సుధీర్, గెహ్నా సిప్పి జంటగా నటించిన చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సుధీర్ మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సమయంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ సినిమాను పూర్తి చేసి, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం.
‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ తర్వాత నాకు మరో అవకాశం ఇచ్చిన రాజశేఖర్‌గారికి ధన్యవాదాలు. ‘గాలోడు’ ట్రైలర్‌కు మంచి స్పందన రావడం హ్యాపీ. సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘మంచి కమర్షియల్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. హిట్ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు రాజశేఖర్‌రెడ్డి. ‘‘కాలేజ్ యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అన్నారు గెహ్నా సిప్పి.
Comments
Please login to add a commentAdd a comment