Geethanjali
-
"దుర్మార్గులు ట్రోల్ చేసి చంపేశారు" సీఎం జగన్ ఎమోషనల్..!
-
పెళ్లి వార్తలపై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా ఐదుసార్లు!
టాలీవుడ్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గీతాంజలి. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రీలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అంజలి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన పెళ్లిపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. పెళ్లి రూమర్స్‌పై అంజలి స్పందిస్తూ.. ' ఇప్పటికే నాకు తెలియకుండా నాలుగుసార్లు పెళ్లి చేశారు. మళ్లీ ఐదోసారి కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నేను కూడా చూశా. ఏకంగా పెళ్లి చేసుకుని వేరే ఇంట్లో ఉంటున్నట్లు రాశారు. వాళ్లకు తెలియని ఏంటంటే.. నేను అవుట్ డోర్ షూటింగ్స్‌లోనే ఎక్కువగా ఉంటున్నా. ఆ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్. కానీ నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా.. అది ఇప్పుడైతే కాదు. దానికి ఇంకా టైముంది' అని చెప్పుకొచ్చింది. కాగా.. గీతాంజలి మళ్లీ ఏప్రిల్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. గీతాంజలి.. విశ్వన్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ కనిపించనుంది. అంతే కాకుండా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టితో ఓ చిత్రం నటించనుంది. వీటితో పాటు మరో 6 సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. -
గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన కోన వెంకట్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పరామర్శించారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా తనకు చేయమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా శాడిజానికి గీతాంజలి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పవిత్ర ఆత్మను ట్రోలింగ్‌తో చంపేశారని అన్నారు. సోషల్ మీడియా సైకోయిజానికి తాను కూడా బాధితుడినేనని అన్నారు కోన వెంకట్. ఈ వేధింపులకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. వీటిని అడ్డుకునేందుకు వీలైతే కొత్త చట్టాలను తేవాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకుంటే ట్రోల్ చేస్తున్నారని, జనాన్ని భయపెడుతున్నారని అన్నారు. కాగా తనకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడంతో సొంతింటి కల నెరవేరిందంటూ తెనాలికి చెందిన గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. ఇంటి పట్టా రిజిస్టరై చేతికి వచ్చిన సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూపై.. టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోలు అసభ్య పదజాలంతో దూషించారు. గీతాంజలి వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర మనోవేదనలకు గురైన ఆమె రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్ బలంగా వినిపించింది. చదవండి: ‘పవన్ కూడా వెన్నుపోటు.. మరీ ఇంత దుర్మార్గమా?’ -
గీతాంజలి కేసు వేగవంతం...రహస్య ప్రాంతంలో నిందితులు
-
టిడిపి- జనసేన సోషల్ మీడియా సైకో మూకల కిరాతక క్రీడ
-
బోండా ఉమా అనుచరుడే !..గీతాంజలి కేసులో తొలి అరెస్ట్
-
గీతాంజలి కేసులో ఇద్దరి అరెస్ట్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్‌తో బలవనర్మణానికి పాల్పడిన గీతాంజలి కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుకు అనుచరుడిగా తెలుస్తోంది. దుర్గారావు అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జగనన్న పాలనలో తనకు మంచి జరిగిందంటూ ఇంటి పట్టా అందుకున్న ఆనందంలో గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. అయితే ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్ చేశారు. దీంతో.. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్ బలంగా వినిపించింది. ఏపీ పోలీసులు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసి.. పసుమర్తి రాంబాబును అరెస్ట్ చేశారు. గీతాంజలిపై రాంబాబు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాంబాబును అదుపులోకి తీసుకుని తెనాలి స్టేషన్‌కు తరలించారు. దుర్గారావు అనే మరో వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు గీతాంజలిపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన నేతల అకౌంట్ల పరిశీలన జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. చాలామంది పోస్టులు డిలీట్ చేసినప్పటికీ.. స్క్రీన్ షాట్లను పరిశీలించాక వాళ్లపై చర్యలు ఉంటాయని.. అలాగే పరారీలో ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. -
గీతాంజలి కేసులో దర్యాప్తు ముమ్మరం
-
గీతాంజలి ఘటన పై డాక్టర్ నూరి పర్వీన్ సంచలన కామెంట్స్
-
గీతాంజలి ఘటనపై..విజయసాయి రెడ్డి సీరియస్
-
గీతాంజలి ట్రోల్స్.. తప్పు ఒప్పుకున్న టీడీపీ
-
గీతాంజలి ట్రైన్ వీడియో..అడ్డంగా దొరికిన టీడీపీ
-
గీతాంజలి చివరి వీడియో
-
గీతాంజలి మృతికి సంతాపం క్యాండిల్ ర్యాలీ
-
గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల సాయం ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ..ఇంకా ఇతర అప్డేట్స్
-
వాన్ని వదలొద్దు గీతాంజలి భర్త ఆవేదన
-
గీతాంజలికి న్యాయం జరగాలి.. ‘జల్సా’ తో కట్టుకథ అల్లారు: పూనమ్ కౌర్
టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, పిల్లలను చదించడానికి అమ్మఒడి పథకం కింద డబ్బులు అందించారని, ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైఎస్సార్సీపీయే గెలుస్తుదని ఆమె చెప్పిన మాటలు వైరల్ కావడంతో.. ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు గీతాజంలిపై అసత్యాలను ప్రచారం చేశారు. ఆమెను ట్రోల్ చేస్తూ మానసికంగా హింసించారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల దాడికి తట్టుకోలేక గీతాంజలి రైలు కిందపడి చనిపోయింది. ఈ విషాదాకర ఘటనపై నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ.. గీతాంజలికి న్యాయం జరగాలని డిమాండ్ చేసింది. అలాగే ‘జల్సా’ సినిమా సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై కూడా స్పందించింది. గీతాంజలికి న్యాయం జరగాలి ‘గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలి ఎందుకు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది? ఓ పార్టికి చెందిన ఆన్లైన్ ట్రోలర్స్ కారణంగానే ఆమె చనిపోయిందా? అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం వారికి బాగా అలవాటు. దయచేసి వారిని శిక్షించండి. ఆ పసి పిల్లలకు న్యాయం చేయండి’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అవన్నీ పుకార్లు మాత్రమే సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారనే ఎక్కువ పాపులర్ అయ్యారు పూనమ్ కౌర్. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌లపై ఆమె చేసే ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. వీరిద్దరి బాగోతాలను నిర్భయంగా బయటపెట్టే ఏకైక నటి పూనమ్ మాత్రమే. అందుకే పవన్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తుంటారు. అంతేకాదు ఆమెపై ఓ కట్టుకథను కూడా అల్లారు. జల్సా సినిమాలో అవకాశం అడిగే ఇవ్వలేదని.. అందుకే ఆమె వారిద్దరిని టార్గెట్ చేసిందని ప్రచారం చేశారు. (చదవండి: సోషల్ మీడియా సైకోలు.. గీతాంజలి చేసిన తప్పేంటి?) తాజాగా దీనిపై స్పందించింది పూనమ్ కౌర్. అవన్నీ పూకార్లు మాత్రమేనని.. తాను ఇంత వరకు ఎవ్వరినీ కూడా అవకాశాలు అడుక్కోలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు నటన మీద మాత్రమే ఆదారపడకుండా ఎప్పుడూ ప్రత్యామ్నాయ జీవన మార్గాల కోసం వెతుకుతుంటానని చెప్పింది. తాను నటించిన సినిమాల కంటే తిరస్కరించిన సినిమాలే ఎక్కువని, దయచేసి అలాంటి రూమర్స్ నమ్మకండి అని మరోసారి తన అభిమానులను కోరింది పూనమ్. #JusticeForGeetanjali , I was confused about who led her to committing suicide , whether it’s online trollers of a particular party who are truly capable of physiologically abusing a woman or a volunteer who seems to go invisible. Please punish . Young girl kids deserve justice. — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 12, 2024 -
టీడీపీ చేసిన హత్యే ఇది..!
-
మీ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయి: పోతుల సునీత
-
ఆ వీడియో చూసి అ అమ్మ చాలా ఏడ్చింది
-
గీతాంజలి ఆత్మహత్యపై సీఎం జగన్ తీవ్ర విచారం
-
ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి: వరుదు కళ్యాణి
-
ప్రధాన కారణం ఆ ఇద్దరే..!
-
అదే గీతాంజలి చేసిన తప్పా? ఎమోషనల్ అయిన రోజా
-
గీతాంజలి ఉదంతం: సీఎం జగన్ విచారం.. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, అమరావతి: తెనాలి మహిళ గీతాంజలి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు!