Malayalam Movie
-
ఓటీటీలో మలయాళ హిట్ మూవీ సూక్ష్మదర్శిని.. ఎలా ఉందంటే?
ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉంది అంటే అది రహస్యమే. కాని మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాలసిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందని వాళ్ళు బయటపెట్టితేనే పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపొరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే సూక్ష్మదర్శిని. ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. సూక్ష్మదర్శిని ఓ మళయాళ సినిమా. హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే ఇది ఓ కాలనీకి సంబంధించినది. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఇంట్లోకి మాన్యుల్ తన తల్లితో కొత్తగా వస్తాడు. మాన్యుల్ ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. మాన్యుల్ తన తల్లికి అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఈ విషయంపై ప్రియ ఫోకస్ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది. మాన్యుల్ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేషన్ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలను మాత్రం సూక్ష్మదర్శినిలో చూస్తే తెలిసిపోతుంది.సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి.జతిన్. ప్రముఖ మళయాళ నటులు నజరియా, బసిల్ జోసెఫ్ వంటి వారు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలలో నటించడం ప్రత్యేక ఆకర్షణ. ఆఖరుగా ఒక్కమాట ఇరుగు పొరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్ ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్.- ఇంటూరు హరికృష్ణ. -
ఓటీటీల్లో కచ్చితంగా చూడాల్సిన మలయాళ సినిమాలు
ఈ ఏడాది తెలుగు సినిమా రేంజు ఎక్కడికో వెళ్లిపోయింది. మిగతా చిత్రపరిశ్రమల్లో ఒక్క మలయాళ ఇండస్ట్రీ మాత్రమే అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ఎందుకంటే జనవరి నుంచి వరసగా మలయాళంలో ప్రతి నెలా ఒకటి రెండు హిట్ సినిమాలు వచ్చాయి. అవి కలెక్షన్స్ అందుకోవడంతో పాటు ప్రేక్షకుల్ని అమితంగా అలరించాయి. అలా ఈ ఏడాది రిలీజైన కొన్ని మలయాళ బెస్ట్ మూవీస్.. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఉన్నాయి. వాటి సంగతేంటనేది చూద్దాం.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)మొత్తంగా 18 సినిమాల్ని వేరే ఆలోచన లేకుండా చూసేయొచ్చు. వీటిలో కామెడీ, యాక్షన్, హారర్, థ్రిల్లర్, రొమాంటిక్.. ఇలా అన్ని జానర్స్ ఉన్నాయి. పైపెచ్చు ఈ జాబితాలో ఉన్న సినిమాలన్నీ కూడా తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఈ ఏడాది మంచి సినిమాలు చూస్తూ ముగించాలనుకుంటే ఈ మూవీస్ బెస్ట్ ఆప్షన్. అస్సలు డిసప్పాయింట్ అయ్యే అవకాశముండదు.ఈ ఏడాది రిలీజైన బెస్ట్ మలయాళ మూవీస్భ్రమయుగం - సోనీ లివ్ (తెలుగు)ఆవేశం - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)మంజుమ్మల్ బాయ్స్ - హాట్‌స్టార్ (తెలుగు)ద గోట్ లైఫ్ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)అడియోస్ అమిగో - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)ఏఆర్ఎమ్ - హాట్‌స్టార్ (తెలుగు)ఆట్టం - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్ - ముబి (మలయాళం)అన్వేషిప్పిన్ కండేతుమ్ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)గురువాయుర్ అంబలనడియిల్ - హాట్‌స్టార్ (తెలుగు)కిష్కింద కాండం - హాట్‌స్టార్ (తెలుగు)గోళం - అమెజాన్ ప్రైమ్ (తెలుగు)ప్రేమలు - ఆహా (తెలుగు)పని - సోనీ లివ్ (తెలుగు) (ఇంకా స్ట్రీమింగ్ కావాలి)తలవన్ - సోనీ లివ్ (తెలుగు)ఉళ్లోరుక్కు - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)సూక్ష్మదర్శిని - ఓటీటీలోకి రావాల్సి ఉందివాళా - హాట్‌స్టార్ (తెలుగు)(ఇదీ చదవండి: 2024లో అత్యధిక లాభాలొచ్చిన తెలుగు సినిమా ఏదంటే?) -
తెలుగు రిలీజ్ అవుతున్న మలయాళ హిట్ సినిమా
రీసెంట్గా మలయాళంలో హిట్టయిన సినిమా 'పని'. ప్రముఖ నటుడు జోజూ జార్జ్.. ప్రధాన పాత్రలో నటించిన దర్శకత్వం వహించాడు. ఈ నెల 13న థియేటర్లలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. అభినయ జోజూకి జోడీగా నటించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో మంగళవారం జరిగింది.(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)ఈ మూవీ డిసెంబర్ 20న సోనీ లివ్ ఓటీటీలో వస్తుందని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు తెలుగు రిలీజ్ ఉండటంతో డిజిటల్ స్ట్రీమింగ్ ఆలస్యంగానే ఉండనుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజవంశీ చెప్పారు. తెలుగు వెర్షన్.. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత తర్వాతే ఓటీటీలోకి వస్తుందని అన్నారు.'పని' కథ విషయానికొస్తే.. రివేంజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతోనే తీశారు. కానీ జోజూ జార్జ్ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని తెలుస్తోంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మలయాళంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాలు చేశాడు జోజూ జార్జ్. గతంలో తెలుగులో 'ఆదికేశవ' మూవీలో విలన్‌గా ఇతడు నటించాడు.(ఇదీ చదవండి: పార్టీ చేసుకున్న 'పుష్ప'.. శ్రీవల్లి మిస్!) -
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఎప్పటికప్పుడు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ టైంలో అలా 'కిష్కింద కాండం' అనే మూవీ వచ్చింది. ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)'పుష్ప 2'లో భన్వర్ సింగ్ షెకావత్‌గా త్వరలో రాబోతున్న ఫహాద్ ఫాజిల్.. రీసెంట్గా మలయాళంలో 'బౌగెన్‌విల్లా' అనే సినిమా చేశారు. కుంచకో బోబన్, జ్యోతిర్మయి ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో ఓ మాదిరి హిట్ అయిన ఈ చిత్రాన్ని డిసెంబరు 13 నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు.'బౌగెన్‌విల్లా' విషయానికొస్తే డాక్టర్ రాయిస్ థామస్ (కుంచకో బోబన్), రీతు (జ్యోతిర్మయి) భార్యాభర్తలు. వీళ్లిద్దరూ ఒకరోజు కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. దీంతో రీతు గతం మర్చిపోతుంది. అంతకు కొన్నిరోజుల క్రితం రీతు.. ఓ అమ్మాయిని ఫాలో అవుతుంది. ఆమె మినిస్టర్ కూతురు. కొన్నాళ్లకు మిస్ అవుతుంది. దీంతో ఆమె కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ కోషి (ఫహాద్ ఫాజిల్) రీతు దగ్గరకు వస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)Every petal tells a story, every twist leaves you guessing. #Bougainvillea blooms this 13th December only on #SonyLIV.#Bougainvillea #BougainvilleaOnSonyLIV #SonyLIV #AmalNeerad #KunchackoBoban #Jyothirmayi #FahadFaasil #Srindaa #VeenaNandakumar #Sharafudheen pic.twitter.com/NdXQkBMWiZ— Sony LIV (@SonyLIV) November 30, 2024 -
మరో వివాదం.. 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలపై ఐటీ రైడ్
ఈ ఏడాది రిలీజైన అద్భుత సినిమాల్లో 'మంజుమ్మెల్ బాయ్స్' ఒకటి. పేరుకే మలయాళ మూవీ గానీ తెలుగు, తమిళంలోనూ కళ్లు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కానీ ఇదంతా నాణెనికి ఒకవైపు. మరోవైపు చూస్తే నిర్మాతలు.. తమతో పాటు మూవీని నిర్మించిన భాగస్వామిని మోసం చేశారు. లాభాల్లో వాటా ఇవ్వలేదని అతడి కేసు పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిర్మాణ సంస్థ ఆఫీస్‌పై రైడ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)స్నేహితుడు గుహలో పడిపోతే మిగిలిన 10 మంది స్నేహితులు కలిసి అతడిని ఎలా కాపాడారు అనే నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్'. ప్రముఖ మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.. ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగానూ వ్యవహరించాడు. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ప్రకటించారు. అయితే లాభాలకు.. కట్టిన ట్యాక్స్‌కి ఏ మాత్రం పొంతన లేదని తాజాగా ఐటీ రైడ్‌లో అధికారులు గుర్తించారు. కొచిలోని పరవ ప్రొడక్షన్ ఆఫీస్‌లో గురువారం తనిఖీలు చేశారు.ఈ ఏడాది ఏప్రిల్‌లోనే 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలు.. వివాదంలో చిక్కుకున్నారు. తాను కూడా సినిమా నిర్మాణంలో భాగమని.. అయితే లాభాల్లో వాటా ఇచ్చే విషయంలో మోసం చేశారని ఓ వ్యక్తి.. వీళ్లపై మారాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అది కోర్ట్ వరకు చేరుకోవడంతో సదరు నిర్మాతల బ్యాంక్ ఖాతాల్ని ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు ఐటీ రైడ్స్ చేయడంతో మరోసారి 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతలు హాట్ టాపిక్ అయ్యారు. మరి ఎన్ని కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టారనేది అధికారులు బయటపెట్టాల్సి ఉంది!(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్) -
ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ
తెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. మలయాళంలో మాత్రం థ్రిల్లర్ మూవీస్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా సెప్టెంబరులో రిలీజైన ఓ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. రూ.5 కోట్లు పెడితే రూ.50 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ మూవీనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ మూవీ 'కిష్కింద కాండం'. కోతుల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల దృష్టిలోనూ పడింది. దీంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 19 నుంచి హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్)'కిష్కింద కాండం' విషయానికొస్తే.. అజయన్ (అసిఫ్ అలీ), అపర్ణ (అపర్ణ బాలమురళి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ అప్పటికే అజయన్కి పెళ్లయి బాబు కూడా పుడతాడు. కానీ భార్య చనిపోవడంతో ఈ పెళ్లి చేసుకుంటాడు. కానీ ఇది జరిగిన కొన్నిరోజులకే కొడుకు మాయమవుతాడు. ఆ కుర్రాడు ఏమైపోయాడు? అజయన్ తండ్రి వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేదే మిగతా స్టోరీ.చివరి వరకూ సినిమాలో ట్విస్ట్‌ను కొనసాగించడంతో పాటు థ్రిల్‌ను ఏమాత్రం తగ్గనీయకుండా దర్శకుడు సినిమా తీశాడు. 'కిష్కింద కాండం' టైటిల్ పెట్టడానికి కూడా కారణముంది. కోతులు ఎక్కువగా కనిపించే ఆ ఊరిలో వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఓ సందర్భంలో మనిషి శవం ఉండాల్సిన చోట కోతి శవం కనిపిస్తుంది. ఇలా మొదటి నుంచి చివరివరకు ట్విస్టులు, థ్రిల్స్ మిమ్మల్ని మైండ్ బ్లాక్ చేయడం గ్యారంటీ.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అంటేనే ఇమేజ్ డ్యామేజ్.. ఎప్పుడు తెలుసుకుంటారో?) -
తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి
మిల్కీ బ్యూటీ తమన్నా ఇంకా ఫామ్‌లోనే ఉంది. అడపాదడపా సినిమాలు చేస్తోంది. గ్యాప్ దొరికితే ఐటమ్ సాంగ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. మలయాళంలోనూ గతేడాది ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఆ చిత్రమే తెలుగులోనూ ఓటీటీలోకి స్ట్రీమింగ్కి సిద్ధమైంది.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)ఉత్తరాదికి చెందిన తమన్నా.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 'బాంద్రా' అనే మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. గతేడాది నవంబర్‌లో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఘోరంగా ఫెయిల్ అయింది. రూ.35 కోట్లు బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల వసూళ్లు మాత్రం వచ్చాయి. దీంతో డిజిటల్ మార్కెట్ కూడా జరగలేదు. అలా మూలన పడిపోయింది.ఇన్నాళ్లకు 'బాంద్రా' డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 15న లేదా 22న స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావొచ్చు. 'బాంద్రా' విషయానికొస్తే.. మాఫియా డాన్ నుంచి తప్పించుకున్న ఓ హీరోయిన్.. గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడుతుంది. ఊహించని పరిస్థితుల్లో ఆమె చనిపోతుంది. తర్వాత ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?) -
'కొండల్' సినిమా రివ్యూ (ఓటీటీ)
నడి సముద్రంలో ఓ బోటు. అందులోనే రెండున్నర గంటల సినిమా అంటే.. హా ఏముంటుందిలే అనుకోవచ్చు. కానీ 'కొండల్' అనే డబ్బింగ్ బొమ్మ నిజంగానే ఆశ్చర్యపరిచింది. చూస్తున్నంతసేపు సముద్రం మధ్యలో బోటులో ఉన్నామా అనేంతలా మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్గా రిలీజైన ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?'కొండల్' కథ విషయానికొస్తే.. అదో సముద్ర తీర ప్రాంతం. ఎందరో మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవిస్తుంటారు. వాళ్లలో ఒకడే ఇమ్మాన్యుయేల్ (ఆంటోని వర్గీస్). ఎలాంటి వాడితోనైనా సరే ఢీ కొట్టే రకం. ఓసారి కొత్త బృందంతో కలిసి సముద్రంలోకి చేపల వేటకు వెళ్తాడు. తమ బోటులోకి కొత్తగా వచ్చిన ఇతడిపై జూడ్ (షబీర్) గ్యాంగ్ కన్నేసి ఉంచుతారు. కొన్నిరోజులకు ఇమ్మాన్యుయేల్ గురించి ఓ సీక్రెట్ తెలుస్తుంది. కాదు కాదు అతడే చెబుతాడు. దీంతో ఒకరిని ఒకరు చంపుకొనేంత వరకు వెళ్తారు? ఇమ్మాన్యుయేల్ ఎవరు? డేనియల్ అనే వ్యక్తితో ఇతడికి సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)'కొండల్' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో రివేంజ్ స్టోరీతో తీసిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా. రెండున్నర గంటల సినిమాలో దాదాపు రెండు గంటల పాటు కథంతా సముద్రం మధ్యలో ఓ బోటులోనే ఉంటుంది. అసలు బోటులో ఏం స్టోరీ చెప్పగలరు? మహా అయితే ఏం చూపిస్తారులే అని మనం అనుకుంటే పప్పులే కాలేసినట్లే.మత్స్యకారులు జీవితాలు ఎలా ఉంటాయి? రోజుల తరబడి వేటకు వెళ్లిన వాళ్లు ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు? ఒకవేళ వేటకు వెళ్లిన వాళ్లలో గ్రూపులు ఏర్పడితే ఎలా ఉంటుంది అనే విషయాలని చాలా నేచురల్‌గా చూపించారు. ఇవన్నీ ఓ వైపు నడుస్తుంటాయి. మరోవైపు రివేంజ్ డ్రామా నడిపిన విధానం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.ఫస్టాఫ్ అంతా స్టోరీ సెటప్ కోసం వాడుకోగా.. ఇంటర్వెల్‌కి హీరో గురించి ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. హీరో vs విలన్ అన్నట్లు సాగుతుంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్‌లో షార్క్ ఫైట్ చూసిన తర్వాత అవన్నీ మర్చిపోతాం. ఇంకా చెప్పాలంటే షార్క్ ఫైట్ అనేది 'దేవర'లో కంటే ఈ సినిమాలో ఇంకాస్త రిచ్‌గా చూపించారు.సినిమాలోని సీన్స్‌తో పాటు ప్రతి మాట కూడా ఆకట్టుకుంటుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. నటీనటులెవరు అనే విషయం పక్కనబెడితే తెరపై పాత్రల స్వభావం మాత్రమే కనిపిస్తుంది. మూవీలో యాక్ట్ చేసిన ఏ ఒక్కరు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలిసుండరు. కానీ సినిమా మొదలైన కాసేపటికే లీనమైపోతాం. ఓటీటీలో ఏదైనా మంచి యాక్షన్ డ్రామా మూవీ చూడాలనుకుంటే 'కొండల్' వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్.-చందు డొంకాన(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఓటీటీకి వచ్చేస్తోన్న మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళం సినిమాలకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటోంది. గతంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నాయి. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు లాంటి టాలీవుడ్ ప్రియులను అలరించాయి. తాజాగా మరో మలయాళ మూవీ తెలుగు ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తోంది.మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేవలం మలయాళం భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్ వేదికగా పంచుకుంది. కాగా.. ఈ ఏడాది జూన్‌లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రంలో షేన్ నిగమ్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆంటో జోస్ పెరీరా, అబీ ట్రెసా పాల్ తెరకెక్కించారు.Don't miss the heartwarming journey of #littlehearts. Premieres October 24th on aha. pic.twitter.com/GRHtwgghY7— ahavideoin (@ahavideoIN) October 21, 2024 -
'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ప్రతివారం పదులకొద్దీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన మలయాళ సినిమా 'వాళా'. కేవలం రూ.4 కోట్లు పెట్టి తీస్తే రూ.40 కోట్లు వసూలు చేసిందీ చిన్న సినిమా. మలయాళంలో సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?విష్ణు, అజు థామస్, మూస అనే ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎప్పుడు అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు తలనొప్పులు తీసుకొస్తుంటారు. వీళ్లకు కలామ్, వివేక్ ఆనంద్ అనే మరో ఇద్దరు ఫ్రెండ్స్ తోడవుతారు. వీళ్లంతా ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. మొదటిరోజే పెద్ద గొడవ పెట్టుకుంటారు. ఏకంగా లెక్చరర్ని కూడా కొట్టేస్తారు. అలా ఆడుతూ పాడుతూ సాగిపోతున్న వీళ్లు.. ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో పట్టుబడతారు. మరి వీళ్లు బయటపడ్డారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఆ వయసులో చేసే అల్లరి, హంగామా అలా ఉంటుంది మరి. చదువు బిడ్డల సంగతి పక్కనబెడితే ఆవారాగా తిరిగే బ్యాచ్‌లు కూడా ఉంటాయి. అలాంటి ఓ బ్యాచ్ కథే 'వాళా'. చూస్తే సింపుల్ కథనే గానీ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. 90ల జ్ఞాపకాలు, టీనేజీ అల్లర్లు, గొడవలు, తల్లిదండ్రులు మాట వినకపోవడం లాంటి సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. కానీ ఇందులో మాత్రం ఇంచుమించు అలానే ఉన్నప్పటికీ హాయిగా నవ్వుకునేలా చేస్తాయి.కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనగానే దాదాపు ప్రతి దర్శకుడు కుర్రాళ్ల వైపు నుంచే కథ చెబుతారు. కానీ ఇందులో మాత్రం ఇటు కుర్రాళ్ల వైపు నుంచి నవ్విస్తూనే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూపించారు. పిల్లల వల్ల వాళ్లు ఎంతలా స్ట్రగుల్ అవుతారనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. ఇంటర్వెల్ ముందు వరకు 90స్ జ్ఞాపకాల్ని నెమరవేసుకునేలా ఉంటాయి. ఆ తర్వాత మాత్రం పిల్లలు-తల్లిదండ్రుల మధ్య బంధాన్ని చూపించారు. చివర అరగంట అయితే చూస్తున్న మనం కన్నీళ్లు పెట్టుకునేంతలా ఎమోషనల్ అయిపోతాం.'వాళా' అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. పనిపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అదే పేరుతో పిలుస్తుంటారు. అరటి మొక్కని చూపించడంతో మొదలయ్యే ఈ సినిమా.. అరటి తోటని చూపించే సన్నివేశంతో ముగుస్తుంది. అలానే ప్రస్తుత సమాజంలోని ఎంతోమంది కుర్రాళ్లు ఈ సినిమాలో తమని తాము చూసుకోవడం గ్యారంటీ. ఎందుకంటే చాలా సీన్లు అలా కనెక్ట్ అయిపోతాయ్.ఎవరెలా చేశారు?యాక్టర్స్ ఎవరూ మనకు తెలియదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఆలోచన మనకు రాదు. ఎందుకంటే అంత బాగా చేశారు. సినిమాటోగ్రాఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకి తగ్గట్లు ఉంది. స్నేహం అంటే ఒకరి కోసం ఒకరు ఆవేశపడటం కాదు. అందరూ కలిసి ఓ బలమైన ఆశయం కోసం పట్టుదలతో ముందుకెళ్లడం, కన్నవాళ్ల కళ్లలో సంతోషం చూడటం అనే సందేశాన్ని అంతర్లీనంగా ఈ కథలో ఇచ్చారు. నిడివి కూడా 2 గంటలే. కుటుంబంతో కలిసి చూసే సినిమా ఇది.-చందు డొంకాన -
కేన్స్ అవార్డ్ విన్నింగ్ సినిమా.. ఇప్పుడు థియేటర్లలో రిలీజ్‌కి రెడీ
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తీసిన సినిమా 'ఆల్ ఉయ్ ఇమేజిన్ యాజ్ ఏ లైట్'. కని కస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్ దేశాలు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. ఈ ఏడాది మేలో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా అద్భుతమైన స్పందనతో పాటు ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డు గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమా మన దగ్గర థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.(ఇదీ చదవండి: తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్)'ఆల్ ఉయ్ ఇమేజిన్ యాజ్ ఏ లైట్' సినిమాని అక్టోబరు 2న ఫ్రాన్స్‌లో రిలీజ్ చేయనున్నారు. అంతకు ముందే సెప్టెంబరు 21న కేరళలోని కొన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. త్వరలో మిగతా ప్రాంతీయ భాషల్లోనూ విడుదల చేస్తారని తెలుస్తోంది. భారత దేశవ్యాప్తంగా తెలుగు హీరో రానాకి చెందిన స్పిరిట్ మీడియా నిర్మాణ సంస్ఛ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.మలయాళ వెర్షన్ సినిమా 'ప్రభయయ్ నీనచతళం' పేరుతో రిలీజ్ కానుంది. కథ విషయానికొస్తే ముంబైలో పనిచేస్తున్న కేరళ నర్సులు ప్రభ, అను జీవితాల్లో జరిగిన సంఘటనల ఏంటి? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. ఇకపోతే వచ్చే ఏడాది ఆస్కార్ బరిలోనూ ఈ సినిమాని నిలపాలని మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫ్రాన్స్ దేశం ఈ చిత్రాన్ని షార్ట్ లిస్ట్ చేసిందని టాక్. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు) -
షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి
ప్రముఖ నటి, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రేవతి.. తనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పుడు స్పందించింది. కొద్దిరోజుల క్రితం కోజికోడ్‌కు చెందిన సజీర్ (33), దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. సుమారు పదేళ్ల క్రితం తనపై దర్శకుడు రంజిత్ లైంగిక దాడికి పాల్పడ్డారని చెబుతూనే, రేవతి పేరును కూడా బయటపెట్టాడు. తన వ్యక్తిగత ఫోటోలు రేవతికి రంజిత్ పంపాడని అతడు ఆరోపించాడు. దీంతో ఈ వార్త పెను సంచలనంగా మారింది.(ఇదీ చదవండి: ‘బిగ్ బాస్' కథ పెద్దదే... పురాతనమైంది కూడా!)అవి నిజం కాదు సజీర్ చేసిన ఆరోపణలపై నటి రేవతి ఇప్పుడు స్పందించింది. దర్శకుడు రంజిత్.. యువకుడి నగ్న చిత్రాలని తనకు పంపారనే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్‌లో దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. మీడియాలో వస్తున్న వాటిలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు.అసలేం జరిగిందంటే?సినిమా అవకాశాల కోసం డైరెక్టర్ రంజిత్ని సంప్రదిస్తే ఒక హోటల్‌కు పిలిపించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని సజీర్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో నటి రేవతి పేరును తీసుకొచ్చాడు. 'దర్శకుడు రంజిత్ గదిలోకి నేను వెళ్లినప్పుడు ఆయన ఒక నటితో మాట్లాడుతున్నాడు. ఆ నటి రేవతి అని రంజిత్ నాకు చెప్పాడు. రేవతి, రంజిత్‌కి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. రంజిత్ నా ఫోటో తీసి వారికి పంపాడు. ఎవరికి పంపారు అని నేను అడిగాను. అప్పుడు రేవతికి పంపించానని దర్శకుడు రంజిత్ సమాధానమిచ్చాడు. ఫొటో చూసి రేవతికి నచ్చిందని కూడా నాతో చెప్పాడు. కానీ, అటువైపు నిజంగానే రేవతినే అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. రంజిత్ నాతో చెప్పిన విషయాన్నే ఇప్పుడు చెబుతున్నాను' అని సజీన్ చెప్పడం చర్చనీయాంశమవుతోంది.(ఇదీ చదవండి: కారవాన్లలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు: రాధిక శరత్‌కుమార్) -
మాలీవుడ్ సూపర్ ‘హీట్’.. ‘అమ్మ’ రాజీనామా!
కేరళ సినిమా రంగంలో భూకంపం పుట్టింది. నటీనటుల సంఘం ‘అమ్మ’ కార్యవర్గం పూర్తిగా రాజీనామా చేసింది. వీరిలో మోహన్‌లాల్ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కేరళ సినిమా రంగంలో మహిళలపై దురాగతాలు బయటికి వస్తుండటంతో పరిశ్రమ వణుకుతోంది. కొందరు తమ పదవులకు రాజీనామాలు చేస్తుంటే మరికొందరు ముఖం చాటేస్తున్నారు. ఈ దావానలం బాలీవుడ్ వరకు పాకితే మరింత ప్రక్షాళనం జరగవచ్చు.మలయాళ సినీ పరిశ్రమలో గొలుసుకట్టు ఘటనలు జరుగుతున్నాయి. 2017లో మలయాళ నటి భావనా మీనన్‌పై లైంగిక దాడి జరగడం (కొచ్చి శివార్లలో కారులో కొందరు వ్యక్తులు చేశారని ఆరోపణ) వెనుక సూత్రధారి మలయాళ హీరో దిలీప్ అని రేగిన కార్చిచ్చు అక్కడి ప్రభుత్వం చేత జడ్జి హేమ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయించింది. అయితే ఆ కమిటీ రి΄ోర్టు ఆలస్యంగా 2024 ఆగస్టులోగాని బయటకు రాలేదు. అది వచ్చిన వెంటనే మలయాళ పరిశ్రమలో కొంతమంది మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పసాగారు. దాంతో మలయాళ పరిశ్రమ కుదుపులకు లోనవుతోంది.నటుడు సిద్దిఖీ పై ఆరోపణమలయాళంలో టాప్ కేరెక్టర్ ఆర్టిస్ట్, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు జనరల్ సెక్రటరీ అయిన సిద్దిఖీ పై రేవతి సంపత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచార ఆరోపణలు చేసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఆమె తన ఆరోపణలను మరోసారి మీడియా ముందుకు తెచ్చింది. ‘2016లో అతను కొచ్చిలోని ఒక హోటల్లో నా పై అత్యాచారం చేశాడు. అప్పుడు నాకు 21 ఏళ్లు ఉంటాయి. నాకు సినిమా రంగం ఆసక్తి ఉందని తెలిసి హోటల్‌కు పిలిపించి హఠాత్తుగా లైంగికదాడి చేశాడు’ అని ఆమె చెప్పింది. ఈ ఆరోపణలు ఆమె 2019లో చేసినా ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకుని సిద్దిఖీని విమర్శల వలయంలో నిలబెట్టాయి. దాంతో అతడు ‘అమ్మ’ పదవికి రాజీనామా చేశాడు. అయితే అతడు తాజాగా ఆ జూనియర్ ఆర్టిస్టు తనపై లేని΄ోని అభాండాలు వేస్తోందని కేరళ డి.జి.పికి ఫిర్యాదు చేశాడు.ఎం.ఎల్.ఏ పేరుమరోవైపు నటుడు ముకేష్ (ఇతను సి.పి.ఎం ఎం.ఎల్.ఏ) పై కూడా టెస్ జోసఫ్ అనే కాస్టింగ్ డైరెక్టర్ అమర్యాదకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. ‘అతను ఔట్‌డోర్‌లో తన రూమ్ పక్కన నా రూమ్ ఉండేలా కుట్ర చేశాడు. నా రూమ్ తలుపు పదే పదే కొట్టాడు’ అని ఆమె తెలియచేసింది. అయితే ముకేష్ ఇదంతా రాజకీయ కుట్ర అని అంటున్నాడు. ఈ దుమారం ఇలా ఉంటే ప్రభుత్వ చలచిత్ర అకాడెమీ ప్రస్తుత చైర్మన్, దర్శకుడు రంజిత్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో అతనూ రాజీనామా చేశాడు. దీంతో ప్రభుత్వం సినిమా పరిశ్రమలో వస్తున్న ఫిర్యాదులపై విచారణకు 4 మహిళా ముగ్గురు పురుష ఐపిఎస్‌లతో ‘సిట్’ ఏర్పాటు చేసింది. ఈ ‘సిట్’ తనకు తానుగా ఫిర్యాదులు నమోదు చేయదని, ఫిర్యాదులను పరిశీలిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో అంతా మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారంగా ఇది మిగలనుందని విమర్శలు వస్తున్నాయి.మేము న్యాయపోరాటాలు చేయలేంఫిర్యాదులు చేస్తున్న మహిళలు ‘మేము కేసులు పెట్టి కోర్టులు చుట్టు తిరగలేం’ అని చెప్పడం గమనార్హం. ‘మేం అంత పెద్దవారిని ఎదుర్కోలేం’ అని వారు అంటున్నారు. మలయాళ ఇండస్ట్రీలో ఉన్న 15 మంది శక్తిమంతులు పరిశ్రమలో ఎవరో పైకి రావాలో, ఎవరు వెనుక ఉండిపోవాలో నిర్ణయిస్తున్నారని హేమ కమిషన్ తెలియచేసింది. వీరు చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో మనలేని పరిస్థితి ఉందని కమిషన్ పేర్కొంది. ‘స్త్రీలను ఎందుకు ఇబ్బంది పెడతారు? అని ప్రశ్నించే పురుషులను కూడా బ్యాన్ చేస్తున్నారు’ అని తెలపడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ కందిరీగల తుట్టె ఏ మేరకు ఎవరిని కుట్టనుందో వేచి చూడాలి.కాంప్రమైజ్ – అడ్జస్ట్ఒక నటి సినిమా చేయడానికి అంగీకరించే ముందు మలయాళ పరిశ్రమలో వినిపించే రెండు పదాలు కాంప్రమైజ్, అడ్జస్ట్. వేషం తె ప్రొడక్షన్ మేనేజర్లు ‘రాజీ పడాలని’, ‘సర్దుకుపోవాలని’ కోరుతారు. ‘సరే’ అంటే వేషం. లేకుంటే లేదు. అంతటితో వదిలితే ఫరవాలేదు. కాని హేమా కమిషన్ ప్రకారం ఏ మహిళా ఆర్టిస్ట్ అయినా నో అంటే వెంటనే ఇండస్ట్రీ అంతటా వ్యాపిస్తుంది. ఆమెను ‘దారి’కి తెచ్చే పని ఇండస్ట్రీ అంతా తీసుకుంటుంది. ‘మా సారు (ఏ పెద్ద స్టారో దర్శకుడో ప్రొడ్యూసర్) అడిగితే కాదంటావా?’ అని ఎవరూ వేషం ఇవ్వరు. పస్తులతో మాడేలా చేస్తారు. అందుకే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ముందుకొచ్చి‘మహిళలు చేసే ఏ ఫిర్యాదునైనా సీరియస్‌గా తీసుకోవాలి’ అని బహిరంగంగా మాట్లాడాడుఫ్యాన్స్ ఆర్మీలైంగిక దుశ్చర్యలు ఎదుర్కొన్న మహిళలు బయటకు చెప్పేందుకు భయపడటానికి మరో కారణం ఈ పెద్ద నటులు ఫ్యాన్స్ ఆర్మీలను దాడికి పురిగొల్పుతుండటమే. ఏ హీరోను ఎవరేమన్నా వారి అభిమానులు సోషల్ మీడియాలో బూతులు జోడిస్తూ మీమ్స్ తయారు చేస్తుండటంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. కొన్నిసార్లు భౌతికంగా దాడి చేస్తారనే భయం కూడా సృష్టిస్తున్నారు. అందుకే హేమా కమిషన్ ఫ్యాన్స్‌ను కట్టడి చేయాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచించింది.తలుపు విరిగేలా బాదుతారు‘ఔట్‌డోర్ షూటింగ్లో అర్ధరాత్రి తాగేసి వచ్చి తలుపు విరిగేలా బాదుతారు. అందుకే ఔట్‌డోర్‌లో కుటుంబ సభ్యులను తోడు తీసుకొని వెళ్లాల్సి వస్తోంది’ అని చాలామంది మహిళా ఆర్టిస్టులు హేమా కమిషన్‌కు చెప్పారు. వేషం ఇచ్చేటప్పుడే ‘అడిగితే అంగీకరించాలనే’ డిమాండ్ ప్రోడక్షన్ మేనేజర్ చల్లగా చెపాడని తెలియచేశారు.మోహన్‌లాల్ రాజీనామా30 ఏళ్ల చరిత్ర కలిగిన ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ) అధ్యక్ష పదవికి నటుడు మోహన్‌లాల్ రాజీనామా చేశారు. మలయాళ పరిశ్రమలో స్త్రీలపై సాగుతున్న లైంగిక దోపిడిని జస్టిస్ హేమా కమిషన్ బయట పెట్టాక వినవచ్చిన ఆరోపణల్లో ‘అమ్మ’ జనరల్ సెక్రటరీ సిద్దిఖీతో పాటు మరికొందరి పేర్లు ఉన్న దరిమిలా నైతిక బాధ్యత వహిస్తూ మొత్తం 17 మంది సభ్యులున్న కార్యవర్గం రాజీనామా చేసింది. హడావిడిగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ మీటింగ్‌లో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మమ్మల్ని విమర్శకు, దిద్దుబాటుకు లోను చేసినందుకు కృతజ్ఞతలు’ అని రాజీనామా లేఖలో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ మోహన్‌లాల్, మమ్ముట్టి తదితర సూపర్స్టార్లు హేమా కమిషన్ గురించి ఏమీ మాట్లాడక΄ోవడాన్ని ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ (డబ్లు్యసిసి) తప్పుబట్టింది. మలయాళ రంగంలోని మహిళా నటీమణులు ‘అమ్మ’తో విభేదించి ఈ గ్రూపును నియమించుకున్నారు. హేమా కమిషన్ రిపోర్టును బయటపెట్టమని ΄ోరాడింది వీరే. ‘తంగలాన్’ నటి ΄ార్వతి తిరువోతు ఈ గ్రూప్‌లో చురుగ్గా పని చేస్తోంది. మెంబర్‌షిప్‌కు వెళ్లినా‘మూడు సినిమాల్లో నటిస్తే అమ్మలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. దానికోసం నేను ఫోన్ చేస్తే ఆ పనులు చూసే సభ్యుడు తన ఫ్లాట్‌కు రమ్మన్నాడు. నేను ఫ్లాట్‌కు వెళ్లి ఫామ్ ఫిలప్ చేస్తుంటే వెనుక నుంచి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఔట్‌డోర్ షూటింగ్ లో ఒక నటుడు నా రూమ్‌కు వచ్చి తలుపు తీసిన వెంటనే మంచం మీదకు లాగే ప్రయత్నం చేశాడు. ఇంకో నటుడు రెస్ట్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడూ వదల్లేదు. కావలించుకున్నాడు. ‘అడ్జస్ట్’ అవమని అందరూ చెప్పడమే. ఎంత అడ్జస్ట్ అవుదామని చూసినా ఇది భరించలేనంతగా ఉండటం వల్ల మలయాళ ఇండస్ట్రీ వదిలిపెట్టి చెన్నైకి మారి΄ోయాను’ అని నటి మీను మునీర్ ఫేస్బుక్లో రాసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఈమె ఈ వివరాలు తెలిపింది. – ఫ్యామిలీ డెస్క్ -
మలయాళ ఇండస్ట్రీలో మరో కుదుపు.. ఒకేసారి 17 మంది రాజీనామా
మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ రీసెంట్గా ఓ నివేదిక సమర్పించింది. ఇందులో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మలయాళ సినిమాల్లో పనిచేసే మహిళలు.. క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఈ వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది. తాజాగా మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ముకుమ్మడి రాజీనామా చేశారు.(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న 'ప్రేమలు' నటుడు)అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ నటుడు మోహన్ లాల్ తొలుత రాజీనామా చేయగా.. పాలక మండలిలోని మిగిలిన సభ్యులందరూ ఇదే ఫాలో అయిపోయారు. ఈ మేరకు 'అమ్మ' సంఘం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడమే దీనికి కారణం. దీంతో వీళ్లంతా నైతిక బాధ్యతగా రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. అలానే రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి, కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.అమ్మ సంఘంలో నటులు జగదీశ్, జయన్ చేర్తలా, బాబురాజ్, కళాభవన్ షాజన్, సూరజ్ వెంజారమూడు, టొవినో థామస్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. తాజాగా జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ నివేదిక విడుదల చేసిన అనంతరం.. దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో మలయాళ చిత్రసీమలో ప్రస్తుతం గందరగోళ వాతావరణం నెలకొంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే) -
ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీల వల్ల బోలెడు ఉపయోగాలు. ఇందుకు తగ్గట్లే పలు భాషల్లో డబ్బింగ్ చిత్రాలన్నీ నేరుగా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. అలా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు. గతేడాది రిలీజైన 'నల్ల నిళవుల రాత్రి' చిత్రాన్ని 'కాళరాత్రి' పేరుతో డైరెక్ట్ ఓటీటీలో తెచ్చేస్తున్నారు.(ఇదీ చదవండి: నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏ ఓటీటీల్లో ఉన్నాయ్?)బాబు రాజ్, చెంబన్ వినోద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'కాళరాత్రి'.. ఆగస్టు 17 అంటే ఈ శనివారమే ఓటీటీలోకి రానుంది. మర్ఫీ దేవసి దర్శకత్వం వహించారు. ఒరిజినల్ లో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగులో అది కూడా నేరుగా ఓటీటీలోనే వచ్చేస్తుంది. కాబట్టి వీకెండ్లో మంచి ఆప్షన్ అవ్వొచ్చు.'కాళరాత్రి' విషయానికొస్తే.. ఓ స్నేహితుల బృందం. తక్కువ ధరకే వచ్చేస్తుందని 266 ఎకరాలని తోట కొనడానికి వెళ్తారు. తీరా చూస్తే తోట మధ్యలో గెస్ట్ హౌస్. దీంతో అక్కడ పార్టీ చేసుకుంటారు. అనూహ్య ఘటనలు జరిగి వీళ్లలో కొందరు చనిపోతారు. ఇంతకీ ఆ హత్యలకు కారణం ఎవరు? ఎందుకు ఎలా చనిపోతున్నారు అనేదే స్టోరీ. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు దీన్ని ట్రై చేయొచ్చు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?
కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా 'ఆట్టం' (మలయాళం) నిలిచింది. దీంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. అవార్డ్ వచ్చేంతలా ఈ సినిమాలో ఏముంది? ఇంతకీ ఏ ఓటీటీలో ఉందోనని తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.'ఆట్టం' విషయానికొస్తే.. కేరళలో ఓ నాటక బృందం. పనిచేసుకుంటూ వీలు దొరికినప్పుడు నాటకాలు ప్రదర్శించే 12 మంది. వీళ్లకి తోడు అంజలి (జరీన్ షిబాబ్) అనే అమ్మాయి. ఓసారి వీళ్ల ప్రదర్శన ఓ విదేశీ జంటకి తెగ నచ్చేస్తుంది. దీంతో తమ రిసార్ట్‌లో వీళ్లకు ఆతిథ్యమిస్తుంది. రాత్రంతా ఫుల్‌గా ఎంజాయ్ చేసి ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోతారు. తన గదిలో కిటికీ పక్కన పడుకున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఇంతకీ అంజలితో అలా ప్రవర్తించింది ఎవరు? దీన్ని ఎలా బయటపెట్టింది అనేదే స్టోరీ?(ఇదీ చదవండి: నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే?)మనుషులు పైకి కనిపించేంత మంచోళ్లు కాదు. ప్రతిఒక్కరిలోనూ రెండు ఫేస్‌లు ఉంటాయి. పైకి మంచిగా కనిపిస్తుంటారు కానీ కొన్నిసార్లు అవసరానికి తగ్గట్లే ప్లేట్ ఫిరాయించేస్తుంటారు. మంచోడిని అనిపించుకోవడం కోసం పక్కనోడిని తక్కువ చేసేలా మాట్లాడటానికైనా అస్సలు మోహమాటపడరు. ఇలా మనకు బాగానే తెలిసిన కాన్సెప్ట్‌తో తీసిన సినిమా 'ఆట్టం'.ఇందులో హీరోయిన్‌తో ఎవరు అసభ్యంగా ప్రవర్తించారో చెప్పే క్రమంలో మనిషి నైజం, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు దర్శకుడు స్టోరీ చెప్పిన విధానం.. వ్యక్తి మనకు నచ్చకపోతే అతడేం చేసినా మనకు నచ్చదని చూపించిన వైనం అలరిస్తుంది. అలానే అందరూ ఎవరికీ వాళ్లు ఆలోచిస్తారు కానీ బాధింపబడ్డ అమ్మాయి మానసిక పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోకపోవడం లాంటి సీన్లు మనిషి ఇప్పుడున్న కాలంలో ఎలా ప్రవర్తిస్తున్నాడో చెప్పకనే చెబుతాయి. (ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే) -
OTT: మలయాళ మూవీ ‘పేరడైజ్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘పేరడైజ్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ప్రముఖ దర్శకులు మణిరత్నం సమర్పించిన సినిమా ‘పేరడైజ్’. శ్రీలంక, ఇండియా రచయితలు కలిసి రాసిన కథతో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమాకు ప్రసన్న దర్శకుడు. రోషన్ మాథ్యూ, దర్శనా రాజేంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ ‘పేరడైజ్’ పూర్తిగా శ్రీలంకలో తీసిన సినిమా. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... ఓ జంట తమ ఐదో వివాహ మహోత్సవాన్ని జరుపుకోవడానికి శ్రీలంకలోని ఓ సుదూర గెస్ట్ హౌస్‌కు వెళుతుంది. ఆ గెస్ట్ హౌస్ కొండల మధ్యలో చాలా మారుమూల ప్రాంతంలో ఉంటుంది. దానికి దరిదాపులో ఓ చిన్న గ్రామం ఉంటుంది. వీళ్ళు వెళ్ళేటప్పటికీ శ్రీలంక దేశం మొత్తం ఉద్యమంతో ఉద్రిక్తత నెలకొని ఉంటుంది. ఈ జంట నివసిస్తున్న గెస్ట్ హౌస్‌లో ఓ రాత్రి దొంగతనం జరిగి వారి వస్తువులన్నీ దొంగలు ఎత్తుకెళ్తారు. ఆ దొంగలను పట్టుకునే క్రమంలో వీరు ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అన్నదే కథ. ఈ సినిమా మొత్తంలో స్క్రీన్‌ప్లే కొంత ల్యాగ్ అపించినా ఆఖరి ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించనిది. అలాగే సినిమా మొత్తంలో సీతమ్మ, హనుమంతులు తిరిగిన ప్రదేశాలు చూపించడం, వాటి వివరణ ఇవ్వడం బావుంది. సినిమా మొత్తం చాలావరకు గ్రీనరీ చూడవచ్చు. ఎందుకంటే లంక అనేది రావణుని పేరడైజ్ కాబట్టి. మరి... మీరు కూడా ఈ ‘పేరడైజ్’ని ప్రైమ్ వీడియోలో చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్.. ట్విస్టులు, క్లైమాక్స్ మాత్రం
ఓటీటీలోకి మరో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. పెద్దగా హడావుడి లేకుండానే నెటిజన్ల కోసం అందుబాటులోకి వచ్చేసింది. మర్డరీ మిస్టరీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ మలయాళంలో చిన్న సినిమాల్లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. పలువురు దర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఈ మూవీ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?మలయాళ ఇండస్ట్రీ ఈ ఏడాది ఫుల్ ఫామ్‌లో ఉంది. జనవరి నుంచి మొదలుపెడితే హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతోంది. అలానే చిన్న సినిమాలతోనూ అలరిస్తోంది. అలా జూన్‌లో థియేటర్లలో రిలీజైన మూవీ 'గోళం'. హీరోహీరోయిన్లతో పాటు దర్శకుడు కొత్తగా పరిచయమైన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: చైతూ- శోభిత నిశ్చితార్థం.. వీళ్లిద్దరూ తొలిసారి అక్కడే కలుసుకున్నారా?)థ్రిల్లర్ సినిమాలు తీసే జీతూ జోసెఫ్‌తో పాటు చాలామంది 'గోళం' చిత్రం చూసి మెచ్చుకున్నారు. ఇకపోతే ఈ సినిమా అంతా దాదాపు ఒకే బిల్డింగ్‌లో తీసినా స్క్రీన్ ప్లే, ట్విస్టులు బాగా పకడ్బందీగా రాసుకున్నారు. దీంతో ప్రేక్షకులకు ఇది నచ్చేసింది.'గోళం' విషయానికొస్తే.. ఓ కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు చూస్తుండగానే జాన్ అనే వ్యక్తిని చంపేస్తారు. పొలిటికల్‌గా పలుకుబడి ఉన్నోడు కావడంతో సంచలనమవుతుంది. ఈ కేసుని కొత్తగా పోలీస్ అయిన సందీప్ కృష్టకు అప్పజెబుతారు. అయితే ఆఫీసులో పనిచేసే వాళ్లలో ఒకరే ఈ హత్య చేసుంటారని సందీప్ అనుమానిస్తాడు. మరి కిల్లర్‌ని పట్టుకొన్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ రివ్యూ) -
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో హిట్ సినిమా ఓటీటీ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. గత నెలల థియేటర్లలోకి వచ్చిన 'వర్షంగల్కు శేషం' అనే మలయాళ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ మలయాళంలో మాత్రం మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)'హృదయం' మూవీతో హిట్ కొట్టిన ప్రణవ్ మోహన్ లాల్- వినీత్ శ్రీనివాసన్ కాంబో మరోసారి 'వర్షంగల్కు శేషం' అనే పీరియాడిక్ డ్రామా సినిమా కోసం కలిసి పనిచేశారు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన దీన్ని 80ల్లో సినిమా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మూవీస్‌కి రిలేట్ అయ్యే కథలంటే ఇష్టపడే వాళ్లకు ఇది కచ్చితంగా నచ్చేస్తుంది!'వర్షంగల్కు శేషం' కథ విషయానికొస్తే.. 80-90ల్లో కేరళ. వేణు(ధ్యాన్ శ్రీనివాసన్)కి చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి. వీటి ద్వారానే సంగీత విద్వాంసుడు మురళి (ప్రణవ్ మోహన్ లాల్)తో పరిచయమవుతాడు. ఇతడి టాలెంట్ చూసి మద్రాస్ వెళ్తే బాగుంటుంగదని వేణు సలహా ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్లిద్దరూ కలిసి చెన్నై (ఒకప్పటి మద్రాసు) వెళ్తారు. మురళి ప్రయత్నంతో వేణు దర్శకుడు అవుతాడు. కొన్ని కారణాల వల్ల స్నేహితుల మధ్య దూరం పెరుగుతుంది. అలాంటి వీళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా ఎలా చేశారు? చివరకు ఏమైంది? అనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
'పుష్ప' విలన్ క్రేజీ మూవీ.. 'ఆవేశం'తో హిట్ కొట్టాడు
సంక్రాంతి తర్వాత తెలుగులో పలు మీడియం రేంజ్ సినిమాలు రిలీజయ్యాయి. చాలావరకు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అద్భుతమైన హిట్ గా నిలిచింది మాత్రం 'టిల్లు స్క్వేర్'నే. మరోవైపు మలయాళ డబ్బింగ్ చిత్రాలు మాత్రం వరసపెట్టి హిట్స్ కొడుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో క్రేజీ మూవీ చేరినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా? దీని సంగతేంటి? (ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్) ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్.. రీసెంట్ టైంలో ఈ మలయాళ డబ్బింగ్ చిత్రాల గురించి తెలుగు ప్రేక్షకులు తెగ మాట్లాడుకున్నారు. మన దగ్గర రిలీజైతే చూసి ఆదరించడంతో పాట కోట్లకు కోట్లు కలెక్షన్స్ వచ్చేలా చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో 'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా ఒకటి చేరింది. 'ఆవేశం' అనే పేరున్న సినిమాతో హిట్ కొట్టేశాడు. తాజాగా మలయాళంలో రిలీజ్ కాగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 'ఆవేశం' కథ విషయానికొస్తే.. బెంగళూరులో చదువుకోవడానికి వచ్చిన ముగ్గురు కుర్రాళ్లు సీనియర్లతో ర్యాగింగ్ గొడవ కారణంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. సిటీలో పేరుమోసిన రౌడీ అయిన రంగాని కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా. ఇందులో రంగాగా చేసిన ఫహాద్ ఫాజిల్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టేశాడనే టాక్ వచ్చింది. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే రిలీజైన ఈ చిత్రంపై ఆల్రెడీ తెలుగు నిర్మాతల దృష్టి పడిందట. 'పుష్ప'తో ఫహాద్ కి ఆల్రెడీ తెలుగులో మార్కెట్ ఉంది కాబట్టి త్వరలో 'ఆవేశం' రిలీజ్ పక్కా ఉంటుందట. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు.. తెలుగులోనూ వస్తోన్న థ్రిల్లర్ మూవీ!
సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. మలయాళంలో రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో టాలీవుడ్ అభిమానుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఈ సంస్థ ఏప్రిల్ 6న రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. తెలుగు వర్షన్‌ను నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. కాగా.. 2006లో కొడైకెనాల్లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. తెలుగులోనూ అదే టైటిల్‌తో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 𝐓𝐡𝐞 𝐡𝐢𝐠𝐡𝐞𝐬𝐭 𝐠𝐫𝐨𝐬𝐬𝐢𝐧𝐠 𝐌𝐚𝐥𝐚𝐲𝐚𝐥𝐚𝐦 𝐟𝐢𝐥𝐦 - #ManjummelBoys is now coming to 𝐞𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧 𝐭𝐡𝐞 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐚𝐮𝐝𝐢𝐞𝐧𝐜𝐞 ❤️🔥 Grand release worldwide on April 6th. Telugu release by @MythriOfficial, @Primeshowtweets & @SukumarWritings ✨… pic.twitter.com/xDULaAgbVx — Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2024 -
బ్లాక్ బస్టర్ సినిమా పరువు తీసిన ప్రముఖ రచయిత
ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ అయిన మలయాళ సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. అందరూ ఈ సినిమా గురించి ఆహా ఓహో అని తెగ పొగిడేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా దీని డబ్బింగ్ వెర్షన్ ఎప్పుడు విడుదలవుతుందా అని చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ రచయిత జయమోహన్ ఏకిపారేశారు. ఇదో చెత్త సినిమా, కేరళ వాళ్లంతా లోఫర్స్ అని దారుణమైన విమర్శలు చేశారు. ఇంతకీ ఏమైంది? 2006లో తమిళనాడులోని కొడైకెనాల్ గుహలో కేరళ కుర్రాడు పడిపోయాడు. అప్పుడు కూడా వచ్చిన స్నేహితులు అతడిని రక్షించారు. ఇదే కథతో 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా తీశారు. ఇప్పటివరకు దీనికి రూ.150 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించిన కుర్రాళ్లంతా మందు తాగుతూ, జల్సా చేస్తూ ప్రమాదానికి గురవుతారు. ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకుని, రచయిత జయమోహన్ ఘోరమైన విమర్శలు చేశారు. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) రచయిత ఏమన్నారు? 'కేరళ అడవుల్లో, అక్కడి యువకులు తాగి పడేసిన మందు బాటిల్స్ విరగ్గొడుతున్నారు. ఆ పెంకులు గుచ్చుకుని చాలా ఏనుగులు చనిపోతున్నాయి. మలయాళ టూరిస్టులు ఎక్కడికెళ్లినా అలాంటి పనులే చేస్తారు. తాగి నిషేధిత ప్రాంతంలోకి వెళ్లి లోయలో పడటాన్ని చాలా గొప్పగా చూపించడం ఓ చెత్త పని. అదో చెత్త సినిమా. నా దృష్టిలో 'మంజుమ్మల్ బాయ్స్'.. ఓ పనికిమాలిన మూవీ' అని జయమోహన్ విమర్శించారు. రైటర్ జయమోహన్ వ్యాఖ్యలపై సగటు కేరళ ప్రేక్షకుడు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఎవరో కొందరు చేసిన పనికి ఇలా అందరినీ ఆపాదించి చెప్పడం సరికాదని అంటున్నారు. ఏదేమైనా అందరూ హిట్ అని తెగ మురిసిపోతున్న 'మంజుమ్మల్ బాయ్స్'పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి జయమోహన్ వార్తల్లో నిలిచారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఈ మధ్య మలయాళ సినిమాలు సెన్సేషన్ సృష్టించాయి. ఫిబ్రవరిలో రిలీజైన నాలుగు మూవీస్ కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అందులో ఒకటే 'అన్వేషిప్పిన్ కండేతుమ్'. పోలీస్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం? (ఇదీ చదవండి: 'ప్రేమలు' సినిమా రివ్యూ) కథేంటి? ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) చింగావనం అనే ఊరిలో సబ్ ఇన్స్పెక్టర్. లవ్ లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు తన దగ్గరకు వస్తుంది. చాలా చాక్యంగా అన్ని ఆధారాలతో నేరస్తుడిని పట్టుకుంటారు. కానీ ఊహించని విధంగా అతడు పోలీసులు కళ్లముందే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దీంతో ఆనంద్ & టీమ్‌పై సస్పెన్షన్ వేటు. కొన్నాళ్లకు అనధికారికంగా ఆనంద్ టీమ్ దగ్గరకు మరో కేసు వస్తుంది. శ్రీదేవిని అమ్మాయి మర్డర్ కేసు ఇది. అందరూ చేతులెత్తేసిన ఈ కేసుని ఆనంద్ టీమ్ ఎలా పరిష్కరించింది? ఇంతకీ నిందుతుడు ఎవరనేదే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' స్టోరీ. ఎలా ఉందంటే? థ్రిల్లర్ సినిమా అనగానే.. మిస్సింగ్ లేదా మర్డర్ కేసు. దొంగని పట్టుకోవడానికి ఓ పోలీసు ఆఫీసర్. సవాళ్లు, పలువురు వ్యక్తులపై అనుమానం. చివరకు నిందుతుడు ఎలా దొరికాడు? అనేదే మీకు గుర్తొస్తుంది. చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఎవరెంత గ్రిప్పింగ్‌గా తీశారా అనేదే ఇక్కడ పాయింట్. ఆ విషయంలో 'అన్వేషిప్పిన్ కండేతుమ్' మూవీ డిస్టింక్షన్లో పాస్ అయిపోయింది. ఒక్క టికెట్ మీద రెండు సినిమాలు అన్నట్లు ఈ చిత్రంలో హీరో రెండు కేసుల్ని సాల్వ్ చేస్తాడు. సస్పెన్షన్‌లో ఉన్న హీరో.. ఎస్పీ ఆఫీస్‌కి రావడంతో సినిమా ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తుంది. ఎస్సైగా ఆనంద్.. పోలీస్ స్టేషన్లో జాయిన్ కావడం, కొన్నాళ్లు గడవడం.. ఓ రోజు లవ్లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు వస్తుంది. ఇంటి పరిసరాల్లో వెతకగా ఆ అమ్మాయి శవం దొరుకుతుంది. ఎవరు చంపారు? ఎందుకు చంపారు అనేది ఫస్టాప్ అంతా చూపించారు. నిందితుడు విషయంలో ఓ షాకింగ్ ఘటన జరగడంతో ఇంటర్వెల్ పడుతుంది. ఈ సంఘటన.. ఆనంద్ & టీమ్‌ని ఇబ్బందుల్లో పడేస్తుంది. అదే టైంలో మరో అమ్మాయి మర్డర్ కేసు వీళ్ల దగ్గరికి వస్తుంది. దీన్ని చేధించడం అంతా సెకండాఫ్‌లో ఉంటుంది. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) ఈ సినిమాలో మర్డర్ కేసు.. దొంగ దొరకడం అనే పాయింట్ చూపిస్తూనే.. పోలీస్ వ్యవస్థలో జరిగే రాజకీయాల్ని కూడా చూపించారు. 1980-90 కాలమానాన్ని తీసుకుని డైరెక్టర్ చాలా మంచి పనిచేశాడు. అప్పటి కాలానికి తగ్గట్లు డ్రస్సులు, ఇల్లు, వాతావరాణన్ని అద్భుతంగా క్రియేట్ చేశారు. అలానే హీరో పోలీసు అనగానే అనవసరమైన బిల్డప్పుల జోలికి పోకుండా స్టోరీకి తగ్గట్లు సినిమా తీశారు. దర్యాప్తు చూపించే విధానంగా మిమ్మల్ని ఎటు డైవర్ట్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా చూసేలా చేస్తుంది. సాధారణంగా ఓ సినిమాలో ఒక్క కథ మాత్రమే ఉంటుంది. ఇందులో ఇంటర్వెల్ ముందు ఒకటి. తర్వాత ఒకటి ఉంటుంది. అంటే ప్రేక్షకులకు డబుల్ ధమాకా. ఎవరెలా చేశారు? అంకిత భావంతో పనిచేసే ఎస్సై ఆనంద్‌గా టొవినో థామస్ ఆకట్టుకున్నాడు. పాత్రకు ఎంత కావాలో అంత చేశాడు. మిగతా పాత్రధారులందరూ కూడా సినిమాకు తగ్గట్లు చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇందులో హీరోయిన్లు లాంటి వాళ్లు ఎవరూ లేకపోవడం రిలాక్సింగ్ విషయం. రెండు వేర్వేరు కేసుల్లో డిఫరెంట్ యాక్టింగ్ తో టొవినో ఆకట్టుకున్నాడు. ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ డార్విన్ కురియాకోస్ ఫెర్ఫెక్ట్ థ్రిల్లర్ సినిమాని ప్రేక్షకులకు అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. ఓ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. సినిమా చూస్తున్నంతసేపు మీకు కూడా ఓ టెన్షన్ క్రియేట్ అవుతుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ కూడా బ్యూటీఫుల్. ఆర్ట్ డిపార్ట్మెంట్ 1980 వాతావరణాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించింది. ఓవరాల్‌గా చెప్పుకుంటే ఓ మంచి థ్రిల్లర్ చూసి చాలారోజులైంది అనుకుంటే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' ట్రై చేయండి. పక్కా నచ్చేస్తుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
100 కోట్ల కలెక్షన్ సూపర్ హిట్ సినిమా.. ఏ ఓటీటీ సంస్థ కొనట్లేదు!
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓటీటీ సంస్థల లెక్కలు మారిపోయాయి. అప్పట్లో ఎగబడిపోవట్లేదు. కోట్లు పెట్టి సినిమాలు కొనేసి చేతులు కాల్చుకోవట్లేదు. ఇప్పుడు దీని వల్ల కొన్ని హిట్ చిత్రాలకు కూడా తలనొప్పులు ఎదురవుతున్నాయి. కొన్నిరోజుల ముందు థియేటర్లలోకి వచ్చిన మలయాళ చిత్రం 'మంజుమ్మల్ బాయ్స్' సూపర్ హిట్ అయింది. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కానీ దీని ఓటీటీ లెక్క మాత్రం ఇంకా తెగట్లేదట. ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర 'హనుమాన్' రచ్చ లేపింది. ఫిబ్రవరిలో మాత్రం టాలీవుడ్ సౌండ్ పూర్తిగా తగ్గిపోయింది. మరోవైపు ఇదే ఫిబ్రవరిలో మలయాళంలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నాయి. వీటిలో ఒకటే 'మంజుమ్మల్ బాయ్స్'. కేరళలోని మంజమ్మల్ అనే ఊరిలోని కొందరు కుర్రాళ్లు.. కొడైకెనల్ ట్రిప్‌కి వెళ్తారు. ఇందులో ఒకడు అనుకోకుండా ఓ గుహలో పడిపోతాడు. మిగతా వాళ్లందరూ కలిసి ఈ ఒక్కడిని ఎలా కాపాడారు ఏంటనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) స్టోరీ సింపుల్‌గా అనిపిస్తున్నప్పటికీ.. సర్వైవల్ డ్రామా సినిమాగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంంటోంది. కేరళ, తమిళనాడులో దీనికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ వసూళ్లు, ఓవరాల్‌గా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఓటీటీ డీల్ మాత్రం ఇంకా తెగలేదట. మూవీ టీమ్ ఏమో రూ.20 కోట్ల వరకు అడుగుతుంటే.. పలు ఓటీటీ సంస్థలు మాత్రం రూ.10 కోట్లు మాత్రమే ఇస్తామని అంటున్నారు. ఇప్పటికే థియేటర్లలో 'మంజుమ్మల్ బాయ్స్'ని చాలామంది చూసేశారు. కాబట్టి ఓటీటీలో ఓ మాదిరి రీచ్ ఉంటుందని ఆయా సంస్థలు కారణాన్ని చెబుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాని తెలుగులో మార్చి 15న రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది. కానీ సౌండ్ పెద్దగా లేదు. తెలుగు డబ్బింగ్ విడుదలపై, అలానే ఓటీటీ స్ట్రీమింగ్పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) -
'అమీర్‌పేట్‌లో అలాంటి కోచింగ్ కూడా ఉంటే బాగుండు'..!
మలయాళంలో హిట్‌గా సినిమా తెలుగులో విడుదలకు సిద్ధమైంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ప్రేమలు'. కేరళలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. దీంతో డబ్బింగ్ చేసి టాలీవుడ్ ప్రేక్షకుల కోసం ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగు హక్కుల్ని దక్కించుకున్నారు. ట్రైలర్ చూస్తే తెలుగు ప్రేక్షకులకు సైతం కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇలాంటి రొమాంటిక్ ప్రేమకథ యూత్‌ను అలరించండం ఖాయంగా కనిపిస్తోంది.ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే అదే రోజున గోపీచంద్ 'భీమా', విశ్వక్ సేన్ 'గామి' చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. దీంతో ఈ వారం బాక్సాఫీస్ వద్ద సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ చేసే సినిమాలు రానున్నాయి. ప్రేమలు సినిమా కథ విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చేసిన సచిన్‌కి(నస్లేన్) యూకే వెళ్లాలనేది ప్లాన్. కానీ వీసా రిజెక్ట్ కావడంతో సొంతూరిలో ఉండటం ఇష్టం లేక ఫ్రెండ్‌తో కలిసి హైదరాబాద్‌కి వస్తాడు. ఇక్కడ ఓ పెళ్లిలో రీనూ(మమిత బైజు)ని చూసి ప్రేమలో పడతాడు. ఈ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా జాజ్ చేస్తుంటుంది. మరి వీళ్లిద్దరూ చివరకు ఒక్కటయ్యారా? ఈ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారనేది స్టోరీ.