సాక్షి, విజయవాడ : స్వతంత్ర సమర యోధుడు భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన వాడు బోండా ఉమా అని రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలను మనం గమనించాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం అన్నారు. సుమశ్రీ చనిపోయినా బోండా ఉమాపై కేసు ఫైల్ చేయడానికి పోలీసులు భయపడుతున్నారని పేర్కొన్నారు. బోండా ఉమను ఎమ్మెల్యే గా భావించాల్సిన అవసరం లేదని అన్నారు.
సింగ్ నగర్, బుడమేరు వంతెనఫై బోండా ఉమా, కుటుంబ సబ్యులు సృష్టించిన అరాచకానికి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారని తెలిపారు. తనపై 24కేసులు ఉన్నాయని బోండా అనే గూండా అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తనపై 3 కేసులు మాత్రమే ఉన్నాయని.. గణపతి స్వామిని కాజేసి బోండా ఉమా తన పై దొంగ కేసు పెట్టించారని వాపోయారు. వెల్లంపల్లి శ్రీను రెండవ కేసు పెట్టారని తెలిపారు. ఏబీ వెంకటేశ్వరరావు ఒక తప్పుడు కేసులో తనను ఇరికించారన్నారు. తనపై దుర్బాషలాడిన బోండా ఉమామహేశ్వరరావు కుటుంబసభ్యుల పై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment