Sudheer
-
ఆమె కథ
సిటీలోనే అత్యంత ఖరీదైన ఫంక్షన్ హాల్ అది. ఆరు నెలల ముందుగా బుక్ చేసుకుంటేనే గాని, అందులో పెళ్ళి చేసుకునే అవకాశం రాదు. సుధీర్, రేవతిల పెళ్ళి ఆ ఫంక్షన్ హాల్లోనే అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్ళికీ మొదటిరాత్రికీ మధ్యలో ఒకరోజు గ్యాప్ రావడంతో సుధీర్, రేవతిలకు కాస్త విశ్రాంతి దొరికింది. శోభనం రోజు మధ్యాహ్నం నుంచే రేవతి ఇంట్లో హడావుడి మొదలైంది. ‘రేవతి! టైమ్ మర్చిపోకమ్మా! సరిగ్గా ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు మీరిద్దరూ కలవాలి. నువ్వే వాడి తలకెక్కేలా చెప్పు’ అని ఉదయం నుంచి లెక్కలేనన్నిసార్లు చెబుతూనే ఉంది సుధీర్ తల్లి కవిత స్నానానికి వెళ్ళే రేవతిని ఆపి మరీ. ‘సాయంత్రం గదిలోకెళ్ళిన వెంటనే ముందుగా టైం చూపించి మరీ వాడి పక్కన కూర్చోవాలి నువ్వు’ వివరంగా చెప్పింది కవిత.‘రేవతీ! స్నానం చేశావా?’ అంటూ గదిలోకి వచ్చింది రేవతి చిన్న వదిన దేవకి. ‘ఏంటీ, అప్పుడే అత్తా కోడళ్ళు సీక్రెట్స్ మాట్లాడేసుకుంటున్నారు. మేం వినకూడదా?’ అంటూ రేవతి, కవితల మధ్యలోకి చొరవగా వచ్చింది దేవకి.‘అలాగేం లేదమ్మా! నువ్వు నా అల్లరి కూతురివి, నీ దగ్గర దాపరికాలు ఉంటాయా చెప్పు, నా కోడలికి జాగ్రత్తలు చెబుతున్నానంతే!’ అంది కవిత. ‘టైమ్ చూసుకుని కలవమంటోంది అత్తయ్య!’ తన వదిన చెవిలో చిన్నగా చెప్పింది రేవతి సిగ్గుపడుతూ.‘అది చాలా ముఖ్యం రేవతి! మా పిన్నమ్మ ఆ పంతులుతో మంచి ముహూర్తం పెట్టమని చాలా గట్టిగా చెప్పింది. నువ్వు ఆ టైమ్ పాటించకపోతే మీ అత్తయ్య, మా పిన్ని కష్టం వృథా అయిపోతుంది’ అంది కవితనుద్దేశించి. రేవతి స్నానానికి వెళ్ళింది.‘మీకు ముహూర్తాలంటే ఎందుకు పిన్నీ అంత గట్టి నమ్మకం?’ ఆసక్తిగా కవితను అడిగింది దేవకి. ‘ఈ నమ్మకాలు మా అమ్మమ్మ నుంచి మా అమ్మకి, మా అమ్మ నుండి నాకు వంటపట్టాయి’ చెప్పింది కవిత. ‘అలా వచ్చిందా! మీది పెద్ద చరిత్రే’ అంది దేవకి. ‘ముందు తెలియని వయసులో వాళ్ళలా ఉండాలని పాటించేదాన్ని. నా పెళ్ళయి పిల్లలు పుట్టాక వాళ్ళకు జరిపించే అన్నప్రాశనలు, నామకరణాలు, ఇంట్లో ఆడపడుచుల ఫంక్షన్లు జరుగుతూ ఉంటే అప్పుడు నా నమ్మకం బాగా బలపడింది’ అని చెప్పింది కవిత. ‘ఏంటమ్మా! పిన్ని, కూతుళ్ళు తీరిగ్గా ముచ్చట్లు పెట్టారు. అక్కడ శోభనం గదిలో పనేంలేదా?’ అంటూ వచ్చింది దేవకి తోటికోడలు మీనా.‘నా పెద్ద కూతురు కూడా ఇటే వచ్చేసింది. ఇంక మాకా గదిలో పనేముంటుంది చెప్పు!’ అంది కవిత. ‘పిన్ని! మిమ్మల్ని బాబాయ్ పిలుస్తున్నారు’ అని కబురు తెచ్చింది మీనా. ‘ఎందుకు తల్లీ! కొడుక్కి శోభనం అయితే ఈయన కంగారేంటి?’ అంటూ వెళ్ళింది, కవిత. మీనా, దేవకి నవ్వుకున్నారు. ‘చాలా సరదాగా ఉంటుందే పిన్ని. మన రేవతి అదృష్టవంతురాలు. మంచి అత్త దొరికింది’ అంది మనస్పూర్తిగా మీనా. ‘హలో అక్కగారు! ఆమె మంచిదిలా కనిపిస్తుందా నీకు? ఆవిడను ఒకవైపే చూశావు, రెండోవైపు పూర్తిగా తెలియదు. ఈ కాలం మనిషి కాదు. కొత్త విషయం ఏంటంటే, పూజ గది, ఈవిడగారుండే గది పనిమనుషులు శుభ్రం చెయ్యరట! ఇంటి కోడళ్లే ఆ పని చెయ్యాలట! ఇప్పుడున్న ఇద్దరూ కోడళ్లూ అలాగే చేస్తున్నారట! బయట హాల్లో సోఫాలో కూర్చున్న ఇద్దరు కోడళ్ళ మొహాలు చూశావా, ఈమెపై కోపంతో తెగ మెరిసిపోతున్నాయ్! ఇంట్లో ఆవిడ పర్మిషన్ లేకుండా చీపురు కట్ట కూడా కొనకూడదట! చీపురు, చేట ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదట! ఏ రోజు ఏ రంగు చీరకట్టాలో ఆవిడే ముందు రోజు నైట్ చెబుతుందట! ఇంట్లో పనివాళ్ళు ఆమెకు ఐదడుగుల దూరంలో నడవాలట! కాని, ఇక్కడ మాత్రం అలాంటివేవీ కనబడకుండా తిరుగుతోంది. ఇంకో గొప్ప సంగతి. ఇద్దరు కోడళ్ళకు సుఖప్రసవం జరుగుందని డాక్టర్లు చెబితే, ఈవిడ మాత్రం మంచి రోజు, మంచి ఘడియలని చెప్పి రెండు మూడు రోజులు ముందే సిజేరియన్ ఆపరేషన్ చేయించి, బిడ్డలను బయటకు తీయించిందట!’ అని చెప్పింది దేవకి. ‘అమ్మ బాబోయ్! ఈవిడకింతుందా?’ అని అమాయకంగా అడిగింది మీనా.‘ఆవిడ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. నీకు శాంపిల్‌గా కొన్నే చెప్పాను’ చెప్పింది దేవకి. ‘అవును చెల్లి! ఆవిడ గురించి ఇన్ని విషయాలు నీకెలా తెలుసు?’ అడిగింది మీనా. ‘మెల్లగా వాళ్ళ పనిమనిషి దగ్గర నుంచి రాబట్టాను’ చెప్పింది దేవకి. ‘ఈ లెక్కన చూస్తే, మన అత్తగారే నయమనిపిస్తుంది’ అంది మీనా. ‘అవును. ఆవిడ కంటే మన అత్తగారు వందరెట్లు మంచిది’ నిజాయితీగా ఒప్పుకుంది దేవకి. ‘మరి మన రేవతి ఆమెను తట్టుకోగలదా?’ రేవతి భవిష్యత్తు గురించి జాలిపడింది మీనా. ‘మన రేవతి మంచిది, అమాయకురాలు. ఆమె నవ్వుతూ సంసారం చేసుకున్నంత వరకు నేను, మా ఆయన వాళ్ళను గౌరవిస్తాం! రేవతి ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే, ఊరుకునే ప్రసక్తే లేదు’ చెప్పింది దేవకి. ‘మేము మాత్రం ఊరుకుంటామా? తేడా వస్తే అడిగి, కడిగి పారేస్తాం!’ అంది మీనా. తోటికోడళ్ళ సంభాషణలు గది బయట ద్వారబంధం పక్కన చాటుగా ఉండి విన్న రేవతి తల్లి, మీనా, దేవకిల అత్తగారు జానకి ‘నా కోడళ్ళు బంగారం, నా అంత అదృష్టవంతురాలైన అత్త ఇంకొకరు ఉండరు’ అని మనసులోనే అనుకుంది.రేవతి స్నానం చేసి బయటకు వచ్చింది. ‘రేవతి, నీదే లేటు. నువ్వు రెడీ అయితే మిగతా ఏర్పాట్లు చేసుకుంటాము‘ అంది మీనా.‘అక్కా! నువ్వు రేవతిని రెడీ చెయ్యి, ఈలోపు నేనెళ్ళి వంట పనులు చూసుకుంటాను’ అని బయటకు నడిచింది దేవకి. ఆమె రావడం గమనించిన జానకి గదిలోకి ప్రవేశించి, ‘అమ్మా దేవకి! అక్కడ రేవతి అత్తగారు కంగారుగా ఉంది. కాస్త నువ్వెళ్ళి చూసుకోమ్మా’ అంది జానకి. ‘అలాగే అత్తయ్యా! మీరు మన రేవతికి అన్నీ చెప్పండి, ఆ పిన్నిగారు టైమ్, టైమ్ అని తెగ ఆరాటపడుతోంది’ అని చెప్పి దేవకి బయటకు వెళ్ళింది. సమయం ఏడు నలభై నిమిషాలవుతోంది. మీనా రేవతిని ముస్తాబు చేస్తోంది. కవిత హాల్లో కోడళ్ళతో ముచ్చట్లు చెబుతోంది. మగాళ్ళు పెంటహౌస్లో సురాపానంలో నిమగ్నమై ఉన్నారు. దేవకి వంటల దగ్గర ఉంది. శోభనం గది పూల పరిమళాలతో నిండిపోయింది. పెళ్ళి కొడుకు సుధీర్‌ను తన ఇద్దరన్నలూ వేరే గదిలో ముస్తాబు చేస్తున్నారు. సుధీర్‌తో ఇంకో పదిమంది స్నేహితులు ఉండటంతో ఆ గది మొత్తం సందడిగా ఉంది. సమయం ఎనిమిది రెండు నిమిషాలైంది. కవిత పెద్ద కొడుకు శ్యామ్ భార్య నీరజ పెళ్ళికొడుకు గది దగ్గరికి వచ్చి, ‘సుధీర్ రెడీ అయ్యాడా?’ అనడిగింది.‘హా! రెడీ!’ అని, ‘రేయ్ తమ్ముళ్లూ! మీరంతా కాస్త వాడికి దారిస్తే, పంజరంలోకి పంపుదాం!’ అన్నాడు. చుట్టూ చేరి జోకులేస్తూ నవ్విస్తున్న సుధీర్ స్నేహితులు వెంటనే ‘ఆల్ ది బెస్ట్ రా సుధీర్!’ అని గట్టిగా అరిచారు. సుధీర్ రాజకుమారుడిలా కదిలాడు. సరిగ్గా సుధీర్ ఎనిమిది గంటల పదకొండో నిమిషంలో గదిలోకి వెళ్ళాడు. రేవతి దేవకన్యలా ముస్తాబై ఎనిమిది గంటల పదహారో నిమిషంలో గదిలోకి ప్రవేశించింది. ఆ అద్భుతమైన తంతును కళ్ళారా చూస్తూ చాలా రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుంది హాల్లో కూర్చున్న కవిత. ‘పిన్నిగారు! అంతా మీరనుకున్నట్టు చాలా అందంగా జరిగింది. రండి భోజనం చేద్దాం!’ అని సంతోషంగా చిరునవ్వుతో పిలిచింది దేవకి. ‘ఇప్పుడు ఆకలేస్తుంది. పద తిందాం!’ అని దేవకి వెనుకే నడిచింది సంతోషంగా కవిత. కుటుంబసభ్యులు, కొంతమంది బాగా దగ్గర బంధువులు అందరూ కలిసి ఆనందంగా భోంచేస్తున్నారు.సందడిగా ఉంది ఆ ప్రాంతం! సమయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలవుతోంది. సరిగ్గా అప్పుడే దేవకి ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన శబ్దం విని, ఓపెన్ చేసి చూసింది దేవకి. రేవతి ఫోన్ నుండి, ‘వదినా! నాకు డేట్ వచ్చింది. ప్లీజ్ హెల్ప్ మీ!’ అని వచ్చిన ఆ మెసేజ్ చూసి, దేవకి మొహంలో చిరునవ్వు మాయమై, కంగారు మొదలై చెమటలు పట్టాయి.‘వెంటనే నీ రూమ్‌కి రా!’ అని రిప్లై చేసి, మెల్లిగా తన కళ్ళు కవిత వైపు తిప్పింది. బంధువులతో ముచ్చటిస్తూ భోంచేస్తుండటం చూసి, ‘హమ్మయ్యా!’ అని ఊపిరి పీల్చుకుని, ‘అక్క! నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తా, కాస్త చూసుకో!‘ అని మీనాకి చెప్పి, లోపలికి వెళ్ళింది.‘ఏంటి రేవతి! ఇలాంటివి ముందే చూసుకోవాలి కదా! ఇప్పుడెలా? మా తమ్ముడికి చెప్పావా?’ అని అడిగింది దేవకి టెన్షన్‌గా. ‘చెప్పాను. వెళ్ళి రెస్టు తీసుకో’ అని చెప్పారు. ‘సరే,నువ్వు కంగారు పడకు. అయినా, ఇంకా టైముంది కదా?’ కంగారుగానే అడిగింది దేవకి. ‘రేపు కానీ, ఎల్లుండు కానీ రావాలి’ అమాయకంగా చెప్పింది రేవతి. ‘సరే సరే, ఈ రూమ్‌లోనే ప్రశాంతంగా పడుకో, రేపు చూసుకుందాం!’ అని చెప్పి, ‘ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఏమౌతుందో, ఏంటో’ అంటూ టెన్షన్‌గా వెనక్కి తిరిగేసరికి, ఎదురుగా కవిత నిలబడి ఉంది. ఆమెను చూసి దేవకి పెద్ద షాకే తిని రాయిలా నిలబడిపోయింది. రేవతి కవితకు, దేవకికి ఒకేసారి మెసేజ్ పెట్టింది. అందువల్ల ఈ విషయం కవితకు తెలిసింది. ‘అసలు మీరు ఆడవాళ్లేనా? నోటికి అన్నమే తింటున్నారా? ముందుగా టేబ్లెట్స్ వేసుకోవాలని తెలియదా? మీ కంటే లేబరోళ్ళే బెటర్ కదా!’ అని పిచ్చ కోపంగా తిట్టి, హాల్లో కొచ్చి, ‘నీరజా! శ్యామ్! అందరూ రండి ఇంటికి పోదాం!’ అంటూ గేటువైపు దారి తీసింది కవిత. ‘ఇప్పుడేమైందని అంత కోపం తెచ్చుకుని పోదామంటున్నావమ్మా!’ అన్నాడు సుధీర్ గట్టిగా. ‘ఏమైందా? అప్పుడే పెళ్ళానికి సపోర్టా? ఇంత అరెంజ్మెంట్ చేయిస్తే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? కనీసం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా?’ కోపంగానే అంది కవిత. ‘మనం స్వచ్ఛమైన నీళ్ళు తాగి ఎంతకాలమైంది? పొల్యూషన్ లేని గాలి పీల్చి ఎన్నేళ్ళైంది? రోగం లేని మనిషెవడైనా ఉన్నాడా?’ సూటిగా అడిగాడు సుధీర్. ‘దానికి, దీనికి సంబంధమేంటి? నువ్వేం మాట్లాడుతున్నావ్?’ అర్థం కానట్టు అడిగింది కవిత. ‘అమ్మా! సంబంధం ఉంది. మంచి ముహుర్తం కాబట్టి, నెలసరి రాకుండా టేబ్లెట్స్ వేసుకుని ఉండొచ్చు కదా! అనేగా నీ కోపం, బాధ? తప్పు. సృష్టికి విరుద్ధమైనది నీ ఆలోచన. ఇంకెంత కాలం మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారు హాఫ్ నాలెడ్జ్ తో! ఇకనైనా కళ్ళుతెరవండి. మీ ఆడవాళ్లు సృష్టికి ప్రతిసృష్టి చేసేవాళ్ళని గొప్పగా చెప్పుకునే ముందు, కొంత మూర్ఖత్వాన్ని, కొంత చాదస్తాన్ని తగ్గించుకుని మీ మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. దేవుడు మనకన్నీ కల్తిలేనివే అందించాడు. మనమే అతి తెలివితో కల్తీగా మారిపోతున్నాము’ అని చెప్పడం ఆపి, ‘నేను చెప్పింది ఇంకా అర్థం కాకపోతే, రేపు మనింట్లో పూజ గదనేది ఉండదు’ అని తన గదివైపు వెళ్ళిపోయాడు. సుధీర్ మాటలు కవితను ఆలోచించేలా చేశాయి. రేవతికి, దేవకికి సారీ చెప్పింది కవిత. ‘భయపడకు. ఈ మూడు రోజులూ నువ్వు నాతో ఉండు. నీకు మొత్తం తగ్గాకే కార్యం పెట్టుకుందాం!’ అని రేవతిని కౌగిలించుకుని ధైర్యం చెప్పింది కవిత. ఇంట్లోకి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ప్రవేశించింది. -
వదినా.. సుధీర్ బ్రోని కలిసేదెప్పుడు..రష్మి పోస్ట్‌పై నెటిజన్ కామెంట్ (ఫొటోలు)
-
సెలబ్రిటీ నీకన్నా ఎవడురా...
‘‘పైసా లేకున్నా మాయా.. పనేం లేకున్నా నాలాంటోడ్ని బతుక్కేమీ పర్లేదు...’’ అంటూ సాగుతుంది ‘బాసే హే..’ పాట. ‘సుడిగాలి’ సుధీర్ హీరోగా నటిస్తున్న ‘జీ.ఓ.ఎ.టీ’ (గోట్) సినిమాలోనిది ఈ పాట. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో దివ్వభారతి హీరోయిన్గా నటిస్తున్నారు. మొగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘బాసే హే నీలా ఉండే లక్కు మాకే లేదురా.. సెలబ్రిటీ నీకన్నా ఎవడురా’ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. లియోన్ జేమ్స్ సంగీత సారథ్యంలో కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను దీపక్ బ్లూ ఆలపించారు. జీతూ మాస్టర్ కొరియోగ్రాఫర్. ‘‘హీరో క్యారెక్టరైజేషన్‌ని వివరించే ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. టాకీ పార్టు దాదాపు పూర్తయింది. యాక్షన్ ఎపిసోడ్స్, రెండు పాటల షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి’’ అని నిర్మాత చంద్రశేఖర్ చె΄్పారు. -
వల్లీ టీచర్... వెరీ స్పెషల్
మాతృదేవోభవ... పితృదేవోభవ... ఆచార్యదేవోభవ... అని నేర్చుకున్నాం. స్పెషల్ ఎడ్యుకేటర్‌లో గురువుతోపాటు తల్లి, తండ్రి కూడా ఉంటారు. ఆ ప్రత్యేక గురువులకు ఎన్ని వందల వందనాలు సమర్పించినా తక్కువే. ఈ పిల్లలకు ప్రేమను పంచడానికే అంకితమైన వల్లీసుధీర్కి ప్రత్యేక వందనం! భగవంతుడు కొంతమంది పిల్లలను భూమ్మీదకు ప్రత్యేకంగా పంపిస్తాడు. కల్మషం తెలియని ఆ స్పెషల్ కిడ్స్‌కి పాఠం చెప్పే టీచర్లు కూడా అంతే స్వచ్ఛమైన మనసు కలిగిన వారై ఉండాలి. ఆ టీచర్లు ప్రతి బిడ్డకూ అమ్మగా మారి తల్లిప్రేమను పంచాలి. స్పెషల్ టీచర్ అనేది ఉద్యోగం కాదు, అకుంఠిత దీక్షతో నిర్వహించే సేవ. నాలుగు దశాబ్దాలకు పైగా అలాంటి సేవకు తనను అంకితం చేసుకున్న మనీషి వల్లీసుధీర్. స్పెషల్ కిడ్స్‌కు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని ప్రమాణం చేసుకున్న మహోన్నతమైన వ్యక్తి ఆమె. తాను స్పెషల్ టీచర్‌గా మారిన వైనాన్ని సాక్షితో పంచుకున్నారు వల్లీసుధీర్. సినిమారీళ్లన్ని మలుపులు! ‘‘నేను స్పెషల్ టీచర్ కావడం వెనుక సినిమా కథలో ఉన్నన్ని మలుపులున్నాయి. మాది తెలుగు కుటుంబమే. కానీ పుట్టింది చెన్నైలో. మా నాన్న కెవీఎస్ శర్మ నటులు. ఎన్టీఆర్‌తో కలిసి చదువుకున్నారు, ఆయనతో కలిసి చెన్నైకి వెళ్లారు, ఆయనతో కలిసి సినిమాలు చేశారు. అమ్మానాన్నలకు నేను ఏకైక సంతానం. నాకు నాలుగేళ్లున్నప్పుడు నాన్న హటాత్తుగా పోయారు. దాంతో నేను, అమ్మ మా అమ్మమ్మగారింటికి విజయవాడకు వచ్చేశాం. టెన్త్ క్లాసు పూర్తయ్యేసరికి తాతగారు కూడా పోయారు. ఇక నేను, అమ్మ హైదరాబాద్‌లోని పిన్ని వాళ్లింటికి వచ్చాం. పూర్తిగా వాళ్ల మీద ఆధారపడిపోకుండా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకున్నాను. స్వీకార్, ఉప్కార్ లో పిల్లలకు శిక్షకుల కోసం చూస్తున్నారని తెలిసింది. అలా స్పెషల్ చిల్డ్రన్ కోసం పని చేయాల్సిన రంగంలోకి అడుగుపెట్టాను. మొదటిరోజు నాకు ఇద్దరు కవల పిల్లలనిచ్చి చూసుకోమన్నారు. పిల్లల అవసరాలు తెలుసుకుని సముదాయించగలిగిన వయసు కాదది. ఇందులో ఇమడలేననుకుని, బాబాయ్‌కి చెప్తే ‘భయపడి వదిలేయడం కాదు, నీ వంతు ప్రయత్నం చెయ్యి. తర్వాత చూద్దాం’ అన్నారు. అలా కొనసాగుతున్న సమయంలో స్వీకార్ వాళ్లు నన్ను శిక్షణ కోసం మణిపాల్‌కి పంపించారు. ఆ శిక్షణ నా మీద అంతటి ప్రభావం చూపిస్తుందని ఏ మాత్రం ఊహించలేదు. అమ్మకు పరీక్షలు పెట్టానట! పిల్లలు మానసిక సమస్యలతో పుట్టడానికి దారి తీసే కారణాలను వివరించారు. నొప్పులు మొదలైన తర్వాత ప్రసవం జరగడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ఉమ్మనీరు పోవడం, పుట్టిన వెంటనే బిడ్డ ఏడవకపోవడం... వంటి సమస్యలను వివరిస్తూ ప్రసవం సమయంలో తల్లిమాత్రమే కాదు బిడ్డ కూడా తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతుందని చెప్పారు. ఎక్కువ సమయం ఆక్సిజన్ అందక పోవడంతో ఎదురయ్యే పరిణామాలను వివరించారు. అంతే... నా గురించి అమ్మ ఎప్పుడూ చెప్పే ఒక విషయం గుర్తు వచ్చింది. ‘నేను పుట్టినప్పుడు మా అమ్మ రెండు రోజులు నొప్పులు పడిందట. నార్మల్ డెలివరీ కాదని సిజేరియన్ చేశారు. ఉమ్మనీరు తాగడంతోపాటు, ఆక్సిజన్ అందక దేహం నీలిరంగులోకి మారిపోయిందట. పైగా పుట్టగానే ఏడవలేదు’. ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య నేను నార్మల్‌గా పుట్టడం ఒక మిరకిల్. అవన్నీ మణిపాల్ శిక్షణ సమయంలో ఒక్కసారిగా రీలు తిరిగినట్లు కళ్ల ముందు మెదిలాయి. నాకు తెలియకుండానే చెంపల మీద కన్నీళ్లు కారిపోయాయి. భగవంతుడికి మనసులోనే దణ్ణం పెట్టుకుని, నార్మల్‌గా పుట్టించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ... ‘నా చివరి ఊపిరి వరకు స్పెషల్ కిడ్స్‌కి సర్వీస్ ఇస్తాను’ అని ఒట్టుపెట్టుకున్నాను. అప్పటి నుంచి స్పెషల్ చిల్డ్రన్‌కి సర్వీస్ ఇవ్వడానికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాను. గ్రాడ్యుయేషన్, డీఎమ్ఆర్, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, సైకాలజీలో పీజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మరో పీజీతోపాటు లండన్‌లో ‘కోర్స్ ఆఫ్ ఇంట్రడక్షన్’ కోర్సు చేశాను. స్వతంత్రులుగా నిలబెట్టాలి! స్పెషల్ చిల్డ్రన్ గురించి సమగ్రంగా చదివిన తరవాత హైదరాబాద్‌లో‘శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్’ స్థాపించాను. ఈ పిల్లలు ప్రతి పనికీ ఒకరి మీద ఆధారపడకుండా తమ పనులు సొంతంగా చేసుకునేటట్లు తయారు చేయడం ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నాను. పర్సనల్ నీడ్స్... అంటే సొంతంగా తినడం, కాలకృత్యాలకు వెళ్లడం, శుభ్రం చేసుకోవడం వంటి పనులకు ఎవరి మీదా ఆధారపడకూడదు. రెండవది డొమెస్టిక్ స్కిల్స్, అంటే... తల దువ్వుకోవడం, దుస్తులు ధరించడం, చెప్పులు సరిగ్గా వేసుకోవడం వంటివి. ఇక మూడవది కాగ్నిటివ్ స్కిల్స్, అంటే... ప్రమాదాల గురించి తెలియచేయడం, అగ్నిప్రమాదం, జల ప్రమాదాలకు దూరంగా ఉండడం ఎలాగో నేర్పించడం, ప్రమాదాలు ఎదురైతే తప్పించుకోవడంలో శిక్షణనివ్వడంతోపాటు ఒక వస్తువు కొనడం, దుకాణానికి వెళ్లి డబ్బు ఇచ్చి కొనుగోలు చేసిన తరవాత చిల్లర డబ్బు తీసుకుని లెక్క చూసుకోవడం వంటి వాటిలో శిక్షణనివ్వడం అన్నమాట. ఈ మేరకు తర్ఫీదు ఇస్తే ఇక వాళ్లు జీవితంలో ఎవరికీ భారంగా పరిణమించరు. అందుకే ఈ మూడింటినే ప్రధానంగా తీసుకున్నాను. కానీ ముందే చెప్పాను కదా! నా జీవితంలో సినిమాకంటే ఎక్కువ మలుపులున్నాయని. నా ప్రయత్నం ఒకదారిలో పడే సమయానికి అమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఇక నేను ఈ సెంటర్ మీద పూర్తి సమయం కేటాయించడం కుదిరేపని కాదని నా ఫ్రెండ్‌కి అప్పగించాను. శ్రద్ధ సెంటర్లో పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా చేయగలిగాను. కానీ నాకు రోజులు గడిచేదెలా? అమ్మకు వైద్యం చేయించేదెలా? అప్పుడు ‘గీతాంజలి దేవశాల’ స్పెషల్ స్కూల్లో చేరాను. అందులో 24 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. స్వీకార్ ఉప్కార్ నుంచి చూసుకుంటే 44 ఏళ్లు పూర్తయ్యాయి. పిచ్చి టీచర్ అనేవాళ్లు! సమాజంలో అప్పటికీ ఇప్పటికీ కొంత మార్పు వచ్చిన మాట నిజమే, కానీ రావలసినంత మార్పు రాలేదనే చెప్పాలి. అప్పట్లో మా గుర్తింపు ‘పిచ్చి టీచర్’, ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేటర్ బాధ్యత ఎంత క్లిష్టమైనదో అర్థం చేసుకుని మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఈ సున్నితత్వం స్పెషల్ చిల్డ్రన్ విషయంలోనూ రావాలి. అప్పటిలాగ దూరం పెట్టడం లేదు కానీ దగ్గరకు రానివ్వడంలో ఒకింత సందిగ్ధంగానే ఉంటున్నారు. తమ పొరుగింట్లో స్పెషల్ కిడ్ ఉంటే ఆ కిడ్ని సానుభూతితో చూస్తున్నారు తప్ప, తమ పిల్లలతో ఆడుకోవడానికి అనుమతించలేకపోతున్నారు. విద్యావ్యవస్థ మాత్రం స్పెషల్ కిడ్స్ కోసం ఒక విభాగం ఉండాలనే నియమంతో ఓ ముందడుగు వేసిందనే చెప్పాలి. ఇద్దరు పిల్లల్లో ఒకరు స్పెషల్ కిడ్, ఒకరు నార్మల్ కిడ్ అయితే ఆ తల్లిదండ్రులు పిల్లలతో ఎలా వ్యవహరించాలి, స్పెషల్ కిడ్ తల్లి ఇరుగుపొరుగు వారితో, వారి పిల్లలతో ఎలా మెలగాలి వంటివన్నీ చెప్పడానికి ఒక వేదిక ఉంటే బావుణ్నని చూస్తున్నాను. ఇన్నాళ్లూ నా సర్వీస్‌కి వేదిక గీతాంజలి దేవశాల. ఇప్పుడు టెక్నాలజీ సాయంతో చెప్పాలా లేక వేరే మాధ్యమాలలో ప్రయత్నించాలా అనేది ఇంకా ఆలోచించలేదు. నాకు నేను పెట్టుకున్న ఒట్టు ప్రకారం చివరి శ్వాస వరకు స్పెషల్ కిడ్స్ కోసం పని చేస్తూనే ఉంటాను’’ అన్నారు వల్లీసుధీర్. ఎవరికి వాళ్లు ప్రత్యేకమే! ఇన్నేళ్ల నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే... స్పెషల్ చిల్డ్రన్‌కి శిక్షణ ఇవ్వడానికి రూపొందించిన కోర్సులన్నీ ఒకరకమైన సాధనాలు మాత్రమే. వాటిని పిల్లవాడికి ఎలా అన్వయింపచేయాలనేది టీచర్ స్వీయ విచక్షణతో తెలుసుకుని ఆచరించాలి. ఒక సూత్రం ఏ ఇద్దరు పిల్లలకూ వర్తించదు. ఎవరికి వాళ్లు ప్రత్యేకమే. మా దగ్గరకు వచ్చిన పిల్లలకు ప్రేమ పంచాలి, బాధ్యతగా శిక్షణనివ్వాలి. అలా నేర్పిస్తూ పాతిక మందిని ఓపెన్ స్కూలింగ్‌లో టెన్త్ క్లాస్ పరీక్షకు సిద్ధం చేశాం. ఆటల్లో శిక్షణనిచ్చి పోటీలకు తీసుకెళ్లాం. మా దగ్గర శిక్షణ పొందిన పిల్లలు స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో ఇంగ్లండ్‌లో క్రీడల పోటీలకు కూడా వెళ్లారు. – వల్లీ సుధీర్, స్పెషల్ టీచర్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పిల్లల బిహేవియర్ ఇష్యూస్ ని అడ్రస్ చేసే విధానం..!
-
సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
సస్పెన్స్ సహస్ర
‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘కాలింగ్ సహస్ర’. అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథి నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ అంశాలతో రానున్న ఈ సినిమా ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘గాలోడు’ హిట్‌తో నాకు మాస్ ఇమేజ్ వచ్చింది. ‘కాలింగ్ సహస్ర’తో సస్పెన్స్ జానర్లోకి అడుగుపెడుతున్నా’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘‘ఇప్పటివరకు ఇలాంటి కథతో ఇండియన్ స్క్రీన్ మీద సినిమా రాలేదు’’ అన్నారు అరుణ్ విక్కిరాలా. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు విజేష్ తయాల్. -
డిసెంబర్ 1st థియేటర్ కి వస్తున్నాము సపోర్ట్ చేయండి
-
డేట్ ఫిక్స్
‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా అరుణ్ విక్కీరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. వెంకటేశ్వర్లు కాటూరి, విజేష్ తయల్, చిరంజీవి పమిడి నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 1న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ‘‘సుధీర్‌ను సరికొత్త కోణంలో చూపించేలా ఈ సినిమాలో ఆయన పాత్ర ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
వారి రుణం తీర్చుకోలేను : సుడిగాలి సుధీర్
‘‘నేనీ రోజు ఈ స్థాయికి చేరుకున్నానంటే నా అభిమానుల ప్రేమే కారణం. టీవీ షోలు చేసినా, సినిమాలు చేసినా నా ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు.. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. త్వరలోనే ‘కాలింగ్ సహస్ర’ సినిమాతో థియేటర్స్‌లో సందడి చేస్తాం’’అని హీరో సుధీర్ అన్నారు. అరుణ్ విక్కీరాలా దర్శకత్వంలో సుధీర్, డాలీషా జంటగా నటించిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్‌పై విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మోహిత్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కనుల నీరు రాలదే..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రెస్మీట్లో సుధీర్ మాట్లాడుతూ– ‘‘మోహిత్ మంచి సంగీతాన్ని అందించారు. జిత్తు మాస్టర్ ఈ పాటని చక్కగా కొరియోగ్రఫీ చేశారు’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వెంకటేశ్వర్లు కాటూరి, విజేష్ తయల్. ‘‘కాలింగ్ సహస్ర’ తర్వాత సుధీర్ సూపర్ స్టార్ అవుతాడు’’ అన్నారు అరుణ్ విక్కీరాల. ఈ కార్యక్రమంలో డాలీషా, కెమెరామేన్ శశికిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్, నిర్మాత బెక్కెం వేణుగో΄ాల్, రామచంద్రరావు మాట్లాడారు. -
సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’ సినిమా సాంగ్ లాంచ్ (ఫొటోలు)
-
ఇద్దరం ఒకేసారి వచ్చాం... ఇప్పుడు తను నా బెస్ట్ ఫ్రెండ్
-
కొలంబియాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి
జి.కొండూరు(మైలవరం): కొలంబియాలో స్నేహితురాలి జన్మదిన వేడుకలకు హాజరైన తెలుగు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన బేతపూడి సుదీర్‌కుమార్ అలియాస్ జోషి (34) టెలీ కమ్యూనికేషన్లో ఎంఎస్ చేసేందుకు 2018లో స్పెయిన్ వెళ్లాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ లే డే జైన్‌లో ఎంఎస్‌లో చేరాడు. కరోనా కారణంగా చదువు పూర్తి కాకపోవడం, సబ్జెక్ట్‌లు మిగిలిపోవడంతో అక్కడే ఉండి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకుంటూ ఎంఎస్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనతోపాటు అదే యూనివర్సిటీలో చదువుతున్న కొలంబియాకు చెందిన యువతి జెస్సికాతో సుదీర్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన తన స్నేహితురాలి జన్మదిన వేడుకల నిమిత్తం సుదీర్‌కుమార్ స్పెయిన్ నుంచి కొలంబియా రాజధాని బోగోటో వెళ్లాడు. అక్కడి నుంచి రియో బ్లాంకోలోని స్నేహితురాలి నివాసానికి చేరుకున్నాడు. అక్కడ జన్మదిన వేడుకల అనంతరం ఏం జరిగిందో ఏమో కానీ ఈ నెల 19వ తేదీన మంగళవారం తెల్లవారుజామున కొలంబియాలోని జెస్సీకా నుంచి జి.కొండూరులోని సుదీర్‌కుమార్ తల్లిదండ్రులు బేతపూడి కేథరీన్, దేవదాసుకు సుదీర్‌కుమార్ మరణ వార్త అందింది. తన ఇంట్లోనే సుదీర్‌కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని జెస్సీకా తెలిపినట్లు కేథరీన్, దేవదాసు చెబుతున్నారు. స్నేహితురాలి జన్మదిన వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సైతం తమతో వాట్సాప్‌లో పంచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జన్మదిన వేడుకలలో భాగంగా తాగిన డ్రింక్ వల్ల మత్తుగా ఉందని, తర్వాత మాట్లాడతానని తమతో చివరిగా ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్నారు. తమ కుమారుడిని జన్మదిన వేడుకల పేరుతో రప్పించి కావాలని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తమ కుమారుడి భౌతికకాయం తమకు అప్పగించేలా చూడాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
సుధీర్ తో నటించాలని నా కోరిక..!
-
మళ్ళీ రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ స్టార్ట్..ఈ సారి పెళ్లేనా..
-
మరో చిత్రంతో వస్తున్న 'గాలోడు'.. షూటింగ్ ప్రారంభం!
సుడిగాలి సుధీర్ మరో చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. హీరోయిన్గా దివ్య భారతి నటించనుంది. తాత్కాలికంగా ఎస్ఎస్4తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మాతలుగా.. లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించారు. ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాదాకృష్ణ, కెఎల్ దామౌదర ప్రసాద్ ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. (ఇది చదవండి: రూమ్‌కు రమ్మని రెండు సార్లు పిలిచాడు: నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు) హీరో సుధీర్ మాట్లాడుతూ..'ఇక్కడికి వచ్చిన అందరికి థాంక్యూ. నన్ను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడానికి కారణం మీడియానే టీం అందరి గురించి ఇదివరకే చెప్పారు. మరో ప్రెస్ మీట్ పెట్టి ఇంకొన్ని విషయాలను పంచుకుంటాం' అని అన్నారు. దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ.. 'సుధీర్‌కు ఈ కథను ఒక గంట నేరేట్ చేయగానే ఆయనకు బాగా నచ్చి ఒప్పుకున్నారు. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా అన్ని చేసి పెట్టారు.' అని అన్నారు. (ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?) -
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కొత్త సినిమా ఓపెనింగ్ (ఫొటోలు)
-
గాలోడు పెళ్ళికొడుకాయనే..సుధీర్ పెళ్లి కన్ఫర్మ్...
-
ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సుడిగాలి సుధీర్?
జబర్దస్త్ షోతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుడిగాలి సుధీర్. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుధీర్ ఆ తర్వాత యాంకర్‌గానూ సత్తా చాటాడు. ముఖ్యంగా యాంకర్ రష్మీతో లవ్‌ట్రాక్ సుధీర్‌కు బాగా కలిసొచ్చింది. బుల్లితెరపై సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మీ జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. స్క్రీన్‌మీద మెస్మరైజ్ చేసే ఈ జంట ప్రేమలో ఉన్నారని పలు వార్తలు షికార్లు చేసినా అందులో ఏమాత్రం నిజం లేదని ఇప్పటికే సుధీర్, రష్మీలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఇకమూడు పదుల వయసు దాటినా ఇంతవరకు పెళ్లి ఊసెత్తని సుధీర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే సుధీర్ పెళ్లి చేసుకుంటాడని సమాచారం. ఇంట్లో తల్లిదండ్రుల కోరిక మేరకు సుధీర్ ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు ఒకే చెప్పాడట. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలోనూ సుధీర్ పెళ్లి విషయంలో పలు కథనాలు వచ్చినా అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. మరి ఈసారైనా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. -
సుడిగాలి సుధీర్‌పై అనసూయ కాంట్రవర్సీ కామెంట్స్.. ఫ్యాన్స్ ట్రోలింగ్
బుల్లితెరపై యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించిన తెలిసిందే. తనదైన యాంకరింగ్, అందం, గ్లామర్‌తో హీరోయన్లకు సమానమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. బుల్లితెరపై అలరిస్తూనే, వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో లీడ్ రోల్ పోషిస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం టీవీ షోలతో పోలిస్తే సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. వరుస మూవీ ఆఫర్లతో బిజీబిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్‌పై అనసూయ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. సుధీర్‌తో వర్క్ చేయడం ఎలా ఉంది? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. అనసూయ కాస్త సీరియస్‌గానే ఆన్సర్ ఇచ్చింది. ''సుధీర్ నా జూనియర్. నేను సీనియర్ని అని మర్చిపోయారా? నాతో కలిసి పనిచేయడం ఎలా ఉందో సుధీర్‌ని అడగండి. అతడు నా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. నేను కూడా అతన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడీ కామెంట్స్‌పై అనసూయను ట్రోల్ చేస్తున్నారు సుధీర్ ఫ్యాన్స్. 'రెండు, మూడు సినిమాలు చేసేసరికి ఇంత ఓవర్ యాక్షన్ అవరసరమా? సుధీర్ గురించి అడిగితే ఒక్క మాట చెప్పలేవా? అయినా స్టార్ హీరోలతో కూడా అనసూయతో పనిచేయడం ఎలా ఉంది అని వాళ్లనే అడగండి అని చెప్తావ్ కదా' అంటూ విమర్శిస్తున్నారు. 🙄🙄 ee lekkana pedda hero movies lo mother characters cheysey vallani aa hero tho cheyadam ela undi ani adagoddu annatlu #anasuyabharadwaj #Anasuya #Aunty pic.twitter.com/VmQ1P8ojGr — Idly_Vishwanatham (@Idly_Baba) December 14, 2022 -
సుధీర్, రష్మిలతో ‘గాలోడు’ కుదరలేదు.. ‘గజ్జల గుర్రం’ చేస్తా: రాజశేఖర్‌రెడ్డి
‘‘గాలోడు’ సినిమా పక్కా కమర్షియల్ కంటెంట్ కావడంతో ఈ విజయాన్ని ముందే నేను ఊహించాను. నేను ఇది వరకు కమర్షియల్ డైరెక్టర్ల వద్దే పని చేశాను. నేను పని చేసిన చిత్రాలన్నీ కూడా దాదాపుగా హిట్ అయ్యాయి. అందుకే ఈ సినిమా మీద ముందు నుంచి నమ్మకంగానే ఉన్నాను’ అని దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన చిత్రం‘గాలోడు’. గెహ్నా సిప్పి హీరోయిన్. నవంబర్ 18న ఈ చిత్రం విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► సుధీర్‌తోనే తీసిన‘ సాఫ్ట్వేర్ సుధీర్’ సినిమాను ముందు వేరే హీరోతో అనుకున్నాను. కానీ ఆ హీరో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో.. ఓ కామెడీ టచ్ ఉన్న హీరో కావాలని అనుకున్న సమయంలో సుధీర్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. అలా ఆయనతో జర్నీ మొదలైంది. నేను మాములుగా అయితే ముందు గాలోడు సినిమాను చేయాలి. సాఫ్ట్ వేర్ సుధీర్ కథ, ఈ గాలోడు కథను సింగిల్ సిట్టింట్లో ఓకే అయింది. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాను. ► గాలోడు సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి. విమర్శలు కూడా వచ్చాయి. వాటిని సరిదిద్దుకుంటాను. సప్తగిరి గారు, మిగతా ఆర్టిస్టులు కాల్ చేసి మెచ్చుకున్నారు. ► నేను ముందు డైలాగ్ రైటర్‌గా పని చేశాను. కాబట్టి కథలో ఎక్కడైనా స్లోగా అనిపిస్తే డైలాగ్స్‌తో మ్యానేజ్ చేశాను. అది చాలా ప్లస్ అయింది. నేను ఎక్కువగా ఘోస్ట్ రైటర్‌గానే పని చేశాను. కానీ ఎప్పటికైనా సక్సెస్ అవుతాను అనే నమ్మకంతోనే ఉన్నాను. ► మొదటి సినిమా సమయంలో సుధీర్ ఇమేజ్ నాకు అంతగా తెలియదు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సమయంలో ఆయన క్రేజ్ తెలిసింది. ఈయనకు మంచి క్రేజ్ ఉందని నాకు అర్థమైంది. అప్పుడు విజయం పై మరింత నమ్మకం పెరిగింది. ► సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు సినిమా కథలను రష్మీకి చెప్పాం. కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదు. రష్మీ, సుధీర్ ఇద్దరితో నేను ఓ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. త్వరలో కచ్చితంగా చేస్తాను. ఆ ఇద్దరితో గజ్జల గుర్రం అనే సినిమాను చేయాలని అనుకుంటున్నాను. ► నా దగ్గర బౌండ్ స్క్రిప్ట్‌లున్నాయి.. అవి సుధీర్ గారికి సూట్ అవుతాయ్ కాబట్టే ఆయనతో సినిమాలు చేశాను. ఇప్పుడు గజ్జల గుర్రం అనేది కథగానే ఉంది. బౌండ్ స్క్రిప్ట్ లేదు. అందుకే కాస్త లేట్ అవుతుంది. ఆయనతో నాకు.. నాకు ఆయనతో మంచి కంఫర్ట్ లెవెల్స్ ఉన్నాయి. మనకన్నా కూడా ఆయన చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. ► డైరెక్షన్ తో పాటు, ప్రొడక్షన్ కూడా చేయడం అనేది చాలా కష్టమైన పని. మా కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు చాలా బిజీ. ఆయన కోసం ఆరు నెలలు ఆగాను. ఎలాగైనా సినిమా బాగా రావాలని ఆయన కోసం ఆగాం. ఇప్పుడు థియేటర్స్ లో ఆయన విజువల్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ► ఎంత కొత్తదనంతో సినిమాలు వస్తున్నా కూడా అందులో ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. కంటెంట్ లేకుండా ఎంత బడ్జెట్ పెట్టినా కూడా వృథానే. అందుకే ఒక కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని ఉంది. -
జబర్దస్త్ నుంచి అందుకే బయటకు వచ్చాను : సుడిగాలి సుధీర్
-
సుధీర్ టీవీ షోస్ చెయ్యడం మానేస్తున్నాడా ..?
-
గాలోడు మూవీ పబ్లిక్ టాక్
-
మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గాలోడు’.. రిలీజ్‌కు రెడీ
సుధీర్, గెహ్నా సిప్పి జంటగా నటించిన చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సుధీర్ మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సమయంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ సినిమాను పూర్తి చేసి, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ‘సాఫ్ట్వేర్ సుధీర్’ తర్వాత నాకు మరో అవకాశం ఇచ్చిన రాజశేఖర్‌గారికి ధన్యవాదాలు. ‘గాలోడు’ ట్రైలర్‌కు మంచి స్పందన రావడం హ్యాపీ. సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘మంచి కమర్షియల్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. హిట్ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు రాజశేఖర్‌రెడ్డి. ‘‘కాలేజ్ యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అన్నారు గెహ్నా సిప్పి. -
సుధీర్ తో కలిసి మూవీ చేయకపోవడానికి కారణం అదే : రష్మీ
-
సుధీర్ ఫ్యాన్స్‌పై రాఘవేంద్రరావు సీరియస్
-
పిచ్చిపిచ్చిగా ఉందా? సుధీర్ ఫ్యాన్స్‌పై రాఘవేంద్రరావు సీరియస్
‘‘ఇటీవల విడుదలైన ‘సీతారామం, బింబిసార, కార్తికేయ 2’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ విజయాలతో సినిమాలకు పూర్వ వైభవం వచ్చింది. వినోదాత్మకంగా రూపొందిన మా ‘వాంటెడ్ పండుగాడ్’ చిత్రం కూడా ఈ చిత్రాల్లానే విజయం సాధిస్తుంది’’ అని ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. కె. రాఘవేంద్రరావు సమర్పణలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అయితే ఆ సమయంలో అనసూయ మాట్లాడుతుండగా సుడిగాలి సుధీర్ స్టేజ్‌పైకి వచ్చాడు. అతన్ని చూడగానే ఫ్యాన్స్ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. స్వయంగా రాఘువేంద్ర రావు మైక్ తీసుకొని సైలెంట్‌గా ఉండాలని కోరినా సుధీర్ ఫ్యాన్స్ వినిపించుకోలేదు. దీంతో ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. సుధీర్ సహా అందరూ మాట్లాడుతారని, కాస్త ఓపిగ్గా ఉండాలని కోరారు. పిచ్చిపిచ్చిగా ఉందా? ఎవరు పిలిచారు వాళ్లని? పెద్దా చిన్నా తేడా లేదా? ఇలాగే ప్రవర్తిస్తే బయటకు పంపించేస్తా అంటూ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. -
సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు: దర్శకుడు
Nee Kalle Diwali Song Out From Sudheer Gaalodu Movie: సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `గాలోడు`. పక్కా మాస్ ఎంటర్టైనర్గా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన `గాలోడు` టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ సాంగ్ ప్రోమో యూట్యూబ్‌లో 13 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని లిరికల్ సాంగ్‌పై మరింత ఆసక్తిని కలిగించింది. తాజాగా `నీ కళ్లే దివాళి...` లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ స్వరపరిచిన ఈ పాట ట్రెమండస్ రెస్పాన్స్‌తో ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్ గా నిలిచింది. ఈ పాటలో సుధీర్ డ్యాన్స్, ఫారెన్ లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ పాట యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండడం విశేషం.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ - ```గాలోడు` ఫస్ట్ సాంగ్ ప్రోమో యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పుడు `నీ కళ్లే దివాళి` పాట కూడా ఇన్స్టంట్ హిట్ అయ్యింది. సుధీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. భీమ్స్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. శ్రీనివాస తేజ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. షాహిద్ మాల్య చక్కగా ఆలపించాడు. యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన `గాలోడు` సినిమా కచ్చితంగా సుధీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. షూటింగ్ పూర్తయ్యింది. ఫస్ట్ సాంగ్‌తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం`` అని తెలిపారు. -
జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ బయటకు?
తెలుగు బుల్లితెరపై కొన్నేళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్న కామెడీ షో జబర్దస్త్ . ఈ షో తరువాత వేరే చానళ్లలో పలు కామెడీ ప్రోగ్రామ్‌లు వచ్చినప్పటికీ దీనిని బీట్ చేయలేకపోయాయి. ఇందులోని కమెడియన్స్‌కు కూడా షో మంచి పేరును తీసుకొచ్చింది. వారానికి రెండు రోజులు వచ్చే ఈ షో(జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్) నుంచి లక్షలు సంపాదిస్తున్న నటులూ ఉన్నారు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ ముందు వరుసలో ఉంటాడు. కేవలం సుధీర్ స్కిట్స్ కోసమే ఎక్స్ట్రా జబర్ధస్త్ చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చదవండి: అనారోగ్యంతో బిగ్‌బాస్‌కు జెస్సీ గుడ్‌బై జబర్దస్త్ కామెడీ షోకి ఎంతో మంది వచ్చారు వెళ్లిపోయారు. కానీ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుడిగాలి సుధీర్ జబర్దస్త్‌లోనే కొనసాగుతున్నాడు. సుధీర్‌తోపాటు తన టీం సభ్యులైన ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కూడా అతని వెంటే ఉన్నారు. ఇటు షోలు చేస్తూనే సమయం కుదిరినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తున్నాడు. వేరే కామెడీ షోలలో ఆఫర్లు వచ్చినా వాటిని రిజక్ట్ చేసేవాడే కానీ జబర్దస్త్‌ను మాత్రం వదల్లేదు. అయితే ప్రస్తుతం సుధీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. చదవండి: సుడిగాలి సుధీర్ పెళ్లి.. యువతి ఎవరంటే..! త్వరలోనే సుధీర్ జబర్దస్త్ నుంచి బయటకి వచ్చేస్తాడని ప్రచారం గట్టిగానే జరుతుంది. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అతి త్వరలోనే సుధీర్ జబర్దస్త్ జర్నీకి శుభం కార్డ్ పడనుందని టాక్ వినిపిస్తోంది. అయితే సడెన్‌గా సుధీర్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో సరిగా తెలియదు కానీ ఇకపై షోలో తను కొనసాగేందుకు అతను ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం హీరోగా సుధీర్ మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటితోపాటు కమెడియన్‌గా కూడా చాలా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఇటు షో అటు సినిమా.. రెండు బ్యాలెన్స్ చేయడం కుదరకపోవడంతో తన అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. చదవండి: షూటింగ్ గ్యాప్‌లో ఇలా రచ్చ చేసిన విజయ్, పూరీ అయితే సుధీర్ బయటకు వస్తే అతను లేని జబర్దస్త్ ఊహించడం చాలా కష్టం. ఇప్పుడు అతను వెళ్లిపోతే కచ్చితంగా అతనితో పాటు గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీం పూర్తిగా మాయమవుతుంది. లేదా సుధీర్ వెళ్లిపోతే.. శ్రీను, రాంప్రసాద్‌లో ఒకరు టీం లీడర్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా సుధీర్ వెళ్లిపోతే మాత్రం కచ్చితంగా షో టీఆర్పీ రేటింగ్స్‌పై మరింత ప్రభావం చూపిస్తుంది. ఇదిలా ఉండగా ఈ విషయంపై సుధీర్ ఇప్పటి వరకు స్పందించలేదు. అతని నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
సుడిగాలి సుధీర్ పెళ్లి.. యువతి ఎవరంటే..!
ఓ కామెడీ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.సుధీర్ పెళ్లిపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సుధీర్ మాత్రం యాంకర్, నటి రష్మీ పై మనసు పారేసుకున్నాడని అందుకే పెళ్లిని వాయిదా వేస్తున్నాడనే వార్తలు చాలా కాలంగా నెట్టింట షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా సుధీర్ పెళ్లిపై అతడి స్నేహితులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను మాత్రం కాస్త సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. (చదవండి: ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను.. సాయితేజ్ ఎమోషనల్ ట్వీట్) తన వయస్సు ఇప్పటికే 34 ఏళ్ళు దాటిపోవడంతో వెంటనే సుధీర్ పెళ్లి సంబంధాల వేటలో పడిపోయినట్టు తెలిసింది. తాజాగా తమ ఫ్యామిలీకి చెందిన అత్యంత సన్నిహితుల ద్వారా ఓ సంబంధం కుదిరినట్లు తెలుస్తోంది. ఆ సంబంధం సుధీర్‌కు బాగా నచ్చి ఓకే కూడా చెప్పేసినట్లు కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇక అమ్మాయి కూడా సుధీర్ సొంత జిల్లాకు చెందిన యువతే అని తెలుస్తోంది. అయితే దీనిపై సుధీర్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
సుడిగాలి సుధీర్ ఇంట్లో విషాదం
Coronavirus: కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఎవరిని వదలడం లేదు ఈ ప్రాణాంతక మహమ్మారి. వందలాది సినీ ప్రముఖులను పొట్టన పెట్టుకుంది. టాలీవుడ్ నటులు, దర్శకులు, రచయితలు ఇలా చాలా మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. తాజాగా కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇంట్లో విషాదాన్ని నింపింది. కరోనాతో ఇటీవల సుడిగాలి సుధీర్ అమ్మమ్మ మృతి చెందింది. ఈ విషయాన్ని ఓ కామెడీ షోలో ఆటో రాంప్రసాద్ వెల్లడించాడు. అమ్మమ్మ చనిపోయినా సుధీర్ వెల్లలేకపోయాడని, చివరి చూపులు కూడా దక్కలేదని రాంప్రసాద్ తెలిపాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న సుధీర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
తుళ్లూరు మాజీ తహసీల్దార్ సుధీర్ అరెస్టు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాజధాని అమరావతి గ్రామాల పరిధిలో భూముల రికార్డుల తారుమారు కేసులో గుంటూరు జిల్లా తుళ్లూరు మండల మాజీ తహసీల్దార్ అన్నే సుధీర్ బాబును, రియల్ ఎస్టేట్ వ్యాపారి, విజయవాడలో ఎం అండ్ ఎం వస్త్ర దుకాణ యజమాని గుమ్మడి సురేష్‌ను బుధవారం తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి అరెస్టు చేశారు. వీరిద్దరిని మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వీవీఎన్‌వీ లక్ష్మి ఎదుట హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో నిందితులను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. అనేక అవకతవకలు, అక్రమాలు.. ► రాజధాని నిర్మాణం పేరిట 29 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాలను గత టీడీపీ సర్కార్ సేకరించిన సంగతి తెలిసిందే. ► తమ భూములను టీడీపీ పెద్దలు, వారి సన్నిహితులు అక్రమంగా తీసుకున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర పేద వర్గాలు ఫిర్యాదులు చేశాయి. ► తుళ్లూరు మండలం రాయపూడి పంచాయతీ పరిధిలోని పెదలంకలో సర్వే నంబర్ 376/2ఎలో 3.70 ఎకరాలను 1975లో నాటి ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్ కింద ఎస్సీలకు పంపిణీ చేసింది. ► లబ్ధిదారుల్లో యలమంచిలి సూరయ్య, ఆయన కుమారులు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో తహసీల్దార్‌గా పనిచేసిన సుధీర్ బాబు వీరికి చెందిన అసైన్డ్ భూమిని పట్టా భూమిగా మార్పు చేసి ఆన్లైన్ ద్వారా వెబ్ ల్యాండ్‌లోకి ఎక్కించారు. తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారి గుమ్మడి సురేష్ 86 సెంట్ల భూమిని అసైనీల నుంచి కొనుగోలు చేసి వల్లూరి శ్రీనివాసబాబు అనే వ్యక్తికి విక్రయించాడు. ► సుధీర్ బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారితో కుమ్మక్కై రెవెన్యూ రికార్డులను ఇష్టానుసారం తారుమారు చేయడం, భూమిని ల్యాండ్‌పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇవ్వడం చేశారని విచారణాధికారుల పరిశీలనలో వెల్లడైంది. గతంలో ఆర్డీవోగా పనిచేసిన వ్యక్తి పరోక్ష సహకారం కూడా ఉందని అంచనాకు వచ్చారు. ► ఈ మోసాన్ని ఆ తర్వాత తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన పూర్ణచంద్రరావు గుర్తించి కలెక్టర్‌కు నివేదించారు. ► రాజధాని గ్రామాలైన అనంతవరం, నేలపాడు, వెలగపూడి, రాయపూడి, పెదలంక తదితర గ్రామాల్లోని మరో తొమ్మిది సర్వే నంబర్లలోని రికార్డులు కూడా తారుమారయ్యాయని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. -
3 మంకీస్ టీమ్‌తో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ
-
త్రీ మంకీస్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్
-
‘సాఫ్ట్వేర్ సుధీర్’ ప్రీ రిలీజ్ వేడుక
-
ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు..
బంజారాహిల్స్: వారంతా బుల్లి తెరపై మెరిసి ఆ తర్వాత వెండితెరపై మైమరపిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. టీవీ నటులుగా వెలుగొందిన అనంతరం చలనచిత్రాలపై దృష్టి సారించి ఔరా అనిపిస్తున్నారు. ఒకప్పుడు వెండితెరపై కనిపించాలంటే నాటకాల్లో నటించి.. ప్రతిభను కనబరిచి సినిమా అవకాశాల్లోకి వచ్చేవారు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, సూర్యకాంతం, నాగభూషణం, రావుగోపాలరావు తదితర మేటి నటీనటులు నాటకాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపి సినిమాల్లోకి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన కృష్ణ, శోభన్‌బాబు తదితరులతో పాటు మెగాస్టార్ చిరంజీవి అప్పటి మద్రాస్ పాండీబజార్లో సినిమా కార్యాలయాల చుట్టూ తిరిగి తమ ప్రతిభను చాటి అవకాశాలు తెచ్చుకున్నారు. 2000 సంవత్సరం తర్వాత కూడా ఒక వెలుగు వెలిగిన నటులంతా చెన్నైలో సినిమా అవకాశాల కోసం తిరిగి దర్శకులను ఒప్పించి, మెప్పించి తారలుగా వెలుగొందారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమాల్లో అవకాశాల కోసం బుల్లితెరను నమ్ముకుంటున్నారు. వెండితెరపై వెలగాలంటే ముందుగా బుల్లితెరను మెప్పించాల్సి ఉంటోంది. టీవీల్లో ఒకవైపు సీరియళ్లు, ఇంకోవైపు షోలలో అలరిస్తూ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. పలు టీవీ చానళ్లు నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా చాలా మంది యువతీ యువకులు వెండితెరపై వెలిగిపోతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే నాటి నాటకాల వేదికలే ఇప్పుడు బుల్లితెరలుగా మారాయి. టీవీషోలకు దూరం కాలేదు.. ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు సినిమాల్లో చాన్సులు కొట్టేస్తున్నారు కొందరు నటులు. సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కదా అని వీరు టీవీలను మాత్రం వదలడం లేదు. యాంకర్ రష్మీ రెండు సినిమాల్లో హీరోయిన్గా నటించినా బుల్లితెరను మాత్రం వదులుకోలేదు. పాటల్లో నటించే అవకాశం వచ్చినా అనసూయ కూడా యాంకర్‌గా, ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్ ఏకంగా హీరోగా చేస్తున్నా తాను నమ్ముకున్న టీవీని మాత్రం వదులుకోలేదు. ఇప్పుడిప్పుడే మరింత మంది టీవీనటులకు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ముందుగా టీవీ షోలలో మెప్పించి ఆ తర్వాత సినిమా స్క్రీన్లపై కనిపించేందుకు చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. నవ్విస్తూ.. మెప్పిస్తూ.. బుల్లితెరపై సందడి చేస్తున్న ప్రముఖ హాస్యనటులు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, యాంకర్ రవితో పాటు రష్మీ, హీరో హీరోయిన్లుగా వెండితెరపై ప్రేక్షకుల్ని మెప్పించారు. వీరికి బుల్లితెర అనే వేదిక లేకపోతే వెండితెర ఏమాత్రం పరిచయం కాకపోయి ఉండేది. టీవీల్లో హాస్య ప్రధానంగా వస్తున్న కార్యక్రమం ద్వారా మహేష్ అనే నటుడు ఏకంగా రామ్‌చరణ్ తేజ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో మంచి చాన్స్ కొట్టేసి ఇప్పుడు బిజీగా మారాడు. మాటీవీలో సందడి చేసిన బిగ్‌బాస్ సీజన్– 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఏకంగా రంగమార్తాండ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకుడు కాగా జీవితా రాజశేఖర్ కూతురు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక యాంకర్‌గా ఒక వెలుగు వెలుగుతున్న అనసూయ భరద్వాజ్ కూడా బుల్లితెరపై మెప్పించి పలు సినిమాల్లో కూడా నటించారు. సుడిగాలి సుధీర్ హీరోగా సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమా దాదాపుగా పూర్తి కావచ్చింది. మేడమీద అబ్బాయి అనే సినిమాలో హైపర్ ఆది సెకండ్ హీరోగా నటించారు. యాంకర్ శ్రీముఖి కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. చలాకీ చంటి, చమ్మక్‌చంద్ర, రాకెట్ రాఘవ, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్, అప్పారావు తదితరులు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. టీవీషోల ద్వారానే వీరందరికీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయనడంతో సందేహంలేదు. రంగస్థలం సినిమాలో రామ్‌చరణ్‌తో నటించిన టీవీ నటుడు మహేష్ -
ఫిల్మ్ చాంబర్లోకి రానిస్తారా? అనుకున్నా
‘జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి టెలివిజన్ షోస్ ద్వారా ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్’. ‘రాజుగారి గది’ ఫేమ్ ధన్యా బాలకృష్ణ హీరోయిన్. రాజశేఖర్ రెడ్డి పులిచర్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పారిశ్రామికవేత్త కె.శేఖర్ రాజు నిర్మించారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ– ‘‘ఒక ట్రెండీ కంటెంట్‌తో సాఫ్ట్వేర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిది. వినోదంతో పాటు వాణిజ్య అంశాలున్నాయి. సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది. సుధీర్ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక ఫీస్ట్‌లా ఉంటుంది’’ అన్నారు. ‘‘సుధీర్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఒప్పుకున్నాను’’ అన్నారు ధన్యా బాలకృష్ణ. ‘‘నాకిది మొదటి సినిమా అయినా పూర్తి సహకారం అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. మా సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు కె. శేఖర్ రాజు. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ– ‘‘పదేళ్ల కిందట హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ చాంబర్ ముందుగా వెళ్తూ.. మనల్ని లోపలికి రానిస్తారా? లేదా? అనుకున్నాను. అలాం టిది ఇవాళ నా ఫస్ట్ సినిమా ప్రెస్‌మీట్ ఇక్కడ జరగడానికి ఆ దేవుడు, మా అమ్మానాన్నల ఆశీర్వాదమే కారణం అనుకుంటున్నాను. మార్చి 20న నా రెండు సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. నాకు ఇష్టమైన రజినీకాంత్, పవన్ కల్యాణ్గార్లను ‘సాఫ్ట్వేర్ సుధీర్’ చిత్రంలో అనుకరించా’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
నవ్వించి ఏడిపిస్తాం
‘‘ఆ ముగ్గురి కామెడీ చూస్తే నాకు ఎనర్జీ వస్తుంది. నా ఐప్యాడ్‌లో ఎప్పుడూ వీళ్లు చేసిన స్కిట్స్ ఉంటాయి’’ అన్నారు ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి. ‘జబర్దస్త్’ ఫేమ్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్‌ప్రసాద్ హీరోలుగా నటించిన చిత్రం ‘త్రీ మంకీస్’. కారుణ్య చౌదరి కథానాయిక. ఓరుగుల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్‌కుమార్ జి. దర్శకత్వంలో నగేశ్ జి. నిర్మించారు. ఈ చిత్రం లోగో, ఫస్ట్ లుక్‌ను శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నటుడు, నిర్మాత నాగబాబు ఆవిష్కరించారు. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆవకాయ, పప్పు, నెయ్యి కలిస్తే ఎంత టేస్ట్ ఉంటుందో వీరి కామెడీ అలా ఉంటుంది. టెన్షలో ఉన్నప్పుడు, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు వీరి స్కిట్స్ చూస్తాను. ‘చిత్రం భళారే విచిత్రం’, ‘అహ నా పెళ్లంట’, ‘ప్రేమకథా చిత్రం’లా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నాగబాబు మాట్లాడుతూ– ‘‘రిస్క్ అనుకోకుండా ఈ ముగ్గురిపై ఫోకస్ పెట్టి సినిమా తీసిన దర్శక, నిర్మాతలకు నా అభినందన లు. గెటప్ శ్రీను వజ్రం లాంటి ఆర్టిస్ట్. 90 రకాల గెటప్‌లతో రకరకాల బాడీ లాంగ్వేజెస్‌తో అతను అలరిస్తాడు’’ అన్నారు. ‘‘అందరినీ పక్కాగా నవ్విస్తాం’’ అని గెటప్ శ్రీను, రామ్‌ప్రసాద్ అన్నారు. ‘‘ఫస్టాఫ్‌లో నవ్విస్తాం, సెకండాఫ్‌లో ఏడిపిస్తాం’ అని సుడిగాలి సుధీర్ అన్నారు. ‘‘స్క్రిప్ట్‌ను నమ్మి చేసిన చిత్రం ఇది’’ అన్నారు అనిల్ కుమార్. ‘‘స్క్రిప్ట్ వినగానే ఆ ముగ్గురితోనే సినిమా చేయాలని పట్టుబట్టి ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు నిర్మాత నగేశ్. -
మేము సైతం అంటున్న యాంకర్లు...
అనాథలకు అన్నం పెట్టడం, పేదలకు సాయం చేయడం, వికలాంగులకు ఊతమివ్వడం, సమాజానికి చేతనైన సేవ చేయడం... ఇవన్నీ చేయాలంటే బోలెడంత డబ్బుండాలి... అది నిజమే కావచ్చు కానీ సేవ చేయాలన్న దృఢ సంకల్పం, ఆ సంకల్పాన్ని నిలబెట్టుకోవాలన్న సహృదయం ఉంటే చాలు... ఆ సేవను చూసి తోటివాళ్లు ముందుకు వస్తారని నిరూపిస్తున్నాడు శరత్.బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని కిస్మత్పూర్లో నివసించే శరత్‌కుమార్ కొండగడుపులో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆర్థికంగా అంత బలంగా లేకపోయినా, ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలనే తపన బలంగా ఉండేది. ఒక బాలికను దత్తత తీసుకుని... తన గల్లీలో ఉండే ఇంటికి పెద్ద దిక్కు అయిన ఓ బాలిక తండ్రి 2011లో చనిపోయాడు. ఇది చూసిన శరత్ ఆ బాలికను దత్తత తీసుకుని స్కూల్లో చేర్పించాడు. ఆమె చదువుకు అయ్యే ఖర్చు తానే భరించాడు. ఆ బాలిక దత్తతతో మొదలైన తన ప్రస్థానం ఇంకెందరికో సాయపడేలా సాగింది. ఇలా సాగిపోతున్న తనకు ఒక ఆలోచన వచ్చింది. ‘నాలాగా ఆలోచించే వాళ్లను ఒక బృందంగా చేసుకుని నేనెందుకు ఒక ఎన్జీఓను ప్రారంభించకూడదు?’అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. ఒక ఎన్జీఓను నడపడం అంత సులువేమీ కాదని శరత్‌కు తెలుసు కాని ఒక సంవత్సరం పాటు దానిపై కసరత్తు చేసి నిస్వార్థంగా ఎన్జీఓను ఎలా నడపాలనే దానిపై అవగాహన పెంచుకున్నాడు. తల్లిదండ్రుల అనుమతితో ‘ది సహృదయ్ స్వచ్ఛంద సంస్థ’ ను ప్రారంభించాడు. సాక్షి దినపత్రికలో వచ్చిన ఓ కథనంతో మొదలైంది... ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడిపై సాక్షి దినపత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. రెండుకిడ్నీలు ఫెయిలైన ఇమ్రాన్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సకు అయ్యే ఖర్చు కోసం దాతల సాయం కావాలన్న ఆ కథనాన్ని చదివిన శరత్ వెంటనే ఆ పేపర్ క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఇమ్రాన్ తల్లిదండ్రులను కలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే మందుల కోసం తన వంతుగా రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని అందించాడు. సేవాభావం గల తన స్నేహితుల సాయంతో మరికొంత సాయం చేశాడు. అది తన మనసుకెంతో తృప్తిని ఇవ్వడంతో వైద్యులతో మాట్లాడి చికిత్స చేస్తే బతికే అవకాశాలున్న రోగులకు దాతల నుంచి సాయం అందేలా చూడటం ప్రారంభించాడు. శరత్‌తోపాటు తన బృందంలోని సభ్యులు వివిధ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకునే స్థోమత లేని రోగులకు సాయం చేయడం మొదలు పెట్టాడు. శరత్ బృందానికి కేటీఆర్ ఏ సాయం కావాలన్నా చేస్తా అని హామీ ఇవ్వడంతో ఆయన ద్వారా ఎంతోమందికి సేవలందిస్తున్నారు. ఇప్పటివరకు కేటీఆర్ సాయంతో 26 మంది ప్రాణాలను కాపాడినట్లు శరత్ తెలిపారు. కేటీఆర్ తమ ఫౌండేషన్‌కు ఎంతో అండగా నిలిచారని పేర్కొన్నారు. ఫోన్ చేస్తే రక్తం దానం... రోగులకు రక్తం కావాలని ఫలానా గ్రూప్ రక్తం కావాలని ఈ ఫౌండేషన్‌ను సంప్రదించే వాళ్లు. ఇది దృష్టిలో పెట్టుకుని ఫౌండేషన్ వలంటీర్ల బ్లడ్ గ్రూప్ వివరాలను సేకరించి పొందుపరిచారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో వలంటీర్లు రోగుల వివరాలు తెలుసుకుని రక్తదానం చేస్తున్నారు. అంతేకాకుండా బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వలంటీర్లు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం. హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు విస్తరణ... 2017లో శరత్ స్థాపించిన ‘ది సహృదయ్ ఫౌండేషన్’ 23 మంది వలంటీర్లతో హైదరాబాద్‌లో తమ సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. తెలంగాణలోని అన్ని జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాలలో తమ సేవలను అందిస్తున్నారు. మరింత మందికి సేవలందించాలనే ఉద్దేశంతో ఆ తర్వాత తమిళ్నాడు, కర్నాటక, యూపీ, ఎంపీ, ఢిల్లీ, అస్సాం, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, మణిపూర్ రాష్ట్రాలలో సహృదయ ఫౌండేషన్ బృందాలు పని చేస్తున్నాయి. విదేశాలలోనూ ఫౌండేషన్ బృందాలు... యూఎస్ఏ, రష్యా, ఆస్ట్రేలియా, మలేసియా, ఇండోనేసియా, ఫిలిఫైన్స్, ఇటలీ, ఉక్రెయిన్ వంటి దేశాలలో తమ బృందాలు పని చేస్తున్నాయని శరత్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 5000మంది వలంటీర్లు ఉన్నారని పేర్కొన్నారు. మేము సైతం అంటున్న యాంకర్లు... శరత్ చేస్తున్న సేవల గురించి తెలిసిన యాంకర్ ప్రదీప్, విష్ణుప్రియ, సుడిగాలి సుధీర్ తల్లి కూడా స్వచ్ఛందంగా తమ వంతు తోడ్పాటును అందిస్తున్నారు.– సచిన్ విశ్వకర్మ, సాక్షి, హైదరాబాద్ -
కథనం హైలైట్
‘పైసామే పరమాత్మ’ అన్నది సామెత. ఇప్పుడు ‘పైసా పరమాత్మ’ అనే పేరుతో ఓ సినిమా రూపొందింది. సంకేత్, సుధీర్, క్రిష్ణ తేజ, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష ముఖ్య తారలుగా విజయ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై టి.కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కిరణ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. కథపై నమ్మకంతో తెరకెక్కించాం. నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా విజయ్ కిరణ్ చక్కగా తీశారు. మా సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘యూత్, ఫ్యామిలీస్ మెచ్చే ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథనం హైలైట్‌గా ఉంటుంది. రామ్ పైడిశెట్టి సాహిత్యం, కనిష్క్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి’’ అని విజయ్ కిరణ్ అన్నారు. -
కొత్త ప్రేమ
కార్తికేయ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తొలి చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. సుధీర్, ఆద్యా ఠాగూర్, అదితి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రణయ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు ప్రణయ్ మాట్లాడుతూ– ‘‘న్యూ జనరేషన్ లవ్ అండ్ లైఫ్ స్టోరీ ఇది. కొన్ని రిఫరెన్స్‌లను దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేసుకున్నాను. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. హీరో సుధీర్ మాట్లాడుతూ– ‘‘టీవీ సీరియల్స్‌లో బాలనటునిగా నటించాను. హీరోగా ఇది నా తొలి చిత్రం. ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: విఠల్, కెమెరా: కుషేందర్, రచనా సహకారం: మదన్ మోహన్. -
అవును..‘ఆ’ ముద్ర పడిపోయింది : రష్మీ
సాక్షి, సిటీబ్యూరో :ఆమె బుల్లి తెరపై చిన్న దుస్తులకు తెరలేపారు. వెండితెరపైనా వన్నె చిన్నెలు ఆరబోశారు. నటిగా పరిచయమైనా గ్లామర్ తారగానే రాణిస్తున్నారు. టీవీ వీక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు... సినీ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తగాపరిచయమయ్యే అందాల హోరు... రష్మీ గౌతమ్. గత కొంతకాలంగా హాట్ స్టార్ ఇమేజ్ను సినిమా సినిమాకీ పెంచుకుంటూ పోతున్న రేష్మీ... ఇప్పుడు ‘అంతకు మించి’ హీట్పంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం సండే సెలబ్రిటీ రష్మీ ‘సాక్షి’తో పంచుకున్న ముచ్చట్లివీ... ? సుధీర్ విషయంలో రూమర్లపై మీ స్పందన. మీరే అంటున్నారు కదా రూమర్ అని. అదే నా సమాధానం. మేము కలిసి నటించాం. సహ నటీనటులం. అంతే.. అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి చెప్పడానికి కూడా ఏమీ లేదు. ? పెళ్లి టైమ్ వచ్చిందా. తాతగారు అంటారు... చావు, పెళ్లి రెండూ చెప్పిరావు. అవి వచ్చే టైమ్ వస్తే ఆపలేం అని. చూద్దాం రానివ్వండి. ? మీ తాజా చిత్రం గురించి... ‘అంతకు మించి’ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ మూవీ. హారర్, గ్లామర్ రెండూ పుష్కలంగానే ఉంటా యి. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది నాకు థర్డ్ హారర్ మూవీ. ? ఎలాగైతేనేం సెక్స్ సింబల్ సాధించారు. అవును.. ఆ ముద్ర పడిపోయింది. అయితే ఆ ముద్ర కావాలని నేను డెలిబరేట్‌గా చేయలేదు. కళాకారులుగా మేము ప్రయోగాలు చేయాలనుకుంటాం. మొదట్లో కరెంట్, ప్రస్థానం లాంటి సినిమాలు చేశాను. అప్పటి నుంచి అన్నీ అలాంటి సైడ్ రోల్స్, ఫ్రెండ్ క్యారెక్టర్స్ వచ్చాయి. అంటే నా గ్రోత్ అక్కడితో ఆగిపోయింది. సినిమాల్లోకి ఎవరైనా లీడ్ రోల్స్ చేయాలనే వస్తారు. కొందరికి కుదురుతుంది. కొందరికి కుదరదు. అంతమాత్రానా ఆగిపోవాలనుకోరుగా... నేనూ అలాగే వచ్చాను. కానీ ఇండస్ట్రీలో ఎవరూ తెలిసిన వారు లేరు. దీంతో వచ్చిన ఆఫర్లు వచ్చినట్టు చేసుకుంటూ వెళ్లాను. తొలి సినిమాల తర్వాత అలా కాదని, డిఫరెంట్‌గా ఉందని ‘గుంటూర్ టాకీస్’ ట్రై చేశాను. అది క్లిక్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లామర్ అనేది త్వరగా ఎక్కుతుంది. ఆర్టిస్ట్‌గా నేను ప్రయత్నించాను. అవి క్లిక్ కాలేదు. ఇలా క్లిక్ అయిపోయింది. కరెంట్, ప్రస్థానం సినిమా టైమ్‌లో ఆ స్టాంప్ పడిపోయింది. ఇప్పుడు ఈ స్టాంప్ పడింది. ? మరి ఆ ముద్ర నుంచి బయటకు రావాలని లేదా. ఈ స్టాంప్ నుంచి బయటకు రావడానికి నేనేమీ ప్రయత్నం చేయడం లేదు. నా మీద నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టి సినిమాలు నిర్మించే నిర్మాతకు డబ్బులు రావాలి. వాళ్లు సేఫ్‌గా ఉండాలి. అలా జరగాలంటే నాకు వీలైనంతగా నావైపు నుంచి సహకారం అందించాలి. హారర్, గ్లామర్ డోస్ ఉండే సినిమాలు మాస్‌కి నచ్చుతాయి. ఆ స్టాంప్ నుంచి బయటకు రావాలని కాకపోయినా... కొత్తగా కనపడాలనే ప్రయత్నమైతే కచ్చితంగా చేస్తాను. అందుకే ఈ సినిమా అయిపోయాక ఇకపై హారర్ మూవీ చేయనని డిసైడ్ అయిపోయాను. ? ప్రస్తుతం జర్నీ ఎలా ఉంది. చాలా బాగుందండీ. అటు సినిమా, ఇటు టీవీ, ఇంకా పబ్లిక్ ఈవెంట్లు. కాకపోతే ఇండస్ట్రీలో సినిమా సినిమాకు కాస్త గ్యాప్ వస్తే చాలు... ఏమిటి సినిమాల్లేవా అంటూ అడుగుతారు. అరె.. నేను వారానికి రెండుసార్లు టీవీలో, ఈవెంట్లలో కనిపిస్తూనే ఉన్నాను. అయినా అలా అనేస్తుంటారు. ? టీవీల్లోనూ పొట్టి దుస్తుల ట్రెండ్ సెట్టర్ మీరే కదా. థ్యాంక్స్ అండీ. టీవీ షోస్‌లో కూడా మేమేమీ కావాలని అనుకొని చేయలేదు. కొత్తదనం కోసం కొన్ని ప్రయోగాలు చేస్తాం. ఆడియన్స్ యాక్సప్టెన్స్ని బట్టి మా నెక్టŠస్ స్టెప్ ఉంటుంది. మీరే అన్నారుగా.. ట్రెండ్ సెట్టర్ అని. ఇప్పుడు టీవీలో చాలామంది పొట్టి డ్రెస్సులు వేసుకుంటున్నారు. అంటే అది చూసే వారికి నచ్చుతుందనేగా. గతంలో టీవీ అంటే చిన్న చూపు ఉండేది. (అయితే ఇప్పుడు చిన్న డ్రెస్సింగ్ చూపు వచ్చిందంటారా? అని అడిగితే... ఆ అవును అంటూ నవ్వులు). ఇది టూ సైడెడ్ థింగ్. ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లయ్.. అంతే. ? మీ హాబీలు, ఫిట్నెస్ వర్కవుట్. పర్సనల్ హాబీలన్నీ ప్రొఫెషన్స్ అయిపోయాయి. స్విమ్మింగ్ అనుకున్నా.. డ్యాన్స్ అనుకున్నా... అవన్నీ సినిమాల్లో చేస్తున్నాను. గార్డెనింగ్ బాగా ఇష్టం. ఇక ఫిట్నెస్ కోసం యోగా రెగ్యులర్‌గా చేస్తుంటాను. ? హైదరాబాద్‌లో సెటిలైనట్టేనా.. నాకొక బేస్ లేదు. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో మూవీస్ చేస్తున్నాను. ప్రస్తుతం వైజాగ్‌లో ఫ్యామిలీ ఉంటోంది. నేను తరచూ ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీలో ఉండాలంటే హైదరాబాద్‌లో ఉండాలి. గతంలో వైజాగ్ నుంచి వస్తూ.. వెళ్తూ ట్రై చేశాను. ముంబై నుంచి ఫ్లైట్ టికెట్ ఇవ్వాలంటే ఓకే.. కానీ వైజాగ్ నుంచి కొంచెం కష్టం. ? ఇప్పుడు కొందరికి సక్సెస్ చాలా తేలిగ్గా వచ్చేస్తున్నట్టుంది. ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఓవర్‌నైట్ స్టార్స్ బాగా వచ్చేస్తున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియా... చాలా ఎక్స్పోజర్ వచ్చేసింది. ఒకప్పుడు సినిమా, టీవీలో చూస్తే చూసినట్టు లేకపోతే లేదు. ఇప్పుడు అలా అని లేదు. చాలా ప్లాట్‌ఫామ్స్ వచ్చేశాయి. ? రేష్మీ అంటే కేవలం గ్లామరేనా? అంతకు మించి ఉందా! లేదు.. అంతకు మించి ఉంది. దీనిని నేను నమ్ముతున్నాను. మీరూ నమ్మండి. అన్ని భాషల్లో కలిపి నేను 25కు పైగా సినిమాలు చేశాను. ప్రస్థానం, కండైన్ (తమిళం), గురు (కన్నడ) సినిమాలకు, యువ సీరియల్‌కు నాకు ఎంతో మంచి పేరొచ్చింది. నా మీద, నా ప్రతిభ మీద నమ్మకం ఉంది.. కాబట్టే నేను ఇండస్ట్రీలో ఉండగల్గుతున్నాను. ? అమ్మాయిలు కొన్ని పనులు చేస్తే పైకి వస్తారా? ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఎక్కడైనా సరే... సక్సెస్ఫుల్, తనకంటూ ఒక మార్కు వేసిన ప్రతి అమ్మాయి విషయంలో ఇలాంటి దురభిప్రాయం చాలా మందిలో చూస్తున్నాను. సినిమాల్లో అయితే ఏముందీ... ఎక్స్పోజ్ చేసి వచ్చింది. వీరితో పడుకుంది.. వారితో పడుకుందీ.. అందుకే అలా పైకి వచ్చేసింది అంటూ ఈజీగా అనేస్తుంటారు. కానీ ఎవరైనా సరే ప్రతిభ ఉంటేనే రాణిస్తారు. అంతే తప్ప పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎవరూ పైకి రాలేరు. -
ఈజీ మనీ కోసం...
‘‘పైసా పరమాత్మ’ టైటిల్, పోస్టర్ చాలా బాగున్నాయి. కథను దర్శకుడు విజయ్ నాకు చెప్పారు. చాలా కొత్తగా ఉందనిపించింది. ప్రతిభ ఉన్నవారు కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు రావాలి. కొత్త కంటెంట్‌తో డిఫరెంట్‌గా తీస్తే ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఆ విషయం ‘గూఢచారి’ చిత్రంతో మరోసారి రుజువైంది’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. సంకేత్, సుధీర్, కృష్ణతేజ, రమణ, అనూష, ఆరోహి నాయుడు, బనీష ప్రధాన పాత్రల్లో విజయ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పైసా పరమాత్మ’. లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై విజయ్ జగత్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ని రాజ్ కందుకూరి విడుదల చే శారు. విజయ్ కిరణ్ మాట్లాడుతూ –‘‘ఈజీ మనీ కోసం దొంగతనాలు, మోసాలు చేస్తోన్న ఓ నలుగురు కుర్రాళ్లు, ఇద్దరు యువతులు అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటారు. ఆ సమస్య నుంచి వారు బయట పడ్డారా? లేదా? అన్నది ముఖ్య కథాంశం’’ అన్నారు. -
కాషాయదళం చేతిలో ఎర్రకార్డు
బాధ్యత గల ఒక కేంద్రమంత్రి మీడియాలో నక్సల్స్ ఉనికి ఉందంటూ తన కుట్ర సిద్ధాంతాన్ని ఆ వ్యవస్థకు ఎలా అంటగడతారు? నా ఆలోచన ప్రకారం భయోత్పాతాన్ని సృష్టించడానికి తీసుకునే చర్యలలో ఇది మొదటిది. రెండవది.. కొందరు వ్యక్తుల మీద ముద్రలు వేయడం, వారిని అపకీర్తి పాలుచేయడం. గడచిన వారం అరెస్టయిన వారంతా ఏ తరహా వ్యక్తులో ఒకసారి పరిశీలిస్తే ‘పట్టణ నక్సల్స్’ సిద్ధాంతాన్ని ముందుకు తేవడం వెనుక ఉన్న కారణం ఊహకు వస్తుంది. అలా అరెస్టయిన వారిలో వశీనాథన్ ఒకరు. ఆయన న్యాయవాది. ట్యుటికోరన్‌లోని స్టెరిలైట్ సంస్థకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వారికి న్యాయ సహాయం అందిస్తున్న వ్యక్తి ఆయనే. ‘భారత ప్రజాస్వామ్యానికి’ ‘సగం మావోయిస్టు’ ఎంత ప్రమాదకరంగా పరి ణమించాడో చెబుతూ కేంద్రంలో ఏ శాఖా లేని మంత్రి అరుణ్ జైట్లీ ఈ మాసారంభంలో మాట్లాడారు. అజ్ఞాతంలో ఉండి పనిచేసేవారికి ఇలాంటివారు జనజీవన స్రవంతిలో కనిపించే మారు రూపాలేనని కూడా జైట్లీ అభివర్ణించారు. ఎన్డీఏ మీద వ్యతిరేకత ఉన్న కొన్ని పార్టీలు మావోయిస్టును తమ ఆయుధంగా ఎలా చూస్తున్నారో కూడా జైట్లీ ట్వీట్ చేశారు. ఇలాంటి అవలక్షణాన్ని ప్రజలు గుర్తించవలసిన సమయం వచ్చిందని కూడా పేర్కొన్నారు. జీహా దీలు, మావోయిస్టులు రాహుల్ గాంధీ సానుభూతికి నోచుకున్నారంటూ గత వారంలో కూడా కేంద్రమంత్రి ఒక బ్లాగ్ ద్వారా విమర్శలు కురిపించారు. ఇదంతా రాజకీయ వేడి చల్లారిపోకుండా చూడడానికి చేస్తున్న పరోక్ష నింద కింద కనిపిస్తే దీని గురించి ఆలోచించవద్దు. కానీ ఎవరి మీదనైనా జీహాదీ అనుకూలురు, మావోయిస్టు అనుకూలురు అంటూ ముద్రలు వేయడం వెనక ఒక ఉద్దేశమే ఉంది. తద్వారా జాతి వ్యతిరేకులుగా కూడా ముద్ర వేయవచ్చు. అరుణ్ జైట్లీ ఆరోపణ హాస్యాస్పదమని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అభిప్రాయపడ్డారు. కానీ నేను ఈ రాజకీయ సంఘర్షణ గురించి పట్టించుకోను. కానీ, 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు దరిమిలా రెండు మాసాలలోనే ఆర్థిక సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా మావోయిస్టుల వెన్నెముకను ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా విరిచిందో మాత్రం నాకు గుర్తుకొచ్చింది. అదెలాగంటే మావోయిస్టులు తమ నిధులను అడవులలో దాచిపెడతారు. ఆ సొమ్మును వారు రద్దు దరిమిలా బ్యాంకులలో మదుపు చేయలేకపోయారు. అలాగే నోట్లను మార్చుకోలేకపోయారు కూడా. ఈ వాదన నిజమైతే ఇతర పార్టీలతో షరీకవుతూ భారత ప్రభుత్వానికి మావోయిస్టులు పెద్ద బెడదగా పరిణమించారంటూ జైట్లీ చేస్తున్న ఆరోపణ తర్కానికి నిలవదు. అందులో ఒకటి మాత్రమే నిజం కాగలదు. రాహుల్‌గాంధీని నేను సమర్థించకపోయినా, పార్టీ ఆయనను రక్షిస్తుంది. 2013 మే నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని దర్భా ఘాటీ దగ్గర జరిగిన దాడిలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖులను ఆ పార్టీ కోల్పోయింది. అలాంటి పార్టీని మావోయిస్టు అనుకూల పార్టీ అని పిలవడం పరోక్ష నింద మరీ పరాకాష్టకు చేరినట్టు ఉంది. 2004లోను తరువాత 2006లోను ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిభావంతంగా రాష్ట్రాన్ని మావోయిస్టు బెడద నుంచి విముక్తం చేసింది. అందుకు మంచి వ్యూహంతో, సమర్థులైన అధికారులతో ఉపయోగించారు. అలాంటి చరిత్ర కలిగిన పార్టీ ఇప్పుడు నక్సల్స్‌కు ప్రయోజనం చేకూరాలని కోరుతుందా? బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ ఒక్కరే మావోయిస్టుల పైన విరుచుకు పడుతున్నారని అనుకోనక్కరలేదు. అలాంటి ఆరోపణలు ఉగ్రవాదులతో నిండి ఉన్న తమిళనాడుకు చెందిన పొన్ రాధాకృష్ణన్ నాలుక అంచున ఒకటిన్నర సంవత్సరాలుగా నర్తిస్తూనే ఉన్నాయి. తమిళనాడులోని అన్నా డీఎంకే ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, రాష్ట్ర నిఘా వ్యవస్థలు కూడా తన ఆరోపణలను తీవ్రమైనవిగా పరిగణించడంలేదని కేంద్ర మంత్రి కూడా అయిన రాధాకృష్ణన్ వాపోతున్నారు. తాజాగా ఆయన ఆక్రోశం రైతుల మీద వ్యతిరేకత నుంచి, 277 కిలోమీటర్ల సేలం చెన్నై ఎనిమిది లేన్ల జాతీయ రహదారి మీదకి మళ్లినట్టు కనిపిస్తున్నది. ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల జాతీయ రహదారిని విస్తరించినప్పటికీ, తమ పొలాలను తీసుకుని దానిని ఎనిమిది లేన్ల గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిగా మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాల పట్ల రైతులంతా ఆగ్రహంతో ఉన్నారు. నక్సలైట్లు, మావోయిస్టులు, ముస్లిం ఉగ్రవాదులు, తమిళం పేరుతో వేర్పాటువాదాన్ని ప్రేరేపిస్తున్న ఉగ్రవాద ముఠాలు చాలా సంస్థలలోకి చొరబడ్డారని గడచిన వారంలోనే రాధాకృష్ణన్ విమర్శలు కురిపించారు. ఆయన ఇంకొక అడుగు వేసి ఇలాంటి వారు మీడియాలోకి చొరబడగలిగారని కూడా ఆరోపించారు. అన్ని పథకాలను పక్క దోవ పట్టించడానికే పెద్ద కుట్ర జరుగుతున్నదని ఆయన అంటున్నారు. కన్యాకుమారి నుంచి ఎన్నికైన ఈ ఎంపీ జల్లికట్టు నిరసనల మీద కూడా విమర్శలు చేశారు. 2017 జనవరిలో చెన్నైలోని మెరీనా బీచ్‌లో జరిగిన ఆందోళన ప్రజల నాడిని పసిగట్టేందుకు తీవ్రవాదులు చేసిన ఒక ప్రయోగమేనని అన్నారాయన. తీవ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించి అణచివేసేందుకు వీలుగా ప్రభుత్వం పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని కూడా ఎంపీ అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను కాపాడాలి గానీ తీవ్రవాదులను కాదని, అలాంటి ప్రభుత్వాల అవసరం ప్రజలకు లేదని ఆయన ప్రకటించారు. ఇంతకీ ఎళప్పాడి పళనిస్వామి ప్రభుత్వం రద్దవుతుందని రాధాకృష్ణన్ సూచనప్రాయంగా చెబుతున్నారా? రాధాకృష్ణన్ మాట లను తీవ్రమైనవిగా పరిగణించడం ఎందుకంటే, ఆయన నరేంద్ర మోదీ మంత్రిమండలిలో సభ్యుడు. ‘ఇలాంటి ప్రభుత్వాల అవసరం లేదు’ అని ఆయన ప్రకటించడం నాకు చాలా వింత అనిపించింది. తమిళనాడులో శాంతిభద్రతల పరిస్థితి డోలాయమానంగా మారిందన్న కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఆయన మాటలలో ప్రతిబింబిస్తున్నదా? ఆ రాష్ట్రాన్ని తీవ్రవాదులు ఏలుతున్నట్టు చెప్పే సమాచారం ఏదైనా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక సంస్థల ద్వారా సేకరించిందా? అయితే ఇలాంటి సమాచారం ఏదైనా ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వానికి అందచేయవలసిందని తమిళనాడు మంత్రి డి. జయకుమార్ రాధాకృష్ణన్‌ను కోరారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం తీవ్రవాదుల పని పట్టకపోతే, రాష్ట్రపతి కార్యాలయం స్పందించవలసి ఉంటుందన్న హెచ్చరిక కూడా రాధాకృష్ణన్ మాటలలో ఉందా? స్టెరిలైట్ వ్యతిరేకోద్యమకారులను, సేలం ఎక్స్‌ప్రెస్ వే వ్యతిరేకులను గడచిన రెండు వారాలుగా వరస పెట్టి అరెస్టు చేయడానికి కారణం ఇదేనా? అయితే ఒకటి. బాధ్యత గల ఒక కేంద్రమంత్రి మీడియాలో నక్సల్స్ ఉనికి ఉందంటూ తన కుట్ర సిద్ధాంతాన్ని ఆ వ్యవస్థకు ఎలా అంటగడతారు? నా ఆలోచన ప్రకారం భయోత్పాతాన్ని సృష్టించడానికి తీసుకునే చర్యలలో ఇది మొదటిది. తరువాత కొందరు వ్యక్తుల మీద ముద్రలు వేయడం, వారిని అపకీర్తి పాలుచేయడం. గడచిన వారం అరెస్టయిన వారంతా ఏ తరహా వ్యక్తులో ఒకసారి పరిశీలిస్తే ‘పట్టణ నక్సల్స్’ సిద్ధాంతాన్ని ముందుకు తేవడం వెనుక ఉన్న కారణం ఊహకు వస్తుంది. అలా అరెస్టయిన వారిలో వశీనాథన్ ఒకరు. ఆయన న్యాయవాది. ట్యుటికోరన్‌లోని స్టెరిలైట్ సంస్థకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వారికి న్యాయ సహాయం అందిస్తున్న వ్యక్తి ఆయనే. చెరువుల ఉద్యమకారుడు పీయూష్ మనుష్ (ప్రస్తుతం బెయిల్ మీద విడుదలయ్యారు), విద్యార్థి నాయకుడు వాల్రామతి, సేలం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న నటుడు మన్సూర్ అలీఖాన్‌లకు కూడా వశీనాథన్ న్యాయ సహాయం చేస్తున్నారు. 260 మంది స్టెరిలైట్ వ్యతిరేకోద్యమకారులను అరెస్టు చేసి, మే 22వ తేదీన జరిగిన హింసతో సంబంధం ఉన్నవారిగా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు. జాతీయ రహదారి కోసం తన భూమిని తీసుకోవడాన్ని వ్యతిరేకించే ప్రతి రైతును స్థానిక పోలీస్ స్టేషన్లో బంధిస్తున్నారు. నక్సలైట్లు సాధారణంగా అనధికార పంచాయతీల ద్వారా న్యాయం అందిస్తూ ఉంటారు. దురదృష్టం ఏమిటంటే సోషల్ మీడియాను ఉపయోగిం చడం ద్వారా అధికార వ్యవస్థ కూడా సరిగ్గా అదే పనిచేస్తున్నది. కొందరు వ్యక్తులకు పట్టణ నక్సల్స్ అంటూ, జాతి వ్యతిరేకులు అంటూ ముద్ర వేయడానికి ప్రధానంగా ట్వీటర్‌ను ఉపయోగిస్తున్నారు. పీయూష్‌ను డబ్బు గుంజే వ్యక్తిగా చిత్రీకరించారు. వాల్రామతిపై నక్సలైట్ అని ముద్ర వేశారు. వీరందరినీ వెనుక ఉండి నడిపించే వ్యక్తిగా వశీనాథన్ను పేర్కొంటున్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తిని అరెస్టు చేసే అధికారం ప్రభుత్వాలకు లేదని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. అయితే వ్యక్తులను అరెస్టు చేయడానికి అనుసరిస్తున్న పద్ధతులే కలవరం కలిగిస్తున్నాయి. ఆ అరెస్టులను గమనిస్తే, నిరసన వ్యక్తం చేస్తే చాలు నిర్బంధం తప్పదన్న సంకేతాలను ఇచ్చే విధంగా ఉన్నాయి. అయితే రెడ్ కారిడార్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో నక్సల్ అణచివేత చర్యలలో రెండు దశాబ్దాల పాటు పాలు పంచుకున్న ఒక ఐపీఎస్ అధికారి తమిళనాడులో నక్సల్ జాడలు లేవని చెప్పారు. అడపాదడపా జరిగే సంఘటనలను బట్టి తమిళనాడు–కేరళ జోన్లో నక్సల్స్ చొరబడ్డారని చెప్పడం రెడ్ కార్డును ఉపయోగించుకోవడం తప్ప, మరేమీ కాదని ఆయన అన్నారు. అంటే, ప్రజల గురించి ఎవరు గళం ఎత్తినా, మానవ హక్కులను రక్షించాలని ఎవరు మాట్లాడినా అలాంటి వారందరి మీద పట్టణ నక్సల్స్ అంటూ ముద్ర వేస్తున్నట్టు కనిపిస్తున్నది. శక్తిమంతమైన ఒక కార్పొరేట్ సంస్థకు వ్యతిరేకంగా ఆందోళన మొదలుపెట్టిన వారిని భయభ్రాంతులను చేయడానికే యథేచ్ఛగా అరెస్టులు సాగిస్తున్నారని స్టెరిలైట్ వ్యతిరేకోద్యమానికి నాయకత్వం వహించిన ఫాతిమా బాబు అన్నారు. ఇక్కడే పుట్టి పెరిగినప్పటికీ తన మీద నీచమైన ఆరోపణలు చేస్తూ బురద చల్లుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగాన్ని ఎవరు వ్యతిరేకించినా వారిని వెతికి వెతికి పట్టుకుంటున్నారని హ్యూమన్ రైట్స్ గ్రూప్ పీపుల్స్ వాచ్ నాయకుడు హెన్రీ టిఫాన్ అన్నారు. ఇప్పుడు తాను సేలం వెళితే వెంటనే అరెస్టు చేయడం ఖాయమనీ, తమిళనాడు అత్యంత వేగంగా ఖాకీవనంగా మారిపోతున్నదని, ఈ రాష్ట్రంలో ఎంతమాత్రం ప్రజాస్వామ్యం లేదని చెన్నైలో ఉండే టిఫాన్ చెప్పారు. మావోయిస్టు ముద్ర కూడా చాలినంత బలంగా లేదని భావిస్తే, వేదాంతకు చెందిన స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ కుట్ర జరిగిందని చెప్పడానికి బాబా రాందేవ్ రంగంలోకి దిగుతారు. టీఎస్ సుధీర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
సుధీర్‌ను పెళ్లి చేసుకో.. రష్మీ ఘాటు రిప్లై!
హైదరాబాద్ : సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూడాలని కొందరు అత్యుత్సాహం చూపిస్తారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు వాళ్లకు ఘాటుగా బదులివ్వడం తరచుగా చూస్తుంటాం. సరిగా ‘జబర్దస్త్’ యాంకర్, నటి రష్మీ గౌతం విషయంలో ఇలానే జరిగింది. ‘‘జబర్దస్త్’ కమెడియన్ సుడిగాలి సుధీర్, మీరు (రష్మీ) మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉంటారు. మీ కెరీర్లో ఎంతో శ్రమిస్తున్నారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోండంటూ’ ప్రసన్న కుమార్ అనే నెటిజన్ రష్మీకి సలహా ఇస్తూ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై యాంకర్ రష్మీ ఎంతో హుందాగా, ఘాటుగానూ సమాధానమివ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘మేమిద్దరం (సుధీర్, నేను) మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నీకెలా తెలుసు. స్క్రీన్ మీద చూసి నువ్వు అలా భావించి ఉంటావు. రీల్ లైఫ్.. రియల్ కాదని తెలుసుకో. వీక్షకులకు వినోదాన్ని పంచేందుకు ప్రోగ్రామ్స్‌లో సరదాగా ఉంటాం. అంతేకానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది మాకు తెలుసు. మా ఇష్టం. మీ సలహాలు అక్కర్లేద’ని రష్మీ బదులిచ్చారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇలాంటి సలహాలు ఇవ్వడం సరైంది కాదని, వారి వ్యక్తిగత జీవితాన్ని వారికి వదిలేయాలని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అది కేవలం తన అభిప్రాయమేనని.. వాక్ స్వాతంత్ర్యపు హక్కును మాత్రమే వాడుకున్నట్లు ప్రసన్న కుమార్ మళ్లీ ట్వీట్ చేశాడు. అభ్యంతరకర విషయాలు మాట్లాడనంత వరకు ఎలాంటి సమస్య ఉండదన్నాడు. -
కూకట్ పల్లిలో ఇంటర్ విద్యార్థి హత్య
సాక్షి, హైదరాబాద్ : కూకట్‌పల్లిలో ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థి దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మూసాపేటకు చెందిన సుధీర్ సోమవారం ఉదయం ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళుతుండగా.. దుండగులు నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా స్నేహితులతో జరిగిన వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుధీర్ స్నేహితులు నవీన్, కృష్ణ, మహీ, తేజ తదితరులు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుజరాత్ మోడల్ మిథ్యేనా!
ఇలాంటి ఆరోపణలు నాయకుల నోటివెంట వింటుంటే వింతనిపిస్తుంది. పాకిస్తాన్ జాతీయులతో కలసి భోజనం చేయడమే నేరమైతే, నరేంద్ర మోదీ కూడా అలాంటి నేరం చేసిన వారే అవుతారు. 2015 డిసెంబర్లో నాటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడానికి హఠాత్తుగా లాహోర్‌లో మోదీ దిగిపోయారు. ఆయన షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలియచేసిన వారం రోజులకే ఉధంపూర్ దాడులు జరిగిన వాస్తవాన్ని ప్రధాని కావాలని విస్మరించారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల మొదటి దశతో సగభాగం పోలింగ్ పూర్తయింది. మిగిలిన సగభాగం నియోజకవర్గాలకు డిసెంబర్ 14వ తేదీన పోలింగ్ జరగబోతోంది. పశ్చిమ భారతదేశంలోని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలే 18 మాసాలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని దేశంలో చాలామంది భావిస్తున్నారు. గుజరాత్లో 22 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి కూడా ఆ పార్టీయే అధికారం చేజిక్కించుకుంటే, 2019 ఎన్నికలలో గెలవడం లాంఛనమే. కానీ కాంగ్రెస్ పార్టీ కనుక బీజేపీ కలలను భగ్నం చేయగలిగితే, రెండో పర్యాయం మోదీ ప్రధాని కావడం నల్లేరు మీద నడక కాబోదు. సొంత రాష్ట్రం గుజరాత్లో నరేంద్ర మోదీ ప్రచారం నిర్వహించిన తీరు మీద ప్రజలలో సర్వత్రా ఆసక్తి నెలకొనడానికి కారణం కూడా ఇదే. నా వరకు, మోదీ అనుసరించిన ఎన్నికల పోరాట వ్యూహాన్ని చూసి చాలా నిరుత్సాహపడ్డాను. 2014 ఎన్నికల సమయంలో గాంధీనగర్‌లో మోదీ తనను తాను ఆ అత్యున్నత పదవికి తగినవానిగా చెప్పుకున్న రికార్డు ఉంది. తరువాత ఆయన ఎంతో తెలివిగా గుజరాత్ మోడల్‌ను దేశమంతటా ప్రచారం చేసుకోగలిగారు. ఆ రాష్ట్రం ఎంతో ముందంజలో ఉందని మిగిలిన రాష్ట్రాలు నమ్మే విధంగా చేశారు. కాబట్టి ఈ 2017 శాసనసభ ఎన్నికలు ఇంతవరకు జరిగిన గుజరాత్ అభివృద్ధి నమూనాలోని సామర్థ్యం మీద వెలువడే తీర్పుగా భావిం చాలి. ఆ నమూనా సమర్థమైనదే అయితే ఆ రాష్ట్రంలో మరోసారి ప్రజలు మరో ఐదేళ్ల పాటు పాలించేందుకు బీజేపీకే అధికారం అప్పగిస్తారు. చిత్రం ఏమిటంటే, మోదీ ప్రవచించే ‘వికాస్’అన్న నినాదం ఈ ఎన్నికల ప్రచారంలో కేవలం అధోజ్ఞాపిక స్థాయికి దిగజారిపోయింది. మోదీ ఫొటోతో ముద్రించిన పోస్టర్ల మీద ‘నేనే వికాస్’, ‘నేనే గుజరాత్’ అంటూ కనిపించిన అక్షరాలలో మాత్రమే ‘వికాస్’ దర్శనమిస్తున్నది. గుజరాత్ మోడల్ మాటేమిటి? ఇంకో వింత కూడా ఉంది. ప్రతిభను చెప్పే రిపోర్ట్ కార్డు కనుక బాగుంటే, మోదీ, అమిత్‌షా, విజయ్ రూపాణీ పటాటోపంగా గుజరాత్ మోడల్‌ను అందరికీ ప్రదర్శించేవారే. అంతేకానీ తల్లిదండ్రులకు కూడా రిపోర్టు కార్డును చూపించడానికి సిగ్గుపడే విద్యార్థిలా ప్రవర్తించేవారు కాదు. నిరుద్యోగం గురించి, నీటి సమస్య గురించి, వస్తుసేవల పన్ను, పెద్ద నోట్ల రద్దు ఫలితంగా చిన్న చిన్న వ్యాపారులు పడుతున్న ఇక్కట్లు వంటి వాటి గురించి రాహుల్ గాంధీ, హార్దిక్ పటేల్ ప్రశ్నిస్తుంటే, మోదీ వేరే అంశాలను ప్రస్తావించడానికి నిర్ణయించుకున్నారు. హిందూ ముస్లిం ఓట్ల మధ్య విభజన తేవడమే బీజేపీ వ్యూహం. నిజానికి ప్రధాని తన అమ్ముల పొదిలోని అస్త్రాలన్నింటినీ ఇంత నిరాశతో ప్రయోగిస్తున్న తీరును ఇంతవరకు జరిగిన ఏ రాష్ట్ర ఎన్నికలలోనూ చూడలేదు. లవ్ జీహాద్ పేరుతో ఒక వ్యక్తిని ఒక హిందువు గొడ్డలితో నరికి చంపిన దృశ్యంతో కూడిన ఘోరమైన వీడియో టీవీ చానళ్లలో వచ్చింది. కానీ ప్రధాని మాత్రం ఈ దారుణం గురించి ప్రస్తావించకుండా, అదే రోజున నీచ జాతికి చెందిన వాడంటూ తన మీద మణిశంకర్ అయ్యర్ నోరు జారడం గురించే ఎక్కువగా ప్రస్తావించారు. అయ్యర్ మాట్లాడిన హిందీ భాషలో కులం గురిం చిన ప్రస్తావన స్పష్టంగా లేకపోయినా, తన ఓబీసీ వర్గ పరిధితో దానిని ముడిపెట్టారు మోదీ. అంతేకాకుండా గుజరాత్ గడ్డ మీద పుట్టిన వ్యక్తిని అవమానించడమేనని చెప్పడానికి ప్రయత్నం చేశారు. తరువాత నవంబర్‌లో ఒక పాకిస్తానీ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా రంగం మీదకు తెచ్చి, కాంగ్రెస్ నాయకుడు (అయ్యర్) తనను అంతం చేయడానికి పాకిస్తాన్లో ఎవరికో సుపారీ ఇచ్చారని తీవ్ర ఆరోపణలకు దిగారు. అయ్యర్ చెబుతున్న భారత్–పాకిస్తాన్ సంబంధాలకు మోదీ ఇచ్చిన భాష్యమిది. అయితే అయ్యర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పిందేమిటి? ‘మొట్టమొదటిగా చేయవలసిన పనేమిటంటే, నరేంద్ర మోదీని తొలగించడం. అప్పుడే చర్చల ప్రక్రియ ముందుకు వెళుతుంది. అందుకు మనం నాలుగేళ్లు వేచి ఉండవలసి ఉంటుంది?’అని. అంటే ప్రజాస్వామిక ప్రక్రియ ప్రకారం భారత్ తన నేతను ఎంచుకోవడానికి 2019 ఎన్నికల తరువాతనే అవకాశం చిక్కుతుందని అయ్యర్ వాదన. విందు రాజకీయం మరో కుట్ర సిద్ధాంతం గురించి మోదీ వెల్లడించారు. పాకిస్తాన్ ప్రతినిధులకు అయ్యర్ విందు ఇచ్చారని, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా అందులో పాల్గొన్నారని మోదీ చెప్పారు. ఒక పక్క గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ ప్రతినిధులతో చర్చలు జరపవలసిన అవసరం ఏమిటి? అంటూ మోదీ పల్లవి అందుకోగానే, మిగిలిన పార్టీ నాయకులంతా అదే పాట అందుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ విందులో పాల్గొన్న మాజీ ప్రధాని, మాజీ ఉపరాష్ట్రపతి, సైనికదళాల మాజీ అధికారి, పదవీ విరమణ చేసిన దౌత్యాధికారులు తన మీద కుట్ర చేశారన్నదే మోదీ ఆరోపణ. ఒకవేళ మోదీ దగ్గర ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే, ఆయన ప్రస్తావించిన వ్యక్తుల మీద దర్యాప్తు కోసం తన అధీనంలోనే ఉండే నిఘా అధికారులను ఆదేశించవచ్చు. ఇలాంటి ఆరోపణ చేసినందుకు క్షమాపణలు చెప్పాలని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కోరారు. అయితే మోదీ నుంచి అలాంటి క్షమాపణ వినే అవకాశాలు బాగా తక్కువ. ఇలాంటి ఆరోపణలు వింటుంటే వింతనిపిస్తుంది. పాకిస్తాన్ జాతీయులతో కలసి భోజనం చేయడమే నేరమైతే, మోదీ కూడా అలాంటి నేరం చేసిన వారే అవుతారు. 2015 డిసెంబర్లో నాటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడానికి హఠాత్తుగా లాహోర్‌లో మోదీ దిగిపోయారు. ఆయన షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలియచేసిన వారం రోజులకే ఉధంపూర్ దాడులు జరిగిన వాస్తవాన్ని ప్రధాని కావాలని విస్మరించారు. అంటే ఆయన హఠాత్తుగా పాక్‌లో దిగిన తరువాతే కశ్మీర్లో పరిస్థితులు మరింత క్షీణించాయి. పఠాక్కోట్ వైమానిక కేంద్రం మీద దాడి కూడా అప్పుడే జరిగింది. ఇలా ఉండగా, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రేగిన వివాదం పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసిన అంశంతో మరింత దిగజారింది.‘భారత్ ఈ ఎన్నికల వివాదంలోకి పాకిస్తాన్‌ను లాగడం ఆపాలి. బాధ్యతా రాహిత్యంతో, ఆధారాలు లేని ఇలాంటి కల్పిత కుట్రల ఆరోపణలు గుప్పించే కంటే తన సొంత బలంతో ఎన్నికలలో నెగ్గడానికి ప్రయత్నించాలి’అన్నదే ఆ ట్వీట్ సారాంశం. రామ్–హజ్ ఈ వివాదంలోకి అహ్మద్‌పటేల్‌ను లాగడానికి కూడా శతవిధాలా ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌ను ముఖ్యమంత్రిని చేస్తారంటూ పోస్టర్లు వెలిశాయి. ఇలాంటి పోస్టర్లతో ఏం సాధించదలుచుకున్నారో సుస్పష్టం. గుజరాత్ హిందూ– ముస్లిం ఓటర్ల మధ్య విభజన తీసుకురావడమే దాని వెనుక ఉద్దేశం. కానీ ఆ రాష్ట్రంలో ముస్లిం జనాభా కేవలం 9 శాతం. గుజరాతీయులకు పాఠం చెప్పేం దుకే అహ్మద్ పటేల్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నట్టు చెబుతున్న ఒక టేప్‌ను కూడా బీజేపీ అధికార ప్రతినిధి రంగం మీదకు తెచ్చారు. ఇది బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట. అయోధ్యలో మందిరం నిర్మించాలని కోరుకుంటున్నారా, లేకుంటే మసీదు నిర్మించాలని కోరుకుంటున్నారా! స్పష్టం చేయవలసిందంటూ కాంగ్రెస్ నాయకులకు ప్రధాని సవాలు విసిరారు. ఈ అంశానికీ, గుజరాత్ ఎన్నికలకూ సంబంధం ఏమిటో ఎవరికీ అర్థం కాక, ఆశ్చర్యంలో ముంచెత్తింది. మోదీ నాయకత్వంలో జరుగుతున్న గుజరాత్ ఎన్నికల ప్రచారం ఏం చెబుతుంది? ఇది భయాందోళనలను సూచిస్తున్నదా? విభజనతోనే ఓట్లు వస్తాయన్న ఆలోచనా? బీజేపీ త్రయంతోను, కాంగ్రెస్, దాని కొత్త మిత్రుల పేర్లతోను దర్శనమిచ్చిన పోస్టర్లు మరొక అంశం. వీటి ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారో స్పష్టమే. బీజేపీ త్రయంలోని పేర్లు రూపాణీ (ఆర్), అమిత్ షా (ఏ), మోదీ (ఎం)– ఈ మూడు పొడి అక్షరాలు కలిపితే ‘రామ్’ అవుతుంది. అదే హార్దిక్ (హెచ్), అల్పేష్ (ఏ), జిగ్నేశ్ (జె) – ఈ మూడు కలిపితే ‘హజ్’ అవుతుంది. ఈ అక్షరాలు వేటికి సంకేతాలో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఇంతకు ముందు కూడా ఇలా బీజేపీ పేర్లతో లబ్ధి పొందిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. జేమ్స్ మైఖేల్ లింగ్ధో పేరు వల్ల 2002లో, మియాన్ ముషార్రఫ్ పేరు వల్ల 2007లోను బీజేపీ తన అధికారాన్ని నిలుపుకుంది. ఈ ఎన్నికలలో కూడా లబ్ధి పొందవచ్చునని ఆ పార్టీ మరోసారి ఈ ఆయుధం వైపు మొగ్గి ఉండవచ్చు. ముస్లింలను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ గుజరాత్లో తొమ్మిది శాతంగా ఉన్న ముస్లింలను నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్ కూడా దోషిగానే నిలుస్తుంది. గతానుభవాలను బట్టే ఇలా చేసినట్టు ఆ పార్టీ వ్యూహకర్తలు చెబుతున్నారు. ముస్లింల ప్రయోజనాల గురించి కాంగ్రెస్ మాట్లాడితే, బీజేపీ వెంటనే తమ పార్టీని ముస్లిం అనుకూల పార్టీగా ముద్రవేసి, హిందూ ఓట్లను గంపగుత్తగా పట్టుకుపోతుందని కూడా ఆ పార్టీ భావిస్తున్నది. అంటే, ముస్లింలు తమకే ఓటు వేయక తప్పదని ఆ పార్టీ విశ్వా సంగా కనిపిస్తుంది. కాబట్టి వారిని ఓట్లు కోరవలసిన అవసరం లేదని భావి స్తున్నది కూడా. అయితే మోదీ మాత్రం ముస్లిం మహిళలు బీజేపీకి ఓటు వేస్తారన్న ఆశతో తలాక్ అంశాన్ని ప్రస్తావించారు. చాలావరకు ఓపీనియన్ పోల్స్ అంచనా వేసినట్టు గుజరాత్ ఎన్నికలలో బీజేపీ కనుక విజయం సాధిస్తే, 2018లో కొన్ని ఇతర రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో కూడా ఇదే అబద్ధాల, అర్థ సత్యాల కర్మాగారాన్ని ఉపయోగించుకుంటుందని నా అనుమానం. అదే వ్యూహాన్ని 2019 సాధారణ ఎన్నికలలో కూడా అనుసరించవచ్చు. 2014 ఎన్నికలలో అచ్చేదిన్ తీసుకువస్తామంటూ హామీ ఇచ్చిన వ్యక్తిని ప్రజలు విశ్వసించారు. అభివృద్ధి అనే పునాది మీద పాలన సాగిస్తాడని నమ్మిన ఆ వ్యక్తి గుజరాత్ మోడల్ ద్వారా నిరాశపరి చారు. అయితే ఇక ఎవరైనా ఏమైనా ఆశించేది ఏం ఉంటుంది? అలాంటి నిరాశ గుజరాత్‌కే పరిమితం కావాలి. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు టీఎస్ సుధీర్ -
పదవి రాకపోతే రాజకీయం వదిలేస్తా..
