ఖరీదైన అభిమానం.. సింగర్‌కు ఏకంగా కోట్ల రూపాయల గిఫ్ట్! | Singer Mika Singh fan gifts him white gold chain and Rolex watch | Sakshi
Sakshi News home page

Mika Singh: ఇండియన్‌ సింగర్‌కు కోట్ల రూపాయల గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్స్‌!

Published Fri, Nov 15 2024 1:52 PM | Last Updated on Fri, Nov 15 2024 2:56 PM

Singer Mika Singh fan gifts him white gold chain and Rolex watch

సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. అలాగే సింగర్స్‌ కూడా అభిమానులు ఉంటారు. అందులోనూ డై హార్డ్ ఫ్యాన్స్‌ కూడా ఉంటారు. కానీ ఖరీదైన ఫ్యాన్స్ కూడా ఉంటారని ఇది చూస్తేనే తెలుస్తోంది. అసలేంటి ఖరీదైన ఫ్యాన్స్‌ అనుకుంటున్నారా? అదేంటో మీరు చూసేయండి.

బెంగాల్‌కు చెందిన ఇండియన్‌ సింగర్ కమ్ రాపర్ మికా సింగ్‌ ఇటీవల యూఎస్‌లో సంగీత కచేరి నిర్వహించారు. ఈ మ్యూజిక్‌ కన్సర్ట్‌లో పలు దేశాల నుంచి అభిమానులు పాల్గొన్నారు. అయితే ఈ కచేరికి హాజరైన పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగర్‌ మికా సింగ్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కోట్ల విలువైన బహుమతులు ఇచ్చిన తమ అభిమానాన్ని చాటుకున్నారు.

రూ.3 కోట్ల విలువైన గిఫ్ట్..

మికా సింగ్‌కు ఏకంగా రూ.3 కోట్ల విలువైన బహుమతులు కానుకగా ఇచ్చాడు. అత్యంక ఖరీదైన బంగారు గొలుసు, రోలెక్స్ వాచ్‌, డైమండ్ రింగులను బహుకరించాడు. వీటి విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. మికా సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్‌ ఇలాంటి ఖరీదైన ఫ్యాన్స్ కూడా ఉంటారా? కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. మికా సింగ్‌ బాలీవుడ్‌లో అనేక పాటలు పాడారు. ఆజ్ కి పార్టీ, అంఖియోన్ సే గోలీ మారే, చింతా టాటా చితా చితా లాంటి సాంగ్స్‌తో ఫేమస్ అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement