈ వివాహానికి సినీనటులు ఫహద్ ఫాజిల్, నజ్రియా, జయరామ్, దర్శకుడు అన్వర్ రషీద్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మ్యూజిక్ కెరీర్..సుశిన్ విషయానికి వస్తే.. దీపక్ దేవ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మొదట శిక్షణ తీసుకున్నాడు. లార్డ్ లివింగ్స్టన్ 700 కండి, కిస్మత్ వంటి చిత్రాలకు బీజీఎమ్ అందించాడు. వరథాన్, కుంబలంగి నైట్స్ సినిమాలతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. భీష్మ పర్వం, మిన్నాల్ మురళి, రోమాంచం, మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, బోగిన్ విల్లా వంటి పలు చిత్రాలకు సంగీతం అందించాడు. Sensational Malayalam music director #SushinShyam got married to AD and singer #UtharaKrishnan ❤️ #fahadhfaasil and wife #Nasriya , #Jayaram were present at this very private ceremony pic.twitter.com/CHR41ApcXL— sridevi sreedhar (@sridevisreedhar) October 30, 2024 చదవండి: అతనితో హీరోయిన్ డేటింగ్.. మొత్తానికి తెలిసిపోయింది! -
Tamara Dsouza: లవ్ తమారా
తమారా డిసూజా గురించి సింపుల్‌గా ఒక్కమాటలో చెప్పలేం! ఆమె.. ప్రతిభా గని! యాక్ట్రెస్, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టయిలిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, గాయని, ఉకులెలె ప్లేయర్ కూడా!ఆ గుర్తింపు తమారా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దాంతో నటననే ఫుల్‌టైమ్ జాబ్‌గా ఎంచుకుంది. ఆమె తాజా చిత్రం ‘లవ్ సితారా’ జీ5లో స్ట్రీమ్ అవుతోంది.తమారా తన నటనతోనే కాదు గాత్రంతోనూ ఆకట్టుకుంటోంది. ప్రీతమ్, షాన్, నీతీ మోహన్, ఏఆర్ రెహమాన్ లాంటి మహామహులతో కలసి పాడుతోంది. నటన, సంగీతం, మేకప్, హెయిర్ స్టయిలింగ్లతో క్షణం తీరికలేని షెడ్యూల్స్‌లో ఎప్పుడన్నా సమయం చిక్కితే సోలో ట్రావెల్‌కి వెళ్లిపోతూ, ఉకులెలె ప్లే చేస్తూ ఆస్వాదిస్తోంది.తమారా .. ముంబైలో పుట్టి, పెరిగింది. కామర్స్ అండ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్. న్యాయశాస్త్రంలోనూ డిగ్రీ పుచ్చుకుంది.చదువైపోగానే ‘రెయిన్ డ్రాప్ మీడియా’ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా జాయిన్ అయింది. విద్యా బాలన్, శ్రుతి హాసన్, ఫరా ఖాన్, బొమన్ ఇరానీ లాంటి యాక్టర్స్ కోసం పనిచేసింది. అంతేకాదు రేస్ 2, వికీ డోనర్, హౌస్‌ఫుల్ 2 లాంటి సినిమాలకు పీఆర్ ఈవెంట్స్‌నూ నిర్వహించింది.ఏడాది తర్వాత ఆమె ఖీఐ్క ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో చేరింది.. మార్కెటింగ్, ప్రమోషన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా. ఆమె పనితీరుకు ముచ్చటపడిన వైకింగ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ సంస్థలో ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. సద్వినియోగం చేసుకుంది తమారా. ఇందులో ఉన్నప్పుడే ఆమె చురుకుదనం, సమయస్ఫూర్తికి మెచ్చి పలు యాడ్ ఏజెన్సీలు వాణిజ్య ప్రకటనల్లో మెరిసే చాన్స్నిచ్చాయి. అలా తమారా.. తనిష్క్, టైటాన్, డ్యూరోఫ్లెక్స్ వంటి ఫేమస్ బ్రాండ్స్ కమర్షియల్ యాడ్స్‌లో కనిపించింది.ఆ కమర్షియల్ యాడ్సే తమారా వెబ్‌స్క్రీన్ ఎంట్రీని ఖరారు చేశాయి. మేడిన్ హెవెన్, లిటిల్ థింగ్స్, హెలో మినీ లాంటి వెబ్ సిరీస్‌లలో నటించే అవకాశాన్నిచ్చాయి. ఆమె నటనకు సిల్వర్‌స్క్రీన్ కూడా స్పేస్ ఇచ్చింది. ‘క్లాస్ ఆఫ్ 83’ , ‘అటాక్’ సినిమాల్లో ప్రధాన పాత్రల్లో మెప్పించి, విమర్శకుల ప్రశంసలు పొందింది.యాడ్స్, వెబ్, సినిమా.. ఈ మూడిట్లో నటించే అవకాశం.. నాకు యాదృచ్ఛికంగా అందిన వరమని చెప్పుకోవచ్చు! సంగీతం, మేకప్, హెయిర్ స్టయిలింగ్ వగైరా వగైరా.. నేను ఇష్టపడి, నేర్చుకుని ఆ దిశగా ప్రయత్నిస్తే సాధించినవి. కానీ నటన విషయం అలాకాదు. నటిని కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అది అనుకోకుండా జరిగింది. కంటిన్యూ అవుతోంది. – తమారా డిసూజా -
USA Presidential Elections 2024: కమలా హారిస్‌కు గాయని బియాన్స్ మద్దతు
హూస్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీకి దిగుతున్న కమలా హారిస్‌కు ప్రఖ్యాత గాయని బియాన్స్ మద్దతు ప్రకటించారు. శుక్రవారం రాత్రి హూస్టన్‌లో జరిగిన డెమొక్రటిక్ ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ‘‘ఒక సెలబ్రిటీకి ఇక్కడికి రాలేదు. ఒక రాజకీయ నాయకురాలిగా రాలేదు. ఒక తల్లిగా వచ్చాను. మన బిడ్డలు ప్రతిబంధకాలు, పరిమితులు లేకుండా పెరగాలంటే కమలా హారిస్‌కు ఓటు వేయాలి’’అని పిలుపునిచ్చారు. హూస్టన్ బియాన్స్ సొంత నగరం కావడం విశేషం. 2016లోనూ ఆమె అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతు పలికారు. క్లీవ్‌లాండ్‌లో ప్రచార సభలో హిల్లరీకి మద్దుతుగా ఒక పాట కూడా పాడారు. ఈసారి మాత్రం పాడలేదు. కమలా హారిస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. హూస్టన్ సభలో కమలా హారిస్ మాట్లాడుతూ.. తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. మహిళల పునరుత్పత్తి హక్కుల విషయంలో గత 50 ఏళ్లలో సాధించిన ప్రగతిని ట్రంప్ నాశనం చేశారని మండిపడ్డారు. మహిళలకు హక్కులు నిరాకరించారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ను చిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ.38 లక్షల బిల్లు కట్టా: సింగర్
చేతిలో డబ్బున్నంతవరకు ఖర్చుచేయడం చాలామందికి దురలవాటు. ఇలాంటి చెడు అలవాటు ఒకప్పుడూ తనకూ ఉండేదంటున్నాడు ప్రముఖ సింగర్ హనీ సింగ్. పార్టీల పేరుతో దుబారా ఖర్చు చేసేవాడినంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా జీవితంలో ఎక్కువ డబ్బు పార్టీలకే వెచ్చించాను. జేబులో ఉన్నదంతా బిల్లు కట్టేసి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లేవాడిని. అప్పట్లో చాలా కాస్ట్లీఅలా 2013లో ఓసారి ఎనిమిది మంది ఓ క్లబ్లో పార్టీ చేసుకున్నాం. అప్పట్లో దుబాయ్‌లో ఉండాలంటే చాలా డబ్బులు వెచ్చించాలి. ఇప్పుడలా లేదనుకోండి. ఇకపోతే ఫ్రెండ్స్ అందరం కూర్చుని తాగాం. మా టేబుల దగ్గరకు అమ్మాయిలు కూడా వచ్చారు. 23 మంది అమ్మాయిలను మా పార్టీలో జాయిన్ చేసుకున్నాం. రూ.38 లక్షల బిల్లుఫుల్లుగా తాగాం, తిన్నాం. కట్ చేస్తే రూ.38 లక్షల బిల్లు కట్టమన్నారు. ఒక్క రోజుకు లక్షల బిల్లు కట్టాల్సి వచ్చింది. ఇందుకోసం ఏకంగా మూడు క్రెడిట్ కార్డులు వాడాను అని చెప్పుకొచ్చాడు. హనీసింగ్ ఈ మధ్యే గ్లోరీ ఆల్బమ్ రిలీజ్ చేశాడు. మీర్జా, తు మేరా 22 మై తేరా 22, ద ఎక్స్పోజ్, జొరావర్ సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు.చదవండి: RRRను దాటేసిన పుష్ప.. రిలీజ్‌కు ముందే ఆ రికార్డ్ క్లోజ్ -
స్వీయ వివాహం చేసుకున్న హాలీవుడ్ పాప్ సింగర్
ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీస్పియర్స్ 42 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకుంది. అయితే ఈసారి తనను తానే పెళ్లాడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ రోజు నాతో నాకే పెళ్లి జరిగింది. మీకిది తెలివి తక్కువ పనిలా అనిపించవచ్చు. కానీ నాకు మాత్రం ఇప్పటివరకు నేను చేసినవాటిలో ఇదొక గొప్ప విషయం అని భావిస్తున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. స్వీయ వివాహం చేసుకున్న బ్రిట్నీస్పియర్ను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.మూడు పెళ్లిళ్లు పెటాకులుకాగా బ్రిట్నీస్పియర్స్ మొదటగా చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ను పెళ్లాడింది. 2004లో వీరి వివాహం జరగ్గా కొద్ది రోజులకే విడిపోయారు. తర్వాత అదే ఏడాది డ్యాన్సర్, నటుడు కెవిన్ ఫెడెర్‌లైన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. అయితే ఈ దాంపత్యం కూడా సజావుగా సాగలేదు. దీంతో 2007లో విడిపోయారు. అనంతరం బ్రిట్నీ.. 2016లో నటుడు సామ్ అస్గారితో డేటింగ్ చేసింది. 2022లో వీరు పెళ్లి చేసుకోగా గతేడాది విడిపోయారు. ఈ మధ్యే విడాకులు సైతం మంజూరయ్యాయి.చదవండి: అప్పుడేమో సినిమాలతో బిజీ.. ఇప్పుడేమో పిల్లలుంటే బాగుండని ఫీలవుతున్న నటుడు -
దేవి శ్రీ ప్రసాద్ కి చిరంజీవి గారంటే ఎంత ఇష్టమో చూడండి..
-
కొరియన్ నోట భారతీయ సంగీతం..'ఔరా' అంటున్న నెటిజన్లు
‘సౌత్ ఇండియన్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఆసక్తి. పాటలు వింటాను. మ్యూజిక్ వీడియోలు చూస్తుంటాను’ అంటున్న కొరియన్ ఆర్టిస్ట్ ఔర సింగర్–సాంగ్ రైటర్ శిరీష భాగవతులతో కలిసి ‘థీ థీ తారా’ (కుట్టనాడన్ డ్రీమ్స్) ఆలపించాడు. గత సంవత్సరం చివరిలో బిగ్‌బాస్ సీజన్ 17లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా కనిపించాడు.ఈ సంవత్సరం ప్రారంభంలో ఝలక్ దిఖ్లా సీజన్ 11లో కూడా కనిపించాడు. ఈ క్రమంలో ఇండియన్ మ్యూజిక్‌పై లవ్ పెంచుకున్నాడు. ‘ఛలో’ ‘రోకో’లాంటి పదాలు పలుకుతున్న ఔర హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాడు.‘ఔరా ఉచ్చారణ చాలా భిన్నంగా ఉంటుంది. దీని కోసం ఐదు వారల పాటు పనిచేశాడు. అతడి అంకితభావం నాకు ఎంతగానో నచ్చింది’ అంటున్న శిరీష ఔరాను మన దేశంలోని ఇంటిపేరుగా అభివర్ణించింది. ‘మార్నింగ్ నూన్ ఈవెనింగ్’ ‘బ్లూ ఒషియన్’ ‘ఫైర్‌వర్క్’....ఇలాంటి ఎన్నో సింగిల్స్‌తో పేరు తెచ్చుకున్న ఔరా 2014లో బాయ్ బ్యాండ్ ఎఎతో కెరీర్ ప్రారంభించాడు. (చదవండి: ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్..కట్‌చేస్తే నేడు ఆమె..!) -
తారీఫ్ కరే క్యా ఉస్కీ..
లిసా మిశ్రా.. గాయనిగా, గేయరచయితగా సంగీత, సాహిత్యాభిమానులకు ఏనాడో పరిచయం. తాజాగా నటనారంగంలోకి అడుగుపెట్టి తన అభినయ కళనూ ప్రదర్శించింది. ఆ ఫ్యాన్ బేస్నూ సంపాదించుకుంది.👉లిసా పుట్టింది ఒడిశాలోని బరంపురంలో. పెరిగింది అమెరికాలోని షికాగోలో. నాలుగో ఏట నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. పదిహేనో ఏట నుంచి గిటార్లో శిక్షణ పొందటం మొదలుపెట్టింది. అకడమిక్స్ విషయానికి వస్తే ఇల్లినాయీ వెజ్లీయన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ రిలిజియన్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.👉పదమూడేళ్ల వయసులో లిసా.. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి, తన పాటల వీడియోలను అందులో పోస్ట్ చేయసాగింది. అయితే ఆమె అలా వీడియోలు అప్లోడ్ చేయడం వాళ్లమ్మకు నచ్చలేదు. ఎందుకు అందరి కళ్లల్లో పడటం అంటూ అభ్యంతరం చెప్పింది. దాంతో కేవలం ఆడియో రికార్డింగ్స్‌ని మాత్రమే పోస్ట్ చేయసాగింది. ఆమె స్వరమాధుర్యానికి ఫిదా అయిపోయారు శ్రోతలు. ఆ ఆడియో పోస్ట్‌లకు వచ్చిన రెస్పాన్స్ చూసి లిసా వాళ్లమ్మ, కూతురి పాటల వీడియోలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 👉యూట్యూబ్‌లోని ఆమె పాటల వీడియోలకు అమెరికన్ పాప్ మ్యూజిక్ కూడా స్పందించింది. 2016, గ్రామీ అవార్డ్ గెలుచుకున్న ‘కలరింగ్ బుక్’ ఆల్బమ్‌లో పాడే అవకాశాన్నిచ్చింది. 2017లో ఎమ్మీ అవార్డ్స్‌కి నామినేట్ అయిన ‘బ్రౌన్ గర్ల్స్’ వెబ్ సిరీస్‌లోనూ థీమ్ సాంగ్ పాడింది.👉పాశ్చాత్య ప్రపంచంలో లిసా అంత కీర్తి సాధించినా.. ఆమె మీద భారత్ దృష్టి పడింది మాత్రం ఆమె ‘వీరే ది వెడ్డింగ్’లోని ‘తారీఫా’ పాటను పాడి, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాకే! ఇన్‌స్టాలో ఆ వీడియో చూసిన సోనమ్ కపూర్, రియా కపూర్లు ఆమెను బాలీవుడ్‌కి పిలిచి, ‘తారీఫా’ రిప్రైజ్ వర్షన్‌ను పాడించారు. దాంతో ఇక్కడా ఆమె లైమ్‌లైట్‌లోకి వచ్చింది. బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.👉‘జడ్జ్‌మెంటల్ హై క్యా’, ‘స్కై ఈజ్ పింక్’, ‘గుడ్ న్యూస్’, ‘జుగ్‌జుగ్ జియో’, ‘లైగర్’, ‘దోనో’ వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలన్నీ హిట్టే! సినిమాల్లో పాడే చాన్స్ రాగానే తనకు ఇష్టమైన పాప్ మ్యూజిక్ వరల్డ్‌కి గుడ్ బై చెప్పలేదు. అక్కడా వినిపించడానికి ప్లాన్ చేసుకుంటోంది. గాయనిగానే కాదు పాటలను రాస్తూ తన రచనా పాటవాన్నీ చూపిస్తోంది.👉క్షణం తీరిక లేని ఆమె షెడ్యూల్లో తన కోసం కాల్షీట్ సర్దే వీలుంటుందేమో చూడమని ఓటీటీ రిక్వెస్ట్ చేసింది.. ‘కాల్ మి బే’ వెబ్ సిరీస్ ఆఫర్‌తో! ఎంతో ఉత్సాహంగా ‘యెస్’ చెప్పింది లిసా. ప్రాధాన్యమున్న పాత్రలో నటించి వీక్షకులు, విమర్శల ప్రశంసలు అందుకుంటోంది. ఆ సిరీస్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమ్ అవుతోంది.సింగర్, సాంగ్ రైటర్ అయిన నాకు యాక్టింగ్ అనేది సవాలే! చాలెంజెస్ అంటే ఇష్టం కాబట్టి యాక్టర్‌గానూ ఇంట్రడ్యూస్ అయ్యాను. మంచి రోల్స్ వస్తే నటననూ కంటిన్యూ చేస్తాను.– లిసా మిశ్రా.