Manjummel Boys Movie
-
డ్రగ్స్ కేసులో 'పిశాచి' సినిమా నటి
మాలీవుడ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఆరోపణలు వస్తున్న సమయంలో డ్రగ్స్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఓం ప్రకాష్ నిర్వహించి ఒక డీజే పార్టీలో డ్రగ్స్ ఉపయోగించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. అతనిపై ఇప్పటికే దాదాపు 30 క్రిమినల్ కేసులు కూడా నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాంటి వ్యక్తితో మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన కొందరు నటీనటులు టచ్‌లో ఉన్నట్లు సమాచారం.అక్టోబర్ 5న ఓ పార్టీలో పాల్గొన్న ఓం ప్రకాష్, అతని స్నేహితుడు షిహాస్ డ్రగ్స్ తీసుకోవడంతో పాటు విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వారిని విచారించగా మలయాళ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. వారు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, సరైన ఆదారాలు కోర్టుకు అందించడంలో పోలీసులు విఫలం కావడంతో ఓం ప్రకాష్, అతని స్నేహితుడు షిహాస్‌కు బెయిల్ వచ్చింది. కానీ, వారిద్దరితో టచ్‌లో ఉన్న నటీనటులు ఎవరనేది చర్చ జరుగుతుంది.మంజుమ్మెల్ బాయ్స్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీనాథ్ భాసితో పాటుగా.. పిశాచి చిత్రం ద్వారా ఫేమ్ అయిన నటి ప్రయాగ మార్టిన్ ఈ డ్రగ్స్‌తో లింక్ ఉన్నట్లు మలయాళ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కూడా ఓం ప్రకాశ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. పలుమార్లు వారు అతని గదికి కూడా పోయినట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు 20 మందికి పైగా ఓం ప్రకాశ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు లభించిన CCTV ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారట. కానీ, ఆ వీడియోను పోలీసులు బహిర్గతం చేయలేదు. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రంలో గుహ లోయలో పడిపోయిన పాత్రలో శ్రీనాథ్ భాసి కనిపించారు. నటి ప్రయాగ మార్టిన్ 2014లో పిశాచి సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరైంది. -
మంజుమ్మెల్ బాయ్స్ మరో ఘనత.. ఏకైక భారతీయ చిత్రంగా!
మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా అదరగొట్టింది. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన ఘనత దక్కింది. రష్యాలో ప్రారంభమైన కినోబ్రావో ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీకి మంజుమ్మెల్ బాయ్స్ ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచిన ఏకైక భారతీయ చిత్రంగా ఘనత సాధించింది.కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ విడుదల చేయగా.. సూపర్ హిట్‌గా నిలిచింది. యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రాలలో ఒకటిగా ఘనత దక్కించుకుంది.(ఇది చదవండి: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ)తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 1న రష్యాలోని సోచిలో ప్రదర్శించనున్నారు. మంజుమ్మెల్ బాయ్స్‌తో పాటు ఎస్ఎస్ రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్, పాయల్ కపాడియా మూవీ ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రాలను వివిధ కేటగిరీలలో ప్రదర్శించనున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ అక్టోబర్ 4, 2024 వరకు కొనసాగనుంది. -
ఇళయరాజాకు 'మంజుమ్మెల్ బాయ్స్' ఎంత డబ్బు చెల్లించారు..?
'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా రికార్డ్ కలెక్షన్లతో సూపర్ హిట్ అందుకుంది. రూ. 200 కోట్లు కలెక్షన్స్ రాబట్టి మలయాళ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలోని ఒక పాట వివాదం తెచ్చిపెట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా పంపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక పాటను కమల్ నటించిన 90ల నాటి 'గుణ' చిత్రం నుంచి వాడారంటూ ఆ నోటీసుల్లో ఇళయరాజా పేర్కొన్నారు.ఈ నోటీసులకు 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్ర నిర్మాత షాన్ ఆంటోనీ స్పందించారు. సరైన అనుమతి పొందిన తర్వాతే పాటను ఉపయోగించామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సాంగ్‌కు సంబంధించ కాపీరైట్ కలిగిన రెండు మ్యూజిక్ కంపెనీలను సంప్రదించి వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే పాటను వాడామని స్పష్టత ఇచ్చారు.ఈ వివాదంలో ఇళయరాజా రూ.2 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారని, సమస్యను పరిష్కరించేందుకు 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాత రూ.60 లక్షలు ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయమై ఇళయరాజా తరపు న్యాయవాది శరవణన్‌ను సంప్రదించగా, ఆయన ఈ సమాచారాన్ని ఖండించారు. నిర్మాత వైపు నుంచి ఇళయరాజాకు ఎలాంటి డబ్బులు అందలేదని ఆయన చెప్పారు. అనంతరం తాము నోటీసు పంపామని తెలిపారు.ఈ విషయమై మంజుమల్ బాయ్స్ యూనిట్ కూగా రియాక్ట్ అయింది. సంగీత దర్శకుడు ఇళయరాజాకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. మా సినిమాలో ఉపయోగించిన 'కణ్మణి అన్బోడు వాలంతన్' పాటకు మ్యూజిక్ మాస్టర్ ఆడియో నుంచి పొందామని వారు వివరించారు. అదేవిధంగా శ్రీదేవి మ్యూజిక్ కార్పొరేషన్ అనే సంస్థ నుంచి తెలుగు పాటను పొందినట్లు తెలిపారు. మరి ఇప్పటి వరకు ఇళయరాజాకి తాము ఎలాంటి పరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు. -
దుమ్మురేపుతున్న మాలీవుడ్.. 1000 కోట్లు దాటేసిన ఇండస్ట్రీ
-
'మంజుమ్మెల్ బాయ్స్'లో ఆ సీన్ కోసం ఓరియో బిస్కెట్స్: డైరెక్టర్
మలయాళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది. 2006లో తమిళనాడు కొడైకెనాల్లోని గుణ కేవ్స్లో కేరళ యువకుడు పడిపోవడం జరిగింది. ఆ నిజజీవిత ఘటన ఆధారంగా మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని చిదంబరం తెరకెక్కించాడు. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది.ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న క్లైమాక్స్ సన్నివేశాన్ని అసలు ఎలా చిత్రీకరించారో తాజాగా ఆ చిత్ర డైరెక్టర్ చిదంబరం రివీల్ చేశాడు. ఈ సినిమాలో సుభాష్ పాత్రలో నటించిన శ్రీనాథ్ భాసి గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పాడు. ఆ గుహలో పడిపోయిన సుభాష్ నెత్తుటి మడుగులో ఉన్నట్లుగా చూపించారు. ఆయనకు గాయాలు అయినట్లుగా చూపించడానికి ఓరియో బిస్కెట్లను మేకర్స్ ఉపయోగించారని చిదంబరం వెల్లడించాడు. ఓరియో బిస్కెట్లలో ఉండే క్రీమ్‌తో సుభాస్‌కు మేకప్ వేశామన్నారు. అతనికి అయినటువంటి గాయాలను చూపించేందుకు తాము ఈ టెక్నిక్ ఉపయోగించామని ఆయన తెలిపాడు. అయితే, ఈ క్రెడిట్ అంతా మేకప్ మ్యాన్ రోనెక్స్ జేవియర్‌కు చెందుతుందని చెప్పాడు. అయితే, ఈ మేకప్ వల్ల సుభాస్ ( శ్రీనాథ్ భాసి) చాలా ఇబ్బంది పడ్డాడు. బిస్కెట్ క్రీమ్ వాసనకు ఆయన చుట్టూ చీమలు కూడా చేరిపోయాయి. ఈ సీన్ తీస్తున్నప్పుడు ఆ చీమలు కూడా అతన్ని కుట్టడం ప్రారంభించాయి. అయినా కూడా శ్రీనాథ్ భాసి చాలా చక్కడా చేశాడని దర్శకుడు చిదంబరం గుర్తుచేసుకున్నాడు. -
మాలీవుడ్‌లో 1000 కోట్ల క్లబ్ సినిమాలు
-
హిట్ సినిమాపై రాశిఖన్నా ప్రశంసలు..!
ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించిన మలయాళ చిత్రం మంజుమల్ బాయ్స్. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అందరూ కొత్త వారే నటించడం మరో విశేషం. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూలు సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. మరో విషయం ఏమిటంటే కేరళలో కంటే తమిళంలోనే అత్యధిక వసూళ్లను సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది.ఇప్పటి వరకూ తమిళంలో విడుదలైన మలయాళ చిత్రాలన్నిటికంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా మంజుమల్ బాయ్స్ నిలిచింది. అయితే ఇంతటి సంచలన విజయాన్ని సాధించినా ఈ చిత్రానికి అభినందనలతో పాటు ఘాటుగా విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమాపై నటి రాశీఖన్నా ప్రశంసలు కురిపించారు. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం ఒక రత్నమని.. ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని కలిగించే చిత్రమని కొనియాడారు. అభినందించడానికి అర్హత కలిగిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ అంటూ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. మంజుమల్ బాయ్స్ చిత్రంపై రాశీఖన్నా ప్రశంసలు కురిపించడంపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈమె నటి తమన్నాతో కలిసి నటించిన అరణ్మణై 4 చిత్రం ఇటీవలే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఈనెల 5వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మలయాళీ బ్లాక్ బస్టర్ మంజుమ్మల్ బాయ్స్ చిత్రానికి తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది. మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయగా.. ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. శనివారం(మే 5) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ మూవీ అందుబాటులో ఉంది. థియేటర్స్‌లో మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే ఈ చిత్రాన్ని చూడొచ్చు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు.ఇదీ మంజుమ్మల్ బాయ్స్ స్టోరీఈ సినిమా కథ 2006 ప్రాంతంలో జరుగుతుంది. కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్(సౌబిన్ షాహిర్), సుభాష్(శీనాథ్ బాసి)తో పాటు మరికొంత మంది స్నేహితులు ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటారు. ఈ గ్యాంగ్‌కి మంజుమ్మల్ బాయ్స్ అని పేరు పెట్టుకుంటారు. వీరంతా కలిసి ఓసారి తమిళనాడులోని కొడైకెనాల్ టూర్‌కి వెళ్తారు. అక్కడ అన్ని ప్రదేశాలను చూసి.. చివరకు గుణ కేవ్స్‌కి వెళ్తారు.అది చాలా ప్రమాదకరమైన గుహ. ఆ గుహల్లో చాలా లోతైన లోయలుంటాయి. వాటిల్లో డెవిల్స్ కిచెన్ ఒకటి. అందులో పడ్డవారు తిరిగిన వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఆ ఏరియాకు టూరిస్టులు వెళ్లకుండా డెంజర్ బోర్డ్ పెట్టి నిషేధిస్తారు అటవి శాఖ అధికారు. కానీ మంజుమ్మల్ బాయ్స్ అధికారుల కళ్లుగప్పి నిషేధించిన ప్రాంతానికి వెళ్తారు. ఆ గుహంతా తిరిగి తెగ అల్లరి చేస్తారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ లోయలో పడిపోతాడు సుభాస్. ఆ తర్వాత ఏం జరిగింది? సుభాష్‌ని కాపాడటానికి తోటి స్నేహితులు ఏం చేశారు? వారికి పోలీసు శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి సహాయాన్ని అందించాయి? చివరకు సుభాష్ ప్రాణాలతో బయటకొచ్చాడా లేదా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. -
ఓటీటీలో సినిమాల జాతర.. ఒక్క రోజే 8 చిత్రాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ రానే వచ్చింది. ఇక ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేసేందుకు చిన్న సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ వారంలో థియేటర్లలో సందడి చేసేందుకు అల్లరి నరేశ్ ఆ ఒక్కటీ అడక్కు, సుహాస్ చిత్రం ప్రసన్నవదనం, జితేందర్ రెడ్డి. తమన్నా,రాశి ఖన్నా నటించిన బాక్(అరణ్మనై-4) లాంటి చిత్రాలు వచ్చేస్తున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే హిట్ చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారాంతంలో అజయ్ దేవగణ్ సైతాన్, మలయాళ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ కాస్తా ఆసక్తి పెంచేస్తున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. మరీ మీరు ఈ వీకెండ్లో ఏ యే సినిమా చూడాలనుకుంటున్నారో ఓ లుక్కేయండి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.నెట్‌ఫ్లిక్స్ సైతాన్ (హిందీ సినిమా) - మే 03 ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) - మే 04 అమెజాన్ ప్రైమ్ క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03 ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 03డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మంజుమ్మెల్ బాయ్స్ (మలయాళ డబ్బింగ్ సినిమా) - మే 05 మాన్స్టర్స్ ఎట్ వర్క్ సీజన్- 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05జియో సినిమా హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03 ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 03 వోంకా (ఇంగ్లీష్ మూవీ) - మే 03జీ5ది బ్రోకెన్ న్యూస్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- మే 03లయన్స్ గేట్ ప్లేబ్లాక్ మాఫియా ఫ్యామిలీ సీజన్-3- మే 03 -
ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా థియేటర్లలో 'ప్రసన్నవదనం', 'కృష్ణమ్మ', 'జితేందర్ రెడ్డి' సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఉన్నంతలో సుహాస్ 'ప్రసన్నవదనం'పై కాస్త అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం చాలావరకు కొత్త చిత్రాలు రాబోతున్నాయి. వీటిలో ఓ రెండు మాత్రమే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక)ఓటీటీలో ఈ వారం దాదాపు 16 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇంగ్లీష్-హిందీ చిత్రాల సంగతి పక్కనబెడితే 'మంజుమ్మల్ బాయ్స్', 'సైతాన్' చిత్రాలు మాత్రమే చూడదగ్గవి అనిపిస్తున్నాయి. మిగతా వాటి గురించి రిలీజైతే తప్ప ఏం చెప్పలేం. ఇంతకీ ఈసారి ఓటీటీల్లోకి ఏం రాబోతున్నాయి. ఎందుకు స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు)నెట్ఫ్లిక్స్ఫియాస్కో (ఫ్రెండ్ సిరీస్) - ఏప్రిల్ 30టీ పీ బన్ (జపనీస్ సిరీస్) - మే 02సైతాన్ (హిందీ సినిమా) - మే 03ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) - మే 04అమెజాన్ ప్రైమ్అంబర్ గర్ల్స్ స్కూల్ (హిందీ సిరీస్) - మే 01ద ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) - మే 02క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 03హాట్స్టార్ద వెయిల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 30మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 05మాన్స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05జియో సినిమామైగ్రేషన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 01హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 03వోంకా (ఇంగ్లీష్ మూవీ) - మే 03ఆపిల్ ప్లస్ టీవీఅకాపుల్కో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 01(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్) -
ఎట్టకేలకు ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. రిలీజ్ డేట్ ఇదే
హమ్మయ్యా.. ఎట్టకేలకు 'మంజుమ్మల్ బాయ్స్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. థియేటర్లలో రిలీజైన దాదాపు రెండున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్ కాబోతుంది. ఫలానా తేదీన ఓటీటీ రిలీజ్ అని తెగ హడావుడి చేశారు. కానీ అది నిజం కాలేదు. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ఓటీటీ సంస్థ.. వీడియోతో అధికారికంగా ప్రకటించింది.ఫిబ్రవరిలో రిలీజై థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఏప్రిల్ 6న రిలీజై ఇక్కడ దాదాపు రూ.10 కోట్లకు పైనే వసూళ్లు సాధించింది.ఒరిజినల్ వెర్షన్ రిలీజై ప్రస్తుతానికి దాదాపు రెండున్నర నెలలు పైనే అయిపోయింది. దీంతో ఇప్పుడు ప్రశాంతంగా హాట్‌స్టార్.. 'మంజుమ్మల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించింది. అందరూ అనుకుంటున్నట్లు మే 3న కాకుండా 5వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. దక్షిణాది భాషలతో పాటు హిందీ వెర్షన్ ఇదే తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. -
'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాతల మోసం.. చీటింగ్ కేసు నమోదు
ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాలో బాగా వినిపించిన మలయాళం సినిమాల్లో 'మంజుమ్మల్ బాయ్స్' ఒకటి. రూ.20కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఏకంగా రూ.250 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో కూడా ఇదే పేరుతో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు.ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. అయితే, తాజాగా ఈ చిత్ర నిర్మాతలపై కేసు నమోదైంది. ఎర్నాకుళం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాతలైన సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోనీ, బాబు షాహిర్‌ల మీద చీటింగ్ కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల క్రితం ఆ నిర్మాతలు తనని మోసం చేశారంటూ సిరాజ్ వలియతార న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా కోసం తాను రూ.7 కోట్లు పెట్టుబడిగా పెట్టానని సిరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో 40 శాతం వాటా తనకు ఇస్తామని చెప్పడంతోనే పెట్టుబడి పెట్టినట్లు సిరాజ్ చెబుతున్నాడు. సినిమా భారీ విజయం అందుకున్న తర్వాత తనకు టచ్‌లో లేకుండా పోయారని ఆయన వాపోయాడు. లాభాల సంగతి పక్కనపెడితే తాను పెట్టిన రూ. 7 కోట్ల మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వలేదని ఆయన తెలిపాడు. పూర్తి విచారణ తర్వాత 'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాతలపై కేసు నమోదు చేయాలని ఎర్నాకుళం కోర్టు ఆదేశించింది.2006లో జరిగిన వాస్తవ సంఘటనలను బేస్ చేసుకుని 'మంజుమ్మల్ బాయ్స్' చిత్రాన్ని చిదంబరం తెరకెక్కించారు. సౌబిన్ షాహిర్,శ్రీనాథ్ భాసి, గణపతి, ఖలీద్ రెహమాన్, జార్జ్ మరియన్ తదితరులు నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. -
'మంజుమ్మల్ బాయ్స్' ప్రదర్శనలు నిలిపేసిన పీవీఆర్ మల్టీప్లెక్స్.. కారణమేంటి?
మలయాళంలో బ్లాక్ బస్టర్ టాక్ తో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. తాజాగా ఏప్రిల్ 6న తెలుగులో రిలీజై అదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యాంగా పీవీఆర్ మల్టిఫ్లెక్స్ మంజుమల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శనలను ఆపేసింది. (ఇదీ చదవండి: ప్రముఖ నటి భర్తకు గుండెపోటు.. అందువల్లే..) మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఆ చిత్ర ప్రదర్శనలను ఆపేసినట్లు పీవీఆర్ యాజమాన్యం వెల్లడించింది. పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని ప్రశ్నించారు. మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్థాంతరంగా ఆపేయడం అన్యాయమన్న శశిధర్ రెడ్డి... ప్రదర్శనలు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారశైలిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై గురువారం సాయంత్రం అత్యవసర సమావేశం కానుంది. (ఇదీ చదవండి: నాలుగేళ్ల గొడవ క్లియర్.. హీరో-కమెడియన్ కలిసిపోయారు!) -
ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?
ఈ మధ్య మలయాళ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. 'ప్రేమలు' అనే ప్రేమకథ కుర్రాళ్లని నవ్విస్తే 'మంజుమ్మల్ బాయ్స్' అనే మరో మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, మలయాళ చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడీ చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 22న మలయాళంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. తొలిరోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దాదాపు నెలపాటు కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. అలా రూ.200 కోట్ల మేర వసూళ్లు దక్కాయి. ఏప్రిల్ 6న తెలుగులోనూ విడుదలైంది. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌తో అసభ్య ప్రవర్తన.. బోనీ కపూర్‌పై నెటిజన్స్ ఫైర్!) అయితే హిట్ టాక్ తెచ్చుకున్న 'మంజుమ్మల్ బాయ్స్' ఓటీటీ హక్కుల్ని కొనే విషయంలో తొలుత లెక్క తేలలేదు. కానీ తర్వాత తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకుంది. మే 3న దక్షిణాదిలో భాషల్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కథ విషయానికొస్తే.. మంజుమ్మల్ అనే ఊరికి చెందిన కొందరు కుర్రాళ్లు తమిళనాడులోని కొడైకెనాల్ ట్రిప్ కి వెళ్తారు. వీళ్లలో ఒకడు లోతైన గుహలో పడిపోతాడు. ఇతడిని మిగతా స్నేహితులు అందరూ కలిసి ఎలా రక్షించారు? చివరకు ఏమైందనేదే 'మంజుమ్మల్ బాయ్స్' స్టోరీ. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న ఆర్ఆర్ఆర్ సింగర్.. ఎన్ని కోట్లంటే?) -
మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్‌తో విక్రమ్..
మంజుమ్మల్ బాయ్స్.. ఈ మధ్యకాలంలో మారుమోగిపోతున్న మలయాళ చిత్రం. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేరళలోనే కాకుండా తమిళనాడులోనూ అనూహ్య విజయాన్ని సాధించింది. తెలుగులోనూ డబ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతటి సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాకు చిదంబరం దర్శకుడిగా వ్యవహరించాడు. డైరెక్టర్‌గా ఇది ఈయనకు రెండో సినిమా! చిదంబరానికి ప్రశంసలు కోలీవుడ్‌లో కమల్ హాసన్, రజనీకాంత్, విక్రమ్, ధనుష్‌ల నుంచి పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలను పొందారీయన. ఈయన దర్శకత్వంలో చిత్రాలు చేయడానికి పలువురు హీరోలు ఆసక్తి చూపుతున్నారు. హీరో ధనుష్ కూడా చిదంబరం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయినట్లు ప్రచారం జరిగింది. అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా ఆయన నటించలేకపోయినట్లు సమాచారం. విక్రమ్‌తో మూవీ తాజాగా చియాన్ విక్రమ్ దర్శకుడు చిదంబరం డైరెక్షన్లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు దర్శకుడు విక్రమ్‌ను కలిసి చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం తంగలాన్ చిత్రాన్ని పూర్తి చేసిన విక్రమ్ తన 62వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత దర్శకుడు చిదంబరం దర్శకత్వంలో విక్రమ్ నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: అర్థరాత్రి నడి రోడ్డుపై ఐస్‌క్రీమ్ తింటూ చిల్ అవుతున్న నయన్.. వీడియో వైరల్ -
‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ
టైటిల్: మంజుమ్మల్ బాయ్స్ నటీనటులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ తదితరులు నిర్మాణ సంస్థలు: పరవ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి రచన, దర్శకత్వం: చిదంబరం సంగీతం: సుశీన్ శ్యామ్ సినిమాటోగ్రఫీ:షైజు ఖలీద్ ఎడిటర్: వివేక్ హర్షన్ విడుదల తేది(తెలుగులో): ఏప్రిల్ 6, 2024 కరోనా తర్వాత మలయాళ సినిమాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ హిట్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తే..ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో తెలుగులో మలయాళ సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు. గతవారం సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ రిలీజ్ చేశారు. ఇక ఈ వారం అదే జోనర్లో మరో సినిమాను విడుదల చేశారు. అదే మంజుమ్మల్ బాయ్స్. ఇటీవల మలయాళంలో రిలీజై రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. ఇప్పుడు అదే పేరుతో ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందా లేదా? రివ్యూలో చూద్దాం. ‘మంజుమ్మల్ బాయ్స్’ కథేంటంటే.. ఈ సినిమా కథ 2006 ప్రాంతంలో జరుగుతుంది. కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్(సౌబిన్ షాహిర్), సుభాష్(శీనాథ్ బాసి)తో పాటు మరికొంత మంది స్నేహితులు ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటారు. ఈ గ్యాంగ్‌కి మంజుమ్మల్ బాయ్స్ అని పేరు పెట్టుకుంటారు. వీరంతా కలిసి ఓసారి తమిళనాడులోని కొడైకెనాల్ టూర్‌కి వెళ్తారు. అక్కడ అన్ని ప్రదేశాలను చూసి.. చివరకు గుణ కేవ్స్‌కి వెళ్తారు. అది చాలా ప్రమాదకరమైన గుహ. ఆ గుహల్లో చాలా లోతైన లోయలుంటాయి. వాటిల్లో డెవిల్స్ కిచెన్ ఒకటి. అందులో పడ్డవారు తిరిగిన వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఆ ఏరియాకు టూరిస్టులు వెళ్లకుండా డెంజర్ బోర్డ్ పెట్టి నిషేధిస్తారు అటవి శాఖ అధికారు. కానీ మంజుమ్మల్ బాయ్స్ అధికారుల కళ్లుగప్పి నిషేధించిన ప్రాంతానికి వెళ్తారు. ఆ గుహంతా తిరిగి తెగ అల్లరి చేస్తారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ లోయలో పడిపోతాడు సుభాస్. ఆ తర్వాత ఏం జరిగింది? సుభాష్‌ని కాపాడటానికి తోటి స్నేహితులు ఏం చేశారు? వారికి పోలీసు శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాంటి సహాయాన్ని అందించాయి? చివరకు సుభాష్ ప్రాణాలతో బయటకొచ్చాడా లేదా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. నిజ సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించి, హిట్ సాధించడంలో మలయాళ ఇండస్ట్రీయే మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడ ఎక్కువగా యథార్థ కథలతోనే సినిమాను తీసి, దాన్ని ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా చేస్తారు. మంజుమ్మల్ బాయ్స్ కూడా ఓ యథార్థ కథే. 2006లో జరిగిన సంఘటన ఇది. కేరళకు చెందిన కొంతమంది స్నేహితులు కోడైకెనాల్ టూర్‌కి వెళ్తే..అందులో ఒకరు లోయలో పడిపోతాడు. ఎర్నాకులం మంజుమ్మల్ బాయ్స్ సాహసం చేసి మరీ తమ స్నేహితుడిని రక్షించుకుంటారు. దీన్నే కథగా అల్లుకొని మజ్ముమల్ బాయ్స్‌ని తెరకెక్కించాడు దర్శకుడు చిదంబరం. కథగా చూసుకుంటే మంజుమ్మల్ బాయ్స్ చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే తరచు పేపర్లో కనిపించే ఓ చిన్న ఆర్టికల్ అని చెప్పొచ్చు. లోయలో పడిపోయిన తన స్నేహితుడిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతాడు. ఇదే మంజుమ్మల్ బాయ్స్ కథ. ఈ యథార్థ సంఘటనకి దర్శకుడు ఇచ్చిన ట్రీట్మెంట్ ఉత్కంఠకు గురి చేస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ లోయలో చిక్కుకున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల భయం కలిగితే.. మరికొన్ని చోట్ల ‘అయ్యో.. పాపం’ అనిపిస్తుంది. లోయలో పడిపోయిన సుభాష్ పరిస్థితి చుస్తుంటే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. సుభాష్‌ని కాపాడడం కోసం తోటి స్నేహితులు చేసే ప్రయత్నం, వారు పడే ఆవేదన గుండెల్నీ పిండేస్తుంది. అదే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, ఇతర అధికారులు వ్యవహరించే తీరును కూడా చాలా సహజంగా చూపించారు. కథనం నెమ్మదిగా సాగడం కొంతమేరకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మంజుమ్మల్ బాయ్స్ నేపథ్యాన్ని పరిచయం చేస్తు సినిమా ప్రారంభించాడు దర్శకుడు. కొడైకెనాల్ టూర్ ప్లాన్ చేసే వరకు కథంతా సింపుల్‌గా సాగుతుంది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు కూడా కాకపోవడంతో ఒకనొక దశలో కాస్త బోర్ కొడుతుంది. ఎప్పుడైతే కొడైకెనాల్కి వెళ్తారో అక్కడ నుంచి కథనంలో వేగం పుంజుకుంటుంది. సుభాష్ లోయలో పడిన తర్వాత ఉత్కంఠ పెరుగుతుంది. ఫస్టాఫ్‌లో కథేమీ లేకున్నా.. మంజుమ్మల్ బాయ్స్ చేసే అల్లరి ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ ఉత్కంఠను పెంచేలా ఉంటుంది. ఇక సెకండాఫ్ అంతా ఉత్కంఠ భరితంగా, ఎమోషనల్‌గా సాగుతుంది. మంజుమ్మల్ బాయ్స్ చిన్నప్పటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సుభాష్, కుట్టన్ పాత్రల స్వభావం ఎలాంటివో ఆ సన్నివేశాల ద్వారా చూపించారు. సుభాష్‌కి ఇరుగ్గా ఉండే ప్రాంతాలు అంటే చిన్నప్పటి నుంచే చాలా భయం..అలాంటిది దాదాపు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోతాడు. చిన్నప్పటి సీన్స్ చూపించిన తర్వాత సుభాష్‌పై మరింత జాలి కలుగుతుంది. ఇలా మంజుమ్మల్ బాయ్స్ చిన్నప్పటి స్టొరీని సర్వైవల్ డ్రామా లింక్ చేస్తూ చూపించిన విధానం బాగుంది. క్లైమాక్స్‌లో ఆకట్టుకుంటుంది. కథనం నెమ్మదిగా సాగడం మైనస్. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తనమదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. వాళ్లు నటించారని చెప్పడం కంటే జీవించారనే చెపొచ్చు. తెరపై వాళ్లను చూస్తుంటే మనకు కూడా ఇలాంటి స్నేహితులు ఉంటే బాగుండనిపిస్తుంది. వాళ్లు చేసే అల్లరి పనులు అందరికి కనెక్ట్ అవుతుంది. షౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాషి పోషించిన పాత్రలు గుర్తిండిపోతాయి. టెక్నికల్‌గా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. గుణ కేవ్స్ చుట్టే ఈ సినిమా సాగుతుంది. వాటిని షైజు ఖలీద్ తన కెమెరాలో చక్కగా బంధించాడు. సుశీన్ శ్యామ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కాస్త ఓపికతో చూస్తే ఈ సర్వైవల్ థ్రిల్లర్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
16 మంది మాయం.. మంజుమ్మెల్ బాయ్స్ ‘గుణ గుహ’ గురించి తెలుసా?
మళయాలంలో చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి.. టోటల్ సౌత్‌నే ఊపేస్తోంది మంజుమ్మెల్ బాయ్స్. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కింది ఈ సర్వైవల్ డ్రామా. అత్యంత ప్రమాదకరమైన గుహల్లో చిక్కుకున్న తన మిత్రుడ్ని రక్షించుకునేందుకు ఓ యువకుడు చేసిన సాహసమే ఈ చిత్రానికి స్ఫూర్తి. అయితే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.. గుణ గుహలు, ఆ గుహ చుట్టూ అల్లుకున్న మిస్టరీ నేపథ్యం. ఆ మిస్టరీ ఏంటి? ఆ గుహలోకి వెళ్లి అదృశ్యమైన 16 మంది ఏమైపోయారు?.. ఇంతకీ ఈ గుహలకు డెవిల్ కిచెన్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. తమిళనాడు కొడైకెనాల్లో గుణ గుహలు ఉన్నాయి. 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి ఈ గుహల గురించి తొలిసారి వెలుగులోకి తెచ్చారు. ఆ గుహకు డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడాయన. లిఖితపూర్వక రికార్డులు కూడా లేకపోయేసరికి అసలు ఆయన వాటికి ఆ పేరు ఎందుకు పెట్టాడో అనేదానికి చాలా ఏండ్లు స్పష్టత లేకుండా పోయింది. ఈలోపు.. 1991లో కమల్ హాసన్ నటించిన గుణ చిత్రం విడుదలైంది. ఆ చిత్రం మేజర్ పోర్షన్ ఈ గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకుంది. గుణ చిత్రం సూపర్ హిట్ కావడంతో.. ఈ గుహలకు ‘గుణ గుహలు’ అనే పేరొచ్చింది. అప్పటి నుంచి పర్యాటకులు క్యూ కట్టడం ప్రారంభించారు. అయితే.. తర్వాతి కాలంలో ఆ గుహల పేరు చెబితేనే జనాలు వామ్మో అనుకోవడం ప్రారంభించారు. అందుకు కారణం.. ఆ గుహలోని అగాథం, ఆ అగాథాన్ని అన్వేషించేందుకు వెళ్లిన కొందరిని అది మింగేయడం. పైగా గుహ ఏకరీతిలో కాకుండా అసాధారణ రీతిలో ఉండడంతో.. అందులో పడిపోయినవాళ్ల మృతదేహాల్ని సైతం బయటకు తీయలేకపోయారు. దీంతో.. వార్డ్ అందుకే డెవిల్స్ కిచెన్ అని దానికి పేరు పెట్టి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. అలా.. గుణ గుహలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గుహల్లో ఒకటిగా పేరు వచ్చింది. పోలీసుల రికార్డుల ప్రకారం.. 2016 దాకా 16 మంది ఈ గుహలోకి వెళ్లిన వాళ్లు కనిపించకుండా పోయారు. అలా.. అదృశ్యమైన వాళ్లలో ఓ కేంద్రమంత్రి బంధువు కూడా ఉన్నారు. వీళ్లలో కొన్ని సూసైడ్ కేసులు కూడా ఉన్నాయి. అయితే.. ఓ వ్యక్తి మాత్రం సజీవంగా బయటకు రాగలిగాడు. అదే మంజుమ్మెల్ బాయ్స్ కథకు మూలమైంది. 2006లో కేరళ కొచ్చి మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు ఈ గుహ సందర్శనకు వెళ్లారు. అందులో సుభాష్ అనే వ్యక్తి గుహ అగాథంలోకి పడిపోయాడు. దీంతో అతని మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో.. సిజూ డేవిడ్ అనే అతని స్నేహితుడు ధైర్యం చేశాడు. పోలీసులు, అధికారులు హెచ్చరించి వారించినా వినకుండా స్థానికుల సాయంతో అతికష్టం మీద తన స్నేహితుడ్ని రక్షించుకున్నాడు. అలా ఆ వాస్తవ గాథ ఆధారంగా తెరకెక్కిన మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం.. ఇప్పుడు సౌత్ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. 2000 సంవత్సరం చాలా ఏళ్లపాటు సందర్శకులను అనుమతించకుండా ఈ గుహను శాశ్వతంగా మూసేశారు. అయినా కూడా హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు ఆ గుహ పరిసరాలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ప్రమాదంలో పడుతూ వచ్చారు. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం సూపర్ హిట్ కావడంతో గుణ గుహలకు సందర్శకులను అనుమతించడం ప్రారంభించింది తమిళనాడు టూరిజం శాఖ. కానీ, గుహ ప్రధాన ద్వారం మాత్రం ఇంకా మూసే ఉంచారు. గుహకి ఉన్న భయాకన నేపథ్యంతో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం షూటింగ్ చాలావరకు సెట్స్‌లోనే నిర్వహించారు. కొంత భాగం మాత్రం గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అలాగే కమల్ హాసన్ గుణ చిత్రం.. తాజా మెంజుమ్మెల్ బాయ్స్ సినిమాలే కాకుండా.. ఈ మధ్యలో మోహన్‌లాల్ నటించిన షిక్కర్(2010) చిత్రం కొంత భాగం డెవిల్స్ కిచెన్ గుహల పరిసరాల్లోనే షూటింగ్ చేసుకుంది. Video Credits: Pyramid Glitz Music -
మంజుమ్మల్ బాయ్స్‌ని ఎంజాయ్ చేస్తారు
‘‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాని అమెరికాలో చూశాను. ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ మూవీ ఇది. మలయాళంలో బిగ్ హిట్ అవడంతో పాటు రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా థియేటర్స్‌కి వచ్చి చూడండి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’’ అని నిర్మాత నవీన్ యెర్నేని అన్నారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రల్లో చిదంబరం ఎస్. పొదువల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’. పరవ ఫిలింస్‌పై బాబు షాహిర్, సౌబిన్, షాహిర్, షాన్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం మలయాళంతో పాటు తమిళంలో కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో తెలుగులో ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో చిదంబరం ఎస్. పొదువల్ మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, శశిధర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, నటులు శ్రీనాథ్ భాసి, అరుణ్ కురియన్, విష్ణు రవి తదితరులు మాట్లాడారు. -
మంజుమ్మెల్ బాయ్స్ హీరోతో 'వజ్ర కాళేశ్వరి దేవి' పెళ్లి
మనోహరం, బీస్ట్ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అపర్ణా దాస్ త్వరలో వివాహ బంధంలో అడుగుబెట్టబోతుంది. టాలీవుడ్లో ఆదికేశవ చిత్రంలో వజ్ర కాళేశ్వరీ దేవిగా ఆమె మెప్పించిన విషయం తెలిసిందే. గతేడాది తమిళంలో రిలీజైన దాదాతో బిగ్గెస్ట్ హిట్టును అందుకోవడంతో ఒక్కసారిగా ఆమె సౌత్ ఇండియా ప్రేక్షకులందరికీ దగ్గరైంది. త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న అపర్ణదాస్ మలయాళ హిట్ సినిమా మంజుమ్మెల్ బాయ్స్ హీరోల్లో ఒకరిగా కనిపించిన దీపక్ పరంబోల్‌తో అపర్ణదాస్ వివాహం జరగనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మంజుమ్మెల్ బాయ్స్‌లో సుధి పాత్రలో మెప్పించిన దీపక్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఏడడుగులు వేయబోతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 24న కేరళలోని వడక్కచేరిలో అపర్ణదాస్, దీపక్ వివాహం జరగబోతుందని వివాహ శుభలేఖ కూడా నెట్టింట వైరల్ అవుతుంది.ఈ మేరకు ఆమె ఫ్యాన్ అకౌంట్ నుంచి కూడా ఈ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. టిక్‌టాక్ నుంచి హీరోయిన్గా మెగా హీరో వైష్ణవ్‌తేజ్ నటించిన ఆదికేశవలో అపర్ణదాస్ కీలక పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో వజ్ర కాళేశ్వరీ దేవి పాత్రను ఆమె పోషించింది. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇకపోతే తమిళంలో 'దాదా' అనే సినిమాలో ఓ బిడ్డకు తల్లిగా కనిపించిన అపర్ణదాస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అక్కడ భారీ హిట్ కొట్టిన ఈ సినిమా త్వరలో తెలుగులో 'పా..పా' పేరుతో విడుదల కానుంది. దుబాయ్‌లో ఎంబీఏ పూర్తిచేసిన ఆమె టిక్‌టాక్ వీడియోల నుంచి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఆమెకు పలు సినిమా అవకాశాలు వచ్చాయి. -
మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ తెలుగులో.. ట్రైలర్ చూశారా?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఏకైక బ్లాక్‌బస్టర్ సినిమా మంజుమ్మెల్ బాయ్స్. 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. మాలీవుడ్‌లో మునుపెన్నడూ ఊహించని రేంజ్లో బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ మూవీ తెలుగులోకి రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం (మార్చి 31) మంజుమ్మెల్ బాయ్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. లోతైన గుహలో.. ఎంతో చలాకీగా, ఆడుతూ పాడుతూ ఉండే మంజుమ్మెల్ బాయ్స్ టీమ్ విహారయాత్ర కోసం కొడైకెనాల్ వెళ్తుంది. అందులో ఒకరు లోతైన గుణ గుహలో పడిపోతారు. అతడిని కాపాడేందుకు సహాయబలగాలు సైతం చేతులెత్తేస్తాయి. కానీ వారి స్నేహితులు మాత్రం అతడిని అలా వదిలేసి పోవడానికి ఇష్టపడరు. మరి ఆ గ్యాంగ్.. అతడిని ఎలా రక్షించారు? అనేది సినిమా కథ! ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఫన్‌తో పాటు సస్పెన్స్ గ్యారెంటీ అన్నట్లుగా ఉంది. ఈ మూవీ ఏప్రిల్ 6న తెలుగులో విడుదల కానుంది. సౌబిన్ షహీర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, జేన్ పాల్ లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకరచయితగా వ్యవహరించాడు. బాబూ షహీర్, సౌబిన్ షహీర్, షాన్ ఆంటోని నిర్మించారు. సుషిన్ శ్యామ్ సంగీత దర్శకుడిగా పని చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులోకి తీసుకువస్తోంది. చదవండి: -
బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు.. తెలుగులోనూ వస్తోన్న థ్రిల్లర్ మూవీ!
సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. మలయాళంలో రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో టాలీవుడ్ అభిమానుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఈ సంస్థ ఏప్రిల్ 6న రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. తెలుగు వర్షన్‌ను నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. కాగా.. 2006లో కొడైకెనాల్లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. తెలుగులోనూ అదే టైటిల్‌తో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 𝐓𝐡𝐞 𝐡𝐢𝐠𝐡𝐞𝐬𝐭 𝐠𝐫𝐨𝐬𝐬𝐢𝐧𝐠 𝐌𝐚𝐥𝐚𝐲𝐚𝐥𝐚𝐦 𝐟𝐢𝐥𝐦 - #ManjummelBoys is now coming to 𝐞𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧 𝐭𝐡𝐞 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐚𝐮𝐝𝐢𝐞𝐧𝐜𝐞 ❤️🔥 Grand release worldwide on April 6th. Telugu release by @MythriOfficial, @Primeshowtweets & @SukumarWritings ✨… pic.twitter.com/xDULaAgbVx — Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2024 -
మలయాళ ఏకైక సినిమాగా 'మంజుమ్మెల్ బాయ్స్' రికార్డ్..!
మలయాళం సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్' చరిత్ర సృష్టించింది. ఈ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు మలయాళ ఇండస్ట్రీలో ఏ సినిమా ఈ మార్క్‌ను అందుకోలేదు. దీంతో ఈ ఫీట్ సాధించిన ఏకైక సినిమాగా 'మంజుమ్మెల్ బాయ్స్' చరిత్రకెక్కింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 29న రిలీజ్ చేయబోతోంది. చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ సినిమా సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఫిబ్రవరి 22న రిలీజైన ఈ మూవీ కేవలం 25 రోజుల్లోనే రూ. 200 కోట్లు కలెక్షన్స్ సాధించడం విశేషం. గతంలో ఏ మలయాళ మూవీ ఈ ఘనతను అందుకోలేదు. ఈ చిత్రం తర్వాత '2018' సినిమా తర్వాత స్థానంలో ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా రూ. 180 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటి వరకు ఆ రికార్డు ఈ సినిమా పేరుతోనే ఉంది. తాజాగా దానిని మంజుమ్మెల్ బాయ్స్ బీట్ చేసింది. తర్వాతి స్థానాల్లో మోహన్‌లాల్ నటించిన 'మన్యం పులి' రూ. 150 కోట్లు కలెక్ట్ చేస్తే.. 'లూసిఫర్' రూ. 130 కోట్లు అందుకుంది. రీసెంట్గా రిలీజ్ అయిన 'ప్రేమలు' ఇప్పటి వరకు రూ. 120 కోట్లు సాధించి ఐదో స్థానంలో ఉంది. మంజుమ్మెల్ బాయ్స్ కథ 2006లో రియల్‌గా జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ ఏడాదిలో కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ గుహలకు విహారయాత్రకు వెళ్లారు. అందులో ఒక యువకుడు పొరపాటున ఓ లోతైన గుహలోకి జారి పడిపోతాడు. ఆ తర్వాత అతన్ని స్నేహితులు ఎలా కాపాడుతారన్నదే 'మంజుమ్మెల్ బాయ్స్' స్టోరీ. -
ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిన మలయాళం సినిమా తెలుగులో ఎప్పుడంటే
మలయాళంలో ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రేమలు చిత్రం రూ. 100 కోట్ల మార్క్‌ను దాటి విజయవంతంగా రన్ అవుతుంది. అదే విధంగా మంజుమ్మెల్ బాయ్స్ మూవీ కూడా రూ. 190 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే 200 కోట్ల మార్కును కూడా దాటేయబోతోందీ చిత్రం. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా మంజుమ్మెల్ బాయ్స్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయబోతోంది మైత్రీ మూవీ మేకర్స్. ఇతర భాషల్లో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న సినిమాలను తెలుగులో విడుదల చేయడం సాధారణం అయ్యింది. ఈ క్రమంలో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ తెలుగులోనూ ఈ సినిమా ప్రమోషన్లను పెద్ద ఎత్తున నిర్వహించి ఆ తర్వాత రిలీజ్ చేయాలని గతంలో వాయిదా వేశారు. మార్చి 29న తెలుగులో రిలీజ్ కానుందని మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే వెల్లడించింది. డైరెక్టర్ చిదంబరం ఈ మూవీని రూ.20 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించారని వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 22న విడుదల అయిన ఈ సినిమాకు భారీ స్పందన లభించింది. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో సౌబిన్ షాహిర్, సీనియర్ నటుడు లాల్, అరుణ్ కురియన్, ఖలిడ్ రెహ్మాన్, శ్రీనాథ్ భసి, బాలు వర్గీస్, గణపతి, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, షెబిన్ బెన్సన్, లాంటి స్టార్స్ కీలక పాత్రలో పోషించారు. 2006లో రియల్‌గా జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ ఏడాదిలో కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ గుహలకు విహారయాత్రకు వెళ్లారు. అందులో ఒక యువకుడు పొరపాటున ఓ లోతైన గుహలోకి జారి పడిపోతాడు. ఆ తర్వాత అతన్ని స్నేహితులు ఎలా కాపాడుతారన్నదే 'మంజుమ్మెల్ బాయ్స్' స్టోరీ. -
బ్లాక్ బస్టర్ సినిమా పరువు తీసిన ప్రముఖ రచయిత
ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ అయిన మలయాళ సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. అందరూ ఈ సినిమా గురించి ఆహా ఓహో అని తెగ పొగిడేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా దీని డబ్బింగ్ వెర్షన్ ఎప్పుడు విడుదలవుతుందా అని చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ రచయిత జయమోహన్ ఏకిపారేశారు. ఇదో చెత్త సినిమా, కేరళ వాళ్లంతా లోఫర్స్ అని దారుణమైన విమర్శలు చేశారు. ఇంతకీ ఏమైంది? 2006లో తమిళనాడులోని కొడైకెనాల్ గుహలో కేరళ కుర్రాడు పడిపోయాడు. అప్పుడు కూడా వచ్చిన స్నేహితులు అతడిని రక్షించారు. ఇదే కథతో 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా తీశారు. ఇప్పటివరకు దీనికి రూ.150 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించిన కుర్రాళ్లంతా మందు తాగుతూ, జల్సా చేస్తూ ప్రమాదానికి గురవుతారు. ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకుని, రచయిత జయమోహన్ ఘోరమైన విమర్శలు చేశారు. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) రచయిత ఏమన్నారు? 'కేరళ అడవుల్లో, అక్కడి యువకులు తాగి పడేసిన మందు బాటిల్స్ విరగ్గొడుతున్నారు. ఆ పెంకులు గుచ్చుకుని చాలా ఏనుగులు చనిపోతున్నాయి. మలయాళ టూరిస్టులు ఎక్కడికెళ్లినా అలాంటి పనులే చేస్తారు. తాగి నిషేధిత ప్రాంతంలోకి వెళ్లి లోయలో పడటాన్ని చాలా గొప్పగా చూపించడం ఓ చెత్త పని. అదో చెత్త సినిమా. నా దృష్టిలో 'మంజుమ్మల్ బాయ్స్'.. ఓ పనికిమాలిన మూవీ' అని జయమోహన్ విమర్శించారు. రైటర్ జయమోహన్ వ్యాఖ్యలపై సగటు కేరళ ప్రేక్షకుడు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఎవరో కొందరు చేసిన పనికి ఇలా అందరినీ ఆపాదించి చెప్పడం సరికాదని అంటున్నారు. ఏదేమైనా అందరూ హిట్ అని తెగ మురిసిపోతున్న 'మంజుమ్మల్ బాయ్స్'పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి జయమోహన్ వార్తల్లో నిలిచారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)