Woman Attack On RTC Bus Driver At Vijayawada - Sakshi
Sakshi News home page

ఆవేశంలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. బిత్తరపోయిన ప్రయాణికులు

Published Sat, Jul 30 2022 7:42 PM | Last Updated on Sun, Jul 31 2022 11:39 AM

Women Attack On RTC Bus Driver At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. ఆవేశంలో ఊగిపోతూ విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది. ఆమె ఓవరాక్షన్‌కు బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. 

వివరాల ప్రకారం.. విజయవాడలోని కంట్రోల్‌ రూమ్‌ సమీపంలో ఆర్టీసీ బస్సులో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. ఆర్టీసీ బస్సు తన బైకును ఢీకొట్టడంతో సదరు మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోపంలో ఊగిపోతూ బస్సును ఆపింది. అనంతరం, బస్సులో డ్రైవర్‌ను ఎడాపెడా చితకబాదింది. కాగా, ఘటన పోలీసుల దృష్టికి చేరడంతో విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: అబద్దాలకు లిమిట్‌ లేదా.. 1983లో చంద్రబాబు టీడీపీలో ఉన్నారా?: అంబటి ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement