Mammootty
-
కొచ్చి టు ఢిల్లీ
మోహన్‌లాల్(Mohanlal), మమ్ముట్టి(Mammootty) హీరోలుగా మలయాళంలో ఓ భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్, కుంచకో బోబన్, ఆసిఫ్ అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. కాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో హీరోయిన్ నయనతార(Nayanthara) నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కొచ్చిలో జరుగు తోంది.ఈ మూవీ షూటింగ్లో నయనతార జాయిన్ అయ్యారని మేకర్స్ ఆదివారం ప్రకటించారు. అలాగే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఢిల్లీలో జరుగనుందని, ఈ షెడ్యూల్‌తో మేజర్ షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. మరోవైపు గతంలో ‘తస్కరవీరన్ (2005), రప్పకల్ (2005), భాస్కర్ ది రాస్కెల్ (2015), పుతియ నియమం (2016)’ వంటి చిత్రాల్లో మమ్ముట్టి–నయనతార స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
మోహన్‌లాల్ 'లూసిఫర్2' మూవీ టీజర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఆప్తుడి ఇంటి వేడుకలో మమ్మూటీ, దుల్కర్ల సందడి (ఫొటోలు)
-
పదహారేళ్ల తర్వాత...
మోహన్‌లాల్, మమ్ముట్టి కాంబినేషన్లో దాదాపు యాభైకి పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే 2008లో రిలీజైన ‘ట్వంటీ 20’ చిత్రం తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్ లెంగ్త్ సినిమా చేయలేదు. పదహారేళ్ల తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి ఓ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో ‘మాలిక్, టేకాఫ్, సీ యూ సూన్’ వంటి సినిమాలతో దర్శకుడిగా పేరు సంపాదించుకున్న మహేశ్ నారాయణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్ ఓ కీలకపాత్రలో నటిస్తుండగా, మరో కీలకపాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలో మొదలైంది. మమ్ముట్టి, మోహన్‌లాల్, కుంచాకోల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాదల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్‌లాల్ నటించారు. కానీ ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ది అతిథిపాత్ర. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న తాజా ఫుల్ లెంగ్త్ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. -
మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ సినిమా.. ఆ లిస్ట్‌లో ఏకంగా రెండో స్థానం!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ 'భ్రమయుగం'. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రాహుల్ సదాశివన్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్వైట్లోనే రూపొందించడం మరో విశేషం. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను దక్కించుకుంది.ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హారర్ ఫిల్మ్స్‌లో ఈ మూవీకి చోటు దక్కింది. ప్రముఖ మూవీ రివ్యూ రేటింగ్స్ ఇచ్చే లెటర్ బాక్స్ డీ సంస్థ తాజాగా జాబితాను రిలీజ్ చేసింది. 2024లో వచ్చిన బెస్ట్ 25 హారర్ ఫిల్మ్స్ లిస్ట్‌ను వెల్లడించింది. ఈ లిస్ట్‌లో మొదటిస్థానంలో ది సబ్‌స్టాన్స్ నిలవగా.. జపనీస్ మూవీ చిమే మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా డెడ్ టాలెంట్స్ సొసైటీ, యువర్ మాన్స్టర్, ఏలియన్ రొమ్యూలస్, ది గర్ల్ విత్ ది నీడిల్, స్ట్రేంజ్ డార్లింగ్, ఎక్స్హ్యుమా, ఐ సా ది టీవీ గ్లో చిత్రాలు టాప్-10లో నిలిచాయి. ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రద్ధాకపూర్ హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2 23వ స్థానం దక్కించుకుంది. (ఇది చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ)‘భ్రమయుగం’ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన దేవన్(అర్జున్ అశోకన్) మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిరి తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్), మరొకరు యజవానమి కుడుమన్ పొట్టి(మమ్ముట్టి). దేవన్‌కి కుడిమన్ పొట్టి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. తక్కువ కులం వాడు అని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన అతిథి అని తనతో సమానంగా చూడాలని వంట మనిషికి ఆదేశిస్తాడు.అయితే అక్కడ జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దేవన్ ఆ భవనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. అసలు కుడిమన్ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు. అతని గురించి అన్నీ తెలిసినా వంటమనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు? దేవన్ని బంధీగా ఎందుకు మార్చారు? చివరకు ఆ ఇంటి నుంచి దేవన్ తప్పించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే భ్రమయుగం చూడాల్సిందే. ప్రస్తుతం భ్రమయుగం సోనిలీవ్‌లో అందుబాటులో ఉంది.Letterboxd’s Top 10 Horror Films of 2024 (so far) 👻See the full list of The Official Top 25 Horror Films of 2024 here: https://t.co/x95L2cdqNZ pic.twitter.com/uL0wziJIMB— Letterboxd (@letterboxd) October 1, 2024 -
శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు
శ్రీలంక అడవుల్లో రిస్కీ ఫైట్స్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విజయ్ దేవరకొండ ఇటీవల శ్రీలంక వెళ్లొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య శ్రీలంకలో జరిగింది. అక్కడ ఓ భారీ రిస్కీ ఫైట్‌ని చిత్రీకరించారని సమాచారం. అటు బాలీవుడ్ వైపు వెళితే... అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో రానున్న హారర్ కామెడీ చిత్రంలోని కీలక సన్నివేశాలను శ్రీలంకలో చిత్రీకరిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దక్షిణాసియా చిత్రాలు కూడా లంకలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.లంకలో ప్యారడైజ్మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు మణిరత్నం సమర్పణలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ప్యారడైజ్’ను పూర్తిగా శ్రీలంకలోనే చిత్రీకరించారు. మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ ఇందులో హీరోగా నటిస్తే ప్రముఖ శ్రీలంక దర్శకుడు ప్రసన్న వితనకే డైరెక్ట్ చేశారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న మలయాళం మూవీని 30 రోజుల పాటు శ్రీలంకలోనే షూట్ చేయనున్నురు. ఈ చిత్రానికి లంక ప్రభుత్వం ఎంతటిప్రాధాన్యత ఇచ్చిందంటే నిర్మాత, దర్శకుడితో ఆ దేశ ప్రధానమంత్రి నినేష్ గుణవర్దెన నేరుగా చర్చలు జరిపారు. ఇక ఫ్యూచర్ప్రాజెక్ట్స్కు షూటింగ్ లొకేషన్ గా శ్రీలంకను ఎంచుకోవాలని మలయాళ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ భావిస్తోంది.ఇండియన్ సినిమాకి రెడ్ కార్పెట్ఒకప్పుడు శ్రీలంకలో సినిమా షూటింగ్స్ వ్యవహారం ఓ ప్రహసనంలా సాగేది. దేశ, విదేశీ సినిమాల షూటింగ్స్ అనుమతుల కోసం 41 ప్రభుత్వ విభాగాలను సంప్రదించాల్సి వచ్చేది. దీంతో భారత్‌తో పాటు ఇతర దేశాల చిత్ర నిర్మాతలు లంక లొకేషన్స్ కు దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు 2022 నాటి ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని రోడ్డున పడేసింది. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పునర్నిర్మించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. అప్పటివరకు టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉన్న శ్రీలంకకు పర్యాటకులు రావడం కూడా తగ్గిపోయింది.దేశాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నో మార్గాలు అన్వేషించిన లంక పాలకులకు భారతీయ సినీ రంగుల ప్రపంచం జీవనాడిలా కనిపించింది. మళ్లీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సినిమా షూటింగ్స్‌తో దేశాన్ని కళకళలాడేలా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సినిమా షూటింగ్స్ కోసం తమ దేశంలో అడుగుపెట్టే ఎవరికైనా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్నిప్రారంభించింది. ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ కోసం అనుమతులను వేగవంతం చేసింది. భారతీయ సినీ ప్రముఖులకు అక్కడి టూరిజం ప్రమోషన్ బ్యూరో రెడ్ కార్పెట్ పరిచింది. దీంతో ఇండియన్ మూవీ షూటింగ్స్‌కు శ్రీలంక కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయిందిఆర్థిక అస్త్రంగా...ఫిల్మ్ టూరిజాన్ని లంక ప్రభుత్వం ఆర్థిక అస్త్రంగా ఎంచుకోవడం వెనక మరో కారణం కూడా ఉంది. ఇండియన్ మూవీస్ అంటే సింహళీయుల్లో విపరీతమైన క్రేజ్. బాలీవుడ్‌తో పాటు ఇతర భారతీయ చిత్రాలు లంక థియేటర్స్‌లో నిత్యం స్క్రీనింగ్ అవుతాయి. షూటింగ్స్ కోసం భారతీయ సినీ ప్రముఖులు లంక బాటపడితే దేశ పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపు వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతుంది. లంక ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికకు తగ్గట్టుగానే షూటింగ్స్ కోసం ఇండియన్ డైరెక్టర్స్,ప్రోడ్యూసర్స్ లంక వైపు చూస్తున్నారు. ఆ దేశం కల్పించే ప్రత్యేక సదుపాయాలను ఉపయోగించుకుంటూ అందమైన లంక లొకేషన్స్ ను షూటింగ్ స్పాట్స్‌గా మార్చేశారు. ఒక రకంగా లంక ఎకానమీకి భారతీయ చిత్ర పరిశ్రమ వెన్నెముకగా మారిపోయింది. – ఫణికుమార్ అనంతోజు శ్రీలంక పిలుస్తోంది.... రారమ్మంటోంది.... అందుకే ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిల్మ్స్ శ్రీలంకకు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్... ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీలంక వైపు చూస్తోంది. సినిమా షూటింగ్స్ కోసం ఏకంగా శ్రీలంక ప్రధానమంత్రితో కూడా భారతీయ సినీ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఒకప్పుడు విదేశాల్లో షూటింగ్స్ అంటే అమెరికాతో పాటు యూరప్ దేశాల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా రూటు మార్చింది. ఆ విశేషాల్లోకి...పచ్చందనమే... పచ్చందమనే పచ్చదనమే అన్నట్లు... శ్రీలంక గ్రీనరీతో అందంగా ఉంటుంది. పాటల చిత్రీకరణకు బెస్ట్ ప్లేస్. ఫైట్లు తీయడానికి దట్టమైన అడవులు ఉండనే ఉన్నాయి. అలాగే అబ్బురపరిచే చారిత్రక కట్టడాలూ, కనువిందు చేసే సముద్ర తీరం ఉన్నాయి. వీటికి తోడు భారతీయులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉండటంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌ను తమ దేశంవైపు తిప్పుకుంటోంది లంక సర్కార్. శ్రీలంకలో గతంలోనూ షూటింగ్స్ జరిగాయి. అక్కడ షూట్ చేయడం కొత్త కాకపోయినా ఆ దేశం భారతీయ చిత్ర నిర్మాణాలకు ఇప్పుడు సింగిల్ డెస్టినేషన్ గా మారిపోయిందని అనొచ్చు. 2022 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతున్న శ్రీలంక గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిల్మ్ టూరిజాన్ని ్రపోత్సహిస్తూ తమ దేశ ఎకానమీకి ఊతమిచ్చే ప్రయత్నాలు చేస్తోంది. -
పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో...
మలయాళ సినీ పరిశ్రమలో దిగ్గజ హీరోలైన మమ్ముట్టి, మోహన్ లాల్ దశాబ్దం తర్వాత మళ్లీ కలిసి నటించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేయనున్నారు. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలో త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. మమ్ముట్టి కంపెనీ, ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నాయి. 30 రోజుల పాటు శ్రీలంకలో ఈ చిత్రాన్ని షూట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మూవీ స్టోరీలైన్‌కి తగ్గట్టు షూటింగ్ లొకేషన్ పర్మిషన్ కోసం నిర్మాతలు శ్రీలంక ప్రధానమంత్రితో కూడా చర్చలు జరిపినట్టు కేరళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ శాతం షూటింగ్ శ్రీలంకలోనూ మిగతాది కేరళ, ఢిల్లీ, లండన్‌లోనూ జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. మమ్ముట్టి, మోహల్ లాల్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నారు దర్శకుడు మహేశ్ నారాయణ్. 50 చిత్రాల్లో భిన్న పాత్రల్లో కలిసి నటించి, ప్రేక్షకులను మెప్పించిన మమ్ముట్టి, మోహన్‌లాల్ చివరిగా 2013లో ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ అనే చిత్రంలో సిల్వర్ స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. -
అంతిమంగా సినిమా బతకాలి: మమ్ముట్టి
మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఈ నివేదికలో పేర్కొనడంతో ఇందుకు నైతిక బాధ్యత వహించి, ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధ్యక్షుడు మోహన్‌లాల్‌తో పాటు కమిటీ సభ్యులందరూ రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా హేమా కమిటీ నివేదికపై ఆల్రెడీ మోహన్‌లాల్ స్పందించారు. తాజాగా మరో అగ్రనటుడు మమ్ముట్టి ఈ అంశం గురించి సోషల్ మీడియాలో సుధీర్ఘమైనపోస్ట్ను షేర్ చేశారు. ఈపోస్ట్ సారాంశం ఈ విధంగా...⇒ ఓ సంస్థకు సంబంధించి ఒక విధానం ఉంటుంది. మొదట నాయకత్వం స్పందించిన తర్వాతే సభ్యులు మాట్లాడితే బాగుంటుంది. ప్రస్తుతం నేను ‘అమ్మ’లో సభ్యుడిని మాత్రమే. అందుకే నేను కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నాను. ⇒సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం. సమాజంలో జరుగుతున్న మంచి చెడులు సినిమాల్లోనూ ఉంటాయి. అయితే సినిమాలపై సమాజం దృష్టి చాలా దగ్గరగా ఉంటుంది. జరుగుతున్న ప్రతి అంశాన్ని గమనిస్తుంటారు. ఒక్కోసారి చిన్న అంశాలు కూడా పెద్ద స్థాయి చర్చలకు కారణమవుతుంటాయి. అందుకే ఇండస్ట్రీలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ఇండస్ట్రీ వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ⇒ ఓ దురదృష్టకర సంఘటన (2017లో జరిగిన దిలీప్– భావనా మీనన్‌ల ఘటనను ఉద్దేశించి కావొచ్చు) జరిగిన నేపథ్యంలో ఇండస్ట్రీపై అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని నియమించింది. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేలా ఆ నివేదికలో పేర్కొన్న సూచనలు, సలహాలు, పరిష్కారాలను స్వాగతిస్తున్నాం. అయితే ఈ అంశాలను అమలు చేయడానికి మలయాళ చిత్ర పరిశ్రమలో అన్ని అసోసియేషన్లు ఏకతాటి పైకి రావాలి. ఇక హేమా కమిటీ పూర్తి నివేదిక కోర్టులో ఉంది. కమిటీకి అందిన ఫిర్యాదులపైపోలీసులు నిజాయితీగా విచారణ చేస్తున్నారు. దోషులను కోర్టు శిక్షిస్తుంది. హేమా కమిటీ సిఫార్సులు అమ్మలయ్యేలా చట్టపరమైన కార్యాచరణ జరగాలి... అంతిమంగా సినిమా బతకాలి. -
హేమ కమిటీపై 'మమ్ముట్టి' ఫస్ట్ రియాక్షన్ ఇదే
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించింది. అందులో పలు దిగ్భ్రాంతికర విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే మహిళలు చాలామంది క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక తెలిపింది. ఇప్పటికే మలయాళ పరిశ్రమలోని ప్రముఖులు చాలామంది పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రముఖ హీరో మమ్ముట్టి తొలిసారి స్పందించారు.మాలీవుడ్‌లో కొంతమంది అగ్ర నటులు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్న సమయంలో మమ్ముట్టి ఇలా స్పందించారు. హేమ కమిటీ నివేదికలో పేర్కొన్న సూచనలు, పరిష్కారాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. సినిమా షూటింగ్ సమయంలో మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా దర్శక నిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. హేమ కమిటీకి నా మద్దతు ఉంటుంది. చిత్రపరిశ్రమపై అద్యయనం చేసిన హేమ కమిటీ పలు సూచనలు ఇచ్చింది. వాటిని అమలు చేసే బాధ్యత అందరి మీద ఉంది. ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదులపై పోలీసుల విచారణ నిజాయితీగానే జరుగుతుంది. జస్టిస్ హేమ కమిటీ అందించిన రిపోర్ట్ కోర్టు వద్ద ఉంది. విచారణ పూర్తి అయిన తర్వాత నిందితులకు తగిన శిక్షను కూడా కోర్టు విధిస్తుంది. ఇండస్ట్రీలో 'పవర్ సెంటర్' అనేది లేదు. కానీ, సినిమా బతకాలి.' అనేది తన అభిప్రాంయ అని మమ్ముట్టి పేర్కొన్నారు. -
ఆయన అడిగిన ప్రశ్న ఎంతో బాధించింది: నటి అంజలి అమీర్
మలయాళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ మారిన హేమ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మాలివుడ్లో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ నుంచి పలు సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు హీరోయిన్లు, ఇతర నటులు గతంలో తమ చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా మలయాళ తొలి ట్రాన్స్‌జెండర్ నటి అంజలి అమీర్ తన అనుభవాలను పంచుకున్నారు.మలయాళ నటుడు నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అంజలి అమీర్ ఇలా పంచుకున్నారు. ' 2018లో మమ్ముట్టి నటించిన పెరున్బు అనే తమిళ సినిమాలో నేను కీలక పాత్ర పోషించాను. ఆ సినిమాలో సూరజ్ వెంజరమూడ్ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన నుంచి నాకు ఒక ప్రశ్న ఎదురైంది. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు స్త్రీలలాగా ఎలా సుఖం పొందుతారని సూరజ్ వెంజరమూడ్ నన్ను ప్రశ్నంచారు. అప్పుడు నేను చాలా కలత చెందాను. ఆయన అడిగేంత వరకు, నేను అలాంటి బాధాకరమైన అనుభవాలను ఎప్పుడూ ఎదుర్కోలేదు. నేను బలంగా ఉన్నాను, కానీ ఈ ప్రశ్న నాకు చాలా కోపం తెప్పించింది. అతడిని హెచ్చరించి మమ్ముట్టికి, దర్శకుడికి తెలియజేశాను. ఆపై వెంటనే సూరజ్ వెంజరమూడ్ క్షమాపణలు చెప్పాడు. మరలా నాతో అలా మాట్లాడలేదు. నేను ఆయన్ను అభినందిస్తున్నాను.' అని అంజలి అమీర్ అన్నారు. సూరజ్ వెంజరమూడ్ టాలీవుడ్‌కు పరిచయమే.. డ్రైవింగ్ లైసెన్స్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, జనగణమన చిత్రాలతో పాటు నాగేంద్రన్స్ హానీమూన్స్ వెబ్ సిరీస్‌తో ఆయన తెలుగు వారికి దగ్గరయ్యాడు.ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఇతరుల పట్ల గౌరవంగా ఉంటారని అంజలి పేర్కొంది. అన్ని విభాగాల్లో మాదిరి ఇక్కడ కూడా మంచివాళ్లతో పాటు చెడువాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ కొందరు మాత్రమే కాంప్రమైజ్‌లు, ఫేవర్లు అడిగేవాళ్లు ఉన్నారని అంజలి పేర్కొంది. -
జాతీయ అవార్డులు: ఆ స్టార్ హీరో సినిమా ఒక్కటీ పంపలేదు
జాతీయ అవార్డుల కోసం 300 చిత్రాల వరకు పోటీ.. కానీ అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా మమ్ముట్టి సినిమా లేదు. ఈ మాట అంటున్నది మరెవరో కాదు జాతీయ అవార్డు జ్యూరీ మెంబర్, దర్శకుడు ఎమ్బీ పద్మకుమార్. మమ్ముట్టి.. 2022 నుంచి గతేడాదివరకు దాదాపు తొమ్మిది సినిమాలతో అలరించాడు. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా జాతీయ అవార్డు కోసం పంపలేదు.ఒక్క సినిమా పంపలేదుదీని గురించి డైరెక్టర్ పద్మకుమార్ మాట్లాడుతూ.. మమ్ముట్టి నటించిన ఒక్క సినిమాను కూడా అవార్డుల కోసం పంపలేదు. జనాలు మాత్రం మళ్లీ ప్రభుత్వాన్ని తప్పుపడతారు. అసలు ఇలా ఎందుకు జరిగిందని మేము అడుగుతున్నాం. మమ్ముట్టి అద్భుత నటన కనబర్చిన సినిమాలను కూడా సబ్మిట్ చేయకపోవడం ఘోర తప్పిదం.మాలీవుడ్‌కు తీరని లోటుఇది కేవలం మమ్ముట్టికి మాత్రమే లోటు కాదు.. మలయాళ సినిమాకు కూడా తీరని లోటు అని పేర్కొన్నాడు. కాగా 2023లో వచ్చిన నాన్పకల్ నెరటు మయక్కం, కాతల్: ద కోర్ వంటి సినిమాలు మమ్ముట్టికి మరింత పేరు తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉంటే 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలు జాతీయ అవార్డు కోసం పోటీపడ్డాయి. జాతీయ అవార్డులుమలయాళ మూవీ ఆట్టమ్ ఉత్తమ చిత్రంగా నిలవగా రిషబ్ శెట్టి (కాంతార)ని ఉత్తమ నటుడు అవార్డు వరించింది. తిరుచిత్రాంబళమ్ మూవీకిగాను నిత్యామీనన్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. కార్తికేయ 2 ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. -
OTT: మమ్ముట్టి ‘టర్బో’ రివ్యూ
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన చిత్రం ‘టర్బో’. ఇదో సీరియస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. దీనికి దర్శకులు వైశాఖ్. డెబ్బై ఏళ్ళ పైబడి వయస్సులో ఉన్న మమ్ముట్టి ఈ సినిమాలో నలభై ఏళ్ల వ్యక్తిలా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించారు. టర్బో జోస్ (మమ్ముట్టి) తనకు సంబంధం లేని తగాదాల్లో తల దూరుస్తుంటాడు. అతనిది ఎవ్వరికీ భయపడని మనస్తత్వం... ఒక్క వాళ్లమ్మకు తప్ప. జోస్‌కి మంచి ఆప్తుడు జెర్రీ. జెర్రీకి సంబంధించిన ఓ సమస్యను పరిష్కరించడంలో జెర్రీని ప్రేమించిన నిరంజనకు జోస్ తారసపడి, అదే సందర్భంలో తన ఆప్తుడైన జెర్రీని పోగొట్టుకుంటాడు. అలాగే జెర్రీ సమస్య నగరంలో అసమాన్యుడి నుండి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ భయపడే వెట్రివేల్ షణ్ముగంతో ముడిపడి ఉంటుంది. దీంతో వెట్రివేల్‌తో టర్బో జోస్ పోరాడవలసి వస్తుంది. అసలు జెర్రీకి వచ్చిన సీరియస్ సమస్య ఏంటి ? జెర్రీ ఎలా చనిపోయాడు? వెట్రివేల్‌ను జోస్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది మాత్రం సోనీ లివ్ ఓటీటీæ తెరమీదే చూడాలి. టర్బో అంటే అదనపు శక్తి అన్నమాట. టైటిల్‌కి తగ్గట్టే సినిమాలో ఎలిమెంట్స్ అన్నీ అదనపు శక్తితో నడుస్తాయి. మమ్ముట్టి మంచి ఈజ్‌తో జోస్ పాత్రను రక్తి కట్టించారు. ఆ తరువాత చెప్పుకోవలసిన పాత్ర రాజ్ బి. శెట్టిది. ఇతనే వెట్రివేల్ షణ్ముగం. ఈ సినిమాలో ప్రతినాయకుడు. విలన్ పాత్రలో రాజ్ బి. శెట్టి చాలా విలక్షణంగా చేశారు. ఈ పాత్రలతో పాటు సినిమా మొత్తం యాక్షన్, కామెడీ సన్నివేశాలతో సీరియస్ కథను సరదా స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన విధానం అద్భుతం. వీకెండ్‌కి ఓ మంచి సినిమా ఈ ‘టర్బో’. – ఇంటూరి హరికృష్ణ -
'నేషనల్ అవార్డ్స్.. రేసులో స్టార్ హీరో
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం నేడు సాయింత్రం ప్రకటించనుంది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించనుంది. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ నేడు (ఆగష్టు 16) జాతీయ అవార్డు అందుకోనున్న వారి జాబితా మాత్రం విడుదల అవుతుందని సమాచారం ఉంది.ఎంపిక విధానం2022కు సంబంధించిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి జాతీయ అవార్డ్స్‌ను అందిస్తారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం వాస్తవానికి 3 మే 2023న నిర్వహించబడుతుందని అందరూ భావించారు. కరోనా తర్వాత ఈ అవార్డులకు సంబంధించిన షెడ్యూల్స్‌లో మార్పులు వచ్చాయి. దీంతో 2022కు సంబంధించిన సినిమాలకు నేడు విన్నర్స్ జాబితా విడుదల అవుతుంది. ఇదే ఏడాది అక్టోబర్‌లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డ్స్‌ను వారు అందుకుంటారు. 1 జనవరి 2022 నుంచి 31 డిసెంబర్ 2022 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా ధృవీకరించబడిన ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు మాత్రమే ఈ అవార్డుల పోటీకి అర్హత పొందాయి.ఉత్తమ హీరో రేసులో ఎవరున్నారు..?70వ జాతీయ అవార్డు వేడుకలో ఉత్తమ హీరోగా ఎంపిక అయింది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే, మమ్ముట్టి, రిషబ్ శెట్టి, విక్రాంత్ మాస్సే మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ రోషాక్, నాన్ పకల్ నేరత్తు మయక్కం అనే రెండు సినిమాలతో మమ్ముట్టి టాప్‌లో ఉన్నారు. కాంతార సినిమాతో రిషబ్ శెట్టి ఉంటే... 12th ఫెయిల్ సినిమా ద్వారా విక్రాంత్ మాస్సే తర్వాతి స్థానంలో ఉన్నారు. బాలీవుడ్ నుంచి పోటీలు ఉన్న ఏకైక హీరోగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే, ఈసారి కూడా సౌత్ ఇండియా హీరోకే అవార్డ్ దక్కుతుందని తెలుస్తోంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ హీరోగా అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. -
ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న మమ్ముట్టి హిట్ సినిమా
ఇతర భాషల్లో హిట్ అందుకున్న సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఓటీటీ వేదికలపైన ఇప్పటికే చాలా సినిమాలు విడుదల అయ్యాయి. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం అబ్రహామింతే సంతాతికల్ ఇప్పుడు తెలుగులో వచ్చేస్తుంది. మమ్ముట్టి నటించిన ఈ సినిమా డెరిక్ అబ్రహాం పేరుతో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. 2018లో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. సుమారు ఆరేళ్ల తర్వాత తెలుగు ఓటీటీలో విడుదల కానుంది.మమ్ముట్టి నటించిన డెరిక్ అబ్రహాం ఆగష్టు 10వ తేదీన తెలుగు ఆహా ఓటీటీలో విడుదల కానుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి షాజీ పాడూర్ దర్శకత్వం వహించారు. గుడ్‌విల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై టీఎల్ జార్జ్, జాబీ జార్జ్ నిర్మించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురిచేసే కథతో దీనిని తెరకెక్కించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో మమ్ముట్టి మెప్పించారు. సుమారు రూ. 5కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 45 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హత్యల కేసును ఏఎస్పీ డెరిక్ అబ్రహాం (మమ్ముట్టి) ఎలా పూర్తి చేశారనేది ప్రధానాంశంగా ఉంటుంది. ఆగష్టు 10వ తేదీన డెరిక్ అబ్రహాం చిత్రాన్ని ఆహా ఓటీటీలో చూసేయండి. -
ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్.. అయినా సంతోషం లేదట!
ఫిలింఫేర్ (సౌత్) 2024 అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం రాత్రి జరిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోని సినిమాలకు, నటీనటులకు పురస్కారాలు అందించారు. నాన్పకల్ నెరతు మయక్కమ్ సినిమాకుగానూ మలయాళ స్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు.ఇది 15వ అవార్డ్ఈ పురస్కారాన్ని అందుకుంటున్న సమయంలో మమ్ముట్టి ఎమోషనల్ అయ్యాడు. అవార్డు తీసుకుంటున్నందుకు అంత సంతోషంగా ఏమీ లేదన్నాడు. విక్రమ్, సిద్దార్థ్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న మమ్ముట్టి.. 'ఇది నా 15వ ఫిలింఫేర్ అవార్డ్.. ఈ మూవీలో నేను ద్విపాత్రాభినయం చేశాను. తమిళ్, మలయాళం మాట్లాడాను. ఈ చిత్రాన్ని నేనే నిర్మించాను. ఈ విజయాన్ని సాధించేందుకు తోడ్పడ్డ టీమ్‌కు కృతజ్ఞతలు.అందువల్లే ఈ బాధనిజానికి ఈ క్షణం నేనెంతో సంతోషంగా ఉండాలి. కానీ ఆ ఆనందమే లేకుండా పోయింది. కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరాశ్రులయ్యారు. ఆ ప్రమాదం మనసును కలిచివేస్తోంది. మీరు కూడా బాధితులకు ఎంతో కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాను' అని పిలుపునిచ్చాడు. కాగా మమ్ముట్టి వయనాడ్ బాధితుల కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.20 లక్షల విరాళం ప్రకటించారు.చదవండి: రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్'.. మ్యాడ్ ట్రైలర్ వచ్చేసింది! -
కేరళ కోసం విరాళాలు ప్రకటించిన స్టార్స్.. ఎవరెవరు ఎంత..?
కేరళలో భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఎక్కడ చూసిన నీటితో నిండిపోయిన నగరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో భారీ వర్షం వల్ల చాలామంది ఆశ్రయం కూడా కోల్పోయారు. యాన్ని ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటికే 200 మందికి పైగానే విగతజీవులుగా మారితే.. మరికొంత మంది ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పటికీ అనేకమంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఈ విపత్తులో కేరళను ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు.సౌత్ ఇండియా స్టార్ హీరో మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ సాయం చేసేందకు ముందుకొచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం కోసం మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ సల్మాన్ రూ. 15 లక్షలు కేరళ మంత్రి పి రాజీవ్‌కు అందజేశారు. ఇదే సమయంలో ఫహాద్ ఫాజిల్- నజ్రియా దంపతులు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ ఫాజిల్ తన నిర్మాణ సంస్థ ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ లెటర్ ప్యాడ్‌పై ముఖ్యమంత్రికి రాసిన లేఖను షేర్ చేస్తూ తెలియజేశాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రూ. 10 లక్షలు ప్రకటించారు. అయితే, ఇప్పటికే సూర్య, జ్యోతిక, కార్తీ రూ. 50 లక్షలు అందించగా.. విక్రమ్ రూ. 20 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ కోసం అండగా నిలబడుతున్న స్టార్ హీరోలను నెటిజన్లు అభినందిస్తున్నారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం టర్బో. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ మూవీగా మలయాళంలో తెరకెక్కించారు. మే 23న మలయాళంలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో మెప్పించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఆగస్టు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనిలివ్ ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో అంజనా జయ ప్రకాశ్, రాజ్ బి.శెట్టి, శబరీష్ వర్మ, సునీల్, కబిర్ దుహాన్ సింగ్‌లు కీలక పాత్రలు పోషించారు.Hold on to your seats as Mammootty takes you on a roller coaster ride of thrills and twists. Stream Turbo from August 9th only on Sony LIV.#Turbo #SonyLIV #TurboOnSonyLIV #Action #Mammootty #MammoottyKampany #Vysakh #MidhunManuelThomas pic.twitter.com/xhwBhfFxbk— Sony LIV (@SonyLIV) July 27, 2024 -
ఇండస్ట్రీ అంతా ఒక్క వెబ్ సిరీస్‌లో... ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో క్రేజీ అంటే క్రేజీ వెబ్ సిరీస్ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. ఇది ఎందుకు అంతలా స్పెషల్ అంటే.. ఏదైనా సినిమాలో గానీ సిరీస్‌లో మహా అయితే ఒకరిద్దరు స్టార్స్ నటిస్తారు. కానీ దీని కోసం మాత్రం దాదాపుగా ఇండస్ట్రీనే కదిలొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిరీస్‌లో అంతమంది స్టార్స్ ఉన్నారు. అసలు దీని సంగతేంటి? తాజాగా రిలీజైన ట్రైలర్ ఎలా ఉంది?(ఇదీ చదవండి: మ్యూజీషియన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)ఈ ఏడాది ఏ ఇండస్ట్రీకి లేనంత సక్సెస్ రేట్ మలయాళ చిత్రపరిశ్రమ దక్కించుకుంది. మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, భ్రమయుగం, ప్రేమలు.. ఇలా వరసపెట్టి సినిమాలు హిట్ కొట్టాయి. వందల కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్నాయి. స్వతహాగా మలయాళ సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఈ భాషలోని స్టార్ హీరోలైన మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ పాజిల్.. ఇలా టాప్ సెలబ్రిటీలు చాలామంది 'మనోరథంగల్' అనే వెబ్ సిరీస్ చేశారు.రెండేళ్లుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సిరీస్.. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 15 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ స్టార్ రైటర్ ఎమ్టీ వాసుదేవర్ నాయర్ రాసిన స్టోరీతో ఈ సిరీస్ తీశారు. 9 భాగాల అంథాలజీని 8 మంది డైరెక్టర్స్ తెరకెక్కించారు. ఇందులో మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతి తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ.. ఇలా దాదాపు టాప్ సెలబ్రిటీలు అందరూ నటించడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
అఖిల్ ఏజెంట్.. ఎట్టకేలకు వచ్చేస్తోంది!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది.అయితే ఈ మూవీ విడుదలై ఏడాది పూర్తయిన ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. గతంలో సోనీలివ్‌లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఈ నెలలో మరోసారి ఏజెంట్ సినిమా ఓటీటీకి వస్తోందంటూ టాక్ వినిపించింది. ఈసారి కూడా అభిమానులకు నిరాశే ఎదురైంది.తాజాగా చివరికీ బుల్లితెరపై సందడి చేసేందుకు ఏజెంట్ సిద్ధమైంది. ఈనెల 28న రాత్రి 8 గంటలకు గోల్డ్‌మైన్స్ టీవీ ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గోల్డ్‌మైన్స్ టెలీఫిల్మ్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్ట్‌గా టీవీల్లో చూసే అవకాశం దక్కింది. అయితే ఇది కేవలం హిందీ వర్షన్లో మాత్రమే టీవీల్లో సందడి చేయనుంది. #Agent (Hindi) @AkhilAkkineni8 | 28th July Sun 8 PM | Tv Par Pehli Baar Only On #Goldmines Tv Channel @mammukka #DinoMorea #SakshiVaidya @GTelefilms pic.twitter.com/UyBDijRU9f— Goldmines Telefilms (@GTelefilms) July 15, 2024 -
ఓటీటీకి మెగాస్టార్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ టర్బో. మే 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్ నటుడు సునీల్ మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ అగ్ర నటుడు రాజ్ బీ శెట్టి విలన్‌గా మెప్పించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు రిలీజైన రెండు నెలల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. ఆగస్టు 9 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మూవీని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ഒരു മാസ്സ് ആക്ഷൻ മമ്മൂട്ടി ചിത്രം!ടർബോ ഓഗസ്റ്റ് 9 മുതൽ Sony LIVൽA mass action entertainer starring Mammootty opposite Raj B Shetty!Turbo, coming on Sony LIV from August 9th#Turbo #SonyLIV #TurboOnSonyLIV #Mammootty #MammoottyKampany #Vysakh #MidhunManuelThomas #SamadTruth pic.twitter.com/LZ88S0wOxq— Sony LIV (@SonyLIV) July 10, 2024 -
మెగాస్టార్ సినిమాలో సమంత
-
కువైట్ అగ్ని ప్రమాదంపై కమల్, మమ్ముట్టి దిగ్భ్రాంతి
కువైట్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందడం పట్ల హీరోలు కమల్ హాసన్, మమ్ముట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 42 మంది భారతీయులు సహా మొత్తం 50 మంది మృత్యువాత పడ్డారు. బాధితుల్లో ఎక్కువమంది కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. వీరంతా ఉపాధి కోసం కువైట్ వెళ్లి అగ్నికి ఆహుతి అయ్యారు. குவைத் நாட்டின் மங்கஃப் நகரில் உள்ள அடுக்குமாடிக் குடியிருப்பில் நேரிட்ட தீ விபத்தில் இந்தியர்கள் உள்பட 50-க்கும் மேற்பட்டோர் உயிரிழந்த செய்தி மிகுந்த அதிர்ச்சியையும் வேதனையையும் அளிக்கிறது. உயிரிழந்தோர் குடும்பத்தினருக்கு ஆழ்ந்த இரங்கலையும், ஆறுதலையும் தெரிவித்துக் கொள்கிறேன்.…— Kamal Haasan (@ikamalhaasan) June 13, 2024 ఈ విషాద ఘటన పట్ల కమల్ స్పందిస్తూ.. ‘కువైట్‌లోని మంగాఫ్‌లో అపార్ట్మెంట్ అగ్నిప్రమాదంలో భారతీయులు సహా 50 మందికి పైగా మరణించారనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ ఘోర ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధిత భారతీయులకు అవసరమైన సహాయం అందించడానికి, మరణించిన వారి మృతదేహాలను మాతృదేశానికి తీసుకురావడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరుతున్నాను’అని కమల్ ట్వీట్ చేశాడు.Heartfelt condolences to the families of those affected by the Kuwait fire accident. I pray that you gather courage and find solace in this difficult time.— Mammootty (@mammukka) June 12, 2024‘కువైట్ అగ్ని ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో మీకు ధైర్యం, ఓదార్పునివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను’అని మమ్ముట్టి ఎక్స్‌లో రాసుకొచ్చాడు. -
మమ్ముట్టికి డైరెక్టర్ క్షమాపణలు.. ఎందుకంటే?
నటుడు విధార్ధ్, వాణి భోజన్ జంటగా నటించిన చిత్రం అంజామై. ఈ చిత్రం ద్వారా ఎస్వీ.సుబ్బురామన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు మోహన్‌రాజా, లింగుసామి వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. ప్రముఖ వైద్యుడు, ర చయిత తిరునావుక్కరసు నిర్మాతగా తిరుచిత్రం పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్రం విడుదల హక్కులను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్స్ పొందడం విశేషం. ఈ సంస్థ ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.చిత్ర దర్శకుడు సుబ్బురామన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం పరిస్థితుల ప్రభావంతోనే రూపొందిందని చెప్పాలన్నారు. ఈ చిత్ర నిర్మాత తిరునావుక్కరసు ఒక వైద్యుడు మాత్రమే కాకుండా, రచయిత, సామాజిక సృహ కలిగిన వ్యక్తి అని చెప్పారు. నిజానికి ఇందులో నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించాల్సిఉందని.. అందుకు ఆయన ఒప్పుకున్నా, అనివార్య కారణాల వల్ల ఆ పాత్రలో నటుడు రఘమాన్ను నటించాల్సి వచ్చిందని చెప్పారు. అందుకు ఈ సందర్భంగా మమ్ముటికి తాను క్షమాపణలు చెప్పుకుంటున్నానన్నారు. అయితే ఆ పాత్రలో రఘుమాన్ చాలా బాగా నటించారని చెప్పారు. చట్టం చేసే అధికారంలో ఉన్న ఒక వ్యక్తి కారణంగా ఒక సామాన్యుడు ఎలాంటి బాధలకు గురయ్యారనేదే ఈ చిత్ర కథాంశం అని చెప్పారు. విధార్ద్ మంచి నటుడన్నది తెలిందేననీ, అయితే ఆయన నుంచి మరింత నటనను వెలికి తీసినట్లు చెప్పారు. ఇక నటి వాణీభోజన్ ఈ చిత్రంలో మరో కోణంలో నటించారని చెప్పారు. నటి వాణిభోజన్ మాట్లాడుతూ అంజామై తనకు చాలా స్సెషల్ చిత్రం అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటుడు రఘుమాన్, కృతిక్ మోహన్, బాలచంద్రన్ ఐఏఎస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కార్తీక్ ఛాయాగ్రహణం, కళాచరణ్ నేపథ్య సంగీతాన్ని అందించారు. -
చివరి శ్వాస వరకు సినిమాల్లో ఉంటా.. కానీ నన్ను గుర్తుంచుకోరు: మమ్ముట్టి
మలయాళ స్టార్, మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మమ్ముట్టి. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల యాక్షన్-థ్రిల్లర్ 'టర్బో'చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి, సునీల్, అంజనా జయప్రకాష్, కబీర్ దుహన్ సింగ్, సిద్ధిక్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూకు హాజరైన మమ్ముట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన చివరి శ్వాస వరకు సినిమాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.మమ్ముట్టి మాట్లాడుతూ..'నా చివరి శ్వాస వరకు నటనను విడిచిపెట్టే ఆలోచనే లేదు. నా మరణం తర్వాత ప్రజలు నన్ను గుర్తుంచుకుంటారని ఆశించడం లేదు. ఎందుకంటే కాలక్రమేణా గొప్ప వ్యక్తులను కూడా ఎవరైనా మరచిపోతారనే విషయాన్ని గట్టిగా నమ్ముతా. అయినా ప్రజలు నన్ను ఎంతకాలం గుర్తుంచుకుంటారు? ఒక సంవత్సరం? పదేళ్లు? అంతకంటే చాలా తక్కువ. చాలా కొద్ది మంది మాత్రమే గుర్తుంచుకుంటారు. ఎందుకంటే వేలమంది నటీనటుల్లో నేను ఒక్కడిని." అని అన్నారు.వారు నన్ను ఏడాది కంటే ఎక్కువ కాలం ఎలా గుర్తుంచుకోగలరు? మనం ఈ ప్రపంచంలో లేనప్పుడు మన గురించి ఎలా తెలుస్తుంది? ప్రపంచం అంతం అయ్యే వరకు అందరూ గుర్తుంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎప్పటికీ జరగదు' అని అన్నారు. కాగా.. తన నటనతో ఇప్పటివరకు మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 1971లో ఇండస్ట్రీలో ప్రవేశించిన మమ్ముట్టి 400కు పైగా చిత్రాలలో నటించారు. 1973లో వచ్చిన ‘కాలచక్రం’లో సినిమాతో గుర్తింపు పొందారు. -
తండ్రికి విషెస్ చెప్పిన సీతారామం హీరో.. పోస్ట్ వైరల్!
సీతారామం మూవీతో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. అంతేకాదు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రంలో గుంటూరుకారం భామ మీనాక్షి చౌదరి అతనికి జంటగా కనిపించనుంది. తాజాగా దుల్కర్ సల్మాన్ తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇవాళ తన తల్లిదండ్రులు మమ్ముట్టి, సల్ఫత్ 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విషెస్ తెలిపారు. వారి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతే కాకుండా తన పేరేంట్స్ గురించి ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దుల్కర్ ఇన్స్తాలో రాస్తూ..'మీ ఇద్దరి 45 ఏళ్లబంధం ప్రపంచ లక్ష్యాలను అందిస్తున్నాయి. మీ సొంత మార్గాల్లో మికోసం చిన్న ప్రపంచాన్ని సృష్టించారు. మీలో నేను భాగమై మీ ప్రేమను పొందడం నా అదృష్టం. హ్యాపీ వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మా, నాన్న! మీరిద్దరూ కలిసి అత్యంత అసాధారణమైన వాటిని కూడా సాధిస్తారు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమాల విషయానికొస్తే నందమూరి బాలకృష్ణ, కెఎస్ రవీంద్రతో కాంబోలో వస్తోన్న చిత్రంలో దుల్కర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించనున్నారు. మరోవైపు దుల్కర్ సూరారై పొట్రు దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తోన్న పురాణనూరు చిత్రానికి సంతకం చేసినట్లు కూడా ప్రకటించారు. View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
అనంతపద్మనాభ ఆలయం గురించి డాక్యుమెంటరీ.. ఆ ఓటీటీలో ఉచితం
శ్రీ మహావిష్ణువు 108 దివ్యదేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం. కేరళలో ఉన్న ఈ క్షేత్రం గురించి చాలామందికి కొంత అవగాహన ఉంది. తాజాగా అనంతపద్మనాభ స్వామి ఆలయం గురించి 'ఒనవిల్లు: ది డివైన్ బో' పేరుతో ఒక ఆసక్తికరమైన డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు. తిరువనంతపురంలోని చలనచిత్ర నిర్మాతలు ఆనంద్ బనారస్, శరత్ చంద్ర మోహన్‌లు ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. మార్చి 8 నుంచి మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్ పడుతుండటం వల్ల ఈ డాక్యుమెంటరీని ఇతర భాష వారు కూడా చూస్తున్నారు. ఓనవిల్లు అంటే శ్రీ పద్మనాభస్వామి ఆలయ స్వామికి 'ఓనవిల్లు' అంటే ఉత్సవ విల్లును సమర్పిస్తారు. త్రివేండ్రంలోని విళైల్ వీడు కరమణ సంప్రదాయ కళాకారులు ఈ విల్లును తయారు చేస్తారు. వీరిని "ఒన్వవిల్లు కుటుంబం" అంటారు. ఈ విల్లును తయారు చేసే కుటుంబ సభ్యులు పనిని ప్రారంభించే ముందు 41 రోజుల తపస్సును పాటిస్తారు. ఆ వంశీయులు ఏడు తరాలుగా ఏటా ఓనవిల్లును తయారు చేస్తున్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ విశిష్టమైన సంప్రదాయ ఆచారం గురించి వచ్చిన ఈ డాక్యుమెంటరీలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి, యువ నటుడు ఉన్ని ముకుందన్లు వాయిస్‌ని అందించడం విశేషం. సంపదకు రక్షణగా ట్రావెన్కోర్ కొంతకాలం క్రితం అనంతపద్మనాభ ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. వెల కట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పటికీ ఒక గదిని ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసివుండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఈ గదిలో ఎంత సంపద ఉంటుందో ఎవరికీ తెలియని రహస్యం. -
ఓటీటీకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జయరాం, అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అబ్రహాం ఓజ్లర్. ఈ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మార్చి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తాజాగా రివీల్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జయరామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. pic.twitter.com/zMSmETJMBw — Disney+ Hotstar (@DisneyPlusHS) March 1, 2024 -
భారీగా 'భ్రమయుగం' కలెక్షన్స్.. బిగ్ మార్క్‌ను దాటేసిన మమ్ముట్టి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'భ్రమయుగం' సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కళ్లు చెదిరే కలెక్షన్స్‌తో రికార్డులు క్రియేట్ చేస్తుంది. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ అయింది. టాలీవుడ్లో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవలం మూడు పాత్రలతో అది కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అన్ని భాషలతో కలుపుకుని రూ. 50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సితార ఎంటర్టైన్మెంట్ వారు ప్రకటించారు. సినిమా పట్ల మంచి టాక్ రావడంతో రూ. 100 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుస హిట్లతో సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మమ్ముట్టి సత్తా చాటుతున్నాడు. భ్రమయుగం ఓటీటీ రైట్స్ కూడా సుమారు రూ. 25 కోట్లకు పైగా సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల హక్కులు మొత్తం సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలిసింది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతుంది. మార్చి చివరి వారంలో సోనీ లివ్‌లో భ్రమయుగం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Sithara Entertainments (@sitharaentertainments) -
ఖైదీలా స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
మమ్ముట్టి ఇప్పుడీ పేరు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంచలనం.. ఏడు పదుల వయస్సు ధాటినా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్ హీరో, మలయాళ మెగాస్టార్. 'యాత్ర' సినిమాతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పాత్రలో ఒదిగిపోయాడు.. తాజాగా 'భ్రమయుగం' సినిమాతో ప్రేక్షకులను మరీంత ఆశ్చర్యపరిచాడు. బ్లాక్ అండ్ వైట్‌లో మూడే పాత్రలతో 'భ్రమయుగం' సినిమా తీసి తన సత్తా ఎంటో నిరూపించాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా సాధ్యమేనా..? అనుకుంటే సాధ్యమే అని నిరూపించాడు. ఒక స్టార్ హీరో ఒక గే పాత్ర చేయడం అంటే అంత సులభం కాదు.. 'కాదల్ ది కోర్'లో చేశాడు మమ్ముట్టి. అందరి హీరోల మాదిరి కాకుండా కొత్తదనాన్ని, ప్రయోగాన్ని, వైవిధ్యాన్ని చూపుతు తనదైన స్టైల్లో సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఆయన నుంచి మరో సినిమా రాబోతుంది. 'టర్బో' పేరుతో మరో భిన్నమైన కథను తెరపైకి తీసుకురావడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ ప్రాజెక్ట్.. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్‌ను మమ్ముట్టి షేర్ చేశారు. పోలీసుస్టేషన్లో ఖైదీల మధ్యలో కూర్చుని కొత్త అవతారంలో మమ్ముట్టి కనిపించారు. ఈ లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇదే క్రమంలో ఆయన 'బజూక' అనే మరో విభిన్న చిత్రంలో నటిస్తున్నారు. గేమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. 'బజూక'లో బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న మమ్ముట్టి గడ్డంతో స్టైలిష్ లుక్‌లో ఉన్న పోస్టర్ ఇప్పటికే వైరల్ అవుతుంది. బజూక సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, సుమిత్ నావల్, సిద్దార్ధ్ భరతన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ సరిగమ బ్యానర్లపై డోల్విన్ కురియాకోస్ జిన్ వీ అబ్రహాం, విక్రం మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్ నిర్మిస్తున్నారు. -
Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ
టైటిల్: భ్రమయుగం నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్,సిద్ధార్థ్ భరతన్ నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ తెలుగు విడుదల:సితార ఎంటర్టైన్మెంట్స్ దర్శకత్వం: రాహుల్ సదాశివన్ సంగీతం: క్రిస్టో జేవియర్ సినిమాటోగ్రఫీ: షఫీక్ మహమ్మాద్ అలీ విడుదల తేది: 23 ఫిబ్రవరి 2024(తెలుగు) ‘భ్రమయుగం’ కథేంటంటే.. తక్కువ కులానికి చెందిన దేవన్(అర్జున్ అశోకన్) మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిరి తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్), మరొకరు యజవానమి కుడుమన్ పొట్టి(మమ్ముట్టి). దేవన్‌కి కుడిమన్ పొట్టి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. తక్కువ కులం వాడు అని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన అతిథి అని తనతో సమానంగా చూడాలని వంట మనిషికి ఆదేశిస్తాడు. అయితే అక్కడ జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దేవన్ ఆ భవనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. అసలు కుడిమన్ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు. అతని గురించి అన్నీ తెలిసినా వంటమనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు? దేవన్ని బంధీగా ఎందుకు మార్చారు? చివరకు ఆ ఇంటి నుంచి దేవన్ తప్పించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో భ్రమయుగం చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రయోగాలు చేయడంలో మమ్ముట్టి ఎప్పుడూ ముందుంటారు. మెగాస్టార్ అనే ఇమేజ్‌ని పక్కకి పెట్టి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. భ్రమయుగం కూడా మరో ప్రయోగాత్మక చిత్రమే. ఒక్క చిన్న పాయింట్‌తో రెండున్నర గంటల పాటు కథను నడిపించడం మాములు విషయం కాదు. దర్శకుడు రాహుల్ సదాశివన్ ఆ విషయంలో వందశాతం సక్సెస్ అయ్యాడు. సినిమా మొత్తం కేవలం మూడు పాత్రల చుట్టే తిప్పుతూ ఆడియన్స్‌ని సీట్ల నుంచి కదలకుండా చేశాడు. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కించి మెప్పించాడు. మమ్ముట్టి నటన.. క్రిస్టో జేవియర్ బీజీఎం సినిమా స్థాయిని పెంచేసింది. కథగా చూస్తే భ్రమయుగంలో కొత్తగా ఏమి ఉండడు. పాడుబడ్డ భవంతిలో ఓ మాంత్రికుడు..అతని చేతిలో బంధి అయినా ఓ ఇద్దరి వ్యక్తుల కథే ఇది. పాయింట్ చిన్నదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు.. వాటిని మలిచిన తీరు అద్బుతంగా ఉంది. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని సినిమా చివరి వరకు కొనసాగించాడు. సినిమాలో హార్రర్ ఎలిమెంట్స్ ఉన్నా అంతగా భయపెట్టవు. థ్రిల్లర్ ఎమిమెంట్స్తోనే కథనాన్ని ఆసక్తికరంగా సాగించాడు. సినిమా ప్రారంభం నెమ్మదిగా ఉంటుంది. పాత్రల పరిచయం వరకు కథ స్లోగా సాగుతుంది. పాడుబడ్డ భవన్‌లోకి తేవన్ వచ్చిన తర్వాత అక్కడే చోటు చేసుకునే కొన్ని సంఘటనలు ఉత్కంఠకు గురి చేస్తాయి. ఫస్టాఫ్ కొంచెం నెమ్మదిగా సాగినా.. కొన్ని సీన్స్ మాత్రం థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కురియన్ పొట్టి ఫ్లాష్ బ్యాక్.. చేతన్ స్టోరీ అవన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది. సినిమా మొత్తం కాస్త నెమ్మదిగా సాగినా.. భ్రమయుగం ఓ ఢిపరెంట్ థ్రిల్లర్ మూవీ. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం మమ్ముట్టి నటననే. కుడుమన్ పొట్టి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై కొత్త మమ్ముట్టిని చూస్తారు. సినిమా మొత్త ఒకే డ్రెస్‌లో కనిపించి తనదైన నటనతో మెప్పించాడు. క్లైమాక్స్‌లో ఆయన నటన అందరిని కట్టిపడేస్తుంది. దేవన్ పాత్రకు అర్జున్ అశోకన్ పూర్తి న్యాయం చేశాడు. సెకండాఫ్‌లో అయితే మమ్ముట్టిలో పోటీపడి నటించాడు. వంట మనిషిగా సిద్ధార్థ్ భరత్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యక్షి పాత్ర ఆసక్తిరేకించినా.. ఆ పాత్ర ప్రాధాన్యత ఏంటో తెరపై సరిగా చూపించలేకపోయారు. టెక్నికల్ పరంగా సినిమా అదరిపోయింది. క్రిస్టో జేవియర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. షఫీక్ మహమ్మాద్ అలీ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో సాగినా.. తెరపై ప్రతి సీన్ చాలా అందంగా కనిపించేలా చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తెలుగులోనూ బ్లాక్ అండ్ వైట్ హారర్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం భ్రమయుగం. మలయాళంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీని రాహుల్ సదాశివన్ దర్శకత్వం తెరకెక్కించారు. సరికొత్త పీరియాడిక్ హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించిన ఈ మూవీపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో తెలుగు వర్షన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 23న సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తెలుగులో టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు వర్షన్ విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని త్వరలోనే కన్నడ, తమిళ, హిందీ భాషల్లోను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ నటించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. -
మెగాస్టార్ సరికొత్త హారర్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'భ్రమయుగం'. ఈ చిత్రానికి 'భూతకాలం' ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ పోస్టర్స్ 'భ్రమయుగం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. చాలా కాలం తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ఈ సినిమా కథ కేరళలో మాయ/తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక సింగర్ జీవితంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముందుగా మలయాళం భాషలో మాత్రమే విడుదల చేయాలని తాజాగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. కాగా.. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతమందించారు. ఈ చిత్రంలో విలన్లు, హీరోలు లేరని మెగాస్టార్ మమ్ముట్టి అన్నారు. విలన్లు, హీరోలు అనే కాన్సెప్ట్ కూడా లేని కాలంలో 'భ్రమయుగం' తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనా పాత్ర చాలా మిస్టరీగా ఉంటుందని తెలిపారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో భాగమైనందుకు మమ్ముట్టి సంతోషం వ్యక్తం చేశారు. మమ్ముట్టి మాట్లాడుతూ.. 'గతంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చాలా వచ్చాయి. ఫ్లాష్‌బ్యాక్‌లను బ్లాక్ అండ్ వైట్‌లో చూపించేవాళ్లం. ఇప్పటికీ చాలా మంది చేస్తున్నారు. అయితే ఇలాంటి సినిమాల జోలికి వెళ్లకపోవడం వల్ల యువత పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో సినిమా చూడటం ఇప్పుడు కొత్త అనుభూతిని కలిగిస్తుంది' అని అన్నారు. -
విధితో ఆటలు.. భయపెడుతున్న మమ్మట్టి 'భ్రమయుగం' తెలుగు ట్రైలర్
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం 'భ్రమయుగం'. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్స్‌కి వచ్చే రోజు ఖరారైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్‌తో పాటు ట్రైలర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. భిన్నమైన హారర్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ నటించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘‘హారర్–థ్రిల్లర్ జానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా షెహనాద్ జలాల్ ఉంటే సంగీతం క్రిస్టో జేవియర్ అందించారు. సౌత్ ఇండియాలో విభిన్నమైన నటుడిగా మమ్ముట్టికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఆయనకు గతంలో జాతీయ అవార్డు కూడా దక్కింది. యాత్ర, యాత్ర-2 చిత్రాలతో ఆయన తెలుగువారికి మరింత చేరువయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా ఒదిగిపోయారని ఆయన్ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అభినందిస్తున్నారు. -
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన 'అబ్రహం ఓజ్లర్'. సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో జయరాం హీరోగా నటించారు. ఈ సినిమాలో మమ్ముట్టి సీరియల్ కిల్లర్‌గా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించారు. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.37 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి మిధున్ మాన్యుల్ థామస్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో జయరాం కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలెగ్జాండర్ జోసెఫ్ అనే సీరియల్ కిల్లర్ పాత్రలో మెగాస్టార్ మమ్ముట్టి కనిపించారు. కాగా.. జయరాం రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి వచ్చాయి. అబ్రహం ఓజ్లర్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజవ్వగా.. తెలుగు మూవీ గుంటూరు కారం మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు తండ్రిగా మెప్పించారు. ఈ సినిమాలో అనశ్వర రాజన్, అర్జున్ అశోకన్, అనూప్ మీనన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. భాగమతి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జయరాం.. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్‌లో కనిపించనున్నారు. -
Yatra 2 Movie Reveiw: యాత్ర 2 రివ్యూ
టైటిల్:యాత్ర 2 నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకి నారాయణ్,సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, శుభలేక సుధాకర్ తదితరులు నిర్మాణ సంస్థ: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ నిర్మాత: శివ మేక రచన-దర్శకత్వం: మహి వి. రాఘవ్ సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ:మది విడుదల తేది: ఫిబ్రవరి 8, 2024 దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ‘యాత్ర’. వైఎస్సార్ ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఐదేళ్ల క్రితం (2019) విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ యాత్ర 2. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాతక్మంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి వి.రాఘవ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తిని పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర 2 మూవీ ఎలా ఉందో చూద్దాం. కథేంటంటే.. యాత్ర 2 ఈవెంట్ బేస్డ్ బయోపిక్. వైఎస్సార్ మరణం అనంతరం, ఆయన తనయుడు, వైఎస్. జగన్మోహన్రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు.. ఆ పాదయాత్ర చేపట్టడానికి ఆయనని ప్రేరేపించిన సంఘటనలు, ఆ పాదయాత్ర కారణంగా ప్రజల కష్టాలని స్వయంగా తెలుసుకున్న ఉదంతాల సమాహారమే ‘యాత్ర 2’ కథ. వైఎస్సార్ మరణం (2009) తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రలు.. వాటన్నింటిని ఎదుర్కొన్ని వైఎస్ జగన్ ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. ఇది వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డిల కథ కాదు..వారి వ్యక్తిత్వానికి సంబంధించిన స్టోరీ. వైఎస్సార్ రాజకీయం ఎలా ఉంటుంది? ఆయనను నమ్ముకున్న వాళ్ల కోసం ఎలాంటి భరోసా ఇస్తారు? అనేది ‘యాత్ర’లో చూపించిన మహి వి రాఘవ్.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం ఏంటి? తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం ఆయన పడిన కష్టాలేంటి? అదిష్టానం వద్దని చెప్పినా..తనను నమ్ముకున్న ప్రజల కోసం అండగా ఉండేందుకు జగన్ చేపట్టిన పాదయాత్ర.. వైఎస్సార్సీపీ పార్టీ స్థాపించడానికి గల కారణం.. ప్రత్యర్థులంతా ఒక్కటైనా భయపడకుండా నిలబడి, ప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు? అనేది యాత్ర 2లో చూపించాడు. వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర గురించి అందరికి తెలిసిందే.. అయితే ఆ యాత్ర చేపట్టడానికి గల ప్రధాన కారణం.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏంటి అనేది చాలా ఎమోషనల్‌గా చూపించాడు డైరెక్టర్ మహి. ఎమోషన్స్ ఎంత పండించాలి? ఎలాంటి సన్నివేశాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనేది లెక్కలేసుకొని మరీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు మహి. రెగ్యులర్ బయోపిక్‌లా కేవలం కథను మాత్రమే చెప్పకుండా.. ప్రతి సన్నివేశాన్ని ఎమోషనల్‌గా చూపిస్తూ ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చేశాడు. 2009 నుంచి 2014 వరకు ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలతో వైఎస్ జగన్ మమేకమైన తీరు, వారి కష్టాలను అవలోకనం చేసుకోవడం లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి. 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ జగన్ పోటీ చేస్తున్నట్లు వైఎస్సార్ ప్రకటించే సన్నివేశంలో ‘యాత్ర 2’కథ ప్రారంభం అవుతుంది. రెండోసారి వైఎస్సార్ సీఎం అవ్వడం.. రచ్చబండ కోసం వెళ్తూ మరణించండం కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అక్కడ నుంచి ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రజల కోసం జగన్ అదిష్టానాన్ని ఎదిరించిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలిచిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఆయన్ను ఓడించేందుకు చంద్రబాబు చేసిన కుట్రలు ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక సెకండాఫ్ అంతా 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సాగుతుంది. 2014 ఎన్నికల సమయంలో ఓడిపోయినా పర్లేదు కానీ రుణమాఫీ చేస్తానని అబద్దపు హామీ ఇవ్వలేనని జగన్ చెప్పే మాటలు అందరిని ఆకట్టుకుంటాయి. అధికార పార్టీ బెదిరింపులకు భయపడి వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా..జగన్ ధైర్యంతో పార్టీని నడిపించడం.. ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా కృష్ణా బ్రిడ్జిపైకి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం.. తప్పుడు కేసులు పెట్టిన నందిగాం సురేశ్‌ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం..ఇవ్వన్నీ తెరపై చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఇక ఈ సినిమాలోని ప్రతి డైలాగు.. ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. వైఎస్ జగన్ ఎలాంటి వాడో డైలాగ్స్లతోనే తెలియజేశాడు మహి వి.రాఘవ్. ‘జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ అనే ఒకే ఒక్క డైలాగ్‌తో జగన్ వ్యక్తితం ఎలాంటిదో తెలియజేశాడు. ‘ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఆ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను’ అనే మాటల్లో జగన్ విశ్వసనీయత ఎంతటిదో అర్థమవుతుంది. 'నువ్వు మా వైఎస్సార్ కొడుకువన్న మాకు నాయకుడిగా నిలబడన్నా’ అంటూ ఓ అంధుడు చెప్పే మాటలు.. జగన్‌పై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారనేది తెలియజేస్తుంది. ‘నేను విన్నాను-నేను ఉన్నాను' అంటూ జగన్ చెప్పే మాటలు ప్రజలకు ఆయనిచ్చిన భరోసాని తెలియజేస్తుంది. 'నాకు భయపడడం రాదయ్యా.. నేనేంటో, నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్సార్ కొడుకుని'అంటూ అసెంబ్లీ వార్నింగ్ ఇచ్చినప్పుడు జగన్ ధైర్యం ఎలాంటిదో అర్థమతుంది. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాటని తపని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తు పెట్టుకుంటే చాలన్న’ అనే మాటలు.. జగన్ ఆశయం ఏంటో తెలియజేస్తుంది. ‘పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలినా అది పిల్లే...పులిని బోనులో పెట్టినా అది పులే’అంటూ వైఎస్ జగన్ గురించి ఓ సీనియర్ నేత చెప్పే డైలాగ్‌కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కథంతా వైఎస్సార్, వైఎస్ జగన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి జీవించేశాడు. ఇక వైఎస్ జగన్‌గా జీవా అదరగొట్టేశాడు. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద వైఎస్ జగన్నే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు జీవా. వైఎస్ జగన్ హుందాతనం, రాజకీయం, తండ్రి ఆశయం నెరవేర్చడం కోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెరపై అద్భుతంగా పండించాడు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీగా కేతకి నారాయణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తెరపై అచ్చం వైఎస్ భారతీలాగే కనిపించారు. సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నెర్ట్ సరిగ్గా సరిపోయారు. లుక్ పరంగాను ఆమె సోనియా గాంధీని గుర్తు చేశారు.చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ కీలక నేత రెడ్డిగా శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాకేంతిక పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు.. నేపథ్య సంగీతం సినిమాని మరో మెట్టు ఎక్కించాయి. ‘చూడు నాన్న..’పాటు హృదయాలను హత్తుకుంటుంది. పెంచలదాస్ పాడిన వైఎస్సార్ పాట అయితే కన్నీళ్లను తెప్పిస్తుంది. ‘తొలి సమరం’సాంగ్ వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానుల్లో జోష్ని నింపుతుంది. మది సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. చివరిగా.. ‘ఓ రాజకీయ నాయుకుడి జీవితంలో డ్రామా ఉండవచ్చు.. యాక్షన్కూ అవకాశముంది.. బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటుందన్న వాళ్లను చూస్తే కామిడీకి స్కోపు ఉందని అనుకోవచ్చు. కానీ.. ఎమోషన్ కూడా ఉంటుందా? కచ్చితంగా ఉంటుంది అనడమే కాకుండా... ఆ భావోద్వేగాలను అందంగా తెరపైకి ఎక్కించి మరీ చూపించాడు మహి వి.రాఘవ్. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘యాత్ర 2’ ట్విటర్ రివ్యూ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాద యాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ ‘యాత్ర 2’. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాతక్మంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి వి.రాఘవ్. ఇందులో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. (చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు!) ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు నేడు(ఫిబ్రవరి 8) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఇప్పటికే ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. యాత్ర 2 మూవీ ఎలా ఉంది? వైఎస్ జగన్‌గా జీవా ఎలా నటించాడు? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. యాత్ర 2 చిత్రానికి ఎక్స్‌లో పాజిటివ్ స్పందన వస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌లో యాత్ర 2 బెస్ట్ బయోపిక్ అని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయట. తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయంటూ పలువురు నెటిజన్స్ ఎక్స్‌లో కామెంట్ చేస్తున్నారు. #Yatra2 The best biopic ever in all the industries u will feel goosebumps right from the start @MahiVraghav just remember this name. Had a little hatred towards jagan but now it’s love ❤️ @JiivaOfficial 💥 Antis ki kuda goosebumps vache moments unnay ⭐️⭐️⭐️⭐️/5 Rating :-4/5 pic.twitter.com/Tggn0vieAr — Film Buff 🍿🎬 (@SsmbWorshipper) February 7, 2024 ‘యాత్ర 2’ బెస్ట్ బయోపిక్. సినిమా స్టార్టింగ్ నుంచే గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు మహి వి. రాఘవ్. ఇంతకు ముందు జగన్‌పై కొంచెం ద్వేషం ఉండే..సినిమా చూశాక అది ప్రేమలా మారింది. వైఎస్ జగన్‌ని ద్వేషించేవారికి కూడా గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉన్నాయంటూ ఓ నెటిజన్ 4/5 రేటింగ్ ఇచ్చాడు. Honestly chepthuna one of the best biopics ever made in Telugu #Yatra2 🔥🔥🔥🔥 Blockbuster movie 👌🏻👌🏻👌🏻#Yatra2 Bomma Blockbuster 🔥💙#YSJaganAgain @ysjagan @JiivaOfficial @mammukka pic.twitter.com/YhYNZnV46B — Sri Surya Movie Creations (@SSMCOfficial) February 8, 2024 నిజాయితీగా చెబుతున్న..తెలుగులో ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌లో యాత్ర 2 బెస్ట్ బయోపిక్. బ్లాక్ బస్టర్ మూవీ. బొమ్మ అదిరింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. యాత్ర-2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు.. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ కచ్చితంగా గుర్తు చేస్తుంది -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి #BlockbusterYatra2#Yatra2#CMYSJagan pic.twitter.com/kKzp63OOgv — YSR Congress Party (@YSRCParty) February 7, 2024 యాత్ర-2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ కచ్చితంగా గుర్తు చేస్తుందని వైఎస్సార్సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. Emotional n Gusebumps Stuff 🔥🔥🔥🔥#Yatra2 Blockbuster Reports pic.twitter.com/WBaUpCbNp6 — Jani Journalist (@shaik_jani8) February 8, 2024 @DrPradeepChinta అన్న రేటింగ్ 5 స్టార్ అంటే.... #Yatra2Movie కి తిరిగే ఉండదిక.... 👏👏👏👏 https://t.co/8J3g3dCOTd — #Siddham for 2024 🦾💪🇮🇳 (@bhojaraju99) February 8, 2024 First half completed! Edipinchesav @MahiVraghav ! pure emotions and YSJagan mass high! Trailer is jujubi.#Yatra2 #Yatra2JourneyBegins #Yatra2Movie #Yatra2OnFeb8th https://t.co/8xpua0Epg0 — Pavan_GR (@pavan_gr) February 7, 2024 Emotional n Gusebumps Stuff 🔥🔥🔥🔥#Yatra2 Blockbuster Reports pic.twitter.com/WBaUpCbNp6 — Jani Journalist (@shaik_jani8) February 8, 2024 Last Ki @ysjagan sir cameo 🔥 Pillini teesukuni velli adavilo vadileste adi pille, kani akkada undi puli adavilo Unna bonu lo Unna gargistundi. Deii em cinema Ra Babu HYD vadini Kuda vachi meeku vote veyali ani undi Jai Jagan#Yatra2#Yatra2OnFeb8th #Yatra2Premier pic.twitter.com/RS25F9xmp9 — UK DEVARA 🌊⚓ (@MGRajKumar9999) February 7, 2024 అధ్బుతమైన స్పందనతో, యూరోప్‌లో ముగిసిన యాత్ర -2 ప్రీమియర్ షో#Yatra2Movie #Yatra2 #JaitraYatra pic.twitter.com/3yOE48IhX0 — AP360 (@andhraa360) February 7, 2024 #Yatra2 #Yatra2Movie వైఎస్ఆర్ మరణం, తదనంతర పరిణామాలు,తన తండ్రి మరణంతో నష్టపోయిన వారిని ఓదార్చేందుకు జగన్ ఓదార్పు యాత్రను ఎలా ప్రారంభించాడో, ఆయన నిర్ణయం వల్ల ఎదుర్కొన్న పరిణామాలను ఈ చిత్రంలో చూపించారు — @Team Basireddy (@BasireddyLokes1) February 7, 2024 ప్రతీ అభిమాని గుండె చప్పుడిలో పెద్దాయన ఉంటారు 🥹🥹#Yatra2#Yatra2JourneyBegins#JaitraYatrapic.twitter.com/IdzOCiCkZ1 — Vikas 🎯🎯 (@VikasRonanki) February 8, 2024 Yatra -2 movie is an inspiration 👌👌👌👌👌@MahiVraghav @mammukka @JiivaOfficial @ysjagan @YSRCParty @JaganannaCNCTS @SajjalaBhargava Please watch it 🔥🔥https://t.co/DSvqpvfiEs pic.twitter.com/1gFEvtBqTX — Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) February 8, 2024 అధ్బుతమైన స్పందనతో, యూరోప్‌లో ముగిసిన యాత్ర -2 ప్రీమియర్ షో#Yatra2Movie #Yatra2 #JaitraYatra pic.twitter.com/3yOE48IhX0 — AP360 (@andhraa360) February 7, 2024 Finally blockbuster kottisamu anna.. 🥹❤️🔥🙏 Tnq @MahiVraghav Anna Great inspirational movie ichavu... 🧎♂️ Jai Jagan anna.. 🇸🇱🙏 @ysjagan #Yatra2Movie #Yatra2 #YSJaganAgainIn2024 pic.twitter.com/IB16sF6fa8 — ᴀʟʟᴜ sᴀɴᴊᴜ ʀᴇᴅᴅʏ™🪓🐉 (@AlluSanjuReddy) February 8, 2024 @MahiVraghav ఎవడ్రా నువ్వు మా జగనన్నకు మాకన్నా పెద్ద ఫ్యాన్ లా ఉన్నావ్🔥 Thanks Mahi anna 🥰 pic.twitter.com/dGJY6pV6Ge — Manager (@thinkpad8gen) February 8, 2024 -
అమెరికాలో 'యాత్ర- 2' ప్రీమియర్స్ సిద్ధం.. అభిమానుల భారీ ర్యాలీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' ఫిబ్రవరి 8న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. యాత్ర 2 సినిమా విడుదల సందర్భంగా వైఎస్సార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అమెరికాలో నివసిస్తున్న వైఎస్సార్, ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ యాత్ర సినిమా విడదుల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కొన్ని వందల కార్లు, బైకులతో యాత్ర పోస్టర్స్ పట్టుకుని రోడ్ షో నిర్వహించారు. అమెరికాలో విడుదలకు ముందే యాత్ర జండా రెపరెపలాడుతుంది. సినిమా విడుదల కోసం ఎంతగానో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్, డల్లాస్‌లో ఫిబ్రవరి 7న యాత్ర 2 ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఫ్యాన్స్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచే అమెరికాలో ప్రీమియర్ షోలు ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించారు. మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ (శుభలేక సుధాకర్) ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఈ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను, నేను విన్నాను... నేనున్నాను (జీవా) అనే డైలాగ్స్ ట్రైలర్ ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవన్నీ భారీగా ట్రెండ్ అవుతున్నాయి. USA #Yatra2 Collection 🔥🔥 pic.twitter.com/9FxfcrFmuF — MBYSJTrends ™ (@MBYSJTrends) February 6, 2024 🚨Premiere Alert🚨 All theatre chain passes are now enabled for #Yatra2 in the USA 🇺🇸 Premieres on Feb 7#Yatra2Trailer - https://t.co/xzuTsMDg0h Directed by @mahivraghav#LegacyLivesOn #Yatra2OnFeb8th @mammukka @JiivaOfficial @ShivaMeka pic.twitter.com/Tcputw5Thl — Three Autumn Leaves (@3alproduction) February 6, 2024 -
నేను విన్నాను...
‘‘నా బిడ్డకు పుట్టుకతోనే చెవుడు ఉందన్నా.. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు.. అన్నా.. మాకంత స్తోమత లేదు (ఓ పాత్రధారి). మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్‌కి ఒక మనిషి మీద నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం.. ఐ డోంట్ థింక్.. ఇట్స్ రైట్ సార్ (మరో పాత్రధారి)... నువ్వు చెప్పింది కరెక్ట్నే అయ్యా.. నాకు అర్థమైంది. కానీ మనం చేయలేమనే మాట ఈ పాపకు అర్థమయ్యేలా చెప్పు (మమ్ముట్టి) అనే సీన్‌తో మొదలైంది ‘యాత్ర 2’ సినిమా టీజర్. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు, పేదల కోసం వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర 2’. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాద యాత్ర ఆధారంగా రూపొందిన ‘యాత్ర’కు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ వస్తోంది. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించారు. మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ (శుభలేక సుధాకర్) ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఈ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను, నేను విన్నాను... నేనున్నాను (జీవా) అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
Yatra 2 Movie Trailer: ‘యాత్ర 2’ ట్రైలర్ వచ్చేసింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. (చదవండి: యాత్ర 2' ట్రైలర్.. అంచనాలు పెంచేస్తున్న ఈ డైలాగ్స్) వైఎస్సార్, ఆయన తనయుడి జీవితంలో జరిగిన యథార్థంగా జరిగిన సంఘటనలే ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాత్ర-2 టీజర్, సాంగ్స్ సినీ ప్రేక్షకులతో పాటు వైఎస్సార్ అభిమానుల గుండెలను తాకాయి. తాజాగా యాత్రా 2 నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘పుట్టుకతోనే చెవుడు ఉంది అన్న.. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషిన్ పెడితే వినబడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పారు. అన్నా.. మాకు అంత స్థోమత లేదు’ అని ఓ సామాన్యురాలు తన కూతురికి గురించి సీఎం వైఎస్సార్(మమ్ముట్టి)కి చెప్పే సీన్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. వైఎస్సార్ మరణం.. జగన్ ఓదార్పు యాత్రకు అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ చేసే కుట్రలు.. పార్టీ పెట్టిన తర్వాత జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన మద్దతు..ఇవన్నీ ట్రైలర్లో హృదయాలను హత్తుకునేలా చూపించారు. ఇక చివర్లో ఓ అంధుడు ‘నువ్వు మా వైఎస్సార్ కొడుకువు అన్నా..మాకు నాయకుడిగా నిలబడు అన్నా’అని అనగా..నేను విన్నాను..నేను ఉన్నాను’ అని జగన్(జీవా) చెప్పే డైలాగ్‌తో ఎమోషనల్‌గా ట్రైలర్ ముగిసింది. దేశంలో ఇప్పటి వరకు ఎందరో ప్రముఖలు జీవితాలపై బయోపిక్‌లుగా పలు చిత్రాలు వచ్చాయి.. వాటంన్నింటికీ దక్కని క్రేజ్ యాత్ర సీక్వెల్ చిత్రాలకు దక్కింది. ఇంతలా యాత్ర-2కు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ గారు ఒకరు.. అంతే కాకుండా ఆయనొక అగ్రెసివ్ రాజకీయ నాయకుడు, మాస్ లీడర్, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి అధినేత.. అంతలా ఇమేజ్ ఉన్న నాయకుడి గురించి తీసే బయోపిక్‌ను అంతే స్థాయిలో పొయెటిక్‌గా తెరమీదకు తీసుకురావడం డైరెక్టర్ మహి కే సాధ్యమైంది. ఆందుకే ఆయన నిజ జీవితాన్ని మరొకసారి వెండితెరపై చూసేందుకు కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
యాత్ర- 2 ట్రైలర్‌పై ప్రకటన చేసిన డైరెక్టర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిన చూసిన నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. వైఎస్సార్, ఆయన తనయుడి జీవితంలో జరిగిన యథార్థంగా జరిగిన సంఘటనలే టీజర్లో కనిపించాయని ప్రేక్షకులు చెబుతున్నారు. దీంతో యాత్ర 2 చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ట్రైలర్‌ను రేపు (ఫిబ్రవరి 3న) విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. మహీ వి. రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. -
ఆ రోజే భ్రమయుగం
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్స్‌కి వచ్చే రోజు ఖరారైంది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘హారర్–థ్రిల్లర్ జానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: షెహనాద్ జలాల్, సంగీతం: క్రిస్టో జేవియర్. -
చిరు భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు: మెగాస్టార్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ మెగాస్టార్‌ను దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించి సత్కరించింది. ఈ ఘనత దక్కడం పట్ల మెగాస్టార్ ఎమోషనలయ్యారు. ఈ ఘనత దక్కడానికి కారణం మీరేనంటూ అభిమానులను ఉద్దేశించి వీడియో రిలీజ్ చేశారు. మెగాస్టార్‌కు అత్యున్నత గౌరవం దక్కడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ట్విటర్ వేదికగా సినీ ప్రముఖులు మెగాస్టార్‌ను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు. పద్మవిభూషణ్‌కు ఎంపికైనందుకు ప్రియమైన చిరు భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా టాలీవుడ్ హీరోలు నాని, కిరణ్ అబ్బవరం, తేజా సజ్జా, నటుడు సత్యదేవ్, అడివి శేష్, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ, నటి ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్ ట్విటర్ ద్వారా మెగాస్టార్‌కు కంగ్రాట్స్ తెలియజేశారు. Congratulations to #Megastar @KChiruTweets on being honoured with the #PadmaVibhushan , a great honour bringing great pride to #TeluguCinema and to his people who love him. Hard work never fails🙏 pic.twitter.com/2l4SEPFIII — Radikaa Sarathkumar (@realradikaa) January 25, 2024 Hearty congratulations, Dear Chiru Bhai, for being conferred with the Padma Vibhushan.@KChiruTweets — Mammootty (@mammukka) January 25, 2024 Congratulations sir ❤️❤️ You are always an Inspiration 😊#PadmaVibhushanChiranjeevi #Megastar https://t.co/41qCnAkw2K — Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 25, 2024 Many congratulations to you, Sir @KChiruTweets Gaaru, on the honor bestowed upon you. You rightly deserve it. Your contribution to cinema, the world of art, your philanthropic lifestyle, your good work for the public and the blessings of your elders brings you this. As a friend,… https://t.co/DXKj4RgZw7 — KhushbuSundar (@khushsundar) January 26, 2024 Good morning Padma Vibhushan Chiranjeevi gaaru :) ♥️@KChiruTweets 🙏🏼 — Hi Nani (@NameisNani) January 26, 2024 Telugu vadi Garva Karanam Mega 🌟 Padma Vibhushan@KChiruTweets garu #MegastarChiranjeevi Garu — Teja Sajja (@tejasajja123) January 25, 2024 Congratulations Annaya @KChiruTweets on being recipient to the second highest civilian award #PadmaVibhushan Much Deserving Honour for your inspiring legacy & contribution. Thank you for holding cinema high at every instance. ❤️ pic.twitter.com/SvqDpnCBfI — Satya Dev (@ActorSatyaDev) January 25, 2024 My favorite picture I have of us sir @KChiruTweets ❤️ Thank you for always being kind and warm to me. Thank you for the amazing films. Thank you for the brilliant performances. Thank you for being our MEGASTAR. You are now a #PadmaVibhushan Sir. A proud moment for us, for TFI… pic.twitter.com/Wa7Q9x6V4P — Adivi Sesh (@AdiviSesh) January 26, 2024 Congratulations to our BOSS @KChiruTweets Garu on being felicitated with the honorary award #PadmaVibhushan ❤️ Thank you for making us all proud yet again and again. pic.twitter.com/pW5LEbVtuo — Vassishta (@DirVassishta) January 25, 2024 -
కల్లర్ మ్యాజిక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మన హీరోలు
కథ బొగ్గు గనుల్లో జరుగుతోంది.. అక్కడ పనిచేసేవాళ్లు ఎలా కనిపిస్తారు? ఫుల్ డార్క్‌గా.. కథ బంగారు గనుల్లో జరుగుతోంది.. కానీ తవ్వేవాళ్లు బంగారంలా మెరిసిపోరు.. కమలిపోయిన చర్మంతో ఉంటారు. ఇక మత్స్యకారులో... వాళ్లూ అంతే.. స్కిన్ ట్యాన్ అయిపోతుంది. ఇప్పుడు కొందరు హీరోలు ఇలా ఫుల్ బ్లాక్‌గా, ట్యాన్ అయిన స్కిన్‌తో కనిపిస్తున్నారు. పాత్రలకు తగ్గట్టు బ్లాక్ మేకప్ వేసుకుని, సిల్వర్ స్క్రీన్‌పై మేజిక్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. 31లో కొత్తగా... హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ల క్రేజీ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్ 31’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ఎలా ఉంటుందో? అనే ఆసక్తి ఇటు చిత్ర వర్గాల్లో అటు సినిమా లవర్స్‌లో నెలకొంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్లో ఎన్టీఆర్ పూర్తి నలుపు రంగు మేకప్‌లో కనిపించారు. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్’ల తరహాలో ఎన్టీఆర్ 31 బ్లాక్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని టాక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్ 31’ షూటింగ్ ఈ ఏడాది లోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందనుంది. ‘‘ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేయని పాత్ర, కథతో ‘ఎన్టీఆర్ 31’ సినిమా చేయబోతున్నాను. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్ కనిపిస్తారు’’ అంటూ ప్రశాంత్ నీల్ ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. గోల్డ్ ఫీల్డ్స్‌లో తంగలాన్ పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు విక్రమ్. దర్శకుడి విజన్ 100 శాతం అయితే విక్రమ్ 200 శాతం న్యాయం చేస్తారనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన విక్రమ్ ‘తంగలాన్’ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ డ్రామాగా రూపొందింది. బ్రిటిష్ పరిపాలన కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణదారులకు ఎదురెళ్లి పోరాడిన ఓ ఆదివాసి తెగ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందట. ఇందులో విక్రమ్ ఆ తెగ నాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్ ఫస్ట్ లుక్ పూర్తి స్థాయి నలుపులో ఎంతో వైవిధ్యంగా ఉంది. మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాని తొలుత సంక్రాంతికి, ఆ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్‌లో రిలీజ్ చేయ నున్నట్లు ఇటీవల పేర్కొన్నారు. భ్రమయుగంలో... దాదాపు 50 ఏళ్ల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు మమ్ముట్టి. అయితే ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్త పాత్రని ‘భ్రమయుగం’ సినిమాలో పోషిస్తున్నారాయన. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘భ్రమయుగం’. హారర్ థ్రిల్లర్ జోనర్లో కేరళలోని కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందుతోంది. అక్కడి చీకటి యుగాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర పూర్తి నలుపు రంగులో ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘భ్రమయుగం’ మలయాళ టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన టీజర్లో సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు మమ్ముట్టి. రామచంద్ర చక్రవర్తి నిర్మిస్తున్న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. గొర్రెల కాపరి పృథ్వీరాజ్ సుకుమారన్ హ్యాండ్సమ్గా ఉంటారు. తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తొలిసారి ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమా కోసం పూర్తి స్థాయిలో నల్లటి మనిషిగా మారిపోయారు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బ్లెస్సీ. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి సౌదీ అరేబియాకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. గొర్రెల కాపరి నజీబ్ పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్. గుబురు గడ్డం,పొడవైన జుట్టుతో నలుపు రంగులో ఉన్న పృథ్వీరాజ్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ పాత్ర కోసం ఆయన బరువు తగ్గారు. పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా మాదేనంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది. ∙హ్యాండ్సమ్గా, పక్కింటి కుర్రాడిలా కనిపించే నాగచైతన్య ‘తండేల్’ సినిమా కోసం పక్కా మాస్ అవతారంలోకి మారిపోయారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం మత్య్సకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మత్స్యకారుని పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. 2018లో జరిగిన వాస్తవ ఘటనలతో తెరకెక్కుతోంది. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్’ అంటూ ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెబుతారు. నిజమే.. ఆయన కటౌట్ చూస్తే అలానే అనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమా నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారాయన. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్: పార్ట్ 1– సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదలై హిట్‌గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ అంతా బ్లాక్‌గా ఉంటుంది. బొగ్గు గనుల్లో మెకానిక్ దేవ పాత్రలో ప్రభాస్ లుక్ కూడా బ్లాక్ షేడ్‌లో ఉంటుంది. రెండో భాగంలోనూ ప్రభాస్ ట్యాన్ లుక్‌లో కనిపిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ప్రయోగాలు చేసే హీరోల్లో సూర్య ఒకరు. కమల్‌హాసన్ గత బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’ (2022)లో రోలెక్స్ పాత్రలో ట్యాన్ లుక్‌లో కనిపించారు సూర్య. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్‌లో ఈ పాత్ర వస్తుంది. రెండో భాగంలోనూ ఉంటుంది. సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. అలాగే విడుదలకు సిద్ధమవుతున్న ‘కంగువా’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో హీరో సూర్య ట్యాన్ లుక్‌లో కనిపిస్తారు. -
యాత్ర-2 నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్
యాత్ర -2 నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తెలుగు ప్రేక్షకుల గుండెలను తాకింది. ఆ టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'చూడు నాన్న' వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర-2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి వీడియో సాంగ్ రిలీజ్ అయింది. 'చూడు నాన్న' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ గేయరచయిత భాస్కరభట్ల ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఎమోషన్స్‌తో కూడిన సంగీతాన్ని అందించారు. ఈ పాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవా తనదైన నటనతో మెప్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఈపాట ఉండటంతో అందరినీ మెప్పిస్తుంది. తండ్రి మరణంతో మొదటిసారి ప్రజల్లో అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకే వేలాదిగా జనాలు వచ్చారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనలను పాటలో చూపించారు డైరెక్టర్ మహి వి రాఘవ్. -
హారర్ థ్రిల్లర్ కథతో 'భ్రమయుగం'.. టీజర్‌తో మెప్పించిన స్టార్ హీరో
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న తాజా చిత్రం 'భ్రమయుగం'.. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు. మమ్ముట్టి ఇటీవల నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్: ది కోర్'తో మెప్పించాడు. ఇందులో మమ్ముట్టి స్వలింగ సంపర్కుడి(గే)గా కనిపిస్తాడు. ఇలా విభన్నమైన అంశాలతో సినిమాలు తీసి సూపర్ హిట్లు కొడుతున్న ఆయన త్వరలో 'భ్రమయుగం' చిత్రం ద్వారా తెరపైకి రానున్నాడు. తాజాగా విడుదలైన భ్రమయుగం టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పోస్టర్‌తో పాటు అన్నీ అంశాలు చాలా ప్రత్యేకంగానే ఉన్నాయి. భిన్నమైన హారర్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ నటించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. కానీ ప్రస్తుతం మాత్రం మలయాళ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. -
Yatra- 2 Teaser.. తూటాల్లా పేలుతున్న డైలాగ్స్
యాత్ర- 2 టీజర్ విడుదలైంది. యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్-1కు చేరిపోయింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఎలాంటి స్టార్ హీరోలు లేరు.. కానీ టీజర్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని లక్షల మంది వైఎస్సార్ అభిమానులు తమ మొబైల్స్‌లలో వాట్సప్ స్టేటస్‌లుగా యాత్ర-2 టీజర్ డైలాగ్స్‌ను పెట్టుకుంటున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర-2 సినిమా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇంతలా ఈ సినిమాకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో వైఎస్ఆర్, ఆయన వారసుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వారందరూ యాత్ర-2 టీజర్‌తో పండుగ చేసుకుంటున్నారు. టీజర్లో చూపించిన ప్రతి అంశం గడిచిన రోజుల్లో మన కళ్ల ముందు జరిగినవే.. కానీ డైరెక్టర్ మహి వి రాఘవ అద్భుతంగా తెరకెక్కించారు. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ గారు ఒకరు.. అంతే కాకుండా ఆయనొక అగ్రెసివ్ రాజకీయ నాయకుడు, మాస్ లీడర్, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి అధినేత.. అంతలా ఇమేజ్ ఉన్న నాయకుడి గురించి తీసే బయోపిక్‌ను అంతే స్థాయిలో పొయెటిక్‌గా తెరమీదకు తీసుకురావడం డైరెక్టర్ మహి కే సాధ్యమైంది. ఈ పాయింట్‌తోనే టీజర్ ప్రారంభం అసలు టీజర్ స్టార్ట్ కావడమే ఎమోషనల్ నోట్‌తో ప్రారంభమైంది. ఆ షాట్ కూడా పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్దే జరిగింది. ఈ టీజర్లో సీఎం జగన్ గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలనే తెరపైకి తీసుకొచ్చారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జగన్ గారిని బాగా కలచివేసింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు హఠాన్మరణానికి గురికావడం ఆయనకు మరింత దుఃఖాన్ని కలిగించింది. తనలాగే కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ తదుపరి కర్తవ్యంపై దృష్టి పెట్టారు. వైఎస్ మరణించిన పావురాలగుట్టను సందర్శించి నివాళులర్పించిన తరువాత నల్లకాలువ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన ప్రతీవ్యక్తి ఇంటికి వస్తానని.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని భరోసా ఇచ్చారు. ఇలా ఇచ్చిన మాటే ఆయన కష్టాలకు తొలిమెట్టయింది. ఈ పాయింట్‌తోనే టీజర్ ప్రారంభం అవుతుంది. అనుకున్నట్లే వైఎస్ జగన్ గారు పాదయాత్ర ప్రారంభించారు.. రోజురోజుకూ ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేకపోయిన కొందరు తండ్రి పోయాడనుకుంటే వారసుడొచ్చాడని.. దీనిని ఎలాగైనా ఆపాలని కాంగ్రెస్‌తో జత కట్టి దొంగదెబ్బ తీసేందుకు వార్నింగ్‌లు జారీచేశారు. అప్పుడు టీజర్లో వినిపించిన డైలాగ్ ఇదే... 'ఉన్నది అంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటి వాడితో యుద్ధం చేయడం మనకే నష్టం' ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇదే. ఎవరికీ తలవంచని ధైర్యం.. కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన.. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం.. పెద్ద దిక్కు తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం వైఎస్ జగన్ సొంతం. రాజీపడి ఎక్కే అందలాల కన్నా.. పోరాటాల ద్వారానే విజయ లక్ష్యాన్ని ఛేదించాలనుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ క్రమంలో వచ్చిందే ఈ డైలాగ్ 'నాకు భయపడడం తెలియదు.. నేను వైఎస్సార్ కొడుకుని' అని చెప్పడం. వైఎస్ జగన్ గారిపై అన్యాయంగా సీబీఐ, ఈడీ కేసులను నమోదు చేయించి, టీడీపీతో కుమ్మక్కై రాజకీయంగా మొగ్గదశలోనే వైఎస్సార్ వారసుడిని అంతమొందించేందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టిన తీరును యాత్ర- 2లో చూపించనున్నాడు డైరెక్టర్ మహీ. జగన్ గారి ఓదార్పు యాత్రకు ముందు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు.. ఎప్పుడైతే ఓదార్పు యాత్ర ప్రకటన వచ్చిందో ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతూ వచ్చాయి. రాజకీయంగా వైఎస్సార్ వారసుడిని లేకుండా చేయాలని కుట్ర పన్నిన వారందరికీ వైఎస్ జగన్ అభిమానులు తగిన బుద్ధి చెప్పారు. ఆయన వెంట ఒక సైన్యంలా జనం కదిలారు. తండ్రి మాదిరే ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా.. పోరాడి నిలబడిన యోధుడిలా జగన్ జీవితం ఎప్పటికీ చరిత్రలో ఉంటుంది. అందుకే రాజన్నతో పాటు ఆయన బిడ్డ వైఎస్ జగన్ జీవితం గురించి సినిమాలు వస్తున్నాయి. వారి అసలైన జీవితాన్ని నేటి తరం యువకులకు తెలిసేలే కొందరు దర్శకనిర్మాతలు పూనుకున్నారు. ఈ క్రమంలోనే యాత్ర సినిమా ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది.. ఫిబ్రవరి 8న యాత్ర- 2 విడుదల కానుంది. -
Yatra 2 Teaser: ఆకట్టుకుంటున్న 'యాత్ర 2' టీజర్
‘ఏన్నా.. ఇంత రాత్రి అయినా నిద్ర పోకుండా ఈడ ఏం చేస్తున్నావన్నా’ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రధారి జీవా డైలాగ్‌తో ‘యాత్ర 2’ టీజర్ విడుదలైంది. ‘యాత్ర’ వంటి హిట్ మూవీకి సీక్వెల్‌గా మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్‌తో కలసి శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట.. ఆయన కోసం ఎదురు చూస్తున్నానన్నా’ (వైఎస్ఆర్ అభిమాని), ‘కాదన్నా.. మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి మీ ముందు నిల్చున్నా మీకు కనపడదు కదా అన్న’ (జీవా), ‘నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకు కనపడతా కదా అన్న, నాలాంటోళ్లు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడున్నానన్నా’ (వైఎస్ఆర్ అభిమాని), ‘నా రాజకీయ ప్రత్యర్థినైనా, శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ, మీ నాయకుడిలాగా వాళ్ల నాశనం కోరుకోనయ్యా’ (వైఎస్ఆర్ పాత్రధారి మమ్ముట్టి) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మహి వి. రాఘవ్. మహేశ్ మంజ్రేకర్, సుజానె బెర్నెర్ట్, కేతకీ నారాయణన్, ‘శుభలేఖ’ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం: సంతోష్ నారాయణన్. -
Yatra 2 Teaser: రిలీజైన 'యాత్ర 2' టీజర్
'యాత్ర 2' సినిమా టీజర్ వచ్చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. అయితే ఏయే సంఘటనల ఆధారంగా తీశారనేది మొన్నటివరకు కాస్త సందేహం ఉండేది. తాజాగా వచ్చిన టీజర్‌తో సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అలానే అంచనాలు కూడా పెరిగిపోయాయి. టీజర్లో ఏముంది? వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్నహార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. అలానే తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఆ అడ్డంకులని జగన్ ఎలా అధిగమించారు? తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగారనేదే 'యాత్ర 2' సినిమా. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) గూస్బంప్స్ సీన్స్ ఈ టీజర్లో ఓ చోట.. 'ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించినా.. జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్' అని సోనియాగాంధీతో ఓ పాత్రధారి చెప్పే సీన్.. 'చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్న' అనే మరో సీన్.. 'నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకుమించి ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా 'యాత్ర 2' సినిమా తీశారు డైరెక్టర్ మహి వి రాఘవ. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. ఈ ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. (ఇదీ చదవండి: OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!) -
గే పాత్రలో మమ్ముట్టి.. సైలెంట్‌గా ఓటీటీలోకి..
ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ముందువరుసలో ఉంటాడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. ఆరు పదుల వయసులో విభిన్న కథాంశాలను సెలక్ట్ చేసుకుంటూ ప్రేక్షక, సినీ ప్రియులను అలరిస్తున్నాడు. ఇటీవల ఈయన నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్: ది కోర్'. జియో బేబి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జ్యోతిక హీరోయిన్గా నటించింది. ఇందులో మమ్ముట్టి స్వలింగ సంపర్కుడి(గే)గా కనిపిస్తాడు. దీంతో విడుదలకు ముందు ఈ సినిమాపై వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా కథ హోమో-సెక్సువాలిటీని ప్రోత్సహించేలా ఉందంటూ కువైట్, ఖతార్ దేశాలు కాదల్: ది కోర్ చిత్రాన్ని బ్యాన్ చేశాయి. అయితే ఈ విమర్శలను దాటుకుంటూ నవంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి అయితే తెచ్చారు కానీ దీన్ని ఫ్రీగా చూసే వీల్లేదు. ఈ మూవీ చూడాలంటే అద్దె చెల్లించాల్సిందే! ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన ఓటీటీలో రిలీజ్ చేశారు. మరి ఉచితంగా ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో చూడాలి! #KaathalTheCore available for Rental in AMAZON PRIME. pic.twitter.com/E3c2ypE8j5 — Christopher Kanagaraj (@Chrissuccess) January 4, 2024 చదవండి: హీరో కూతురి పెళ్లి.. 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వెళ్లిన వరుడు -
టీజర్ రెడీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘యాత్ర 2’ ఉంటుంది. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. మహీ వి. రాఘవ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 5న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించి, ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘‘ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి’’ అంటూ ‘యాత్ర 2’ టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్‌ను షేర్ చేసింది యూనిట్. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్‌తో కలిసి శివ మేక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
యాత్ర 2 టీజర్ వచ్చేస్తోంది!
‘యాత్ర’మూవీకి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. (చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న చిన్నారుల బాధ.. భారీ సాయం చేసిన హీరో) ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే హీరో జీవా లుక్‌తో పాటు వైఎస్ భారతీ పాత్ర పోషిస్తున్న మరాఠీ నటి కేతకి నారాయణన్ లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. జనవరి 5న యాత్ర 2 టీజర్ రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ.. మమ్ముట్టి, జీవాలకు సంబంధించిన కొత్త పోస్టర్ని విడుదల చేసింది. View this post on Instagram A post shared by Mahi V Raghav (@mahivraghav) -
కన్నీళ్లు తెప్పిస్తున్న చిన్నారుల బాధ.. భారీ సాయం చేసిన హీరో
కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన వెల్లియామామట్‌లో సుమారు 15 ఆవులు మృతి చెందాయి. ఎండిన పచ్చిమిర్చి పొట్టుతో పాటు కలుషితమైన ఆహారం తినడం వల్లే అవి మృతి చెందాయని తెలుస్తోంది. ఈ పశువులు ఇద్దరు యువకులు జార్జ్ (18), మాథ్యూ (15)లకు చెందినవి. తన తండ్రి మరణం తరువాత వారిద్దరూ సుమారు 3 ఏళ్ల నుంచి ఆవులను పెంచుకుంటున్నారు. పాఠశాలకు వెళ్తూనే డెయిరీ రంగంలోకి వారు కష్టపడుతున్నారు. మాథ్యూ చదువుతో పాటు ఆవులను కూడా పెంచుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ సమయంలో వారి ఆవులు చనిపోవడంతో మాథ్యూ, జార్జ్‌తో పాటు వారి తల్లి కుంగిపోవడం ఆపై వారు ఆస్పత్రి పాలు కావడం జరిగింది. గతంలో వీరు రాష్ట్ర ఉత్తమ బాల పాడి రైతుగా అవార్డును గెలుచుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న డైరీ ఫామ్‌లలో వీరిది ఒకటి. డిసెంబర్ 31న వారి ఆవులు చనిపోవడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. ఆ కుటుంబం ఇబ్బందిని తెలుసుకున్న మలయాళ నటీనటులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రముఖ నటుడు జయరామ్ వారికి భారీ సాయం అందించారు. తాజాగా ఆయనే స్వయంగా వారి ఇంటికి చేరుకుని రూ. 5 లక్షలు అందించడం విశేషం. జయరామ్‌కు తెలుగు చిత్ర సీమలో కూడా మంచి గుర్తింపు ఉంది. అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ సినిమాలో తండ్రిగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిన్నారుల కుటుంబానికి సాయంగా మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి కూడా రూ. లక్ష, సలార్ నటుడు పృథ్వీరాజ్ రూ.2 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని జయరామ్ పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం ఇద్దరూ పిల్లలకు ఆ డబ్బు కూడా అందజేయనున్నట్లు తెలుస్తోంది. జయరామ్ ఆర్థిక సాయం చేసిన డబ్బు తన కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బు అని ఆయన తెలిపారు. గతంలో తాను ఎంతో ప్రేమతో పెంచుకున్న ఆవులు కూడా కొన్ని కారణాల వల్ల మృత్యువాత పడ్డాయని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను, తన భార్య ఎంతో బాధపడ్డామని ఆయన తెలిపారు. మరోవైపు కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి చించు రాణి, జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ ఆ యువ రైతుల కుటుంబానికి చేరుకున్నారు. బీమాతో కూడిన ఐదు ఆవులను రైతులకు అందజేయనున్నట్లు మంత్రి హామీనిచ్చినట్టు తెలుస్తోంది. ఆపై ఆ కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 50,000 అందించారని సమాచారం. -
సూపర్ స్టార్ పాన్ ఇండియా చిత్రం.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్!
ఈ ఏడాది మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త ఏడాది సరికొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. గతేడాదిలో నన్పకల్ నేరత్ మయక్కమ్, కన్నూర్ స్క్వాడ్, కాథల్-ది కోర్ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. కొత్త ఏడాదిలో యువ దర్శకుడు రాహుల్ సదాశివన్తో జతకట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా తన కొత్త సినిమా భ్రమయుగం పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో మమ్ముట్టి తలపై కిరీటంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. పోస్టర్ చూస్తే చేతబడి చేసే వ్యక్తి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. కేరళలోని మూఢ నమ్మకాల ఆధారంగానే సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. పాన్-ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే గతంలోనే దర్శకుడు రాహుల్ హారర్ జానర్లో తనదైన ప్రతిభను నిరూపించుకున్నారు. 2022లో అతను తెరకెక్కించిన భూతకాలం మలయాళంలో అత్యుత్తమ హారర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాగా.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. #HappyNewYear 2024 ! ✨#Bramayugam Written & Directed by #RahulSadasivan Produced by @chakdyn @sash041075 Banner @allnightshifts @studiosynot pic.twitter.com/HseyAbCSIS — Mammootty (@mammukka) January 1, 2024 -
ఒక ఫ్రేమ్ లోకి రజినీకాంత్, మమ్మూట్టి..?
-
Yatra 2 Movie: పవర్ఫుల్ డైలాగ్‌తో వైఎస్ భారతి లుక్ రిలీజ్
యాత్ర’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సూపర్‌హిట్ మూవీ ‘యాత్ర’కి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మహి. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మరాఠీ నటి కేతకి నారాయణన్ నటిస్తోంది. నేడు(డిసెంబర్ 9) వైఎస్ భారతి పుట్టినరోజు. ఈ సందర్భంగా యాత్ర 2 మూవీలో ఆమె క్యారెక్టర్ లుక్ పోస్టర్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్‌పై ‘నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్లకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడటం కూడా నేర్పించలేదు.’ అని భారతి పాత్ర చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌ని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. యాత్ర’ చిత్రాన్ని ఫిబ్రవరి 8, 2019లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. A resilient force behind the rise of a leader! Presenting @KetakiNarayan as #YSBharathi from #Yatra2. In cinemas from 8th Feb, 2024.#HBDYSBharathiGaru #Yatra2OnFeb8th #LegacyLivesOn @ShivaMeka @MahiVraghav @vcelluloidsoffl @3alproduction pic.twitter.com/KdhUuB47wA — Mahi Vraghav (@MahiVraghav) December 9, 2023 -
నాకు సోదరి కూడా ఉందంటూ ఫోటో షేర్ చేసిన దుల్కర్
సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్లో జెండా పాతిన హీరోల్లో దుల్కర్ సల్మాన్ కూడా ఒకరు. సీతారామం, చుప్,కింగ్ ఆఫ్ కొత్త లాంటి సినిమాల ద్వారా ఇటు మలయాళ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లో కూడా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన సూర్యతో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటో తన అక్క సురుమి తీసినట్లు ఆయన తెలిపాడు. మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి కుమారుడే దుల్కర్ సల్మాన్.. తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్.. ఇండస్ట్రీలో సూపర్ హిట్లు కొడుతున్నాడు. కానీ ఆయన సోదరి సురుమి మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆమెకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆమె చాలా పెయింటింగ్స్ వేయడం జరిగింది. దుల్కర్, సురుమి ఇద్దరూ కూడా మంచి స్నేహితుల్లా ఉంటారు. తన సోదరి సురుమి తీసిన ఫోటోను దుల్కర్ షేర్ చేశాడు. ఆ ఫోటోలో దుల్కర్‌తో ఉన్న వ్యక్తి సురుమి భర్త డా. ముహమ్మద్ రేహాన్ షాహిద్ అని అభిమానులు గుర్తించారు. ఆ ఫోటోకు క్యాండిడ్ క్యాప్చర్ అనే టైటిల్‌ను ఆయన చేర్చాడు. మై వన్ అండ్ ఓన్లీ, సిబ్లింగ్ క్లిక్, బెస్ట్, క్యాండిడ్ ఫోటోలు, స్పెషల్ సమ్మిట్, క్లీనింగ్ అప్, బిజినెస్మెన్ అనే ట్యాగ్‌లతో దుల్కర్ చిత్రాన్ని పంచుకున్నాడు. సోదరి తీసిన ఆ ఫోటో అభిమానుల దృష్టిని త్వరగా ఆకర్షించింది. బావ బావమరుదుల ముఖాలు కూడా స్పష్టంగా ఉండేలా ఫోటో షేర్ చేసి ఉంటే బాగుండని వ్యాఖ్యానిస్తున్నారు. దుల్కర్ తన బావతో కలిసి ఫార్మల్ డ్రెస్‌లో స్టైలిష్ స్మైల్‌తో ఫోటోలో కనిపించాడు. 'నాకు ఒక సోదరి ఉంది.. ఆమె నేరుగా నిలబడి ఫోటోకు ఎలా పోజులివ్వాలో కూడా ఆమెకు తెలియదు. దుల్కర్ తరచుగా తండ్రి, సోదరి మోడల్‌గా పోజులిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ఒక సినిమాలో భాగంగా దుల్కర్‌తో మమ్ముట్టి ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ సినిమాకు సురుమి మాత్రమే ఎందుకు రాలేదని నెటిజన్లు కామెంట్లు చేశారు. వాటికి స్వయంగా సురుమినే సమాధానమిచ్చింది. తనకు సినిమాలంటే ఇష్టమని, అయితే కెమెరా ముందుకు రాలేనని, తెరపై సోదరుడిలా కనిపించడం తనకు ఇష్టం లేదని సురుమి తెలిపింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సురుమి పెయింటింగ్ అక్కడి ఎగ్జిబిషన్లో పాపులర్ అయింది. తొమ్మిదో తరగతి నుంచి చిత్రలేఖనంపై ఆమెకు పట్టు ఉంది. సురుమికి ఇద్దరు కుమారులు. బెంగుళూరులో తన భర్త ముహమ్మద్ రేహాన్ షాహిద్‌తో సురుమి ఉంది. View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
నా అభిమాన హీరో ఆయనే.. సమంత పోస్ట్ వైరల్!
ఖుషి సినిమా తర్వాత సమంత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే చికిత్స కోసం విదేశాలకు వెళ్లి వచ్చిన భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉంటోన్న సామ్ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఓ మూవీని చూసిన సమంత తన రివ్యూను అభిమానులతో పంచుకున్నారు. సామ్ తాజాగా మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన కాథల్-ది కోర్ చిత్రంపై తన రివ్యూను ప్రకటించారు. సమంత ట్విట్టర్లో రాస్తూ.. 'కాథల్-ది కోర్ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఏడాదిలో నేను చూసిన ఉత్తమ చిత్రం ఇదే. తప్పకుండా అందరు కలిసి చూడాల్సిన చిత్రమిది. మమ్ముట్టి నా అభిమాన హీరో. ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మూవీ ఫీల్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నా. మంచి సినిమాలు చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లవ్ యూ జ్యోతిక' అంటూ పోస్ట్ చేసింది. అలాగే మూవీ డైరెక్టర్ జీయో బాబీని లెజెండ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. సమంత పోస్ట్‌పై కాథల్ ది కోర్ చిత్ర నిర్మాణ సంస్థ కూడా స్పందించింది. ఆమెకు ధన్యవాదాలు చెబుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. కాగా.. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరును ప్రధానంగా ఈ మూవీలో చూపించారు. -
Anagha Maya Ravi: మమ్ముట్టి ఆన్‌స్క్రీన్ కూతుర్ని చూశారా? రచ్చ లేపుతోందిగా (ఫోటోలు)
-
హోమో సెక్సువల్ పాత్రలో స్టార్ హీరో.. ఆ రెండు దేశాల్లో బ్యాన్!
ఆరు దశాబ్దాల వయసు దాటినా.. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న అతికొద్ది మంది హీరోల్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక్కరు. ఈ వయసులో కూడా ఆయన డిఫరెంట్ చిత్రాలతోనే ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఈ మెగాస్టార్ నటించిన మరో ప్రయోగాత్మక చిత్రం ‘కాథల్-ది కోర్’. జీయో బేబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టికి జోడీగా జ్యోతిక నటించింది. నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు కొద్ది రోజుల ముందే ఈ చిత్రానికి ఊహించని షాక్ తగిలిగింది. ఈ మలయాళ చిత్రాన్ని రెండు దేశాలు నిషేధించాయి. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని(హోమో-సెక్సువాలిటీ)ప్రోత్సహించేలా ఉందని కువైట్, ఖతార్ దేశాలు బ్యాన్ చేశాయి. ‘కాథల్-ది కోర్’ కథేంటి? ఈ చిత్రాన్ని త్వరలోనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ప్రదర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ పత్రిక..ఈ చిత్రం కథని క్లుప్తంగా వివరిస్తూ వార్తను ప్రచురించింది. దాని ప్రకారం.. కో ఆపరేటివ్ బ్యాంకులో పని చేసి రిటైర్ అయిన జార్జ్(మమ్ముట్టి).. భార్య ఓమన(జ్యోతిక)తో కలిసి తీకోయ్ అనే చిన్న ఊళ్ళో నివసిస్తుంటాడు. అతను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. (చదవండి: వారి వల్ల నా ఫ్యామిలీలో పక్కన పెట్టేశారు.. చనిపోదామనుకున్న అంటూ యమున ఆవేదన) నామినేషన్ వేసిన తర్వాత..అతని భార్య ఓమన హఠాత్తుగా విడుకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతుంది. అదే గ్రామంలో డ్రైవింగ్ స్కూల్ నడిపే వ్యక్తితో జార్జ్ స్వలింగ సంపర్క బంధం కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది. జోసెఫ్ మాత్రం తీవ్రంగా ఖండిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎన్నికల్లో జార్జ్ పోటీ చేశాడా? లేదా? విడాకుల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం చూసే తీరును ఇందులో చూపించినట్లు ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు చెప్పారు. దీంతో కువైట్, ఖతార్ దేశాలు ఈ చిత్రాన్ని బహిష్కరించాయి. -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న చిత్రాలు.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
ప్రస్తుత రోజుల్లో సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలపైనే ఆధారపడుతున్నారు. సినిమాలు కుటుంబంతో కలసి ఇంట్లోనే చూసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ప్రతివారంలో రిలీజయ్యే సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా చిన్న చిత్రాలను సైతం ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంతే కాకుండా దక్షిణాదిలో మలయాళంలోనూ ప్రతివారం సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్లు ఉన్న సినిమాలకు మరింత ఆదరణ లభిస్తోంది. అలాగే ఈ వారంలో మిమ్మల్ని అలరించేదుకు వస్తోన్న మాలీవుడ్ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. ఓటీటీలో అలరిస్తోన్న మాలీవుడ్ సినిమాలు ఇవే! 1. కన్నూరు స్క్వాడ్ - మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన చిత్రం కన్నూరు స్క్వాడ్. ఈ మూవీ మలయాళంలో రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సూపర్ హిట్ మూవీ ఈ శుక్రవారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2.మాస్టర్‌పీస్ వెబ్ సిరీస్ - నిత్య మీనన్ ప్రధాన పాత్రలో వచ్చిన మలయాళ కామెడీ వెబ్ సిరీస్ ఇది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లనే అందుబాటులో ఉంది. 3.కాసర్ గోల్డ్ - రెండున్నర కోట్ల విలువైన బంగారం చోరీ చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా కాసర్ గోల్డ్ తెరకెక్కించారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 4.వాలట్టీ - రెండు కుక్కల చుట్టూ తిరిగే ఎమోషనల్ కథే వాలట్టీ. కుక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం నవంబర్ 7 నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 5.18 ప్లస్ - ప్రేమ, స్నేహం, కుటుంబ మద్దతు లేకుండా లేచిపోయి పెళ్లి చేసుకునే జంట ఇబ్బందులే కథాంశంగా తీసిన చిత్రమిది. సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఫీల్ గుడ్ మూవీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. 6.నెయ్మార్ - మనషులు, జంతువుల మధ్య ఉండే రిలేషన్స్‌ను చాటి చెప్పే సినిమా నెయ్మార్. నెయ్మార్ అనే ఓ కుక్క ఇద్దరు స్నేహితుల జీవితాలను ఎలా మార్చిందనేది కథాంశాన్నే తెరకెక్కించారు. ఈ సినిమా కూడా హాట్‌స్టార్‌లో అలరిస్తోంది. -
యాత్రలో జర్మనీ నటి సుజానే
‘యాత్ర’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాలో సోనియా గాంధీ పాత్రని జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహి వి. రాఘవ్ మాట్లాడుతూ–‘‘యాత్ర’కి కొనసాగింపుగా ‘యాత్ర 2’ రూపొందుతోంది. వైఎస్ జగన్‌గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనలను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ‘యాత్ర 2’ని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్ నారాయణన్. -
ఓటీటీకి వచ్చేస్తోన్న మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే అఖిల్ ఏజెంట్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఏడాది మలయాళంలో ఆయన నటించిన తాజా చిత్రం 'కన్నూర్ స్క్వాడ్'. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన కన్నూర్ స్క్వాడ్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 10 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంగా వచ్చిన ఈ చిత్రానికి రాబీ వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తన స్వీయ నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ పతాకంపై నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా 35 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. (ఇది చదవండి: ఆ ఓటీటీకి వరుణ్- లావణ్య పెళ్లి వేడుక!!) కథ ఏంటంటే.. కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో కన్నూర్ స్క్వాడ్ టీమ్ నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంతటి క్లిష్టతరమైన కేసునైనా తమ ధైర్యసాహసాలతో సాల్వ్ చేస్తుంటారు. అలాంటి టీమ్‌కు సవాల్‌గా పొలిటిషియన్ దారుణ హత్యకు సంబంధించిన కేసు వస్తుంది. ఈ కేసును పది రోజుల్లో సాల్వ్ చేయాలని పోలీసులను హోమ్ మినిస్టర్ ఆదేశిస్తాడు. ఎలాంటి ఆధారాలు లేని ఈ క్రైమ్‌ను కన్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది? ఈ మర్డర్ చేసింది ఎవరు? ఆ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కన్నూర్ స్క్వాడ్ టీమ్ ఎలా ప్రయాణం చేసింది? నిజాయితీకి మారుపేరైన కన్నూర్ స్క్వాడ్ టీమ్‌పై లంచగొండిగా ఎందుకు ముద్రపడింది? యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన కన్నూర్ స్వ్కాడ్ టీమ్ తమ ప్రాణాలను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారు అన్నదే ఈ సినిమా.. కన్నూర్ స్క్వాడ్ సినిమా చాలా వరకు కార్తీ 'ఖాకీ' సినిమాను గుర్తుకు తెస్తుంది. -
మమ్ముట్టికి మైల్స్టోన్ చిత్రంగా 'కన్నూర్ స్క్వాడ్'.. కథ ఏంటంటే?
శాండిల్‌వుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తాజాగా విడుదల చేసిన 'కన్నూర్ స్క్వాడ్' 100 కోట్ల క్లబ్లో చేరింది. సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 35 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మమ్ముట్టి నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను కూడా మమ్ముట్టి సంస్థ షేర్ చేసింది. 100 కోట్ల క్లబ్లో చేరిన మమ్ముట్టికి ‘కన్నూర్ స్క్వాడ్’ నాలుగో చిత్రం. (ఇదీ చదవండి: బిగ్ బాస్ ఎలిమినేషన్.. టేస్టీ తేజకు రిటర్న్ గిఫ్ట్.. సందీప్ పోస్ట్ వైరల్) గతంలో 'భీష్మ పర్వం', 'మధురరాజా', 'మామాంగమ్' చిత్రాలు కూడా మమ్ముట్టి 100 కోట్ల క్లబ్లో చేరిన మలయాళ సినిమాలు. ‘కన్నూర్ స్క్వాడ్’ చిత్రం విడుదలైన రోజు నుంచి థియేటర్లలో మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికీ కూడా వీకెండ్లో కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. 'కన్నూర్ స్క్వాడ్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో చేరి మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. 'కన్నూర్ స్క్వాడ్' కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లు వసూలు చేసింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమా విజయాన్ని అభినందించారు. ‘కన్నూర్ స్క్వాడ్’ చూనిట్ సభ్యులందరికీ సోషల్ మీడియా ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలిపాడు. ఈ చిత్రంపై చూపిన అంతులేని ప్రేమకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. కథ ఏంటి..? కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో కన్నూర్ స్క్వాడ్ టీమ్ నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంతటి క్లిష్టతరమైన కేసునైనా తమ ధైర్యసాహసాలతో సాల్వ్ చేస్తుంటారు. అలాంటి టీమ్‌కు సవాల్‌గా పొలిటిషియన్ దారుణ హత్యకు సంబంధించిన కేసు వస్తుంది. ఈ కేసును పది రోజుల్లో సాల్వ్ చేయాలని పోలీసులను హోమ్ మినిస్టర్ ఆదేశిస్తాడు. ఎలాంటి ఆదారాలు లేని ఈ క్రైమ్‌ను కన్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది? ఈ మర్డర్ చేసింది ఎవరు? ఆ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కన్నూర్ స్క్వాడ్ టీమ్ ఎలా ప్రయాణం చేసింది? నిజాయితీకి మారుపేరైన కన్నూర్ స్క్వాడ్ టీమ్‌పై లంచగొండిగా ఎందుకు ముద్రపడింది? యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన కన్నూర్ స్వ్కాడ్ టీమ్ తమ ప్రాణాలను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారు అన్నదే ఈ సినిమా.. కన్నూర్ స్క్వాడ్ సినిమా చాలా వరకు కార్తీ 'ఖాకీ' సినిమాను గుర్తుకుతెస్తుంది. -
Viral Pics: కేరళీయం 2023 వేడుకలు: ఒకే ఫ్రేమ్‌లో దిగ్గజాలు (ఫొటోలు)
-
మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'భ్రమయుగం'. రాహుల్ సదాశివం దర్శకుడు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమూల్దా లైజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. క్రిస్టో జవీర్ సంగీతమందిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్) ఆగస్టు 17 నుంచి ఒట్టపాలెం, కొచ్చి, అదిరపల్లి ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు చెప్పాడు. అయితే పాన్ ఇండియా సినిమా షూటింగ్ కేవలం రెండు నెలల్లో పూర్తిచేయడమంటే విశేషమనే చెప్పాలి. కొన్నాళ్ల ముందు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా విశేష స్పందన వచ్చిందని స్వయంగా దర్శకుడు చెప్పాడు. ఈ క్రమంలోనే చిత్ర విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని దర్శకుడు పేర్కొన్నారు. వైవిధ్య భరితమైన హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా 'భ్రమయుగం' ఉంటుందని దర్శకుడు చెప్పాడు. వచ్చేది ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. (ఇదీ చదవండి: కీర్తి సురేశ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. హాజరైన ఆ నిర్మాత) -
వచ్చే ఏడాది భ్రమ యుగం
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన హారర్–థ్రిల్లర్ ఫిల్మ్ ‘భ్రమ యుగం’. రాహుల్ సదాశివన్ రచన–దర్శకత్వంలో చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఏకకాలంలో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ‘‘ఈ ఏడాది ఆగస్టులోప్రారంభమైన ఈ సినిమాను ఓట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి వంటి లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఒక్కటి గుర్తు పెట్టుకోండి!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. 2019 ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘యాత్ర 2’ మూవీని తెరకెక్కిస్తున్నారు మహి వి.రాఘవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. ‘యాత్ర’లో వైఎస్ఆర్ పాత్ర పోషించిన మమ్ముట్టి ‘యాత్ర 2’ లోనూ అదే పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలోని వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘నేనెవరో ఇంకా ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి... నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అనే అనే డైలాగ్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఉన్నాయి. మహి వి.రాఘవ్ మాట్లాడుతూ–‘‘వైఎస్ జగన్‌గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ రూపొందుతోంది. ఈ సినిమాని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యులాయిడ్‌పై శివ మేక నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్ నారాయణన్. -
యాత్ర 2.. ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్.. ఒక్కటి గుర్తుపెట్టుకోండి!
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'యాత్ర'. 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! యాత్ర 2 లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటిస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. పోస్టర్లో మమ్ముట్టి, జీవా ఇన్టెన్స్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ‘నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి...నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని’ అనే ఎమోషనల్ డైలాగ్‌ను కూడా పోస్టర్లో గమనించవచ్చు. పోస్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 - 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు ‘యాత్ర 2’ని తెరకెక్కిస్తున్నారు. ‘యాత్ర’ చిత్రాన్ని 2019లో ఫిబ్రవరి 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. In the shadow of a legend, A leader rises! Presenting the first look of #Yatra2. In cinemas from 8th Feb, 2024.#Yatra2FL #Yatra2OnFeb8th #LegacyLivesOn @mammukka @JiivaOfficial @ShivaMeka @vcelluloidsoff @KetakiNarayan @Music_Santhosh @madhie1 #SelvaKumar @3alproduction pic.twitter.com/doygY3BBTC — Mahi Vraghav (@MahiVraghav) October 9, 2023 చదవండి: కొత్త కంటెస్టెంట్ల చేతిలో నామినేషన్స్ ప్రక్రియ.. అమర్, తేజలకు.. -
ఒకే ఏడాదిలో రెండు విషాదాలు.. శోకసంద్రంలో మమ్ముట్టి కుటుంబం!
ప్రముఖ సీనియర్ నటుడు, మలయాళం స్టార్ మమ్ముట్టి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి అమీనా(70) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుకూ తుదిశ్వాస విడిచారు. కాగా.. అమీనాకు జిబిన్ సలీం, జూలీ, జూబీ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బుధవారం (సెప్టెంబర్ 13) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇటీవలే మమ్ముట్టి తన 72వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: Balayya : నేను ముందుంటా, టిడిపిని నడిపిస్తా : బాలకృష్ణ) అయితే ఈ ఏడాదిలోనే మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ఏప్రిల్ 21న మరణించిన సంగతి తెలిసిందే. వరుస విషాదాలతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమీనా మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ, మమ్ముట్టి అభిమానులు సంతాపం ప్రకటించారు. కాగా.. ప్రస్తుతం మమ్ముట్టి 'బ్రహ్మయుగం' అనే చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 7 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. (ఇది చదవండి: ఆ రెండు చిత్రాలనే నమ్ముకున్న రకుల్.. ఈసారైన కలిసొచ్చేనా?) -
థియేటర్లలో మిమ్మల్ని భయపెట్టేందుకు వస్తున్న సినిమాలు ఇవే..
హారర్ చిత్రాలంటే వెన్నులోంచి టెర్రర్ పుట్టాల్సిందే. అలా క్షణ క్షణం భయపడుతూ హారర్ చిత్రాలు చూడటంలో చాలామందికి ఓ కిక్ దొరుకుతుంది. ఆ భయమే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడలా థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టి, వసూళ్లు రాబట్టడానికి కొందరు హారర్ చిత్రాలు చేస్తున్నారు. ఆ చిత్రాలేంటో తెలుసుకుందాం. భ్రమ యుగంలో... సుధీర్ఘమైన కెరీర్లో ఎన్నో రకాల సినిమాల్లో నటించారు మమ్ముట్టి. ఈ ప్రయాణంలో ΄పొలిటికల్, థ్రిల్లర్, హారర్, సస్పెన్స్.. ఇలా ఎన్నో జానర్స్‌ను టచ్ చేశారాయన. తాజాగా ‘భ్రమ యుగం’ అనే హారర్ ఫిల్మ్‌లో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథతో రాహుల్ సదా శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. హారర్ రాజా లవ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో సాగే చిత్రాలు చేస్తున్నప్పటికీ ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లోనే నటిస్తారు ప్రభాస్. అయితే తొలిసారి ప్రభాస్ హ్యూమర్‌తో కూడిన హారర్ అంశాలు ఉండే ఓ సినిమాలో నటిస్తున్నారు. మారుతి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’, ‘వింటేజ్ కింగ్’, ‘అంబాసిడర్’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని సమాచారం. మాళవికా మోహనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీ రోల్లో సంజయ్ దత్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా టైటిల్, రిలీజ్‌లపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చంద్రముఖి తిరిగొస్తే.. హారర్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులు ‘చంద్రముఖి’ని అంత సులభంగా మర్చిపోలేరు. వెంకటపతి రాజుగా రజనీకాంత్, చంద్రముఖిగా జ్యోతిక వెండితెరపై ప్రదర్శించిన నటన అలాంటిది. ఇప్పుడు ‘చంద్రముఖి’ మళ్లీ వస్తోంది. కానీ రజనీ, జ్యోతికలు రావడం లేదు. ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా రూ΄పొందిన ‘చంద్రముఖి 2’లో రజనీ, జ్యోతికల స్థానాల్లో రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ నటించారు. ‘చంద్రముఖి’ని డైరెక్ట్ చేసిన పి. వాసుయే ‘చంద్రముఖి 2’ని తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. భైరవకోనలో ఏం జరిగింది? ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో ప్రేక్షకులను భయపెడుతూ, కథలో వీలైనప్పుడు నవ్వించారు దర్శకుడు వీఐ ఆనంద్. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా ‘ఊరుపేరు భైరవకోన’. ఇందులో సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్. ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో హారర్ అండ్ సస్పెన్స్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ఇటీవల విడుదలైన టీజర్ స్పష్టం చేస్తోంది. భైరవకోన అనే ఊర్లో జరిగే కొన్ని కల్పిత ఘటనల సమాహారంగా ఈ సినిమా కథనం సాగనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మంత్రం.. తంత్రం.. ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న తెలుగు కథానాయికల్లో అనన్య నాగళ్ల ఒకరు. అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్న ఈ బిజీ అమ్మాయి లిస్ట్‌లో ‘తంత్ర’ అనే ఓ హారర్ ఫిల్మ్ కూడా ఉంది. తాంత్రిక శాస్త్రం, పురాణ గాధల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఈ చిత్రదర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి పేర్కొన్నారు. ధనుష్ (దివంగత నటుడు శ్రీహరి తమ్ముడు కొడుకు) నటుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓ మంచి దెయ్యం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ప్రేమకథా చిత్రమ్ 2’.. ఇలా హీరోయిన్ నందితా శ్వేతకు హారర్ జానర్లో నటించిన అనుభవం ఉంది. ఈ క్రమంలో నందితా శ్వేత చేసిన మరో హారర్ ఫిల్మ్ ‘ఓఎమ్‌జీ’. ‘ఓ మంచి ఘోస్ట్’ ఉపశీర్షిక. ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, నవమి గాయక్ ఈ సినిమాలో ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. మార్తాండ్ కె. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. మరి.. మంచి దెయ్యంగా నందితా శ్వేత ఏ రేంజ్లో భయపెడతారో చూడాలి. కేరాఫ్ దెయ్యం గ్రామాల్లో ఒకప్పుడు మాతంగులుగా జీవించిన వారి జీవితాల ఆధారంగా రూ΄పొందుతున్న హారర్ ఫిల్మ్ ‘భయం కేరాఫ్ దెయ్యం’. ఈ చిత్రంలో ఓ మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా రవిబాబు, తాంత్రికుడిగా సత్యప్రకాష్ నటిస్తున్నారు. సీవీఎమ్ వెంకట రవీంద్రనాథ్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూ΄పొందుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తంతిరం హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథాచిత్రం ‘తంతిరం’. భార్యాభర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ప్రభావితం అవుతుందనేది ఈ సినిమా కథాంశం. మెహర్ దీపక్ దర్శకుడు. ఈ సినిమా మేజర్ షూటింగ్ కేరళలో జరి గింది. శ్రీకాంత్, ప్రియాంక లీడ్ రోల్స్ చేశారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు.. హారర్ జానర్లో ప్రేక్షకులను భయ పెట్టే మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. -
జైలర్ సినిమాలో మెగాస్టార్ ఉండాల్సింది, సైడ్ చేసిన రజనీకాంత్!
సాధారణంగా సినిమాలో ఇద్దరు స్టార్స్ ఉంటేనే చూసేందుకు రెండు కళ్లు చాలవు. అలాంటిది జైలర్‌లో ఒకరిద్దరు కాదు, అనేకమంది స్టార్స్ ఉన్నారు. కన్నడ నుంచి శివ రాజ్‌కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్.. ఇలా వివిధ భాషల నుంచి వేర్వేరు స్టార్స్‌ను తీసుకువచ్చారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రయత్నం సక్సెస్ అయింది. ఎవరి ప్రాధాన్యతను తగ్గించకుండా అందరికీ సమన్యాయం చేస్తూ అందరి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు డైరెక్టర్. విలన్‌గా ఈయన చేయాల్సింది కాదు ఇకపోతే ఈ సినిమాలో విలన్ వర్మాన్ పాత్ర కూడా బాగా పండింది. నటుడు వినాయకన్ ఈ పాత్రకు సరిగ్గా సెట్టయ్యాడు. అయితే విలన్ పాత్ర ఈయన చేయాల్సింది కాదట! మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చేయాల్సిందట! ఈ విషయాన్ని జైలర్‌లో రజనీ కొడుకుగా నటించిన వసంత రవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మమ్ముట్టి సర్‌ను విలన్‌గా అనుకున్నారు. రజనీకాంత్ సరే సెట్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు. కానీ మమ్ముట్టికి అలాంటి పాత్ర ఇవ్వడానికి ఆయనకు మనసొప్పలేదు. మమ్ముట్టికి అలాంటి పాత్రనా? బాధపడ్డ రజనీ నెగెటివ్ పాత్రలో తనను ఊహించుకోలేకపోయాడు. ఆయనే స్వయంగా మమ్ముట్టి సర్‌కు ఫోన్ చేసి మనం ఇది కాకుండా మరో సినిమాలో కలిసి నటిద్దాం అని చెప్పాడు. అలా ఆయన విలన్‌గా చేయలేదు అని పేర్కొన్నాడు. ఇకపోతే మమ్ముట్టి ప్రస్తుతం భ్రమయుగం అనే సినిమా చేస్తున్నాడు. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్డూడియోస్ల సమర్పణలో ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తున్నారు. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. చదవండి: జైలర్‌లో డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫేమస్ అవ్వడానికి ముందే గదిలో శవమై.. -
మెగాస్టార్ కొత్త సినిమా.. హారర్ థ్రిల్లర్ కథతో!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘భ్రమయుగం’ టైటిల్ ఖరారైంది. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్డూడియోస్ల సమర్పణలో ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తున్నారు. ‘భ్రమ యుగం’ సినిమా చిత్రీకరణ గురువారం ప్రారంభమైంది. ‘‘ఇప్పటివరకూ చేయని కొత్త పాత్రను ఈ సినిమాలో చేస్తున్నాను’’ అని మమ్ముట్టి అన్నారు. ‘‘కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథ ‘భ్రమ యుగం’’ అన్నారు రాహుల్ సదాశివన్. ‘‘హారర్, థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికే మా నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశాం. తొలి చిత్రాన్నే మమ్ముట్టీగారితో చేస్తుండడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. మమ్ముట్టీగారి ఇమేజ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్తుంది. దర్శకుడు రాహుల్ సృష్టించిన అద్భుత ప్రపంచం ‘భ్రమ యుగం’’ అన్నారు నిర్మాతలు. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. #Bramayugam - My next, shoot commences today ! Written & Directed by #RahulSadasivan Produced by @chakdyn @sash041075 Banner @allnightshifts @StudiosYNot pic.twitter.com/Qf9gRVwKzY — Mammootty (@mammukka) August 17, 2023 -
‘ఏజెంట్’మూవీ ట్విటర్ రివ్యూ
మాస్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు అఖిల్ అక్కినేని. తొలి సినిమా కోసం మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్‌ని ఎంచుకొని భారీ బడ్జెట్‌తో ‘అఖిల్’ని తీశాడు.అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో తన పంథాని మార్చి లవర్ బాయ్‌గా మారాడు. అయినా కూడా పెద్ద సెక్సెస్‌ని అందుకోలేకపోయాడు. చివరి మూవీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` ఓ మోస్తరు విజయం సాధించింది. అయినా కూడా లవర్ బాయ్‌గా ఉండేందుకు అఖిల్ ఇష్టపడటం లేదు. మాస్ హీరోగా నిరూపించుకోవడానికి ఈ సారి ‘ఏజెంట్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి `కిక్` ఫేమ్ సురేందర్‌రెడ్డి దర్శకుడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 28) ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఏజెంట్’కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలు ట్విటర్లో చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. Jus Now I have completed my Show .it was kutha ramp for masses . justification has been done for tha tag #wildsale ..🥵🥵🥵🙏🙏🙏 will be first 100cr share from Tier 2 Those whoever wants to take screen shot they can ...#Agent — Pawanfied (@OnlyPSPK_) April 28, 2023 ట్విటర్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమాలో యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయని అంటున్నారు. యాక్షన్ పరంగా అఖిల్ ఆకట్టుకున్నాడని చెబుతున్నారు. కానీ కథ బలంగా లేదని కామెంట్ చేస్తున్నారు. ఫస్టాఫ్ కొంత ఫర్వాలేదు కానీ సెకండాఫ్ కొంపముంచిందని నెటిజన్స్ అంటున్నారు. అఖిల్ వన్ మ్యాన్ షో అని కామెంట్ చేస్తున్నారు. #Agent what a mess..Surender Reddy completely lost it..feel sorry for Akhil..not even one department was decent..bgm was horrible and the graphics are awful..the film looks incomplete..I am not sure if DI is complete…it had a dark shade throughout.. Disaster. — akhil_maheshfan2 (@Maheshfan_1) April 28, 2023 Akhil One man Show 💥💥💥 Action Sequences Mathram 👌👌👌 Love story 😢😢😢 Songs 😢😢😢 BGM 🥵 Interval And Climax KCPD 💥💥💥 Negetive Reviews patinchukovadhu Movie Bagundhi 👍👍 Rating:3/5 #Agent #AkhilAkkineni pic.twitter.com/UUwvOYhVez — Srinivas (@srinivasrtfan2) April 28, 2023 Interval bang that's a wild ride @DirSurender mark 1st half and that looks good Especially Action scenes and dailogues 🔥🔥#Agent — RAVANNAsura (@Karthik70504619) April 28, 2023 #Agent An engaging Spy Action Film! Akhil is extra ordinary in this movie and can see his hard work and dedication in action sequences and comedy scenes, cinematography and BGM are main highlights of the movie. Surendra reddy delivers a hit again after SyeRaa. pic.twitter.com/DwhK91ZbYO — Johnnie Walker (@roopezh) April 28, 2023 #Agent: 👉#Agent is such a terrible film. In recent times, Telugu Film Industry has not produced such a bad film 👉It’s a third-rate film because of the medicore direction and predictable plot 👉#AkhilAkkinen’s transformative efforts are futile#AgentReview #Mammootty — PaniPuri (@THEPANIPURI) April 28, 2023 #Agentreview from USA premiere : Excellent Response💥💥💥 Great action episodes Akhil's terrific screen presence 💥💥 Awesome screenplay Never Before Songs Kummesayi, WildSaale Song Mind-blowing🥵 Full of suspense n twists. ⭐⭐⭐⭐/5#AkhilAkkineni #Agent #BlockbusterAgent 🔥💥 — RAVANNAsura (@Karthik70504619) April 28, 2023 Interval bang that's a wild ride @DirSurender mark 1st half and that looks good Especially Action scenes and dailogues 🔥🔥#Agent — RAVANNAsura (@Karthik70504619) April 28, 2023 -
ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ హీరో తల్లి కన్నుమూత..!
మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తల్లి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫాతిమా ఇస్మాయిల్(93) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. కాగా.. మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగువారికి కూడా సుపరిచితమైన నటుడు మమ్ముట్టి. తెలుగులోనూ చాలా సినిమాల్లో నటించారు. తనదైన నటనతో టాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. గతేడాది ఆయన నటించిన చిత్రం రాస్చాక్. ఈ సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం అక్కినేని అఖిల్ మూవీ ఏజెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. -
Agent Movie: సముద్ర తీరాన ఏజెంట్ మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ (ఫొటోలు)
-
‘యాత్ర’.. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం
కొన్ని కథలు ప్రేక్షకులను అలరిస్తాయి.. ఆలోచింపజేస్తాయి. మరికొన్ని కథలు హృదయాలను హత్తుకుంటాయి. కన్నీళ్లను తెప్పిస్తాయి. అలా మనసుల్ని హత్తుకునే కథలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. అలాంటి వాటిలో ‘యాత్ర’ ఒకటి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ఇది. వైఎస్సార్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. నాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్సార్.. పాదయాత్ర ద్వారా జనంలోకి ఎలా వెళ్లగలిగారు? సమస్యలు ఎలా తెలుసుకున్నారు? కష్టాలకు పట్టించుకోకుండా.. మండుటెండల్లో ఎలా ముందడుగు వేశారు.. మండుటెండల్లో ఎలా ముందడుగు వేశారు? ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి? పాదయాత్ర రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది? యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి ? పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు? అన్నదే ఈ సినిమా కథ. ఒక సినిమాకు కథతో పాటు క్యారెక్టర్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యం. ఇదే సినిమా సక్సెస్‌ని నిర్ణయిస్తుంది. వైఎస్సార్ పాత్రకు మలయాళ నటదిగ్గజం మమ్ముట్టిని ఎంపిక చేయడంతోనే ఈ సినిమా సగం విజయం సాధించింది. ‘యాత్ర’ సినిమా అనేది ఓ ఎమోషనల్ జర్నీ. ఇందులో పెద్దగా కథ కంటే పాత్రలే ముఖ్యం. వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పెట్టి నటించాడు. ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకు తెర మీద రాజన్ననే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు మమ్ముట్టి. రాజశేఖరరెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు. సినిమా అంతా ఒక ఎత్తైయితే క్లైమాక్స్‌లో వచ్చే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీన్స్ మరో ఎత్తు. అప్పటి వరకు వైఎస్సార్ గొప్పతనాన్ని తెలుసుకొని ఉప్పొంగిపోయిన ప్రేక్షకులను చివర్లో చూపించే రియల్ ఫుటేజ్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్ని బయోపిక్ మూవీస్‌లా కేవలం కథను మాత్రమే చెప్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు మహి వీ రాఘవ. సినిమా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు. అందుకే విమర్శకులు సైతం రాఘవపై ప్రశంసలు కురిపించారు. సూటిగా సుత్తి లేకుండా, చెప్పాల్సిన విషయాన్ని ఎమోషనల్‌గా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా.. కంటతడి పెట్టించేలా ‘యాత్ర’ను తీర్చి దిద్దారు. (యాత్ర సినిమా విడుదలై నేటికి(ఫిబ్రవరి 8) నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా..) -
క్షమించండి.. ఇకపై అలా జరగదు.. స్టార్ హీరో
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లకు క్షమాపణలు చెప్పారు. తన తప్పును తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అసలు విషయమేమిటంటే.. 2018లో కేరళలో వచ్చిన వరదల ఆధారంగా 2018 పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఓ శాంతి ఓషాన' సినిమాతో మంచిపేరు తెచ్చుకున్న జూడో ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మూవీ టీజర్ విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మమ్ముట్టి దర్శకుడిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. ఈవెంట్లో దర్శకుడి హెయిర్ స్టైల్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్ముట్టి మాట్లాడుతూ..'జూడ్ ఆంథోనీ తలపై వెంట్రుకలు లేకపోయినా, అసాధారణమైన మెదడు కలిగిన అత్యుత్తమ ప్రతిభావంతుడైన దర్శకుడు' అని అన్నారు. దీంతో దర్శకుడిని బట్టతల వ్యక్తి అంటూ అవమానించారని నెటిజన్లు భావించారు. ఇలా మాట్లాడడం బాడీ షేమింగ్‌తో సమానమంటూ పోస్టులు చేశారు. దీనిపై మమ్ముట్టి క్షమాపణలు చెబుతూ.. తన అధికారిక సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 'డియర్ ఆల్.. దర్శకుని ప్రశంసించేందుకు నేను వాడిన కొన్ని పదాలు మిమ్మల్ని బాధపెట్టాయని తెలిసింది. ఉత్సాహంతో అలాంటి మాటలు మాట్లాడినందుకు క్షమించండి. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతా. ఈ తప్పును గుర్తుచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. మమ్ముట్టి చేసిన తప్పును వెంటనే అంగీకరించి వెంటనే సోషల్ మీడియా పోస్ట్‌తో క్షమాపణలు చెప్పినందుకు నెటిజన్లు ఇప్పుడు మమ్ముట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
తెలుగులో మలయాళ హిట్ మూవీ, ఓటీటీలో ఎప్పుడంటే?
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించిన సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ రోస్‌చాక్. ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. హాట్‌స్టార్‌లో నవంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా రోస్‌చాక్ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేసింది హాట్‌స్టార్. ఇది చూసిన జనాలు ట్రైలర్ అద్భుతంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. కాగా నిశం బషీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మమ్ముట్టి నిర్మాతగా వ్యవహరించాడు. మిధున్ ముకుందన్ సంగీతం అందించగా కిరణ్ దాస్ ఎడిటర్‌గా పని చేశాడు. అసిఫ్ అలీ, షరఫ్ ఉధీన్, గ్రేస్ ఆంటోని ముఖ్యపాత్రల్లో నటించారు. చదవండి: ఇనయ కోసం సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసిన బిగ్‌బాస్ బాత్‌టబ్‌లో శవమై కనిపించిన సింగర్ -
మరో సూపర్‌స్టార్‌తో విజయ్ సేతుపతి
ఇతర కథానాయకులకు భిన్నమైన నటుడు విజయ్ సేతుపతి. ఈయనకు హీరోగా స్టార్ డమ్ ఉన్నా దాని పక్కన పెట్టి ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కోకుండా నచ్చిన, వచ్చిన అవకాశాలను వదలుకోకుండా నటిస్తుంటారు. ప్రస్తుతం విజయ్‌సేతుపతి గాంధీ టాకీస్, మేరీ క్రిస్మస్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. అలాగే మైఖేల్, విడుదలై, జవాన వంటి చిత్రాల్లో ఇతర హీరోలతో కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే తెలుగు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రలోనూ, తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు విలన్‌గా పేట చిత్రంలో, కమలహాసన్‌కు విలన్‌గా విక్రమ్ చిత్రంలో, విజయ్‌కు ప్రతినాయకుడిగా మాస్టర్ చిత్రంలోనూ పోటీ పడి నటించి మెప్పించారు. కాగా తాజాగా మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టితో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మణికంఠన్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఇందులోనూ విజయ్ సేతుపతి విలన్‌గానే కనిపిస్తారని సమాచారం. ఈ రేర్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
13 ఏళ్ల తర్వాత మళ్లీ మలయాళంలో జ్యోతిక
దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరోయిన్ జ్యోతిక. ఈ నెల 18న జ్యోతిక బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మమ్ముట్టి హీరోగా మలయాళ హిట్ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఫేమ్ జో బేబీ దర్శకత్వంలో ‘కాతల్’ అనే సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలోనే జ్యోతిక హీరోయిన్గా నటించనున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసిన జ్యోతిక ఇంతకుముందు మలయాళంలో ‘రాఖిలి పట్టు’(2007), ‘సీతాకల్యాణం’ (2009) అనేసినిమాలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.