బోండా కుమారుడి బర్త్ డే:యువకుల హల్ చల్ | bonda uma maheswara rao son's birthday celebrations | Sakshi
Sakshi News home page

బోండా కుమారుడి బర్త్ డే:యువకుల హల్ చల్

Published Sun, May 10 2015 7:15 PM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM

బోండా కుమారుడి బర్త్ డే:యువకుల హల్ చల్

బోండా కుమారుడి బర్త్ డే:యువకుల హల్ చల్

విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా యువకులు నగర రోడ్లపై హల్ చల్ చేశారు. ఎమ్మెల్యే కుమారుడి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆదివారం అతని స్నేహితులు విజయవాడలోని ఏలూరు,  బందరు రోడ్డులపై బైకులపై  షికార్లు కొట్టారు.

మితిమీరిన వేగంతో టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలు నడుపుతూ.. హారన్ల మోత మోగించారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా  బొండా రవితేజ స్నేహితులు బైకులు, కార్లతో ర్యాలీ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న వారికి ఒక రకమైన నిబంధనలు, సాధారణ ప్రజలకు మరో రకమైన నిబంధనలు పాటించడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై పోలీస్ అధికారుల నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement