Mika Singh
-
ఖరీదైన అభిమానం.. సింగర్‌కు ఏకంగా కోట్ల రూపాయల గిఫ్ట్!
సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. అలాగే సింగర్స్ కూడా అభిమానులు ఉంటారు. అందులోనూ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. కానీ ఖరీదైన ఫ్యాన్స్ కూడా ఉంటారని ఇది చూస్తేనే తెలుస్తోంది. అసలేంటి ఖరీదైన ఫ్యాన్స్ అనుకుంటున్నారా? అదేంటో మీరు చూసేయండి.బెంగాల్‌కు చెందిన ఇండియన్ సింగర్ కమ్ రాపర్ మికా సింగ్ ఇటీవల యూఎస్‌లో సంగీత కచేరి నిర్వహించారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో పలు దేశాల నుంచి అభిమానులు పాల్గొన్నారు. అయితే ఈ కచేరికి హాజరైన పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగర్ మికా సింగ్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. కోట్ల విలువైన బహుమతులు ఇచ్చిన తమ అభిమానాన్ని చాటుకున్నారు.రూ.3 కోట్ల విలువైన గిఫ్ట్..మికా సింగ్‌కు ఏకంగా రూ.3 కోట్ల విలువైన బహుమతులు కానుకగా ఇచ్చాడు. అత్యంక ఖరీదైన బంగారు గొలుసు, రోలెక్స్ వాచ్, డైమండ్ రింగులను బహుకరించాడు. వీటి విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. మికా సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఇలాంటి ఖరీదైన ఫ్యాన్స్ కూడా ఉంటారా? కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. మికా సింగ్ బాలీవుడ్లో అనేక పాటలు పాడారు. ఆజ్ కి పార్టీ, అంఖియోన్ సే గోలీ మారే, చింతా టాటా చితా చితా లాంటి సాంగ్స్‌తో ఫేమస్ అయ్యారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన మిర్చి సింగర్.. ఎవరికో తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్. అతను పలు భాంగ్రా, పాప్, సినీ గీతాలు ఆలపించి ఫేమస్ అయ్యారు. సుప్రసిద్ధ పంజాబీ సింగర్ దలేర్ మెహంది తమ్ముడు మికా సింగ్. అతని తల్లిదండ్రులిద్దరూ సంగీతాభిమానులు కావడం వల్ల మికా కూడా ఆ రంగం పట్ల ఆకర్షితుడయ్యాడు. తెలుగులో మిర్చి సినిమాలో తన వాయిస్ వినిపించాడు. తాజాగా మికా సింగ్ తన స్నేహితునికి ఓ ఖరీదైన బహుమతి ఇచ్చాడు. తన అత్యంత సన్నిహితుడైన కన్వల్ జీత్ సింగ్‌కు మెర్సిడెజ్ బెంజ్ కారును బహుకరించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు మికా సింగ్. స్నేహితుని కారును ఇచ్చిన అతని కలను నెరవేర్చాడు సింగర్ మికా. మికా తన ఇన్‌స్టాలో ఫోటో షేర్ చేస్తూ.. ' మేం ఎప్పుడు ఏదో ఒకటి కొనుగోలు చేస్తుంటాం. కానీ మీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తుల గురించి ఆలోచించరు. కానీ నా స్నేహితుడు ఈ ఆనందానికి అర్హుడు. అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆయన అభిమానులు మికా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీది చాలా పెద్దమనసు ఉంటూ ప్రశంసిస్తున్నారు. సింగర్ మికా ప్రేమకు కన్వల్ జీత్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. కన్వల్ దీత్ సింగ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'మేము కలిసి 30 ఏళ్లు అయింది. అతను కేవలం నా స్నేహితుడు మాత్రమే కాదు. అంతకు మించి మేము జీవితాంతం సోదరులం. నా ఫేవరేట్ కారును బహుమతిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది చాలా అద్భుతంగా ఉంది. మీది చాలా గొప్పమనసు. ఈ బహుమతిని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను.' అంటూ కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by Bollywood Celebrities (@bollycelebrities_) -
వేరే అమ్మాయిలతో అల్లరి వేషాలు, నా ప్రేయసి లాగిపెట్టి కొట్టింది
బాలీవుడ్ పాపులర్ సింగర్ మికా సింగ్ తన జీవిత భాగస్వామిని వెతుక్కునే పనిలో పడ్డాడు. 'మికా దీ వోహ్తీ' అనే షోతో ఏకంగా స్వయంవరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాజాగా ఈ షోలో తన జీవితంలోని ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు సింగర్. గతంలో తనకు గర్ల్‌ఫ్రెండ్ ఉన్న సమయంలో కూడా వేరే అమ్మాయిలతో చిలిపిగా మాట్లాడేవాడినని గుర్తు చేసుకున్నాడు. 'ఆమె ఎంతో అందంగా ఉండేది, నేను తనతో సరసాలాడుతూ మాట్లాడేవాడిని. మన పిల్లలకు సన్నీ, బన్నీ అని పేర్లు పెట్టుకుందాం అని చెప్పాను. అప్పుడు నిజంగా నేను అలానే ఉండేవాడిని. కానీ ఈ విషయాలు నా ప్రియురాలికి తెలియకుండా జాగ్రత్తపడేవాడిని. ఆ అమ్మాయిల పేర్లను రాజేశ్, రాకేశ్.. అంటూ రకరకాలుగా ఫోన్లో సేవ్ చేసుకునేవాడిని. ఒకరోజు నా ప్రియురాలు ఇంటికొచ్చేసరికి రాకేశ్ అని సేవ్ చేసున్న నెంబర్ నుంచి అదే పనిగా ఫోన్ వస్తూనే ఉంది. ఫోన్ లిఫ్ట్ చేయమని తను అడిగింది. నేను ఫోన్ ఎత్తగానే అవతలి నుంచి అమ్మాయి గొంతు వినిపించింది. అంతే, తను క్షణం ఆలస్యం చేయకుండా నా చెంప చెళ్లుమనిపించింది. ఇది ప్రారంభం మాత్రమేనని నన్ను బెదిరించింది. నిజానికి అలా చెంపదెబ్బలు తినడం నాకదే మొదటిసారి. కానీ ఆ దెబ్బతో ఆమెకు నామీద ఎంత ప్రేముందో అర్థమైంది. అప్పటినుంచి నేను నిజాయితీగా ఉన్నాను, అలాగే పబ్లిక్‌లో నన్ను లాగిపెట్టి కొడితే నా పరిస్థితేంటని కొంత భయపడ్డాను కూడా! ఎందుకంటే ఎవరున్నారు? ఏంటనేది ఆమె పెద్దగా పట్టించుకోదు కూడా!' అని చెప్పుకొచ్చాడు మికా సింగ్. చదవండి: ఆ సినిమాలో నటించమంటూ హీరోకు రూ.2355 కోట్లు ఆఫర్ తల్లిదండ్రులు కాబోతున్న అలియా భట్-రణ్‌బీర్ కపూర్ -
అందుకోసమే లైఫ్ పార్ట్నర్ కావాలంటున్న పాపులర్ సింగర్
Mika Singh Revealed Why He Looking For His Life Partner: బాలీవుడ్ పాపులర్ సింగర్లో ఒకరు మికా సింగ్. అనేక పాటలను తన హుషారైన గాత్రంతో పాడి ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన తన జీవిత భాగస్వామి కోసం వెతుకులాట మొదలుపెట్టనున్నాడు. అది కూడా ఎందుకోసమో వివరించాడు. రాఖీ సావంత్, మల్లికా షెరావత్, రతన్ రాజ్‌పుత్, రాహుల్ మహాజన్ తర్వాతి ఇప్పుడు మికా సింగ్ కోసం స్వయంవరం ఏర్పాటు చేయనుంది ఓ నేషనల్ ఛానెల్. మికా ది వోహ్తి అనే పేరుతో ఒక రియాలిటీ షోను ప్రారంభిస్తోంది స్టార్ భారత్ ఛానెల్. ఇప్పటికే ఈ షోలో పాల్గోనేవారికోసం రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించారు. ఈ స్వయంవరం ఎందుకు అనే విషయాన్ని ఈ షో ప్రోమో ద్వారా తెలియజేశాడు మికా. ఈ ప్రోమోలో 'నేను 2000కుపైగా వివాహాల్లో ప్రదర్శించాను. అలాగే ఎన్నో పాటలు పాడి కెరీర్లో విజయం సాధించాలన్నేదే నా ఉద్దేశం. నా మొదటి పాట మౌజా హి మౌజా పాడినప్పుడు ఇలాగే కొనసాగాలని అనుకున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్. రెహమాన్, ఇతర ప్రముఖ సంగీత దర్శకుల్లాగా గొప్పవాన్ని కావాలనుకుంటున్నాను. భగవంతుని దయతో నేను ముందుకు సాగుతున్నాను. కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని దలేర్ పాజీ, భాభిజీ కోరారు. నా బంధువుల కోరిక నిమిత్తం నేను నా జీవిత భాగస్వామిని వెతకాలనుకుంటున్నా. వారి కోరికను నేను నెరవేర్చాలని అనుకుంటున్నా. అందుకోసం వారిని కొద్ది సమయం వేచి ఉండమని అభ్యర్థించాను.' అని మికా తెలిపాడు. ఇంకా వివరిస్తూ 'నేను టీవీ ఛానెల్ నుంచి ఈ ఆఫర్ అందుకున్నట్లు మా దలేర్ పాజీకి తెలియజేశాను. అతను సంతోషంతో అవును.. నువ్ ఎందుకు ఇలా ప్రయత్నించకూడదు ? నీకు సరైనా జీవిత భాగస్వామి దొరుకుతుంది.' అని పేర్కొన్నాడు. అలాగే ఈ టీవీ షో డబ్బు కోసం చేయట్లేదని మికా సింగ్ తెలిపాడు. View this post on Instagram A post shared by STAR Bharat (@starbharat) -
వరదల్లో చిక్కుకున్న సింగర్ కారు.. కదిలి వచ్చిన అభిమానులు
ముంబై: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు దేశ ఆర్థిక రాజధాని ముంబైని అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ వరద నీరు చేరుకుని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పని మీద బయటకు వచ్చిన జనం ఇంటికి చేరాలంటే గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో సింగర్, ర్యాపర్ మికా సింగ్ కారు ముంబై వర్షాల్లో చిక్కుకుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సింగర్ కారు ఇలా వరద నీటిలో చిక్కుకుపోయింది. ఆ సమయంలో ఆయనతో పాటు ఆకాంక్ష పూరి కూడా ఉన్నారు. వీరిద్దరు ఓ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి వస్తుండగా ఇలా వరద నీటిలో చిక్కుకుపోయారు. ఇక మికా కారు ఆగిపోయిందన్న విషయం తెలిసిన వెంటనే ఆయన అభిమానులు పదుల సంఖ్యలో రోడ్డు మీదకు వచ్చి.. సాయం చేసేందుకు ప్రయత్నించారు. వారంతా వర్షంలో తడుస్తూ.. సింగర్‌కు సాయం చేశారు. ఈ సందర్భంగా మికా మాట్లాడుతూ.. ‘‘దగర్గ దగ్గర 200 మంది వరకు జనాలు నాకు సాయం చేయడానికి వచ్చారు. వారందరికి నా కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ఇప్పుడు సమయం తెల్లవారుజామున 3 గంటలవుతుందన్నారు. అభిమానుల సాయంతో మికా సింగ్ అక్కడ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మికా సింగ్, ఆకాంక్ష పూరి డేటింగ్ చేస్తున్నట్లు గతకొంత కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వారు నిశ్చితార్థం కూడా చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై ఆకాంక్ష పూరి స్పందిస్తూ.. "మికా, నేను 12 సంవత్సరాలుగా ఒకరికొకరం తెలుసు. అతను నా కుటుంబ సభ్యుడిలాంటివాడు. అతను నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మా మాధ్య చాలా బలమైన బంధం ఉంది. అయితే మేం నిశ్చితార్థం చేసుకున్నామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. మాకు అలాంటి ప్రణాళికలు లేవు. అభిమానులు మేం కలిసి ఉండాలని కోరుకుంటారు. కానీ క్షమించండి.. అలా జరగదు’’ అని స్పష్టం చేశారు. -
పాక్‌లో ప్రదర్శన.. సింగర్‌పై నిషేధం
ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) బాలీవుడ్ గాయకుడు మికా సింగ్‌పై నిషేధం విధించింది. పాకిస్తాన్‌లోని కరాచీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చినందుకుగాను మికా సింగ్‌పై నిషేధం విధిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. పాకిస్తాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ కజిన్ కూతురి వివాహ కార్యక్రమం కరాచీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్ మికా సింగ్ పాల్గొన్నారు. ఇందుకు సంభందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. మికా సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తడం వంటి విషయాలు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాలోని అన్ని ప్రొడక్షన్ హౌజ్‌లు, మ్యూజిక్ కంపెనీలు, ఆన్లైన్ మ్యూజిక్ ప్రొవైడర్స్ ఇక నుంచి మికా సింగ్‌తో పని చేయకూడదని ఏఐసీడబ్ల్యూఏ ఆదేశించింది. ఒకవేళ తమ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా మికా సింగ్‌తో కలిసి పనిచేస్తే.. వారిపై కూడా కఠిన చర్యలకు వెనకాడబోమని హెచ్చరించింది. ఓవైపు కశ్మీర్ విషయంలో భారత నిర్ణయాన్ని పాకిస్తాన్ తప్పు పడుతున్నవేళ.. దేశ ప్రయోజనాల కంటే మికా సింగ్ డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చాడని.. అందుకే అతనిపై నిషేధం విధించామని ఏఐసీడబ్ల్యూఏ తెలిపింది. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ కూడా ఇందులో జోక్యం చేసుకోవాలని ఏఐసీడబ్ల్యూఏ కోరింది. -
ముషారఫ్ ఇంట్లో మికా సింగ్.. నెటిజన్ల ఆగ్రహం
కరాచీ : జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేశాక భారత్, పాక్‌ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. భారత్‌పై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత్‌తో వాణిజ్యాన్ని రద్దు చేసుకోవడమేగాక పాక్‌లో బాలీవుడ్ సినిమాలపై నిషేదం విధించింది. కాగా, పాకిస్తాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ కజిన్ కూతురి వివాహ కార్యక్రమం కరాచీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మికా సింగ్ పాల్గొన్నారు. ఆయన పాటలు పాడుతుండగా పలువురు హుషారుగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పాకిస్తాన్‌లోని చాలామందికి నచ్చలేదు. దీంతో ఇరుదేశాల నెటిజన్లు ఈ వీడియోపై ట్విటర్లో యుద్ధం చేసుకుంటున్నారు. ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్టు నైలా ఇనాయత్.. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ‘జనరల్ పర్వేజ్ ముషారఫ్ బందువుల ఫంక్షన్లో ఓ భారత సింగర్ ప్రదర్శన ఇచ్చారు. సంతోషం.. అదే పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో ఇది జరిగి ఉంటే?.. అంటూ ప్రశ్నించారు. అలాగే ఓ పాకిస్తానీ ట్వీట్ చేస్తూ.. ‘ఒక పక్క ఇండియా చేతిలో కశ్మీర్ పతనం అవుతోంది. మరో పక్క కరాచీలో భారత కళాకారుడు ప్రదర్శనలు ఇస్తున్నాడు. నయా పాకిస్తాన్ అంటే ఇదేనేమో!’ అని కామెంట్ చేశారు. ‘బాలీవుడ్ సినిమాలు బ్యాన్ చేశారు. భారత్‌తో వాణిజ్యాన్ని నిలిపేశారు. పాక్ గగనతలంలో భారత విమానాల రాకపోకలను నిషేధించారు. సరే.. విమానాలు రద్దు అయితే, వీసాలు ఇవ్వకుంటే వాళ్లు ఎలా పాక్ వచ్చారు. ఎందుకంటే ఈ నయా పాకిస్తాన్ ఓ షేమ్ పాకిస్తాన్’ అని ఆ నెటిజన్ మండిపడ్డాడు. దీనిపై భారత నెటిజన్లు స్పందిస్తూ.. ‘రాజకీయం వేరు.. కళలు వేరు.. కళలకు హద్దులు లేవు’ అని పేర్కొంటున్నారు. -
ప్రముఖ సింగర్ ఇంట్లో చోరి
సాక్షి, ముంబై : బాలీవుడ్ ప్రముఖ సింగర్ మికా సింగ్ ఇంట్లో చోరి జరిగింది. దాదాపు మూడు లక్షలు వరకు చోరి అయ్యాయి. రెండు లక్షల విలువైన ఆభరణాలు, లక్ష రూపాయల నగదు పోయినట్లు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. గతంలో ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తిపై అనుమానంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే ఈ చోరిపై మికా సింగ్ స్పందించలేదు. భజరంగీ భాయిజాన్ (ఆజ్ కి పార్టీ), కిక్ (జుమ్మెకీ రాత్), జంజీర్ (ముంబై హీరో) లాంటి పాటలను మికా సింగ్ ఆలపించారు. ప్రముఖ టీవీ కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. -
ఇంటికొచ్చిన డిజైనర్‌పై సింగర్ లైంగిక వేధింపులు
ముంబయి: బాలీవుడ్ సింగర్ మికా సింగ్ పై కేసు నమోదైంది. ఓ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు పెట్టారు. అతడిపై ఐపీసీ 354, 504 సెక్షన్ ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. బాలీవుడ్ కు చెందిన ఓ డిజైనర్ తరుచుగా మికా సింగ్ ఇంటికి వెళ్లొస్తుంటుందని, అయితే, ఇటీవల ఒకసారి వెళ్లిన ఆమెను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే, కేసు నమోదు చేసినపోలీసులు.. విచారణకు హాజరుకావాలని ఇంకా ఎలాంటి సమన్లు జారీ చేయలేదు. గతంలో 2006లో ఓ పార్టీలో రాఖీ సావంత్‌ను ముద్దు పెట్టి మికాసింగ్ కేసులో ఇరుక్కున్నాడు. -
నా పాటలన్నీ బ్లాక్ బస్టర్స్!
ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తనకు వెరీ లక్కీ అని సింగర్ మికా సింగ్ అంటున్నాడు. అక్షయ్ హీరోగా నటించిన 'హౌస్ ఫుల్ 3' మూవీలోనూ కొన్ని పాటలు పాడిన మికా ఆ హీరోపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తాను పాడిన పాట 'తాంగ్ ఉత్కే' ఆవిష్కరణలో మికా మాట్లాడుతూ... 'సింగ్ ఈజ్ కింగ్ లో తొలి పాట పాడాను. అది చాలా సూపర్ హిట్టయింది. సింగ్ ఈజ్ కింగ్ పాట కేవలం అక్షయ్ వల్లనే సక్సెస్ అయింది. ఆ హీరో కోసం నేను పాడిన పాటలు అన్నీ బాగా పాపులర్ అయ్యాయి' అని సింగర్ మికా ఆనందాన్ని వ్యక్తంచేశాడు. 'స్టంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే అక్షయ్ చాలా బాగా డ్యాన్స్ చేశాడు. దాంతో పాటలకు మంచి జోష్ వచ్చింది' అని మికా చెప్పాడు. ఇప్పటివరకూ చాలా పాటలు పాడాను. అందులో అక్షయ్ కోసం పాడినవే ఎక్కువగా ఉన్నాయ. నాకు మాత్రం 'సింగ్ ఈజ్ కింగ్' ఆల్ టైమ్ ఫెవరెట్ గా నిలిచిపోతుంది. లేటెస్ట్ మూవీ 'హౌస్ ఫుల్ 3'లో అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్, జాక్వెలైన్ ఫెర్నాండేజ్, నర్గీస్ ఫక్రీ, లిసా హేడాన్, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
ఆ సింగర్ అరెస్టై విడుదలయ్యాడు
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికాసింగ్(38)ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గత ఏప్రిల్‌లో జరిగిన ఓ కచేరి కార్యక్రమంలో డాక్టర్‌పై చేయిచేసుకున్న నేపథ్యం కేసులో ఆయనను గురువారం ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పశ్చిమ ఢిల్లీలోని ఇందర్ పురి జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఆస్పత్రిలో కంటి వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తిని సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో వేదిక మీదకు పిలిచి ఏవో ప్రశ్నలు అడిగి అనంతరం చెంప చెల్లుమనిపించాడు. దీనికి సంబంధించి అప్పట్లోనే కేసు నమోదవ్వగా ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. మికా సింగ్‌పై ఇదే కాకుండా పలు కేసులు కూడా ఉన్నాయి. -
లాగి లెంపకాయ కొట్టిన సింగర్
ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగే పాటల వేడుక వివాదానికి వేదికగా మారడమంటే ఇదే! ఆవేశాన్ని అదుపు చేసుకోకపోతే, ఆనక అనవసరమైన తలనొప్పులు తప్పవని ప్రముఖ పంజాబీ గాయకుడు, గీత రచయిత, కంపోజర్ మికా సింగ్‌కు ఇప్పుడు తెలిసొచ్చినట్లుంది. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఒక సంగీత విభావరిలో ప్రేక్షకులలో ఉన్న ఒక డాక్టర్‌ను లాగి లెంపకాయ కొట్టిన ఈ ప్రముఖ గాయకుడు ఇప్పుడు పోలీసు కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘ఢింక చిక...’ (హిందీ చిత్రం - ‘రెడీ’), ‘చింతా తా చిత చితా...’ (హిందీ చిత్రం - ‘రౌడీ రాథోడ్’) లాంటి మాస్పాటలతో దేశాన్ని ఉర్రూతలూపిన మికా సింగ్ మాత్రం తాను అంతలా సహనం కోల్పోవడం వెనుక కారణం ఉందంటున్నారు. తాగి వచ్చిన సదరు డాక్టర్ తాను ఎన్నిసార్లు చెప్పినా ఆ విభావరిని చూడడానికి వచ్చిన ఆడవారికీ, పిల్లలకూ జాగా ఇవ్వలేదనీ, పైగా చేతి మధ్యవేలును పైకి ఎత్తి, అసభ్యమైన సైగలు చేశారనీ ఆరోపిస్తున్నారు. ‘‘వేదిక మీదకు పిలిచి మరీ ‘మీ ఇంట్లో వాళ్ళ ముందు అలాగే అసభ్యమైన సైగలు చేస్తావా’ అని మందలించాను. తాగేసి ఉన్న అతను మళ్ళీ అలాగే సైగలు చేయడంతో ఒక లెంపకాయ ఇచ్చాను’’ అని మికా సింగ్ తన ప్రవర్తనను సమర్థించుకున్నారు. తెలుగులో కూడా ‘బలుపు’ (పాపులర్ పాట ‘పాతికేళ్ళ చిన్నది...’), ‘అదుర్స్’ (‘పిల్లా నా వల్ల కాదు...’ పాట), ‘మిర్చి’ (‘యాహూ.. యాహూ...’ పాట) లాంటి పాటలతో ఆకట్టుకున్న ఈ గాయకుడు ఇప్పుడు పాట కన్నా తన ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కడం విచిత్రమే. చెంపదెబ్బ తిన్న డాక్టర్ మాత్రం మికా సింగ్ తనను పక్కకు తప్పుకొమ్మంటూ అసభ్యకరంగా చెప్పారనీ, బౌన్సర్ల ద్వారా తనను వేదిక మీదకు తెప్పించి, తన మాట వినలేదంటూ కొట్టారనీ ప్రత్యారోపణ చేస్తున్నారు. మొత్తానికి, ఢిల్లీలోని నేత్ర వైద్యుల సంఘం ఆనందం కోసం ఏర్పాటుచేసుకున్న విభావరి చివరకు ఆవేశకావేశాలకు వేదికైందన్న మాట. -
బాలీల్యాండ్
ఎంటీవీ ‘బాలీల్యాండ్ సిటీ కన్సర్ట్’ మ్యూజిక్‌తో షేక్ చేసింది. బాలీవుడ్ గాయకులు మికాసింగ్, బాద్షా, కనికాకపూర్, ఆకృతిల గానం.. డీజేలు చేతస్, ఎన్వైకేలు రాకింగ్ మ్యూజిక్ బీట్స్.. ఆహూతులను కుర్చీల్లో కూర్చోనివ్వలేదు. మాదాపూర్ నోవాటెల్‌లో శుక్రవారం జరిగిన ఈ మెగా ఈవెంట్ సిటీజనులకు వీనుల విందు చేసింది. ఆరేళ్ల నుంచే... ‘ఆరేళ్ల నుంచే క్లాసికల్ మ్యూజిక్ ప్రాక్టీసు మొదలెట్టా. చదువు పూర్తయిన తర్వాత లండన్‌కు వెళ్లా. ప్లే బ్యాక్ సింగర్ కావడానికి ముందు యూరప్‌లో మోడలింగ్ చేశా. 2012లో జగ్ని జీ పాట పాడా. రాగిని ఎంఎంఎస్2లో పాడిన బేబీ డాల్ పాట నాకు బంపర్ అవకాశాలు తీసుకొచ్చింది. షారుఖ్‌ఖాన్ నటించిన హ్యపీ న్యూ ఇయర్ సినిమాలో పాడే లక్కీ చాన్స్ కొట్టేశా. హైదరాబాదీలు మ్యూజిక్‌ను సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు’ అని పంజాబీ ఫోక్ సింగర్ కనికాకపూర్ ‘సిటీప్లస్’తో చెప్పారు. పాత, కొత్త తరం సంగీతాన్ని మిక్స్‌చేసే బాణీల్లో ఉండే మజానే వేరని మికాసింగ్ అన్నారు. ఇక్కడి వంటలు బాగా ఇష్టమన్నారు. వీఎస్