
సాక్షి, విజయవాడ: ఉపాధికి కేరాఫ్‌గా అడ్రస్‌గా విరాజిల్లుతున్న బెజవాడ బిసెంట్ రోడ్డులో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు (బోండా ఉమ) అనుచరులు గుండా గిరి చేస్తున్నారు. చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారు. బీసెంట్ రోడ్డు మధ్యలో బోండా ఉమా అనుచరులు 12 తోపుడు బండ్లు ఏర్పాటు చేశారు.తోపుడు బండ్లకు పోలీసుల్ని బందోబస్తు పెట్టారు.
అయితే, బోండా ఉమ అనుచరుల తోపుడు బండ్ల కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని బీసెంట్ రోడ్డులోని హాకర్స్ వాపోతున్నారు. సేవ్ బీసెంట్ రోడ్డు పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన షాపుల యజమానులు తమ నిరసనలు తెలుపుతున్నారు. బోండా ఉమా అనుచరులు ఏర్పాటు చేసిన తోపుడు బండ్లు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. బోండా ఉమా పది మంది అనుచరుల కోసం 300 కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు. బీసెంట్ రోడ్డు యూనియన్ నాయకులపై రౌడీషీట్ ఓపెన్ చేయిస్తామని బెదిరిస్తున్నారు
పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి మా పై కేసులు పెడుతున్నారని వాపోతున్నారు. టీడీపీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment