ఈ ఏడాది రిలీజైన అద్భుత సినిమాల్లో 'మంజుమ్మెల్ బాయ్స్' ఒకటి. పేరుకే మలయాళ మూవీ గానీ తెలుగు, తమిళంలోనూ కళ్లు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కానీ ఇదంతా నాణెనికి ఒకవైపు. మరోవైపు చూస్తే నిర్మాతలు.. తమతో పాటు మూవీని నిర్మించిన భాగస్వామిని మోసం చేశారు. లాభాల్లో వాటా ఇవ్వలేదని అతడి కేసు పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు నిర్మాణ సంస్థ ఆఫీస్‌పై రైడ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)
స్నేహితుడు గుహలో పడిపోతే మిగిలిన 10 మంది స్నేహితులు కలిసి అతడిని ఎలా కాపాడారు అనే నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్'. ప్రముఖ మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.. ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగానూ వ్యవహరించాడు. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ప్రకటించారు. అయితే లాభాలకు.. కట్టిన ట్యాక్స్‌కి ఏ మాత్రం పొంతన లేదని తాజాగా ఐటీ రైడ్‌లో అధికారులు గుర్తించారు. కొచిలోని పరవ ప్రొడక్షన్ ఆఫీస్‌లో గురువారం తనిఖీలు చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలు.. వివాదంలో చిక్కుకున్నారు. తాను కూడా సినిమా నిర్మాణంలో భాగమని.. అయితే లాభాల్లో వాటా ఇచ్చే విషయంలో మోసం చేశారని ఓ వ్యక్తి.. వీళ్లపై మారాడు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. అది కోర్ట్ వరకు చేరుకోవడంతో సదరు నిర్మాతల బ్యాంక్ ఖాతాల్ని ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు ఐటీ రైడ్స్ చేయడంతో మరోసారి 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలు హాట్ టాపిక్ అయ్యారు. మరి ఎన్ని కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టారనేది అధికారులు బయటపెట్టాల్సి ఉంది!
(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment