ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ప్రముఖ సింగర్‌ కూతురు.. | Anjali Sivaraman: Well-Known For Her Music And Acting In Web Series | Sakshi
Sakshi News home page

Anjali Sivaraman: ఈ బ్యూటీని గుర్తుపట్టారా? రాధికా ఆప్టే చెల్లిలా ఉందే, కానీ కాదు, ఈమె ఎవరంటే..

Published Fri, Sep 29 2023 10:09 AM | Last Updated on Fri, Sep 29 2023 10:46 AM

Anjali Sivaraman Known For Her Music And Acting In Web Series - Sakshi

ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా? తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియకపోయినా బీటౌన్‌ ప్రేక్షకులకు మాత్రం ఈమె సుపరిచితమే. సడెన్‌గా చూస్తే.. ఈమె కంగనా రనౌత్‌, రాధికా ఆప్టేల పోలికలతో ఉన్నట్లు కనిపిస్తుంది. మరో యాంగిల్‌లో చూస్తుంటే.. హ్యాపీడేస్‌ ఫేమ్‌ స్రవంతి లాగానూ అనిపిస్తుంది. తన టాలెంట్‌ కన్నా గ్లామర్‌ ట్రీట్‌తో జనాలకు బాగా పరిచయమున్న ఈ బ్యూటీ పేరు అంజలి శివరామన్‌.  

తన యూనిక్‌ స్టైల్‌తో నటిగా మంచి పేరు తెచ్చుకున్న అంజలి శివరామన్‌ చక్కని గాయని కూడా. ‘నా నటనకు గానం అనేది ఎంతో ఉపయోగపడింది. క్రమశిక్షణతో ఉండడానికి కారణం అయింది. నన్ను నేను వ్యక్తీకరించుకునే సాధనం అయింది’ అంటుంది అంజలి. సింగర్‌ చిత్ర అయ్యర్‌ కూతురైన అంజలికి చిన్నప్పటి నుంచే స్వరాలతో స్నేహం ఏర్పడింది. స్కూల్‌ ఫంక్షన్‌ల నుంచి ఫ్యామిలీ ఫంక్షన్‌ల వరకు అంజలి పాట వినిపించాల్సిందే.

పాటలు అంటే ఇష్టం ఉన్నప్పటికీ మ్యూజిక్‌ క్లాస్‌కు తరచుగా బంక్‌ కొట్టేది. ఆ తరువాత మాత్రం సంగీత శిక్షణ ప్రాముఖ్యత తెలుసుకొని ప్రతిరోజూ క్లాస్‌కు తప్పకుండా హాజరయ్యేది. ‘సంగీతం నా రక్తంలోనే ఉంది’ అంటుంది అంజలి, అంజలి నోట పాట విన్న వారు...‘అమేజింగ్‌ వాయిస్‌’ అనకుండా ఉండలేరు. ‘జాజ్‌ బ్లూస్‌ తన స్టైల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’గా చెబుతుంది అంజలి.

ముంబైలోని ఒక మ్యూజిక్‌ స్టూడియోలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న అంజలి యాదృచ్ఛికంగా నటనరంగంలోకి వచ్చింది. మోడలింగ్, టీవీ కమర్షియల్స్‌ ద్వారా గుర్తింపు పొందిన అంజలి క్రైమ్‌ డ్రామా థ్రిల్లర్‌ ‘క్లాస్‌’లో లీడ్‌రోల్‌ పోషించింది. సుహాని అహుజా పాత్రతో మంచి మార్కులు కొట్టేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement