సాక్షి, విజయవాడ: రాహుల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాహుల్ హత్యలో కోగంటి సత్యం ప్రధాన సూత్రధారి కాగా.. కోరాడ విజయ్‌కుమార్ పాత్రధారిగా వ్యవహరించాడు. వీరిద్దరు కలిసి రాహుల్‌ను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. తలపై పలుమార్లు బలంగా మోదడంతో మెదడు నరాలు చిట్లాయి. కారులోనే తాడుతో గొంతుకి ఉరేసి చంపి మరొక తాడుని సంఘటనా స్ధలంలో ఉంచారు.
సాక్ష్యాదారాలని తారుమారు చేయడానికి రకరకాల ఎత్తుగడలకు పాల్పడ్డారు. హత్య కోసం కొత్త ఫోన్లు, కొత్త సిమ్‌లు బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. రాహుల్ హత్యకేసులో మొత్తం 12 మంది పాత్ర ఉన్నట్లు తెలిసింది. వాహనాలు మార్చి... మనుషులని మార్చి.. పోలీసులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇక రాహుల్ హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న వంద సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ కాల్‌డేటా, బ్యాంకు లావాదేవీలతో నిజాలు బయటపడ్డాయి. ఫ్యాక్టరీని కోగంటి సత్యానికి అమ్మేసి తన 30 శాతం వాటా డబ్బులు ఇవ్వాలని కోరాడ విజయ్ రాహుల్‌పై ఒత్తిడికి పాల్పడ్డారు. రాహుల్ మాట వినకపోవడంతో కోగంటి ఆదేశాలతో కారులోనే అతనిపై హత్యకు పాల్పడ్డారు
ఇక వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో ఏ2 నిందితుడు కోగంటి సత్యంకు విజయవాడ 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించేందుకు ఎర్పాట్లు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment