
చలాకీ చంటి అనగానే 'జబర్దస్త్'లో కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించినప్పటికీ ఈ కామెడీ షోతో ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. కొన్నేళ్ల పాటు హవా చూపించాడు. కానీ తర్వాత పూర్తిగా ఈ షోకి దూరమైపోయాడు. బిగ్‌బాస్ 6వ సీజన్‌లో పాల్గొన్నాడు గానీ కొన్నాళ్లకే బయటకొచ్చేశాడు. గతేడాది గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి, క్షేమంగా ఇంటికొచ్చేశాడు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇతడు.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)
గుండెపోటు వచ్చిన తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కరూ కూడా సహాయం చేయలేదని చంటి చెప్పుకొచ్చాడు. 'నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఒక్కరూ హెల్ప్ చేయలేదు. కనీసం పలకరించలేదు కూడా. కొందరు ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పారంతే. నిజ జీవితంలో ఎవరూ హెల్ప్ చేయరు. డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో బతుకుతాం. డబ్బులు లేకపోతే ఎవరు పట్టించుకోరు. ప్రతి ఆర్టిస్ట్ జీవితం ఇంతే. ఇండస్ట్రీలో ఉంటే ఏదో సంపాదించేస్తున్నారని అనుకుంటారు. కానీ మనకు ఎంతొస్తుందని ఎవరికీ తెలీదు. మనం కూడా ఎవరి దగ్గర సాయం ఆశించకూడదు. ఫ్రెండ్స్ అయినా డబ్బు విషయంలో సాయం చేయరు' అని చంటి చెప్పుకొచ్చాడు.
చంటి చెప్పిన దానిబట్టి చూస్తే 'జబర్దస్త్', సినిమాలు చేస్తున్న టైంలో చాలామంది స్నేహితులు ఉన్నారు. కానీ ఆపదలో ఎవరూ తనని ఆదుకోవడానికి రాలేదే అని బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. అదే టైంలో రియాలిటీ ఏంటనేది కూడా చెప్పకనే చెప్పారు. అలానే జబర్దస్త్ షోలో వాళ్లే వద్దన్నారని, దానికి కారణం కూడా తెలీదని చెప్పాడు. వాళ్లు వద్దన్న తర్వాత ఇక తాను మళ్లీ అడగనని, అది కరెక్ట్ కాదని కూడా క్లారిటీ ఇచ్చేశాడు.
(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత)
Comments
Please login to add a commentAdd a comment