Sudigali Sudheer Latest Movie Shooting Starts In Hyderabad - Sakshi

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కొత్త చిత్రం.. షూటింగ్ ప్రారంభం!

Published Fri, May 12 2023 9:04 PM | Last Updated on Fri, May 12 2023 9:12 PM

Sudigali Sudheer Latest Movie Shooting Starts In Hyderabad - Sakshi

సుడిగాలి సుధీర్ మరో చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. హీరోయిన్‌గా దివ్య భారతి నటించనుంది. తాత్కాలికంగా ఎస్ఎస్4తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మాతలుగా..  లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించారు.  

ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాదాకృష్ణ, కెఎల్‌ దామౌదర ప్రసాద్‍ ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

(ఇది చదవండి: రూమ్‌కు రమ్మని రెండు సార్లు పిలిచాడు: నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు)

హీరో సుధీర్ మాట్లాడుతూ..'ఇక్కడికి వచ్చిన అందరికి థాంక్యూ. నన్ను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడానికి కారణం మీడియానే టీం అందరి గురించి ఇదివరకే చెప్పారు. మరో ప్రెస్ మీట్ పెట్టి ఇంకొన్ని విషయాలను పంచుకుంటాం' అని అన్నారు. 

దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ.. 'సుధీర్‌కు ఈ కథను ఒక గంట నేరేట్ చేయగానే ఆయనకు బాగా నచ్చి ఒప్పుకున్నారు. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా అన్ని చేసి పెట్టారు.' అని అన్నారు. 

(ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?)

Sticky for cinema

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement