గీతాంజలి కేసులో ఇద్దరి అరెస్ట్‌ | Bonda Uma Aide Arrested In Geethanjali Case | Sakshi
Sakshi News home page

గీతాంజలి కేసులో బోండా ఉమా అనుచరుడు సహా ఇద్దరి అరెస్ట్‌

Published Thu, Mar 14 2024 10:34 AM | Last Updated on Thu, Mar 14 2024 1:46 PM

Bonda Uma Aide Arrested In Geethanjali Case - Sakshi

సాక్షి, గుంటూరు: సోషల్‌ మీడియా ట్రోలింగ్‌తో బలవనర్మణానికి పాల్పడిన గీతాంజలి కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుకు అనుచరుడిగా తెలుస్తోంది.  దుర్గారావు అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

జగనన్న పాలనలో తనకు మంచి జరిగిందంటూ ఇంటి పట్టా అందుకున్న ఆనందంలో గీతాంజలి ఓ ప్రైవేట్‌ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. అయితే ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్‌ చేశారు. దీంతో.. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. 

ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. సోషల్‌ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్‌ బలంగా వినిపించింది. ఏపీ పోలీసులు కూడా  ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసి.. పసుమర్తి రాంబాబును అరెస్ట్‌ చేశారు. గీతాంజలిపై రాంబాబు సోషల్‌ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాంబాబును అదుపులోకి తీసుకుని తెనాలి స్టేషన్‌కు తరలించారు. దుర్గారావు అనే మరో వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు గీతాంజలిపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన నేతల అకౌంట్ల పరిశీలన జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. చాలామంది పోస్టులు డిలీట్‌ చేసినప్పటికీ.. స్క్రీన్‌ షాట్లను పరిశీలించాక వాళ్లపై చర్యలు ఉంటాయని.. అలాగే పరారీలో ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement