Jabardasth
-
రీతూ చౌదరికి ఆల్రెడీ పెళ్లయిందా? అందుకేనా ఆ సలహా! (ఫోటోలు)
-
జబర్దస్త్ యాదమ్మ రాజు భార్య స్టెల్లా మెటర్నిటీ ఫోటోషూట్
-
మారుతి సుజుకి డిజైర్ కారును ఆవిష్కరించిన జబర్దస్త్ వర్ష (ఫొటోలు)
-
గృహ ప్రవేశం.. పట్టుచీరలో 'జబర్దస్త్' సత్యశ్రీ (ఫొటోలు)
-
పశ్చిమగోదావరి జిల్లా : తణుకు లో గృహప్రవేశం చేసిన జబర్ధస్త్ నటి సత్య శ్రీ (ఫొటోలు)
-
సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న జబర్దస్త్ వర్ష (ఫోటోలు)
-
ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి
చలాకీ చంటి అనగానే 'జబర్దస్త్'లో కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించినప్పటికీ ఈ కామెడీ షోతో ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. కొన్నేళ్ల పాటు హవా చూపించాడు. కానీ తర్వాత పూర్తిగా ఈ షోకి దూరమైపోయాడు. బిగ్‌బాస్ 6వ సీజన్లో పాల్గొన్నాడు గానీ కొన్నాళ్లకే బయటకొచ్చేశాడు. గతేడాది గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి, క్షేమంగా ఇంటికొచ్చేశాడు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇతడు.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)గుండెపోటు వచ్చిన తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కరూ కూడా సహాయం చేయలేదని చంటి చెప్పుకొచ్చాడు. 'నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఒక్కరూ హెల్ప్ చేయలేదు. కనీసం పలకరించలేదు కూడా. కొందరు ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పారంతే. నిజ జీవితంలో ఎవరూ హెల్ప్ చేయరు. డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో బతుకుతాం. డబ్బులు లేకపోతే ఎవరు పట్టించుకోరు. ప్రతి ఆర్టిస్ట్ జీవితం ఇంతే. ఇండస్ట్రీలో ఉంటే ఏదో సంపాదించేస్తున్నారని అనుకుంటారు. కానీ మనకు ఎంతొస్తుందని ఎవరికీ తెలీదు. మనం కూడా ఎవరి దగ్గర సాయం ఆశించకూడదు. ఫ్రెండ్స్ అయినా డబ్బు విషయంలో సాయం చేయరు' అని చంటి చెప్పుకొచ్చాడు.చంటి చెప్పిన దానిబట్టి చూస్తే 'జబర్దస్త్', సినిమాలు చేస్తున్న టైంలో చాలామంది స్నేహితులు ఉన్నారు. కానీ ఆపదలో ఎవరూ తనని ఆదుకోవడానికి రాలేదే అని బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. అదే టైంలో రియాలిటీ ఏంటనేది కూడా చెప్పకనే చెప్పారు. అలానే జబర్దస్త్ షోలో వాళ్లే వద్దన్నారని, దానికి కారణం కూడా తెలీదని చెప్పాడు. వాళ్లు వద్దన్న తర్వాత ఇక తాను మళ్లీ అడగనని, అది కరెక్ట్ కాదని కూడా క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత) -
బుజ్జిపాపాయికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత (ఫోటోలు)
-
బిగ్‌బాస్ సుజాత సీమంతం 'ఫోటోలు' షేర్ చేసిన రాకింగ్ రాకేశ్ (ఫొటోలు)
-
పెళ్లే వద్దన్నాడు.. భార్యతో కలిసి గుడ్‌న్యూస్ చెప్పిన రాకింగ్ రాకేశ్ (ఫోటోలు)
-
తండ్రి కాబోతున్నతెలుగు ప్రముఖ కమెడియన్.. పోస్ట్ వైరల్
ఎక్కడా లేని విధంగా తెలుగులో బోలెడంత మంది కమెడియన్స్ ఉన్నారు. సినిమాలు, టీవీ షోలు చేస్తూ ఉన్నంతలో ఎంటర్టైన్ చేస్తుంటారు. అలా స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి, షోల్లో స్కిట్స్ చేసేంతలా గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పేశాడు. తన భార్య ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని వెల్లడించాడు.(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్)'పటాస్' కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు.. సద్దాంతో కలిసి స్కిట్స్, ప్రోగ్రామ్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం 'జబర్దస్త్'లో కమెడియన్‌గా ఉన్నాడు. ఇకపోతే ఏడాదిన్నర క్రితం యూట్యూబర్ స్టెల్లా రాజ్‌ని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జంటనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!) View this post on Instagram A post shared by sharon stella pastham (@stellaraj_777) -
Rithu Chowdary: జబర్దస్త్ బ్యూటీ కొత్త కారు.. అదిరిపోయిందంతే! (ఫోటోలు)
-
రైలు ఎక్కబోయి జారిపడి.. 'జబర్దస్త్' రైటర్ మృతి
కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు శుక్రవారం రైలు ఎక్కుతూ కాలుజారి కింద పడి ప్రముఖ కామెడీ షో 'జబర్దస్త్' స్క్రిప్ట్ రైటర్, సహాయ నటుడు మృతి చెందాడు. ఆర్పీఎఫ్, రైల్వే ప్రయాణికుల కథనం ప్రకారం.. చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మేదర మహ్మదీన్ హైదరాబాద్ వెళ్లేందుకు తెల్లవారుజామున భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?)కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతుండగా కాలు జారి ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్య ఇరుక్కుపోయాడు. అప్పటికే రైలు కదులుతుండగా ప్లాట్‌ఫాం, రైలు మధ్య శరీరం మూడు, నాలుగు సార్లు తిరిగింది. గమనించిన ఆర్పీఎఫ్ పోలీసులు అతని చేతులు పట్టుకుని పైకి లాగారు. దీంతో మహ్మదీన్ పైకి లేచి నడుచుకుంటూ తనకు ఏమి కాలేదని పేర్కొన్నాడు. అయినా ఆర్పీఎఫ్ పోలీసులు 108 వాహనంలో కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఖమ్మం తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా మహ్మదీన్ ప్లాట్‌ఫాం, రైలుకు మధ్య నలిగిపోయి అతని శరీరంలోని అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు. శరీరంపై మాత్రం నామమాత్రపు గాయాలే ఉన్నాయి. ప్లాట్‌ఫాం నుంచి 108 వాహనం వరకు, ఆస్పత్రిలో కూడా నడుచుకుంటూ తిరిగిన వ్యక్తి మృతి చెందడం విస్మయానికి గురిచేసింది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?) -
తెలంగాణ తేజం పాటను ఆవిష్కరించిన కేసీఆర్.. నెట్టింట వైరల్
'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేశ్.. ప్రస్తుతం 'కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ )' అనే టైటిల్‌తో ఒక సినిమా తీస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాను నిర్మాతగా రాకింగ్ రాకేశ్ కావడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా నుంచి తెలంగాణ తేజం పాటను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా ఆవిష్కరించారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సినిమా హీరో, నిర్మాత రాకింగ్ రాకేశ్ దంపతులు వెళ్లి ఆయన్ను కలుసుకున్నారు. వారితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ ఉన్నారు. ఈ పాటను గోరేటి వెంకన్న రచించగా సింగర్స్ మనో, కల్పన, గోరేటి వెంకన్న ఆలపించారు. ఈ పాటకు నెట్టింట మంచి ఆదరణ లభిస్తుంది. పాటలో తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెబుతూ సాగడంతో సోషల్‌మీడియాలో నెటిజన్లు భారీగా షేర్ చేస్తున్నారు. -
'జబర్దస్త్' కమెడియన్‌కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!
ఏంటో ఈ మధ్య పవిత్ర అనే పేరున్న వాళ్లకు అస్సలు కలిసి రావట్లేదు. ఈ మధ్య తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం.. కారు ప్రమాదంలో మరణించింది. ఇప్పుడు అదే పేరున్న మరో నటి కారు ఇలానే యాక్సిడెంట్ అయింది. కాకపోతే ఇక్కడ ఎవరికీ ఏం కాలేదు. ఇది జరిగిన దాదాపు వారం రోజులు పైనే అయింది. ఇప్పుడు తనకు జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ గురించి 'జబర్దస్త్' ఫేమ్ పవిత్ర బయటపెట్టింది. ప్రాణాలతో బయటపడ్డామని చెబుతూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)సాధారణ నటిగా కెరీర్ ప్రారంభించిన పవిత్ర.. 'జబర్దస్త్' షోలో తనదైన కామెడీతో ఆకట్టుకుంటోంది. గత కొన్నేళ్ల నుంచి ఇదే షోలో చేస్తున్న పవిత్ర.. ఏడాదిన్నర క్రితం కారు కూడా కొన్నది. ఇప్పుడు ఆ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు పిన్ని, పిల్లలతో కలిసి పవిత్ర సొంతూరు వెళ్లింది. కాకపోతే నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి గోతిలో పడింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చిన్న దెబ్బలు మినహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.'మా పిన్ని, ఆమె పిల్లలిద్దరూ ఫస్ట్ టైమ్ నా కారు ఎక్కారు. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనేలోపు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వస్తున్న వెహికల్ డ్రైవర్ కన్ఫ్యూజ్ చేయడంతోనే మాకు ఇలా జరిగింది. ఎవ్వరికీ ఎలాంటి దెబ్బలు తగలకపోవడం నాకు కాస్త హ్యాపీగా అనిపించింది. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్లే నాకు దెబ్బలేం తగల్లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కుదుటపడటానికి రోజంతా పట్టింది. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ నన్ను గుర్తుపట్టారా కానీ ఒక్కరు కూడా సాయం చేయలేదు. వీడియోలు తీశారు. అదొక్కటే నాకు బాధగా అనిపించింది' అని చెబుతూ పవిత్ర ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?) -
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
యాంకర్ శ్రీముఖి పెళ్లికి రెడీ అయిందా? అంటే నిజమే అని తెలుస్తోంది. గత కొన్నేళ్లలో చూసుకుంటే లేడీ యాంకర్స్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. ఎక్కువగా టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. అయితే గతంలోనూ ఈ బ్యూటీ పెళ్లి వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయాయి. ఇప్పుడు మాత్రం ఈమె ఫ్రెండ్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ అసలు విషయం చెప్పేశాడు.(ఇదీ చదవండి: ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు)లేడీ యాంకర్లో సుమ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. అలా సుమ తర్వాత ఉన్నంతలో మంచి ఫేమ్ సంపాదించింది ఎవరంటే శ్రీముఖినే గుర్తొస్తుంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది గానీ తర్వాత పూర్తిగా యాంకరింగ్‌పై దృష్టి పెట్టింది. మధ్యలో బిగ్‌బాస్ షోకి కూడా వెళ్లొచ్చింది. 30 ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటోంది.గతంలో శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈమె ఫ్రెండ్ అయిన అవినాష్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీముఖి పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పేశాడు. ప్రస్తుతం వాళ్లింట్లో సంబంధాలు చూస్తున్నారని, బహుశా ఈ ఏడాదిలోనే వివాహం జరగొచ్చని అన్నాడు. దీనిబట్టి చూస్తే త్వరలో శ్రీముఖి కూడా ఏడడుగులు వేసేస్తుందనమాట.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా) -
కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
మరో కమెడియన్ సొంతిల్లు కట్టుకున్నాడు. 'పటాస్' షోతో గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత పలు కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న గల్లీ బాయ్ భాస్కర్ తాజాగా కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఫైనల్లీ డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి తోటి కమెడియన్స్ వచ్చి విషెస్ చెప్పారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?)'పటాస్' షోలో స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన భాస్కర్.. సద్దాం, యాదమ్మ రాజు తదితరులతో కలిసి స్కిట్స్ కూడా చేసేవాడు. ఆ తర్వాత అదిరింది, కామెడీ స్టార్స్, కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లాంటి షోలు చేశాడు. ఇప్పుడు 'జబర్దస్త్'లో చేస్తున్నాడు. వీటితో పాటు ఈవెంట్స్ లో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తున్న భాస్కర్.. ఇప్పుడు మూడు అంతస్థుల ఇల్లు కట్టేసుకున్నారు. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. తన డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?) View this post on Instagram A post shared by Bhaskar (@gully_boy_bhaskar) -
Jabardasth Mohan: జబర్దస్త్ లేడీ గెటప్ కమెడియన్ పెళ్లి (ఫోటోలు)
-
తనకు ఎంతో ఇష్టమైన 'చుట్కీ గౌతమ్'ను కోల్పోయిన యాంకర్ రష్మీ
బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న రష్మి.. జంతు ప్రేమికురాలనే విషయం చాలామందికి తెలిసిందే. మూగజీవాలకు ఏదైనా హాని జరిగితే ఆమె వెంటనే స్పందిస్తుంది. లాక్‌డౌన్‌లోనూ వీధి కుక్కలు, పావురాల కోసం ప్రతిరోజూ ఆహారం అందించేది. అంతేకాదు.. జంతు పరిరక్షణ కోసం ఆమె ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలను కూడా నిర్వహించింది. అలాంటి రష్మీ తాజాగా ఎమోషనల్ అయింది. తను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క చుట్కీ గౌతమ్‌ను కోల్పోయింది. దీంతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది. కారణాలు తెలియవు కానీ శనివారం తన పెంపుడు కుక్క చనిపోయిందంటూ రష్మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. చుట్కీని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని తెలిపింది. అనంతరం చుట్కీకి స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించింది. చుట్కీ చితాభస్మాన్ని కారులో తన వెంట తీసుకెళ్తున్న పిక్‌ను కూడా రష్మీ షేర్ చేసుకుంది. చుట్కీ చనిపోవడానికి 24 గంటల ముందు తనతో గడిపిన ఫొటోలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంది. ప్రపంచంలో జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. అంతలా మూగ జీవాలపై ఆమె ప్రేమను చూపిస్తుంది. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
'అమ్మ కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు'.. జబర్దస్త్ శాంతి ఎమోషనల్!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. తన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. గతంలో తన తల్లికి సర్జరీ కోసం ఇంటిని అమ్మేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. తాజాగా శాంతి తన మదర్‌కు మోకాలి సర్జరీ చేయించినట్లు వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలో అమ్మకు మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తైనట్లు శాంతి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు. డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది తమను బాగా చూసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం మా అమ్మ ఆరోగ్యంతో ఉన్నారని శాంతి ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. గతంలో అమ్మకు తెలియకుండానే సర్జరీ కోసం ఇంటిని అమ్మేస్తున్నట్లు చెబుతూ ఎమోషనలయ్యారు. అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేయస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద ఏది ఉండదని అన్నారు. నా ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని శాంతి తెలిపింది. -
ఆ విషయం నాకు కూడా తెలుసు... మీకు ఇష్టముంటేనే రండి: ఆర్పీ హాట్ కామెంట్స్
జబర్దస్త్ కమెడియన్‌గా ఫేమ్ తెచ్చుకున్న ఆర్పీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంతే కాదు.. గతేడాది ప్రియురాలిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. విశాఖపట్నంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ముందస్తు హడావుడి లేకుండా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్లికి ముందే హైదరాబాద్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కూకట్ పల్లి, అమీర్‌పేట్‌లోనూ అతనికి బ్రాంచ్‌లున్నాయి. స్టాల్స్ ప్రారంభం నుంచే ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. వ్యాపారం విజయవంతం కావడంతో ఆర్పీ ముందడుగు వేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట పలు బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్పీ తన బిజినెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీ వద్ద ధరలు అధికంగా ఉన్నాయంటున్నారు? అని యాంకర్ ప్రశ్నించగా.. ఆర్పీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నా బిజినెస్ నా ఇష్టం.. నా రేట్లు అంతే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అదేంటో మీరు ఓ లుక్కేయండి. ఆర్పీ మాట్లాడుతూ..'ఇది నా బిజినెస్. నా రేట్లు ఇంతే. చేపలకు, మిగతా వాటికి చాలా తేడా ఉంటుంది. ఆడి, బెంజ్, క్రెటా కార్లలో నీ స్తోమతను బట్టి తీసుకుంటాం. ఇది కూడా అంతే కొనగలిగే కెపాసిటీ ఉన్నవాళ్లే తీసుకుంటారు. అంతే తక్కువ రేటు అని చెప్పి.. ఎలా పడితే అలా ఇవ్వలేను కదా. మేం మొత్తం క్వాలిటీ ఉత్పత్తులు మాత్రమే వాడుతాం. నా చేపల పులుసు నీకు అందుబాటు రేటులో ఉంటేనే తిను. లేకపోతే వద్దు. కొందరు కావాలనే నాపై అలాంటి ప్రచారం చేస్తుంటారు. నీకు ఇష్టముంటే తిను. లేకపోతే పో. నా చేపల పులుసు రేట్లు అంతే. అంతేకానీ రూ.100 జేబులో పెట్టుకుని.. రూ.1000 ఫుడ్ కావాలంటే వస్తుందా? మా చేపల పులుసు తినమని నేను ఎవరినీ బతిమాలాడను కదా? రేట్లు ఎంత పెట్టాలి అనే విషయం నాకు తెలుసు. నాది కూడా వ్యవసాయం కుటుంబమే. ఎవరెన్ని చేసిన ఐ డోంట్ కేర్. నా చేపల పులుసుపై నాకు నమ్మకముంది' అని అన్నారు. -
ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది: జబర్దస్త్ రాంప్రసాద్
-
బిగ్‌బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్‌పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ!
బిగ్‌బాస్ 7 షో దాదాపు నెలన్నర క్రితమే అయిపోయింది. రైతుబిడ్డ అని చెప్పుకొన్న పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఫైనల్ తర్వాత హైదరాబాద్ రోడ్లపై నానా రచ్చ చేశాడు. అతడి అభిమానులైతే.. ఆర్టీసీ బస్సులతో పాటు పలువురు కార్లని కూడా ధ్వంసం చేశారు. దీంతో ప్రశాంత్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంత సీరియస్ విషయాన్ని ఇప్పుడు కామెడీ చేసి పడేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్‌బాస్ 7వపై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా శివాజీ ఆటతీరు, షోలో అమ్మాయిలపై చేసిన వల్గర్ కామెంట్స్.. షో చూడాలనే ఆసక్తిని పూర్తిగా చంపేశాయి. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా శివాజీ బుర్ర ఇంకా అలానే ఉండిపోయింది. అమర్, శోభాపై పిచ్చిపిచ్చి కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) సరే ఇదంతా పక్కనబెడితే శివాజీ ఈ మధ్య ఓ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేశాడు. ఓటీటీలో అది ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దాని ప్రమోషన్స్ కోసం ప్రముఖ కామెడీ షోకి వచ్చాడు. అయితే చాలా కాంట్రవర్సీ అయిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌ని ఇందులో స్కిట్‌గా వేశారు. పాపం అంత సీరియస్ విషయాన్ని పూర్తిగా కామెడీ చేసి పడేశారు. స్కిట్ చూస్తున్న టైంలో శివాజీ ముఖమైతే పూర్తిగా మాడిపోయింది. ఏదో తెచ్చిపెట్టుకున్నట్లు కాస్త నవ్వాడు అంతే! తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇదంతా ఉంది. అయితే బిగ్‌బాస్ షోలోకి రాకముందు శివాజీపై కొందరి వరకు కాస్త మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ షోలో పార్టిసిపేట్ చేశాడో.. తన ప్రవర్తనతో ఉన్న ఆ కాస్త పరువు కూడా పోగొట్టుకున్నాడు! ఇప్పుడు అదే శివాజీకి దోస్త్ అయిన ప్రశాంత్ అరెస్టుపై స్కిట్ వేసి.. శివాజీని సైలెంట్ అయిపోయేలా చేసేపడేశారు. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్
'జబర్దస్త్' షోతో చాలామంది వెలుగులోకి వచ్చారు. వీరిలో ఒకడు అవినాష్. అయితే ముక్కు అవినాష్ అనే పేరుతో ఇతడు పాపులర్ అయ్యాడు. ప్రసుత్తం పలు ఈవెంట్స్, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. 2021 నవంబరులో అవినాష్.. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు స్వయంగా అవినాష్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా భార్యతో కలిసి ప్రెగ్నెన్సీ విషయమై పలు వీడియోస్ చేస్తూ వచ్చిన అవినాష్ దంపతులు.. ఇప్పుడు బిడ్డ చనిపోవడంతో బాధపడుతున్నారు. ఈ విషయం ఎప్పటికీ జీర్ణించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన అవినాష్.. దీని గురించి ఎలాంటి ప్రశ్నలు అడిగి మరింత బాధపెట్టొద్దని చెప్పుకొచ్చాడు. అయితే పురిట్లోనే బిడ్డ చనిపోయిందా? లేదా ప్రసవించిన తర్వాత చనిపోయిందా? అనే విషయం అవినాష్ చెప్పలేదు. (ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న ఆ తెలుగు సినిమా.. డేట్ ఫిక్స్) 'నా లైఫ్‌లో సంతోషమైన, బాధ అయినా.. నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది' 'అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్' అని కమెడియన్ అవినాష్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోనే పలువురు అతడికి ధైర్యంగా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: విమాన ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం) View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
Satya Sri: ఊటీలో చిల్ అవుతున్న జబర్దస్త్ బ్యూటీ (ఫోటోలు)
-
సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న కిర్రాక్ ఆర్పీ, వైరల్ అవుతున్న (ఫొటోలు)
-
యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!
యాంకర్ రష్మీ.. ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఏంటనేది పక్కనబెడితే.. స్క్రీన్‌పై కెమిస్ట్రీ మాత్రం వేరే లెవల్. కలిసి ఏ షోలో కనిపించినా సరే టీఆర్పీలు దూసుకెళ్తాయి. అలాంటిది వీళ్లిద్దరూ ఒక్కచోట కనిపించి చాలా కాలమైంది. అలానే ఇద్దరూ(వేర్వేరుగా) ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటున్నారు. ఇలాంటి టైంలో తాజాగా రష్మీ పెళ్లి రూమర్ ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) ఒడిశా నుంచి వచ్చిన అమ్మాయి రష్మీ. చాలా ఏళ్ల క్రితమే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలు చేసింది. ఎప్పుడైతే కామెడీ షోకి యాంకర్ అయ్యిందో ఈమె ఫేట్ మారిపోయింది. ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ప్రస్తుతానికైతే ఒకటి రెండు షోలకు యాంకరింగ్ తప్పితే వేరే ప్రాజెక్టులు ఏం చేయట్లేదు. అలానే రష్మీ వయసు కూడా 35 ఏళ్లు. అయితే ఈమెకి ఇదివరకే పెళ్లయిందని అని అన్నారు గానీ అందులో ఎంత నిజముందనేది తెలియదు. తాజాగా మరోసారి అలాంటి పుకారు వచ్చింది. ఒడిశాకు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌తో ఈమెకు పెళ్లి కానుందిని, ఇది పెద్దల కుదిర్చిన సంబంధమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటిలానే ఇది నిజం కాదని సుధీర్ ఫ్యాన్స్ అంటున్నారు. రష్మీ స్వయంగా స్పందిస్తే తప్పితే దీనిపై ఓ క్లారిటీ రాదు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!
తెలుగులో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. సినిమాల్లో కావొచ్చు, షోల్లో కావొచ్చు తమదైన హాస్యంతో నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. అలా 'జబర్దస్త్' షోతో పాపులర్ అయిన నరేశ్.. అదేనండి పొట్టి నరేశ్. తనదైన శైలిలో కామెడీ చేస్తూ ఫేమ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఓ షోలో భాగంగా తన ప్రేయసిని అందరికీ పరిచయం చేశాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!) ఇంతకీ ఎవరామె? టీవీ షోలతో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నరేశ్.. పలు కార్యక్రమాల్లో తనదైన మార్క్ హాస్యంతో నవ్విస్తున్నాడు. హైట్ తక్కువ ఉన్నప్పటికీ అది ఇతడికి ప్లస్ అయిందని చెప్పొచ్చు. తాజాగా ఓ షోలో భాగంగా తన ప్రేమలో ఉన్న విషయాన్ని యాంకర్ రష్మీతో చెప్పుకొచ్చాడు. అలానే అమ్మాయిని స్వయంగా స్టేజీపై తీసుకొచ్చాడు. ఆమె తమ ప్రేమ గురించి బయటపెట్టింది. గత రెండేళ్లుగా ఎక్స్‌ప్రెస్ చేయలేనంత ప్రేమని నరేశ్ ఇచ్చాడని చెప్పుకొచ్చింది. అలానే నరేశ్ తన ప్రేయసిని స్టేజీపైకి తీసుకురావడం పక్కనబెడితే.. ప్రపోజ్ చేసి, చేతిపై ముద్దు కూడా పెట్టాడు. అంతా బాగానే ఉంది కానీ ఇదంతా కూడా స్క్రిప్టెడ్ అనిపిస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒరిజినల్ అనే ఫీల్ రాలేదు. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని చూసి చూసి ప్రేక్షకులకు ఎప్పుడో బోర్ కొట్టేశాయి. అయినా కూడా షో నిర్వహకులు ఇలానే చేయడంపై నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) -
ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?
'జబర్దస్త్' షోతో చాలామంది పాపులర్ అయ్యారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ ఫైమా మాత్రం చాలా స్పెషల్. ఓ స్టాండప్ కామెడీ షోలో తన ప్రతిభని నిరూపించుకుని, ఆ తర్వాత తన కోసమే స్కిట్స్ చూసే రేంజుకి వెళ్లిపోయింది. బిగ్‌బాస్ గత సీజన్లో ఆడే అవకాశం దక్కించుకుని మంచిగా సెటిలైపోయింది. అలాంటి ఫైమా.. ఇప్పుడు సడన్‌గా ఆస్పత్రి బెడ్‌పై కనిపించి షాకిచ్చింది. ఇంతకీ ఏమైంది? (ఇదీ చదవండి: భర్తని పరిచయం చేసిన హీరోయిన్ ఇలియానా.. ఇతడెవరో తెలుసా?) పేద కుటుంబానికి చెందిన ఫైమా.. తొలుత స్టాండప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 'జబర్దస్త్'లో అవకాశం దక్కించుకుంది. తనదైన మేనరిజమ్, టైమింగ్ ఈమెకు చాలా ప్లస్ అయ్యాయి. అలా బిగ్‌బాస్, డ్యాన్స్ షోలో పాల్గొని తనలోని మరిన్ని టాలెంట్స్ ఉన్నాయని బయటపెట్టింది. ప్రస్తుతం మళ్లీ 'జబర్దస్త్'లో భాస్కర్ టీమ్‌లో చేస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా ఫైమా ఆస్పత్రిలో చేతికి సెలైన్‌తో కనిపించింది. స్వయంగా ఈ వీడియోని తనే ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఏమైంది? అసలెందుకు ఆస్పత్రిలో ఉందనే కారణం మాత్రం చెప్పలేదు. బహుశా వాతవరణం మార్పు వల్ల జ్వరం ఏమైనా వచ్చిందా? అనే సందేహం వస్తోంది. అలానే అభిమానులు మాత్రం.. ఫైమా త్వరగా కోలుకోవాలని వీడియో దిగువన కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్.. రిజల్టిదే!) View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) -
'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో
'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేశ్.. ప్రస్తుతం 'కేసీఆర్' అని ఓ సినిమా తీస్తున్నాడు. అయితే ఇది తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ లేదంటే వేరే ఏదైనా స్టోరీనా అనేది పెద్దగా రివీల్ చేయలేదు. సరే అదంతా పక్కనబెడితే ఈ నవంబరులోనే సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ విషయమై నటుడు-నిర్మాత రాకేశ్ ఎమోషనల్ అయ్యాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!) అసలేం జరిగింది? ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అన్ని పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. మరోవైపు జబర్దస్త్ కమెడియన్ రాకేశ్ 'కేసీఆర్'(కేశవ్ చంద్ర రమావత్) పేరుతో సినిమా తీస్తున్నాడు. అయితే ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయొద్దని సెన్సార్ ఆపేసింది. ఇప్పుడు దాని గురించే చెబుతూ రాకేశ్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలానే కొందరికి తను బినామీగా వ్యవహరిస్తున్నాననే వార్తలపైనా క్లారిటీ ఇచ్చేశాడు. రాకేశ్ ఏమన్నాడు? 'ఈ సినిమాని అనుకున్న టైంకే రిలీజ్ చేద్దామని పక్కా ప్లాన్ వేసుకున్నాం. కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. ఇది బయోపిక్కా? ఏ జానర్ అనేది రివీల్ చేయడం లేదు. సెన్సార్ వాళ్లకే అన్నీ వివరించాను. ఎన్నికల కోడ్ ప్రకారం ఈ మూవీని ఇప్పుడు విడుదల చేయకూడదట. ఏది జరిగినా మన మంచికే అనుకుంటున్నాను. పబ్లిసిటీకి టైం దొరికిందని అనుకుంటాను. అలానే నాకు ఎవరు డబ్బులిచ్చి ఈ సినిమాని చేయమని చెప్పలేదు. ప్యాషన్ తో ఈ సినిమా తీస్తున్నా. మీరు గౌరవిస్తారని కోరుకుంటున్నాను' అని రాకేశ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) -
Jabardasth Pavithra: ప్రియుడికి ఉంగరం తొడిగిన పవిత్ర.. త్వరలోనే పెళ్లి (ఫోటోలు)
-
'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్
తెలుగులో కామెడీ షో అనగానే చాలామందికి 'జబర్దస్త్' గుర్తొస్తుంది. ఓ సాధారణ కమెడియన్‌గా ఈ షోలో అడుగుపెట్టిన రాకేశ్.. ఆ తర్వాత టీమ్ లీడర్ రాకింగ్ రాకేశ్ అయ్యాడు. పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం తనే హీరోగా నటిస్తూ నిర్మిస్తూ 'కేసీఆర్' సినిమా తీస్తున్నాడు. అయితే ఈ మూవీ తీయడం కోసం ఇల్లు తాకట్టు పెట్టానని, కొందరు తనని మోసం చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏంటీ సినిమా? కమెడియన్ రాకేశ్.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఇప్పుడు ఏకంగా కోట్లు పెట్టి 'కేసీఆర్' అనే సినిమా తీస్తున్నారు. ఇది కేసీఆర్ జీవితం ఆధారంగా, ఆయనపై ఇష్టంతో తీస్తున్న సినిమా ఇది అని స్వయంగా రాకేశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. సినిమా అంటే కోట్ల వ్యవహారం కదా! అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయ్ అని యాంకర్ అడగడంతో.. తను ఎంతో కష్టపడి, ఇష్టంగా కట్టుకున్న ఇల్లు తాకట్టు పెట్టేశానని రాకేశ్ చెప్పుకొచ్చాడు. బినామీ డబ్బులతో నిర్మిస్తున్నాననే వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'కేజీఎఫ్' స్టోరీతో మరో సినిమా.. జాతీయ అవార్డుకి గురిపెట్టిన హీరో) మోసం చేశారు! ఈ సినిమా చేస్తానని కొందరు వ్యక్తులు తనకు మాటిచ్చారని, వాళ్లు వెనక్కి తగ్గడంతోనే ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చిందని రాకింగ్ రాకేశ్ చెప్పుకొచ్చుడ. అలానే ఓ రైటర్ మోసం చేయడం వల్ల సినిమా మొదలు కావడానికి ముందే కారు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని అన్నాడు. ఈ సినిమా నిర్మాణం గురించి తెలిసి అమ్మతో పాటు భార్య సుజాత తనని ఎంకరేజ్ చేశారని రాకేశ్ చెప్పుకొచ్చాడు. తన భార్య సుజాత.. బ్యాంకులో దాచుకున్న డబ్బులిస్తానని తనకు ధైర్యం చెప్పిందని.. అలానే ఈ సినిమాకు రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్, క్యాస్టూమ్ డిజైనర్.. ఇలా చాలా పనుల్ని సుజూత చేస్తూ తనకు అండగా ఉందని రాకేశ్ చెప్పాడు. ఇదిలా ఉండగా కేసీఆర్ సినిమాతో తెలుగు నటి సత్యకృష్ణ కూతురు అనన్య మేనన్ ఇండస్ట్రీలోకి ఎంటారీ ఇస్తోంది. గరుడ వేగ అంజి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ చిత్ర రిలీజ్ డేట్ వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: వీళ్లకేమో తిట్లు.. శివాజీకేమో బుజ్జగింపులు.. ఏంటిది బిగ్‌బాస్?) View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) -
వాడి వల్ల చాలా మోసపోయాను.. కన్నీళ్లు పెట్టుకున్న రీతూ చౌదరి
కామెడీ షో జబర్దస్త్ నటి రీతూ చౌదరి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే.. కొద్దిరోజుల క్రితం తన తండ్రి మరణించడంతో ప్రస్తుతం తన కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటుంది. తన కొత్త ఇంటి నిర్మాణం విషయంలో ఓ ఇంటీరియర్ డిజైనర్ వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెబుతూ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చింది. తన ఇంటికి సంబంధించిన ఇంటీరియల్ వర్క్‌ను ఒకరికి అప్పగిస్తే డబ్బు తీసుకుని మోసం చేశాడని.. అందువల్ల సుమారు రూ. 2 లక్షలు మోసపోయినట్లు ఆమె తెలిపింది. (ఇదీ చదవండి: క్రేజీ హీరోకు జోడీగా దేత్తడి హారిక.. బేబీ టీమ్‌తో గోల్డెన్ ఛాన్స్) 'మా ఫ్యామిలీకి నాన్న దూరం కావడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయన లేకపోవడంలో నా కొత్త ఇంటికి సంబంధించిన ఇంటీరియల్ వర్క్‌ను ఒకరికి అప్పజెప్పాను. అందుకు గాను అతనికి రూ. 5లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాను. కానీ అతను డబ్బు తీసుకున్నాక పని మాత్రం నేను చెబుతున్నట్లుగా చేయలేకపోయాడు.. పని రాకపోతే రాదని చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు సగం సగం పనులు చేశాడు. దాంతో అతడిని పనిలో నుంచి తీసేసి.. డబ్బులు తిరిగి ఇవ్వమని కోరితే ఎటువంటి రెస్పాన్స్ లేకుండా.. ఫోన్లకు కూడా స్పందించేవాడు కాదు. తిరిగి మమ్మల్నే అనరాని మాటలు అనేవాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూ. 3లక్షలు తిరిగి ఇచ్చాడు. ఓవైపు బ్యాంక్ ఈఎంఐలు కట్టుకుంటూ మరోవైపు ఇంటి పని పూర్తి కాక మానసికంగా ఎంతో సతమతమయ్యా. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మా నాన్న చనిపోవడంతో నేను ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ ఇల్లు నిర్మాణ విషయంలో నేను తీవ్రమైన మానసిక కుంగుబాటుకు గురికావడమే కాకుండా.. ఆర్థికంగా మోసపోయాను. ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా. అతన్ని పనిలో నుంచి తొలగించాక ఇంటీరియర్ వర్క్‌ను వేరే వాళ్లకు అప్పగించాను. ప్రస్తుతం వర్క్ పూర్తి కావచ్చింది. నాకు ఎదురైన ఇబ్బంది ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను.' అంటూ రితూ చౌదరి తెలిపింది. -
Jabardasth Varsha Latest Photos: సముద్రతీరంలో జబర్దస్త్ వర్ష ఆటలు.. తడిసి ముద్దవుతున్న అందాలు (ఫోటోలు)
-
అక్కడికెళ్లి కోహ్లీతో ఆడొచ్చు కదా?.. అదిరే అభి వీడియో వైరల్!
జబర్దస్త్ కామెడీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అభినయ కృష్ణ. అభిమానులను ఆయనను అదిరే అభి అని పిలుస్తుంటారు. తన కామెడీ పంచ్‌లతో కామెడీ షోతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2002లో వచ్చిన ప్రభాస్ మూవీ ఈశ్వర్లో హీరో ఫ్రెండ్‌గా తొలిసారిగా నటించారు. ఆ తరువాత విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్ఎస్సీ, ఈగ చిత్రాలలో నటించారు. అయితే తాజాగా అదిరే అభి ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: చిన్నప్పుడే తండ్రి మరణం.. హోటల్లో వెయిటర్‌గా.. అత్తారింటికి దారేదీ నటుడి స్టోరీ!) అదిరే అభి వీడియోలో మాట్లాడుతూ..'మొన్ననే పక్కన టీ కొట్టుకు వెళ్లి టీ తాగుతున్నా. అప్పుడే టీ కొట్టు అతను మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఆ లాస్ట్ బాల్‌ను ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడుంటే సిక్స్ వెళ్లేది అన్నాడు. మిస్ చేశాడు కోహ్లీ అన్నాడు. నేను షాకయ్యా. విరాట్ కోహ్లీకి సిక్స్ ఎలా కొట్టాలో అతను చెబుతుంటే నాకు ఆశ్చర్యమనిపించింది. ఇంకో పక్కనున్న వ్యక్తి దేశంలో, రాష్ట్రంలో ఇలా చేసి ఉంటే వీళ్ల పార్టీ గెలిచేది అని అన్నాడు. అదోక షాక్. ఇంకొంతమంది సినిమాల గురించి చెప్పారు. ఈ సీన్ అలా కాకుండా ఇలా తీసి ఉంటే బాగుండేది అన్నారు.' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..'నాకు అర్థం కానీ విషయం ఏంటంటే అంత నాలెడ్జ్ ఉన్నోడు ఇక్కడ టీ షాపు దగ్గర మాట్లాడాల్సిన అవసరమేంటి? అక్కడికెళ్లి కోహ్లీతో ఆడొచ్చు కదా? పాలిటిక్స్‌లో చేరి అధికారంలోకి రావొచ్చు కదా? సినిమాల్లో చేరి డైరెక్షన్ చేయొచ్చు కదా? బేసిక్‌గా ఏంటంటే మనం మనపని తప్పా అందరి పనులు చేసేస్తాం. అందరికంటే ఎక్కువ మనకే తెలుసనుకుంటాం. ఈరోజు కోహ్లీ ఎందుకు క్రికెట్ గ్రౌండ్లో ఉన్నాడు.. మనం టీ షాపు దగ్గర ఎందుకు ఉన్నామనేది రియలైజ్ చేసుకోవాలి. మనం మనపనిని ఫర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు. ఎవరితో అవసరం లేదు. మన పని పక్కనపెట్టి.. అతను అలా ఆడితే బాగుండేది.. వాళ్లు ఇలా చేస్తే బాగుండేది.. అంటే మనల్ని నాశనం చేసుకున్నట్టే. అవతలి వాళ్లు అడిగితే చెప్పండి.. అంతేకానీ అడగకున్నా కూడా మనం మాట్లాడుతున్నామంటే టైం వేస్ట్ చేస్తున్నట్టు' అని అన్నారు. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!) అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో అదిరే అభి మాటలకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అలాంటి వాళ్లతో మీకెందుకు అన్నా అని పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది మేధావులకు టైం కలిసిరాక అలా రోడ్లమీద తిరుగుతూ ఉంటారు అన్నా అంటూ నెటిజన్స్ రిప్లై ఇస్తున్నారు. ఏది ఏమైనా అదిరే అభి చెప్పిన మాటలు మనం కూడా ఎక్కడో ఒకచోట అలా మాట్లాడి ఉంటాం అని అనిపిస్తోంది. View this post on Instagram A post shared by Adhire Abhi (@abbhinav_actor) -
'ఎవరు సార్ ఆయన.. నాకేంటి సంబంధం'.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ!
టేస్టీ తేజ.. మీలో ఈ పేరు ఎంతమందికి తెలుసు. దాదాపుగా చాలామందికి తెలియదనే చెబుతారు. ఎందుకంటే అతని అంతలా ఫేమ్ ఉన్న వ్యక్తి కాదు. అతన్ని గుర్తు పెట్టుకునేంత ఏం చేశాడని అంటారా?.. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేంత వరకు కూడా ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. బిగ్ బాస్ షోకు రాకముందు అతను ఏం చేశాడు? తొమ్మిదో కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన టేస్టీ తేజను ఈ అవకాశం ఎలా వరించింది? ఆ వివరాల గురించి ఓసారి తెలుసుకుందాం. (ఇది చదవండి: సుధీర్ బాబు వీడియో లీక్.. అలా మారిపోయాడేంటీ భయ్యా?) జబర్దస్త్‌తో కెరియర్ స్టార్ చేసిన తేజ.. యూట్యూబర్‌గా ఫేమస్ అయ్యారు. తన సొంత యూట్యూబ్ ఛానల్తోనే పాపులరిటీ తెచ్చుకున్నారు. తేజా ఫుడ్ లవర్ కావడంతో అతని పేరు కాస్తా టేస్టీ తేజాగా మారింది. మొదట చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్‌తో తేజా ప్రయాణం మొదలై.. ఆ తర్వాత దూసుకెళ్లాడు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడలో కూడా సెలబ్రిటీలతో టేస్టీ తేజ ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఏకంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. తేజాకి డబ్బులిచ్చి మరీ ఫుడ్ వీడియోలు చేయించుకుంటున్నారంటే మనోడి క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన టేస్టీ తేజ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన గురించి మాట్లాడుతూ ఫుల్ ఎమోషలయ్యారు. ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం. టేస్టీ తేజకు జబర్దస్త్ కమెడియన్‌గా రాణించేందుకు లైఫ్ ఇచ్చింది మాత్రం అదిరే అభి. ఇంటర్వ్యూలో అతని ఫోటో చూడగానే టేస్టీ తేజ కన్నీళ్లాగలేదు. ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు. (ఇది చదవండి: 'నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు'.. ఆసక్తిగా ట్రైలర్!) టేస్టీ తేజ మాట్లాడుతూ..'ఎవరు సార్ ఆయన.. ఆయనకు, నాకు ఏంటి సంబంధం సార్.. నాకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏముంది సార్? .. అంటూ అభిని చూస్తూ చిన్న పిల్లాడిలా బోరున విలపించాడు. తేజ వేరే వాళ్లతో వెళ్దామని చాలా మంది సలహాలిచ్చినా.. లేదు మనోడు చేస్తాడు.. అని నాతో చేయించాడు. ఎప్పుడు ఎక్కడికెళ్లినా ఈయనను మాత్రం మర్చిపోను సార్. జబర్దస్త్‌లో చేసిన పరిచయాల వల్లే నా సొంత యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఫేమస్ అయ్యాను. ఏ సినిమా ప్రమోషన్ అయినా టేస్టీ తేజ వీడియో కచ్చితంగా ఉంటుంది. ఇదంతా అన్న వల్లే సాధ్యమైంది. ఎక్కడున్న అన్న బాగుండాలి.. మాలాంటి వారికి ప్రోత్సహించాలి. అందుకే అన్నను చూడగానే ఏడుపు వచ్చేసింది.' అంటూ ఎమోషనల్ అయ్యారు. -
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఫన్నీ స్పీచ్..!
-
కొత్త ఇంట్లోకి ఫైమా.. అమ్మని పట్టుకుని ఏడ్చేసింది!
తెలుగులో లేడీ కమెడియన్స్ చాలా తక్కువ మంది. అందులో ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీ షోలతో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె.. తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో అలరిస్తూ ఉంటుంది. అలాంటి ఈమె.. ఇప్పుడు కొత్తింట్లో అడుగుపెట్టింది. అప్పట్లో తన తల్లికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంది. 'పటాస్' షోలో స్టాండప్ కామెడీ చేస్తూ వెలుగులోకి వచ్చిన ఫైమా.. ఆ తర్వాత 'జబర్దస్త్'లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత సహాయ పాత్రల్లో కనిపించిన ఈమె.. తన మార్క్ విచిత్రమై యాస, టైమింగ్‌తో ఆకట్టుకుంది. ఒకానొక దశలో టీమ్ లీడర్స్‌నే డామినేట్ చేసి మరీ గుర్తింపు తెచ్చుకుంది. (ఇదీ చదవండి: 'ఛాంగురే బంగారు రాజా' సినిమా రివ్యూ) అలా కమెడియన్‌గా చాలా క్రేజ్ తెచ్చుకున్న ఫైమా.. గతేడాది 'బిగ్‌బాస్'లో పాల్గొంది. దాదాపు 10 వారాల పాటు ఉండి, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అయితే షోలో అడుగుపెట్టినప్పుడు తల్లి గురించి కొన్ని విషయాలు చెప్పింది. బీడీలు చుట్టి, అలా వచ్చిన డబ్బుతో తమని పెంచిందని చెప్పిన ఫైమా.. ఆమెకి ఓ ఇల్లు కట్టివ్వాలనేదే తన కోరిక అని చెప్పింది. ఇప్పుడు ఆ కలని నిజం చేసి చూపించింది. ఇదిలా ఉండగా ఫైమా.. ప్రస్తుతం పలు షోల్లో కమెడియన్, డ్యాన్సర్‌గా ఆకట్టుకుంటోంది. మరోవైపు 'పటాస్' నుంచి తనతో ట్రావెల్ అవుతున్న కమెడియన్ ప్రవీణ్‌తో ఈమె ప్రేమలో ఉంది. ఇక ఎలానూ ఇల్లు కట్టేసింది కాబట్టి త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చూడాలి ఎప్పుడో ఆ శుభకార్యం జరుగుతుందో? (ఇదీ చదవండి: అతడితో పులిహోర కలిపేస్తున్న రతిక.. పాపం ప్రశాంత్!) -
యాంకర్ రష్మీ పరువు తీసిన బుల్లెట్ భాస్కర్!
తెలుగు ప్రేక్షకులు కామెడీని ఎక్కువగా ఆదరిస్తారు. అది సినిమా అయినా, టీవీ ప్రోగ్రామ్ అయినా బాగుంటే కచ్చితంగా చూసేస్తారు. అయితే ఒకప్పుడు బాగా గుర్తింపు తెచ్చుకున్న 'జబర్దస్త్'కి ఇప్పుడు క్రేజ్ తగ్గిపోయింది. ప్రోమాలు తప్పితే షో ఎవరూ చూడట్లేదనిపిస్తుంది. సరే అది పక్కనబెడితే ఇప్పుడు అదే షోలో యాంకర్ రష్మీని ఓ కమెడియన్ సరదాగా ట్రోల్ చేశాడు. 20 ఏళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన రష్మీ.. ఒకటి రెండు సినిమాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేసింది. ఎప్పుడైతే యాంకర్ అయిందో ఆమె ఫేట్ మారిపోయింది. హీరోయిన్గా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కొన్నాళ్ల క్రితం పలు మూవీస్ చేసింది గానీ ఇప్పుడు కేవలం షోల్లో మాత్రమే కనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' రెండో వారం నామినేషన్స్.. లిస్టులో తొమ్మిది మంది!) తాజాగా రిలీజైన ఓ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.. రష్మీని చూసేందుకని 'భోళా శంకర్' సినిమాకు వెళ్లానని.. కానీ కర్చీఫ్ పడిపోయిందని దాన్ని తీసుకునేలోపు రష్మీ యాక్ట్ చేసిన సీన్ వచ్చి వెళ్లిపోయిందని అన్నాడు. అయితే భాస్కర్ టీజ్ చేసినా సరే.. ఇది సరదాగా కావడంతో రష్మీ.. లైట్ తీసుకుంది. ఏదేమైనా సరే నవ్వుతూనే రష్మీ పరువు తీసేశాడు బుల్లెట్ భాస్కర్. మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమా ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షోకే ఫ్లాప్ టాక్ బయటకొచ్చింది. ఇందులో చిరు ఎంట్రీ సాంగ్ లో రష్మీ.. కాసేపు కనిపిస్తుంది. అలానే శ్రీముఖితోనూ చిరు... 'ఖుషి' నడుము సీన్ చేయడంపై అప్పట్లోనే ట్రోల్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా సెప్టెంబరు 15 నుంచి 'భోళా శంకర్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
నా లైఫ్‌లో రష్మీదే మెయిన్ రోల్: సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే యాంకర్ రష్మీనే గుర్తొస్తుంది. ఏ క్షణాన 'జబర్దస్త్'లో వీళ్లిద్దరూ కలిశారో గానీ అప్పటినుంచో షోలో కామెడీ కంటే వీళ్ల జంటే బాగా హైలైట్ అయింది. దాదాపు కొన్నేళ్లపాటు కళకళలాడిన ఈ జోడీకి.. హఠాత్తుగా బ్రేక్ పడింది. సుధీర్.. షో నుంచి బయటకు వెళ్లిపోవడంతో వీళ్లని కలిసి చూసే ఛాన్స్ దక్కలేదు. తాజాగా ఓ ఈవెంట్ లో వీళ్లిద్దరూ కలిసి ముందులా ప్రేమలో మునిగితేలారు. తాజాగా ఓ ఈవెంట్ లో కలిసి యాంకరింగ్ చేసిన సుధీర్-రష్మీ.. 'నిజమేనా చెబుతున్నా జానే జానా' పాటకు డ్యాన్స్ చేసి, తామిద్దరి కెమిస్ట్రీ ఇంకా అలానే ఉందని చెప్పకనే చెప్పారు. ఇక ఈ ఫెర్ఫార్మెన్స్ తర్వాత రష్మీతో తన బాండింగ్‌పై సుధీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతకంటే ముందు స్క్రీన్ పై సుధీర్‌తో తను ఉన్న పాత వీడియోలని ప్లే చేయగా, రష్మీ ఎమోషనల్ అయింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే) 'రష్మీతో నాది బ్యూటీఫుల్ జర్నీ' అని సుధీర్ చెప్పగానే.. బ్యూటీఫుల్ జర్నీనా? లవ్ జర్నీనా? అని గెటప్ శీను పంచ్ వేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన సుధీర్.. 'బేసికల్ గా రష్మి సెన్సిటివ్, చాలా కష్టపడేతత్వం ఉన్న వ్యక్తి. నాకు అందరికంటే రష్మీ చాలా ఎక్కువ' అని ఆమెని తెగ పొగిడేశాడు. ఇదంతా షోకి హైలైట్ గా నిలిచింది. 'మేం బయటకు ఎక్కడికెళ్లినా.. మా ఇద్దరి గురించే అడుగుతూ ఉంటారు. చెప్పాలంటే నా జర్నీలో, సక్సెస్ లో రష్మీదే మెయిన్ రోల్. కెరీర్ లో నేను ముందుకెళ్లడానికి, స్కిట్స్ తోపాటు రష్మీ పాత్ర చాలా ఉంది. ఆమెతో చేసిన ప్రోగ్రామ్స్, స్కిట్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి' అని సుధీర్ చెప్పుకొచ్చాడు. ఇక చివర్లో రష్మీకి థ్యాంక్స్ చెప్పిన సుధీర్.. దానితో పాటు 'మిస్ యూ' అని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. (ఇదీ చదవండి: బేబి.. క్లైమాక్స్ అలా తీసుంటే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ) -
ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. అయితే ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. అతని తల్లికి ప్రస్తుతం సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. (ఇది చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ ) ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అమ్మకు తెలియకుండానే ఇంటిని అమ్మేస్తున్నట్లు ఎమోషనలయ్యారు. అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేయస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ శాంతికి మద్దతు ప్రకటిస్తున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న పని చూస్తుంటే గర్వంగా ఉందని పోస్టులు పెడుతున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం చాలా గొప్పది.. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద, స్టేటస్ ఏది ఉండదని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్ని రోజులు నాకోసం ఉన్న ఇల్లు ఇప్పుడు నాకు లేకుండా పోతోంది.. కానీ ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. (ఇది చదవండి: ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న నటి?!) View this post on Instagram A post shared by Jabardasth Shanthi Swaroop (@jabardasthshanti) -
బ్రేకప్స్ గురించి బయటపెట్టిన యాంకర్ రష్మీ
యాంకర్ రష్మీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. వీళ్లు ఏ క్షణాన కలిశారో గానీ జంటగా హాట్ టాపిక్ అయిపోయారు. దాదాపు 6-7 ఏళ్ల నుంచి టీవీ స్క్రీన్‌పై వీళ్ల జోడీని కొట్టే కాంబో రాలేదని చెప్పొచ్చు. అలాంటిది కొన్నాళ్లుగా సుధీర్-రష్మీ కలిసి కనిపించలేదు. దీంతో చాలామంది ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. ఇలాంటి టైంలో తాజాగా రష్మీ.. తన బ్రేకప్స్ గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు) 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలకు యాంకరింగ్ చేస్తూ రష్మీ బిజీగా ఉంటుంది. వీటితోపాటు అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తూ ఉంటుంది. ఈ మధ్యే భోళా శంకర్ మూవీలో చిరుతో కలిసి ఓ పాటలో స్టెప్పులేసింది. తాజాగా కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసి, తెలుగులో ఆగస్టు 25న రిలీజ్ కాబోతున్న 'బాయ్స్ హాస్టల్' చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. ఇక ఈ ఈవెంట్లో రష్మీ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హార్ట్ బ్రేక్స్ గురించి చెబుతూ.. 'ప్రతి ఒక్కరి జీవితంలో హార్ట్ బ్రేక్, రిలేషన్స్ చాలా ఉంటాయి. 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు చాలామంది ఇవన్నీ చూస్తూనే ఉంటారు. నా బ్రేకప్స్ గురించి కౌంట్ చేసి చెప్పడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చింది. దీన్నిబట్టి చూస్తుంటే యాంకర్ రష్మీ మనసు కూడా ఇప్పటికే చాలాసార్లు బ్రేక్ అయిందనమాట. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త) -
జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ ఆర్టిస్ట్, సింగర్ నవ సందీప్‌పై కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమని అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని బాధిత యువతి పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇతడు జబర్దస్త్ షోతో పాటు ఇతరత్రా షోలలోనూ కనిపించాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ, పటాస్ వంటి షోలలనూ సందీప్ పాల్గొన్నాడు. బుల్లితెర షోలలో కామెడీ పండించి నవ్వించిన సందీప్ ఇలా ఓ అమ్మాయిని మోసం చేశాడని తెలిసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సాయిధరమ్ తేజ్ రీల్ చెల్లెలు.. ఇంత అందంగా ఉందేంటి బ్రో! ఓటీటీలో బ్రో.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే? -
బ్రేకప్ రూమర్స్... ట్విస్ట్ ఇచ్చిన రీతూ.. ఒక్క పోస్ట్‌తో..
జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఈ మధ్య గ్లామర్‌ను తెగ ఒలకబోస్తోంది. ఇటు వెస్ట్రన్, అటు ట్రెడిషనల్ గెటప్‌లో ఫోటోషూట్ చేస్తూ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇస్తోంది. రీతూ అందాన్ని చూసి అభిమానులు తెగ ముచ్చటపడిపోతున్నారు. మా రీతూ హీరోయిన్‌కు ఏమాత్రం తక్కువ కాదనేవాళ్లూ ఉన్నారు. తండ్రి చనిపోయిన బాధలో నుంచి తేరుకుని ఇప్పుడిప్పుడే తిరిగి మామూలు మనిషవుతున్న రీతూ గతంలో శ్రీకాంత్ అనే వ్యక్తితో లవ్‌లో ఉన్నట్లు వార్తలు వైరలయ్యాయి. వీరిద్దరూ కలిసి రీల్స్ చేస్తూ తెగ హల్చల్ చేసేవారు. అతడితో బంధం ఎంతో గొప్పదని కూడా రీతూ పేర్కొంది. ఈ ముద్దుగుమ్మ నుదుటన శ్రీకాంత్ ముద్దు పెట్టిన వీడియో సైతం నెట్టింట చక్కర్లు కొట్టింది. దీంతో వీరి లవ్వు నిజమేనని అంతా అనుకున్నారు. రీతూకు ఓ తోడు దొరికేసిందని అభిమానులు అభిప్రాయపడ్డారు. కానీ ఇటీవల రీతూ తనకు బ్రేకప్ అయిందంటూ హింట్ ఇచ్చింది. గత నెలలో ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో జరిపిన చిట్‌చాట్‌లో తాను సింగిల్‌గా ఉన్నట్లు వెల్లడించింది. అంతేకాదు, ప్రేమకు, పెళ్లికో దండం.. ప్రస్తుతం తాను తనతో మాత్రమే ప్రేమలో ఉన్నానని చెప్పుకొచ్చింది. అసలు పెళ్లి చేసుకోకపోతేనే సంతోషంగా ఉండొచ్చు అని పేర్కొంది. శ్రీకాంత్‌తో మాట్లాడట్లేదని కూడా తెలిపింది. దీంతో వీరి బ్రేకప్ నిజమేననుకున్నారంతా! ఇంతలో సడన్ షాకిస్తూ తాజాగా శ్రీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తనను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారనుకుందో ఏమో కానీ ఆ పోస్ట్‌కు కామెంట్లు కనిపించకుండా పెట్టింది. అసలు గీతూ ఇప్పుడు సింగిలా? కాదా? అనేది తెలియాలంటే తను క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే! View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) చదవండి: -
కాస్టింగ్ కౌచ్ పై నోరువిప్పిన కుష్బూ
-
రూ.2 లక్షలిస్తానన్నా జబర్దస్త్‌కు వెళ్లను: కమెడియన్
నటుడు, కమెడియన్ జోష్ రవి సినీ ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లవుతోంది. ఇప్పటివరకు వందకు పైగా సినిమాలు చేశాను, కానీ ఇందులో గుర్తుపెట్టుకునేవి 20-30 మాత్రమే ఉంటాయంటున్నాడు జోష్ రవి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. రవితేజ ఫోన్ చేసి మెచ్చుకుంటే కన్నీళ్లాగలేదు. కానీ తర్వాత అన్నీ గే క్యారెక్టర్స్ వచ్చాయి. అస్తమానం అవే చేస్తే బాగోదని వాటన్నింటినీ వదులుకున్నాను. మొదట్లో చాలా కష్టాలు పడ్డాను. తిండీతిప్పలు మాని తిరిగాను. వచ్చిన అవకాశంతో నన్ను నేను నిరూపించుకున్నాను. జనాలు ఆదరించారు. నేను నటించిన మొదటి చిత్రం మగధీర. కానీ ఎక్కువ నిడివి పాత్ర జోష్‌లో ఉండటంతో జోష్ రవిగా నా పేరు స్థిరపడిపోయింది. నాన్నకు ప్రేమతో సినిమాలో జూ.ఎన్టీఆర్ ఫ్రెండ్‌గా నేను చేయాల్సింది. సుకుమార్‌గారికి ఫోటో కూడా పంపాను. కానీ ఎవరో ఎదగడం కోసం మధ్యలో ఉన్నవాళ్లు నా గురించి నెగెటివ్‌గా చెప్పి ఆ ఆఫర్ రాకుండా చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ విషయం నాకూ, సుకుమార్‌కు కూడా తెలిసింది. జబర్దస్త్ షోపై నాకు గౌరవం ఉంది. కానీ రూ.2 లక్షలు ఇస్తానన్నా నేను వెళ్లను. ఎందుకంటే నేను కేవలం సినిమాలే చేస్తాను. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినప్పటికీ నాలుగు సార్లు షోకి గెస్ట్‌గా వెళ్లాను. ఇప్పటికీ గెస్ట్‌గా రమ్మంటే వెళ్తాను. కానీ అక్కడే ఉండి డబ్బు సంపాదించాలనేది లేదు. ఎందుకంటే నేను 20కు పైగా సినిమాలు చేశాక జబర్దస్త్‌కు వెళ్లాను. అప్పుడు నాకు రెండు, మూడు వేలు మాత్రమే ఇచ్చేవారు. నాకు సినిమా అనేది ప్రధానం. ఇక్కడ అవకాశాలు రాకపోయినా ఖాళీగా కూర్చుంటానే తప్ప జబర్దస్త్ చేయను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: విజయ్ దేవరకొండకు కాబోయే భార్యపై సామ్ కామెంట్స్ వైరల్ శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే -
వీల్ ఛైర్లో యాంకరింగ్.. అదీ తెలుగు షోలోనే!
కామెడీ చూడటానికి హాయిగా ఉంటుంది. కానీ చేసేవాళ్లని అడిగితే అదెంత కష్టమో చెబుతారు. ఇండస్ట్రీలో మేల్ కమెడియన్స్ ఉన్నంతమంది లేడీస్ లేరు. టీవీ షోల వల్ల ఇప్పుడిప్పుడే పలువురు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా ఫేమ్ తెచ్చుకుంది రోహిణి. ఉత్తరాంధ్రకు చెందిన ఈమె... తొలుత సీరియల్స్ లో కామెడీ పాత్రలు చేసింది. 'జబర్దస్త్'లో చేసి ఓ రేంజు క్రేజ్ సంపాదించింది. (ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?) షోలు, సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న రోహిణి.. సరిగ్గొ కొన్నాళ్ల ముందు ఆస్పత్రిలో చేరింది. కాలికి పెద్దకట్టుతో కనిపించింది. దీంతో ఆమెకు ఏమైందా అని అందరూ కంగారు పడ్డారు. 2016లో విజయవాడ నుంచి కారులో వస్తుండగా రోహిణికి యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆమె కాలిలో రాడ్ పెట్టారు. ఇప్పుడు అది తీయించుకుందామని వెళ్లింది. ఆ ఫొటోలు, వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ నొప్పి నుంచి కాస్త కోలుకుంది. షోలు చేయడం మొదలుపెట్టేసింది. రోహిణి కాలి నుంచి రాడ్ నుంచి కొన్ని నెలలు అయినా కాలేదు. అప్పుడే తెలుగులోని ఓ ఛానెల్లో ప్రసారమైన షోలో కనించింది. వీల్ ఛైర్లోనే స్టేజీపైకి వచ్చి రవితో కలిసి యాంకరింగ్ కూడా చేసింది. తాజాగా ఆదివారం ఈ షో టెలికాస్ట్ అయింది. అయితే ఈ షోని చాలా నెలల క్రితమే ఒప్పుకొందని, వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆరోగ్యం కుదటపడనప్పటికీ షో చేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) (ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవికి వింత అలవాటు!) -
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన రీతూ చౌదరి, నో పెళ్లి అంటూ పోస్ట్
నటి, జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి సోషల్ మీడియాలో చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుందీ బ్యూటీ. మరోపక్క బుల్లితెరపైనా పలు షోలలో కనిపిస్తూ కామెడీ పంచులతో అలరిస్తోంది. అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంటూ ఉంటుంది. ఆ మధ్య రీతూ చౌదరి లవ్‌లో పడిందంటూ ఓ వార్త తెగ వైరలయింది. శ్రీకాంత్ అనే వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఈ బంధం కంటే ఏదీ గొప్పది కాదని రాసుకొచ్చింది. దీంతో రీతూ-శ్రీకాంత్ లవ్‌లో ఉన్నారని కన్ఫామ్ అయిపోయింది. రీతూ నుదుటన శ్రీకాంత్ ముద్దు పెట్టిన వీడియో కూడా వైరల్ అయింది. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ఆ మధ్య ఫోటో కూడా లీకైంది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వీళ్లిద్దరూ మళ్లీ కలిసి కనిపించనేలేదు. రీతూ తండ్రి చనిపోయినప్పుడు కూడా శ్రీకాంత్ ఆమెను ఓదార్చడానికి రాలేనట్లు తెలుస్తోంది. పైగా రీతూ.. అతడితో కలిసి దిగిన ఫోటోలను సైతం డిలీట్ చేసింది. దీంతో వీళ్లు అసలు కలిసే ఉన్నారా? విడిపోయారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ అనుమానాలకు తెర పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో 'నిజాలు మాట్లాడుకుందాం' అంటూ చిట్‌చాట్ నిర్వహించిన ఆమె.. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు అసలు పెళ్ళి చేసుకోకపోవడమే మంచిది, అప్పుడే సంతోషంగా ఉండొచ్చు అని రిప్లై ఇచ్చింది. శ్రీకాంత్‌తో మాట్లాడట్లేదా? అని అడగ్గా లేదన్నట్లుగా తలాడిస్తూ త్వరలోనే వివరంగా చెప్తానంది. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు 'లవ్వుకో దండం.. నేను నాతో మాత్రమే ప్రేమలో ఉన్నాను' అని చెప్పుకొచ్చింది. దీంతో రీతూ బ్రేకప్ నిజమేనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. #Rithu x #Srikanth pic.twitter.com/raIL6cXxDA — Hardin (@hardintessa143) July 16, 2022 చదవండి: ఇంట్లో వాళ్లను కాదని డేర్ చేస్తున్న నిహారిక -
Kevvu Karthik : హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న జబర్దస్త్ కెవ్వు కార్తిక్ (ఫొటోలు)
-
Anchor Varsha Photos: హైలైఫ్ ఎగ్జిబిషన్ పోస్టర్ లాంచ్‌లో జబర్దస్త్ వర్ష సందడి (ఫొటోలు)
-
అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. నన్ను కూడా గుర్తుపట్టలేదు: యాంకర్
నటిగా కెరీర్ మొదలుపెట్టిన సౌమ్య రావు జబర్దస్త్ షోతో యాంకర్‌గా మారింది. పైకి నవ్వుతూ, పంచులు విసురుతూ చలాకీగా కనిపించే ఆమె జీవితంలో మాత్రం ఎంతో విషాదం దాగి ఉంది. తల్లి క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూయడం ఆమెను ఎంతగానో కుంగదీసింది. చివరి రోజుల్లో తల్లి అనుభవించిన నరకాన్ని చూసి తల్లడిల్లిపోయింది. తాజాగా ఓ షోలో హైపర్ ఆది.. సౌమ్య రావుకు ఆమె తల్లి జ్ఞాపకార్థం ఓ ఫోటో ఫ్రేమ్ ఇచ్చాడు. ఇది చూసి స్టేజీపైనే ఏడ్చేసింది సౌమ్య రావు. ఆమె మాట్లాడుతూ.. 'ఒకరోజు అమ్మకు బాగా తలనొప్పి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రెయిన్ క్యాన్సర్ అన్నారు. తను నెమ్మదిగా జ్ఞాపకశక్తిని కోల్పోతూ వచ్చింది. ఆఖరికి నన్ను కూడా మర్చిపోయింది. తనను మూడున్నరేళ్లపాటు బెడ్‌పైనే చూసుకున్నాను. ఆ దేవుడు అమ్మను ఇంతటి దారుణ స్థితిలో వదిలేస్తాడని అసలు ఊహించలేదు. అమ్మ మళ్లీ నా కడుపులో పుట్టాలని కోరుకుంటున్నాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సౌమ్య. మొన్నామధ్య మాతృ దినోత్సవం సందర్భంగానూ తల్లిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది సౌమ్య. తల్లి కోసం భగవంతుడికి ఎన్నో పూజలు చేసినా, ఉపవాసాలు ఉన్నా ఆ దేవుడు కరుణించలేదని బాధపడింది. ఆ భగవంతుడు తనకే ఎందుకిలా చేశాడని ఆవేదన చెందింది. అందరూ అమ్మ ఫోటో షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే తనకు మాత్రం చివరి రోజుల్లో తల్లి పడ్డ బాధే కళ్ల ముందు మెదులుతోందని కన్నీళ్లు పెట్టుకుంది.. అమ్మ లేకుండా తన జీవితం అసంపూర్తిగా మిగిలిపోయిందని పేర్కొంది. ప్రతిరోజు, ప్రతిక్షణం తల్లిని మిస్ అవుతూనే ఉంటానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Sowmya Rao (@sowmya.sharada) చదవండి: వెకేషన్‌కు మెగాస్టార్ దంపతులు -
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి ఫోటోలు చూశారా? (ఫొటోలు)
-
ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ (ఫొటోలు)
-
సొంతింటి కల సాకారం చేసుకున్న రీతూ చౌదరి
జబర్దస్త్ కామెడీ షోలో చలాకీగా కనిపించే నటి రీతూ చౌదరి తాజాగా తన సొంతింటి కల సాకారం చేసుకుంది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. తన తల్లిదండ్రులకు సొంతింటి కల ఉండేదని ఇప్పుడు దాన్ని నిజం చేశానని చెప్పింది. అలాగే తన పేరెంట్స్ పెళ్లిరోజని, తండ్రికి వేడుకలంటే ఇష్టమంటూ అమ్మతో కేక్ కట్ చేయించింది. ఆ మరుసటి రోజు తన తొలి సంపాదనతో కొనుక్కున్న కారులో రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్లింది. అక్కడ ఇంటికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసి పనులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె కారులో కూర్చుని ఎమోషనల్ అయింది. 'మా నాన్న ఈ కారులోనే తుదిశ్వాస విడిచాడు. ఇప్పుడు కూడా నాన్న మా వెనకాల సీటులోనే ఉన్నాడనిపిస్తోంది. నేనెప్పుడూ అలాగే ఫీలవుతాను. మా నాన్న లేకపోయినా ఆయన కల నెరవేర్చాను' అంటూ భావోద్వేగానికి లోనైంది. ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతుండగా అభిమానులు రీతూ చౌదరికి శుభాకాంక్షలు చెప్తున్నారు. కొత్త ఇల్లు కొన్నందుకు కంగ్రాట్స్, అమ్మను బాగా చూసుకో, గుడ్ లక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అమ్మ చనిపోయేముందు ఆ పని చేయమంది, కానీ నేనే: వనితా -
పెళ్లి చేసుకున్న పటాస్ ప్రవీణ్.. కానీ ఫైమాను కాదు!
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ కొమరం. కామెడీ పంచులతో అదరగొట్టే కొమరం అంటే ఇండస్ట్రీలో ఎవరూ గుర్తు పట్టలేరేమో. ఎందుకంటే తన పాత్ర కొమరక్కతోనే అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు. తన యాస, భాష, కట్టు బొట్టుతో అందరిని మెప్పించారు. ఇటీవల నాని నటించిన దసరా చిత్రంలో కనిపించారు. అయితే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన కొమరం ఎప్పటికప్పుడు తన వీడియోలతో అభిమానులను అలరిస్తుంటారు. (ఇది చదవండి: ఐదేళ్లు కష్టాలు అనుభవించా.. అలా ఎవరికీ జరగకూడదు: జబర్దస్త్ కొమరం) తాజాగా తన ఛానెల్ కోసం ఓ జంటకు పెళ్లి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పటాస్ కామెడీ షోతో ఫేమస్ అయిన ప్రవీణ్‌కు పెళ్లి చేసిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే దీనిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పెళ్లి నిజంగానే జరిగిందా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో ఫైమా ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పెళ్లిపై పటాస్ ప్రవీణ్ క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో కేవలం కొమరక్క యూట్యూబ్ ఛానెల్ కోసమే చేసినట్లు చెప్పారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే కొమరక్క ఛానెల్లో వస్తుందని తెలిపారు. -
ఆ దేవుడు నన్ను కరుణించలేదు: జబర్దస్త్ యాంకర్ ఎమోషనల్
సీరియల్స్‌తో నటిగా కెరీర్ ఆరంభించిన సౌమ్య రావు జబర్దస్త్‌తో యాంకర్‌గా మారింది. షోలో నవ్వుతూ, చలాకీగా ఉంటూ, కంటెస్టెంట్లపై పంచులు విసిరే ఆమె వ్యక్తిగతంగా మాత్రం ఎంతో బాధను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. సౌమ్య తల్లి క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూశారు. చివరి రోజుల్లో తన తల్లి ఎదుర్కొన్న నరకం గురించి వివరిస్తూ ఇటీవల ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సౌమ్య రావు ఆస్పత్రి బెడ్ మీద ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ తనను నవ్వించేందుకు ప్రయత్నించింది. తన తల్లి అనుభవించిన నరకం ఏ తల్లికీ రాకూడదని ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'అంబులెన్స్, డాక్టర్స్.. ట్రీట్మెంట్.. మందులు.. ఎంతో బాధ అనుభవించావు. నీ కోసం ఆ భగవంతుడికి ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను. అయినా ఆ దేవుడు కరుణించలేదు. ఆ భగవంతుడు నాకెందుకిలా చేశాడని బాధేస్తోంది. అందరూ అమ్మ ఫోటో షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే నాకు మాత్రం చివరి రోజుల్లో నువ్వు పడ్డ బాధే గుర్తొస్తోంది. దాన్ని మర్చిపోలేకపోతున్నాను. రేయిపగలు నీకు సేవ చేసినా, భగవంతుడికి పూజ చేసినా అన్నీ వృథా అయ్యాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్తిగా మిగిలింది. ప్రతిరోజు, ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను. అమ్మా, నాకోసం మళ్లీ పుడతావని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను. దేవుడా.. మా అమ్మానాన్నలను మళ్లీ నాకివ్వు. నిన్ను చాలా మిస్ అవుతున్నా అమ్మా.. లవ్ యూ సోమచ్' అని రాసుకొచ్చింది. చదవండి: పొద్దున ఆరు గంటలకే చికెన్ తిన్న ఎన్టీఆర్.. నాక్కూడా : రామ్ చరణ్ -
మరో చిత్రంతో వస్తున్న 'గాలోడు'.. షూటింగ్ ప్రారంభం!
సుడిగాలి సుధీర్ మరో చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. హీరోయిన్గా దివ్య భారతి నటించనుంది. తాత్కాలికంగా ఎస్ఎస్4తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మాతలుగా.. లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించారు. ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాదాకృష్ణ, కెఎల్ దామౌదర ప్రసాద్ ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. (ఇది చదవండి: రూమ్‌కు రమ్మని రెండు సార్లు పిలిచాడు: నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు) హీరో సుధీర్ మాట్లాడుతూ..'ఇక్కడికి వచ్చిన అందరికి థాంక్యూ. నన్ను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడానికి కారణం మీడియానే టీం అందరి గురించి ఇదివరకే చెప్పారు. మరో ప్రెస్ మీట్ పెట్టి ఇంకొన్ని విషయాలను పంచుకుంటాం' అని అన్నారు. దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ.. 'సుధీర్‌కు ఈ కథను ఒక గంట నేరేట్ చేయగానే ఆయనకు బాగా నచ్చి ఒప్పుకున్నారు. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా అన్ని చేసి పెట్టారు.' అని అన్నారు. (ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?) -
చైతన్య చివరి వీడియోపై కమెడియన్ అదిరే అభి..
-
అందుకే జబర్దస్త్‌లో ఎక్కువ పారితోషికం.. చైతన్య చివరి వీడియోపై అభి..
ఢీ షోలో కొరియోగ్రాఫర్‌గా పని చేసిన చైతన్య మాస్టర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే! మే 1న అప్పులు తీర్చలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి ప్రాణాలు తీసుకున్నాడు. ఢీ షో పేరు ఇస్తుంది కానీ జబర్దస్త్‌లో వచ్చినంత సంపాదన ఢీలో రాదని ఆయన వీడియోలో వాపోయాడు. తాజాగా చైతన్య మృతికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించిన కమెడియన్ అదిరే అభి జబర్దస్త్ వర్సెస్ ఢీ పారితోషికాలపై స్పందించాడు. అలాగే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారికి పలు సలహాలు, సూచనలు ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశాడు. సినిమా, టీవీ పరిశ్రమలో ఉండేవాళ్లను చూసి చాలామంది కొత్తగా ఈ ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. అలా వచ్చి సెటిలైన వాళ్లను చూసి.. మరింతమంది ఇన్స్పైర్ అయి వస్తుంటారు. అంటే.. మనం ఏం చేసినా దాని ప్రభావం తర్వాత వచ్చేవాళ్లపై పడుతుంది. కాబట్టి ఇండస్ట్రీలోకి రావాలనుకునేవాళ్లందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. ఇండస్ట్రీ గురించి ముందు అవగాహన తెచ్చుకుంటే మున్ముందు వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి మానసిక ధైర్యం వస్తుంది. ఇక్కడికి రాగానే ఎర్రతివాచీ పరిచి ఆఫర్లు ఇస్తారు, చాలా డబ్బులు వస్తాయి అని భ్రమపడితే పొరపాటే. కడుపు మాడ్చుకుని, ఎన్నో నిద్ర లేని రాత్రిళ్లు గడిపితేనే సక్సెస్ వస్తుంది. ఒక బ్రేక్ వచ్చాక దాన్ని మెయింటెన్ చేయడం కూడా చాలా పెద్ద విషయం! ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్‌గా వెలుగొందిన అమితాబ్ బచ్చన్ గతంలో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఆ బ్యానర్లో తీసిన సినిమాలన్నీ ఫ్లాపవడంతో వంద కోట్ల మేర నష్టం వచ్చింది. తన కార్లు కూడా అమ్మేసుకున్నాడు. కానీ.. కౌన్ బనేగా కరోడ్‌పతితో హోస్ట్‌గా మళ్లీ కెరీర్ మొదలుపెట్టి జీరో నుంచి మళ్లీ సూపర్ స్టార్ అయ్యాడు. అంటే పరిస్థుతులను ఎదుర్కొనేంత మానసిక ధైర్యం మనకు ఉండాలి. అందుకే ముందుగానే ప్లాన్ బి కూడా రెడీ చేసుకోవాలి. మనకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత దాచుకోవాలి. అప్పుడే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది మనకు సాయపడుతుంది. చిన్నవాటికే కుంగిపోయి ఆత్మహత్య చేసుకోకూడదు. ఇక షో రేటింగ్‌ను బట్టి ఆయా ప్రోగ్రామ్‌లో పని చేసే వాళ్లకు పారితోషికం ఇస్తారు. జబర్దస్త్‌కు రేటింగ్ ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు. అయినా వాటి మీద ఆధారపడకుండా బయట ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ద్వారా ఆర్టిస్టులు మరింత సంపాదిస్తారు. ఇక్కడ ఆఫర్లు రానప్పుడు వేరే దారి ఎంచుకుని జీవించడం బెటర్' అని చెప్పుకొచ్చాడు అభి. చదవండి: అక్కినేని కుటుంబాన్ని వెంటాడుతున్న ఫ్లాపులు.. చై ఆన్సరేంటంటే -
ఆయన పరిస్థితిని చూస్తే భయమేసింది: మహేశ్
జబర్దస్త్ కమెడియన్ మహేశ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలం సినిమాతో ఓ రేంజ్లో గుర్తింపు వచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఫుల్ ఎమోషనల్ సీన్స్‌లో మహేశ్ అద్భుతమైన నటనతో మెప్పించారు. అతనికి యాస, లుక్ మహేశ్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం మహేశ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్‌పై మహేశ్ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహేశ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (ఇది చదవండి: 'పుష్ప రాజ్' తగ్గేదేలే.. భారీ ధరకు ఆడియో రైట్స్!) మహేశ్ మాట్లాడుతూ.. 'చైతన్యతో నేను ఓసారి ట్రావెల్ చేశా. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో నాకు డ్యాన్స్ నేర్పించారు. చైతన్య మంచి టాలెంటెడ్. ఆయన అలా చేసుకున్నాడంటే ఎంత స్ట్రగుల్ అయ్యాడో. ఆరోజు చాలా బాధపడ్డా. అంత క్రేజ్ ఉన్న ఆయనే అలా చేస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి?' అని అన్నారు. రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడుతూ..'కానీ నాకు అయితే రెమ్యూనరేషన్స్ బాగానే వస్తున్నాయి. నాకు ప్రారంభంలో తక్కువగానే ఉండేది. ఎందుకంటే మనకు అవకాశం రావాలి కదా. క్రేజ్‌ను బట్టి అమౌంట్ డిసైడ్ చేస్తారు. ఫస్ట్ తక్కువ డబ్బులు వచ్చినా మనం కష్టపడాలి. ఆ తర్వాతే నాకు బాగా డబ్బులొచ్చాయి. కామెడీలో నాకు రవితేజ టైమింగ్ అంటే చాలా ఇష్టం. సీన్ వందశాతం నిలబెట్టడంలో ఆయన బెస్ట్. ఎలాంటి సీన్ అయినా పండించగలరు. నా ఫేవరేట్ హీరోయిన్ అంటే అనుష్క. నా చిన్నప్పుడు అయితే రమ్యకృష్ణ అంటే చాలా ఇష్టం. అయితే ఆమెను ఎప్పుడు కలవలేదు.' అని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉంది: స్టార్ హీరోయిన్) -
జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి సీరియస్? ఐసీయూలో చికిత్స!
జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కమెడియన్ చంటి. చలాకీతనం, తనదైన కామెడీ టైమింగుతో అలరించిన చంటి కొంతకాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. పలు కామెడీ షోస్ చేసిన చలాకీ చంటి సినిమాల్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బిగ్‌బాస్ సీజన్-6లోనూ పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. కానీ బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక ఏ షోలోనూ పెద్దగా కనిపించలేదు. అయితే ప్రస్తుతం ఆయన తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. -
అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ సినిమాలకు డైలాగ్స్ రాసా..
-
పంచ్ ప్రసాద్‌కు తీవ్ర అనారోగ్యం.. మరోసారి ఆస్పత్రికి!
జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు. అంతే కాకుండా రోజు రోజుకు కొత్త అనారోగ్య సమస్యలు ఆయన్ని చుట్టుముడుతున్నాయి. ఇటీవలే తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రిలో పంచ్ ప్రసాద్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం గొంతు సమస్యతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన భార్య తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు. (ఇది చదవండి: ‘పుష్ప -2’ టీజర్.. ఐకాన్ స్టార్ దెబ్బకు యూట్యూబ్ షేక్) పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ.. 'ఇప్పుడు ఆసుపత్రికి వచ్చాం. ఇప్పటికే ఆయనకు థైరాయిడ్ సమస్య ఉంది. అది మరింత తీవ్రంగా మారింది. అల్ట్రా సౌండ్ స్కానింగ్ తర్వాత రిపోర్టులు చూసిన డాక్టర్స్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆయన కాలికి లెగ్ ఇన్ఫెక్షన్ కూడా ఉండడంతో సర్జరీ ఇప్పుడే వద్దని చెప్పారు. లెగ్ ఇన్ఫెక్షన్ తగ్గిన తరువాత సర్జరీ చేస్తామని డాక్టర్లు అన్నారు. మెడిసిన్స్‌తో తగ్గాలని దేవుడిని కోరుకుంటున్నా.' అని ఆమె అన్నారు. కాగా, పంచ్ ప్రసాద్ తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇది చూసిన ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. -
జబర్దస్థ్ కమెడియన్‌ను పెళ్లాడిన యాంకర్.. ఫోటోలు వైరల్
జబర్దస్థ్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ తన ప్రేయసి జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట నిశ్చితార్థం ఇటీవలె జరగ్గా, తాజాగా వీరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. బుల్లితెరపై పలు షోస్‌తో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ రియల్ కపుల్ అనిపించుకున్నారు. కుటుంబంసభ్యులు, సన్నిహితుల సమక్షంలో తిరుపతిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పలువురు బుల్లితెర నటీనటులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుజాత తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. బిగ్‌బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక జబర్దస్థ్ షోతో గుర్తింపు పొందిన రాకేశ్‌తో కలిసి పలు షోల్లో జంటగా పాల్గొంది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కారు. -
''ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ''.. రిలీజ్ డేట్ ఫిక్స్
యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కించిన చిత్రం 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'. రేలంగి నరసింహా రావు దర్శకత్వం వహించారు. కామెడీ హారర్ చిత్రాన్ని తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్బంగా నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ. .'ఈ సినిమాను కశ్మీర్, హైదరాబాద్‌లో షూట్ చేశాం. మంచి అద్భుతమైన కంటెంట్‌తో తెరకెక్కించాం. రేలంగి నరసింహారావు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి 76 సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇందులో మంచి అద్భుతమైన కామెడీ హారర్ ఉంది. జబర్దస్త్ రాకింగ్ రాకేష్ బిజీగా ఉన్నా తను ఈ చిత్రంలో మంచి కామెడీ పండించాడు. ఈ సినిమాలో నటించిన యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులు హార్రర్,థ్రిల్లర్ కామెడీ సినిమాలు ఎప్పుడొచ్చినా ఆదరిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 18న రిలీజ్ చేస్తున్నాం.' అని అన్నారు. -
నాన్న చనిపోయిన బాధ లేదు, ఎక్స్పోజింగ్ మొదలుపెట్టావా?
నటి, లేడీ కమెడియన్ రీతూ చౌదరి తండ్రి ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే! నిత్యం తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో బాధతో నిండిన పోస్టులు పెడుతోంది రీతూ. ఆయన జ్ఞాపకాలతోనే ఈ జీవితమంతా బతికేస్తా అంటూ ఎమోషనలవుతోంది. అయితే ఈరోజు మాత్రం సడన్‌గా పల్చటి చీర కట్టి తన అందాలు చూపిస్తూ నవ్వులు చిందిస్తూ ఓ రీల్ చేసింది. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు షాకయ్యారు. ఏంటక్కా ఇది? మొన్ననే కదా నాన్నని పోగొట్టుకున్నావు. ఆ బాధలో ఉండగా ఈ వీడియోలు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. 'నిన్ననే బాధతో పోస్టులు పెట్టావు, అప్పుడే గ్లామర్ షోనా?', 'ఛీ, నాన్న పోయిన బాధ కూడా లేదు..', 'నాన్న నాన్న అన్నావు.. అప్పుడే ఎక్స్పోజింగ్ వీడియోలు పెడుతున్నావు. మీరు నిజంగా దేవత.. మీలాంటివాళ్లు ఉండాలి.. తెలుగు అమ్మాయిలు ఎక్కడికి పోతున్నారో!', 'నాన్న చనిపోయారని అంత బాధపడ్డారు, అప్పుడే ఇంత సంతోషంగా కనిపిస్తున్నారు', 'ఏంటిదంతా? కనీసం 11 రోజుల దాకా కూడా ఆగలేవా?' అంటూ ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. అయితే రీతూ ఫ్యాన్స్ మాత్రం.. తను డిప్రెషన్ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తోంది. మీకంత బాధగా ఉంటే అన్‌ఫాలో అయిపోయిండి, తన వృత్తి అలాంటిది.. బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా.. యాక్టింగ్ చేయాల్సిందే! అది అర్థం చేసుకోకుండా ఎందుకలా నిందిస్తున్నారు? అని మండిపడుతున్నారు. ఈ రీల్ తన తండ్రి చనిపోకముందే చేసిందని, కాకపోతే కాస్త ఆలస్యంగా ఇప్పుడు పోస్ట్ చేసిందని రీతూను వెనకేసుకొస్తున్నారు. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) చదవండి: ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేని దుస్థితి -
ఈ జబర్దస్త్‌కు ఏమైంది.. ఇలా తిట్టుకుంటున్నారు.. అదిరే అభి ఎమోషనల్
జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరినీ నవ్వించే బబర్దస్త్ కామెడీ షోకు దిష్టి తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరిగిందో ఏమో కానీ మమ్మల్ని మేమే తిట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎవరి దిష్టి తగిలిందో అర్థం కావడం లేదని ఎమోషనల్ పోస్ట్ చేశారు. మళ్లీ ప్రేక్షకులను నవ్వించే పాత రోజులు వస్తే బాగుండని అన్నారు. 'జబర్దస్త్ టీం అంతా సంతోషంగా ఉండేవాళ్లమని.. అంతా ఓ కుటుంబం లాగా ఉండేదని.. మాది జబర్దస్త్ ఫ్యామిలీ అని అనేవారు. అలాంటి ఫ్యామిలీ లాంటి జబర్దస్త్‌కు ఎవరో దిష్టి పెట్టారంటూ' ఎమోషనల్ అయ్యారు. అందులో ఏముందంటే.. 'జబ్బలు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు, టైమింగ్‌తో పంచులేసే టీమ్ లీడర్లు, కామెడీని అవపోసన పట్టే కంటిస్టెంట్లు. అందరికీ అన్నం పెట్టే అమ్మలాంటి మల్లెమాల ఇది కదా మా కుటుంబం. కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు.స్టేజ్ ఎక్కేవరకూ రిహార్సల్స్ అయినా అప్పుడప్పుడు స్పాంటేనిటీలు. పోస్టర్ ఆఫ్ ది డే కోసం ఫోజులు, పాతికవేల చెక్కుతో ఫోటోలు, జడ్జీలు వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలు. ఇవేమీ ఇప్పుడు కనిపించడం లేదని అభి రాసుకొచ్చారు. మళ్లీ పాత రోజులు వస్తే బాగుండునని తన వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేశారు. ఎవరైనా ఏదైనా అంటే పడని మేము.. మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చాలా మంది కమెడియన్స్ ఈ షో నుంచి బయటకొచ్చేసిన సంగతి తెలిసిందే. అనసూయ, కిరాక్ ఆర్పీ వంటి వాళ్లు ఇప్పుడు షోలో లేరు. అదిరే అభి కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశారు. దీనికి తోడు.. మల్లెమాల యాజమాన్యం మీద ఆరోపణలు, ఒకరి మీద ఒకరు విమర్శలు వంటివి నచ్చక ఇలా పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతోంది. -
'నువ్వు ఎప్పుడు ఇదే చెప్పేవాడివి డాడీ.. వాటితోనే బతికేస్తా'
జబర్దస్త్ నటి రీతూ చౌదరి మరోసారి తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. ఇటీవల తండ్రి మరణాన్ని తలుచుకుంటూ వరుస పోస్టులు పెట్టింది రీతూ. నువ్వు లేని ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నానంటూ సోషల్ మీడియాలో భావోద్యేగ పోస్టులు చేసింది రీతూ చౌదరి. ఇటీవలే ఆమె తండ్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తన తండ్రితో దిగిన చివరి ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసింది. రీతూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఆడియోను పంచుకుంది. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఏముందంటే.. ' జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏలా మలుపు తిరుగుతుందో నీ కథతో అర్థమైంది. అలాంటిది ఈ ఉన్న కొన్ని రోజులు మనసుకు నచ్చనట్లు బతకడమే. నీ నుంచి నేర్చుకున్నా. చివరకు మిగిలేది ఏంటి? మనం పంచిన ప్రేమ. మనం చేసుకున్న జ్ఞాపకాలు. నువ్వు ఎప్పుడు ఇదే చెప్పేవాడివి డాడీ. నీ జ్ఞాపకాలతో బతికేస్తా.'అంటూ సమంత ఫోటో ఉన్న ఆడియో క్లిప్‌ను తన స్టోరీస్‌లో పోస్ట్ చేసింది రీతూ చౌదరి. -
నేను బతికే ఉన్నా.. జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ..!
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ రచ్చరవికి గాయాలయ్యాయని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. సూర్యాపేట - మునగాల వద్ద అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు కథనాలొచ్చాయి. అయితే ఈ ప్రమాదం వార్తలపై జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేం జరగలేదని వాటిని కొట్టిపారేశారు. తనకు ఏమీ కాలేదని రచ్చ రవి అభిమానులకు ఫోన్ చేసి చెప్పారు. పుణెలో షూటింగ్ జరుపుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినట్లు వివరించారు. తాను ఫ్లైట్‌లోనే హైదరాబాద్‌కు వచ్చినట్లు చెప్పారు. శనివారం జరగనున్న వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్‌కు కూడా వెళ్తున్నానని రచ్చరవి క్లారిటీ ఇచ్చారు. అభిమానుల ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. -
డాడీ నా వల్ల కావడం లేదు.. ప్లీజ్ తిరిగి రా: రీతూ చౌదరి ఆవేదన
కామెడీ షో జబర్దస్త్ నటి రీతూ చౌదరి ఇంట ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. తన తండ్రి చనిపోయిన విషయాన్ని తెలుపుతూ రీతూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తన తండ్రితో దిగిన చివరి ఫొటో ఇదేనంటూ భావోద్వేగానికి గురయ్యింది. తాజాగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రీతూ మరోసారి సోషల్ మీడియా వేదికగా కన్నీటి పర్యంతమైంది. చదవండి: ఈ ఒక్క వారమే ఓటీటీలోకి 20 చిత్రాలు.. అవేంటంటే! ‘డాడీ నా వల్ల కావడం లేదు. ఎంత ట్రై చేసినా నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా, నువ్వు లేవన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నీ అంత ప్రేమ ఎవరూ నాకు చూపించలేరు. నీలా ఎవరూ నన్ను బుజ్జగించలేరు. నేను అలిగితే బ్రతిమలాడేది నువ్వు. నాకు కోపం వచ్చినప్పుడు చిరాకు పడినా, మళ్లీ ప్రేమతో నవ్వుతావ్. ఎవరైనా నన్ను ఒక్కమాట అంటే ఫీల్ అయి తిట్టేసేవాడివి. అలాంటిది ఎలా డాడీ నన్ను వదిలి వెళ్లిపోవాలని అనిపించింది. చెప్పు డాడీ ఇప్పుడు నాకు అన్నం తినిపించేది ఎవరు. నన్ను మోటివేట్ చేసేది, యాక్టివ్‌గా ఉంచేది ఎవరు చెప్పు డాడీ’ అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజీని జత చేసింది. చదవండి: అక్కినేని వివాదం: మరోసారి బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు అలాగే చివరగా ‘ప్లీజ్ డాడీ.. తిరిగి రా మనం రీల్స్ చేసుకుందాం. నువ్వు చెప్పినట్లు అన్ని జ్యూస్‌లు తాగుతాను. మంచి ఫుడ్ తింటా. త్వరగా నిద్రపోతా. నువ్వు చెప్పినట్టే ఉండాను. ప్లీజ్ రా డాడీ, నీ కూతురు పులి అన్నావు కదా డాడీ, నీ పులిని వదిలేసి వెళ్లిపోతావా? అమ్మ, అన్నయ్య ఉండలేకపోతున్నారు డాడీ, ప్లీజ్ రా డాడీ’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ పలువురి కదిలిస్తోంది. ఆమె ఆవేదన చూసి ‘ధైర్యంగా ఉండు’ అంటూ ఆమె పోస్ట్‌పై నెటిజన్లు, బుల్లితెర నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
'కూతురు ప్రేమంటే ఏంటో ఈ వీడియో చూస్తే చాలు'
జబర్దస్త్ నటి రీతూ చౌదరి తండ్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనలైంది రీతూ. నువ్వు లేని లోకంలో ఉండలేక పోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఓ వీడియో విడుదల చేసింది. తండ్రితో కలిసి చేసిన రీల్స్‌ను గుర్తు చేసుకుంటూ భావోద్వేగమైన సందేశం పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు మేమంతా ఉన్నాం.. ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. రీతూ చౌదరి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'డాడీ.. ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదు. నువ్వు లేని లోకాన్ని ఊహించలేకపోతున్నా. నాపై నీ ప్రేమను ఇంకెవరూ చూపించలేరు. నేను అలిగితే బతిమాలుతావు. నాకు చిరాకు, కోపం పడినా మళ్లీ నవ్విస్తావ్. ఎవరైనా నన్ను ఒకమాట అంటే తిట్టేవాడివి. అలాంటి నన్ను వదిలి ఎలా వెళ్లిపోయావు. నాకు నువ్వే అన్నం తినిపించేది. నన్ను మోటివేట్ చేసేది. నువ్వు, నేను కలిసి రీల్స్ చేసేది. నువ్వు తిరిగిరా డాడీ.. నువ్వు చెప్పినట్లు వింటాను. నీ కూతురును పులి అన్నావ్. మళ్లీ పులిని ఎలా వదిలి వెళ్లిపోయావ్. అమ్మా, అన్న నిన్ను తలుచుకుంటూనే ఉన్నారు. ప్లీజ్ రా డాడీ.' అంటూ వీడియో పోస్ట్ చేసింది. -
నాన్నా.. తిరిగిరా.. నిన్ను విడిచి ఉండలేను: జబర్దస్త్ నటి ఎమోషనల్ పోస్ట్
పాపులర్ కామెడీ షో జబర్దస్త్ నటి రీతూ చౌదరి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, జబర్దస్త్ కమెడియన్లు విచారం వ్యక్తం చేశారు. తండ్రి చనిపోవడంతో తీవ్ర ఎమోషనల్‌కు గురైంది రీతూ చౌదరి. తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిందామె. తండ్రితో దిగిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తూ భావోద్వేగమైన నోట్ రాసింది. (ఇది చదవండి: తీవ్ర విషాదం.. టాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య) తండ్రితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. “నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నా. నీతో దిగిన ఫొటోను ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని ఊహించలేదు. నీతో దిగిన లాస్ట్ ఫొటో ఇదే నాన్న. నన్ను ఎలా వదిలి వెళ్లిపోయావు? నువ్వు లేకుండా నేను ఉండలేను. డాడీ ప్లీజ్ తిరిగిరా నీ కూతురు దగ్గరికి.' తీవ్రమైన భావోద్వేగ పోస్ట్ చేసింది రీతు చౌదరి. ఆమెకు ఇంట్లో అందరి కంటే తండ్రి అంటేనే చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతోంది జబర్దస్త్ నటి రీతూ. -
పట్టుచీరలో యాంకర్ అనసూయ ట్రెడిషనల్ ఫోటోలు
-
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తో " చిట్ చాట్ "
-
జబర్దస్త్‌లో రష్మీ అవుట్.. ఆమె స్థానంలో సౌమ్య రావు (ఫొటోలు)
-
విషాదం.. జబర్దస్త్ కమెడియన్ కన్నుమూత
జబర్దస్త్‌లో అందరినీ నవ్విస్తూ.. నవ్వుతూ తనకంటూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మిమిక్రీ కళాకారుడు, కమెడియన్ కొమ్ము నర్సిమూర్తి(48) అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో ఆయన స్వగ్రామం హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో విషాదం అలుముకుంది. ఎన్నో స్టేజి షోలు.. అనేక సినిమాల్లో నటించిన మూర్తికి జబర్దస్త్ ద్వారా మంచి పేరు, ప్రఖ్యాతలు వచ్చాయి. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన సినీ రంగంలో వస్తున్న అవకాశాలతో భార్య అంజలి, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కేన్సర్ బారిన పడ్డాడు. దీంతో మూడేళ్లుగా జబర్దస్త్ షోకు దూరంగా ఉంటూ.. ఏపీ మంత్రి, నటి రోజా, తన తోటి నటులు, స్నేహితులు అందించిన ఆర్థికసాయంతో చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పటికే రూ.16 లక్షలు చికిత్స కోసం ఖర్చు చేశారు. మరో రూ.20లక్షలు చికిత్సకు అవసరం కావాల్సి ఉంది. ఈ క్రమంలో వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో ఆరోగ్యం మరింత క్షీణించి చికిత్స పొందతూనే మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా జబర్దస్త్ కమెడియన్ వెంకట్‌తో పాటు సహానటులు, గ్రామస్తులు తరలివచ్చి నివాళులర్పించారు. నాగారంలో బుధవారం మధ్యాహ్నం మూర్తి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
'జబర్దస్త్' మానేయడంపై తొలిసారి నోరువిప్పిన అనసూయ
టాలీవుడ్ ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అక్కర్లేదు. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకుంది. యాంకరింగ్‌తో పాటు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది. అయితే కొన్నేళ్లుగా యాంకర్‌గా కొనసాగుతున్న అనసూయ ఇటీవలె ఓ కామెడీ షోకు గుడ్‌బై చెప్పేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఆస్కార్ బరిలో ఎన్టీఆర్.. లిస్ట్ బయటికొచ్చేసింది! దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఆ షోకు యాంకర్‌గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ఉన్నట్లుండి ఆ షో నుంచి ఎందుకు బయటకు వచ్చేసిందన్న దానిపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తాజాగా తాను ఆ షోను ఎందుకు వీడాల్సి వచ్చిందన్న దానిపై తొలిసారిగా నోరు విప్పింది అనసూయ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'దాదాపు రెండేళ్ల నుంచే షో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా. చాలా సందర్భాల్లో నాపై వేసే పంచులు నచ్చక సీరియస్‌గా రియాక్షన్స్ ఇచ్చాను. నాకు బాడీ షేమింగ్, వెకిలి చేష్టలు లాంటివి నాకు నచ్చవు. చాలాసార్లు పంచులు నచ్చక ముఖం మాడ్చుకున్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవి షోలో వేయరు. క్రియేటివ్ ఫీల్డ్ అన్న తర్వాత ఇవన్నీ తప్పవు కానీ నేను మాత్రం ఆ ఊబిలో చిక్కుకోవాలని అనుకోవడం లేదు. ఈ విషయంలో నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. మరో విషయం ఏంటంటే నాగబాబు, రోజాగారు వెళ్లిపోయారు కాబట్టే నేను కూడా వెళ్లిపోతున్నాను అనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. వాళ్లు వెళ్లిపోయారు కదా అని వెళ్లిపోవడానికి నేనెం గొర్రెల మంద టైప్ కాదు. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నా' అంటూ చెప్పుకొచ్చింది. కామెడీ షో నుంచి బయటకు వచ్చిన అనంతరం అనసూయ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: కావాలనే టార్గెట్ చేశారు.. అందుకే ఓపెనింగ్స్ తగ్గాయి: కరీనా కపూర్ -
‘జబర్దస్త్’ స్క్రిప్ట్ రైటర్‌గా గుర్తింపు.. విశాఖ జిల్లా కుర్రాడు.. ఊరమాస్
కొమ్మాది (భీమిలి)విశాఖపట్నం: ఒకప్పుడు హాస్యనటుడు షకలక శంకర్‌కు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన అనుభవంతో సినిమాలవైపు అడుగులు వేస్తున్నాడు విశాఖ జిల్లా శ్రీహరిపురానికి చెందిన పోతిన రమేష్ జబర్దస్త్‌లో స్క్రిప్ట్ రైటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ అనుభవంతో మొట్టమొదటిసారిగా హర్రర్ లవ్ స్టోరీ అటవీ సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభించి ప్రస్తుతం పలువురు ప్రముఖ కథానాయకులతో ఊరమాస్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: నడిరోడ్డుపై హీరోయిన్ను జుట్టుపట్టుకుని కొట్టిన హీరో భార్య అంతే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే తానే వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో సినీ పరిశ్రమవైపు అడుగులు వేస్తున్నానని, ఊరమాస్ సినిమా 90 శాతం విశాఖలో చిత్రీకరించానని చెప్పారు. విశాఖలో షూటింగ్‌కు అనుకూలమైన లొకేషన్లతో పాటు, అనేక మంది మంచి నటులు ఉన్నారని, సినీ పరిశ్రమ విశాఖ తరలి వస్తే ఎందరో నటులకు, టెక్నీషియన్స్‌కు మరింత ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రియల్ఎస్టేట్ మాఫియా, ప్రేమ అనే అంశాలతో తెరకెక్కిస్తున్న ఊరమాస్ సినిమా 5 భాషల్లో నిర్మిస్తున్నామని, ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. -
ఆటో రాంప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం..
సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై టి.వి.ఎన్.రాజేష్ సమర్పణ... యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో అమి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం "పీప్ షో". దొంగచాటుగా తొంగిచూడడాన్ని "పీప్ షో" అంటారన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ క్రేజీ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. జబర్దస్త్ సూపర్ స్టార్స్‌లో ఒకడైన ఆటో రామ్ ప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్తున్న "పీప్ షో" చిత్రానికి మలయాళ సంగీత సంచలనం రంజిన్ రాజ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే నమ్మకముందని చిత్ర దర్శకుడు క్రాంతి కుమార్, నిర్మాతలు టి.వి.ఎన్.రాజేష్, ఎస్.ఆర్.కుమార్ తెలిపారు. తన చిరకాల మిత్రుడు క్రాంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పీప్ షో" చిత్రంతో తెలుగులో పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు సంగీత దర్శకుడు రంజిన్ రాజ్. "పీప్ షో" చిత్రం దర్శకుడిగా తన మిత్రుడు క్రాంతి దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుందని హీరో రామ్ ప్రసాద్ పేర్కొన్నారు. చదవండి: అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్ టూ సేమ్.. లండన్‌లో సీక్రెట్‌గా బాలీవుడ్ హీరో పెళ్లి..! -
ఆ కామెడీ షో నుంచి అందుకే తప్పుకున్నా.. జబర్దస్త్ అప్పారావు
అద్దంకి రూరల్(ప్రకాశం జిల్లా): నాటక రంగంలో సంతృప్తి, సినిమా రంగంలో ఆర్థికాభివృద్ధి లభించిందని సినీ, టీవీ హాస్య నటుడు అప్పారావు పేర్కొన్నారు. బుధవారం అద్దంకి పట్టణంలోని నాటకరంగ కళాకారుల సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక పెండ్యాల ప్లాజాలో విలేకర్లతో ముచ్చటించారు. చిన్నతనం నుంచి నాటకాలపై మక్కువ ఉండేదన్నారు. ‘శుభవేళ’ చిత్రం ద్వారా వెండి తెరకు పరిశ్రమకు పరిచయమైనట్లు తెలిపారు. షకలక శంకర్ ప్రోత్సాహంతో ఓ తెలుగు చానల్ కామెడీ షోలో పాత్రలు పోషించానని, ప్రాధాన్యత లేని పాత్రలు రావడంతో 6 నెలల క్రితమే తప్పుకున్నాని చెప్పారు. చదవండి: బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. ప్రముఖ నటుడు అరెస్ట్ విశాఖ జిల్లాలోని అక్కాయపాలెం తన స్వస్థలమని, పట్టుదలతోపాటు భార్య సహకారంతో ఈ స్థాయిలో ఉన్నానన్నారు. తన భార్య 18 ఏళ్లు టీచర్‌గా పనిచేస్తూనే ప్రోత్సహించిందన్నారు. ఇప్పటి వరకు 250 సినిమాలు, 70 సీరియల్స్‌లో నటించినట్లు వివరించారు. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తన పాత్రకు ప్రశంసలు దక్కాయని తెలిపారు. తనకు రాని ఇంగ్లిష్ భాషతోనే అందరినీ ఆకట్టుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సినీ రంగాన్ని ఎంచుకునే యువకులు ఏ శాఖలో ప్రతిభ ఉందో గ్రహించి శిక్షణ పొందితే విజయం సాధించవచ్చని సలహా ఇచ్చారు. ప్రతిభ ఉన్నవారిని ఎవరూ అడ్డుకోలేరని హాస్యన టుడు అప్పారావు స్పష్టం చేశారు.