ఓటీటీకి మెగాస్టార్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Malayalam Megastar Action Thriller Turbo Movie Streaming On This Date | Sakshi
Sakshi News home page

Ott Release: ఓటీటీకి సునీల్ అరంగేట్ర చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Wed, Jul 10 2024 6:38 PM | Last Updated on Wed, Jul 10 2024 6:58 PM

Malayalam Megastar Actrion Thriller Movie Streaming On This Date

మలయాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్  ట‌ర్బో. మే 23న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్ నటుడు సునీల్ మలయాళ  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. వైశాఖ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో క‌న్న‌డ అగ్ర న‌టుడు రాజ్ బీ శెట్టి విల‌న్‌గా మెప్పించారు.

తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు రిలీజైన రెండు నెల‌ల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. ఆగస్టు 9 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మూవీని మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement