Rahul
-
ఈడీ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పూర్తికాలపు డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియమితులయ్యారు. ఈడీ తాత్కాలిక చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఆయనను బుధవారం పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమించారు. నవీన్ ఇండియన్ రెవెన్యూ సరీ్వసు (ఐఆర్ఎస్) 1993 బ్యాచ్.. ఇన్‌కంట్యాక్స్ కేడర్‌కు చెందిన అధికారి. రాహుల్ నవీన్‌ను రెండేళ్ల కాలానికి, లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు (ఇందులో ఏది ముందైతే అది వర్తిస్తుంది) ఈడీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆదేశాలు జారీచేసింది. 57 ఏళ్ల నవీన్ 2019 నవంబరులో స్పెషల్ డైరెక్టర్‌గా ఈడీలో చేరారు. ఈడీ డైరెక్టర్‌గా సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలం గత ఏడాది సెపె్టంబరు 15న ముగియడంతో.. నవీన్ అప్పటినుండి తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ పన్ను వ్యవహారాల్లో నవీన్ నిపుణులు. తాత్కాలిక డైరెక్టర్‌గా నవీన్ వ్యవహరించిన కాలంలోనే మనీలాండరింగ్ కేసుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ల సంచలన అరెస్టులు జరిగాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ఎంటెక్ రాహుల్ నవీన్ బిహార్‌కు చెందిన వారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి బీటెక్, ఎంటెక్ చేశారు. మెల్బోర్న్ (ఆ్రస్టేలియా)లోని స్విన్బుర్నే యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ఆదాయపు పన్ను శాఖలో 30 ఏళ్లు పనిచేశారు. అంతర్జాతీయ ట్యాకేషన్స్పై నవీన్ రాసిన పలు వ్యాసాలను నాగ్‌పూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌లో ట్రైనీ ఐఆర్ఎస్ విద్యార్థులకు పాఠాలుగా బోధిస్తున్నారు. ‘‘ఇన్ఫ్మర్మేషన్ ఎక్చేంజ్ అండ్ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ: టాక్లింగ్ గ్లోబల్ ట్యాక్స్ ఎవాషన్ అండ్ అవాయిడెన్స్’’ శీర్షినక నవీన్ రాసిన పుస్తకం 2017లో ప్రచురితమైంది. -
తనకంటే చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్.. క్లారిటీ ఇచ్చేసిందా?
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో సాహో చిత్రంలో మెప్పించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. స్ట్రీ-2, చందు ఛాంపియన్ చిత్రాల్లో నటిస్తోంది. గతేడాది తు ఝూథీ మెయిన్ మక్కార్ తన అభిమానులను అలరించింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన కనిపించింది. అయితే ఈ చిత్రానికి రాహుల్ మోడీ రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా శ్రద్ధా కపూర్.. అతనితో ఉన్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. అవీ కాస్తా వైరల్ కావడంతో ఇంతకీ అతను ఎవరా? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే తు ఝూథీ మెయిన్ మక్కార్ సినిమా రిలీజ్ తర్వాత వీరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా పోస్ట్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ బీ టౌన్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. రాహుల్ మోడీ ప్యార్ కా పంచ్‌నామా 2, సోను కే టిటు కి స్వీటీ, ప్యార్ కా పంచ్‌నామా పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు. మరోవైపు అతను శ్రద్ధా కపూర్ కంటే మూడేళ్లు చిన్న అని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్‌కు 34 ఏళ్లు కాగా..శ్రద్ధా కపూర్ 37 ఏళ్లు. కొద్దికాలంగా ఈ జంట పలు ఈవెంట్లలో సందడి చేశారు. దీంతో డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్‌లో శ్రద్ధా, రాహుల్ జంటగా కనిపించారు. -
నేడు రాయ్‌బరేలీ సీటుపై రాహుల్ కీలక ప్రకటన?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియా, సోదరి ప్రియాంకతో కలిసి నేడు (మంగళవారం) యూపీలోని రాయ్‌బరేలీకి వస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. దీనితోపాటు రాయ్‌బరేలీ సీటు విషయంలో తన నిర్ణయం వెలిబుచ్చనున్నారని సమాచారం.గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీతో అనుబంధం ఉంది. అందుకే రాయ్‌బరేలీ ఎంపీగా రాహుల్‌గాంధీ కొనసాగుతారనే వాదన చాలాకాలంగా వినిపిస్తోంది. రాహుల్ రాయ్‌బరేలీతో పాటు కేరళలోని వయనాడ్ స్థానం నుంచి కూడా విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. అందులో ఆరుగురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు 6.36 శాతం నుంచి 9.46 శాతానికి పెరిగింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్, సహరాన్‌పూర్‌లలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీకి 66.17 శాతం ఓట్లు రాగా, 2019లో సోనియా గాంధీకి ఇదే సీటు నుంచి 55.80 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిని చవిచూశారు. అయితే ఈసారి గాంధీ కుటుంబానికి సన్నిహుతుడైన కిషోరి లాల్ శర్మ 54.99 శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ రాయ్‌బరేలీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిలో రాహుల్ తాను రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగుతాననే సందేశాన్ని ఇస్తారని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.భూమా అతిథి గృహంలో జరిగే ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, అమేథీ ఎంపీ కేఎల్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్, ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. -
రాహుల్ వయనాడ్ వదిలి.. రాయ్‌బరేలీ ఎంపీ అవుతారా?
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేసి, రెండు చోట్లా విజయం సాధించారు. నిబంధనల ప్రకారం ఒక నేత రెండు స్థానాలలో ఎంపీగా ఉండకూడదు. దీంతో రాహుల్ గాంధీ వయనాడ్ సీటును వదులుకుంటారా లేక రాయ్ బరేలీ సీటును వదులుకుంటారా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన వయనాడ్ సీటును వదిలి, రాయ్ బరేలీకి ఎంపీగా కొనసాగుతారని తెలుస్తోంది.రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదిలిపెట్టడానికి కారణం సోనియా గాంధీ అని చెబుతున్నారు. ఎందుకంటే రాయ్‌బరేలీ సీటు కాంగ్రెస్‌కు సాంప్రదాయక స్థానం. రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ మాజీ పార్లమెంటు స్థానం కూడా ఇదే. గతంలో సోనియా గాంధీ రాయ్‌బరేలీ ప్రజలను ఉద్దేశిస్తూ ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు.తన జీవితమంతా రాయ్‌బరేలీ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో నడిచిందని, ఒంటరితనాన్ని దూరం చేసిందని పేర్కొన్నారు. తన కుమారుడని రాయ్‌బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నానని, రాహుల్‌ను మీవాడిగా చూసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ వరుసగా రెండోసారి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాహుల్ మాట్లాడుతూ తాను రాయ్‌బరేలీ, వయనాడ్ స్థానాలను గెలుచుకున్నానని, ఈ రెండు లోక్‌సభ స్థానాల ఓటర్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. తాను ఈ రెండు స్థానాలకు ఎంపీని కావాలనుకుంటున్నానని, అయితే ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాలని, దీనిపై చర్చించి ఏ సీటును ఎంపిక చేసుకోవాలో నిర్ణయించుకుంటానని రాహుల్ తెలిపారు. -
స్మృతి ఇరానీకి చుక్కలు చూపించిన కేఎల్ శర్మ ఎవరు?
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సంచలనం రేపుతున్నాయి. యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిషోరి లాల్ శర్మ (కేఎల్ శర్మ) ఓట్ల ఆధిక్యంతో స్మృతీ ఇరానికి చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహం, దూకుడుతనం, ఎన్నికల ప్రచారం కేఎల్ శర్మకు కలసివచ్చే అంశాలుగా పరిణమించాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో కేఎల్ శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.కెఎల్ శర్మకు గాంధీ కుటుంబంతో పాత పరిచయం ఉంది. చాలా కాలంగా రాయ్‌బరేలీలో ఉంటూ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సలహాదారుగా శర్మ వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించే ఆయన గాంధీ కుటుంబపు ఎన్నికల ప్రచారంలోనూ కీలకపాత్ర పోషిస్తుంటారు. కెఎల్ శర్మ రాజీవ్ గాంధీకి కూడా అత్యంత సన్నిహితునిగా పేరొందారు.కేఎల్ శర్మ అమేథీలో 1983, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో పాటుపడ్డారు. 1999లో సోనియా గాంధీ మొదటి ఎన్నికల ప్రచారంలో కూడా శర్మ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి కారణంగానే అమేథీలో సోనియా విజయం సాధించారని చెబుతారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడించారు. మరి ఇప్పుడు కెఎల్ శర్మ ఎటువంటి ఫలితాలు రాబడతారనే దానిపై అందరి దృష్టి నెలకొంది. -
ఢిల్లీ మెట్రోలో రాహుల్.. ఫొటో వైరల్
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు దశల ఎన్నికలు ఇప్పటికే ముగియగా, ఇంకా మరో రెండు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఈ క్రమంలో మే 25న ఢిల్లీలో ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. రాహుల్ గాంధీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న రాహుల్ గాంధీ సామాన్య ప్రజలతో మమేకమై, వారితో ఫొటోలు కూడా దిగారు. రాహుల్ గాంధీ ఢిల్లీ మెట్రోలో మంగోల్‌పురిలో జరిగే ర్యాలీకి బయలుదేరారు. ఆయనతో పాటు ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ కూడా ఉన్నారు. ఢిల్లీలో మే 25వ తేదీన ఓటింగ్ జరగనుంది. -
‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఐదు దశల ఎన్నికల ఓటింగ్ పూర్తియ్యింది. ఇక రెండు దశలు మాత్రమే మిగిలివున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 400పైగా సీట్లను దక్కించుకుంటామని చెబుతోంది. అదే సమయంలో ఇండియా కూటమి కూడా తాము సాధించే సీట్లపై అంచనాలు వేసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ అందరికన్నా మహనీయుడని వ్యంగ్యంగా అన్నారు.రాహుల్ గాంధీ గొప్ప వ్యక్తి అని, ఆయన దేనికైనా సమాధానం చెప్పగలరని ప్రమోద్ కృష్ణం అన్నారు. మొదటి నుంచి రాహుల్ అన్ని విషయాలను ఎక్కువ చేసి చెబుతారని, అతని గురించి ఏమి చెప్పగలనని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. నాడు కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మహాత్మా గాంధీ కలలు కన్నారు. అయితే బీజేపీ కూడా ఆ పని చేయలేకపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ పని చేస్తున్నారని ప్రమోద్ కృష్ణం పేర్కొన్నారు.కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నారని ప్రమోద్ కృష్ణం ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్ తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు. జూన్ 4 తర్వాత ఇప్పటి వరకు అతి తక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని ప్రమోద్ కృష్ణం అన్నారు. -
రేపే లోక్‌సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ మే 20న జరగనుంది. ఈ దశలో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలలో ఓటింగ్ జరగనుంది. పలువురు ప్రముఖులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యూపీలోని లక్నో లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అతనిపై సమాజ్‌వాదీ పార్టీ రవిదాస్ మెహ్రోత్రాను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. మంత్రిగా పనిచేసిన మెహ్రోత్రా ప్రస్తుతం లక్నో సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు.రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి దినేష్ ప్రతాప్ సింగ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం తన సీటును వదులుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని అమేథీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఇక్కడి నుంచి గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్ శర్మను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది.చిరాగ్ పాశ్వాన్ బీహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన ఎన్డీఏ కూటమిలోని ఎల్జేపీ (ఆర్)కి చెందిన నేత. కాగా ఇదే స్థానం నుంచి శివచంద్ర రామ్‌ను ఆర్జేడీ తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించింది.ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్‌లోని బారాముల్లా స్థానం నుంచి జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఒమర్‌పై మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ నుంచి ఫయాజ్ అహ్మద్ పోటీకి దిగారు. గత ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి అక్బర్ లోన్ ఈ స్థానంలో విజయం సాధించారు.ఐదో దశ ఎన్నికల పోరులో మోదీ ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు రంగంలోకి దిగారు. ముంబై నార్త్ నుండి పీయూష్ గోయల్, మోహన్‌లాల్‌గంజ్ నుండి కౌశల్ కిషోర్, లక్నో నుండి రాజ్‌నాథ్ సింగ్, అమేథీ నుండి స్మృతి ఇరానీ, ఫతేపూర్ నుండి సాధ్వి నిరంజన్ జ్యోతి, దిండోరి నుండి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, కోడెర్మా నుండి అన్నపూర్ణా దేవి, భివాండి నుండి కపిల్ పాటిల్ ఈ జాబితాలో ఉన్నారు. -
స్మృతితో రాహుల్ ఎందుకు పోటీ పడలేదు?.. గెహ్లాట్ వివరణ!
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం 2024- లోక్‌సభ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా ఏళ్లుగా కాంగ్రెస్, రాహుల్ గాంధీలకు కంచుకోటగా ఉన్న ఈ స్థానం ఆ తరువాత బీజేపీకి దక్కింది. ఇక్కడి నుంచి స్మృతి ఇరానీ ఎంపీ అయ్యారు. ఈసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి అమేథీ నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం గతంలో జోరుగా సాగినా అది కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ హైకమాండ్ స్మృతి ఇరానీ ఎదుట కేఎల్ శర్మను తమ అభ్యర్థిగా ప్రకటించింది. రాహుల్ గాంధీకి రాయ్ బరేలీ స్థానాన్ని అప్పగించింది. అదిమొదలు బీజేజీ ప్రతిపక్ష పార్టీపై మాటల దాడి చేస్తూనే ఉంది. స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఎందుకు పోటీకి దిగలేదంటూ ప్రశ్నిస్తోంది.దీనికి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సమాధానం ఇచ్చారు. కేఎల్ శర్మ 40 ఏళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నారని, గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో పగలు రాత్రి పనిచేసిన శర్మను అమేథీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో తప్పేముంది? రాహుల్ గాంధీనే అమేథీకి ఎందుకు వెళ్లాలని, కేఎల్ శర్మ సరిపోతారని గెహ్లాట్ అన్నారు.రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయించాలని పార్టీ భావించిందని, అక్కడ రాహుల్ గెలుస్తారని అన్నారు. అమేథీలో కెఎల్ శర్మ విపక్షాలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. శర్మ అటు పార్టీ కోసం ఇటు ప్రజల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. సోనియా గాంధీ కూడా శర్మను మెచ్చుకున్నారని, అతనికి అమేథీ ప్రజల సమస్యల గురించి తెలుసని, అక్కడి సమస్యల పరిష్కారానికి ఆయన ఒక ప్రణాళిక రూపొందించారని గెహ్లాట్ వివరించారు. -
వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
ఐదో దశ నామినేషన్ల చివరి రోజు వరకు యూపీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే ఉత్కంఠను ఆ పార్టీ కొనసాగించింది. అయితే చివరికి ఆయన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ మరో సస్పెన్స్‌కు తెరలేపింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ రాహుల్ అటు కేరళలోని వయనాడ్, ఇటు యూపీలోని రాయ్‌బరేలీలలో గెలిస్తే ఏ సీటును వదులుకుంటారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది.గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి మే 3న రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్‌కు ముందు ఆయన తల్లి సోనియా గాంధీ ఈ స్థానానికి వరుసగా 20 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలు. ఇదిలా ఉండగా వయనాడ్, రాయ్‌బరేలీలలో గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు? అనే ప్రశ్నకు లక్నో యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సంజయ్ గుప్తా విశ్లేషణ చేశారు.తల్లి రాజకీయ వారసత్వం కోసం రాహుల్ గాంధీ అమేథీని వదిలి, రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయం ద్వారా రాహుల్ గాంధీ సురక్షితమైన పందెం ఆడారు. మొదటిది బీజేపీ మహిళా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పోటీపడితే గతంలో మాదిరిగా పరాభవం ఎదురుకాకుండా చూసుకున్నారు. మరోవైపు తన తల్లి గతంలో పోటీ చేసి, విజయం సాధించిన రాయ్‌బరేలీ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేశారు.ఇక వయనాడ్ విషయానికొస్తే ముస్లిం, క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్న ఈ లోక్‌సభ స్థానం సురక్షితమని రాహుల్ గాంధీ భావించారు. అలాగే అమేథీలో కన్నా రాయ్‌బరేలీలో పోటీ చేయడమే సరైనదని రాహుల్ నిర్ణయించుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌లో రాహుల్‌కు 7 లక్షల 6,000 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థికి కేవలం రెండు లక్షల నాలుగు వేల ఓట్లు మాత్రమే దక్కాయి.అయితే ఈసారి వయనాడ్‌లో పరిస్థితులు మారాయి. రాష్ట్రంలోని అధికార వామపక్ష కూటమి ఈసారి అభ్యర్థిని మార్చింది. ఈసారి బీజేపీ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య అన్నే రాజాపై రాహుల్ ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రాహుల్‌కు ఇండియన్ ముస్లిం లీగ్ మద్దతు ఉంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా తన సత్తాను చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఒకవేళ రాహుల్ అటు వయనాడ్, ఇటు రాయ్‌బరేలీ రెండింటిలో గెలిస్తే రాయ్‌బరేలీని వదులుకుని, వయనాడ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్నాయని ప్రొఫెసర్ సంజయ్ గుప్తా అన్నారు. అయితే అటువంటి సందర్భం ఏర్పడినప్పుడు రాయ్‌బరేలీకి జరిగే ఉప ఎన్నికలో రాహుల్ సోదరి ప్రియాంక పోటీ చేసి, గాంధీ కుటుంబపు కంచుకోటకు కాపాడే ప్రయత్నిం చేస్తారని ఆయన తన అభిప్రాయం తెలిపారు. -
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
ఎట్టకేలకు రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేలిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై పోటీకి దిగారు. మరి దినేష్.. రాహుల్‌కు తగిన పోటీని ఇవ్వగలరా? బీజేపీ అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి?ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీని గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణిస్తుంటారు. ఈసారి ఇక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా గాంధీ నిరాకరించారు. దీంతో ఆమె కుమారుడు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీకి దిగారు. ఇదే స్థానం నుంచి బీజేపీ తన అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్‌ను బరిలో నిలిపింది.2018లో దినేష్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ మరుసటి ఏడాది ఆయనకు బీజేపీ లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీపై దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేశారు. అయితే సోనియా గాంధీ 1,67,178 ఓట్లతో విజయం సాధించారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ దినేష్ ప్రతాప్ సింగ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. రాయ్‌బరేలీ రాజకీయాలలో పంచవటి వర్గం ఆధిపత్యం చెలాయిస్తుంది. దినేష్ పంచవటి వర్గానికి చెందినవారు. ఆయన గుణవర్ కమంగల్పూర్ గ్రామ నివాసి.రాయ్‌బరేలీ రాజకీయాలలో దినేష్ కుటుంబానికి ఆదరణ ఉంది. ఒకప్పుడు ఆయన సోనియా గాంధీకి అత్యంత సన్నిహితునిగా పేరొందారు. 2010లో తొలిసారిగా, 2016లో రెండోసారి కాంగ్రెస్ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ ఎమ్మెల్సీ అయ్యారు. 2018లో కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరారు. మరి ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత దినేష్ కాంగ్రెస్‌కు ఎంతవరకూ పోటీనివ్వగలరో వేచిచూడాలి. -
నేడు అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్
ఈరోజు (ఆదివారం) భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేత స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ లోక్‌సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు ఆమె అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం ఆమె తన లోక్‌సభ నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్ 26) ప్రారంభమైంది. ఐదో దశలో మొత్తం 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది.అమేథీలో నామినేషన్‌కు చివరి తేదీ మే 3. దీంతో కాంగ్రెస్‌కు ఈ సీటు నుంచి పోటీచేయబోయే అభ్యర్థిని ప్రకటించడానికి ఎక్కువ సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ అమేథీలో తన అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. అయితే రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమేథీ నియోజకవర్గం చాలాకాలంపాటు గాంధీ కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే 2019లో రాహుల్‌ను ఓడించడం ద్వారా స్మృతి ఇరానీ ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి స్వస్తి పలికారు. అయితే ఇప్పుడు స్మృతిని ఓడించి, కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు రాహుల్ ప్రయత్నించనున్నారని సమాచారం.అమేథీతో పాటు రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఎవరికీ టిక్కెట్ కేటాయించలేదు. ఈ సీటు కూడా కాంగ్రెస్ సంప్రదాయ సీటు. 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. సోనియాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి సోనియా కుమార్తె ప్రియాంక ఎన్నికల బరిలో దిగవచ్చని తెలుస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
అమేథీ నుంచి రాహుల్.. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక? నామినేషన్లకు సన్నాహాలు?
దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలల్లో తమ నామినేషన్లు వేసేముందు వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు అయోధ్యలోని రామ్ లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. కాంగ్రెస్ వర్గాల నుంచి మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 26న కేరళలోని వయనాడ్‌కు పోలింగ్ పూర్తయిన తర్వాత గాంధీ కుటుంబం అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టనున్నదని సమాచారం. అమేథీలో రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ వేయనున్నారని, దీనికి ముందు వారు అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. వయనాడ్‌లో ఓటింగ్ ఏప్రిల్ 26న ముగియనుంది. అదే రోజున రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం అమేథీ, రాయ్‌బరేలీలలో పోటీ విషయమై ఏప్రిల్ 30లోపు కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయనున్నదని సమాచారం. ఈ స్థానాల అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ మౌనం వహిస్తూ వస్తోంది. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు.. అమేథీ, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పక్షంలో మే ఒకటి నుంచి మూడవ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. ఈ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లకు మే 3 చివరి రోజు. మే 20న ఐదవ విడతలో ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.రాహుల్, ప్రియాంకలు యూపీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ సెల్ ఇన్చార్జి జైరాం రమేష్‌తో పాటు పలువురు నేతలు గతంలోనే సూచన ప్రాయంగా తెలియజేశారు. తాజాగా అమేథీలోని రాహుల్ నివసించే బంగ్లాను శుభ్రం చేసి, పెయింటింగ్ వేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ నేపధ్యంలో రాహుల్ అమేథీ నుంచి, ప్రియాంక రాయ్‌బరేలీ నుంచి పోటీచేయవచ్చని స్పష్టమవుతోంది. -
అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి రాబర్ట్ వాద్రా?
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మే 20న ఐదవ దశలో అమేథీ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ ఇక్కడి అభ్యర్థి ఎవరనేది వెల్లడించకముందే స్థానికంగా వెలసిన పోస్టర్లు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. అమేథీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ‘అమేథీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రాను ఆహ్వానించాలి’ అని పోస్టర్‌పై రాశారు. రాబర్ట్ వాద్రా అమేథీ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. అమేథీ, గౌరీగంజ్లలోని కాంగ్రెస్ కార్యాలయాలు, హనుమాన్ తిరహా, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ తరహా పోస్టర్లను గోడలపై అతికించారు. ఈ పోస్టర్ గురించి స్థానిక కాంగ్రెస్ నేత సోను సింగ్ రఘువంశీ మాట్లాడుతూ రాబర్ట్ వాద్రా ఈసారి అమేథీ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారు. అందుకే రాబర్ట్ వాద్రా ఇక్కడి నుంచి పోటీచేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారన్నారు. -
వింత రాజకీయం.. పొత్తు ఉన్నా ఎవరి ప్రచారం వారిదే?
పశ్చిమ యూపీలో ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, ప్రచారం చేపట్టే విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కనిపించడం లేదు. తొలి విడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. అయితే ప్రచారం చివరి రోజున ఇరు పార్టీలు ఉమ్మడి ర్యాలీకి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ యూపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల తీరుకు భిన్నంగా బీజేపీ-ఆర్ఎల్డీల దోస్తీ పటిష్టంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రితో ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి పలుమార్లు సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఎస్పీ, కాంగ్రెస్ హైకమాండ్ విడివిడిగా తమ గొంతు వినిపించడం విచిత్రంగా మారింది. ఎస్పీ తో పొత్తు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ విడిగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఇరు పార్టీల మధ్య దూరానికి కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వివిధ లోక్‌సభ స్థానాలకు వెళ్లి తమ కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలేష్ యాదవ్ పిలిభిత్ నుంచి ముజఫర్ నగర్ వరకు బహిరంగ సభలు నిర్వహించారు. అయితే ముజఫర్‌నగర్‌కు సమీపంలో జరిగిన ప్రియాంక గాంధీ రోడ్ షోలో అఖిలేష్ కనిపించలేదు. సహరాన్పూర్ లోక్‌సభ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ప్రచారం చివరి రోజున ఎస్పీ, కాంగ్రెస్‌లు ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ప్రధాన కారణం ముస్లిం ఓటు బ్యాంకు అని రాజకీయ విశ్లేషకులు జ్ఞాన్ ప్రకాశ్ తెలిపారు. 2019 నాటి ఎస్పీ, బీఎస్పీ పొత్తును ఉదహరిస్తూ, అప్పట్లో ఆ రెండు పార్టీల అధినేతలు ఉమ్మడి ర్యాలీని నిర్వహించారన్నారు. అయితే నాడు బహుజన సమాజ్ పార్టీ.. కూటమి వల్ల ప్రయోజనం పొందిందని, ఎస్పీ ఎటువంటి ప్రత్యేక ప్రయోజనం పొందలేకపోయిందన్నారు. ఈ సారి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ఇదే కారణం కావచ్చన్నారు. -
అవినీతిపై ఉక్కుపాదమే: ప్రధాని మోదీ
రుద్రపూర్/జైపూర్: అవినీతిలో కూరుకుపోయిన కొందరు నాయకులు తనను బెదిరించేలా మాట్లాడుతున్నారని, నిస్సిగ్గుగా దూషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నెగ్గి, మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అవినీతిపై ఇక ఉక్కుపాదమేనని, ఇది తన గ్యారంటీ అని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా దేశం గొంతు విప్పుతోందని అన్నారు. ప్రతి ఒక్క అవినీతిపరుడిపై చర్యలు ఉంటాయని, ఎవరినీ వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసినవారు జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. తనను తిట్టొచ్చు, బెదిరించవచ్చు గానీ అవినీతిపై చర్యల విషయంలో మాత్రం ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే దేశమంతటా మంటలు తప్పవంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్‌ను దేశం నుంచి తుడిచిపెట్టేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో తొలి బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి ఉద్దేశాలు బయటపడుతున్నాయని చెప్పారు. అధికారం కోల్పోయి నిరాశలో ఉన్న కాంగ్రెస్ రాజకుటుంబ వారసుడు దేశంలో మంటలు సృష్టించడం గురించి మాట్లాడుతున్నాడని, అలాంటివి మీరు అనుమతిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ విధమైన అనుచిత భాష మాట్లాడవచ్చా? వారిని మీరు శిక్షిస్తారా? లేదా? అని అడిగారు. బుజ్జగింపు రాజకీయాలే కాంగ్రెస్ నైజం ‘ఎమర్జెన్సీ’ ఆలోచనా ధోరణి ఉన్న కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం లేదని ప్రధానమంత్రి ఆరోపించారు. ఎన్నికల్లో రాబోయే ఫలితాలపై ప్రజలను రెచ్చగొట్టాలని కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. దేశాన్ని అస్థిరత, అరాచకం వైపు మళ్లించాలన్నదే కాంగ్రెస్ ధ్యేయమని ఆక్షేపించారు. ఆ పారీ్టకి తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశాన్ని విడగొట్టాలన్న కాంగ్రెస్ నాయకుడిని శిక్షించాల్సింది పోయి లోక్‌సభ బరిలో దింపుతోందని ఆక్షేపించారు. ఆ అగ్నిని పదేళ్లుగా ఆర్పేస్తున్నా... విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ‘‘అవినీతిపై చర్యలను అడ్డుకోవడానికి అవినీతిపరులంతా చేతులు కలిపిన తొలి లోక్‌సభ ఎన్నికలివి. సొంత కుటుంబాలను కాపాడుకోవడానికి కుటుంబ పార్టీలు ర్యాలీల మీద ర్యాలీలు వరుసగా నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు కూడా ఇవే’’ అన్నారు. రాజస్తాన్‌లోని కోట్‌పుత్లీలో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే దేశం అగి్నగుండం అవుతుందంటూ కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. అలాంటి అగ్నిని గత పదేళ్లుగా తాను ఆర్పేస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు. -
బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రాహుల్ కుశ్వాన్
జైపూర్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు పార్టీల మారుతూ సార్వత్రిక సమరాన్ని మరింత ఆసక్తి రేపుతున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి.. బీజేపీ నేతలు కాంగ్రెస్‌లోకి వరుస కడుతున్నారు. తాజాగా రాజస్తాన్‌లోని చురూ సెగ్మెంట్‌కు చెందిన ఎంపీ బీజేపీకి షాక్ ఇచ్చారు. రాహుల్ కుశ్వాన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవకి రాజీనామా చేసి.. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సహకరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సొనియా గాంధీ, రాహుల్ గాంధీ, గోవింద్ సింగ్ దోస్తారా, ఇతర నేతలకు ధన్యవాదాలు’ అని కాంగ్రెస్ చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతకంటే ముందు.. ప్రజాజీవితంగా గురించి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నానని రాహుల్ కుశ్వాన్ ‘ఎక్స్’(ట్వీటర్) వేదికగా వెల్లడించారు. ‘కొన్ని రాజకీయ కారణాల రీత్యా ఈ రోజు కీలక పరిణామం జరగబోతుంది. నేను బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నా’అని పేర్కొన్నారు. అదేవిధంగా చురూ నియోజకవర్గ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. వచ్చే లోక్‌సభలో ఎన్నికల్లో చురూ సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్ తిరస్కరించిన నేపథ్యంలో రాహుల్ కుశ్వాన్ పార్టీ మారటం గమనార్హం. బీజేపీ మొదటి జాబితాలో చురూ లోక్‌సభ స్థానంలో రాహుల్ కుశ్వాన్ బదులు పారా ఒలింపియన్ దేవేంద్ర ఝఝరియాను బరిలోకి దించిన విషయం తెలిసిందే. చదవండి: డీప్‌ఫేక్ బారినపడ్డ యోగి ఆదిత్యనాథ్ -
ఏమిటి నేను చేసిన నేరం? బీజేపీ ఎంపీ తీవ్ర ఆవేదన!
భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. రాజస్థాన్‌లోని చురు లోక్‌సభ స్థానం నుంచి కొత్త వ్యక్తి దేవేంద్ర ఝజారియాకు టిక్కెట్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం చురు ఎంపీగా ఉన్న రాహుల్ కశ్వాన్.. తనను తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు తన చురు స్థానం నుంచి మరో అభ్యర్థిని బీజేపీ బరిలోకి దించగా రాహుల్ కశ్వాన్ సోషల్ మీడియాలో తన స్పందనను తెలియజేశారు. కస్వాన్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. "నా నేరం ఏమిటి? నేను నిజాయితీగా లేనా? కష్టపడి పనిచేయలేదా? విధేయుడిని కాదా? నేను ఏమి కళంకం తెచ్చాను? చురు లోక్‌సభలో పనిచేయలేదా? ఏదైనా పొరపాటు జరిగిందా?" అంటూ ప్రశ్నలు సంధించారు. "ప్రధానమంత్రి అన్ని పథకాల అమలులో నేను ముందంజలో ఉన్నాను. ఇంకా ఏమి కావాలి? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా మౌనమే వినిపిస్తోంది. ఎవరూ సమాధానం చెప్పలేక పోతున్నారు" అంటూ వాపోయారు. అయితే రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమని, టిక్కెట్ దక్కలేదన్న నైరాశ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. కాగా రాహుల్ కస్వాన్ తండ్రి రామ్ సింగ్ కూడా చురు నుంచి బీజేపీ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. అలాగే రాహుల్ తల్లి కమలా కశ్వాన్ కూడా సాదుల్పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు రాజస్థాన్‌లోని 25 స్థానాలకు గాను 15 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు నలుగురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. -
భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్, ప్రియాంక!
కాంగ్రెస్ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ ఓపెన్ జీపులో యాత్రలో పాల్గొన్నారు. వీరిని చూసేందుకు జనం తరలివచ్చారు. రాహుల్, ప్రియాంకలను స్వాగతిస్తూ జనం వారిపై పూల వర్షం కురిపించారు. ఈ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు కూడా యాత్రలో పాల్గొన్నారు. అమ్రోహా, సంభాల్, బులంద్‌షహర్, అలీఘర్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ వరకు జరిగే ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటున్నారు. ఆదివారం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఆగ్రా అనంతరం ఈ యాత్ర రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. మార్చి 26న ఈ యాత్రకు విరామం కల్పించనున్నారు. రాహుల్ గాంధీ ఫిబ్రవరి 27, 28 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే పార్టీ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం భారత్ జోడో న్యాయ యాత్ర మార్చి 2న మధ్యాహ్నం 2 గంటలకు ధోల్పూర్ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ యాత్ర మొరెనా, గ్వాలియర్, శివపురి, గుణ, షాజాపూర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల మీదుగా సాగనుంది. -
సోనియా రాజ్యసభ నామినేషన్.. వెంటవచ్చిన రాహుల్, ప్రియాంక!
రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ఈరోజు(బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజధాని జైపూర్ చేరుకున్న ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. సోనియా గాంధీ లోక్‌సభ నుంచి కాకుండా రాజ్యసభ నుంచి పార్లమెంటుకు చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార నివాసంలో సోనియాగాంధీ నామినేషన్ సెట్‌పై ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేశారు. #WATCH कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी राज्यसभा चुनाव के लिए अपना नामांकन दाखिल करने के लिए जयपुर, राजस्थान पहुंचीं। उनके बेटे और पार्टी सांसद राहुल गांधी और उनकी बेटी और पार्टी महासचिव प्रियंका गांधी वाड्रा उनके साथ हैं। pic.twitter.com/0oGUmMr1to — ANI_HindiNews (@AHindinews) February 14, 2024 సీనియర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 1999 లోక్‌సభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె అమేథీ లోక్‌సభ సభ్యురాలిగానూ ఉన్నారు. ఆమె పార్లమెంటు ఎగువ సభకు వెళ్లడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ పత్రాల పరిశీలన ఫిబ్రవరి 16న జరగనుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20లోగా తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. -
నేడు ఒడిశాకు రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర
మణిపూర్ నుంచి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ యాత్ర 24వ రోజు అంటే నేడు (మంగళవారం)ఒడిశాలోకి ప్రవేశించనుంది. జనవరి 14న ఈశాన్య భారతం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు వివిధ రాష్ట్రాలలోని ప్రజలను కలుస్తున్నారు. జార్ఖండ్ యాత్ర పూర్తయ్యాక కాంగ్రెస్ ఇప్పుడు ఒడిశా వైపు వెళ్లనుంది. మంగళవారం సుందర్‌గఢ్ జిల్లా నుంచి రాహుల్ ఒడిశాలో అడుగుపెట్టనున్నారు. రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ఒడిశా కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేశారు. సుందర్‌గఢ్ జిల్లాలోని పారిశ్రామిక పట్టణం బిరామిత్రపూర్‌లో ఒడిశా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి స్వాగతం పలుకనున్నారు. రాహుల్ గాంధీ మంగళవారం మధ్యాహ్నం బిర్మిత్రాపూర్ చేరుకుంటారని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్ర బిజా బహల్ ప్రాంతంలో విరామం తీసుకోనుంది. బుధవారం రూర్కెలాలోని ఉదిత్‌నగర్ నుండి పాన్‌పోష్ వరకు 3.4 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. రాహుల్ పాన్‌పోష్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మరుసటి రోజు రాణిబంద్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. రాజ్గంగ్పూర్లో జరిగే ర్యాలీలో కూడా రాహుల్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 8న రాహుల్ గాంధీ జర్సుగూడ పాత బస్టాండ్ నుంచి యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం ర్యాలీలో ప్రసంగిస్తారు. జార్సుగూడలోని కనక్‌తోరా నుంచి యాత్ర మొదలై అనంతరం ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశిస్తుంది. -
