ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ | Shraddha Kapoor and Rahul Mody attended a wedding in Ahmedabad | Sakshi
Sakshi News home page

Shraddha Kapoor: ప్రియుడితో పెళ్లికి హాజరైన శ్రద్ధాకపూర్.. వీడియో వైరల్

Published Tue, Feb 25 2025 1:55 PM | Last Updated on Tue, Feb 25 2025 4:48 PM

Shraddha Kapoor and Rahul Mody attended a wedding in Ahmedabad

సాహో మూవీతో తెలుగు వారికి పరిచయమైన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor). ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. అయితే గతేడాది విడుదలైన స్త్రీ-2 మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. గతంలో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్‌ రావు కీలక పాత్రలో కనిపించారు.

రైటర్‌తో డేటింగ్..

అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మపై కొన్ని రోజులుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ సినీ రచయిత రాహుల్ మోదీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అంతేకాదు వీరిద్దరు చాలాసార్లు ఈవెంట్లలో జంటగా కనిపించారు. అప్పటి నుంచే ఈ జంట రిలేషన్‌లో ఉన్నారంటూ బీటౌన్‌లో టాక్ వినిపిస్తూనే ఉంది. ‍అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపింది శ్రద్ధాకపూర్. తమ రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటించకపోయినా దీన్ని బట్టి వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని అర్థమవుతోంది.

పెళ్లిలో జంటగా..

తాజాగా తన ప్రియుడిగా భావిస్తోన్న రాహుల్ మోదీతో కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరైంది ముద్దుగుమ్మ. గుజరాత్‌లో ‍అహ్మదాబాద్‌లో జరిగిన స్నేహితుల పెళ్లిలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సందడి చేసింది. ఇ‍ద్దరు కలిసి నూతన వధూవరులతో ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత శ్రద్ధా కపూర్ సైతం  పెళ్లికి హాజరైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు శ్రద్దాకపూర్, రాహుల్ విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారు. కాగా.. గతేడాది జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ బాష్‌లో శ్రద్ధా కపూర్, రాహుల్ జంటగా కనిపించారు. అప్పటి నుంచే వీరిద్దరిపై డేటింగ్‌ రూమర్స్ మరింత వైరలయ్యాయి. 
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement