Mollywood: హిట్టయిన సినిమాలు ఇంతేనా? రూ.700 కోట్ల లాస్‌! | Kerala Film Producers Association: Only 26 Out of 199 Films were Successful in 2024 | Sakshi
Sakshi News home page

Mollywood: రూ.100 కోట్ల క్లబ్‌లో ఐదు మాత్రమే! పైకి హిట్టయినా.. లోపల ఇదీ పరిస్థితి!

Published Sun, Dec 29 2024 11:29 AM | Last Updated on Sun, Dec 29 2024 1:04 PM

Kerala Film Producers Association: Only 26 Out of 199 Films were Successful in 2024

కథలో కొత్తదనం, సహజత్వం అనగానే చాలామందికి మలయాళ సినిమాలు గుర్తొస్తుంటాయి. అది నిజమేనని ఏయేటికాయేడు మాలీవుడ్‌ (Mollywood) నిరూపించుకుంటూనే ఉంది. ఈ ఏడాదైతే మంజుమ్మెల్‌ బాయ్స్‌, ఆడుజీవితం, ఆవేశం వంటి ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. అయితే 2024లో మాలీవుడ్‌లో సినిమాల సక్సెస్‌ రేట్‌ చాలా తక్కువగా ఉందంటోంది కేరళ చిత్ర నిర్మాతల సంఘం.

199 చిత్రాలు రిలీజ్‌
వారి నివేది ప్రకారం.. 2024లో 199 మలయాళ సినిమాలు వెండితెరపైకి వచ్చాయి. ఇందులో కేవలం 26 చిత్రాలు మాత్రమే సక్సెసయ్యాయి. అయితే మొత్తం అన్ని సినిమాలకు కలుపుకుని రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే రూ.300 కోట్లు మాత్రమే తిరిగొచ్చింది. అంటే రూ.700 కోట్లు నష్టపోయారు! బడ్జెట్‌ పెరగడం, నటీనటుల పారితోషికం పెంపు వంటివి ఈ నష్టానికి ప్రధాన కారణమని తేల్చాయి.

రూ.100 కోట్ల క్లబ్‌లో ఐదు సినిమాలు
మంజుమ్మెల్‌ బాయ్స్‌ (Manjummel Boys), ఆవేశం (Aavesham), ప్రేమలు (Premalu), ఆడుజీవితం (Aadujeevitham: The Goat Life), ARM చిత్రాలు మాత్రమే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ ఐదింటిలో అత్యధికంగా మంజుమ్మెల్‌ బాయ్స్‌ రూ.242 కోట్లు సాధించింది. కిష్కింద కాండం, గురువాయూర్‌ అంబలనడయిల్‌, వర్షంగళక్కు శేషం సినిమాలు రూ.50 కోట్లు వసూలు చేశాయి.

రీరిలీజ్‌ మూవీస్‌ హిట్‌
మోహన్‌లాల్‌ దర్శకుడిగా మారి తెరకెక్కించిన బరోజ్‌ పెద్దగా ఆక్టటుకోలేకపోయింది. కానీ అతడు నటించిన దేవదూతన్‌, మణిచిత్రతళు సినిమాలను రీరిలీజ్‌ చేయగా మరోసారి హిట్టందుకున్నాయి. జనాలు భారీ తారాగణాన్ని చూసి కాకుండా కంటెంట్‌ను చూసి థియేటర్లకు వస్తున్నారని ఈ ఏడాదితో స్పష్టమైంది. దీన్ని బట్టి ఎడాపెడా ఖర్చుపెట్టకుండా నిర్మాణ వ్యయాలను అదుపులో పెట్టుకుంటే ఇండస్ట్రీకి మంచిది!

చదవండి: Tollywood: ‘డిసెంబర్‌’ రివ్యూ.. హిట్‌ రాలేదు ‘పుష్పా’ !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement