
ప్రిక్వార్టర్స్‌లో రాహుల్
రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి
న్యూఢిల్లీ: రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో రాహుల్ 11–5, 11–8, 11–5తో కొజి నైతో (జపాన్)పై, రెండో రౌండ్‌లో 11–2, 11–1, 11–4తో అర్తెమ్ సెర్పియనోవ్ (రష్యా)పై గెలుపొందాడు. హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ సిరిల్ వర్మ రెండో రౌండ్‌లో 7–11, 11–5, 5–11, 7–11తో ర్యోటారో మరువో (జపాన్) చేతిలో ఓడిపోయాడు.
భారత్‌కే చెందిన శుభాంకర్, ఆనంద్ పవార్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్‌లో ఆనంద్ పవార్ 11–4, 11–6, 11–7తో హెంగ్ లిన్ ఎన్గాన్ (ఇంగ్లండ్)పై, శుభాంకర్ 6–11, 13–11, 11–6, 11–4తో థామస్ (ఫ్రాన్స్)పై గెలిచారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో తెలుగు అమ్మాయి గుమ్మడి వృశాలి 11–7, 11–2, 11–5తో ఎనిమిదో సీడ్ సెనియా ఎవ్‌జెనోవా (రష్యా)పై విజయం సాధించింది.