Malayalam actor
-
ఖరీదైన కారు కొనుగోలు చేసిన అమరన్ నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ మలయాళ నటుడు శ్యామ్ మోహన్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కంపెనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కారును సొంతం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన భార్య గోపికతో కలిసి కారు ముందు ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. ప్రేమలు, అమరన్ చిత్రాలతో మెప్పించిన మలయాళ నటుడు శ్యామ్ మోహన్. ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలో శ్యామ్ మోహన్ నటించాడు. ఈ సినిమా తర్వాత మలయాళంలోనే నునాకుజి అనే చిత్రంలోనూ కనిపించారు. ఇటీవల విడుదలైన అమరన్ మూవీలో కీలక పాత్ర పోషించాడు. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన అమరన్ దీపావళి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. View this post on Instagram A post shared by ShyaM Mohan M (@shyammeyyy) -
'ప్రతి రోజు ఐదు లవ్ లెటర్స్'.. ప్రేమకథ పంచుకున్న స్టార్ నటుడి భార్య!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి తెలుగువారికి చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించారు. మాలీవుడ్ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగులోనూ అంతే ఫేమల్ అయ్యారు. ప్రస్తుతం మంచువిష్ణు కన్నప్ప, ఎంపురన్ చిత్రాల్లో నటిస్తున్నారు.అయితే గతంలో మోహన్ లాల్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన భార్య సుచిత్ర వీరిద్దరి ప్రేమాయణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తానే మోహన్ లాల్‌కు ప్రేమలేఖలు రాసేదాన్ని అని తెలిపింది. అదేపనిగా లవ్ లెటర్స్ రాస్తూ విసిగించేదాన్ని అంటూ తమ ప్రేమకథను వివరించింది.సుచిత్ర మాట్లాడుతూ..'నేను ఫస్ట్ టైమ్ త్రివేండ్రంలో అతన్ని కలిశా. అంతకు ముందు కేవలం సినిమాల్లో మాత్రమే చూసేదాన్ని. దగ్గర నుంచి చూడడం అదే మొదటిసారి. మా కుటుంబాలకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని బంధువుల పెళ్లిలో నాకు తెలిసింది. నేను కోజికోడ్‌లో ఉన్నప్పుడు సెలవుల్లో అతని సినిమాలను థియేటర్లలో చూసేదాన్ని. ఆయన మొదటి సినిమా మజిల్ విరింజ పుక్కల్ చూసినప్పుడు ఆయనపై ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ ఆయన టాలెంట్‌ను గుర్తించి ప్రేమించడం మొదలుపెట్టా' అని తెలిపింది.'ఆ తర్వాత నా పేరు రాయకుండా ఆయనకు లేఖలు రాయడం ప్రారంభించా. ప్రతి రోజు ఐదు రాసి పంపించాను. ఆయన అడ్రస్ తెలుసుకుని మరీ లెటర్స్ రాశా. నా ప్రేమలేఖలతోనే ఓ రేంజ్లో వేధించా. మా ఇంట్లో ఉన్నప్పుడు అతన్ని సుందర కుట్టప్పన్ (అందమైన అబ్బాయి) అనే నిక్‌నేమ్‌తో పిలిచేదాన్ని. ఆ తర్వాత మా అమ్మ, నాన్నకు మోహన్‌లాల్ గురించి చెప్పా. వెంటనే నా ప్రేమను అంగీకరించి తెలిసినవాళ్లతో మాట్లాడి మా పెళ్లి చేశారు' తమ లవ్‌స్టోరీని గుర్తుచేసుకున్నారు. కాగా.. మోహన్ లాల్, సుచిత్ర వివాహం 1988లోనే జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
ప్రేమమ్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. పోలీసులు ఏం తేల్చారంటే?
ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలీపై గతంలోనే లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశం పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ యువ నటి ఫిర్యాదు చేసింది. దుబాయ్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురిపై యువతి ఆరోపణలు చేసింది. దీంతో అప్పట్లోనే నివిన్ పౌలీతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటులపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.అయితే ఆ తర్వాత జరిగిన విచారణలో నటుడు నివిన్ పౌలీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. తాజాగా ఈ కేసులో నివిన్ పౌలీకి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. యువతి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంఘటన జరిగిన సమయంలో నివిన్ పౌలీ అక్కడ లేరని గుర్తించినట్లు తెలిపారు. అతను లైంగికంగా వేధించినట్లు స్పష్టమైన ఆధారాలు తమకు లభించలేదని కొత్తమంగళం కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. దీంతో ఆరో నిందితుడిగా ఉన్న ఆయన పేరును తొలగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే మిగిలిన నిందితుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా.. నివిన్ పౌలీ మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ప్రేమమ్ చిత్రంలో నటించారు. -
నా మొదటి భార్య అలాంటిది.. అందుకే రెండో పెళ్లి: నటుడు
ఈ రోజుల్లో బట్టతల, బయటకు తన్నుకొచ్చిన పొట్ట కామన్ అయిపోయింది. కానీ పెళ్లి చేసుకునేవరకైనా ఆ రెండింటినీ అడ్డుకోవాలని లేదా కవర్ చేసుకోవాలని ప్రయత్నించేవాళ్లు బోలెడు. అయితే మలయాళ బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ మాత్రం నెరిసిన గడ్డం, బట్టతలతోనే పెళ్లి చేసుకున్నాడు. ముసలాడిగానే పెళ్లిపీటలపై కూర్చుని ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేశాడు. పిల్లల ఎదుటే రెండో పెళ్లి చేసుకున్నాడు.దంపతులపై ట్రోలింగ్ఇది చూసిన జనం నోరెళ్లబెట్టారు. సోషల్ మీడియా వేదికగా వేణుగోపాల్‌ను, నటి దివ్య శ్రీధర్‌ను తిట్టిపోస్తున్నారు. ఈ వయసులో రెండో పెళ్లేంటని విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌తో కొత్త జంట ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దివ్య శ్రీధర్ స్పందిస్తూ.. తమ వయసు మరీ ఎక్కువేమి కాదని పెదవి విప్పింది. తన వయసు 40, క్రిస్ వయసు 49 అని పేర్కొంది. తాము శారీరక వాంఛ కోసం పెళ్లి చేసుకోలేదని, ఒకరికొకరం తోడు కోరుకున్నామని వెల్లడించింది.కుటుంబానికి కూడా దూరంక్రిస్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. మొదటి భార్యతో నేను సంతోషంగా లేను. నా స్వేచ్ఛను దూరం చేసింది. ఆమె నా కుటుంబంతో కూడా మాట్లాడనిచ్చేదికాదు. ఎన్నో షరతులు విధించేది. ఎవరూ మా ఇంటికి వచ్చేవారు కాదు. కనీసం ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఒప్పుకునేది కాదు. నేను మనిషిలా కాకుండా ఒక పెంపుడు జంతువులా ఉండేవాడిని. జీవితంపైనే విరక్తి వచ్చింది. దాని నుంచి విముక్తి కోరుకున్నాను.అందుకే రెండో పెళ్లి2019లో విడాకులకు దరఖాస్తు చేయగా 2022లో మంజూరయ్యాయి. కానీ కొన్ని నెలలకు ఏ తోడూ లేకుండా బతకడం కష్టంగా అనిపించింది. అందుకే దివ్యను పెళ్లి చేసుకున్నాను. చాలామంది మా రెండో పెళ్లి గురించి తప్పుగా మాట్లాడుతుంటే బాధగా ఉంది అన్నాడు. కాగా క్రిస్ వేణుగోపాల్, దివ్య శ్రీధర్.. ఇద్దరికీ ఇది రెండో వివాహమే! క్రిస్ వేణుగోపాల్ పాతరమట్టు సీరియల్లో తాతగా నటించాడు. పలు సీరియల్స్‌లో యాక్ట్ చేసిన ఇతడు పల్లు రైజింగ్, తెలివు, సంబవస్తలతు నిన్నుమ్ వంటి చిత్రాల్లోనూ నటించాడు.చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన హర్షసాయి.. కేసు గురించి.. -
లేటు వయసులో పెళ్లి.. 'తండ్రి దొరికినందుకు పిల్లలు హ్యాపీ'
బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ పెళ్లి చేసుకున్నాడు. 49 ఏళ్ల వయసులో నటి దివ్య శ్రీధర్‌తో ఏడడుగులు వేశాడు. కేరళలోని గురువాయూర్‌లో మంగళవారం వీరి వివాహం జరిగింది. వీళ్లిద్దరూ పాతరమట్టు అనే సీరియల్లో కలిసి నటించారు.ఫస్ట్ ప్రపోజ్ ఎవరంటే?ఈ వివాహం గురించి నటి దివ్య మాట్లాడుతూ.. నాకు మొదట ప్రపోజ్ చేసింది అతడే.. పెళ్లి చేసుకోవాలనుందని చెప్పాడు. నాకేమీ అర్థం కాలేదు. తీరా.. అతడు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అందుకు నన్ను ఒప్పించాడు కూడా! దీని గురించి నా కూతురు, కొడుక్కి చెప్తే వాళ్లు ఎంతగానో సంతోషించారు. తమకు తండ్రి దొరికాడని ఖుషీ అయ్యారు అని తెలిపింది.ఇద్దరూ నటులేకాగా క్రిస్ వేణుగోపాల్ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ యాక్ట్ చేస్తుంటాడు. దివ్య శ్రీధర్.. మలయాళ సీరియల్స్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో అలరిస్తూ ఉంటుంది. -
మరో ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ లెవెల్ క్రాస్. జూలైలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలో దర్శనమిచ్చింది.తాజాగా ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఆసిఫ్ అలీ హీరోగా నటించారు. ఈ మూవీకి అర్బాజ్ అయూబ్ దర్శకత్వం వహించారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు లెవెల్ క్రాస్ సినిమా చూసేయండి.Unlikely love. Shattered trust. Eternal consequences. Stream #LevelCross on #Aha ▶️https://t.co/NCGmg0REO0 pic.twitter.com/0H57F28kFt— ahavideoin (@ahavideoIN) October 15, 2024 -
ప్రముఖ నటుడు అరెస్ట్.. అదే కారణం!
ప్రముఖ మలయాళ నటుడు బైజు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ తన కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరువనంతపురంలోని మ్యూజియం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నటుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.కాగా.. కారులో బైజూ కుమార్తె కూడా అతనితో ఉన్నట్లు తెలుస్తోంది. బైజు సంతోష్ దాదాపు 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన మొదట అధవ మణియన్ పిల్ల (1981) చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత పుతన్ పనం (2017), మేరా నామ్ షాజీ (2019) చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్నారు. కాగా.. ప్రస్తుతం సంతోశ్ పృథ్వీరాజ్ సుకుమారన్ చిత్రం ఎల్2 ఎంపురన్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. -
మాజీ భార్య ఫిర్యాదు.. ప్రముఖ నటుడు అరెస్ట్
మలయాళ ప్రముఖ నటుడు బాల అరెస్ట్ అయ్యాడు. కొచ్చిలోని అతడి ఫ్లాట్‌లో ఉండగా.. సోమవారం ఉదయం పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతోనే ఇదంతా జరిగింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.బాల తమిళ-మలయాళ సినిమాలు చేసే నటుడు. 'కంగువ' దర్శకుడు శివ ఇతడికి అన్నయ్య అవుతాడు. 2006 నుంచి బాల.. నటుడిగా కొనసాగుతున్నాడు. 2010లో సింగర్ అమృత సురేశ్‌ని పెళ్లి చేసుకున్నాడు. 2012లో వీళ్లకు పాప కూడా పుట్టింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. 2019లో విడాకులు తీసుకున్నారు. బాల మరో పెళ్లి చేసుకుని ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)ఈ మధ్య సోషల్ మీడియాలో, పలు ఇంటర్వ్యూల్లో తమ పరువు తీసేలా బాలా ప్రవర్తిస్తున్నాడని.. ఇతడి మాజీ భార్య అమృత తాజాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కూతురి వెంటపడటంతో పాటు వేధిస్తున్నాడని పేర్కొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కొచ్చిలో బాలాతో పాటు అతడి మేనేజర్, ఫిల్మీ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానెల్ యజమానికి కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లని వేధించిన కారణంగా జువైనల్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.బాలా తనని వేధిస్తున్నాడని చెప్పి అమృత.. గతంలో రెండు మూడుసార్లు గృహ హింస కేసు పెట్టింది. ఇప్పుడు విడాకుల నిబంధనని మీరి తమని వేధిస్తున్నాడని అమృత కేసు పెట్టడంతో ఈ గొడవ కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి) -
పుష్ప నటుడి థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ చూశారా?
పుష్ప నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సైకలాజికల్ థ్రిల్లర్ బౌగెన్‌విల్లా. ఈ సినిమాకు అమల్ నీరద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, జ్యోతిర్మయి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.కాగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పుష్ప మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప సీక్వెల్ పార్ట్-2 లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
ప్రముఖ మలయాళ నటుడు కన్నుమూత
ప్రముఖ మలయాళ నటుడు టీపీ మాధవన్ (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో మంగళవారం నాడు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి కేరళ సీఎం పినరయి విజయన్ సహా పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సినిమా..కాగా టీపీ మాధవన్ 40 ఏళ్ల వయసులో సినీ కెరీర్ ఆరంభించారు. దాదాపు 600 చిత్రాల్లో నటించారు. 2016లో వచ్చిన మాల్గుడి డేస్ సినిమాలో చివరిసారిగా నటించారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా సీరియల్స్‌లో విలన్, కమెడియన్, సహాయక నటుడిగా మెప్పించారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'అమ్మ'కు మొట్టమొదటి జనరల్ సెక్రటరీగా పని చేశారు.చదవండి: రానాకి ఇంతకంటే బెటర్ ప్రశంస ఉండదేమో? -
'అ చిత్రాలు చూడాలంటూ.. డైరెక్టర్‌పై నటి సంచలన ఆరోపణలు'!
హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది. సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటీమణులు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. ఇండస్ట్రీలో తమను ఇబ్బందులకు గురిచేసిన వారిపేర్లను బహిర్గతం చేశారు. ప్రముఖ మలయాళ నటి మిను మునీర్ పలువురు స్టార్ డైరెక్టర్స్, నటులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రముఖ నటుడు జయసూర్య సహా ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా మలయాళ డైరెక్టర్‌పై మిను మునీర్ సంచలన ఆరోపణలు చేసింది. దర్శకుడు బాలచంద్ర మీనన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ఫేస్బుక్ పోస్ట్‌లో తనకెదురైన కష్టాలను పంచుకుంది. 2007లో డైరెక్టర్ బాలచంద్ర తన గదిలో అశ్లీల చిత్రాలు చూడమని బలవంతం చేశాడని తెలిపింది. కొంతమంది పురుషులు, ముగ్గురు అమ్మాయిలు ఆ గదిలో ఉన్నారని.. తాను మాత్రం బయటికి వచ్చేశానని వెల్లడించింది. బాలచంద్రన్ నన్ను కూర్చొమని అడిగాడని మునీర్ వివరించింది.అయితే గతంలోనూ ఫేస్బుక్ ద్వారా మిను మునీర్ తనకెదురైన ఇబ్బందులను పంచుకుంది. 2013లో ఒక ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నప్పుడు తనను శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని తెలిపింది. దీంతో మలయాళ ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చిందని పేర్కొంది. చెన్నైకి మకాం మార్చానని వెల్లడించింది. -
అత్యాచార కేసులో ప్రముఖ నటుడికి అరెస్ట్ వారెంట్
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ సినిమా పరిశ్రమలో మహిళలపై ఎలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయో ఈ కమిటీ బయటపెట్టింది. ఇందులో ప్రముఖ హీరోలు, నటులు, దర్శకులు ఇరుక్కున్నారు. ప్రముఖ నటుడు సిద్ధిఖీపైన కూడా ఓ మహిళ అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ కేసులోనే సదరు నటుడికి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటికే ముందస్తు బెయిల్ కోసం సిద్ధిఖీ ప్రయత్నించగా.. దాన్ని కోర్టు తిరస్కరించింది.(ఇదీ చదవండి: కాపీ కొట్టారంటూ డైరెక్టర్ శంకర్ కామెంట్.. 'దేవర' గురించేనా..?)కేసు ఏంటి?మాజీ నటి ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం.. ఓ తమిళ సినిమాలో అవకాశమిస్తానని సిద్ధిఖీ చెప్పాడు. అందుకోసం లైంగిక అవసరాలు తీర్చమన్నాడు. కుదరదనే సరికి బలవంతంగా ఓ హోటల్లో అత్యాచారం చేశాడు. 2016లో తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఘటన గురించి గతంలో ఇదే నటి మాట్లాడుతూ.. తనతో సిద్ధిఖీ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.ఇప్పుడే ఎందుకు?తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ రిలీజ్ చేయడంతో పలువురు నటీమణులు తమపై జరిగిన అఘాయిత్యాలని బయటపెడుతున్నారు. అలా సదరు నటి.. నటుడు సిద్ధిఖీపై పోలీస్ కేసు పెట్టింది. ఈ క్రమంలోనే విచారించిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కానీ సిద్ధిఖీ ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకునే పనిలో ఉన్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ఓనమ్ స్పెషల్: కసావు చీర... కాటుక కళ్లు...
ఓనమ్ పండగకి కళకళలాడిపోయారు తారలు. పండగ ప్రత్యేకమైన కసావు చీర కట్టుకుని, సంప్రదాయ నగలు పెట్టుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని మెరిసిపోయారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అమ్మ చీర కట్టుకుని, కొప్పున పువ్వులు పెట్టుకుని అందంగా ముస్తాబైన అనుపమా పరమేశ్వరన్ ‘ఇవాళ ఓనమ్ పెన్నే...’ అంటూ పలు ఫొటోలను షేర్ చేశారు.భర్త జగత్ దేశాయ్, కుమారుడు ఇలయ్తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు అమలా పాల్. ‘ఇవాళ ఓనమ్ థీమ్ ఏంటంటే పాయసమ్’ అంటూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేశారు కల్యాణీ ప్రియదర్శన్. భర్త, హీరో గౌతమ్ కార్తీక్‌తో కలిసి పండగ చేసుకున్నారు మంజిమా మోహన్. ఓనమ్ పండగకి అంబారీ స్వారీ చేయకపోతే ఎలా అంటూ నటుడు కాళిదాస్ జయరాం సందడి చేశారు. చేతిలో కలువ పువ్వు పట్టుకుని అనిఖా సురేంద్రన్, మియా జార్జ్ కనువిందు చేశారు. జడకు తామర పువ్వు పెట్టుకుని ప్రెట్టీగా అన్నా బెన్, జుత్తుకి మల్లెలు చుట్టి బ్యూటిఫుల్‌గా మిర్నా మీనన్, అరిటాకులో పువ్వులు పెట్టి చిరునవ్వుతో అందంగా మహిమా నంబియార్, సింపుల్‌గా స్టిల్ ఇచ్చినా సూపర్‌గా కనిపించిన అతుల్యా రవి, అంతే అందంగా కనిపిం చిన అనంతికా సనీల్‌కుమార్, నవ్యా నాయర్... ఇలా ఎవరికి వారు చక్కగా రెడీ అయి, ‘ఓనమ్ శుభాకాంక్షలు’ తెలిపారు. -
జైలర్ నటుడు అరెస్ట్.. కానిస్టేబుల్‌ను కొట్టడం వల్లే!
సాక్షి, హైదరాబాద్: జైలర్ నటుడు వినాయకన్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామికా భద్రత దళం) కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనపై స్పందించిన వినాయకన్ తానే తప్పూ చేయలేదంటున్నాడు. ఎయిర్‌పోర్టు అధికారులే తనను గదిలోకి తీసుకెళ్లి వేధించారంటున్నాడు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చెక్ చేసుకోమని చెప్తున్నాడు. అసలు తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని మీడియాతో వాపోయాడు. కాగా మలయాళ నటుడు వినాయకన్.. రజనీకాంత్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో మరింత పాపులర్ అయ్యాడు. గతేడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తన వల్ల జైలుపాలయ్యాడు. -
తనపై లైంగిక ఆరోపణలు.. చట్టపరంగానే ఎదుర్కొంటా: నటుడు జయసూర్య
మలయాళ సినీ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక సంచలనంగా మారింది. పలువురు నటులు, డైరెక్టర్లపై ఫిర్యాదులు రావడంతో ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మలయాళ నటుడు జయసూర్య స్పందించారు. ఇలాంటి ఆరోపణలు తన కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని జయసూర్య ఖండించారు. ప్రస్తుతం తాను యూఎస్‌లో ఉన్నానని.. త్వరలోనే కేరళకు వస్తానని చెప్పారు.ఆగస్టు 31న తన బర్త్ డేను జయసూర్య సెలబ్రేట్ చేసుకున్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేయడం చాలా సులభమని.. అబద్ధం ఎల్లప్పుడూ నిజం కంటే వేగంగా ప్రయాణిస్తుందని అన్నారు. కానీ చివరికీ నిజం గెలుస్తుందని జయసూర్య ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకముందన్నారు. నా పుట్టినరోజును ఇలాంటి సమయంలో జరుపుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు.కాగా.. జయసూర్య తనను లైంగికంగా వేధించారంటూ ప్రముఖ మలయాళ నటి మిను మునీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేసింది. ఇప్పటికే మలయాళ ఆర్టిస్టుల సంఘ సభ్యులు మోహన్‌లాల్‌తో సహా అందరూ రాజీనామాలు చేశారు. -
ప్రముఖ నటులపై అత్యాచార కేసు నమోదు
లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మలయాళ నటుడు, సీపీఎం ఎమ్మెల్యే ముకేశ్, నటుడు జయసూర్యలపై కేరళ పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నటి మిను మునీర్ తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. తనను వేధించిన ముకేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అతడికి ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఇవ్వకూడదని కోరారు.మోహన్‌లాల్ రాజీనామా.. మంచి నిర్ణయంఅమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్టుల)కు మోహన్‌లాల్ రాజీనామా చేయడంపై స్పందిస్తూ.. ఇది మంచి నిర్ణయమేనన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు అమ్మ బాధ్యతలు చేపట్టే అర్హత పుష్కలంగా ఉందన్నారు. కాగా ముకేశ్, మణ్యంపిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్య తనను వేధించారంటూ మిను మునీర్ సంచలన ఆరోపణలు చేసింది. డబ్బు కోసం బ్లాక్మెయిల్వీరి వేధింపుల వల్ల మలయాళ ఇండస్ట్రీని వదిలేసి చెన్నైకి వెళ్లిపోయానంది. హేమ కమిటీ నివేదిక వెలువడిన సమయంలో ఈమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే ముకేశ్, జయసూర్యపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మరో ఐదుగురిపైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను ముకేశ్ కొట్టిపారేశాడు. డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించాడు. ఎప్పటికైనా నిజం బయటకు వస్తుందని చెప్తున్నాడు.చదవండి: అలాంటివారిని చెప్పు తీసుకుని కొట్టండి: విశాల్ -
మాలీవుడ్‌లో మీ టూ : ‘మాకు ఆ విషయం చెప్పలేదు’
హేమ కమిటీ నివేదిక మాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ రిపోర్ట్ బయటకొచ్చాక పలువురు డైరెక్టర్స్, నటులపై పెద్దఎత్తున లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు హీరోయిన్స్ తమకెదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(AMMA) సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అమ్మ అధ్యక్ష పదవిలో ఉన్న మోహన్ లాల్ సైతం వైదొలిగారు. పాలక మండలి పదవుల నుంచి మొత్తం 17 మంది సభ్యులు రాజీనామాలు సమర్పించారు. వీరంతా నైతిక బాధ్యత వహిస్తూ పక్కకు తప్పుకున్నారు. దీంతో మలయాళ చిత్రమండలిని రద్దు చేశారు. రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.రాజీనామా చేయని ఇద్దరు?అయితే అమ్మ సభ్యులుగా ఉన్న మరో ఇద్దరు హీరోయిన్స్ మాత్రం రాజీనామాలు సమర్పించలేదు. తాజాగా రద్దయిన కమిటీలో హీరోయిన్స్ సరయు, అనన్య సభ్యులుగా ఉన్నారు. అయితే రాజీనామా నిర్ణయంపై తమ సమాచారం లేదని వీరిద్దరు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమ అభిప్రాయం కూడా తీసుకోలేదని ఆరోపించారు. అయితే మండలి పూర్తిగా రద్దు చేయడంతో వీరి పదవులు కూడా పోయినట్లేనని భావిస్తున్నారు.అసలేంటి హేమ కమిటీ?ఇటీవల జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ నివేదికను బహిర్గతం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఆ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలోనే మొదట అమ్మ జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు. -
కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న యంగ్ కమెడియన్
'ప్రేమలు' సినిమాతో తెలుగులోనూ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంగీత్ ప్రతాప్. స్వతహాగా ఎడిటర్ అయిన ఇతడు.. మలయాళంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అయితే జూలై 27న రాత్రి ఇతడు ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగింది. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నాడు. అలాంటిది నెలలోనే పూర్తిగా కోలుకున్న సంగీత్ ప్రతాప్.. ఇన్ స్టాలో పెద్ద పోస్ట్ పెట్టాడు. అసలేం జరిగింది? ఇప్పుడు పరిస్థితి ఏంటనేది క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్-8లోకి రాజ్ తరుణ్? ఎట్టకేలకు ఓ క్లారిటీ)'గత నెలలో ఇదే రోజున కారు ప్రమాదం జరగ్గానే నా జీవితం తలక్రిందులైంది. తొలుత నాకు ఏం కాలేదని అనుకున్నా. కానీ నర్స్ వచ్చి చెప్పిన తర్వాత నేనెంత ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడ్డానో అర్థమైంది. ఆ రోజు నుంచి నాలో బాధ, భయం, డిప్రెషన్ ఇలా చాలా ఎమోషన్స్‌కి గురయ్యాను. ఈ యాక్సిడెంట్ తర్వాత నా ఆలోచన మారిపోయింది. ఇంతకుముందు భవిష్యత్ గురించి చాలా భయాలుండేవి. కానీ జీవితం మనం కంట్రోల్లో ఉండదని అర్థమైంది. నచ్చినట్లు బ్రతికాలని ఫిక్స్ అయ్యాను''ఇన్ని రోజులు కంటికి రెప్పలా చెప్పాలంటే ఓ పిల్లాడిలా నన్ను చూసుకుంది నా భార్య. దీనికి బదులుగా ఆమెకు ఎంత ప్రేమ తిరిగిచ్చినా తక్కువే. తల్లిదండ్రులు, స్నేహితులు నాకు అండగా నిలిచారు. వాళ్లు చెప్పిన మాటలు, మెసేజులు వల్ల నాకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది. అలా ఈ రోజు మళ్లీ సాధారణ జీవితాన్ని తిరిగి మొదలుపెట్టాను. నాకెంతో ఇష్టమైన సెట్‌కి వెళ్లిపోయాను. కాస్త ఇబ్బందిగానే ఉంది. కొన్నిరోజుల్లో అంతా సెట్ అయిపోతుందిలే. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను' అని సంగీత్ ప్రతాప్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ) View this post on Instagram A post shared by Sangeeth Prathap (@sangeeth.prathap) -
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ రాజీనామా
హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటులు, డైరెక్టర్స్‌పై పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీ పెద్దలు చక్కదిద్దే పనిలో పడ్డారు. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) మండిపడ్డారు. ఈ నివేదికపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) తీవ్రమైన విమర్శలు రావడంతో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మోహన్‌లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. ఇప్పటికే ఈ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక విషయంలో సీఎం పినరయి విజయన్ పోలీసు అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నివేదికపై దర్యాప్తు చేయడానికి ఏడుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా.. ఇప్పటికే దర్శకుడు రంజిత్ చలనచిత్ర అకాడమీకి రాజీనామా చేయగా.. నటుడు సిద్ధిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ పదవి నుంచి నుంచి వైదొలిగారు. -
హేమ కమిటీ రిపోర్ట్.. ఆశ్చర్యం కలగలేదన్న సలార్ నటుడు!
హేమ కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటీమణులు బహిరంగంగా తమకెదురైన వేధింపులను బయటపెడుతున్నారు. దీంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం(అమ్మా)పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ నివేదికపై స్పందించారు. ఈ విషయంలో అమ్మా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఇండస్ట్రీని ప్రక్షాళన చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. "హేమ కమిటీతో మాట్లాడిన మొదటి వ్యక్తిని నేను. సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. వారికి సురక్షితమైన పనివాతావరణం సృష్టించే మార్గాలను కనిపెట్టడమే ఈ నివేదిక లక్ష్యం. హేమ కమిటీ నివేదిక తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. ఆ ఆరోపణలు నిజమని రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఉన్నా. నివేదికలో పేర్కొన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దోషులను కఠినంగా శిక్షించాలి. అదే విధంగా ఆరోపణలు తప్పు అని రుజువైతే తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని కూడా శిక్షించాల్సిందేనంటూ' సలార్ నటుడు కోరారు. ఈ విషయంలో నిందితుల పేర్లను విడుదల చేయాలనే నిర్ణయం కమిటీ సభ్యులదేనని స్పష్టం చేశారు.కాగా.. ఈ ఏడాది ఆడుజీవితం (ది గోట్ లైఫ్) మూవీతో సూపర్‌హిట్‌ను సొంతం చేసుకున్నారు. దుబాయ్ నేపథ్యంలో ఓ యధార్థం కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అంతకుముందు సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ తనదైన నటనతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
7వ తరగతి పరీక్షలు రాసిన 68 ఏళ్ల నటుడు
ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రన్స్.. ఏడో తరగతి పరీక్షలు రాశాడు. అది కూడా 68 ఏళ్ల వయసులో. చిన్నప్పుడు నాలుగో క్లాస్ వరకే చదువుకున్న ఇతడు.. పుస్తకాలు, వేసుకోవడానికి బట్టలు లేకపోవడంతో టైలర్‌గా మారిపోయాడు. స్కూల్ కి వెళ్లకపోయినప్పటికీ.. చదువుకోవడం నేర్చుకున్నాడు. అలా పెద్దయిన తర్వాత నటుడిగా మారాడు.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)1980 నుంచి మలయాళంలో పలు చిత్రాల్లో ఇంద్రన్ నటిస్తున్నాడు. గతేడాది రిలీజైన '2018' అనే డబ్బింగ్ మూవీలో అంధుడి పాత్ర పోషించాడు. ఇందుకు గానూ ఉత్తమ నటుడిగా కేరళ ఫిల్మ్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.ఇక 10వ తరగతి పాస్ కావాలనే కోరిక ఇంద్రన్కి కలిగింది. ఇది జరగాలంటే తొలుత 7వ తరగతి పాస్ కావాలని రూల్ ఉంది. దీంతో తాజాగా తిరువనంతపురంలోని అట్టకుళంగర సెంట్రల్ స్కూల్లో ఏడో తరగతి పరీక్షలు రాశాడు. ఏదేమైనా 68 ఏళ్ల వయసులో చదువుకోవాలని ఇతడి ఉత్సాహాన్నfి చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో స్టార్ హీరో తీసిన పిల్లల సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్) -
అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!
ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురయ్యారట. ఈ మేరకు మలయాళ మీడియాలో వార్తలొస్తున్నాయి. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత, కండరాల నొప్పితో బాధపడుతున్నారని.. దీంతో కుటుంబ సభ్యులు ఈయన్ని ఆస్పత్రిలో చేర్పించారట. ఐదు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?)ఈ క్రమంలోనే మోహన్ లాల్ హెల్త్ బులెటిన్ అని ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇలా అస్వస్థత అని వార్తలు రావడంతో అభిమానులు ఏమైందోనని కంగారు పడుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాలో కీలక పాత్ర చేసిన మోహన్ లాల్.. ఇప్పటి జనరేషన్ తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే.ప్రస్తుతం ఎల్ 2, బరోజ్ సినిమాలతో కాస్త బిజీ ఉన్న మోహన్ లాల్.. వీటి షూటింగ్ కోసం గుజరాత్ వెళ్లగా, అక్కడే అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. దీంతో తిరిగి ఊరికొచ్చేసి, ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది ఆయన క్లారిటీ ఇస్తే తప్ప బయటకు రాదు.(ఇదీ చదవండి: టాలీవుడ్ ఆశలన్నీ నాని 'శనివారం' పైనే..) -
ఈ ఫొటోలోని ఇద్దరూ స్టార్ హీరోలే.. తండ్రి కొడుకులే కానీ!
వారసత్వంతో ఎంట్రీ ఇవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఏ రంగంలో అయినా ఇది అనుకున్నంత సులభమైతే కాదు. పైన కనిపిస్తున్న పిల్లాడు కూడా అలానే తండ్రి పేరుతో సినిమాల్లోకి వచ్చాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో సినిమాలు చేస్తూ అసలైన పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు. ఇంతలా చెప్పాం కదా మరి వీళ్లు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్)పైన ఫొటోలో కనిపిస్తున్న వాళ్లలో పిల్లాడి పేరు దుల్కర్ సల్మాన్. వ్యక్తి పేరు మమ్ముట్టి. 'సీతారామం', 'మహానటి' సినిమాలతో తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సృష్టించిన హీరోనే పైన ఫొటోలో ఉన్న పిల్లాడు. తండ్రి మమ్ముట్టి మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో సులభంగానే దుల్కర్ ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. కానీ ఎంతో కష్టపడి ఇప్పుడున్న పొజిషన్‌కి చేరుకున్నాడు.వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరైన దుల్కర్ సల్మాన్.. సొంత భాష మలయాళంలో బోలెడన్ని మూవీస్ చేశాడు. తెలుగులోనూ మహానటి, సీతారామం చేశాడు. ప్రస్తుతం 'లక్కీ భాస్కర్' అనే మూవీ చేస్తున్నాడు. తమిళం, హిందీలోనే ఇదివరకే హీరోగా మూవీస్ చేసి మరీ హిట్స్ కొట్టాడు. పేరుకే తండ్రి కొడుకు గానీ మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్.. దేశవ్యాప్తంగా ఒకరిని మించి మరొకరు గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.(ఇదీ చదవండి: ఉన్న కార్లు అమ్మేసి కొత్త కారు కొన్న దళపతి విజయ్) -
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బిజు మీనన్, ఆసీఫ్ అలీ నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'తలవన్'. ఈ సినిమాను జిస్ జాయ్ దర్శకత్వంలో తెరకెక్కించరు. ఈ ఏడాది మే నెలలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రేక్షకులను మెప్పించింది. పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మలయాళంలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 12 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడతో సహా మొత్తం ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓ పోలీస్ అధికారి ఓ కేసును ఎలా చేధించాడనేది ఈ సినిమాలో చూపించారు. #Thalavan will be streaming from Sept 12 on SONY LIV. pic.twitter.com/5A1GE3jXs6— Christopher Kanagaraj (@Chrissuccess) August 11, 2024 -
ఓటీటీకి వచ్చేస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం టర్బో. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ మూవీగా మలయాళంలో తెరకెక్కించారు. మే 23న మలయాళంలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో మెప్పించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఆగస్టు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనిలివ్ ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో అంజనా జయ ప్రకాశ్, రాజ్ బి.శెట్టి, శబరీష్ వర్మ, సునీల్, కబిర్ దుహాన్ సింగ్‌లు కీలక పాత్రలు పోషించారు.Hold on to your seats as Mammootty takes you on a roller coaster ride of thrills and twists. Stream Turbo from August 9th only on Sony LIV.#Turbo #SonyLIV #TurboOnSonyLIV #Action #Mammootty #MammoottyKampany #Vysakh #MidhunManuelThomas pic.twitter.com/xhwBhfFxbk— Sony LIV (@SonyLIV) July 27, 2024