ఆ రోజే భ్రమయుగం
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్స్‌కి వచ్చే రోజు ఖరారైంది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘హారర్–థ్రిల్లర్ జానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: షెహనాద్ జలాల్, సంగీతం: క్రిస్టో జేవియర్. -
దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆదిలాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల ను అర్హులైన ప్రతీ కుటుంబానికి ఉచితంగా అందజేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాలో దరఖాస్తుల కొరత లేదని ప్రతి గ్రామం, ము న్సిపల్ వార్డులో ఉన్న కుటుంబాల కంటే పది శా తం అదనంగా పంపించామన్నారు. మీసేవ, జిరా క్స్ కేంద్రాలు, దళారులు విక్రయించినట్లైతే చర్యలు తప్పవన్నారు. మీసేవ కేంద్రాల లైసెన్స్ రద్దుతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఆరు గ్యారంటీల దరఖాస్తుల వివరాలు వెల్లడించారు. దరఖాస్తు నింపేందుకు కొంతమంది రూ.50వరకు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలా జరుగకుండా అన్ని చోట్ల వాటిని నింపేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశామన్నారు. ఆరు గ్యారంటీలకు ఒకే కా మన్ దరఖాస్తు పత్రం ఉంటుందని, అందులో అవసరమైన సాయంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. రేషన్‌కార్డు లేని వారు, ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉన్న వారు కూడా నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పింఛన్ పొందుతున్న ల బ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, రైతుబంధు సాయం పొందుతున్న రైతులు మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్తగా రేషన్‌కార్డు పొందాలనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అద్దె ఇళ్లలో నివసించేవారు గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం అద్దె ఇంటి విద్యుత్ సర్వీస్ నంబర్‌తోనూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఇ బ్బందులు పడుకుండా ఉండేలా అన్ని కేంద్రాల్లో షామియానాలు, తాగునీటి వసతి కల్పించామన్నారు. జనవరి 6వరకు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, అప్పటికీ అందించలేని వారు కూడా ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందజేస్తామన్నారు. డబ్బులిస్తే ఇప్పిస్తామని నమ్మబలికే దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. సంక్షేమ ఫలాల కోసం మహారాష్ట నుంచి వచ్చే వారికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తే మాత్రం బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో జనాభా ఎక్కువగా ఉన్నందున ప్రతి వార్డుకు ఓ జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించినట్లుగా వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. -
ఎల్గర్ అజేయ సెంచరీతో...
‘బాక్సింగ్ డే’ టెస్టుపై దక్షిణాఫ్రికా ఆధిక్యం కనబరుస్తోంది. రెండో రోజు ఆటలో భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్ చేసిన సఫారీ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుకుంది. దక్షిణాఫ్రికా ఆరంభానికి సిరాజ్ తూట్లు పొడిచినప్పటికీ ఓపెనర్ డీన్ ఎల్గర్ (అజేయ) శతకంతో సాఫీగా సాగిపోయింది. రెండు పటిష్టమైన భాగస్వామ్యాలతో సఫారీ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సంపాదించేందుకు ఎల్గర్ కీలకపాత్ర పోషించాడు. సెంచూరియన్: ఓవర్‌నైట్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీ మినహా తొలి టెస్టులో రెండో రోజంతా దక్షిణాఫ్రికా హవానే నడిచింది. ఓపెనర్ ఎల్గర్ చక్కని సెంచరీతో సఫారీ భారీ స్కోరుపై కన్నేసింది. తద్వారా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని పెంచుకునేందుకు పట్టుబిగిస్తోంది. బుధవారం రెండో రోజు ఆటలో తొలుత భారత్ తొలి ఇన్నింగ్స్ 67.4 ఓవర్లలో 245 పరుగుల వద్ద ముగిసింది. రాహుల్ (137 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) టెస్టుల్లో ఎనిమిదో శతకం సాధించాడు. మొదటి రోజే రబడ 5 వికెట్లు తీయగా, రెండో రోజు మిగిలిన రెండు వికెట్లలో కొయెట్జీ (1/74), బర్గర్ (3/50) చెరొకటి తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వెలుతురు మందగించి ఆట నిలిచే సమయానికి 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి 11 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. ఎల్గర్ (140 బ్యాటింగ్; 23 ఫోర్లు), జాన్సెన్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బుమ్రా, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టాడు. శతకం పూర్తయ్యాక ఆలౌట్! వర్షం, గ్రౌండ్ తడి ఆరడానికి సమయం పట్టడంతో రెండో రోజు కూడా ఆట ఆలస్యంగానే మొదలైంది. ఓవర్‌నైట్ స్కోరు 208/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ తొలి సెషన్లో 8.4 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు రాహుల్, సిరాజ్ (5) తొమ్మిదో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. రాహుల్ సెంచరీకి చేరువయ్యాక కొయెట్టీ 65వ ఓవర్ తొలి బంతికి సిరాజ్‌ను అవుట్ చేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్‌తో రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే బర్గర్ అతన్ని బౌల్డ్ చేయడంతో 245 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. సిరాజ్ దెబ్బ తీసినా... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభంలోనే సిరాజ్ దెబ్బకొట్టాడు. ఓపెనర్ మార్క్రమ్ (5) కీపర్ క్యాచ్‌తో వెనుదిరిగేలా చేశాడు. అయితే భారత శిబిరానికి ఈ ఆనందం తర్వాత శ్రమించక తప్పలేదు. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఎల్గర్‌కు జతయిన టోనీ డి జార్జి (62 బంతుల్లో 28; 5 ఫోర్లు) భారత బౌలర్లను తేలిగ్గా ఎదుర్కొన్నారు. 49/1 స్కోరువద్ద తొలి సెషన్ ముగియగా... రెండో సెషన్లోనూ ఈ జోడీ భారత బౌలింగ్ దళాన్ని కష్టపెట్టింది. ఎల్గర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... సఫారీ స్కోరు వంద దాటింది. ఈ దశలో బుమ్రా వైవిధ్యమైన బంతులతో రెండు కీలక వికెట్లను పడగొట్టి టీమిండియాను ఊరడించాడు. రెండో వికెట్‌కు 93 పరుగులు జోడించాక జార్జిని, తన మరుసటి ఓవర్లో పీటర్సన్ (2)ను పెవిలియన్ చేర్చాడు. 113 పరుగుల వద్ద 3 వికెట్లను కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. అయితే క్రీజులో పాతుకుపోయిన ఎల్గర్‌కు బడింగ్హామ్ చక్కని సహకారం ఇవ్వడంతో మరో భారీ భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను నిలబెట్టింది. ఎల్గర్ శతకాన్ని పూర్తి చేసుకోగా... టీ విరామం (194/3) వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఆఖరి సెషన్లోనూ ఎల్గర్–బడింగ్హామ్ జోడీ భారత బౌలర్లకు పరీక్షపెట్టింది. ఈ క్రమంలో బడింగ్హామ్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 131 పరుగులు జోడించాక సిరాజ్ ఓవర్లో బడింగ్హామ్ (56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిష్క్రమించాడు. వెరిన్ (4)ను ప్రసిధ్ అవుట్ చేశాడు. తర్వాత కాసేపటికే బ్యాడ్‌లైట్‌తో ఆటను నిలిపివేశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) వెరిన్ (బి) బర్గర్ 17; రోహిత్ (సి) బర్గర్ (బి) రబడ 5; శుబ్‌మన్ (సి) వెరిన్ (బి) బర్గర్ 2; కోహ్లి (సి) వెరిన్ (బి) రబడ 38; అయ్యర్ (బి) రబడ 31; రాహుల్ (బి) బర్గర్ 101; అశ్విన్ (సి) సబ్–ముల్డర్ (బి) రబడ 8; శార్దుల్ (సి) ఎల్గర్ (బి) రబడ 24; బుమ్రా (బి) జాన్సెన్ 1; సిరాజ్ (సి) వెరిన్ (బి) కొయెట్జీ 5; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (67.4 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–24, 4–92, 5–107, 6–121, 7–164, 8–191, 9–238, 10–245. బౌలింగ్: రబడ 20–4–59–5, మార్కొ జాన్సెన్ 16–2–52–1, బర్గర్ 15.4–4–50–3, కొయెట్జీ 16–1–74–1. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 5; ఎల్గర్ (బ్యాటింగ్) 140; టోని జార్జి (సి) యశస్వి (బి) బుమ్రా 28; పీటర్సన్ (బి) బుమ్రా 2; బెడింగ్హమ్ (బి) సిరాజ్ 56; వెరిన్ (సి)రాహుల్ (బి) ప్రసిధ్‌కృష్ణ 4; జాన్సెన్ (బ్యాటింగ్) 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (66 ఓవర్లలో 5 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–11, 2–104, 3–113, 4–244, 5–249. బౌలింగ్: బుమ్రా 16–3–48–2, సిరాజ్ 15–0–63–2, శార్దుల్ 12–2–57–0, ప్రసిధ్‌కృష్ణ 15–2–61–1, అశ్విన్ 8–3–19–0. -
లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి రాహుల్, ప్రియాంక పోటీ?
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో అధిష్టానంతో సమావేశమయ్యారు. అనంతరం యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ చేయడం గురించి ఆయన మాట్లాడుతూ..‘అది వారి ఇల్లు. అక్కడి నుంచే వారు పోటీ చేస్తారు. అలహాబాద్, ప్రయాగ్‌రాజ్, రాయ్ బరేలీ, అమేథీలలోని వారి పూర్వీకులతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. 40 ఏళ్లుగా అక్కడి ప్రజలతో వారికి దృఢమైన అనుబంధం ఉంది. ఈ బంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది’ అని అన్నారు. పార్టీ అధిష్టానం ఉత్తరప్రదేశ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, ఖర్గే , రాహుల్, ప్రియాంక తదితర జాతీయ నాయకులు యూపీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తాము కోరామన్నారు. యూపీలో పొత్తుల గురించి అజయ్ రాయ్ మాట్లాడుతూ దీనిపై నిర్ణయాన్ని పూర్తిగా జాతీయ నాయకత్వానికే వదిలేశామని అన్నారు. తాము ఏకగ్రీవ తీర్మానం చేసి, ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా ఢిల్లీలో అధిష్టానంతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు कांग्रेस मुख्यालय, दिल्ली में राष्ट्रीय अध्यक्ष श्री @kharge जी, जननायक श्री @RahulGandhi जी, कांग्रेस महासचिव/प्रभारी, UP श्रीमती @priyankagandhi जी व राष्ट्रीय महासचिव संगठन @kcvenugopalmp जी ने प्रदेश अध्यक्ष श्री @kashikirai जी, CLP लीडर श्रीमती @aradhanam7000 जी व प्रदेश के… pic.twitter.com/Yp4vbrcIxZ — UP Congress (@INCUttarPradesh) December 18, 2023