► ఆసుపత్రి కమిటీ చైర్మన్‌గా మా సుధీరే ప్రమాణం చేస్తాడు ► ఎమ్మెల్సీ పీఆర్‌కు మంత్రి ఆది పరోక్ష చాలెంజ్ ► జమ్మలమడుగు అధికారపార్టీలో ఆసుపత్రి చైర్మన్ పదవి చిచ్చు ► ఎవరికి వారే పట్టుకోసం తీవ్ర పోరు సాక్షి ప్రతినిధి, కడప: ‘ఏది ఏమైనా మా సుధీరే ఆస్పత్రి కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అవసరమైతే నేను రాజకీయమైనా వదులుకుంటా’ మంత్రి ఆదినారాయణరెడ్డి మంగళవారం జమ్మలమడుగు ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో తన మనసులోని ఆగ్రహాన్ని ఇలా బయటపెట్టారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా తన కుమారుడు సుధీర్‌రెడ్డిని ప్రమాణా స్వీకారం చివరి నిమిషంలో వాయిదాపడటంపై మనసులోనే రగిలిపోతున్న ఆదినారాయణరెడ్డి అదే ఆసుపత్రి వేదికగా జరిగిన కార్యక్రమంలో తన ప్రత్యర్థి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి పరోక్షంగా ఈ చాలెంజ్ విసిరారు. ఆదేవిధంగా పట్టణంలోని వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రికి చైర్మన్‌గా తన కుమారుడు సుధీర్‌రెడ్డి ఈనెల ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. తాను పట్టుబట్టిన పనిని ఖచ్చితంగా జరిగే విధంగా చూస్తానని, తన పని జరుగకపోతే రాజకీయాల నుంచి అయిన తప్పుకుంటానని పరోక్షంగా ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. తీవ్రమైన ఆధిపత్యపోరు జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిని టీడీపీలో చేర్చుకునే ప్రతిపాదనను మాజీమంత్రి రామసుబ్బారెడ్డి గట్టిగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆయన్ను తీసుకుంటే పార్టీ కూడా వదిలి వెళ్లేందుకు వెనుకాడబోమని కూడా ఆయన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పరోక్షంగా సంకేతాలు పంపారు. ఆ తర్వాత ఆదిని మంత్రిని చేయాలనుకున్నప్పుడు ససేమిరా అంగీకరించలేదు. పీఆర్‌కు ఎమ్మెల్సీ పదవి ఎరవేసి చంద్రబాబు ఒప్పించారు. అక్కడి నుంచి జమ్మలమడుగు టీడీపీలో ఆధిపత్య పోరు తీవ్రమైంది. మంత్రి ఆది, మాజీమంత్రి పీఆర్ మధ్య ఏ మాత్రం సఖ్యత కుదరకపోగా రెండు వర్గాలు ఒకరినొకరు దెబ్బ తీసుకోవడానికి ఎత్తులు పైఎత్తులు వేస్తూ వచ్చాయి. ఇదే సందర్భంలో పీఆర్ వద్దనుకుని పంపిన మున్సిపల్ కమిషనర్‌ను మంత్రి వెనక్కుతేవడం, తన తమ్ముడు గిరిధర్‌రెడ్డి పేరు ఆసుపత్రి కమిటీ చైర్మన్ పదవికి ప్రతి పాదిస్తే మంత్రి దాన్ని పక్కకు తోసేసి తన కుమారుడు సుధీర్‌ను చైర్మన్ చేసుకోవడం పీఆర్ జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిణామాలన్నింటి మీద నేరుగా సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం మీద ఒత్తిడి తెచ్చి సుధీర్‌రెడ్డి పదవీ ప్రమాణా స్వీకారాన్ని చివరి నిమిషంలో నిలుపుదల చేయించారు. ఆ పదవి తన తమ్ముడు గిరిధర్‌రెడ్డికి ఇప్పించాలని పీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రగలిపోతున్న మంత్రి ఆది తనకు ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి తీసుకుని చేతిలో అధికా రం పెట్టుకుని పీఆర్ మంత్రి మీద పోరాటం చేసే వ్యూహం అమలు చేశారు. దీంతో తాను మంత్రిగా ఉండి కొడుక్కు చిన్న పదవి కూడా ఇప్పించుకోలేకపోవడాన్ని ఆదినారాయణరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆసుపత్రి సలహా మండ లి చైర్మన్ పదవి తన కుమారుడికే కావాలని ఆయన కూడా పట్టుబట్టారు. ఈ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం కమిటీ నియామకాన్నే పక్కన పెట్టేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి ఆది మంగళవారం అదే ఆసుపత్రి వేదికగా తన సత్తా ఏమిటో చూపిస్తానని గట్టిగా చెప్పారు. తన కుమారుడు ఆసుపత్రి కమిటీ చైర్మన్‌గా ప్రమాణా స్వీకారం చేయకపోతే రాజకీయం కూడా వదులుకుంటానని చెబుతూ చేతనైతే నిలుపుదల చేయిం చాలని పరోక్షంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి సవాల్ విసిరారు. ఈ పరిణామంతో జమ్మలమడుగు తెలుగుదేశం రాజకీయం మరోసారి వేడెక్కబోతోంది. -
బ్లూవేల్ భూతం: బాలుడిని రక్షించిన పోలీసులు
ముంబైః ప్రపంచదేశాలనే గడగడవణికిస్తున్న మృత్యు క్రీడ ‘బ్లూ వేల్’ బారిన పడిన ఓ 14 ఏళ్ల బాలున్ని పోలీసులు రక్షించారు. ఇటీవలే ముంబైలో 14 ఏళ్ల మన్‌ప్రీత్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవక ముందే షోలాపూర్‌కు చెందిన సుధీర్ భోస్లే అనే బాలుడు ఈ బ్లూ వేల్ గేమ్ బారిన పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు ఈ విషయం తెలియడంతో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సుధీర్‌ను రక్షించగలిగారు. వివరాల్లోకి వెళ్తే షోలాపూర్‌లోని ఓ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న సుధీర్ ఎంతో చురుగ్గా ఉండేవాడు. అయితే అయిదారు రోజుల నుంచి సుధీర్ ప్రవర్తనలో మార్పు వచ్చినట్టు తల్లిదండ్రులు గమనించారు. సెల్ ఫోన్లో బిజిగా ఉండడం కూడా గమనించారు. ముఖ్యంగా అస్వస్థతతోపాటు సరిగా నిద్రపోకపోవడం తదితరాలను గమనించి సుధీర్‌కు నిద్రపోయేందుకు రోజు తలకి ఆయుర్వేదం అయిల్‌తో మసాజ్ చేసేవారు. అయితే ఈ బ్లూ గేమ్ బారిన పడ్డాడన్న సంగతి వారికి తెలియలేదు. చెప్పపెట్టకుండానే బస్సెక్కాడు... కొన్ని రోజులుగా సరిగా నిద్రపోకుండా ఉన్న సుధీర్ బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఇంట్లోవారికి ఎవరికి ఏమి చెప్పకుండానే ఇంట్లోనుంచి బయటపడ్డాడు. క్రికెట్ అకాడమి కోసమని తీసుకున్న రూ. మూడు వేల రూపాయలతోపాటు, సెల్ ఫోన్ తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరాడు. తాను ఇళ్లు వదిలి వెళ్తున్నానని తనను వెదికించేందుకు ప్రయత్నం చేయవద్దని లేదంటే తానేమైన చేసుకుంటానని బెదిరిస్తూ రాసిన లేఖను చూసి ఇంట్లో సు ధీర్ తల్లిదండ్రులు ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగారు. సెల్‌ఫోన్‌తోనే ఆచూకి లభ్యం....! సుధీర్ ఇళ్లు విడిచి వెళ్లడంతో తల్లిదండ్రులు విషయాన్ని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా సుధీర్ వద్ద సెల్ ఫోన్ ఉండడంతో ఫోన్ ట్రేస్ చేసి షోలాపూర్ నుంచి పుణే దిశలో టేంబూర్ణీ ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. దీన్నిబట్టి పుణే దిశగా సుధీర్ ప్రయాణిస్తున్న భావించిన పోలీసులు బస్సు డిపోతో పాటు అటువైపు బయలుదేరిన బస్సు డ్రైవర్లు కండక్టర్లతో సంప్రదింపులు జరిపి బాలున్ని వివరాలు చెప్పి ఇలాంటి బాలుడు బస్సులో ఉన్నాడా లేదా అని అడిగి తెలుసుకునే ప్రయత్నంచేశారు. ఇంతలో ఓ బస్సులో వీరు చెప్పిన వివరాలనుసారం ఓ బాలుడు ఉన్నట్టు తెలిసింది. మరికొద్ది సేపట్లో భిగవాన్ బస్సుస్టాండ్‌కు చేరుకోనున్నట్టు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడి పోలీసులకు సమచారం అందించారు. అనంతరం ఆ బస్సులోని సుధీర్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే దర్యాప్తులో ఇదంత బ్లూ బెల్ గేమ్ ఆడడం వల్లే జరిగిందని తెలిసింది. అదృష్టవశాత్తు ఎలాంటి ఘోరం జరగకముందే పోలీసులు సుధీర్‌ను రక్షించగలిగారు. -
తెరపైకి పోస్టర్లు అంటించే కుర్రాళ్ల జీవితాలు
తాజ్‌మహల్‌కు రాళ్లెత్తిన కూలీలను ఎవరూ పట్టించుకుంటారు? అలాగే సినిమా ప్రచారానికి పోస్టరు అంటిం చేవారి జీవితాల గురించి అసలు ఎవరూ ఆలోచించరు. అలాంటి ముగ్గురు కుర్రాళ్ల జీవన విధానాలను ఆవిష్కరించే చిత్రంగా కె-3 తెరకెక్కించింది. కామథేను ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన చిత్రం ద్వారా ఛాయాగ్రాహకుడు ఎంఎస్ అన్నాదురై దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన కథ, కథనం, మాటలు, ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన చిత్రంలో విమల్‌రాజ్ హీరోగాను, ఆదిర హీరోయిన్‌గాను నటించారు. విశ్వంత్, సుదీర్, పావలా లక్ష్మణ్‌మీసై రాజేంద్రనాథ్‌లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎన్.తిరుమురుగన్, ఏ.ప్రకాష్‌రాజ్ సహ నిర్మాతులగా వ్యవహరిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వివరించారు. అర్ధరాత్రుల్లో పోస్టర్లు అతికించే కదీర్, గంజా, కరుప్పు అనే ముగ్గురు యువకుల జీవన విధానాలే చిత్రకథ అని తెలిపారు. అందుకే ఈ చిత్రానికి కే-3 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ముగ్గురు కూలీలుగా ఎలామారారు? అం దుకు ఎవరు కారణం? లాంటి పలు ఆసక్తికరమైన అంశాలతో విభిన్న కథనంతో తెరకెక్కిస్తున్న చిత్రం కే-3 అని చెప్పారు. ఈ పోస్టర్లు అం టించే పని ని 18 నుంచి 20 వయసుగల వా రే అధికంగా చేస్తుంటారు. చిత్ర షూ టింగ్‌ను తిరునెల్వేలి, కేరళ, చెన్నై, సే లం మొదలగు ప్రాంతాల్లో నిర్వహిం చినట్లు తెలిపారు. చిత్ర నిర్మాణం పూర్తయ్యిందని, ఈ నెల 20న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఓ కన్నడ నిర్మాత కన్నడ, తెలుగు అనువాద హక్కులను పొందినట్లు చెప్పారు. -
వెస్టిండీస్ క్రికెట్ జట్టు పై మండిపడ్డ బి.మోహన్
-
వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కుమారుడిపై ఏఎస్పీ దాడి
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్కడ అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌పై ఏఎస్పీ అప్పలనాయుడు దాడికి దిగారు. జమ్మలమడుగు మండలం దేవగుడిలో పోలింగ్ ఏజెంటుగా వ్యవహరిస్తున్న ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌ను ఏఎస్పీ పోలింగ్ బూత్ నుంచి బయటకు లాక్కొచ్చి మరీ కొట్టారు. పోలీసులు అసలు పోలింగ్ బూత్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదని, కేవలం బూత్ వెలుపల భద్రత కల్పిస్తే చాలని నిబంధనలు చెబుతున్నా, ఏఎస్పీ మాత్రం కేవలం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ వర్గాలు ఆరోపించాయి. ఎమ్మెల్యే కుమారుడితో పాటు ఓటర్లు, ప్రజల మీద కూడా ఏఎస్పీ దాడి చేశారు. దీనిపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయం: ఆఫీస్ బాయ్... బాసయ్యాడు!
కుటుంబాన్ని నడపడానికి సుధీర్ ఇంటర్మీడియట్ చదువును మధ్యలో ఆపేశాడు. ఓ కార్గో సర్వీస్ సంస్థలో పనికి కుదిరాడు. ఐతే చిన్ననాటి నుంచి ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త పనులు చేయడం సుధీర్‌కు అలవాటు. ఈ అలవాటే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక్క ముక్క చదువు రాకున్నా ఏదో ఒక వ్యాపారం చేసి కోటీశ్వరులైన వాళ్లు చాలామందే ఉండొచ్చు.. కానీ ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయని ఓ అబ్బాయి.. కార్గో సర్వీస్‌లో సరకులు ఎక్కించే పనికి కుదిరిన కుర్రాడు.. సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఎదిగి.. సొంత సంస్థను నెలకొల్పి కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకెళ్తే మాత్రం అది ఆశ్చర్యపరిచే విషయమే కదా! ముంబయికి చెందిన సుధీర్ నాయర్ అదే సాధించాడు! ఇతని విజయగాథేంటో తెలుసుకుందాం రండి! సుధీర్‌ది ముంబయిలోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబం. అసలే అంతంత మాత్రంగా ఉన్న అతని కుటుంబ పరిస్థితి.. తండ్రి అకాలమరణంతో మరింత కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో కుటుంబాన్ని నడపడానికి సుధీర్ ఇంటర్మీడియట్ చదువును మధ్యలో ఆపేశాడు. ఓ కార్గో సర్వీస్ సంస్థలో పనికి కుదిరాడు. ఐతే చిన్ననాటి నుంచి ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త పనులు చేయడం సుధీర్‌కు అలవాటు. ఈ అలవాటే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. కొన్నాళ్లు సరకులు ఎక్కించే పనిలో కొనసాగిన సుధీర్‌కు ఓసారి బిల్లింగ్ వ్యవహారాలు చూడాల్సిన అవసరం వచ్చింది. అందులో చురుగ్గా కనిపించడంతో అతడికి ఆ పనే అప్పగించారు. తర్వాత టైపిస్టుగా మారాడు. ఆ తర్వాత సుధీర్ కళ్లు కంప్యూటర్ మీద పడ్డాయి. ఆఫీసులోనే కూర్చుని కంప్యూటర్‌పై పట్టు సాధించాడు. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్‌గా మారాడు. రోజూ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి రోజువారీ ప్రోగ్రామర్‌గా మారాడు. కొన్ని రోజులకు కంపెనీకి స్వయంగా సాఫ్ట్వేర్ కోడ్లు తయారు చేసే స్థితికి చేరాడు. దీంతో అతని కెరీర్లో కొత్త దశ ఆరంభమైంది. మిత్రుల సూచన మేరకు సాఫ్ట్వేర్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు సుధీర్. దుబాయ్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ 15 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాడు. ఈ అనుభవంతో సొంతంగా వ్యాపారం ఆరంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. అతని దృష్టి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ)పై పడింది. ఈ రంగంలో భవిష్యత్తును ముందే ఊహించిన సుధీర్.. సొంతంగా కంపెనీ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు. మిత్రుల సహకారం తోడవడంతో 2006లో అతను ఈ రిసోర్స్ ఇన్ఫోటెక్ సంస్థను ఆరంభించాడు. మొదట ఐదారుగురితో మొదలైన ఈ రిసోర్స్ ప్రస్తుతం 100 మంది ఉద్యోగులతో పని చేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం సంస్థ టర్నోవర్ రూ.8 కోట్లకు పైమాటే. దేశవిదేశాల్లో ఆ సంస్థకు 300 మంది క్లైంట్లు ఉన్నారు. 25 వేల మంది యూజర్లు ఈ రిసోర్స్ ఈఆర్పీని ఉపయోగిస్తున్నారు. ఐతే ఈ స్థాయికి చేరడానికి సుధీర్ బృందం పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదు. మొదట్లో కస్టమర్ల నమ్మకం గెలుచుకోవడానికి రేయింబవళ్లు పని చేశారు వాళ్లు. మార్కెట్లో తామేంటో తెలియడానికి, ఆదాయం రావడానికి కొంత సమయం పట్టింది కానీ.. పునాది పడ్డాక మాత్రం సుధీర్ బృందానికి ఎదురులేకపోయింది. సుధీర్ కష్టానికి జాతీయ స్థాయి గుర్తింపు కూడా లభించింది. అతనికి ఉద్యోగ్ రతన్ పురస్కారం దక్కింది. ఇటీవలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలెప్మెంట్.. బిజినెస్ లీడర్షిప్ అవార్డు ఇచ్చి సత్కరించింది. దేవుడు మనకు కనిపించడం ఇష్టం లేక అవకాశం రూపంలో వస్తాడంటారు. కార్గో కాంప్లెక్స్‌లో ఓసారి నన్ను బిల్ చేయమని చెప్పడం నాకు దేవుడిచ్చిన అవకాశంగా అనుకుంటా. మనం ఎక్కడో ఓ చోట ఆరంభించాలి. అబ్దుల్ కలాం పేపర్‌బాయ్‌గా తన ప్రస్థానాన్ని ఆరంభించాడు. అలాగే నేను కూడా. ఏదో సాధించాలన్న తపన ఉండటం అన్నింటికంటే ముఖ్యం. జీవితం నదీ ప్రవాహం లాంటిది. ఈ సూత్రాన్ని నమ్ముకునే నేను ప్రయాణం సాగిస్తున్నా’’ అంటూ తన ప్రస్థానం గురించి చెబుతుంటాడు సుధీర్. - ప్రకాష్ చిమ్మల