అదితి సెహగల్
‘నా జీవితంలో సంగీతం భాగం అయిపోయింది’ అంటుంది అదితి సెహగల్. రాక్ మ్యూజిషియన్ అమిత్ సెహగల్, నటి షెనా గమత్‌ల కుమార్తె అయిన అదితి ‘డాట్’ పేరుతో కూడా మ్యూజిక్ వరల్డ్‌లో పాపులర్ అయింది. ఆరేళ్ల వయసులో పియానో ప్లే చేయడం నేర్చుకుంది. పన్నెండేళ్ల వయసులో మ్యూజిక్ కంపోజింగ్‌లోకి వచ్చింది. 'ప్రాక్టిస్ రూమ్స్’ ఆల్బమ్ ఆమెకు ఎంతో పేరు తెచ్చింది.
‘ఎవ్రీబడీ డ్యాన్సెస్ టు టెక్నో’ మ్యూజిక్ వీడియో వైరల్ హిట్ అయింది. గాఢమైన స్నేహబంధానికి అద్దం పట్టే ‘గర్ల్స్ నైట్’ సాంగ్ కూడా అదితికి ఎంతో పేరు తెచ్చింది. ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ తాజా జాబితాలో సంగీత విభాగంలో చోటు సాధించిది అదితి. ఆదితి సంగీతకారిణి మాత్రమే కాదు మంచి నటి కూడా. జోయా అక్తర్ ‘ది ఆర్చీస్’ సినిమాలో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment