కొత్త ప్రేమ | debut film from Karthikeya Productions | Sakshi
Sakshi News home page

కొత్త ప్రేమ

Oct 21 2018 12:40 AM | Updated on Oct 21 2018 12:40 AM

debut film from Karthikeya Productions  - Sakshi

కార్తికేయ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న తొలి చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. సుధీర్, ఆద్యా ఠాగూర్, అదితి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రణయ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు ప్రణయ్‌ మాట్లాడుతూ– ‘‘న్యూ జనరేషన్‌ లవ్‌ అండ్‌ లైఫ్‌ స్టోరీ ఇది. కొన్ని రిఫరెన్స్‌లను దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేసుకున్నాను.

నవంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం’’  అన్నారు. హీరో సుధీర్‌ మాట్లాడుతూ– ‘‘టీవీ సీరియల్స్‌లో బాలనటునిగా నటించాను. హీరోగా ఇది నా తొలి చిత్రం. ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుంది’’  అన్నారు. ఈ చిత్రానికి ఆర్ట్‌: విఠల్, కెమెరా: కుషేందర్, రచనా సహకారం: మదన్‌ మోహన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement