మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జయరాం, అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అబ్రహాం ఓజ్లర్. ఈ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మార్చి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తాజాగా రివీల్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జయరామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
— Disney+ Hotstar (@DisneyPlusHS) March 1, 2024
Comments
Please login to add a commentAdd a comment