దుల్కర్‌ చిత్రానికి రూ. 40 కోట్ల ఓటీటీ డీల్‌, ఒప్పందం రద్దు చేయించిన మమ్ముట్టి! | Mammootty Makes Son Dulquer Salmaan Cancel OTT Deal Rs 40 Crore For Kuruppu Movie | Sakshi
Sakshi News home page

Dulquer Salmaan Movie: రూ. 40 కోట్ల ఓటీటీ డీల్‌, అడ్డుకున్న తండ్రి మమ్ముట్టి!

Published Thu, Nov 11 2021 4:20 PM | Last Updated on Thu, Nov 11 2021 4:40 PM

Mammootty Makes Son Dulquer Salmaan Cancel OTT Deal Rs 40 Crore For Kuruppu Movie - Sakshi

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘కురుప్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీ తెరకెక్కి నవంబర్‌ 12న విడుదలకు సిద్దమైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇక ఇటీవల విడుదలైన ‘కురుప్‌’ ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీ విడుదలపై హీరో దుల్కర్‌ సల్మాన్‌, చిత్ర బృందం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

చదవండి: పునీత్‌ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్‌ ఫెలో అంటూ విమర్శలు

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తిక వార్త నెట్టంట చక్కర్లు కొడుతోంది. ‘కురుప్‌’ మూవీ షూటింగ్‌ ఎప్పుడో పూరైనప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మొదట ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్‌ భావించారట. అంతేగాక డిజిటల్‌ విడుదలకు వారికి ఓటీటీ నుంచి రూ. 40 కోట్ల డీల్‌ కూడా కుదిరినట్లు వినికిడి. 

చదవండి: హీరోయిన్‌ పూర్ణతో రవిబాబు ఎఫైర్‌ అంటూ వార్తలు, స్పందించిన నటుడు

అయితే దుల్కర్‌ సల్మాన్‌ తండ్రి, మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి సినిమా చూసి ఓటీటీ డీల్‌ను రద్దు చేసి థియేటర్లో విడుదల చేయమని మేకర్స్‌ను ఒప్పించాడట. తండ్రి చెప్పడంతో వెంటనే రూ. 40 కోట్ల ఓటీటీ ఒప్పందాన్ని దుల్కర్‌ సల్మాన్‌ రద్దు చేసుకుని థియేటర్లో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట. అయితే ఈ చిత్రాన్ని స్యయంగా దుల్కర్‌ సల్మాన్‌ నిర్మించడం విశేషం.  

చదవండి: తెలుగు ప్రేక్షకులను మించిన సినీ ప్రేక్షకులు ఉండరేమో: హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement