మాజీ భార్య ఫిర్యాదు.. ప్రముఖ నటుడు అరెస్ట్ | Malayalam Actor Bala Arrested Over Ex-Wife Amrita Complaint | Sakshi
Sakshi News home page

Actor Bala Arrest: స్టార్ దర్శకుడి తమ్ముడు అరెస్ట్.. ఏమైందంటే?

Published Mon, Oct 14 2024 12:01 PM | Last Updated on Mon, Oct 14 2024 12:16 PM

Malayalam Actor Bala Arrested Over Ex-Wife Amrita Complaint

మలయాళ ప్రముఖ నటుడు బాల అరెస్ట్ అయ్యాడు. కొచ్చిలోని అతడి ఫ్లాట్‌లో ఉండగా.. సోమవారం ఉదయం పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ భార్య అమృత సురేశ్ ఫిర్యాదు చేయడంతోనే ఇదంతా జరిగింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

బాల తమిళ-మలయాళ సినిమాలు చేసే నటుడు. 'కంగువ' దర్శకుడు శివ ఇతడికి అన్నయ్య అవుతాడు. 2006 నుంచి బాల.. నటుడిగా కొనసాగుతున్నాడు. 2010లో సింగర్ అమృత సురేశ్‌ని పెళ్లి చేసుకున్నాడు. 2012లో వీళ్లకు పాప కూడా పుట్టింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. 2019లో విడాకులు తీసుకున్నారు. బాల మరో పెళ్లి చేసుకుని ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)

ఈ మధ్య సోషల్ మీడియాలో, పలు ఇంటర్వ్యూల్లో తమ పరువు తీసేలా బాలా ప్రవర్తిస్తున్నాడని.. ఇతడి మాజీ భార్య అమృత తాజాగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కూతురి వెంటపడటంతో పాటు వేధిస్తున్నాడని పేర్కొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కొచ్చిలో బాలాతో పాటు అతడి మేనేజర్, ఫిల్మీ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానెల్ యజమానికి కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లని వేధించిన కారణంగా జువైనల్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

బాలా తనని వేధిస్తున్నాడని చెప్పి అమృత.. గతంలో రెండు మూడుసార్లు గృహ హింస కేసు పెట్టింది. ఇప్పుడు విడాకుల నిబంధనని మీరి తమని వేధిస్తున్నాడని అమృత కేసు పెట్టడంతో ఈ గొడవ కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement