శాండిల్‌వుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తాజాగా విడుదల చేసిన 'కన్నూర్ స్క్వాడ్' 100 కోట్ల క్లబ్‌లో చేరింది. సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 35 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మమ్ముట్టి నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను కూడా మమ్ముట్టి సంస్థ షేర్ చేసింది. 100 కోట్ల క్లబ్‌లో చేరిన మమ్ముట్టికి ‘కన్నూర్ స్క్వాడ్’ నాలుగో చిత్రం.
(ఇదీ చదవండి: బిగ్ బాస్ ఎలిమినేషన్.. టేస్టీ తేజకు రిటర్న్ గిఫ్ట్.. సందీప్ పోస్ట్ వైరల్)
గతంలో 'భీష్మ పర్వం', 'మధురరాజా', 'మామాంగమ్' చిత్రాలు కూడా మమ్ముట్టి 100 కోట్ల క్లబ్‌లో చేరిన మలయాళ సినిమాలు. ‘కన్నూర్ స్క్వాడ్’ చిత్రం విడుదలైన రోజు నుంచి థియేటర్లలో మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికీ కూడా వీకెండ్‌లో కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. 'కన్నూర్ స్క్వాడ్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా 50 కోట్ల క్లబ్‌లో చేరి మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. 'కన్నూర్ స్క్వాడ్' కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లు వసూలు చేసింది.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమా విజయాన్ని అభినందించారు. ‘కన్నూర్ స్క్వాడ్’ చూనిట్ సభ్యులందరికీ సోషల్ మీడియా ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలిపాడు. ఈ చిత్రంపై చూపిన అంతులేని ప్రేమకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.
కథ ఏంటి..?
కేరళ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కన్నూర్ స్క్వాడ్ టీమ్ నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంతటి క్లిష్టతరమైన కేసునైనా తమ ధైర్యసాహసాలతో సాల్వ్ చేస్తుంటారు. అలాంటి టీమ్‌కు సవాల్‌గా పొలిటిషియన్ దారుణ హత్యకు సంబంధించిన కేసు వస్తుంది. ఈ కేసును పది రోజుల్లో సాల్వ్ చేయాలని పోలీసులను హోమ్ మినిస్టర్ ఆదేశిస్తాడు.
ఎలాంటి ఆదారాలు లేని ఈ క్రైమ్‌ను కన్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది? ఈ మర్డర్ చేసింది ఎవరు? ఆ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కన్నూర్ స్క్వాడ్ టీమ్ ఎలా ప్రయాణం చేసింది? నిజాయితీకి మారుపేరైన కన్నూర్ స్క్వాడ్ టీమ్‌పై లంచగొండిగా ఎందుకు ముద్రపడింది? యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన కన్నూర్ స్వ్కాడ్ టీమ్ తమ ప్రాణాలను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారు అన్నదే ఈ సినిమా.. కన్నూర్ స్క్వాడ్ సినిమా చాలా వరకు కార్తీ 'ఖాకీ' సినిమాను గుర్తుకుతెస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment