Koganti satyam
-
రాహుల్ హత్య కేసు: పోలీసు కస్టడీకి కోగంటి సత్యం
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోగంటి సత్యాన్ని గురువారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కోగంటి సత్యాన్ని విజయవాడ సబ్‌జైలు నుంచి మాచవరం పీఎస్‌కు తరలించారు. కాగా పోలీసులు రాహుల్ హత్య కేసు విషయమై కోగంటి సత్యాన్ని నేడు, రేపు విచారించనున్నారు. ఇక ఈ హత్య కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ అయ్యారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాహుల్ హత్యకు కారణాలివే.. కోరాడ విజయ్‌కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్‌ఫండ్ కంపెనీ నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్‌ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్‌కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్‌కుమార్ రాహుల్‌ను కోరాడు. అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్‌పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్‌కుమార్ స్నేహితురాలు గాయత్రికి రాహుల్ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్ బిజినెస్‌లో కాంట్రాక్ట్ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చకపోవడంతో రాహుల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్ హత్యకు దారితీశాయి. చదవండి: రాహుల్ హత్య కేసు: మరో నలుగురు అరెస్ట్ రాహుల్ హత్యకేసు: వెలుగులోకి సంచలన విషయాలు -
రాహుల్ హత్య కేసును ఛేదించిన విజయవాడ పోలీసులు
-
రాహుల్ హత్య: చార్జర్ వైర్‌తో చంపేశారు
గుణదల (విజయవాడ తూర్పు) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్ హత్య కేసు మిస్టరీ వీడింది. సెల్‌ఫోన్ చార్జర్ వైర్ మెడకు బిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి రాహుల్‌ను చంపేశారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కీలక ఆధారాలు సేకరించి, పలువురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను కమిషనర్ శుక్రవారం మీడియాకు వివరించారు. ఆర్థిక లావాదేవీలే ముఖ్య కారణం.. కోరాడ విజయ్‌కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్‌ఫండ్ కంపెనీ నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్‌ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్‌కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్‌కుమార్ రాహుల్‌ను కోరాడు. అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్‌పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్‌కుమార్ స్నేహితురాలు గాయత్రికి రాహుల్ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్ బిజినెస్‌లో కాంట్రాక్ట్ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చకపోవడంతో రాహుల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్ హత్యకు దారితీశాయి. హత్య జరిగిందిలా.. ఈ నెల 18వ తేదీ రాత్రి విజయ్‌కుమార్‌తో పాటు సీతయ్య, బాబూరావు అనే వ్యక్తి కలిసి రాహుల్‌ను తమ కారులో సీతారామపురంలోని కోరాడ చిట్‌ఫండ్ కంపెనీకి తీసుకెళ్లారు. అక్కడ రాహుల్‌కు, విజయకుమార్‌కు కంపెనీల వాటాల విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో విజయ్‌కుమార్ రాహుల్‌పై దాడి చేశాడు. కోగంటి సత్యం సూచన మేరకు అక్కడ నుంచి రాహుల్‌ను తీసుకుని దుర్గా కళామందిరం వద్దకు చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసిన డాక్యుమెంట్లపై రాహుల్‌పై దాడి చేసి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. అనంతరం పథకం ప్రకారం రాహుల్‌ను బందరు రోడ్డులో పార్క్ చేసిన కారు వద్దకు తెచ్చారు. కారులో ఎక్కాక రాహుల్‌కు విజయ్‌కుమార్, సీతయ్య, బాబురావు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముందు సీటులో ఉన్న రాహుల్‌ను చిత్రహింసలు పెట్టి.. సెల్‌ఫోన్ చార్జర్ వైర్ మెడకు బిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. నిందితుల అరెస్ట్.. మృతుని తండ్రి కరణం రాఘవరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పది రోజుల వ్యవధిలోనే కీలక ఆధారాలు సేకరించి, పరారీలో ఉన్న నిందితుల్లో ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, రాహుల్ హత్య కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించామని కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కోరాడ విజయ్‌కుమార్ (ఏ1), నల్లూరు రవికాంత్ (ఏ14), కఠారపు కోటేశ్వరరావు అలియాస్ కోటి (ఏ10), కఠారపు గాంధీబాబు అలియాస్ గాంధీ (ఏ11), కిలారి అనంత సత్యనారాయణ (ఏ6), షేక్ మహబూబ్ జానీ (ఏ8)ని శుక్రవారం అరెస్టు చేశామని, కేసులో కీలక నిందితుడు, ప్రధాన సూత్రధారి కోగంటి సత్యంను ఈనెల 23న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని వివరించారు. మిగిలిన ఆరుగురు నిందితులను కూడా 48 గంటల్లోపు అరెస్టు చేస్తామని కమిషనర్ చెప్పారు. కాగా, తొలుత 14 మంది నిందితులుగా గుర్తించినప్పటికీ ఓ మహిళ ప్రమేయంపై ఆధారాలు లేకపోవడంతో.. 13 మందినే నిందితులుగా గుర్తించామని పోలీసులు పేర్కొంటున్నారు. ఇవీ చదవండి: పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడు: ధర్మాన కృష్ణదాస్ అంతర్వేది సాగర తీరం.. విభిన్న స్వరూపం! -
రాహుల్ హత్య కేసు: మరో 11 మంది నేడు కోర్టు ముందుకు
సాక్షి, విజయవాడ: జిల్లాలో వ్యాపారి రాహుల్ హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో 11 మంది నిందితులని పోలీసులు నేడు కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోగంటి సత్యం అరెస్ట్ కాగా.. మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. కోరాడ విజయ్ కుమార్, గాయత్రి, సీతయ్య, సుబ్బారావులతో పాటు మరో ఆరుగురిని గుర్తించారు. వీరందరిని వైద్య పరీక్షల అనంతరం సాయంత్రం కోర్టు ముందుకు తీసుకురానున్నారు. అనంతరం రాహుల్ హత్య కేసుపై కమిషనర్ మీడియాతో మాట్లాడనున్నారు. కాగా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే రాహుల్‌ను హత్య చేశారని, సాక్ష్యాదారాలను తారుమారు చేసేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీసులు సీసీటీవీ, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఇప్పటికే వెల్లడించారు. చదవండి: రాహుల్ హత్యకేసు: వెలుగులోకి సంచలన విషయాలు -
రాహుల్ హత్యకేసు: వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, విజయవాడ: రాహుల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాహుల్ హత్యలో కోగంటి సత్యం ప్రధాన సూత్రధారి కాగా.. కోరాడ విజయ్‌కుమార్ పాత్రధారిగా వ్యవహరించాడు. వీరిద్దరు కలిసి రాహుల్‌ను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. తలపై పలుమార్లు బలంగా మోదడంతో మెదడు నరాలు చిట్లాయి. కారులోనే తాడుతో గొంతుకి ఉరేసి చంపి మరొక తాడుని సంఘటనా స్ధలంలో ఉంచారు. సాక్ష్యాదారాలని తారుమారు చేయడానికి రకరకాల ఎత్తుగడలకు పాల్పడ్డారు. హత్య కోసం కొత్త ఫోన్లు, కొత్త సిమ్‌లు బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. రాహుల్ హత్యకేసులో మొత్తం 12 మంది పాత్ర ఉన్నట్లు తెలిసింది. వాహనాలు మార్చి... మనుషులని మార్చి.. పోలీసులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇక రాహుల్ హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న వంద సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ కాల్‌డేటా, బ్యాంకు లావాదేవీలతో నిజాలు బయటపడ్డాయి. ఫ్యాక్టరీని కోగంటి సత్యానికి అమ్మేసి తన 30 శాతం వాటా డబ్బులు ఇవ్వాలని కోరాడ విజయ్ రాహుల్‌పై ఒత్తిడికి పాల్పడ్డారు. రాహుల్ మాట వినకపోవడంతో కోగంటి ఆదేశాలతో కారులోనే అతనిపై హత్యకు పాల్పడ్డారు ఇక వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో ఏ2 నిందితుడు కోగంటి సత్యంకు విజయవాడ 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించేందుకు ఎర్పాట్లు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించారు. చదవండి: వ్యాపారి హత్య కేసులో కోగంటి సత్యంకు రిమాండ్ -
వ్యాపారి హత్య కేసులో కోగంటి సత్యంకు రిమాండ్
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో ఏ2 నిందితుడు కోగంటి సత్యంకు విజయవాడ 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించేందుకు ఎర్పాట్లు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించారు. కోవిడ పరీక్ష అనంతరం నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. కాగా, రాహుల్ హత్య తర్వాత రెండ్రోజుల పాటు పరారీలో ఉన్న కోగంటి సత్యంను విజయవాడ పోలీసులు నిన్న బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్ కూడా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. చదవండి: కామం మైకంలో ప్రైవేటు పార్ట్‌కు డ్రగ్స్.. తెల్లారి లేచి చూస్తే -
రాహుల్ హత్య కేసు: విజయవాడ మెజిస్ట్రేట్ ముందుకు కోగంటి సత్యం
విజయవాడ: పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న కోగంటి సత్యంను పోలీసులు విజయవాడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అంతకముందు కేసులో ఏ-2గా ఉన్న కోగంటి సత్యంను బెంగళూరులో అరెస్ట్ చేశారు. కాగా విజయవాడ విడిచివెళ్లొదంటూ రెండు రోజుల క్రితం కోగంటి సత్యంకు పోలీసులు నోటీసులు అందించారు. తాను విజయవాడలోనే ఉంటానని.. ఎప్పుడు పిలిచినా వస్తానని కోగంటి సత్యం పోలీసులకు వివరించాడు. అయితే సోమవారం మధ్యాహ్నం కోగంటి సత్యం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమై విజయవాడ మాచవరం పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారం అందించగా.. సత్యంను బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్టు చేసి దేవనపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. -
ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్టీల్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆర్ధిక లావాదేవీల వివాదం వల్లే విజయవాడకు చెందిన వ్యాపారవేత్త కోగంటి సత్యం ఈ హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయమున్న ఐదుగురు కీలక నిందితులైన కోగంటి సత్యం, శ్యామ్, ప్రసాద్, ప్రీతమ్, రాములను మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్య కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ సోమవారం మీడియాకు వెల్లడించారు. భూ వివాదమే హత్యకు కారణమని... పక్కా పథకం ప్రకారమే రాంప్రసాద్‌ను హతమార్చారని...హత్యకు నెల రోజుల ముందు నుంచి రెక్కీ నిర్వహించారని డీసీపీ తెలిపారు. హత్య జరిగే సమయంలో కోగంటి సత్యం సోమాజిగూడ యశోదా ఆస్పత్రి సమీపంలోనే ఉన్నారని, హత్య జరిగిన తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. అయితే ఈ హత్య కేసులో తన ప్రమేయం లేకుండా ఉండేలా సత్యం జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. చదవండి: రాంప్రసాద్ హత్య కేసులో సంచలన నిజాలు కాగా రాంప్రసాద్, కోగంటి సత్యం చాలా ఏళ్లపాటు కలిసి వ్యాపారం చేశారని, ఈ నేపథ్యంలో కోగంటి సత్యంకు రూ.70కోట్లు రాంప్రసాద్ బాకీ పడ్డారన్నారు. అయితే రూ.23 కోట్లు చెల్లించేలా ఇరువురి మధ్య సెటిల్మెంట్ జరిగిందని, చెల్లించాల్సిన రుణాన్ని భారీగా తగ్గించినా రాంప్రసాద్ అప్పు తీర్చలేదని కోగంటి సత్యం ఆగ్రహంతో కక్ష కట్టినట్లు చెప్పారు. ఈ హత్య కోసం రూ.10 లక్షల సుపారీ ఇచ్చేందుకు సత్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు అనుచరుడు శ్యాం తన వాటర్ ప్లాంట్‌లోనే తయారైనట్లు చెప్పారు. కేసులో ప్రమేయం ఉన్న మరో ఆరుగురు పరారీలో ఉన్నారని డీసీపీ వెల్లడించారు. ఇక కోగంటి సత్యంపై 21 కేసులు ఉన్నాయని తెలిపారు. చదవండి: ‘రాంప్రసాద్‌ను చంపింది నేనే’ -
కోగంటే సూత్రధారి!
సాక్షి, హైదరాబాద్/అమరావతి బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్టీల్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు నెలల క్రితమే ఆయన హత్యకు నిందితులు కుట్ర పన్నినట్లు ప్రధాన నిందితుడైన కోగంటి సత్యం విచారణలో వెలుగుచూసింది. అయితే, ఎన్నికల నేపథ్యంలో హత్య అమలు వాయిదా పడింది. రాంప్రసాద్ కదలికలపై మొత్తం మూడుచోట్ల రెక్కీ నిర్వహించిన నిందితులు.. కుట్ర అమలుకు అనుకూలంగా ఉంటుందనే పంజగుట్ట ప్రాంతాన్ని ఎంచుకున్నారని బయటపడింది. ఈ కేసులో కోగంటి సత్యం సహా మొత్తం పది మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు గురువారం రాత్రి వరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అలాగే, ఈ హత్య పథక సూత్రధారి కోగంటి సత్యమే అని కూడా నిర్ధారణకు వచ్చారు. రాంప్రసాద్‌ను చంపేందుకు కిరాయి హంతకులకు కోటి రూపాయల సుపారీ ఇచ్చినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. రంగంలోకి దిగిన ప్రధాన అనుచరుడు.. విజయవాడకు చెందిన కామాక్షి స్టీల్స్ వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదాలు, మధ్యలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జోక్యం.. రెండు నెలల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద కోగంటి సత్యం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురికావడం తదితర పరిణామాల నేపథ్యంలో రాంప్రసాద్‌ను హత్య చేయాలని కోగంటి సత్యం నిర్ణయించుకున్నాడు. ఆ పనిని తన ప్రధాన అనుచరుడైన శ్యామ్‌కు అప్పగించాడు. ఎన్నికల కారణంగా పోలీసుల తనిఖీలు విస్తృతంగా ఉండడం.. రాంప్రసాద్ ఆచూకీ స్పష్టంగా తెలియకపోవడంతో కోగంటి సత్యం తన పథకాన్ని వాయిదా వేశాడు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత శ్యామ్, సురేష్‌లు తమ అనుచరుడైన ఆనంద్‌ను రంగంలోకి దింపి రాంప్రసాద్ ఆచూకీ కనిపెట్టే బాధ్యత అప్పగించారు. గది అద్దెకు తీసుకుని గాలింపు.. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆనంద్ ఓ గది అద్దెకు తీసుకుని గాలింపు మొదలు పెట్టాడు. చివరకు రాంప్రసాద్ ఆచూకీ కనిపెట్టిన అతను.. పరిగిలో రాంప్రసాద్ నిర్వహిస్తున్న అభిరామ్ స్టీల్స్ ఫ్యాక్టరీ, గచ్చిబౌలిలోని నివాసం, పంజగుట్టలోని కార్పొరేట్ కార్యాలయాలను గుర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న శ్యామ్, సురేష్‌లు.. హైదరాబాద్ వచ్చి ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఫ్యాక్టరీ వద్ద దాడిచేస్తే కార్మికులు చూసి తమను పట్టుకోవడం, ఎదురుదాడి చేయడం లేదా రాంప్రసాద్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లే అవకాశం ఉందని భావించారు. ఇంటి వద్ద కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉండటంతో అక్కడ కూడా దాడి చేయకూడదని నిర్ణయించుకున్నారు. పంజగుట్టలో అభిరామ్ స్టీల్స్ కార్యాలయం సమీపంలో ఉన్న దేవాలయం వద్దే అనువుగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని కోగంటి సత్యంకి చెప్పడంతో అతడి నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన శ్యామ్, చోటు, రమేష్ తదితరులు గత శనివారం రాత్రి రాంప్రసాద్‌ను మట్టుబెట్టారు. ఈ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం పది మందికి పాత్ర ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కోగంటి సత్యం, శ్యామ్, చోటు, రమేష్, ఆనంద్, సురేష్ సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు పట్టుకున్నారు. హత్య జరిగిన సమయంలో మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. నిందితుల్ని శుక్రవారం అరెస్టుచేసే అవకాశం ఉంది. ఇప్పటికే హత్యకు వినియోగించిన వాహనాలు, ఆయుధాలు, సెల్ఫోన్లు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితులపై నేరం నిరూపించడానికి అవసరమైన ఇతర ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు తీరు తెన్నుల్ని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు నిందితులకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. రోడ్డు ప్రమాదం తర్వాతే హత్యకు ప్రణాళిక రెండు నెలల కిందట మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై కోగంటి సత్యం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అప్పట్లో దీనిపై ఆయన ఎవరిపై అనుమానం వ్యక్తంచేయలేదు. అయితే, ఈ ప్రమాదం వెనుక రాంప్రసాద్ హస్తమున్నట్లు గుర్తించిన సత్యం.. మరోవైపు కామాక్షి స్టీల్స్ వ్యాపార లావాదేవీల వివాదం తీవ్రరూపం దాలుస్తుండడంతో భవిష్యత్తులో అతని నుంచి తనకెదురయ్యే ముప్పును తప్పించుకునేందుకే రాంప్రసాద్ హత్యకు ప్రణాళిక రూపొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకోసం రూ. కోటి వరకు సత్యం సుపారీ ఇచ్చినట్లు.. ఈ చెల్లింపులన్నీ శ్యామ్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉంటే.. రెండు దశాబ్దాలుగా స్టీలు వ్యాపార రంగంలో ఉన్న కోగంటి సత్యంపై విజయవాడ నగరంలో మొత్తం 24 కేసులున్నాయి. ఏ–1 రౌడీషీట్ కూడా ఉంది. వైజాగ్, విజయవాడలో ఆస్తి, వ్యాపార తగాదాలు ఉన్నాయి. ఇందులో మూడు కేసులు మినహా అన్ని కేసులు కొట్టేశారు. -
రాంప్రసాద్ హత్య కేసులో సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్ : క్రైమ్ సస్సెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న పారిశ్రామికవేత్త తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసును హైదరాబాద్ ట్రాన్స్‌ఫోర్స్ పోలీసులు చేధించారు. విజయవాడకు చెందిన కోగంటి సత్యం అనే వ్యాపారవేత్త ఈ హత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మర్డర్‌లో మొత్తం 8 మంది హస్తం ఉందని, వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పారు. శనివారం రాత్రి రాంప్రసాద్పై దాడి జరిగినప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సత్యంను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. సంచలన విషయాలను రాబట్టారు. (చదవండి : హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్త హత్య ) ఆరు నెలల ముందే రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. నెల రోజుల ముందే కోగంటి అనుచరుడు పంజాగుట్టలో ఓ గదిని రెంట్‌కు తీసుకున్నాడు. పక్కా ప్లాన్‌తో కోగంటి సత్యం డైరెక్షన్లోనే హత్య జరిగింది. తన పాత్రను బయటపెట్టకుండా కోగంటి జాగ్రత్త పడ్డాడు. రాంప్రసాద్ హత్యకు కోగంటి రూ.30 లక్షలు సుపారి ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. కోగంటి వాడిన 5 సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు వాడిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అదుపులో ఉన్న వ్యక్తుల ఇచ్చిన వివరాల ఆధారంగా వాహనం, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ స్టీల్ వ్యాపారి బన్సల్ , హైదరాబాద్ కు చెందిన సియోట్ కంపెనీ ఓనర్లతో పాటు మరొకొంత మంది అనుమానితులను కూడా పోలీసులు విచారించనున్నారు. (చదవండి : టాస్క్‌ఫోర్స్ అదుపులో కోగంటి సత్యం) కాగా రాంప్రసాద్ ను హత్య చేసింది తానే అంటూ నిందితుడు శ్యామ్ మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే ఈ హత్యకు కోగంటికి సంబంధం ఎలాంటి సంబంధంలేదని చెప్పాడు. రాంప్రసాద్ వల్ల తీవ్రంగా నష్టపోయానని, ఆయన నుంచి తనకు రూ.15 లక్షలు రావాల్సి ఉందని పేర్కొన్నాడు. దీంతోపాటు రాంప్రసాద్ వద్ద కేసులు ఎదుర్కొంటూ అన్ని విధాలుగా నష్టపోయానన్నాడు. ఆ సందర్భంలో తనను కలిసిన రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్ సుపారీ ఇచ్చాడని, రాంప్రసాద్‌ను హత్య చేస్తే రూ.30 లక్షలు చెల్లిస్తానంటూ ఒప్పందం చేసుకున్నట్లు వివరించాడు. దీంతో తన అనుచరులైన ఛోటు, రమేష్‌లతో కలిసి రాంప్రసాద్‌ను హత్య చేశానని పేర్కొన్నాడు. -
క్రైమ్ సస్సెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న రాంప్రసాద్ హత్య
-
టాస్క్‌ఫోర్స్ అదుపులో కోగంటి సత్యం
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్టలో జరిగిన తెలప్రోలు రాంప్రసాద్ హత్యకేసులో కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ హత్యకు సంబంధించి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు విజయవాడకు చెందిన వ్యాపారవేత్త కోగంటి సత్యంను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి రాంప్రసాద్పై దాడి జరిగినప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సత్యం.. అక్కడినుంచే మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈయన కోసం గాలించిన ప్రత్యేక బృందాలు హబ్సిగూడ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది. ఇదంతా జరుగుతుండగానే.. సోమవారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు హఠాత్తుగా తెరపైకి వచ్చారు. విజయవాడకు చెందిన టెక్కెం శ్యాంప్రసాద్ అలియాస్ శ్యామ్‌తో పాటు అతడి అనుచరులు ఛోటు, రమేష్ మీడియాకు రహస్య ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంలో శ్యామ్ మాట్లాడుతూ తానే మిగిలిన ఇద్దరితో కలిసి రాంప్రసాద్‌ను హత్య చేశానని వెల్లడించాడు. రాంప్రసాద్ వల్ల తీవ్రంగా నష్టపోయానని, ఆయన నుంచి తనకు రూ.15 లక్షలు రావాల్సి ఉందని పేర్కొన్నాడు. దీంతోపాటు రాంప్రసాద్ వద్ద కేసులు ఎదుర్కొంటూ అన్ని విధాలుగా నష్టపోయానన్నాడు. ఆ సందర్భంలో తనను కలిసిన రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్ సుపారీ ఇచ్చాడని, రాంప్రసాద్‌ను హత్య చేస్తే రూ.30 లక్షలు చెల్లిస్తానంటూ ఒప్పందం చేసుకున్నట్లు వివరించాడు. దీంతో తన అనుచరులైన ఛోటు, రమేష్‌లతో కలిసి రంగంలోకి దిగానని పేర్కొన్నాడు. ఆఫీసులో ఉంటాడని తెలిసే.. శనివారం రోజున పంజాగుట్టలోని కార్యాలయానికి రాంప్రసాద్ వస్తాడనే విషయాన్ని తమకు ఊర శ్రీనివాస్ చెప్పాడని శ్యామ్ వెల్లడించాడు. దీంతో హత్యకు పథకం వేశామని, విజయవాడలో ఉన్న తన వాటర్ ప్లాంట్‌లోనే మూడు కత్తుల్ని ప్రత్యేకంగా తయారు చేయించానని వెల్లడించాడు. వాటిని తీసుకుని హైదరాబాద్‌కు వచ్చి ఓ ప్రాంతంలో బస చేశామని, దాదాపు 15రోజుల పాటు రెక్కీ చేసిన తర్వాతే శనివారం రాత్రి కాపుకాసి కత్తులతో దాడి చేశామని వివరించాడు. హత్యానంతరం అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కారులో ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు వెళ్ళిపోయామని తెలిపాడు. సోమవారం లొంగిపోవాలని నిర్ణయించుకుని వచ్చామని శ్యామ్ చెప్పాడు. ఈ కేసుతో కోగంటి సత్యంకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. విజయవాడకు చెందిన శ్యామ్‌పై అక్కడ రౌడీషీట్ కూడా ఉందని పోలీసులు చెప్పారు. గతంలో రాంప్రసాద్ కిడ్నాప్, హత్యాయత్నం కేసులో కోగంటి సత్యంతో కలిసి జైలుకు కూడా వెళ్ళాడంటున్నారు. ఈ కేసు తర్వాతే సత్యం ఇతడితో విజయవాడలోని తన కార్యాలయానికి పక్కనే వాటర్ ప్లాంట్ పెట్టించాడని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో శ్యామ్ హఠాత్తుగా వచ్చి లొంగిపోవడం, హత్య కేసులో సత్యం పాత్ర లేదంటూ చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిని నివృత్తి చేసుకోవడానికే సత్యంతో పాటు పోలీసుల ఎదుట లొంగిపోయిన ముగ్గురినీ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మరోపక్క విజయవాడలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చిన కోగంటి సత్యం పెద్దల్లుడు కృష్ణారెడ్డిని కూడా ఇక్కడే ప్రశ్నిస్తున్నారు. ఈ కేసును ప్రత్యేక బృందాలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. -
‘రాంప్రసాద్‌ను చంపింది నేనే’
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులొకొచ్చింది. రాంప్రసాద్‌ని తానే హత్య చేశానంటూ శ్యామ్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి నేరం ఒప్పుకున్నాడు. తనతోపాటు చోటూ, నరేష్‌తో కలిసి ఈ హత్య చేసినట్టు అతను ఒప్పుకున్నాడు. అయితే హత్య చేయించింది కోగంటి సత్యం అని రాంప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా... వాటిని ఖండిస్తూ తానే హత్య చేశానని శ్యామ్ నేరం ఒప్పుకోవడం గమనార్హం. ఈ కేసులో శ్యామ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి శ్యామ్ భార్య మాట్లాడుతూ.. ‘మూడు రోజుల క్రితం నా భర్త పని ఉందని బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి వాటర్ ప్లాంట్‌ను నేను చూసుకుంటున్నాను. అయితే రాంప్రసాద్‌ని నా భర్త హత్య చేశాడనే విషయం నాకు తెలీదు. కానీ రాంప్రసాద్ మా మీద పెట్టిన కేసులు వల్ల ఆర్థికంగా నష్టపోయి.. మానసిక ఇబ్బందులు పడ్డాం. రాం ప్రసాద్ పెట్టిన కేసుల వల్ల పోలీసులు అర్థరాత్రి మా ఇంటికి వచ్చి సోదాలు జరిపి ఇంట్లో ఉన్న విలువైన కాగితాలు, డబ్బు, నగలు పట్టుకుపోయారు. రాంప్రసాద్ మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడ’ని తెలిపారు. -
హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్త హత్య
సాక్షి, హైదరాబాద్/అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: పారిశ్రామికవేత్త తేలప్రోలు రాంప్రసాద్ (49) హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ఆయన దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా పంజగుట్ట వద్ద దుండగులు కత్తులతో పొడిచా రు. తీవ్రగాయాల పాలైన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని భట్టిప్రోలుకు చెందిన రాంప్రసాద్ తన ఇద్దరు పిల్లలు అఖిల్, నిహారి, భార్య వైదేహితో కలిసి 2017లో హైదరాబాద్‌కు వచ్చారు. ప్రస్తుతం ఖాజాగూడలో నివాసం ఉంటూ పరిగిలో అభిరాం స్టీల్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. సంస్థ కార్పొరేట్ కార్యాలయాన్ని పంజ గుట్ట దుర్గానగర్‌లో ఏర్పాటు చేశారు. ప్రతీ శనివారం కార్యాలయం మూసే సమయంలో దాని పక్కనే ఉన్న కళ్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లడం ఆయనకు అలవాటు. ఈ శనివారంరాత్రి 8:20 సమయంలో దైవదర్శనం అనంతరం బయటకు వచ్చిన సమయంలో అక్కడే కాపుకాసి ఉన్న ముగ్గురు వ్యక్తులు కత్తులతో ఆయనపై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచారు. దీంతో రాంప్రసాద్ అక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం దుండగులు కారులో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న రాంప్రసాద్‌ను అంబులెన్స్‌లో సోమాజి గూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. పోలీసులు ఘటనాస్థలిలో సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఆ కాలనీ మొత్తం చీకటిగా ఉండటంతో నిందితులను స్పష్టంగా గుర్తించలేకపోయారు. కిరాయి హంతకుల పనిగా పోలీసులు నిర్థారించారు. అయితే దుండగులు పారిపోయిన కారు నంబర్ గుర్తించారు. ఆ కారు చిత్తూరుకు చెందిన చిరునామాతో ఉంది. కారు నంబర్ ప్లేట్ మార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు.. రాంప్రసాద్ భార్య వైదేహి ఫిర్యాదు మేరకు విజయవాడకు చెందిన కోగంటి సత్యం అనే వ్యక్తిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోగంటి సత్యంతో ఆర్థిక వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు వైదేహి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సత్యంపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు నిమిత్తం విజయవాడకు ప్రత్యేక బృందాన్ని పంపారు. హత్య జరిగిన సమయానికి కోగంటి సత్యం పంజగుట్ట ప్రాం తంలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. కంపెనీ ఆర్థిక లావాదేవీలు కాస్తా రాజకీయ వైరంగాను మారడంతో రాంప్రసాద్ హత్య దర్యాప్తు ఒకే కోణంలో చూడలేమని పోలీసులు చెబుతున్నా రు. సత్యం ప్రతి వారం పటమట పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉందని, ఈవారం రాకపోవడం తో ఆయన ఎక్కడికి వెళ్లారనేది ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను విచారించామని సీఐ దుర్గారావు తెలిపా రు. ఆదివారంరాత్రి పంజాగుట్ట పోలీసులు సత్యం పెద్ద అల్లుడు పొచంపల్లి కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసి, విచారణ కోసం హైదరాబాద్‌కు తరలించారు. బొండా ఉమా భాగస్వామి.. కోగంటి సత్యం ఎండీగా ఉంటూ కామాక్షి స్టీల్ ట్రేడర్స్ పేరుతో విజయవాడలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. 2008లో ఈ సంస్థలో రాంప్రసాద్‌తో పాటు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తదితరులు కూడా భాగస్వామిగా ఉండేవారు. 2013లో వ్యాపార లావాదేవీల్లో తేడాలు రావడంతో రాంప్రసాద్, బొండా ఉమ బయటకు వెళ్లిపోయారు. బొండా ఉమా, రాంప్రసాద్ తనను మోసం చేశారని కోగంటి సత్యం అప్పట్లో ఆరోపించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాంప్రసాద్, సత్యం విజయవాడలోని కృష్ణలంకలో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. బొండా ఉమా సహకారంతో రాంప్రసాద్ కిడ్నాప్ కేసు పెట్టారని సత్యం ఆరోపించారు. అప్పట్లో సత్యంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోగంటి సత్యంపై రౌడీషీట్ కూడా తెరిచారు. పథకం ప్రకారం నన్ను ఇరికిస్తున్నారు ‘‘రాంప్రసాద్ హత్యతో నాకు సంబంధం లేదు. పథకం ప్రకారం కొందరు నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు. నాపై రాంప్రసాద్ కుటుంబం ఆరోపణలు చేయడం వెనుక టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేను బొండా ఉమాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్లే ఆయన కక్షగట్టారు. కామాక్షి స్టీల్స్‌లో నాతో పాటు బొండా ఉమా కూడ వ్యాపార భాగస్వామిగా ఉండేవారు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు బొండా ఉమ తన వాటా కింద ఉన్న షేర్లను రాంప్రసాద్‌కు విక్రయించారు. రాంప్రసాద్ నాకే రూ. 26 కోట్లు ఇవ్వాలి. రాంప్రసాద్‌ను చంపితే నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? డబ్బులు అడిగినప్పుడల్లా నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఈ రోజు ఉదయం టీవీలో వార్తలు చూసే వరకూ కూడ రాంప్రసాద్ హత్యకు గురైన విషయం నాకు తెలియదు. రాంప్రసాద్‌కు అతని బావమరిదితో కూడ గొడవలున్నాయి. చాలా మందికి రాంప్రసాద్ డబ్బులు ఇవ్వాలి. మూడు రోజుల క్రితం నేను తిరుపతికి వెళ్లాను. అక్కడి నుంచి ఫిజియోథెరపీ చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాను. హత్య విషయంలో తెలంగాణ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తాను. ఎక్కడికి నేను పారిపోలేదు. అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేయాలి’’. – మీడియాతో కోగంటి సత్యం. -
‘ఆ హత్యకేసులో బోండా ఉమ ప్రమేయం ఉంది’
సాక్షి, హైదరాబాద్ : పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోగంటి సత్యం స్పష్టం చేశారు. శనివారం పంజాగుట్టలో రాంప్రసాద్‌ను ముగ్గురు దుండగులు కత్తులతో పొడిచి హత్యచేసి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై కోగంటి సత్యంకు సంబంధం ఉందని అందుకే అజ్ఞాతంలోకి వెళ్లారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తనను కావాలనే ఈ కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాంప్రసాద్ నుంచి తనకు 26 కోట్లు రావాలని, అలాంటప్పుడు తానేలా హత్యచేస్తానని ప్రశ్నించారు. నాపై కక్ష్యపూరితంగానే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ హత్యకేసులో బోండా ఉమా, ఏబీ వెంకటేశ్వరరావు ప్రమేయం ఉందని అన్నారు. గతంలో కూడా ఏబీ వెంకటేశ్వర రావుతో కలిసి బోండా ఉమా తనపై తప్పుడు కేసులు బనాయించారని గుర్తు చేశారు. తానేమీ అజ్ఞాతంలో లేనని, ఫిజియోథెరపీ కోసం హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు. -
పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసులో కొత్త కోణం వెలుగుచూసింది. వ్యాపారా లావాదేవీల్లో జరిగిన గొడవలే హత్యకు కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెలరోజులుగా రాంప్రసాద్‌కు విజయవాడకు చెందిన బిజినెస్ పార్టనర్ నుంచి బెదిరింపులు వస్తూ ఉండేవని, వాటా నిమిత్తం న్యాయంగా రావాల్సిన 50 కోట్లకు సంబంధించి అతగాడిపై కృష్ణలంక పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో రాంప్రసాద్‌ను చంపేశారని చెబుతున్నారు. నిన్న హైదరాబాద్ పంజాగుట్టలో రాంప్రసాద్‌ను ముగ్గురు దుండగులు కత్తులతో పొడిచి హత్యచేసి పారిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు రాంప్రసాద్ హత్య విజయవాడలోనూ కలకలం రేపుతోంది. ఆర్ధిక లావాదేవీలతోనే మాజీ వ్యాపార భాగస్వామి కోగంటి సత్యం...రాంప్రసాద్ హత్యకు స్కెచ్ వేసాడన్న కుటుంబసభ్యుల ఆరోపణపై పోలీసులు దృష్టి పెట్టారు. అయితే రాంప్రసాద్ హత్యకు కోగంటికి ఎలాంటి సంబంధం ఆయన అనుచరులు చెబుతునన్నారు. కాగా పటమటలోని కోగంటి సత్యం నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను విచారణ చేశారు. అయితే కోగంటి సత్యం ప్రతి వారం పటమట పీఎస్‌లో సంతకం చేయాల్సి ఉందని, ఈ వారం రాకపోవడం వల్లే ఆయన కుటుంబసభ్యులను విచారించామని సీఐ దుర్గారావు తెలిపారు. -
రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలను గుర్తించాలి : కోగంటి
సాక్షి, విజయవాడ : స్వతంత్ర సమర యోధుడు భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన వాడు బోండా ఉమా అని రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలను మనం గమనించాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం అన్నారు. సుమశ్రీ చనిపోయినా బోండా ఉమాపై కేసు ఫైల్ చేయడానికి పోలీసులు భయపడుతున్నారని పేర్కొన్నారు. బోండా ఉమను ఎమ్మెల్యే గా భావించాల్సిన అవసరం లేదని అన్నారు. సింగ్ నగర్, బుడమేరు వంతెనఫై బోండా ఉమా, కుటుంబ సబ్యులు సృష్టించిన అరాచకానికి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారని తెలిపారు. తనపై 24కేసులు ఉన్నాయని బోండా అనే గూండా అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తనపై 3 కేసులు మాత్రమే ఉన్నాయని.. గణపతి స్వామిని కాజేసి బోండా ఉమా తన పై దొంగ కేసు పెట్టించారని వాపోయారు. వెల్లంపల్లి శ్రీను రెండవ కేసు పెట్టారని తెలిపారు. ఏబీ వెంకటేశ్వరరావు ఒక తప్పుడు కేసులో తనను ఇరికించారన్నారు. తనపై దుర్బాషలాడిన బోండా ఉమామహేశ్వరరావు కుటుంబసభ్యుల పై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే బోండా ఉమాపై కోగంటి సత్యం ఫైర్
విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై పారిశ్రామికవేత్త కోగంటి సత్యం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన విజయవాడలో డుండి గణేష్‌ను దర్శించుకున్నారు. డుండి గణేషుడికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బోండా ఉమాపై కోగంటి సత్యం నిప్పులు చెరిగారు. డుండి గణేష్ ఉత్సవాలను దౌర్జన్యంగా కబ్జా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే బోండా ఉమా గుండాలా వ్యవహరించారంటూ మండిపడ్డారు. అధికార పార్టీ బలాన్ని ఉపయోగించి తనను తప్పుడు కేసుల్లో ఇరికించినట్టు విమర్శించారు. ఎమ్మెల్యే బోండా రౌడీయిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని కోగంటి సత్యం తెలిపారు.