మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాతో బాలాజీ
సాక్షి, విజయవాడ : ‘అతను స్వామిజీ కాదు.. పంతులూ కాదు.. టీడీపీ నాయకుడు... పార్టీని అడ్డంపెట్టుకొని ఇక్కడ కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసేశాడు. దేవుడి పేరుతో గుడిని కట్టి... స్వామీజీగా అవతారం ఎత్తి అక్కడికి వచ్చే మహిళలు, బాలికలపై వికృతచేష్టలకు పాల్పడుతుంటాడు.. అతడికి ఓ మాజీ ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆయన ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయాయి’ అంటూ దొంగ స్వామిజీ కుప్పం బాలాజీ గురించి అనేక ఆసక్తికర విషయాలను అక్కడి ప్రజలు వెలుగులోకి తీసుకువస్తున్నారు.
గుడి ఆవరణలోనే అన్నీ..
టీడీపీ నాయకుడు కుప్పం బాలాజీ, పార్టీ నాయకుల అండదండలతో ప్రకాష్‌నగర్‌లోని కార్పొరేషన్ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ చిన్న గుడిని నిర్మించాడు. ఆ గుడి ఆవరణలో మూడు గదులను నిర్మించుకొని పగలు కాసేపు స్వామిజీ వేషధారణలో ఉండడం గుడికి వచ్చే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తుంటాడని, కాస్త బలహీనతతో ఉన్న మహిళలు గదిలోకి వస్తే ప్రత్యేక పూజలు చేస్తా, అమ్మవారి బొట్టు పెడతా, తాయిత్తులు కడతానంటూ లోపలికి తీసుకువెళ్లి వారిని తాకరాని చోట్ల తాకడం, బలహీనపడిన వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తుంటాడని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇది చదవండి : లైంగిక దాడికి ప్రయత్నం.. పూజారికి దేహశుద్ధి!
ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం
బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తమకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి పోలీసులకు చెప్పవచ్చని, బాధితుల వివరాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. ఫిర్యాదు అందితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
– ప్రభాకర్, నున్న సీఐ
Comments
Please login to add a commentAdd a comment