bonda uma maheswara rao
-
Vijayawada: మరెవరికీ ఇలాంటి అన్యాయం జరగొద్దు
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్సార్సీపీ దళిత నేత శిరోముండనం చేయించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ దళిత నాయకుడిపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గుండా గిరి చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశాడనే కోపంతో అధికారులను ఉపయోగించి మరీ నందెపు జగదీష్‌కు చెందిన భవనాన్ని జేసీబీతో కూల్చివేయించారు. ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన జగదీష్.. కూల్చేసిన భవనం ముందే శిరోముండనం చేయించుకుని అర్ధనగ్నంగా బోండా ఉమాకు నిరసన తెలియజేశారు. అనంతరం జగదీష్ మీడియాతో మాట్లాడారు. ‘‘నేను అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశానని అసూయతో, అధికార బలంతో భవనాలను కుప్పకూల్చారు. దీనిపై సీఎం చంద్రబాబుకు స్పందనలో ఫిర్యాదు చేస్తా. దళిత వైఎస్సార్సీపీ నాయకుడిగా ఉండటం నేను చేసిన తప్పా?. బోండా ఉమాకు అధికారం తోడవడంతో ఇటువంటి అన్యాయాలు ముందు రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. .. నేను మాజీ కార్పొరేటర్, కో ఆప్షన్ మెంబర్‌ను. నాకు న్యాయం జరగకపోతే, నా కుటుంబ సభ్యులకి శిరోముండనం చేసుకొని నిరసన తీవ్రతరం చేస్తా. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు’’ అని జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. -
గీతాంజలి కేసులో ఇద్దరి అరెస్ట్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్‌తో బలవనర్మణానికి పాల్పడిన గీతాంజలి కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుకు అనుచరుడిగా తెలుస్తోంది. దుర్గారావు అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జగనన్న పాలనలో తనకు మంచి జరిగిందంటూ ఇంటి పట్టా అందుకున్న ఆనందంలో గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. అయితే ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్ చేశారు. దీంతో.. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్ బలంగా వినిపించింది. ఏపీ పోలీసులు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసి.. పసుమర్తి రాంబాబును అరెస్ట్ చేశారు. గీతాంజలిపై రాంబాబు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాంబాబును అదుపులోకి తీసుకుని తెనాలి స్టేషన్‌కు తరలించారు. దుర్గారావు అనే మరో వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు గీతాంజలిపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన నేతల అకౌంట్ల పరిశీలన జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. చాలామంది పోస్టులు డిలీట్ చేసినప్పటికీ.. స్క్రీన్ షాట్లను పరిశీలించాక వాళ్లపై చర్యలు ఉంటాయని.. అలాగే పరారీలో ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. -
పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారు: బోండా ఉమ
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో టీడీపీలో వర్గవిభేదాలు, అంతర్గత వివాదాలు బయట పడుతున్నాయి. తెలుగుదేశం తమ్ముళ్లు బహిరంగానే కుమ్ములాటకు దిగుతున్నారు. తాజాగా కాకినాడు జిల్లా పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉప్పాడలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జయహో బీసీల సమావేశం జరిగింది. ఈ క్రమంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ జనసేన నేతల ఆందోళన దిగారు. ఇలా ఎందుకు జరిగిందని మాజీ ఎమ్మెల్యే వర్మను జనసేన నాయకులు నిలదీశారు. దీంతో ఇది టీడీపీ కార్యక్రమం అంటూ వర్మ సమాధానం చెప్పాడు. వర్మ సమాధానంపై జనసేన కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని జనసేన నాయకులు తెగేసి చెప్పారు. పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారు: బోండా ఉమ టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలావరకు ఫైనల్ అయిందని టీడీపీ నేత బోండా ఉమ మహేశ్వర రావు అన్నారు. పవన్‌కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది, అవే ప్రకటించారని అన్నారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారని అన్నారు. పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారని బోండా ఉమ ఎద్దేవా చేశారు. చదవండి: మాకు చెప్పకుండానే రెండు సీట్లు ప్రకటించారు -
‘అరగుండు పాత్రుడు దేవుడి దగ్గరా డ్రామాలేస్తే టెంకాయ పగిలిపోతుంది’
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేతల ఓవరాక్షన్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి.. టీడీపీ నేతలపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, ట్విట్టర్లో ‘అరగుండు పాత్రుడు దేవుడి దగ్గరా డ్రామాలేస్తే టెంకాయ పగిలిపోతుంది. నీ కోరికలేమిటో అందరికీ తెలుసు. బడుద్దాయి కొడుకుని నర్సీపట్నంలో గెలిపించాలి. వైజాగ్ రాజధాని కాకుంటే ఖనిజాలు దోచుకున్నా, భూములు ఆక్రమించినా ఎవరి దృష్టీ పడదు. ఉత్తరాంధ్ర పేదరికం అలాగే ఉండాలని కోరుకున్న గంజాయి పాత్రుడు. బోండం ఒరిజినల్ బిజినెస్ చిత్తు కాగితాలు ఏరుకోవడం. దుర్గగుడి దగ్గర సైకిల్ బెల్లులు కొట్టేసిన డబ్బుతో కాల్ మనీ వ్యాపారం చేసే బోండం, నర్సీపట్నంలో గంజాయి అరగుండు పాత్రుడు, దెందులూరులో కోడిపందాల కాంతారావు వంటి స్క్రాప్ ను పెంచి పోషించిన దుర్మార్గం 40ఏళ్ల ఇండస్ట్రీ తుప్పుదే’ అన్నారు. ఈ నాలుగింటిలో బొల్లి బాబు ఏ రకం? 1)అధికారం మా చేతిలోనే ఉండాలి. 2)అసమర్థుడైనా పప్పే సీఎం కావాలి. 3)కుల దైవం డ్రామోజీకి బతికుండగానే ఊరూరా గుళ్ళు కట్టించాలి. 4)వ్యవస్థలన్నిటిలో మావాళ్లే ఉండాలి. బోండం ఒరిజినల్ బిజినెస్ చిత్తు కాగితాలు ఏరుకోవడం. దుర్గగుడి దగ్గర సైకిల్ బెల్లులు కొట్టేసిన డబ్బుతో కాల్ మనీ వ్యాపారం చేసే బోండం, నర్సీపట్నంలో గంజాయి అరగుండు పాత్రుడు, దెందులూరులో కోడిపందాల కాంతారావు వంటి స్క్రాప్ ను పెంచి పోషించిన దుర్మార్గం 40ఏళ్ల ఇండస్ట్రీ తుప్పుదే. #RIPTDP — Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2022 అరగుండు పాత్రుడు దేవుడి దగ్గరా డ్రామాలేస్తే టెంకాయ పగిలిపోతుంది. నీ కోరికలేమిటో అందరికీ తెలుసు. బడుద్దాయి కొడుకుని నర్సీపట్నంలో గెలిపించాలి. వైజాగ్ రాజధాని కాకుంటే ఖనిజాలు దోచుకున్నా, భూములు ఆక్రమించినా ఎవరి దృష్టీ పడదు. ఉత్తరాంధ్ర పేదరికం అలాగే ఉండాలని కోరుకున్న గంజాయి పాత్రుడు. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2022 ఈ నాలుగింటిలో బొల్లి బాబు ఏ రకం? 1)అధికారం మా చేతిలోనే ఉండాలి. 2)అసమర్థుడైనా పప్పే సిఎం కావాలి. 3)కుల దైవం డ్రామోజీకి బతికుండగానే ఊరూరా గుళ్ళు కట్టించాలి. 4)వ్యవస్థలన్నిటిలో మావాళ్లే ఉండాలి. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2022 -
పోలీస్ వ్యవస్థను అగౌరవపరిచిన ‘బొండా’పై చర్యలు తీసుకోండి
అనంతపురం/గుంటూరు ఈస్ట్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, డీజీపీని, పోలీస్ వ్యవస్థను అగౌరవపరుస్తూ మాట్లాడిన విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం అనంతపురం నగరంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది ఇస్తాక్ అహమ్మద్ మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన దీక్షలో పాల్గొన్న బొండా.. బాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా, సీఎం జగన్‌ను అగౌరవపరుస్తూ మాట్లాడారన్నారు. గొడవలు సృష్టించేలా ఆయన వ్యాఖ్యలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా ఆ ప్రసంగాన్ని టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు. ‘మా నాయకుడు చిటికేస్తే మీ డీజీపీ, మీ పోలీసులు ఎంతమంది ఉన్నా.. తాడేపల్లి మీద దాడి చేసి ఒక్క గంటలో ధ్వంసం చేస్తామం’టూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, అక్కడే ఉన్న చంద్రబాబుగానీ, ఇతర నాయకులు గానీ వారించే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బొండాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు యత్నం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాను అరెస్ట్ చేయాలంటూ అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో గుంటూరు నగర మేయర్ కావటి నాగమనోహర్‌నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సీఎంను దూషించడమే కాకుండా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూలగొడతామంటూ సవాలు విసిరి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న బొండా ఉమాను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను పట్టాభి అమలు చేసినట్టు చెప్పారు. -
బోండా ఉమాకు మెదడువాపు వచ్చినట్లుంది
సాక్షి, విజయవాడ: వైసీపీ అభివృద్ధి కార్యక్రమాలపై బోండా ఉమా మాట్లాడుతున్న తీరు చూస్తే ఆయనకు మెదడువాపు వచ్చిందేమో అనిపిస్తుంది అన్నారు వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్. రేపు ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బొప్పన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అండ్ కో హైద్రాబాద్‌లో, ఏపీలో వీళ్ళే అభివృద్ధి చేసినట్టు చెప్పుకుంటున్నారు. బోండా ఉమా వెన్ను పోటు పొడిచింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాదు.. మీ లీడర్ చంద్రబాబు. మా నాయకుడు దమ్ము, ధైర్యంతో పార్టీ నుంచి బయటికి వచ్చి రాజీనామా చేసి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. 2014 నుంచి 2019 వరకూ, ఇన్ని ఏళ్లలో మీ ప్రభుత్వం చేసిన పనులు, మీరు చేసిన పనులపై చర్చిద్దాం. బోండా ఉమా, వాళ్ళ పార్టీ నాయకులు రండి. నేను, మా పార్టీ నాయకులు వస్తాము. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో చర్చిద్దాం. ఏ విషయం పైన అయిన చర్చించడానికి మేము సిద్ధం. మీరు రెడీనా.. మీకు దమ్ము ఉందా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎలాంటి పిచ్చి కూతలు కుసిన ఖబడ్దార్. ప్రజలు మీకు ఈ సారి ఆ 23 సీట్లు కూడా ఇవ్వరు అని’ అని బొప్పన హెచ్చరించారు. బోండా ఉమాను మహిళలే కొడతారు: నాగేశ్వరరావు బోండా ఉమా చాలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారన్నారు మాజీ కార్పొరేటర్ నాగేశ్వరావు. ‘మా నాయకుడు పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని ఈ రోజు అవి అన్ని తీరుస్తున్నారు. మా నాయకుడిని ప్రపంచమే మెచ్చుకుంటుంది. అసలు రంగుల సంప్రదాయం తీసుకోచ్చిందే టీడీపీ. ఒక కాపు నాయకుడిగా ఉండి కాపులకు బోండా ఉమా ఏం చేశాడు. మా ముఖ్యమంత్రి జగన్‌ని ఏమన్నా.. ప్రభుత్వం ద్వారా ఇస్తున్న పథకాలకు అడ్డుపడిన నీ నియోజకవర్గంలో ఉన్న మహిళలే నిన్ను కొడతారు’ అంటూ బోండా ఉమాపై నాగేశ్వరా రావు మండిపడ్డారు. -
బోండా ఉమాపై మల్లాది విష్ణు ఫైర్
సాక్షి, విజయవాడ : నగరంలో కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర నిర్మించిన ఫ్లై ఓవర్‌పై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే పార్థ సారధి, తాను ఫ్లై ఓవర్ పూర్తి చేయాలని 2013లోనే కేంద్ర మంత్రిని కలిశామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నుంచే విజయవాడ అభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఉందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లై ఓవర్‌ను ఏడాదిలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు ఏమయ్యాయి?. దుర్గ గుడి ఫ్లై ఓవర్ విషయంలో మేము మొదటినుంచి అనుకూలంగానే ఉన్నాము. 2013లోనే దుర్గగుడి ఫ్లై ఓవర్‌కు తొలి అడుగు పడింది. ( దేవదాయ శాఖ నిధుల మళ్లింపు అవాస్తవం ) విజయవాడ నగరంలో డ్రైనేజీ వ్యవస్థకు 500 కోట్ల రూపాయలు వస్తే.. మీరు ఏం చేశారో తెలుసు. ఈ రోజు రాష్ట్రంలో 5 కోట్ల మందికి వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి, అందుతున్నాయి. కోర్టుల పేరుతో ఈ రోజు పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్నారు. విజయవాడ నగరంలో మూడు నియోజకవర్గాల్లో లక్ష మందికి ఇల్లు ఇస్తుంటే టీడీపీ వాళ్లు అడ్డుకుంటున్నారు. జక్కంపూడిలో 15 వేల ఇళ్ల నిర్మాణానికి 50 వేల నుంచి లక్ష రూపాయలు జమ చేయించకపోతే దక్కవని దోచుకున్నది టీడీపీ నేతలే’’నన్నారు. -
దొంగ స్వామిజీ... కుప్పం బాలాజీ!
సాక్షి, విజయవాడ : ‘అతను స్వామిజీ కాదు.. పంతులూ కాదు.. టీడీపీ నాయకుడు... పార్టీని అడ్డంపెట్టుకొని ఇక్కడ కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసేశాడు. దేవుడి పేరుతో గుడిని కట్టి... స్వామీజీగా అవతారం ఎత్తి అక్కడికి వచ్చే మహిళలు, బాలికలపై వికృతచేష్టలకు పాల్పడుతుంటాడు.. అతడికి ఓ మాజీ ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆయన ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయాయి’ అంటూ దొంగ స్వామిజీ కుప్పం బాలాజీ గురించి అనేక ఆసక్తికర విషయాలను అక్కడి ప్రజలు వెలుగులోకి తీసుకువస్తున్నారు. గుడి ఆవరణలోనే అన్నీ.. టీడీపీ నాయకుడు కుప్పం బాలాజీ, పార్టీ నాయకుల అండదండలతో ప్రకాష్‌నగర్‌లోని కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ చిన్న గుడిని నిర్మించాడు. ఆ గుడి ఆవరణలో మూడు గదులను నిర్మించుకొని పగలు కాసేపు స్వామిజీ వేషధారణలో ఉండడం గుడికి వచ్చే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తుంటాడని, కాస్త బలహీనతతో ఉన్న మహిళలు గదిలోకి వస్తే ప్రత్యేక పూజలు చేస్తా, అమ్మవారి బొట్టు పెడతా, తాయిత్తులు కడతానంటూ లోపలికి తీసుకువెళ్లి వారిని తాకరాని చోట్ల తాకడం, బలహీనపడిన వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తుంటాడని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇది చదవండి : లైంగిక దాడికి ప్రయత్నం.. పూజారికి దేహశుద్ధి! ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తమకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి పోలీసులకు చెప్పవచ్చని, బాధితుల వివరాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. ఫిర్యాదు అందితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. – ప్రభాకర్, నున్న సీఐ -
రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలను గుర్తించాలి : కోగంటి
సాక్షి, విజయవాడ : స్వతంత్ర సమర యోధుడు భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన వాడు బోండా ఉమా అని రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలను మనం గమనించాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం అన్నారు. సుమశ్రీ చనిపోయినా బోండా ఉమాపై కేసు ఫైల్ చేయడానికి పోలీసులు భయపడుతున్నారని పేర్కొన్నారు. బోండా ఉమను ఎమ్మెల్యే గా భావించాల్సిన అవసరం లేదని అన్నారు. సింగ్ నగర్, బుడమేరు వంతెనఫై బోండా ఉమా, కుటుంబ సబ్యులు సృష్టించిన అరాచకానికి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారని తెలిపారు. తనపై 24కేసులు ఉన్నాయని బోండా అనే గూండా అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తనపై 3 కేసులు మాత్రమే ఉన్నాయని.. గణపతి స్వామిని కాజేసి బోండా ఉమా తన పై దొంగ కేసు పెట్టించారని వాపోయారు. వెల్లంపల్లి శ్రీను రెండవ కేసు పెట్టారని తెలిపారు. ఏబీ వెంకటేశ్వరరావు ఒక తప్పుడు కేసులో తనను ఇరికించారన్నారు. తనపై దుర్బాషలాడిన బోండా ఉమామహేశ్వరరావు కుటుంబసభ్యుల పై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బోండా ఉమా అనుచరుల రౌడీయిజం
సాక్షి, విజయవాడ : టీడీపీ నేతల దౌర్జన్యానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రౌడీయిజం చెలాయిస్తూ.. తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ నేతలపై కయ్యానికి కాలుదువ్వుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలో చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మల్లాది విష్ణుకు మద్దతుగా జరుగుతున్న ప్రచారంలో బోండా ఉమామహేశ్వరరావు అనుచరులు రౌడీయిజాన్ని ప్రదర్శించారు. మల్లాది విష్ణుకు మద్దతుగా కోగంటి సత్యనారాయణ ప్రచారం చేస్తుండగా.. బుడమేరు వంతెన వద్ద బోండా ఉమా అనుచరులు దుర్భాషలాడుతూ.. వాగ్వాదానికి దిగారు. టీడీపీ నినాదాలు చేస్తూ.. బల ప్రదర్శనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. -
‘చింతమనేని’ని కలిసేందుకు వెళ్లి.. ఆదృశ్యం!
-
గబ్బర్ సింగ్ గురితప్పాడు...
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్‌పై చేసిన వ్యాఖ్యలను పవన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గబ్బర్ సింగ్ గురి తప్పాడంటూ.. తక్షణమే చంద్రబాబు, లోకేశ్‌కు పవన్ క్షమాపణ చెప్పాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ గురువారమిక్కడ డిమాండ్ చేశారు. అర్థం పర్థం లేని విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. లోకేశ్ పెద్ద నాయకుడు అవుతాడనే.. పవన్ టీడీపీనే టార్గెట్ చేశారని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. కేంద్రం కుట్రలో భాగంగానే పవన్ మాట్లాడరని, ఆయన బీజేపీతో కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. బీజేపీ సహకారం లేకున్నా సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. పవన్ తన కార్యకర్తలకు సూచనలు ఇవ్వకుండా టీడీపీని టార్గెట్ చేశారన్నారు. కేంద్రం కుట్రలో భాగంగానే పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. 90 శాతం ఎర్ర చందనం అక్రమ రవాణాను నిరోధించామని చినరాజప్ప తెలిపారు. డబ్బులు తీసుకోండి...జనసేనకు ఓటెయ్యండని పవన్ చెప్పడం విచారకరమన్నారు. నీతుల చెప్పే పవన్ డబ్బులు తీసుకోమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. లోకేశ్ రాబోయే రోజుల్లో పెద్ద నాయకుడు అవుతాడని పవన్ టార్గెట్ చేశాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యేలు ఉన్నారనడం బాధాకరమని చినరాజప్ప అన్నారు. పవన్ పార్ట్‌టైం పొలిటీషియన్ పవన్ కల్యాణ్ బీజేపీ స్క్రిప్ట్ చదువుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో చేయాలని హితవు పలికారు. ‘చంద్రబాబుపై పవన్ అర్థంలేని ఆరోపణలు చేశారు. ఏ ఉద్దేశంతో సీఎం, లోకేశ్‌పై విమర్శలు చేశారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి. బీజేపీపై ఎందుకు విమర్శలు చేయలేదు. ఆ పార్టీ ఆడినట్లు ఎందుకు ఆడుతున్నారు. లోకేశ్ అవినీతి గురించి ఒక్క ఆధారాన్ని చూపించండి. శేఖర్ రెడ్డికి లోకేశ్‌కు ఏమి సంబంధం. లోకేశ్‌కు శేఖర్‌రెడ్డికి సంబంధం ఉందని ప్రధానమంత్రి మోదీ మీకు చెప్పారా?. బీజేపీ ఓ వైపు జనసేన, మరోవైపు వైఎస్ఆర్ సీపీని పెట్టుకుని రాజకీయాలు చేస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ పేరు పవన్ తన ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదు. పవన్ పార్ట్‌టైం పొలిటీషియన్. రాష్ట్ర సమస్యలపై అతడికి అవగాహన లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడైనా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిశారా?. పవన్ వల్ల కాపులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఏనాడైనా కాపుల కోసం కృషి చేశారా?. రాజకీయ ఉనికి కోసమే పవన్ టీడీపీపై విమర్శలు చేశారు.’ అని బోండా ఉమ మండిపడ్డారు. -
'ఆ ఒప్పందాల్లో రహస్యాలు లేవు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల ఒప్పందాల్లో ఎటువంటి రహస్యాలు లేవని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. సింగపూర్ ప్రభుత్వానికి 58 శాతం వాటా ఇస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రభుత్వానికి 42 శాతం వాటా ఉంటుందని అన్నారు. ఎకరం రూ. 4 కోట్లకు తగ్గకుండా అమ్ముతామని తెలిపారు. భూముల ఒప్పందం ఏపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వానికి మధ్య జరుగుతుందని చెప్పారు. ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకోమని బోండ ఉమ స్పష్టం చేశారు. -
'చంపుతా, పాతరేస్తానన్న సస్పెండ్ చేయలేదు'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంప్రదాయాలను అధికారపక్షం తుంగలో తొక్కిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం తిరుపతిలో జరిగిన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కమిటీ సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ పోడియం వద్ద వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. రికార్డులో లేని మాటలను సాకుగా చూపి ఏడాదిపాటు సస్పెండ్ చేశారని మండిపడ్డారు. అంతేకాక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను చంపుతా, పాతరేస్తానన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావును ఒక్క రోజు కూడా సస్పెండ్ చేయలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కొడుకు వీరంగాన్ని వెనకేసుకొచ్చిన ఎమ్మెల్యే!
విజయవాడ: బెజవాడ రోడ్లపై తన రెండవ కొడుకు రవితేజ, అతని అనుచరుల వీరంగాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెనకేసుకొచ్చారు. తన కొడుకు ఏ తప్పు చేయలేదని ఆయన చెప్పారు. కేవలం 15 బైకులు, రెండు కార్లతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. గోరంత ర్యాలీని కొన్ని మీడియాలు కొండంత చేసి చూపాయన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు ఈ-చలాన్ కడితే సరిపోతుందని చెప్పారు. గతంలో మిగతా పార్టీలు కూడా అనుమతిలేకుండా ర్యాలీలు నిర్వహించినట్లు చెబుతూ తన కొడుకు చర్యలను బొండా ఉమ సమర్ధించారు. -
బోండా కుమారుడి బర్త్ డే:యువకుల హల్ చల్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా యువకులు నగర రోడ్లపై హల్ చల్ చేశారు. ఎమ్మెల్యే కుమారుడి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆదివారం అతని స్నేహితులు విజయవాడలోని ఏలూరు, బందరు రోడ్డులపై బైకులపై షికార్లు కొట్టారు. మితిమీరిన వేగంతో టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలు నడుపుతూ.. హారన్ల మోత మోగించారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా బొండా రవితేజ స్నేహితులు బైకులు, కార్లతో ర్యాలీ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న వారికి ఒక రకమైన నిబంధనలు, సాధారణ ప్రజలకు మరో రకమైన నిబంధనలు పాటించడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై పోలీస్ అధికారుల నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడం గమనార్హం. -
బోండా బ్యాచ్ వీరంగం