పాపులర్ సింగర్ మికా సింగ్.. అదుర్స్ (పిల్లా నా వల్ల కాదు..), బలుపు (పాతికేళ్ల చిన్నది), డార్లింగ్ (యాహు యాహూ..) సినిమా పాటలతో తెలుగువారికీ సుపరిచితుడయ్యాడు. టాప్ సింగర్‌గా, ర్యాపర్‌గా రాణిస్తున్న ఇతడు రెండుమూడు సినిమాల్లోనూ నటించాడు. అంతేకాదు, ఓ సారి చిన్నపాటి సినిమా లేదా వెబ్ సిరీస్ తీయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా 2020వ సంవత్సరంలో డేంజరస్ అనే వెబ్ సిరీస్ తీశాడు.
రిస్క్ ఎందుకని?
అయితే నిర్మాతగా ఇదే తన తొలి ప్రాజెక్ట్ కావడంతో రాజ్ సినిమా డైరెక్టర్ విక్రమ్ భట్ దగ్గరున్న కథనే సెలక్ట్ చేసుకున్నాడు. పెద్దగా రిస్క్ చేయడం ఇష్టం లేని అతడు రాజ్ సినిమాలోని కొందర్ని తన సిరీస్ కోసం సెలక్ట్ చేసుకున్నాడు. బడ్జెట్ మరీ మితిమీరిపోకూడదని భావించి కరణ్ సింగ్ గ్రోవర్‌ను ఎంపిక చేశాడు. అలాగే కొత్త హీరోయిన్‌ను పరిచయం చేయాలనుకున్నాడు. కానీ కరణ్ భార్య బిపాసా బసు (Bipasa Basu) తనే కథానాయికగా చేస్తానంది. దీంతో ఒప్పుకోక తప్పలేదు.
దంపతులకు వేర్వేరు గదులు
ఇంకా మికా సింగ్ (Mika Singh) మాట్లాడుతూ.. నెల రోజుల షెడ్యూల్ కోసం 50 మంది కలిసి లండన్‌కు వెళ్లాం. తీరా వెళ్లాక అది రెండు నెలలవరకు కొనసాగింది. కరణ్, బిపాసా చాలా ఓవర్ చేశారు. వీళ్లు దంపతులే కాబట్టి ఒక రూమ్ బుక్ చేశాను. కానీ వాళ్లేమో వేర్వేరు గదులు కావాలన్నారు. నాకసలు అర్థమే కాలేదు. తర్వాత వేరే హోటల్‌కు వెళ్తామంటే అదీ చేశాను. ఒక యాక్షన్ సన్నివేశంలో కరణ్ కాలు ఫ్రాక్చర్ అయింది. అది మనసులో పెట్టుకుని డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేశారు. గొంతు బాలేదు, బిజీగా ఉన్నామంటూ ఇలా ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పేవారు.
నానా రచ్చ
వారు చేసిన పనికి డబ్బిస్తున్నప్పుడు ఎందుకింత డ్రామా చేస్తున్నారనేది నాకసలు అంతుపట్టలేదు. ముద్దు సన్నివేశం దగ్గర కూడా నానా రచ్చ చేశారు. అందుకు ససేమీరా ఒప్పుకోమన్నారు. స్క్రిప్ట్‌లో ఈ సీన్ గురించి వివరంగా రాసుంది. అది చదివే అగ్రిమెంట్‌పై సంతకం చేశారు. పైగా ఇద్దరూ భార్యాభర్తలే అయినప్పుడు ముద్దు పెట్టుకోవడానికి అభ్యంతరం ఏముంది? ఇలాంటివాళ్లు ధర్మ ప్రొడక్షన్, యష్ రాజ్ ఫిలింస్ వంటి పెద్ద నిర్మాతలకు భజన చేస్తారు. చిన్న పాత్ర ఇచ్చినా ఆహా ఓహో అని పొంగిపోతారు.
యాటిట్యూడ్ చూపించారు
కానీ చిన్న నిర్మాతల దగ్గర మాత్రం యాటిట్యూడ్ చూపిస్తారు. మేము కూడా వారిపై డబ్బు ఖర్చు పెడుతున్నాం కదా! ఇదంతా చూశాక ఇంకోసారి నిర్మాణం వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. ఇతరులకు కూడా అదే సలహా ఇస్తుంటాను. లేదు, కచ్చితంగా సినిమా నిర్మించాలనుకుంటే కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం ఉత్తమం. నేను సినిమా తీస్తున్న విషయం తెలిసి అక్షయ్ కుమార్ (Akshay Kumar) హెచ్చరించాడు కూడా!
హీరోల సలహా లెక్కచేయలే
నీకేమైనా పిచ్చిపట్టిందా? జీవితంలో ఎంతో సాధించావ్.. అలాంటిది ఇప్పుడు నటీనటుల వానిటీ వ్యాన్ దగ్గరకు వెళ్లి మీ షాట్ రెడీ అయింది, రండి అని పిలుచుకుంటూ ఉంటావా? నిర్మాతగా మారితే డబ్బు పోగొట్టుకుంటావ్ అన్నాడు. సల్మాన్ ఖాన్ అయితే.. సినిమా తీయాలనుకుంటే ఓకే, కానీ అందులో నువ్వు కూడా నటించు. ఎందుకంటే నువ్వు ఎంపిక చేసే హీరో కంటే నువ్వే ఎక్కువ ఫేమస్ అన్నాడు. ఇద్దరి మాటల్నీ నేను పట్టించుకోలేదు. నా సిరీస్ కోసం ఎంతో డబ్బు పోగేశాను.. కానీ అది ఫ్లాప్ అయింది. కనీసం అందులో నటించినా బాగుండేదని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను అని మికా సింగ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: Mollywood: హిట్టయిన సినిమాలు ఇంతేనా? రూ.700 కోట్ల లాస్!
Comments
Please login to add a commentAdd a comment