Music World
-
Aria: ‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు.. ఈ ఆల్బమ్‌లో ఉంటాయి’
డిజిటల్ సింగిల్ ‘కీపింగ్ ది ఫైర్’తో ఆరంగేట్రం చేసింది ‘ఎక్స్: ఇన్’ అనే అయిదుగురు సభ్యుల మల్టీనేషనల్ గర్ల్ గ్రూప్. ఈ గ్రూప్‌లోని సభ్యుల పేర్లు.. ఇషా, నిజ్, హన్నా, నోవ, ఆరియా (ఇండియా) సెకండ్ మినీ ఆల్బమ్ ‘ది రియల్’తో మరోసారి సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది ‘ఎక్స్:ఇన్’ బృందం.‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు ఈ ఆల్బమ్‌లో ఉంటాయి’ అంటుంది మెయిన్ ర్యాపర్, లీడ్ డ్యాన్సర్ నోవ. ఈ ఆల్బమ్ తమ పర్సనల్ స్టోరీలకు సంబంధించిన ‘మ్యూజికల్ ఎక్స్ప్రెషన్’ అని కూడా అంటుంది నోవ. ‘ది రియల్’లో నో డౌట్, మై ఐడల్, విత్‌డ్రా, నెవర్ సారీ అనే పాటలు ఉన్నాయి. సవాళ్లు, ఆటుపోట్లను అధిగమించి ఉన్నతస్థానానికి చేరడమే ఆల్బమ్‌లోని పాటల సారాంశం.‘కష్టాలు ఉన్నట్లే వాటిని అధిగమించే దారులు ఉన్నాయి. అయితే ఆ దారి గురించి ఎంత త్వరగా తెలుసుకుంటామనేది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది’ అంటుంది ఆరియా.ఇవి చదవండి: Aditya Dadia: అతను.. అక్షరాలా ఆల్రైట్! -
‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..!
‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ముగ్గురు గాయకులు... నతనియ లాల్వాని, సుభి, షల్మాలి ఖోల్గాడేలు ‘వావ్’ అనుకునేపాటను తీసుకువచ్చారు. ఈ కొత్త సాంగ్ ‘ముంబై మ్యాజిక్’ నిజంగానే మ్యాజిక్ చేసింది.హెరిటేజ్, హాసల్, హోప్ అనే మాటలతో రూపుదిద్దుకున్నపాట ఇది. ‘ముంబైవాసిగా ఈపాట నన్ను ఎన్నో జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్లింది’ అంటుంది నతనియ. ‘దేశీ ఎట్ హార్ట్’ అని తన గురించి పరిచయం చేసుకునే సుభి న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజిల్స్లాంటి ఎన్నో ్ర΄ాంతాలలో నివసించింది. అయినప్పటికీ స్వదేశీ మూలాలకు ఎప్పుడూ దూరం కాలేదు.బ్రాడ్వే, జాజ్లాంటి డిఫరెంట్ మ్యూజిక్ జానర్స్‌కు దేశీ టచ్ ఇచ్చింది.‘ఎన్నో విలువైన జ్ఞాపకాలకుపాట రూపం ఇచ్చే అవకాశం దక్కింది’ అంటుంది ‘ముంబై మ్యాజిక్’ గురించి. ‘ముంబై మహానగరంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు రిలేట్ అయ్యేపాట ఇది. ముంబై నగర ముఖచిత్రాన్ని వివిధ వర్ణాలలో అందంగా చూపినపాట. నగరంలోని వేగాన్ని, నిశ్శబ్దాన్ని, వెలుగు, నీడలను పట్టించేపాట ఇది’ అంటుంది షల్మాలి.ఇవి చదవండి: ఆ ముగ్గురూ.. పర్యావ'రణధీరులు'... -
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాశ్వతంగా రద్దే!
‘ఫాస్ట్ బీట్ వద్దు.. మెలోడీయే ముద్దు’ అంటూ ఓ కొత్త నినాదాన్ని అందుకున్నాడు చెచెన్యా అధ్యక్షుడు రమ్జాన్ కాదిరోవ్. ‘చెచెన్ సంగీతం చెచెన్ మనస్తత్వానికి అనుగుణంగానే ఉండేట్టు చూడండి’ అంటూ ఆ దేశపు సాంస్కృతిక శాఖ మంత్రి మూసా దాదయేవ్కి ఆదేశాలూ ఇచ్చాడు. విషయం ఏంటంటే.. చెచెన్యా బహిరంగ వేడుకలు, సంబరాల్లో ఫాస్ట్ బీట్ మ్యూజిక్‌ని రద్దుచేశారు.ఇది కిందటి నెల నుంచే అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఆ దేశ సంప్రదాయ సంగీతం ఆధునిక పాశ్చాత్యా సంగీత బాణీలతో ప్రేరణ, స్ఫూర్తి చెందకుండా.. తమ కల్చర్‌కి తగ్గట్టే ఉండాలి. ప్రదర్శనల్లో పాటలకు, ఆ పాటల మీద డాన్స్‌లకు ప్రేక్షకులు వెర్రెత్తి ఊగినా.. ఈలలతో గోల చేసినా ఆ షోకి ఇక అంతే సంగతులు.అప్పటికప్పుడు దాన్ని రద్దు చేస్తారు. అందుకే బీట్స్ మరీ స్పీడ్‌గా కాకుండా అలాగని మరీ స్లోగా కాకుండా నిమిషానికి 80 నుంచి 116 మధ్యలో ఉండాలని చెచెన్యా సర్కారు వారి ఆనతి. తమ దేశం మీద వెస్టర్న్ ఇన్‌ఫ్లుయెన్స్‌ని రూపుమాపడానికే ఈ చర్య కాకపోతే.. సంగీతానికి హద్దులు, నిషేధాలు ఏంటని అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు కొంతమంది గ్లోబల్ మ్యూజిక్ లవర్స్.అయితే స్థానిక సంగీతకారులు మాత్రం.. ఈ రద్దును జూన్ నుంచి అమలు చేయాల్సిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నారట. రద్దుకు ముందే ఖరారై, అన్నిరకాలుగా ప్రిపేర్ కూడా అయిన మే నెలలోని తమ ప్రోగ్రామ్స్‌కి కొత్త ఉత్తర్వుల ప్రకారం తిరిగి మ్యూజిక్ నోట్స్ రాసుకోవడం.. రిహార్సల్స్.. రికార్డింగ్స్ ఎట్సెట్రాకు టైమ్ కావాలి కాబట్టి.. వాళ్లంతా ఆ రద్దును జూన్ వరకు వాయిదా వేయమని కోరుతున్నారు. సర్కారు మాత్రం సమస్యేలేదంటోందట.ఇవి చదవండి: ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..! -
Taylor Swift: 14 స్పాట్లలో టాప్‌లో తొలి ఆర్టిస్ట్‌గా.. రికార్డుల సునామీ!
‘బిల్బోర్డ్ హాట్ 100 చాట్‌లో 14 స్పాట్లలో టాప్‌లో నిలిచిన తొలి ఆర్టిస్ట్‌గా చరిత్ర సృష్టించింది పాప్ సెన్సేషన్ టేలర్ స్విఫ్ట్. టేలర్ లేటెస్ట్ ఆల్బమ్ ‘ది టార్చర్డ్ పోయెట్స్ డిపార్ట్మెంట్’లోని 14 ట్రాక్స్ ‘బిల్బోర్డ్’లోని 14 స్పాట్స్‌లో టాప్‌లో నిలిచాయి.‘ఫోర్ట్‌నైట్’ ‘మై బాయ్ వోన్లీ బ్రేక్స్’ ‘సో లాంగ్, లండన్, ఫ్రెష్ ఔట్ ది స్లమ్మర్, ది టార్చర్డ్ పోయేట్స్ డి, డౌన్ బ్యాడ్, బట్ డ్యాడీ ఐ లవ్ హిమ్, ఫ్లోరిడాలాంటి సాంగ్స్ ఇందులో ఉన్నాయి.ఈ నెల 19న విడుదల అయిన ‘ది టార్చర్డ్ పోయెట్స్ డిపార్ట్మెంట్’ అమ్మకాలల్లో రికార్డ్ సృష్టించింది. స్పాటిఫైలో హైయెస్ట్ సింగిల్–డే గ్లోబల్ స్టీమ్స్ ఆల్బమ్‌గా నిలిచింది. యాపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్‌లోనూ ఈ ఆల్బమ్ హవా కొనసాగింది.ఇవి చదవండి: Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు.. -
'యూ, యూ, యూ, లైక్ ఇట్స్'.. ఈ మాగ్నటిక్ సాంగ్‌ను విన్నారా!?
కొరియన్–పాప్ సెన్సేషన్ ‘ఇలిట్’ మ్యూజిక్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. డెబ్యూ–సింగిల్ ‘మాగ్నెటిక్’ బిల్బోర్డ్ చార్ట్ ‘హాట్ 100’లో చోటు సాధించడం ద్వారా ‘ఇలిట్’ గ్లోబల్ స్టేజీపై గ్రౌండ్ బ్రేకింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది. యునహ్, మింజుచ, మోకా, వోన్హీ, ఇరోహ అనే అయిదుగురు అమ్మాయిల బృందంతో ‘ఇలిట్’ మ్యూజిక్ బ్యాండ్ గత నెల ప్రారంభమైంది. తొలి అడుగుల్లోనే స్పాటిఫై ‘డైలీ టాప్ సాంగ్ గ్లోబల్’ చార్ట్‌లో చోటు సంపాదించింది. యూకే ‘అఫిషియల్ సింగిల్స్ టాప్ 100’లో మెరిసింది. ‘మాగ్నెటిక్’ సాంగ్‌ను ‘ఇలిట్’ సభ్యుల ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించారు. ఈ గ్రూప్ డెబ్యూ ఆల్బమ్... సూపర్ రియల్ మీ. ‘మై వరల్డ్’, ‘మాగ్నటిక్’, ‘మిడ్నైట్ ఫిక్షన్’, ‘లక్కీ గర్ల్ సిండ్రోమ్’ అనే నాలుగు ట్రాక్‌లు ఈ ఆల్బమ్‌లో ఉంటాయి. తొలి వారంలోనే ‘సూపర్ రియల్ మీ’ అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. ‘యూ, యూ, యూ, లైక్ ఇట్స్ మాగ్నటిక్/ యూ, యూ, యూ, సూపర్’ అంటూ ‘మాగ్నటిక్’ను పాడాలనుకుంటే ఇప్పుడే వినండి మరి! ఇవి చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..! -
"కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం!"
కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో టీఎం కృష్ణగా పేరు తెచ్చుకున్న తోడూరు మాడభూషి కృష్ణ చుట్టూ వివాదాలు ఎగసిపడుతున్నాయి. సంగీతంలో 'నోబెల్ ప్రైజ్' స్థాయిలో అభివర్ణించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీవారి 'సంగీత కళానిధి' పురస్కారం-2024 టీఎం కృష్ణకు ప్రదానం చేయబోతున్నామని ఈ నెల 18వ తేదీన అకాడమీ ప్రకటించింది. అప్పటి నుంచి సంప్రదాయ సంగీత వాదుల నుంచి నిరసనల గళం పెద్దఎత్తున వినపడుతోంది. ఇది ప్రస్తుతం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీఎం కృష్ణను సమర్థిస్తూ కూడా కొన్ని వర్గాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నాయి. ఆయనకు మద్దతు పలికేవారిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వున్నారు. ముఖ్యంగా ద్రవిడ సిద్ధాంతాలను బలపరిచేవారు, సనాతన సంప్రదాయం పట్ల గౌరవంలేనివారు, నాస్తికులు అందులో వున్నారు. టీఎం కృష్ణకు సంగీత కళానిధి పురస్కార ప్రకటనను నిరసిస్తూ, గతంలో ఈ పురస్కారాన్ని తీసుకున్న కొందరు వెనక్కు ఇచ్చేస్తున్నారు. చాలామంది కళాకారులు ఇక నుంచి మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో పాడబోమని, సంగీత కచేరీలు చేయబోమని తమ నిరసనను చాటుకుంటున్నారు. ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ పత్రిక అధినేతలలో ఒకరైన ఎన్.మురళి ప్రస్తుతం మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి అధ్యక్షులుగా వున్నారు. టీఎం కృష్ణను ఈ పురస్కారానికి ఎంపిక చేయడంలో మురళి పాత్ర ప్రధానంగా వున్నదని సంగీత సమాజంలో గట్టిగా వినపడుతోంది. ఈ వివాదం ఇంతటితో ముగిసేట్టు లేదు. రకరకాల రూపం తీసుకుంటోంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ చరిత్రలో ఇంతటి వివాదం గతంలో ఎన్నడూ చెలరేగలేదు. టీఎం కృష్ణకు ఒక వర్గం మీడియా మద్దతు, సహకారం కూడా బాగా వున్నాయని అనుకుంటున్నారు. ఈయన ప్రస్థానాన్ని గమనిస్తే.. మొదటి నుంచీ వివాదాస్పద వ్యక్తిగానే ప్రచారం వుంది. వేదికలపైన పాడేటప్పుడే కాక, వివిధ సందర్భాల్లోనూ ఆయన చేసే విన్యాసాలు, హావభావాలపై చాలా విమర్శలు వచ్చాయి. అట్లే, ఆయనను మెచ్చుకొనే బృందాలు కూడా వున్నాయి. సంప్రదాయవాదులు ఎవ్వరూ ఇతని తీరును ఇష్టపడరు. ఈ క్రమంలో రేపు డిసెంబర్ లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదికలో జరగబోయే ప్రతిష్ఠాత్మకమైన వేడుకలకు చాలామంది దూరంగా జరుగుతారని అనిపిస్తోంది. ప్రసిద్ధ జంట కళాకారిణులు రంజని - గాయత్రి పెద్ద ప్రకటన కూడా చేశారు. హరికథా విద్వాంసులు దుష్యంతి శ్రీథర్, విశాఖ హరి వంటీఎందరో నిరసన స్వరాన్నే అందుకున్నారు. తెలుగునాట కూడా అవే ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. 1976లో తమిళనాడులో బ్రాహ్మణ కుటుంబంలో, శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన కృష్ణ మొదటి నుంచీ కొత్త గొంతును వినిపిస్తున్నారు. బ్రాహ్మణత్వంపైన, కర్ణాటక సంగీత ప్రపంచంలో బ్రాహ్మణుల పెత్తనం పెరిగిపోతోందంటూ కృష్ణ నినదిస్తున్నారు. సమాజంలో, సంగీత సమాజంలో ఎన్నో సంస్కరణలు రావాలని, సమ సమాజ స్థాపన జరగాలని మాట్లాడుతున్నారు. తాను గురుశిష్య పరంపరలోనే సంగీతం నేర్చుకున్నప్పటికీ దాని పైన తన దృక్పథం వేరని చెబుతున్నారు. చెంబై విద్యనాథ భాగవతార్ - కె జె ఏసుదాసు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు - అన్నవరపు రామస్వామి వంటివారి గురుశిష్య బంధాలు ఆయనకు ఏ విధంగా అర్ధమవుతున్నాయో? అనే ప్రశ్నలు వస్తున్నాయి. త్యాగయ్య మొదలు మహా వాగ్గేయకారులందరిపైనా ఆయన వివిధ సమయాల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి దేవదాసి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ బ్రాహ్మణత్వంతోనే ప్రవర్తించారని, అదే పద్ధతిని అనుసరించి పాడుతూ పెద్దపేరు తెచ్చుకున్నారని, ఆ కీర్తి కోసమే ఆమె ఆలా చేశారని గతంలో కృష్ణ చేసిన విమర్శలు పెద్ద దుమారం రేపాయి. బ్రాహ్మణత్వాన్ని పులుముకోకపోతే ఈ శాస్త్రీయ సంగీత రంగంలో ఇమడలేరని, రాణించలేరని, అందుకే సుబ్బలక్ష్మికి కూడా అలా ఉండక తప్పలేదని కృష్ణ బాధామయ కవి హృదయం. కులాన్ని బద్దలు కొట్టాలని, కళలు, సంగీతం అందరికీ అందాలని, అది జరగడంలేదని వాదిస్తూ, సముద్ర తీరాలలో, మత్స్యకార వాడల్లో, వివిధ సమాజాల్లో కచేరీలు, సంగీత ఉత్సవాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. పర్యావరణ విధ్వంసంపైన, బీజేపీ ప్రభుత్వ విధానాలపైన, వివిధ ఉద్యమ వేదికల ద్వారా తన వ్యతిరేకతను చాటుకుంటూ వస్తున్నారు. కర్ణాటక సంగీతాన్ని గ్రామీణ ప్రాంతాలకు, వెనుకబడిన వర్గాల దగ్గరకు తీసుకెళ్లాలంటూ చేసిన ప్రదర్శనలు మీడియాను కూడ బాగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంతో 2016లో ప్రతిష్ఠాత్మక 'రామన్ మెగసెసే అవార్డు' కూడా అందుకున్నారు. తమిళ భాషను, యాసను ప్రచారం చేసే క్రమంలో కృష్ణ తెలుగును చిన్నచూపు చూస్తూ వస్తున్నారు. త్యాగయ్య కీర్తనలు ఈనాటికి పనికిరావని, ఆ సాహిత్యం మూఢమైనదనే భావనలను కూడా ప్రచారం చేశారు. మహా వాగ్గేయకారులు రచించిన కీర్తనలను సాహిత్యానికి, భావానికి, భాషకు సంబంధం లేకుండా నడ్డివిరచి పాడుతూ మహనీయులను హేళన చేస్తున్నాడని, తెలుగు భాషను అవమానపరుస్తున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇతను కేవలం సంగీత విద్వాంసుడుగానే కాక, ఉద్యమకారుడుగానూ ప్రచారంలోకి వచ్చాడు. ఈ.వి రామస్వామి పెరియార్ భావాలను అనుసరిస్తూ, గీతాలను సృష్టిస్తూ, గానం చేస్తూ, ప్రచారం చేస్తూ వున్నారు. ఇస్లాం, క్రిస్టియన్ పాటలు కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో స్వరపరచి ఎందుకు పాడకూడదు? అన్నది అతి వాదన. బ్రాహ్మణులు, దైవం, హిందూమతం, కాంగ్రెస్, మహాత్మాగాంధీని పెరియార్ వ్యతిరేకించారు. కృష్ణ కూడా ఇంచుమించు అవే భావనలలో వున్నారు. బీజేపీ, సంఘ్ పరివార్పైన కూడా అనేకసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈయన ప్రస్తుత పురస్కారం ఎంపిక విధానాన్ని, అర్హతను గమనిస్తే, ఇతని కంటే గొప్పవాళ్ళు, జ్ఞాన, వయో వృద్ధులు ఎందరో వున్నారు. వాళ్లందరినీ కాదంటూ ఈయనకు ఈ పురస్కారం ఇవ్వాల్సినంత శక్తి సామర్ధ్యాలు, అనుభవం ఆయనకు లేవన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. సంప్రదాయ వ్యతిరేకత ముసుగులో, సంస్కరణ మాటున సాహిత్యంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా అవమానిస్తున్నాడని సంప్రదాయవాదులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు భాషను ముక్కలు ముక్కలుగా నరికివేస్తున్నాడని తెలుగు భాషాప్రియులెందరో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సంగీతం పట్ల, వాగ్గేయకార మహనీయుల పట్ల, తెలుగు భాష పట్ల గౌరవం లేనప్పుడు అసలు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడని అనేకులు మండిపడుతున్నారు. సంగీత కళానిధి పురస్కారం సంగతి అటుంచగా, ఇంతటి విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూస్తూ ఊరుకోబోమనే మాటలు సనాతన సమాజాల నుంచి వినపడుతున్నాయి. ఈ పురస్కార ప్రకటనను మ్యూజిక్ అకాడమీ విరమించుకుంటుందని చెప్పలేం. ఈ ధోరణులతో నడుస్తున్న కృష్ణ శాస్త్రీయ రాగాలను ఎంచుకోకుండా, తాను కొత్త కొత్త రాగాలను పుట్టించుకొని అందులో పాడుకొమ్మని కొందరు సలహా ఇస్తున్నారు. ఈ సనాతన భారతంలో "కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం " అని సంప్రదాయ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే అనేకమంది అతనిపై న్యాయస్థానాలలో కేసులు కూడా పెడుతున్నారు. ఏమవుతుందో చూద్దాం. - రచయిత, మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
Adithi Sehgal: ‘ఎవ్రీబడీ డ్యాన్సెస్ టు టెక్నో’
‘నా జీవితంలో సంగీతం భాగం అయిపోయింది’ అంటుంది అదితి సెహగల్. రాక్ మ్యూజిషియన్ అమిత్ సెహగల్, నటి షెనా గమత్ల కుమార్తె అయిన అదితి ‘డాట్’ పేరుతో కూడా మ్యూజిక్ వరల్డ్‌లో పాపులర్ అయింది. ఆరేళ్ల వయసులో పియానో ప్లే చేయడం నేర్చుకుంది. పన్నెండేళ్ల వయసులో మ్యూజిక్ కంపోజింగ్లోకి వచ్చింది. 'ప్రాక్టిస్ రూమ్స్’ ఆల్బమ్ ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. ‘ఎవ్రీబడీ డ్యాన్సెస్ టు టెక్నో’ మ్యూజిక్ వీడియో వైరల్ హిట్ అయింది. గాఢమైన స్నేహబంధానికి అద్దం పట్టే ‘గర్ల్స్ నైట్’ సాంగ్ కూడా అదితికి ఎంతో పేరు తెచ్చింది. ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ తాజా జాబితాలో సంగీత విభాగంలో చోటు సాధించిది అదితి. ఆదితి సంగీతకారిణి మాత్రమే కాదు మంచి నటి కూడా. జోయా అక్తర్ ‘ది ఆర్చీస్’ సినిమాలో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇవి చదవండి: Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ -
Shruti Rane: మ్యూజిక్ వరల్డ్‌లో గోల్డెన్ వాయిస్..
'శృతి రాణే సింగర్, మ్యూజిక్ కంపోజర్. స్కూలు రోజుల నుంచి పాటలు పాడేది శృతి. స్థానికంగా జరిగే పాటల పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకుంది. ‘గోల్డెన్ వాయిస్’ అని శృతిని పిలిచేవారు. గానంలోనే కాదు పాటల కంపోజింగ్‌లో కూడా మంచి పేరు తెచ్చుకుంది శృతి.' తన డైనమిక్ స్టేజీ పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. తన అభిమాన మ్యూజిక్ కంపోజర్లు ప్రీతమ్, విశాల్–శేఖర్. ఎంత జటిలమైన పాటను అయినా అవలీలగా పాడే శృతి క్లాసిక్ సాంగ్స్ రీక్రియేటెడ్ వెర్షన్స్‌కు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా విమర్శలు తప్పవు. ‘బాలీవుడ్ క్లాసిక్సాంగ్స్ను ఇష్టపడే లక్షలాది శ్రోతలలో నేను ఒకరిని. ఒక క్లాసిక్ సాంగ్‌కు సంబంధించి బ్యాడ్ వెర్షన్ విన్నప్పుడు ఎంత కోపం వస్తుందో నాకు తెలుసు. ఒరిజినల్ ఎసెన్స్ మిస్ కాకుండా పాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదృష్టవశాత్తు రీక్రియేట్ వెర్షన్‌కు సంబంధించి నాకు ప్రశంసలు తప్ప విమర్శలు ఎదురు కాలేదు’ అంటుంది శృతి రాణే. -
మ్యూజిక్ వరల్డ్‌లో.. తను ఒక సుమధుర 'ధ్వని'
స్కూలు, కాలేజి రోజుల నుంచి రోజుల తరబడి పాటలు వినేది ధ్వని భానుశాలి. అందరూ తనను సరదాగా ‘సాంగ్ ఈటర్’ అని పిలిచేవారు. రికార్డ్ బ్రేకింగ్ సాంగ్ ‘వాస్తే’తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన ధ్వని సింగర్‌గా బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుంది. మంత్రముగ్ధులను చేసే అందమైన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చిత్రపరిశ్రమలో గొప్ప సంగీతదర్శకులతో కలిసి పనిచేసే అదృష్టాన్ని సొంతం చేసుకుంది. ధ్వని పాడిన ‘దిల్బార్’ పాట బిల్బోర్డ్ యూట్యూబ్‌లో మ్యూజిక్ ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో నిలిచిన తొలి భారతీయ సింగిల్‌గా చరిత్ర సృష్టించింది. ‘ఒక ఆర్టిస్ట్ నుంచి స్ఫూర్తి తీసుకోవచ్చు. కానీ వారి శైలిని కాపీ కొట్టకూడదు’ అంటున్న ధ్వని సంగీతప్రపంచంలో తనదైన అందమైన సంతకాన్ని సృష్టించుకుంది. ధ్వని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ప్రోత్సాహకంగా మాట్లాడిన వారు తక్కువే. దీని గురించి ఇలా స్పందిస్తుంది ధ్వని... ‘ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. రకరకాల అభిప్రాయాలు వినడం వల్ల మనం ఎంచుకున్న దారి సరిౖయెనదేనా అనే డౌటు వచ్చి అయోమయంలోకి వెళతాం. ఇలాంటి సమయంలో మనపై మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. నా ప్రయాణంలో నేను అది కోల్పోలేదు’ అంటుంది ధ్వని భానుశాలి. ఇవి కూడా చదవండి: 'దీపెన్' దారి దీపం.. -
Chandrika Tandon: తేజో చంద్రిక
ఆరోజు... ‘అలాగే’ అని తల ఆడించి ఉంటే ‘పవర్ఫుల్ ఉమన్’గా ప్రపంచవ్యాప్తంగా చంద్రిక పేరు తెచ్చుకునేది కాదు. ‘ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ఈ ఊళ్లో ఒక్కరోజు కూడా ఉండలేను’ అని భయపడి ఉండే ఉద్యోగజీవితంలోకి వచ్చేది కాదు. తనను తాను నిరూపించుకునేది కాదు. ‘లాయర్ కావాలనుకున్నాను. ఈ ఉద్యోగం ఏమిటి’ అని నిట్టూర్చి ఉంటే చంద్రిక కొత్త శిఖరాలు అధిరోహించేది కాదు. ‘ఉద్యోగ జీవితానికే టైమ్ లేదు. ఇక సంగీతానికి స్థానం ఎక్కడ’ అని సర్దుకుపోయి ఉంటే సంగీత ప్రపంచంలో తనదైన పేరు తెచ్చుకునేది కాదు. ప్రపంచ గుర్తింపు పొందిన బిజినెస్ లీడర్, గ్రామీ–నామినేట్ ఆర్టిస్ట్‌గా, దాతగా ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తుంది చంద్రిక.... ‘అవసరం లేదు’ ఒక మాటలో తేల్చేసింది అమ్మ. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీలో చేరాలనుకుంటున్న చంద్రికకు ఆ మాట శరాఘాతం అయింది. ‘ఆ కాలేజీలో తక్కువమంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అంతా అబ్బాయిలే’ అన్నది అమ్మ. చంద్రిక చాలా సేపు అమ్మతో వాదించినా ఫలితం కనిపించలేదు. ఇంట్లోనే నిరాహార దీక్ష చేసింది. దీంతో చంద్రిక మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదవడానికి తల్లి ఒప్పుకోక తప్పింది కాదు. మూడు సంవత్సరాల కాలేజీ జీవితం చంద్రిక జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. సంగీతప్రపంచంతో అనుబంధానికి, సింగర్‌గా పేరు తెచ్చుకోవడానికి కారణం అయింది. డిగ్రీలో చేరడమే కష్టం అనుకున్న చంద్రిక ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ చేరడం పెద్ద విజయం. నిజానికి చంద్రికకు బిజినెస్ ప్రపంచంపై పెద్దగా ఆసక్తి లేదు. తాతలాగే లాయర్ కావాలనుకుంది. అయితే ప్రొఫెసర్ స్వామినాథన్ సూచన మేరకు బిజినెస్ స్కూల్లో చేరింది. మొదటి కొన్నిరోజులు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే సొంత ఊరు దాటి అంత దూరం రావడం అదే మొదటిసారి. ఆ ఒంటరితనానికి దూరం కావడానికి సంగీతానికి దగ్గరైంది. చంద్రిక తొలి ఉద్యోగం సిటీబ్యాంక్‌లో. బ్యాంకర్ కావాలని కలలో కూడా అనుకోని చంద్రికకు ఇది వింతగా అనిపించింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం లెబనాన్‌లోని బీరుట్ వెళ్లింది. యుద్ధానికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో అక్కడకు వెళ్లింది. అక్కడ అయిదు నెలల పాటు ఉంది. సిటీబ్యాంక్ తరువాత వేరే సంస్థల నుంచి చంద్రికకు అవకాశాలు రావడం మొదలైంది. అలా అమెరికాలోకి అడుగు పెట్టింది. ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు ఇష్టమైన సంగీతప్రపంచాన్ని మాత్రం చంద్రిక విడిచి బయటికి రాలేదు. ఎన్నో ఆల్బమ్స్ ద్వారా సక్సెస్ఫుల్ మ్యూజిషియన్‌గా తనను తాను నిరూపించుకుంది. సెకండ్ ఆల్బమ్ ‘సోల్ కాల్’ గ్రామీ అవార్డ్–బెస్ట్ కాంటెంపరరీ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో నామినేట్ అయింది. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ మకెంజీకి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పార్ట్నర్గా అరుదైన ఘనత సాధించింది. అడ్వైజరీ సంస్థ ‘టాండన్ క్యాపిటల్స్ అసోసియేషన్స్’ ప్రారంభించి సూపర్ సక్సెస్ అయింది. ఈ ప్రయాణంలో చంద్రికకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కుటుంబజీవితం, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కూడా అందులో ఒకటి. అయితే ప్రతి సవాలును అధిగమిస్తూ ముందుకు వెళ్లింది. సవాలు ముందుకు వచ్చినా, ఒత్తిడి తలలో దూరినా తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం సంగీతం. పాటలు వినడం, పాడడం తనకు ఎంతో ఇష్టం. అదే తన బలం. తాజాగా ‘అమ్మూస్ ట్రెజరర్స్’ ఆల్బమ్‌తో ముందుకు వచ్చింది చంద్రిక. ఇది పిల్లలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఆల్బమ్. -
ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ప్రముఖ సింగర్ కూతురు..
ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా? తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియకపోయినా బీటౌన్ ప్రేక్షకులకు మాత్రం ఈమె సుపరిచితమే. సడెన్‌గా చూస్తే.. ఈమె కంగనా రనౌత్, రాధికా ఆప్టేల పోలికలతో ఉన్నట్లు కనిపిస్తుంది. మరో యాంగిల్లో చూస్తుంటే.. హ్యాపీడేస్ ఫేమ్ స్రవంతి లాగానూ అనిపిస్తుంది. తన టాలెంట్ కన్నా గ్లామర్ ట్రీట్‌తో జనాలకు బాగా పరిచయమున్న ఈ బ్యూటీ పేరు అంజలి శివరామన్. తన యూనిక్ స్టైల్‌తో నటిగా మంచి పేరు తెచ్చుకున్న అంజలి శివరామన్ చక్కని గాయని కూడా. ‘నా నటనకు గానం అనేది ఎంతో ఉపయోగపడింది. క్రమశిక్షణతో ఉండడానికి కారణం అయింది. నన్ను నేను వ్యక్తీకరించుకునే సాధనం అయింది’ అంటుంది అంజలి. సింగర్ చిత్ర అయ్యర్ కూతురైన అంజలికి చిన్నప్పటి నుంచే స్వరాలతో స్నేహం ఏర్పడింది. స్కూల్ ఫంక్షన్ల నుంచి ఫ్యామిలీ ఫంక్షన్ల వరకు అంజలి పాట వినిపించాల్సిందే. పాటలు అంటే ఇష్టం ఉన్నప్పటికీ మ్యూజిక్ క్లాస్‌కు తరచుగా బంక్ కొట్టేది. ఆ తరువాత మాత్రం సంగీత శిక్షణ ప్రాముఖ్యత తెలుసుకొని ప్రతిరోజూ క్లాస్‌కు తప్పకుండా హాజరయ్యేది. ‘సంగీతం నా రక్తంలోనే ఉంది’ అంటుంది అంజలి, అంజలి నోట పాట విన్న వారు...‘అమేజింగ్ వాయిస్’ అనకుండా ఉండలేరు. ‘జాజ్ బ్లూస్ తన స్టైల్ ఆఫ్ మ్యూజిక్’గా చెబుతుంది అంజలి. View this post on Instagram A post shared by 𑁍 𝔸 ℕ 𝕁 𝔸 𝕃 𝕀 𑁍 (@anjalisivaraman) ముంబైలోని ఒక మ్యూజిక్ స్టూడియోలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న అంజలి యాదృచ్ఛికంగా నటనరంగంలోకి వచ్చింది. మోడలింగ్, టీవీ కమర్షియల్స్ ద్వారా గుర్తింపు పొందిన అంజలి క్రైమ్ డ్రామా థ్రిల్లర్ ‘క్లాస్’లో లీడ్‌రోల్ పోషించింది. సుహాని అహుజా పాత్రతో మంచి మార్కులు కొట్టేసింది. View this post on Instagram A post shared by 𑁍 𝔸 ℕ 𝕁 𝔸 𝕃 𝕀 𑁍 (@anjalisivaraman) -
ఎల్విస్ గిటారుకు రూ.2.25 కోట్లు
న్యూయార్క్: సంగీత ప్రపంచంలో రాక్ అండ్ రోల్ రారాజుగా పేరొందిన అమెరికన్ గాయకుడు, నటుడు ఎల్విస్ ప్రెస్లీకి చెందిన గిటారు న్యూయార్క్‌లో జరిగిన వేలంలో రికార్డుస్థాయిలో రూ.2. 25కోట్లకు అమ్ముడుపోయింది. 1969లో ఎల్విస్ ఆయన తండ్రి దీనిని బహూకరించారు. ఆ తర్వాత 1975లో ఓ అభిమానికి ఎల్విస్ దీన్ని కానుకగా ఇచ్చాడు. జూలియన్సంస్థ నిర్వహించిన ఇదే వేలంలో గాయకుడు మైఖేల్ జాక్సన్ కోటు రూ.1.72 కోట్ల ధర పలికింది. బీటిల్స్ బ్యాండ్ సహ వ్యవస్థాపకుడు, సంగీతకళాకారుడు జాన్ లెనిన్ స్వదస్తూరితో రాసిన పాట రూ.2.38కోట్లకు అమ్ముడుపోయింది. -
నీలి చిత్రాలు, పైరసీ సీడీలు స్వాధీనం
హైదరాబాద్ : నగరంలోని మల్కాజ్గిరి, యాదవ్‌నగర్‌లో ఓ మ్యూజిక్ షాప్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. నీలి చిత్రాల సీడీలను విక్రయిస్తున్నారనే సమచారంతో సైబరాబాద్ స్పెషల్ పోలీసులు శనివారం ఉదయం తనిఖీలు చేశారు. మల్కాజ్ గిరిలోని 'మ్యూజిక్ వరల్డ్' షాపులో సోదాలు చేపట్టిన పోలీసులు 27 నీలి చిత్రాల సీడీలు, 102 పైరసీ సీడీలు, ఒక కంప్యూటర్, రెండు సెల్ఫోన్లు, రూ.3,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు నగేష్ (43)ని అదుపులోకి తీసుకున్నారు. (మల్కాజ్గిరి) -
పాటకు పట్టాభిషేకం!
మీలో గానప్రతిభ ఉంది. ఆ ప్రతిభకు తగిన వేదిక గురించి మీకు తెలియకపోవచ్చు. మీకు సంగీతం అంటే బోలెడు ఇష్టం ఉంది. సంగీతానికి సంబంధించిన సరికొత్త ముచ్చట్లను, బంగారంలాంటి పాత పాటలను, అంతగా ఎవరూ వినని అద్భుతమైన పాటలను... ఇతరులతో పంచుకోవాలనే ఉత్సాహం మీలో ఉంది. మీలో ఇవన్నీ ఉన్నవి నిజమే అయితే ఫేస్బుక్లో ఆదరణ పొందుతున్న ‘మ్యూజిక్ వరల్డ్’ మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. మీలో ప్రతిభను ప్రపంచానికి చాటుతుంది.... రాజేష్‌శ్రీ, సురేఖాదాస్, అరుణా రమేష్....హైదరాబాద్‌కు చెందిన ఈ ముగ్గురికి ఉన్నత సాహిత్యవిలువలు ఉన్న పాటలు అంటే ఇష్టం. ఆ ఇష్టమే వారిని ఒకచోట కలిపింది. ఒకరికొకరు సినీ పాటల సంగీత మాధుర్యాలను క్రమం తప్పకుండా ‘ఫేస్బుక్’లో షేర్ చేసుకునేవారు. ‘‘మనలాంటి అభిరుచి ప్రపంచంలో ఎంతో మందికి ఉంటుంది. వారందరినీ ఎందుకు కలుపుకుపోకూడదు!’’ అని భావించారు. ఉత్తమ పాటల సేకరణ... అలా వారి ఆలోచనల నుండి పుట్టుకొచ్చిందే ‘మ్యూజిక్ వరల్డ్’. 2011లో ఫేస్బుక్లో ప్రారంభమైన ఈ సంస్థ పేరుకు తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ‘మ్యూజిక్ వరల్డ్’ ద్వారా టాలెంట్ హంట్ సాగించారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు అందులో ఎన్ని మంచి పాటలు ఉన్నా వాటికి అంతగా ప్రాచుర్యం లభించదు. గొప్పగా ఉండి కూడా ప్రాచుర్యానికి నోచుకోని తెలుగు సినిమా పాటలు బోలెడు ఉన్నాయి. అలాంటి పాటలను సేకరించి వాటిలోని రచనా వైశిష్ట్యాన్ని, స్వరరచనలోని గొప్పదనాన్ని విశ్లేషిస్తూ అన్ని వివరాలతో ‘పాటకు పట్టాభిషేకం’ అనే పేరుతో ఫేస్బుక్లో పెట్టేవారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఎన్నో లైక్‌లతో కొద్దికాలానికే ఎంతో మంది సభ్యులయ్యారు. వర్ధమాన గాయనీ గాయకులను అనేక టీవీ చానళ్లు పరిచయం చేస్తున్నాయి. అయితే అక్కడికి చేరుకోవడం ఎలాగో చాలా మందికి తెలియదు. అలాంటి వారికి ఒక వేదికగా ‘పాటకు పట్టాభిషేకం’ను ఫేస్బుక్లో తీర్చిదిద్దారు. ఔత్సాహిక గాయకులు తాము పాడిన పాటను సెల్ఫోన్లో రికార్డు చేసి పోస్ట్ చేస్తారు. ఇలా వచ్చిన పాటలను ‘మీరు పాడిన పాటలు’ పేరుతో ప్రతి శని, ఆదివారాల్లో వినవచ్చు. తద్వారా ఔత్సాహిక గాయకులలోని గానప్రతిభ ప్రపంచానికంతా తెలుస్తుంది. కేవలం పాడే వారి కోసమే కాదు, రాసే వారి కోసం కూడా ఒక వేదిక కలిపించడానికి ‘మీరు రాసిన పాటలు’ ప్రతి గురువారం ఫేస్బుక్లో సిద్ధంగా ఉంటుంది. లలిత సంగీతం, జానపద గీతాల కోసం ప్రతి శుక్రవారం, శని, ఆదివారాలు కేటాయించారు. సినీ సంగీతకారుల పుట్టిన రోజుల్లో ప్రత్యేక వ్యాసాలు, ప్రత్యేక కార్యక్రమం, వీడియోలు పోస్ట్ చేస్తారు. ఈ స్నేహం... భగవంతుడి వరం గ్రాఫిక్స్ డిజైనర్ అయినా రాజేశ్శ్రీకి సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇష్టం ఆయనతో పాటు పెరిగి పెద్దదైంది. పాత, కొత్త సినిమా పాటలపై ఫేస్బుక్లో విశ్లేషణలు రాయడం ద్వారా తన అభిరుచిని లోకంతో పంచకునేవారు. ఆలా ఆయనకు ఎందరో తోడయార్యురు. గత సంవత్సరం హైదరాబాద్‌లో తొలిసారిగా జరిగిన ‘మ్యూజిక్ వరల్డ్’ సమావేశానికి దేశం నలుమూలల నుంచి 80 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ ఏడాది జనవరి 26న కేవలం గాయకుల కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి వందమంది హాజరయ్యారు. ఔత్సాహిక గాయకులను ప్రపంచానికి పరిచయం చేయాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ‘‘నిర్వహణకు సంబంధించిన ఖర్చులను మేము ముగ్గురమే భరిస్తున్నాం. మా ముగ్గురిదీ భగవంతుడు కల్పించిన స్నేహం. అందుకే మ్యూజిక్వరల్డ్కు సంబంధించిన పనులను భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మా సభ్యుల సంఖ్య పద్నాలుగు వేలకు చేరుకుంది. ఇప్పటి వరకు ముఫ్పైమంది ఔత్సాహిక గాయకులకు మంచి అవకాశం కల్పించామనే తృప్తి ఉంది’’ అంటున్నారు ఆనందంగా రాజేష్‌శ్రీ. రాశి కాదు... వాసి ముఖ్యం ‘మ్యూజిక్ వరల్డ్’లో వీలైనంత ఎక్కువమందిని చేర్పిండమే లక్ష్యం కాదు. రాశి కంటే వాసికే ప్రాధాన్యమిస్తున్నారు. సభ్యత్వం కోరుకునేవారి వ్యక్తిగత వివరాలను పరిశీలిస్తారు. సభ్వత్వం ఇచ్చిన తరువాత వారి ప్రవర్తనను పర్యవేక్షిస్తారు. ఇతర సభ్యుల పట్ల సభ్యతగా వ్యవహరించిన వారికి మాత్రమే సభ్యత్వం ఇచ్చి గుర్తింపు కార్డును జారీచేస్తుంటారు. ‘‘వృత్తిపరమైననులు, ఇంటి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ మ్యూజిక్ వరల్డ్ కోసం తగిన సమయం కేటాయిస్తున్నాను. ప్రతిరోజూ నాకు కేటాయించిన పనులు పూర్తి చేస్తుంటాను. ఇష్టమైన పని కావడంతో, పని చేస్తున్నట్లు కాదు...పాటతో చెలిమి చేస్తున్నట్లుగా ఉంటుంది’’ అంటున్నారు సురేఖదాస్. ‘‘ఒకవైపు ఇంటి పనులు చేస్తూనే ఉదయం 8.30 గంటలకు సంగీత కార్యక్రమాలపై దృష్టి పెడతాను. కొంత విరామం తరువాత మళ్లీ 11.30 గంటల నుండి మ్యూజిక్వరల్డ్ బాధ్యతల్లో మునిగిపోతాను. రాత్రి 7-9 గంటల మధ్యలో ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంటాను.’’ అంటున్న అరుణా రమేష్ తాను చేస్తున్న పనిలో ఎంతో తృప్తి ఉందని చెబుతుంటారు. ‘మ్యూజిక్ వరల్డ్’ ద్వారా ఈ ముగ్గురు మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని ఆశిద్దాం. విశాఖపట్టణం దగ్గర ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక యువ గాయకుడు ఆర్థికపరిస్థితి దృష్ట్యా అవకాశాల కోసం పెద్దగా ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలో ‘మ్యూజిక్ వరల్డ్’ అతని గానప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కుర్రాడు డీడీలో ప్రసారమయ్యే ‘ఆలాపన’, రకరకాల స్టేజ్ షోలలో పాడాడు. పేరు తెచ్చుకున్నాడు. ఇలా ‘మ్యూజిక్ వరల్ట్’ ఇస్తున్న ప్రోత్సాహంతో అజ్ఞాతంలో ఉన్న ఎందరో గాయకుల ప్రతిభ ప్రపంచానికి పరిచయం అవుతోంది. - కొట్రా నందగోపాల్, సాక్షి, చెన్నై, ఫోటోలు: వన్నె శ్రీనివాసులు