Shraddha Kapoor
-
ఈ పాపని గుర్తుపట్టారా? ప్రభాస్ హీరోయిన్.. ఆ రికార్డ్ కూడా
ఈమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్. తండ్రి విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు కావడంతో సులువుగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఒకేఒక్క పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేసింది. మరి ఇంతలా చెప్పాం కదా ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. 2010 నుంచి హీరోయిన్ గా వరస సినిమాలు చేస్తోంది. తొలుత గ్లామరస్ రోల్స్ చేసింది. 'ఆషికి 2' మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన 'సాహో'లో హీరోయిన్ ఈమెనే. కాకపోతే పెద్ద హిట్ కాకపోవడంతో మరో తెలుగు మూవీలో చేయలేదు.రీసెంట్ టైంలో 'స్త్రీ 2' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ హారర్ మూవీలో నటించింది. ఇదేమో ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు నెలకొల్పింది. 'పుష్ప 2'లోని కిస్సిక్ పాట కోసం ఈమెనే తొలుత సంప్రదించారు గానీ రెమ్యునరేషన్ సమస్యలతో నో చెప్పేసింది.(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు)ప్రస్తుతానికైతే ఈమె కొత్తగా ఏ మూవీ చేస్తున్నట్లు లేదు. గానీ ఎన్టీఆర్ తొలి హిందీ మూవీ అయిన 'వార్ 2'లో శ్రద్ధా కపూర్.. ఐటమ్ సాంగ్ చేస్తుందనే రూమర్స్ వస్తున్నాయి. మరి అవి నిజమో కాదో చూడాలి.సినిమాల సంగతి పక్కనబెడితే 38 ఏళ్ల శ్రద్ధా పెళ్లి గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. హీరో ఆదిత్య రాయ్ కపూర్, ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ ఇలా చాలా పేర్లు వినిపించాయి. ప్రస్తుతం రైటర్ రాహుల్ మోదీతో డేటింగ్ వార్తలు వస్తున్నాయి. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ప్రభాస్ సరసన 'సాహో'లో హీరోయిన్ గా చేసింది. అయితే శ్రద్ధా ఎంతో ప్రేమతో బహుమతిగా ఇచ్చిన ఇంటి ఈమె తండ్రి ఏకంగా కోట్ల రూపాయలకు అమ్మేశాడు. బాలీవుడ్ సర్కిల్ లో ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: దిగ్గజ హీరో శివాజీ గణేశన్ ఇల్లు జప్తు.. హైకోర్ట్ సంచలన ఆదేశం)బాలీవుడ్ సెలబ్రిటీలు ఓవైపు నటిస్తూనే రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటారు. అంటే ఓ బంగ్లా లేదంటే అపార్ట్ మెంట్ కొనడం, కొన్నిరోజుల తర్వాత దాన్ని లక్షలు లేదంటే కోట్ల రూపాయల లాభానికి అమ్మడం లాంటివి చేస్తుంటారు. అమితాబ్ ఈ విషయంలో ముందుంటాడు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ కూడా ఇదే దారిలో వెళ్తున్నాడేమో?ఎందుకంటే కొన్నాళ్ల క్రితం శ్రద్ధా కపూర్.. ముంబైలోని జుహూ ప్రాంతంలో సిల్వర్ బీచ్ హెవెన్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఓ అపార్ట్ మెంట్ ని బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు దీన్నే రూ.6.11 కోట్లకు శక్తి కపూర్ విక్రయించారట. మూడు నెలల క్రితమే అంటే డిసెంబరులోనే ఈ డీల్ జరిగిపోయింది. ఇది జరిగిన కొన్నిరోజులకే పిరమాల్ మహాలక్ష్మి సౌత్ టవర్ లో మరో అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. మరి ఇదెప్పుడో అమ్మేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
అతనితో హీరోయిన్ డేటింగ్.. ఊహించని విధంగా దొరికేసింది!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ పేరు ఇటీవల తెగ మార్మోగిపోతోంది. కొద్ది రోజుల క్రితమే ఓ పెళ్లిలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రాహుల్ మోడీతో కనిపించింది. వీరిద్దరు కలిసి జంటగా సన్నిహితుల వివాహా వేడుకలో పాల్గొన్నారు. దీంతో మరోసారి వీరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. గతంలోనూ అనిల్ అంబానీ పెళ్లి వేడుకలోనూ జంటగా కనిపించారు. అంతేకాదు పలు ఈవెంట్లలో శ్రద్ధా కపూర్ అతనితో పాటు కనిపించింది. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని బాలీవుడ్లో టాక్ తరచుగా వినిపిస్తూనే ఉంది.అయితే తాజాగా శ్రద్ధాకపూర్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ముంబయిలో ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ ముద్దుగుమ్మ ఫోటోగ్రాఫర్ల చేతికి చిక్కింది. దీంతో ఆమెను తమ కెమెరాల్లో బంధిస్తుండగా తన ఫోన్ కూడా కనిపించింది. ఆ ఫోన్లో తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రాహుల్ మోడీతో దిగిన ఫోటో వాల్‌పేపర్‌గా కనిపించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ వీరిద్దరి డేటింగ్ నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే శ్రద్ధా కపూర్ చివరిసారిగా హారర్ కామెడీ ఫిల్మ్ స్త్రీ- 2లో కనిపించింది. రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో మరో మూడు సినిమాల్లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
సాహో మూవీతో తెలుగు వారికి పరిచయమైన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor). ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. అయితే గతేడాది విడుదలైన స్త్రీ-2 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. గతంలో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించారు.రైటర్‌తో డేటింగ్..అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మపై కొన్ని రోజులుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ సినీ రచయిత రాహుల్ మోదీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అంతేకాదు వీరిద్దరు చాలాసార్లు ఈవెంట్లలో జంటగా కనిపించారు. అప్పటి నుంచే ఈ జంట రిలేషన్లో ఉన్నారంటూ బీటౌన్‌లో టాక్ వినిపిస్తూనే ఉంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపింది శ్రద్ధాకపూర్. తమ రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటించకపోయినా దీన్ని బట్టి వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని అర్థమవుతోంది.పెళ్లిలో జంటగా..తాజాగా తన ప్రియుడిగా భావిస్తోన్న రాహుల్ మోదీతో కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరైంది ముద్దుగుమ్మ. గుజరాత్లో అహ్మదాబాద్‌లో జరిగిన స్నేహితుల పెళ్లిలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సందడి చేసింది. ఇద్దరు కలిసి నూతన వధూవరులతో ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత శ్రద్ధా కపూర్ సైతం పెళ్లికి హాజరైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు శ్రద్దాకపూర్, రాహుల్ విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారు. కాగా.. గతేడాది జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ బాష్‌లో శ్రద్ధా కపూర్, రాహుల్ జంటగా కనిపించారు. అప్పటి నుంచే వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరింత వైరలయ్యాయి. Shraddha Kapoor and Rahul Mody at a friend's wedding in Ahmedabad last night ♥️ pic.twitter.com/PBRanqJeoR— 𝒔𝒉𝒓𝒂𝒅𝒅𝒉𝒂__𝒎𝒚__𝒋𝒂𝒂𝒏🦋 (@shraddhasmehnaz) February 22, 2025 -
అల్లు అర్జున్‌తో నో.. ఎన్టీఆర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్త్రీ 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ ఇచ్చేసిందట. చిత్రపరిశ్రమలో భారీ క్రేజ్ ఉన్న ఆమెకు ఐటమ్ సాంగ్స్‌లో నటించమని ఇప్పటికే భారీ ఆఫర్స్ వచ్చాయి. కానీ, ఆమె సున్నితంగానే వాటికి నో చెప్పింది. అయితే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ బాలీవుడ్ మూవీ వార్2లో ఆమె స్టెప్పులు వేయనుందని తెలుస్తోంది.‘సాహో’తో తెలుగు వారికి పరిచయమైన శ్రద్ధా కపూర్‌కు టాలీవుడ్లో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె మంచి డ్యాన్సర్ కూడా.. అయితే, ‘పుష్ప2’లో ప్రత్యేక పాట కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరిగింది. రెమ్యునరేషన్ విషయంలో డీల్ సెట్ కాకపోవడంతో ఆమె నో చెప్పారని కూడ వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా ఆ ఛాన్స్ శ్రీలీల దక్కించుకుంది. ఇప్పుడు వార్2 సినిమాలో శ్రద్ధా కపూర్ ఒక ఐటమ్ సాంగ్‌లో కనిపించనుందని గట్టిగానే వినిపిస్తుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతోంది.అల్లు అర్జున్ పుష్ప2 చిత్రానికి నో చెప్పిన శ్రద్ధా కపూర్.. ఎన్టీఆర్, హృతిక్‌తో కలిసి స్టెప్పులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే సినీప్రియుల్ని ఉర్రూతలూగించేలా ఆ సాంగ్ ఉంటుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని శ్రద్ధ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
దుబాయ్‌లో కీర్తి సురేశ్.. బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న అనన్య..!
దుబాయ్‌లో కీర్తి సురేశ్ చిల్...సెల్ఫీ మోజులో శ్రద్ధాకపూర్..శారీలో లావణ్య త్రిపాఠి ఫోటో షూట్..పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సాక్షి అగర్వాల్...బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న అనన్య నాగళ్ల.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
Year Ender 2024 భయపెట్టి, నవ్వించి ఏడ్పించిన సిల్వర్ క్వీన్స్
ఓటీటీ, థియేటర్ రిలీజెస్... ఈ రెండింటిలోనూ నటీమణులకు సంబంధించి అద్భుతమైన నటనకు చెప్పుకోదగ్గ సంవత్సరంగా 2024 నిలుస్తుంది. వారి నట ప్రతిభకు మాత్రమే కాకుండా భారతీయ సినిమా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోని వైవిధ్యానికి, అద్భుత కథాకథనాలను హైలైట్ చేసిన సంవత్సరంగా కూడా 2024 గురించి చెప్పవచ్చు...టాప్ టెన్‌లో ఒకటి... దో పట్టీగ్లామర్ పాత్రలు మాత్రమే కాదు నటనకు సవాలు విసిరే పాత్రలలో కూడా మెప్పించగలనని నిరూపించింది కృతీసనన్. సంక్లిష్టమైన సంబంధాలు, గృహహింసను ప్రతిబింబించే గ్రిప్పింగ్ డ్రామా ‘దో పట్టీ’లో సౌమ్య, శైలిగా ద్విపాత్రాభినయం చేసింది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దృఢసంకల్పంతో ఎదుర్కొనే మహిళగా తన నటనతో ప్రేక్షకుల మన్ననలు ΄పొందింది. పాత్రలలో భావోద్వేగాన్ని పండించడం లో కృతీసనన్ తనదైన నటనను ప్రదర్శించింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘దో పట్టీ’ ప్రపంచవ్యాప్తంగా నాన్–ఇంగ్లీష్ సినిమాల టాప్–టెన్ జాబితాలో ఒకటిగా నిలిచింది.నవ్వుతూనే భయపడేలా... భయపడుతూనే నవ్వేలా!చాలా తక్కువ స్క్రీన్ టైమ్‌తో, ఆకట్టుకునే ట్విస్ట్‌లతో ‘స్త్రీ–2’లో మెప్పించింది శ్రద్ధాకపూర్. హాస్యం, హారర్‌ను మేళవించిన ఆమె నటన అదుర్స్ అనిపించింది. ఫ్రెష్ లుక్‌తో, చక్కని టైమింగ్‌తో ఆకట్టుకుంది. ‘సీక్వెల్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కత్తిమీద సాములాంటిది. ఎంటర్టైనింగ్ డైలాగులు ఉన్న‘స్త్రీ–2’లో అద్భుతమైన నటీనటులు ఉన్నారు’ అంటుంది శ్రద్ధా కపూర్.అయితే ఆ అద్భుతమైన నటీనటులలో అందరి కంటే శ్రద్ధాకపూర్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. ‘స్త్రీ–2’ విజయంతో ఇప్పుడు ‘స్త్రీ–3’కు ఉత్సాహంగా రెడీ అవుతోంది.16 కిలోల బరువు పెరిగింది!ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్‌సింగ్ చమ్కీల జీవితం ఆధారం గా తెరకెక్కిన ‘అమర్ సింగ్ చమ్కీల’ అనే బయోగ్రఫీ డ్రామాలో పరిణీతి చోప్రా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ప్రశంసలు అందుకుంది. ప్రతి సన్నివేశంలో పాత్ర పట్ల అంకితభావం కనిపిస్తుంది. ఈ సినిమా కోసం పరిణీతి చోప్రా ఏకంగా 16 కిలోల బరువు పెరిగింది!‘చమ్కీల’ సినిమాలో అమర్ జోత్ కౌర్ పాత్రలో చోప్రాకు నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఇంతియాజ్ అలీ షూటింగ్‌కు ముందు... ‘కానీ మీరు ఆమెలా కనిపించడం లేదు’ అన్నాడు. అంతే.. బరువు పెరగడంపై దృష్టి పెట్టింది పరిణీతి చోప్రా. వర్కవుట్స్ చేస్తూ ఫిట్‌గా ఉన్న అమ్మాయి కాస్తా పాత్ర కోసం ఎడా పెడా తినేసి బరువు పెరిగింది.పరిణీతి చోప్రా ఉత్తమ నటన గురించి చెప్పుకునే చిత్రాలలో ‘చమ్కీల’ అగ్రస్థానంలో నిలుస్తుంది.వెరీ స్ట్రాంగ్ ఉమెన్సంప్రదాయ మహారాష్ట్ర మహిళగా ‘సర్ఫీర’లో రాధిక మదన్ అద్భుత నటన ప్రదర్శించింది. ప్రేమను పంచే భార్యగా, బలమైన వ్యక్తిత్వం, తిరగబడే శక్తి ఉన్న మహిళగా ఆమె పాత్ర ఆకట్టుకుంది.విభిన్నమైన పాత్రలు పొషించడం రాధికకు కొత్త కాకపొయినా ‘సర్ఫీర’లో పాత్ర స్ఫూర్తిని ప్రతిబింబించేలా ప్రాంమాణికమైన నటనతో ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ఎంతోమంది అభిమానులను సంపాదించింది. ‘మరాఠీ భాష, యాసపై రాధికకు ఉన్న పట్టు ఈ సినిమాలో హైలైట్.‘కంటెంట్ డ్రైవెన్ స్క్రిప్ట్‌లు ఎంచుకోవడంలో ముందు ఉంటుంది’ అని తన గురించి వినిపించే మాటను మరోసారి నిజం అని నిరూపించింది రాధికా మదన్.మాటలు కాదు... మాస్టర్ క్లాస్ఈ హసీన్ దిల్రూబా (2021)కి సీక్వెల్‌గా వచ్చిన ‘ఫిర్ ఆయి హసీన్ దిల్రూబా’లో తాప్సీ పన్ను మరోసారి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది. రొమాన్స్, సస్పెన్స్, డ్రామాలను బ్యాలెన్స్ చేయడం లో తన నటనతో మాస్టర్ క్లాస్ అనిపించుకుంది. కుట్రల ఉచ్చులో చిక్కుకుపొయే ‘రాణి కాశ్యప్’ పాత్రను పొషించి చిరస్మరణీయమైన నటనను ప్రదర్శించింది. ఎంతో సంక్లిష్టమైన పాత్రను కూడా అవలీలగా పొషించింది.‘లవ్ అంటే పిచ్చి కాదు’ అంటున్న తాప్సీ ప్రేమ చుట్టూ ఉండే నమ్మకం నుంచి త్యాగం వరకు ఎన్నో అంశాలను ప్రతిఫలించే పాత్రలో నటించి మెప్పించింది.‘రాణి పాత్రను పొషించినందుకు గర్వంగా ఉంది. నా క్యారెక్టర్ ద్వారా ఓపెన్ మైండ్‌తో ఉన్నప్పుడే ప్రతికూల పరిస్థితులతో పొరాడగలమని చెప్పాను’ అంటున్న తాప్సీ పన్ను సీక్వెల్లో లోతైన భావోద్వేగాలను ప్రదర్శించి మొదటి భాగంతో పొల్చితే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది.భయపడింది... భయపెట్టింది!‘భూల్ భులైయా 3’ ఫ్రాంచైజీతో మంజులికగా మెరిసింది విద్యాబాలన్. మంత్రముగ్ధులను చేసే నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘అమీ జే తోమర్’ పాటకు మాధురీ దీక్షిత్ కలిసి చేసిన డ్యాన్స్ ‘వావ్’ అనిపించింది. ‘భూల్ భులైయా 2’లో నటించడానికి ‘సారీ’ చెప్పింది విద్యాబాలన్. ‘భూల్ భులైయా నాకు బాగా నచ్చిన సినిమా. నేను బాగా నటించగలనా అనే సందేహం, రిస్క్ తీసుకోకూడదు అనుకోవడం వల్లే నో చెప్పాల్సి వచ్చింది’ అంటుంది విద్య.అయితే ‘భూల్ భులైయా 3’ కోసం మరోసారి తన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నో చెప్పలేకపొయింది. స్క్రిప్ట్ బాగా నచ్చడమే కారణం. ‘ఈ సినిమాలో నేను నటించాల్సిందే’ అని డిసైడైపొయిన విద్యాబాలన్ తన నటనతో ‘భూల్ భులైయా 3’ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. -
బ్లాక్ బ్యూటీలా శ్రీవల్లి.. హాట్ హాట్‌గా ఉప్పెన భామ!
బ్లాక్ బ్యూటీలా శ్రీవల్లి లుక్స్..మరింత హాట్‌గా ఉప్పెన భామ కృతి శెట్టి!టోక్యో షూట్లో బిజీ బిజీగా సుహాసిని..సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన పూనమ్ బజ్వా..మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఆదితి గౌతమ్..అనసూయ డిసెంబర్ మెమొరీస్..న్యూ ఇయర్ మూడ్‌లో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam | Actor (@aditigautamofficial) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ లో నటి శ్రద్ధా కపూర్ సందడి (ఫొటోలు)
-
పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. ఆ హీరోయిన్ను రిజెక్ట్ చేసిన నిర్మాతలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అయితే పుష్ప మూవీలో సమంత ఐటమ్ సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఆ సాంగ్‌కు ఫుల్ క్రేజ్ రావడంతో పార్ట్-2లోనూ ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్‌తో చిత్రయూనిట్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.అయితే పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం శ్రద్దాకపూర్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ తెలుస్తోంది. ఒక్క పాటకు దాదాపు రూ.5 కోట్ల పారితోషికం అడిగినట్లు సమాచారం. అయితే అంత భారీస్థాయిలో డిమాండ్ చేయడంతో పుష్ప-2 నిర్మాతలు తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఐటమ్ సాంగ్‌లో శ్రద్ధా కపూర్ డ్యాన్స్ చూడాలనుకున్నా ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. అయితే గతంలో సమంతకు కూడా దాదాపు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే పుష్ప-2 ఐటమ్ సాంగ్‌లో గుంటూరు కారం భామ శ్రీలీల కనిపించనున్నట్లు లేటేస్ట్ టాక్. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మెప్పించిన భామ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలతో బీజీగా ఉంది. శ్రీలీలతో డీల్ ఓకే అయితే పుష్ప-2 తన డ్యాన్స్‌తో అభిమానులను అలరించనుంది. కాగా పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా ప్రేక్షకులను అలరించనుంది. -
శ్రద్ధా కపూర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..! ఇష్టంగా పోహా..!
బాలీవుడ్ స్టార్ క్వీన్ శ్రద్ధా కపూర్ స్త్రీ 2 మూవీ బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఆ విజయోత్సాహంలో మునిగితేలుతుంది. శ్రద్ధా తన విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంటుంది. అంతేగాదు శ్రద్ధా నటనకు, గ్లామర్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. పాపులారిటీ పరంగా భారతదేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటీనటులలో శ్రద్ధా కపూర్ కూడా ఒకరు. అలాంటి శ్రద్ధాకి ఆరోగ్య స్ప్రుహ కూడా ఎక్కువే. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఎలాంటి ఆహారం తింటే మంచి ఫిట్నెస్తో ఆరోగ్యంగా ఉంటామో తన అభిమానులతో షర్ చేసుకుంటుంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా..ఇప్పటికి అలానే వన్నె తరగని అందంతో కట్టిపడేస్తుంది. అందుకు కారణం శ్రద్ధా పాటించే ఆహార నియమాలే. అవేంటో చూద్దామా..!2010లో తీన్ పట్టితో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన శ్రద్ధా ఇప్పటికీ అలానే అంతే అందంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే యంగ్‌గా ఫిట్నెస్తో ఉండేందుకు మంచి జీవనశైలిని పాటిస్తుంది. అలాగే రోజువారీ వ్యాయామాలు తప్పనిసరి అంటోంది. అంతేగాదు ఇటీవల ఇంటర్యూలో శ్రద్ధా కపూర్ తాను కొన్నేళ్లక్రితం శాకాహారిగా మారానని చెప్పుకొచ్చింది. తన భోజనంలో పూర్తిగా స్వచ్ఛమైన శాకాహారమే ఉంటుందని తెలిపింది. ఇక ఆమె ఫిట్నెస్ ట్రైనర్ మాహెక్ నాయర్ కూడా శ్రద్ధా పోహా, ఉప్మా, దలియా, ఇడ్లీ లేదా దోస వంటి ఆరోగ్యకరమైన ఇంటి భోజనంతో ప్రారంభిస్తుందని చెబుతున్నారు. కక్డీ చి భక్రి వంటి సాధారణ మహారాష్ట్ర వంటకం, దాల్ చావల్, ఊరగాయలంటే మహా ఇష్టమని చెబుతున్నారు. ఇలా వైవిధ్య భరితమైన వంటకాలని ఇష్టపడే ఆమెకు ఈ డైట్‌ప్లాన్‌ని అనుసరించాలని చెప్పడం కాస్త కష్టమని చెప్పారు. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) అందువల్లే ఆమె రోజులో మూడు సార్లు విభిన్నంగా తినేందుకే ఇష్టపడుతుందట. కూరగాయల్లో బెండకాలయంటే ఇష్టమని, పండ్లలో మామిడి పండు అంటే మహా ఇష్టమని పేర్కొంది శ్రద్ధా. తన సినిమాల పరంగా ఎక్కువ డ్యాన్స్‌తో కూడిన వాటికి గానూ మితమైన కార్బ్, ప్రోటీన్, ఫ్యాట్ డైట్లు తీసుకుంటుందని శ్రద్ధా ట్రైనర్ చెబుతున్నారు. అలాగే బికినీ పాత్రలకు అనుగుణంగా మంచి టోన్ స్కిన్ కోసం అధిక ఫైబర్‌తో కూడిన పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుతో కూడిన లీన్ డైట్‌ని తీసుకుంటుంది. ఆమె భోజనంలో తప్పనిసరిగా స్ప్రౌట్ సలాడ్లు, ఓట్స్ ఉంటాయి. అయితే ఏదైనా పండుగ సమయాల్లో మాత్రం డైట్‌ని పక్కన పెట్టేసి మరీ తనకిష్టమైన మోదకాలు, స్వీట్లు లాగించేస్తుంది. అయితే లిమిట్ దాటకుండా తీసుకుంటుదట. అంతేగాదు ఆమెకు ఫ్రెంచ్ ఫ్రైస్, వడ పావ్, పానీ పూరీ వంటివి కూడా చాలా ఇష్టమని చెబుతోంది శ్రద్ధా. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) (చదవండి: యాపిల్స్‌లోని ఈ రకాలు ట్రై చేసి చూశారా..!) -
పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. యానిమల్ బ్యూటీ కాదు.. ఆ హీరోయిన్ కోసం ప్రయత్నాలు!
టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. గతంలో పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప పార్ట్-1 సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కనిపించనుంది.అయితే పుష్ప చిత్రంలో ఓ సాంగ్ అభిమానులను ఊపేసింది. ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ.. అంటూ సాంగే ఐటమ్ సాంగ్ ఓ రేంజ్లో అలరించింది. ఈ పాటకు హీరోయిన్ సమంత తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఐటమ్ సాంగ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సీక్వెల్లోనూ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సాంగ్‌కు హీరోయిన్ ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పుష్ప టీమ్ ఫుల్ ఫోకస్ పెట్టింది.అయితే ప్రస్తుతం ఈ ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్ను వెతికేపనిలో ఉంది పుష్ప టీమ్. గతంలో ఈ పాట కోసం బాలీవుడ్ భామ, యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీ పేరు కూడా వినిపించింది. కానీ ఇప్పుడేమో మరో క్రేజీ హీరోయిన్ పేరు బయటకొచ్చింది. స్త్రీ-2 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న శ్రద్ధాకపూర్‌ను పుష్ప టీమ్ సంప్రదించినట్లు సమాచారం. ఆమెను ఎంపిక చేస్తే బాలీవుడ్‌లోనూ క్రేజ్ వేరే లెవెల్‌కు పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే శ్రద్ధాకపూర్‌ను టీమ్ సభ్యులు కలిశారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
శ్రద్ధా కపూర్ 'ఊ అన్నారా'?
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తుండగా, హీరోయిన్ శ్రీవల్లిపాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. ఈ సినిమా టాకీపార్టు చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంది. అలాగే మిగిలి ఉన్నపాటలను చిత్రీకరించే పనిలో ఉంది టీమ్. ఈ నెలాఖర్లో స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్‌లో మెరిసే హీరోయిన్ల పేర్లలో జాన్వీ కపూర్, మృణాళినీ ఠాకూర్, శ్రద్ధా కపూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి.అయితే శ్రద్ధా కపూర్‌ను యూనిట్ సంప్రదించిందని, ఆమే నటించనున్నారని భోగట్టా. మరి... శ్రద్ధా కపూర్ ఊ అన్నారా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘పుష్ప: ది రూల్’ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘పుష్ప’ సినిమా తొలి భాగం ‘పుష్ప : ది రైజ్’లోని స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామ..’లో సమంత మెరిశారు. ఈ సాంగ్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ‘పుష్ప 2’లోని స్పెషల్ సాంగ్ ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది. తొలి భాగానికి సంగీతదర్శకత్వం వహించిన దేవిశ్రీ ప్రసాద్ ‘పుష్ప: ది రూల్’కూ సంగీతం అందిస్తున్నారు. -
'స్త్రీ 3' ప్రాజెక్ట్‌పై శ్రద్ధా కపూర్ వ్యాఖ్యలు
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్ 3 రానుంది. ఈమేరకు శ్రద్ధా కపూర్ పలు విషయాలను పంచుకుంది. ఆగష్టు 15న విడుదలైన స్త్రీ2 కేవలం రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే.. సుమారు రూ. 700 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.స్త్రీ2 విజయం పట్ల శ్రద్ధా కపూర్ ఇలా చెప్పుకొచ్చారు. స్త్రీ సినిమా చూసిన ప్రతిసారి ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూడలేదనే ఫీల్ ఉంటుంది. అలాంటి సమయంలో దానికి సీక్వెల్ చేయాలని నన్ను కోరినప్పుడు చాలా సంతోషించాను. పార్ట్1 మించిన విజయాన్ని స్త్రీ2 చిత్రం ద్వారా ప్రేక్షకులు అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను ఇంత అద్భుతంగా తెరకెక్కించిన దర్శక నిర్మాతలను అభినందించాలి. ఈ చిత్రం ప్రాంచైజీలో భాగంగా మూడో పార్ట్ కూడా రానుంది. అయితే, అందులో మొదటి రెండు భాగాలకు మించిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పటికే మేకర్స్ ఆ పనులను ప్రారంభించారు.' అని ఆమె చెప్పారు.2018లో స్త్రీ సినిమా విడుదలైంది. ఆ చిత్రం భారీ విజయం అందుకోవడంతో ఈ ఏడాది రెండో పార్ట్ తెరకెక్కించారు. ఇందులో భాగంగానే మూడో పార్ట్‌ను కూడా నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. హారర్ కామెడీగా వచ్చిన ఈ రెండు సినిమాలు అభిమానులను మెప్పించాయి. -
ఓటీటీలోనూ తగ్గేదేలే.. దూసుకెళ్తోన్న హారర్ థ్రిల్లర్
శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ.870 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ హారర్ కామెడీ మూవీ బాలీవుడ్లో పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఇటీవలే ఓటీటీకి వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీలోనూ అదే రేంజ్లో దూసుకెళుతోంది.టాప్‌లో ట్రెండింగ్ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఏకంగా ప్రైమ్ వీడియో నేషనల్ వైడ్ గా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సెప్టెంబర్ చివర్లోనే రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే అక్టోబర్ 10 నుంచి ఉచితంగా అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. -
ఓటీటీలో రూ.700 కోట్ల సినిమా.. ఉచితంగా చూసేయండి
ఇటీవల థియేటర్లలో రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఆగస్టు 15న రిలీజై ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా యానిమల్, పఠాన్, బాహుబలి లాంటి పెద్ద సినిమాల రికార్డులను అధిగమించింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ స్త్రీ- 2. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పటికే అద్దె ప్రాతిపదికన ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. నేటి నుంచి ఉచితంగా అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు.స్త్రీ 2 కథేంటంటే..2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ. -
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్త్రీ 2' సినిమా
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ2 చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఆగష్టు 15న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్లో హిట్ టాక్ తెచ్చుకుంది. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 700 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.2018లో విడుదలైన స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ వచ్చింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) చూసే అవకాశం మాత్రమే ఉంది.స్త్రీ 2 కథేంటంటే..2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ.దర్శకుడు అమర్ కౌశిక్ వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ఒకవైపు భయపెడుతూనే మరోవైపు నవ్వులు పంచుతోంది. కామెడీ, హారర్ రెండింటిని బ్యాలన్స్ చేస్తూ ఆసక్తికరంగా కథనాన్ని సాగించాడు. ఇక ప్రత్యేక పాటలో తమన్నా స్టెప్పులేయడం.. అక్షయ్ కుమార్ అతిథి పాత్ర లో కనిపించడం సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. -
‘స్పెక్టాక్యులర్ సౌదీ’ ఈవెంట్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
‘స్త్రీ 2’ మూవీతో సంచలన విజయం సాధించిన శ్రద్ధా కపూర్ (ఫొటోలు)
-
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిన్న సినిమా.. ఏకంగా షారూక్ మూవీ రికార్డ్ బ్రేక్!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2 తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటిస్థానంలో ఉన్న షారూఖ్ ఖాన్ జవాన్ మూవీని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం జీవితకాల కలెక్షన్లను స్త్రీ-2 అధిగమించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి జవాన్ రూ.640.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. హిందీలో మాత్రమే రూ.582.31 కోట్లు రాబట్టింది. ఈ ఏడాదిలో స్త్రీ-2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం హిందీలోనే రూ.586 కోట్ల వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని స్ట్రీ 2 నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ భారతదేశంలోనే 'ఆల్ టైమ్ నంబర్ వన్ హిందీ చిత్రం' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2లో వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్రలు పోషించారు. గతంలో స్త్రీ (2018) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా.. గతేడాది షారూక్- అట్లీ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ జవాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. -
శ్రద్ధాకపూర్ మూవీ రికార్డ్.. ఏకంగా యానిమల్‌ను దాటేసింది!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ.. తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. అంతేకాకుండా గతంలోనే టాలీవుడ్ మూవీ బాహుబలి ది బిగినింగ్ వసూళ్లను దాటిన స్త్రీ-2.. సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్ దేశవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్‌ను సైతం దాటేసింది.కాగా.. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ గతేడాది విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేవలం ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.553 కోట్లు వసూళ్లు సాధించింది. తాజాగా స్త్రీ-2 రూ.583 కోట్ల వసూళ్లతో యానిమల్ చిత్రాన్ని దాటేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో షారూఖ్ ఖాన్ జవాన్ (రూ.640 కోట్లు) తర్వాత రెండోస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: బాహుబలిని దాటేసిన చిన్న సినిమా.. జవాన్‌పై గురి!)అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 15న విడుదలైన ఈ హారర్ కామెడీ సినిమా.. బాలీవుడ్లో స్టార్ హీరోల చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధాకపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. -
ఇంతవరకు దీపికా పదుకొణె సినిమాలు చూడలేదు: ప్రముఖ నటుడు
నవాజుద్దీన్ సిద్ధిఖి బాలీవుడ్లో బడా నటుడు. రెండున్నర దశాబ్దాలుగా తన నటనతో హిందీ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ మధ్యే సైంధవ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యాడు. ప్రస్తుతం అతడు యాక్ట్ చేసిన 'సైయాన్ కీ బందూక్' సాంగ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.దీపిక సినిమాలు చూడలేదుబాలీవుడ్ సెలబ్రిటీల గురించి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అలా హీరోయిన్ దీపికా పదుకొణె గురించి అడగ్గా ఆమె గురించి నాకు పెద్దగా తెలియదు, తన సినిమాలేవీ చూడలేదు అని బదులిచ్చాడు. అలాగే సెన్సేషనల్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి కూడా తనకు తెలియదన్నాడు. టికు వెడ్స్ షెరు మూవీలో అవనీత్ కౌర్‌తో నవాజుద్దీన్ సిద్ధిఖిత్వరలో చూస్తాపోనీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విధ్వంసం సృష్టించిన స్త్రీ 2 సినిమా గురించి తెలుసా? అని యాంకర్ ప్రశ్నించాడు. ఇప్పటివరకు సినిమా చూడలేదని, కానీ తప్పకుండా చూస్తానని నవాజుద్దీన్ చెప్పాడు. టికు వెడ్స్ షెరు మూవీలో తనతో కలిసి నటించిన యంగ్ హీరోయిన్ అవనీత్ కౌర్ గురించి మాట్లాడుతూ.. ఆమె సొంతకాళ్లపై నిలబడే వ్యక్తి. అద్భుతమైన నటి కూడా అని ప్రశంసించాడు.ఓటీటీ..కాగా నవాజుద్దీన్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ అద్భుత్ ఆదివారం (సెప్టెంబర్ 15న) ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో రిలీజైంది. ఈ మూవీలో డయానా పెంటీ, శ్రేయ ధన్వంతరి, రోహన్ మెహ్రా కీలక పాత్రలు పోషించారు.చదవండి: సోనియాని ఏకిపారేసిన యష్మి.. నామినేషన్లో ఎవరున్నారంటే? -
బ్లాక్‌బస్టర్ మూవీకి బంపరాఫర్.. కేవలం ఒక్క రోజు మాత్రమే!
రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.500 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. అయితే ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. (ఇది చదవండి: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘స్త్రీ 2’.. ఇంతకీ ఈ మూవీలో ఏముంది?)తాజాగా స్త్రీ-2 సినిమా టికెట్లపై చిత్ర బృందం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ టికెట్ ఆఫర్ 1+1 పొందేందుకు బుక్ మై షో యాప్‌లో STREE2 ప్రోమో కోడ్ వినియోగించాలని సూచించింది. అయితే ఈ ఆఫర్ కేవలం సెప్టెంబరు 13న మాత్రమేనని స్పష్టం చేసింది. దీంతో థియేటర్లలో ఈ మూవీ చూడాలనుకునేవారు ఎంచక్కా ఆఫర్‌ను ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Maddock Films (@maddockfilms) -
రూ.500 కోట్ల క్లబ్లో చిన్న సినిమా.. ఏకంగా ఆ జాబితాలో టాప్!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటించిన హారర్-కామెడీ చిత్రం స్త్రీ-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా అరుదైన క్లబ్లో చేరింది. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం 22 రోజుల్లోనే రూ.502.9 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. షారూఖ్ ఖాన్ జవాన్ తర్వాత అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా నిలిచింది. త్వరలోనే గదర్-2 ఆల్ టైమ్ వసూళ్లను దాటేయనుంది. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన గదర్-2 బాక్సాఫీస్ వద్ద రూ. 525 కోట్లు నికర వసూళ్లు సాధించింది.అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన 'స్త్రీ 2 మొదటి రోజు నుంచే రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో దేశవ్యాప్తంగా ఈ ఏడాది రూ. 500 కోట్ల నికర వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగా ఘనత సాధించింది. అయితే ఈ నెలలో బాలీవుడ్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశముంది. దేశవ్యాప్తంగా హిందీలో ఈ మూవీ కంటే ముందు జవాన్(రూ. 640 కోట్లు), పఠాన్(రూ.543 కోట్లు), యానిమల్(రూ.553 కోట్లు), గదర్-2 (రూ. 525 కోట్లు) ముందున్నాయి. -
Stree 2: రూ.50 కోట్ల బడ్జెట్.. రూ. 500 కోట్ల కలెక్షన్స్!
కంటెంట్ ఈజ్ కింగ్.. ఇప్పుడు ఇండియన్ చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న మాట ఇది. ఒకప్పుడు హీరోహీరోయిన్లను చూసి ప్రేక్షకులు సినిమా థియేటర్‌కి వెళ్లేవారు..కానీ ఇప్పుడు కథను నమ్మి వెళ్తున్నారు. కథ నచ్చితే హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా సినిమాను హిట్ చేస్తున్నారు. స్త్రీ 2 చిత్రం ఆ కోవలోకి చెందినదే. బడా హీరోలెవరు ఈ చిత్రంలో లేరు. కానీ ఆ హీరోల సినిమాలకు మించిన కలెక్షన్స్‌ని రాబడుతోంది. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి హిస్టరీ క్రియేట్ చేస్తోంది.ఊహించని విజయంశ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ 2 చిత్రం ఆగస్ట్ 15న విడుదలైంది. రిలీజ్‌కి ముందు వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ..ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. తొలి రోజు ఈచిత్రానికి రూ. 51 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఓ చిన్న చిత్రానికి ఈ మధ్యకాలంలో ఈ స్థాయి ఓపెనింగ్స్ రాలేదు. రిలీజ్ రోజే హిట్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ అమాంతం పెరిగిపోయాయి. మూడో వారంలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 509 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.స్త్రీ 2 కథేంటంటే..2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ.#Stree2 is rock-steady at the #BO, firmly holding its ground on a working day [third Mon]... Mass circuits - particularly non-national chains + single screens at Tier-2 and Tier-3 centres - are driving its biz... Expected to enjoy a smooth, uninterrupted run right till #Dussehra.… pic.twitter.com/AdUGp3v4Ff— taran adarsh (@taran_adarsh) September 3, 2024 -
బాహుబలిని దాటేసిన చిన్న సినిమా.. జవాన్‌పై గురి!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ మరో మైలురాయిని దాటేసింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా టాలీవుడ్ మూవీ బాహుబలి ది బిగినింగ్ దేశవ్యాప్తంగా సాధించిన నెట్ వసూళ్లను అధిగమించింది.'స్త్రీ 2' రిలీజైన రెండువారాల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.424 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. గతంలో రాజమౌళి చిత్రం 'బాహుబలి: ది బిగినింగ్' దేశీయంగా రూ. 421 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మళ్లీ థియేటర్లకు రప్పించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.ఇదే జోరు కొనసాగితే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది స్త్రీ-2. బాలీవుడ్లో 'గదర్ 2' (రూ. 525.7 కోట్లు), 'పఠాన్' (రూ. 543.09 కోట్లు), 'యానిమల్' (రూ. 553.87 కోట్లు) లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించే లక్ష్యంతో దూసుకెళ్తోంది. మూడో వారాంతం నాటికి ఇండియాలో రూ. 500 కోట్ల నికర స్థాయిని అధిగమిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే షారూఖ్ ఖాన్ చిత్రం జవాన్ సాధించిన రూ.640 కోట్ల నికర వసూళ్లను అధిగమించడం స్త్రీ-2 చిత్రానికి సవాల్‌గా మారనుంది. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుత జోరు చూస్తుంటే స్త్రీ 2'కి ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది. -
సినిమా సూపర్ హిట్.. కానీ అద్దె ఇంట్లోకి స్టార్ హీరోయిన్
హీరోహీరోయిన్లు అనగానే.. వాళ్లకేంటి బోలెడన్ని డబ్బులున్నాయని అనుకుంటారు. అది నిజమే కానీ కొందరు హీరోయిన్లు చాలావరకు అద్దెకు ఉంటుంటారు. మన దగ్గర చాలామందికి సొంతిళ్లు ఉంటాయి. బాలీవుడ్లో మాత్రం రెంట్ కల్చర్ ఎక్కువే. ఇప్పుడు స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ అదే ఫాలో అయిపోయింది. స్టార్ హీరో ఇంటిని అద్దెకు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న యంగ్ కమెడియన్)ప్రభాస్ 'సాహో'లో హీరోయిన్గా చేసిన శ్రద్ధా కపూర్.. తాజాగా 'స్త్రీ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇదలా పక్కనబెడితే శ్రద్ధా.. ఇప్పుడు ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న హీరో హృతిక్ రోషన్ ఇంటిని అద్దెకు తీసుకునే ప్లాన్‌లో ఉందట. బీచ్‌కి ఎదురుగా ఉంటే ఈ బిల్డింగ్‌లో హీరో అక్షయ్ కుమార్ అపార్ట్మెంట్ ఉండటం విశేషం.శ్రద్ధా కపూర్ ఇల్లు మారడానికి కారణం ఉంది. 1987లో శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్.. జుహూలోనే ఓ ఇంటిని కొన్నారు. దాన్ని ఇప్పుడు కాస్త విస్తరించి రీ మోడలింగ్ చేయాలనుకుంటున్నారు. అందుకే వేరే ఇంట్లో కొన్నాళ్ల పాటు అద్దెకు ఉండాలి. అలా ఇప్పుడు హృతిక్ ఇంట్లోకి శ్రద్ధా కపూర్ రానుందనమాట.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే) -
చీరలో రీతూ చౌదరి హొయలు.. నిధి అగర్వాల్ కొత్త లుక్
మేకప్ లేకుండా యాంకర్ అనసూయపెళ్లి డ్రస్సులో బార్బీ డాల్‌లా అమీ జాక్సన్బొద్దుగా ఉన్నా ముద్దొచ్చేలా పూనమ్ బజ్వాబీచ్ ఒడ్డున చీరలో అబ్బో అనేలా రాశీ సింగ్టైట్ ఔట్ ఫిట్‌లో కాక రేపుతున్న శ్రద్ధా కపూర్సిల్క్ చీరలో రచ్చ లేపుతున్న హాట్ బ్యూటీ రీతూ చౌదరిక్యాట్ వాక్ చేస్తూ క్యూట్‌గా ఓరకంట చూస్తూ కృతిశెట్టి View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Pragya Nayan Sinha (@pragyanayans) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Keerthi Pandian (@keerthipandian) -
బాక్సాఫీస్ వద్ద అదే జోరు.. కేజీఎఫ్-2 రికార్డ్ బద్దలయ్యే ఛాన్స్!
శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజై 12 రోజులైనప్పటికీ కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.589 కోట్ల గ్రాస్ వసూళ్ల సాధించింది. కేవలం ఇండియాలోనే రూ.498 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రూ.422 కోట్ల నెట్ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏకంగా రూ.20.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.విడుదలైన రెండోవారం మొదలైన స్త్రీ-2 చిత్రానికి థియేటర్లలో ఆదరణ దక్కించుకుంటోంది. హిందీ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్-2 సాధించిన వసూళ్ల కంటే కేవలం 12 కోట్లు మాత్రమే వెనుకబడి ఉంది. ఇదే జోరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టనుంది. ఈ చిత్రం త్వరలోనే అత్యధిక వసూళ్లు చేసిన ఆరో భారతీయ చిత్రంగా నిలవనుంది. మూడో వారాంతం నాటికి రూ.500 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబడుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో అపర్శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. ఈ వారంలోనూ బాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో స్త్రీ-2 ప్రభంజనం కొనసాగించే అవకాశముంది. ఆగస్ట్ 30న శుక్రవారం బీటౌన్‌లో బిగ్ స్టార్స్ చిత్రాలు ఏవీ రావడం లేదు. ఇది కూడా ఈ చిత్రానికి వసూళ్లుపరంగా కలిసి రానుంది. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న మూవీ.. పది రోజుల్లోనే రూ.500 కోట్లు!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన హారర్-కామెడీ చిత్రం స్త్రీ-2. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. 2018లో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్‌గా రూపొందించారు. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ.426 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ వసూళ్లతో కలిపి ఐదొందల మార్కును దాటేసింది.ఈ చిత్రం సక్సెస్ కావడం డైరెక్టర్ అమర్ కౌశిక్ ఆనందం వ్యక్తం చేశారు. స్త్రీ 2 కోసం దాదాపు రెండున్నరేళ్లు కష్టపడ్డామని తెలిపారు. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదని తెలిపారు. షూటింగ్ మొదటి రోజు నుంచే స్త్రీ 2 కథతో పూర్తిగా నిమగ్నమై తెరకెక్కించామని అన్నారు. కాగా.. అన్యాయానికి గురైన ఓ స్త్రీ.. దెయ్యంగా మారి ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదేవిధంగా వసూళ్లు కొనసాగితే త్వరలోనే ఈ మూవీ మరిన్ని పెద్ద చిత్రాల రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. -
శ్రద్ధ కపూర్ దెబ్బకు షారుఖ్ ఖాన్ రికార్డ్స్ అవుట్..!
-
స్టార్ హీరోయిన్.. కానీ బడా హీరోలతో ఇంతవరకు జోడీ కట్టలేదు!
కొన్ని రోజులుగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు మార్మోగిపోతోంది. అటు స్త్రీ ఘన విజయం ఆమెను ఉబ్బితబ్బిబ్బు చేస్తోంది. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించింది. కెరీర్లో ఎన్నో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ బడా స్టార్స్ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లతో మాత్రం ఇంతవరకు నటించనేలేదు. స్టార హీరోలతో నటించే ఛాన్స్ రాలేదా?ఖాన్ త్రయంతో నటించకపోవడానికి గల కారణాన్ని శ్రద్ధ తాజాగా బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. షారూఖ్, ఆమిర్, సల్మాన్‌లతో నటించే ఛాన్స్ నాకు ఎప్పుడో వచ్చింది. కానీ పాత్రలో సత్తా లేకపోవడం వల్ల, అసలు ఆ రోల్ బాగోకపోవడం వల్ల ఇప్పటివరకు ఏదీ ఫైనలైజ్ కాలేదు. సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు ఆఫర్ చేసిన పాత్ర పేలవంగా ఉంటే నేను చేయలేను.బెస్ట్ అనిపించేవి సెలక్ట్ చేసుకుంటామంచి సినిమాలే చేయాలనుకుంటాను. ఉత్తమ దర్శకులతో పని చేయాలని భావిస్తాను. ఇవన్నీ చేసినప్పుడే కదా పెద్ద స్టార్స్‌తో కలిసి నటించే ఛాన్స్ వస్తుంది. అలాంటి ఆఫర్ ఇప్పుడొస్తే కచ్చితంగా ఓకే చెప్తాను అని చెప్పుకొచ్చింది. కాగా శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన స్త్రీ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.400 కోట్లు రాబట్టింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాజ్‌కుమార్ రావు, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన డబ్బింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న శ్రద్ధాకపూర్ మూవీ.. వారం రోజుల్లోనే రికార్డ్!
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన చిత్రం స్త్రీ-2. గతంలో వచ్చిన చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.అమర్ కౌశిక్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో భారీగా వసూళ్లు రాబడుతోంది. ఇండియావ్యాప్తంగా రూ.342 కోట్లు రాబట్టగా.. వరల్డ్ వైడ్‌గా రూ.401 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్లో మొదటి వారంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. -
ప్రధాని మోదీనే మించిపోయిన ప్రభాస్ హీరోయిన్
మన దేశ గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా సరే ఈయన్ని చూసేందుకు అభిమానులు గట్టిగానే వస్తుంటారు. సోషల్ మీడియాలోనూ మోదీకి గుర్తింపు గట్టిగానే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈయన్ని బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ దాటేసింది.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)ప్రస్తుతం మన దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖుల్లో ఇన్ స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నది కోహ్లీకే. 270 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇతడి తర్వాత ప్రియాంక చోప్రాకు 91.8 మిలియన్లు, ప్రధాని మోదీకి దాదాపు 91.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మూడో స్థానికి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ వచ్చేసింది. 'స్త్రీ 2' సక్సెస్‌తో ఈమె ఫాలోవర్స్ సంఖ్య 91.4 మిలియన్లకు చేరింది. దీంతో మోదీని ఈమె అధిగమించినట్లయింది.ట్విటర్లో మాత్రం 101.2 మిలియన్ల ఫాలోవర్లతో మోదీ తొలి స్థానంలో ఉండటం విశేషం. ఇక శ్రద్ధా కపూర్ విషయానికొస్తే చాన్నాళ్ల నుంచి హిందీలో సినిమాలు చేస్తోంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌తోనూ 'సాహో' మూవీలో హీరోయిన్గా చేసింది. ఆ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. ఏదేమైనా ఇప్పుడు 'స్త్రీ 2'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఐదు రోజుల్లోనే ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది.(ఇదీ చదవండి: ఆశ్రమంలో 'డబుల్ ఇస్మార్ట్' హీరోయిన్.. త్వరలో సన్యాసం) -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న స్త్రీ-2.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం స్త్రీ-2. గతంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆగస్టు 15న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రక్షాబంధన్ రోజు సోమవారం సైతం రూ.45 కోట్ల కలెక్షన్స్‌తో హవా కొనసాగించింది.ఇండియా విషయానికొస్తే ఐదో రోజు సైతం రూ. 38.4 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా రిలీజైన ఐదు రోజుల్లోనే ఇండియావ్యాప్తంగా రూ. 242.4 కోట్ల వసూళ్లు సాధించింది. ఇదే జోరు కొనసాగితే ఈ వారాంతంలో పెద్ద సినిమాల రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. అదే రోజు బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఖేల్ ఖేల్ మే, వేదా చిత్రాలతో స్త్రీ-2 పోటీ పడుతోంది. ఆ రెండు సినిమాల కలెక్షన్లను బీట్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అపర్ శక్తి, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో వేచి చూడాల్సిందే. -
సూపర్ హిట్ మూవీ.. ఎవరి పారితోషికం ఎంతంటే?
స్త్రీ .. ఆరేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రాజ్‌కుమార్ రావు- శ్రద్దాకపూర్‌ల నటనకు జనాలు ఫిదా అయ్యారు. భయపెడుతూనే నవ్వించే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. తాజాగా దీనికి సీక్వెల్‌గా స్త్రీ 2 తెరకెక్కింది. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల పైచిలుకు సాధించింది. ఈ క్రమంలో ఇందులో నటించిన తారల రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం..హీరో రాజ్‌కుమార్ రావు రూ.6 కోట్ల పారితోషికం తీసుకోగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ రూ.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. కీలకపాత్రలో మెప్పించిన పంకజ్ త్రిపాఠి రూ.3 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారట. అపరశక్తి ఖురానా.. రూ.70 లక్షలు, అభిషేక్ బెనర్జీ రూ.55 లక్షలు అందుకున్నారు. అతిథి పాత్రలో కనిపించిన వరుణ్ ధావన్.. ఏకంగా రూ.2 కోట్లు అందుకున్నాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.135 కోట్లు వసూలు చేసింది.చదవండి: బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘స్త్రీ 2’.. ఇంతకీ ఈ మూవీలో ఏముంది? -
బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘స్త్రీ 2’.. ఇంతకీ ఈ మూవీలో ఏముంది?
కంటెంట్ బాగుంటే చాలు నటీనటులు, భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు నేటి ప్రేక్షకులు. ఏ భాషలోనే తెరకెక్కించినా చాలు.. హిట్ టాక్ వస్తే థియేటర్స్‌కి వెళ్లి చూస్తున్నారు. అలా ఇప్పుడు బాలీవుడ్ మూవీ స్త్రీ 2కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.135 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది.(చదవండి: బ్రదర్ అంటే బెస్ట్ ఫ్రెండ్: సితార ఘట్టమనేని)వాస్తవానికి ఈ సినిమాకి ప్రిమియర్ షో నుంచే హిట్ టాక్ వచ్చింది. తొలి రోజు ఏకంగా రూ. 51 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ స్థాయి కలెక్షన్స్ రాలేదు. వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు రావడం కూడా సినిమాకు ప్లస్ అయింది. దీనికి తోడు ఆగస్ట్ 15న విడుదలైన చిత్రాలన్నీ ప్లాప్ టాక్ మూటగట్టుకోవడం కూడా స్త్రీ 2కు కలిసొచ్చింది. స్త్రీ 2 కథేంటంటే..2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ.(చదవండి: మమ్ముట్టి ‘టర్బో’ మూవీ రివ్యూ)దర్శకుడు అమర్ కౌశిక్ వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ఒకవైపు భయపెడుతూనే మరోవైపు నవ్వులు పంచుతోంది. కామెడీ, హారర్ రెండింటిని బ్యాలన్స్ చేస్తూ ఆసక్తికరంగా కథనాన్ని సాగించాడు. ఇక ప్రత్యేక పాటలో తమన్నా స్టెప్పులేయడం.. అక్షయ్ కుమార్ అతిథి పాత్ర లో కనిపించడం సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. ఈ చిత్రం కచ్చితంగా 500 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని సీనీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
'స్త్రీ 2' ప్రచార కార్యక్రమంలో శ్రద్ధా కపూర్ (ఫొటోలు)
-
shraddha Kapoor: శ్రద్ధాకపూర్ అందాల ఆరబోత..
-
బాయ్ ఫ్రెండ్ రూమర్.. ఇంతలోనే హీరోయిన్ బ్రేకప్!
మరో స్టార్ హీరోయిన్ బ్రేకప్ చెప్పేసిందా? అంటే అవుననే అనిపిస్తోంది. ప్రభాస్ 'సాహో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. గత కొన్నాళ్లుగా రాహుల్ మోదీ అనే రైటర్‌తో ప్రేమలో ఉంది. దీన్ని నిజం చేసేలా పలు ఈవెంట్స్‌లో జంటగా కనిపించారు. నెల క్రితం కూడా రాహుల్ గురించి శ్రద్ధా పోస్ట్ పెట్టింది. ఇంతలోనే బ్రేకప్ న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫుడ్‌కి ఫిదా అయిన ఆరో హీరోయిన్.. ఏం చెప్పిందంటే?)శ్రద్ధా కపూర్.. రాహుల్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు అందరినీ ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. దీంతో బ్రేకప్ అయిందని అంటున్నారు. మరికొందరు మాత్రం త్వరలో శ్రద్ధా నటించిన 'స్త్రీ 2' త్వరలో రిలీజ్ కానుందని, దీనిపై బజ్ లేకపోవడంతో కావాలనే ఇలా స్టంట్ చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. శ్రద్ధా చెబితే తప్ప దీనిపై ఓ క్లారిటీ రాదు.తండ్రి శక్తి కపూర్ నటుడు కావడంతో సులువుగానే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 2010 నుంచి హిందీలో అడపాదడపా మూవీస్ చేస్తోంది. ప్రభాస్ 'సాహో'తో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకుంది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఇలా బ్రేకప్ న్యూస్ వల్ల వైరల్‌గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్) -
రెడ్ ఔట్ఫిట్లో అందంగా మెరిసిన ‘స్త్రీ-2’ భామలు
-
శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ సినిమా ప్రెస్‌మీట్ (ఫోటోలు)
-
జైలర్ తర్వాత మరో ఐటమ్ సాంగ్‌లో తమన్నా..!
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది జైలర్ మూవీలో ఐటమ్ సాంగ్‌తో అలరించిన భామ.. ఇటీవల ఎక్కువగా ఐటమ్ సాంగ్స్‌తోనే మెప్పిస్తోంది. తాజాగా స్త్రీ-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఈ మూవీ నుంచి ఆజ్ కీ రాత్ అనే ఐటమ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో తమన్నా భాటియా తన అందం, డ్యాన్స్‌తో అభిమానులను కట్టిపడేసింది. కాగా.. ఈ చిత్రంలో ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటిస్తున్నారు. ఈ మూవీని హారర్-కామెడీ చిత్రంగా తెరకెక్కిచారు. ఈ మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా.. దినేశ్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో పంకడ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
మీరు వధువుగా ఎప్పుడు కనిపిస్తారు?.. శ్రద్ధాకపూర్ సమాధానం ఇదే!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ ప్రస్తుతం స్త్రీ-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 2018లో వచ్చిన హిట్ మూవీ ‘స్త్రీ’కి సీక్వెల్‌గా ఈ మూవీని తీసుకొస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో తమన్నా ప్రత్యేక గీతంతో అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రద్ధాకపూర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా బాలీవుడ్ భామకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అని ఓ రిపోర్టర్ అడిగారు. దీనికి సమాధానంగా తనదైన శైలిలో స్పందించింది. ఒక స్త్రీ.. తనకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు పెళ్లి చేసుకుంటుందని నవ్వుతూ ఆన్సరిచ్చింది. కాగా.. గతంలో శ్రద్ధా కపూర్.. బాలీవుడ్ స్క్రీన్ రైటర్ రాహుల్ మోడీతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. వీరిద్దరికి తూ ఝూతీ మైన్ మక్కార్ మూవీ సెట్స్‌లో పరిచయమైంది. గతంలో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్‌కు జంటగా హాజరై సందడి చేశారు. కాగా.. శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ-2 ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
Shraddha Kapoor: పింక్ డ్రెస్‌లో అదరగొట్టిన సాహో హీరోయిన్ (ఫోటోలు)
-
తనకంటే చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్.. క్లారిటీ ఇచ్చేసిందా?
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో సాహో చిత్రంలో మెప్పించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. స్ట్రీ-2, చందు ఛాంపియన్ చిత్రాల్లో నటిస్తోంది. గతేడాది తు ఝూథీ మెయిన్ మక్కార్ తన అభిమానులను అలరించింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన కనిపించింది. అయితే ఈ చిత్రానికి రాహుల్ మోడీ రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా శ్రద్ధా కపూర్.. అతనితో ఉన్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. అవీ కాస్తా వైరల్ కావడంతో ఇంతకీ అతను ఎవరా? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే తు ఝూథీ మెయిన్ మక్కార్ సినిమా రిలీజ్ తర్వాత వీరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా పోస్ట్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ బీ టౌన్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. రాహుల్ మోడీ ప్యార్ కా పంచ్‌నామా 2, సోను కే టిటు కి స్వీటీ, ప్యార్ కా పంచ్‌నామా పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు. మరోవైపు అతను శ్రద్ధా కపూర్ కంటే మూడేళ్లు చిన్న అని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్‌కు 34 ఏళ్లు కాగా..శ్రద్ధా కపూర్ 37 ఏళ్లు. కొద్దికాలంగా ఈ జంట పలు ఈవెంట్లలో సందడి చేశారు. దీంతో డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్‌లో శ్రద్ధా, రాహుల్ జంటగా కనిపించారు. -
పండెరుపు చీరలో శ్రద్ధా స్టన్నింగ్ లుక్..ధర ఎంతంటే!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రద్ధా కపూర్ టీన్ పట్టి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచియం అయింది. అయితే ఆషికీ-2 సినిమాతోనే శ్రద్ధా కపూర్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ నటనకు బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఇప్పుడు శ్రద్ధా స్ట్రీ2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో శ్రద్ధా సంప్రదాయ చీరలో తళుక్కమంది. ఈ చీర ఆమె ఫ్యాషన్ శైలి ఏంటో చెప్పకనే చెప్పింది. ఆమె పూల మొక్కలతో కూడిన పండెరుపు చీరలో శ్రద్ధా ఎర్ర గులాబీలా అందంగా కనిపించింది.ఆ చీరకు తగ్గట్టు గోల్డెన్ బ్యాంగిల్స్, చక్కటి చెవిపోగులు, స్లీవ్ లెస్ బ్లౌజ్, సింపుల్ మ్యాకప్‌తో మరింతో అందంగా కనిపించిది. ఈ చీరను డిజైనర్ ధృవ్ పంచల్ తీర్చిదిద్దారు. దీని ధర ఏకంగా రూ. 31,500/-. శ్రద్ధా ఇలా చీరలో ఇంతకుమునుపు కూడా సందడి చేసింది. ప్రతి చీర ఆమె స్కిన్ టోన్‌కి తగ్గట్లుగా ఎంపిక చేసుకుంటుంది. తన లుక్ అందంగా కనిపించేలా సింపుల్ మేకప్‌కే ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఆమె నట్టించిన స్ట్రీ2 మూవీ వచ్చే నెల ఆగస్ట 15 థియోటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తన మూవీ ప్రమోషనల్ సందడి చేసేలా తన లుక్స్ పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది శ్రద్ధా.. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)(చదవండి: స్లిమ్‌గా మారిన నటి విద్యాబాలన్..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
ప్రభాస్ ఇంటి ఫుడ్‌ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే
డార్లింగ్ ప్రభాస్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది 'బాహుబలి'. ఎందుకంటే ఓ సాదాసీదా హీరో.. ఈ సినిమా వల్ల పాన్ ఇండియా వైడ్ అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. అలానే ప్రభాస్ అంటే అద్భుతమైన ఫుడ్ కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే తనతో పనిచేసే వాళ్లకు తినలేనంత వెరైటీ ఫుడ్ పెట్టి చంపేస్తాడనే అంటుంటారు. కానీ ఐదేళ్లయినా సరే డార్లింగ్ హీరో ఇంటి ఫుడ్‌ని బాలీవుడ్ హీరోయిన్ మర్చిపోలేకపోతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. 'సాహో' మూవీ చేశాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా చేసింది. మన దగ్గర మూవీ సరిగా వర్కౌట్ కాలేదు కానీ హిందీలో మంచి వసూళ్లు దక్కించుకుంది. అలానే ప్రభాస్-శ్రద్ధా జోడీ కూడా ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది. ఈ కాంబో మళ్లీ సెట్ అయితే బాగుండు అని చాలామంది అనుకుంటున్నారు. తాజాగా ఓ నెటిజన్.. ఈ విషయమై శ్రద్ధాని అడిగాడు.'ప్రభాస్‌తో మళ్లీ ఎప్పుడు నటిస్తారు?' అని నెటిజన్ అడగ్గా.. 'ప్రభాస్, మళ్లీ తన ఇంటి ఫుడ్ పంపించినప్పుడు..' అని రిప్లై ఇచ్చింది. దీనిబట్టి ఐదేళ్లయినా సరే ఇంకా ప్రభాస్ ఇంట్లో చేసిచ్చిన ఫుడ్‌ని శ్రద్ధా మర్చిపోలేకపోతోంది అనమాట. మరి అట్లుంటది ప్రభాస్ అతిథ్యం అంటే!(ఇదీ చదవండి: రామ్ చరణ్ కూతురు క్లీంకార కోసం ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్) -
Shraddha Kapoor: బహు భాషిణి
నటిగా సుపరిచితమైన శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా లిప్స్టిక్కు సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్లో బ్రిటిష్, ఫ్రెంచ్, రష్యన్, అమెరికన్ యాక్సెంట్లతో మాట్లాడి ‘ఔరా’ అనిపించింది. శ్రద్ధా నాలుగు విభిన్న భాషలను అలవోకగా మాట్లాడుతున్న ఈ వీడియో వైరల్ అయింది. గతంలో ‘కపిల్ శర్మ షో’లో తన భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించి ‘శభాష్’ అనిపించుకుంది శ్రద్ధ. ‘శ్రద్ధా కపూర్‌లో మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంది’ అంటున్నారు ఆమె అభిమానులు. -
అచ్చం ఆ హీరోయిన్లా... సాహో బ్యూటీ ఫన్నీ రియాక్షన్!
కెమెరామెన్లలో ఐపీఎల్ కెమెరామెన్స్ ప్రత్యేకం.. వీరు గ్రౌండ్లో ఆటపై ఎంత దృష్టిపెడతారో, ఆ ఆటను వీక్షించేందుకు వచ్చిన అందమైన అమ్మాయిలపైనా అంతే దృష్టి సారిస్తారు. ఎప్పటికప్పుడు కొత్త అందాలను వెలుగులోకి తీసుకువస్తుంటారు. స్టేడియంలో సెలబ్రిటీలు దాగి ఉన్నా సరే.. వారిని ఇట్టే పట్టేసుకుంటారు. అలా ఇటీవల ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ జరిగింది. అచ్చం హీరోయిన్లా.. ఈ మ్యాచ్‌లో ఓ అందమైన యువతిని హైలైట్ చేసి తనను కాస్తా వైరల్ చేశారు. చాలామంది ఆమెను హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో పోల్చారు. ఇది చూసిన శ్రద్దా కపూర్ సోషల్ మీడియాలో ఫన్నీగా స్పందించింది. అచ్చం తనలాగే ఉన్న ఆ అమ్మాయి ఫోటో షేర్ చేస్తూ.. 'హేయ్, అది నేనే' అని నవ్వుతున్న ఎమోజీ షేర్ చేసింది. ఇకపోతే హీరోయిన్‌కు జిరాక్స్‌లా ఉన్న ఆమె పేరు ప్రగతి. హీరోయిన్‌తో కలిసి.. ఒక్క మ్యాచ్‌తో వైరలైపోయిన ఈ బ్యూటీ మనిద్దరం కలిసి మ్యాచ్ చూద్దాం కదా.. అంటూ శ్రద్దా కపూర్‌ను ట్యాగ్ చేసింది. మరి ఆమె ఏమని స్పందిస్తుందో చూడాలి! శ్రద్ధా కపూర్ విషయానికి వస్తే.. ఆమె చివరగా తు ఝూటీ మే మక్కర్ అనే హిట్ మూవీలో నటించింది. ప్రస్తుతం స్త్రీ 2 అనే హారర్ మూవీ చేస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: రూ.3 కోట్ల లగ్జరీ కారు కొన్న బిగ్ బాస్ విన్నర్! -
అలాంటి డ్రెస్‌లో శ్రద్ధాదాస్ హోయలు..కలర్ఫుల్గా కనిపించిన మంచులక్ష్మి!
మెరుపులాంటి డ్రెస్‌లో శ్రద్ధాదాస్ హోయలు.. సండే మూడ్‌లో శ్రద్ధా కపూర్... కలర్‌ఫుల్ డ్రెస్‌లో మంచులక్ష్మి స్మైలీ లుక్స్.. బాలీవుడ్ భామ దియా మీర్జా ట్రెండీ పోజులు బ్లాక్ డ్రెస్‌లో శ్రియా శరణ్ బోల్డ్ లుక్స్.. View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
‘సాహో’ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ శ్రేయస్ అయ్యర్?!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రంజీ బరిలో దిగడం.. ఆ తర్వాత భారత జట్టులోకి రావడం.. ఆడిన రెండు మ్యాచ్‌లలో విఫలం కావడం.. ఆపై మళ్లీ రంజీ టోర్నీ ఆడేందుకు వెళ్లడం వంటివి జరిగాయి. ఈ పరిణామాల క్రమం మధ్యలో అయ్యర్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు కూడా!.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడన్న విమర్శల నేపథ్యంలో బోర్డు అయ్యర్‌పై వేటు వేసినట్లు తెలిసింది. అయితే, ఈసారి కెరీర్ పరంగా కాకుండా.. వ్యక్తిగత విషయాల నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ పేరు తెరమీదకు వచ్చింది. ఆమెతో డేటింగ్ అంటూ రూమర్లు శ్రేయస్ అయ్యర్ స్నేహితుల జాబితాలో ఓ కొత్త అమ్మాయి చేరినట్లు సమాచారం. అయితే, ఆమెతో కేవలం ఫ్రెండ్షిప్ వరకే అయ్యర్ పరిమితం కాలేదని.. డేటింగ్ కూడా చేస్తూ పరస్పర అభిప్రాయాలు పంచుకుంటూ.. తమ బంధాన్ని మరో లెవల్‌కు తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడని గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. వదంతులకు కారణం ఇదే? ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన అందాల తార. ఇక శ్రద్ధాతో అయ్యర్ పేరును ముడిపెట్టి కథనాలు రావడానికి కారణం.. ఇటీవల వాళ్లిద్దరు ఓ యాడ్‌లో కలిసి కనిపించడం.. అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో కావడమే. ఇద్దరు సెలబ్రిటీలు.. అందునా ఓ స్టార్ క్రికెటర్.. ఓ టాప్ హీరోయిన్ ఇలా ఒకరినొకరు ఫాలో కావడంతో నెటిజన్లు ఇలా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరూ సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారంటూ అభిప్రాయపడుతున్నారు. వాళ్లంతా బీ-టౌన్ అల్లుళ్లే కాగా క్రికెట్‌కు, బాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నవాబ్ అలీ పటౌడీ ఖాన్ నుంచి విరాట్ కోహ్లి.. మొన్నటికి మొన్న కేఎల్ రాహుల్ దాకా.. బాలీవుడ్ నటీమణులను పెళ్లాడిన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ఏమో శ్రేయస్ అయ్యర్ కూడా ఆ జాబితాలో చేరినా ఆశ్చర్యపడనక్కర్లేదంటున్నారు నెటిజన్లు! అన్నట్లు శ్రద్ధ ఇటీవలే తన 37వ పుట్టినరోజు జరుపుకోగా.. అయ్యర్‌కు ఇప్పుడు 29 ఏళ్లు! చదవండి: #DhanashreeVerma: అతడితో అలా చహల్ భార్య ధనశ్రీ వర్మ ఫొటో.. -
ఒకపుడు కాఫీ షాప్‌లో పనిచేసింది..ఒక్క సినిమాతో కలలరాణిగా.. ఎవరీ స్టార్ కిడ్?
యాక్టింగ్‌లోకి రాకముందు చాలామంది మోడల్‌గా లేదా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి ఒక్కో మెట్టూ ఎదుగుతూ స్టార్ ఇమేజ్ సంపాదించు కుంటారు. అదే అప్పటికే స్టార్లుగా, సూపర్ స్టార్లుగా పేరు సంపాదించిన వారి పిల్లలైతే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే చాలా గ్రాండ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. అలాంటి స్టార్ కిడ్స్ను అటు ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తారు. మరికొంతమంది . కానీ ప్రముఖ నటుడు కూతురు మాత్రం దీనికి భిన్నం. గ్లామరస్ షోబిజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు ఆమె ఏం చేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఆయన కూతురు ఎవరు? ఈ వివరాలన్నీ తెలియాలంటే మీరు స్టోరీ చదవాల్సిందే. బాలీవుడ్లో విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు శక్తి కపూర్. విలనిజాన్ని పండించడంలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ఆయన. ఆయన ముద్దుల తనయ శ్రద్ధా కపూర్. 1987, మార్చిలో పుట్టింది. సూపర్ స్టార్ కుటుంబం నేపథ్యం, అందం, ప్రతిభ రెండూ ఉన్నప్పటికీ శ్రద్ధా తొలి చిత్రం (2010లో "తీన్ పట్టి" ) ఫ్లాప్ అయ్యింది. దాదాపు మూడేళ్ల తరువాత గానీ హీరోయిన్గా గుర్తింపు రాలేదు. కానీ 2013లో ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ భామ. ఆషికీ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఆషికీ 2 సినిమా ఆరోహి పాత్రతో ఒక్కసారిగా యూత్ కలల రాణిగా అవతరించింది. బాలీవుడ్లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది. ఒక్కో సినిమాకు సుమారు 5 కోట్ల రూపాయలదాకా తీసుకుంటుందని సమాచారం. పెళ్లికిచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూసి అతిథులు ఫిదా : ఫాదర్ ఐడియా అదిరింది! "ఏక్ విలన్,’’ "హైదర్", "ABCD", "బాఘీ", "హాఫ్-గర్ల్‌ఫ్రెండ్" “సాహో” (2019),చిచోరే, “స్ట్రీట్ డ్యాన్సర్” (2020),'తూ ఝూతీ మై మక్కార్' (2023) లాంటి పలు సినిమాల్లో నటించింది. అనేక అవార్డులు, ప్రశంసలను అందుకుంది. "లవ్ కా ది ఎండ్" చిత్రంలో ఉత్తమ నటిగా స్టార్‌డస్ట్ సెర్చ్‌లైట్ అవార్డును అందుకుంది. 2014లో మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీల మెకాఫీ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. శ్రద్ధా మంచి గాయని కూడా శ్రద్ధా కపూర్ నటన మాత్రమేకాదు పాటలు పాటడంలో కూడా దిట్ట. దివంగత గాయని లతా మంగేష్కర్ , ఆశా భోంస్లేల నుంచి శ్రద్ధాకు వారసత్వంగా వచ్చిన ప్రతిభ ఇదని భావిస్తారు. శ్రద్దాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, నటించడం అంటే ఆసక్తి ఉండేదట. సినిమా డైలాగులు రిహార్సల్ చేస్తూ బాలీవుడ్ పాటలకు అద్దం ముందు డ్యాన్స్ చేస్తూ ఉండేదట. అలాగే తండ్రితో పాటు వివిధ షూటింగ్ లొకేషన్లకు కూడా వెళ్లేది. అలా నటనపై ఆసక్తి ఉన్నప్నపటికీ సినిమాల్లోకి రాకముందే తన చదువును పూర్తి చేయాలని భావించింది. అందుకే పదహారేళ్ల వయసులో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చిత్రంలో ఆఫర్ వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించింది. శ్రద్ధా బోస్టన్ విశ్వ విద్యాలయంలో సైకాలజీ చదువుతున్న క్రమంలో ఆమె అక్కడ కాఫీ షాప్‌లో కూడా పనిచేసిందని చెబుతారు. శ్రద్ధా ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటిపోయింది. హారర్ కామెడీ , డ్యాన్స్ డ్రామా జానర్‌తో చిత్రాలతోపాటు, గాయనిగా కూడా తనను తాను నిరూపించుకుంటోంది. స్త్రీ-2 తోపాటు ప్రస్తుతం రెండు-మూడు సినిమాలున్నాయని, ఈ ప్రాజెక్ట్‌లు టైమ్ ట్రావెల్, పురాణాల ఆధారంగా ఉంటాయని ఇటీవల శ్రద్ధా కపూర్ ప్రకటించింది. సోషల్ మీడియా క్రేజ్ ఇన్‌స్టాలో 86.8 మిలియన్లు, ట్విటర్లో 14.3 మిలియన్ల ఫాలోయర్లుఉన్నారంటేనే సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్‌ను అర్థం చేసు కోవచ్చు. నటనతో పాటు అనేక పాపులర్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న శ్రద్ధా ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 123 కోట్లుగా అంచనా. -
పూజా హెగ్డే గ్లామర్ ట్రీట్... అలాంటి డ్రస్‌లో 'మన్మథుడు' బ్యూటీ!
మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న హీరోయిన్ శ్రద్ధా కపూర్ డిజైనర్ డ్రస్‌లో హిట్ సినిమాల హీరోయిన్ శ్రుతిహాసన్ బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హీరోయిన్ రెబా బర్త్ డే సెలబ్రేషన్స్ అమెరికాలో చిల్ అవుతున్న 'హనుమాన్' బ్యూటీ అమృత అయ్యర్ స్పా చేయించుకున్నానని చెబుతూ మహేశ్ భార్య నమ్రత పోస్ట్ థైస్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే సింగింగ్ టాలెంట్ బయటపెట్టిన హాట్ బ్యూటీ అషూరెడ్డి సున్నుండలు చేస్తూ బిజీబిజీగా ఉన్న యాంకర్ అనసూయ వీపు అందాలు చూపిస్తూ మాయ చేస్తున్న 'మన్మథుడు' బ్యూటీ View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by JOE (@joemonjoseph) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) -
ఫ్రెండ్ పెళ్లిలో చిందేసిన బాలీవుడ్ బ్యూటీ.. మరి నీ పెళ్లెప్పుడో?
ఇప్పటి పెళ్లిళ్లు తూతూమంత్రంగా జరగడం లేదు. హల్దీ, సంగీత్, డెస్టినేషన్ వెడ్డింగ్.. ఇలా రకరకాల పేర్లు, ఈవెంట్లతో ధూమ్‌ధామ్‌గా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీల పెళ్లిళ్లయితే చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీల దగ్గర పనిచేసేవారు కూడా బాగానే సంపాదిస్తూ అంతే గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ దగ్గర పనిచేసే ఆమె హెయిర్ స్టైలిస్ట్ నిఖితా మీనన్ పెళ్లి పీటలెక్కింది. గోవాలో ఆమె పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎనర్జీ డ్యాన్స్ ఈ క్రమంలో అక్కడ పెళ్లికూతురితో పాటు తన ఫ్రెండ్స్‌తో కలిసి హిందీ పాటకు స్టెప్పులేసింది శ్రద్ధా కపూర్. పింక్, ఆరెంజ్ కలర్ లెహంగా ధరించిన ఈ బ్యూటీ ఎంతో ఎనర్జీగా డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు శ్రద్ధా ఎంత సంతోషంగా, హుషారుగా డ్యాన్స్ చేస్తుందో.. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు.. మరి నువ్వెప్పుడు ముహూర్తం పెట్టించుకుంటావ్? అని కామెంట్లు చేస్తున్నారు. సాహోతో తెలుగులో పరిచయం కాగా గతంలో స్త్రీ(2018) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రద్ధా కపూర్ ఇప్పుడు దాని సీక్వెల్లో నటిస్తోంది. రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే సాహో సినిమాతో ఈ బ్యూటీ తెలుగువారికీ దగ్గరైంది. View this post on Instagram A post shared by Gaurav (Shraddha Kapoor Fanpage) (@teamshraddhakusa) View this post on Instagram A post shared by Gaurav (Shraddha Kapoor Fanpage) (@teamshraddhakusa) View this post on Instagram A post shared by Gaurav (Shraddha Kapoor Fanpage) (@teamshraddhakusa) View this post on Instagram A post shared by Nikita Menon (@nikitamenon1) చదవండి: ఓటీటీలో మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు! -
మిస్టర్ పొలిశెట్టి బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
క్రిస్మస్ ఎనర్జీ
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు సంబంధించి బాలీవుడ్ సెలబ్స్ సందడి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. పాత, కొత్త అనే తేడా లేకుండా తారల క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. తారలలో కొందరు తమ క్రిస్మస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. క్రిస్మస్ తన ఫేవరెట్ ఫెస్టివల్ అని చెబుతోంది బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ‘క్రిస్మస్కు సంబంధించి బాల్యజ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకు బాగా నచ్చే పండగ ఇది. నా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎక్కువగా బహ్రెయిన్‌లో జరిగాయి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కడే. చిన్నప్పుడు క్రిస్మస్కు ముందురోజు రాత్రి బొమ్మల దుకాణంలో అందమైన బార్బీ బొమ్మను చూశాను. అది నాకు బాగా నచ్చింది. అదేరోజు అర్ధరాత్రి ప్రార్థనల తర్వాత శాంటా క్లాజ్ నుంచి అచ్చం అలాంటి బొమ్మే అందింది. ఓ మై గాడ్, శాంటా ఈజ్ సో కూల్ అనుకున్నాను’ అంటూ గత జ్ఞాపకాల్లోకి వెళ్లింది ఫెర్నాండేజ్. ‘క్రిస్మస్ ఎనర్జీ’ పేరుతో క్రిస్మస్ జ్ఞాపకాల ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయడంలో ముందుంటుంది శ్రద్ధా కపూర్. -
సొగసైన కారుపై 'సాహో' భామ
-
Shraddha Kapoor: లంబోర్గిని కారు కొన్న శ్రద్ధా కపూర్ (ఫోటోలు)
-
నాలుగు కోట్ల కారు కొన్న స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
2010లో టీన్ పట్టి చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన భామ శ్రద్ధా కపూర్. లవ్ కా ది ఎండ్ సినిమాలో హీరోయిన్గా కనిపించింది. ఆ తర్వాత ఆషికి-2 చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం హైదర్, ఏక్ విలన్, ఏబిసిడి, భాగీ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈ ఏడాది రణ్‌బీర్ కపూర్ సరసన తూ ఝూతీ మైన్ మక్కర్ చిత్రంలో నటించింది. తాజాగా ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. (ఇది చదవండి: స్టార్ కమెడియన్ కూతురు బర్త్ డే.. హాజరైన అగ్ర హీరోలు!) అత్యంత ఖరీదైన లంబోర్గిని హురాకేన్ టెక్నికా అనే మోడల్ కారును సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కారు విలువ దాదాపు రూ.4 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శ్రద్ధా కపూర్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ తారలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆమె రాజ్ కుమార్ రావు సరసన స్ట్రీట్-2 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2018లో వచ్చిన హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: 'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!) View this post on Instagram A post shared by Pooja Choudary (@poojachoudary_9) -
‘మహాదేవ్’ లూటీ రోజుకు రూ.200 కోట్లు
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన వ్యవహారమిది. బాలీవుడ్ ప్రముఖ నటులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. యాప్‌పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత నెలలో భారత్‌లో 39 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.417 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, నగదు స్వా«దీనం చేసుకుంది. యాప్ కోసం ప్రచారం చేసిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ యాప్ బాగోతం బయటపడింది. ► ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి పట్టణానికి చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ దుబాయ్‌లో మకాం వేసి, మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ► కొత్తకొత్త వెబ్సైట్లు, చాటింగ్ యాప్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారు. ఆన్లైన్లో బెట్టింగ్‌ల్లో భారీగా లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ► తమ వలలో చిక్కిన కస్టమర్లతో వాట్సాప్‌లో గ్రూప్‌లు ఏర్పాటు చేస్తారు. వారితో నేరుగా ఫోన్లలో మాట్లాడరు. వాట్సాప్ ద్వారానే సంప్రదిస్తుంటారు. ► కస్టమర్లను బెట్టింగ్ యాప్‌లో సభ్యులుగా చేర్చి, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత వారితో నగదు జమ చేయించుకుంటారు. ఈ వ్యవహారాన్ని మహాదేవ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు పర్యవేక్షిస్తుంటారు. ఈ డబ్బంతా తప్పుడు పత్రాలతో తెరిచిన యాప్ నిర్వాహకుల బినామీ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. ► యాప్‌లో బెట్టింగ్‌లు కాస్తే తొలుత లాభాలు వచి్చనట్లు నమ్మిస్తారు. దాంతో కస్టమర్లో ఆశ పెరిగిపోతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా అతడిని ప్రేరేపిస్తారు. చివరకు అదంతా నష్టపోయేలా బెట్టింగ్ యాప్‌లో రిగ్గింగ్ చేస్తారు. మళ్లీ కొత్త బకరా కోసం వేట మొదలవుతుంది. ► మహాదేవ్ బెట్టింగ్ యాప్ సంపాదన ప్రతిరోజూ రూ.200 కోట్లు ఉంటుందని ఈడీ దర్యాప్తులో తేలింది. ► భారత్, మలేసియా, థాయ్‌లాండ్, యూఏఈలో మహాదేవ్ యాప్‌నకు వందలాది కాల్ సెంటర్లు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉంది. నాలుగు దేశాల్లో పెద్ద సంఖ్యలో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. ► భారత్‌లోని 30 కాల్ సెంటర్లను అనిల్ దమానీ, సునీల్ దమానీ నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని ఈడీ అరెస్టు చేసింది. ► బెట్టింగ్ యాప్ జోలికి రాకుండా ఉండడానికి పోలీసులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు నిర్వాహకులు హవాలా మార్గాల్లో లంచాలు ఇచి్చనట్లు వెల్లడయ్యింది. ► బెట్టింగ్ సిండికేట్ నడిపిస్తున్న ఓ యాప్‌ను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రమోట్ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది. ► ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఓ పెళ్లి నిర్వహణకు రూ.200 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. దీనిపై దర్యాప్తు చేయగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ గురించి బయటపడింది. ఈ పెళ్లిలో రణబీర్ కపూర్, శ్రద్ధాకపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్‌తోపాటు మరికొందరు బాలీవుడ్ నటులు ప్రదర్శన ఇచ్చారు. వారికి హవాలా మార్గంలో రూ.కోట్లలో చెల్లింపులు చేసినట్లు తేలింది. పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలను చార్టర్డ్ విమానంలో దుబాయ్‌కి తీసుకెళ్లారని ఈడీ అధికారులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డేటింగ్లో స్టార్ హీరోయిన్.. ముచ్చటగా మూడోసారి!
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా.. లవ్ కా ది ఎండ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2013లో విడుదలైన ఆషికి- 2 చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది. శ్రద్దా సినిమాల్లో నటించడంతో పాటు మంచి సింగర్ కూడా. తన సినిమాల్లో చాలా పాటలు పాడింది. (ఇది చదవండి: ప్రతి తండ్రికి ఈ పాట అంకితం: మహేశ్ బాబు ప్రశంసలు) అయితే తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. గతంలో ఆషికి-2 నటుడు ఆదిత్య రాయ్కపూర్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూసి.. ఆఫ్ స్క్రీన్‌లోనూ రిలేషన్లో ఉన్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఆ తర్వాత ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చెట్టాపట్టాలేసుకుని పలు పార్టీలకు హాజరైంది. ఆ సమయంలో శ్రద్దా కపూర్‌పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా శ్రద్ధా కపూర్ అతనితో డేటింగ్లో ఉందన్న వార్త బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తు జూతీ మైన్ మక్కర్' చిత్రానికి సహ రచయితగా పనిచేసిన రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందని బీ టౌన్ టాక్. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. అయితే ఈ జోడీ రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. నెటిజన్స్ సైతం న్యూ లవ్ బర్డ్స్ ఇన్ బాలీవుడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో శ్రద్ధా కపూర్‌కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్‌పై శివాజీ ఎమోషనల్!) కాగా.. తూ ఝూతీ మైన్ మక్కర్ చిత్రం 2023లో విడుదలైంది. లవ్ ఫిల్మ్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్, డింపుల్ కపాడియా, అనుభవ్ సింగ్ బస్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. స్టార్ హీరోయిన్‌కు సమన్లు!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో రణ్‌బీర్ కపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్, హ్యూమా ఖురేషికి సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా మరో నటి శ్రద్ధా కపూర్‌కు సైతం నోటీసులిచ్చారు. ఇవాళ ఈడీ ముందు హాజరవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించగా.. రణ్‌బీర్ కపూర్ హాజరయ్యేందుకు రెండు వారాల గడువు కోరారు. అయితే ఈరోజు శ్రద్ధా కపూర్ ఈడీ ముందుకు హజరవుతారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: బాలీవుడ్లో బెట్టింగ్ యాప్ ప్రకంపనలు.. ప్రముఖులకు ఈడీ సమన్లు..!) ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న కపిల్ శర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్లకు కూడా వేర్వేరు తేదీల్లో సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరంతా కూడా ఈడీ ముందు హాజరు కావడానికి రెండు వారాల సమయం కోరినట్లు తెలిపారు. అయితే ఈ కేసులో వీరందరినీ నిందితులుగా ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం యాప్ ప్రమోటర్లు వారికి చేసే చెల్లింపు విధానం మాత్రమే ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ మహదేవ్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నట్లు ఈడీ పేర్కొంది. -
బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించిన సాహో భామ.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆషిక్-2 సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ఆ తర్వాత పలు చిత్రాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఈ ఏడాది రణ్‌బీర్ కపూర్ సరసన తూ జూటి మెయిన్ మక్కర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీలో బాగీ, ఎక్ విలన్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, స్త్రీ, ఓకే జాను లాంటి చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సాహో చిత్రంలో కనిపించింది శ్రద్ధా కపూర్. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: హ్యాపీ బర్త్ డే బాబాయ్.. ఉపాసన స్పెషల్ విషెస్!) అయితే తాజాగా ఈ సాహో భామ ముంబయిలో ఓ థియేటర్ వద్ద కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా చూసి బయటకు వస్తుండగా కెమెరాల కంటికి చిక్కింది. అయితే ఆమెతో పాటు బాయ్‌ఫ్రెండ్ రాహుల్ కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి థియేటర్లో సినిమా చూసి వెళ్తుండగా ఫోటోలకు పోజులిచ్చింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ బీ టౌన్లో చర్చ మొదలైంది. కానీ ఇంతవరకు వీరి రిలేషన్‌పై ఎక్కడా స్పందించలేదు. అయితే వీరిద్దరు వేరు వేరు కార్లలో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. రాహుల్ తూ జూతీ మైన్ మక్కార్ సినిమాకు రచయితగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. అంతే కాకుండా రాహుల్ ప్యార్ కా పంచ్‌నామా- 2, సోను కే టిటు కి స్వీటీతో సహా లవ్ రంజన్ చిత్రాలకు కూడా పనిచేశాడు. కాగా.. గతంలో శ్రద్ధా కపూర్.. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో కొన్నాళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు 2022లో విడిపోయినట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపించాయి. (ఇది చదవండి: విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్..
Siddhanth Kapoor Inside Party Video Goes Viral After Consuming Drugs: మొన్నటి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు మరవకముందే బాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. స్టార్ హీరోయిన్ సోదరుడు, వెటరన్ యాక్టర్ శక్తి కపూర్ తనయుడు సిద్దాంత్ కపూర్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆదివారం (జూన్ 12) రాత్రి బెంగళూరులో పార్టీ జరుగుతున్న హోటల్‌పై పోలీసులు దాడి చేయగా పలువురు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించారు. వారిలో సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నట్లు ధృవీకరించారు. సిద్ధాంత్తోపాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిని ఉల్సూరు పోలీస్ స్టేషన్‌కు తరిలించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సిద్ధాంత్ అరెస్ట్ అయిన కొద్ది గంటల తర్వాత ఈ వీడియో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో సిద్ధాంత్ డీజే ప్లే చేస్తూ కనిపించాడు. అతను ప్లే చేస్తున్న సంగీతానికి పార్టీలోని వారంతా డ్యాన్స్ చేయడం మనం చూడొచ్చు. చదవండి: ఇటలీలో ఫ్యామిలీతో మహేశ్ బాబు.. ఫొటో వైరల్.. View this post on Instagram A post shared by Whatsinthenews (@_whatsinthenews) కాగా సిద్ధాంత్.. సల్మాన్ ఖాన్ 'జుడ్వా' చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రంగీలా పాత్రలో కనిపించాడు. 'భాగమ్ భాగ్', 'చుప్ చుప్కే', 'భూల్ భులాయా' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేశాడు. 'అగ్లీ', 'జజ్బా', 'భూత్: పార్ట్ 1', 'చెహ్రే' వంటి పలు సినిమాల్లో నటించాడు. తన సోదరి శ్రద్ధా కపూర్‌తో కలిసి 'హసీనా పార్కర్' సినిమాలోనూ నటించాడు. -
డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ హీరోయిన్ సోదరుడు
బెంగళూరు: సినీ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసులు పట్టి పీడిస్తున్నాయి. ఆ మధ్య షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే కదా! ఇది మరవకముందే బాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్దాంత్ కపూర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని రేవ్ పార్టీ జరుగుతున్న హోటల్‌పై పోలీసులు దాడి చేయగా పలువురు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించారు. వారిలో సిద్ధాంత్ కూడా ఉన్నట్లు ధృవీకరించారు. అతడితో పాటు డ్రగ్స్ తీసుకున్న మరో ఐదుగురిని ఉల్సూర్ పోలీస్ స్టేషన్‌కు తరలిచామని పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయంపై సిద్ధాంత్ తండ్రి శక్తి కపూర్ స్పందిస్తూ ఇది నమ్మశక్యంగా లేదని, ఇలా జరిగే ఛాన్సే లేదని పేర్కొన్నాడు. తన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదని, అదుపులోకి మాత్రమే తీసుకున్నారని స్పష్టం చేశాడు. కాగా సిద్ధాంత్.. సల్మాన్ ఖాన్ 'జుడ్వా' చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రంగీలా పాత్రలో కనిపించాడు. 'భూల్ భులాయా', 'చుప్ చుప్కే' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేశాడు. 'అగ్లీ', 'జజ్బా', 'భూత్: పార్ట్ 1' వంటి పలు సినిమాల్లో నటించాడు. తన సోదరి శ్రద్ధా కపూర్‌తో కలిసి 'హసీనా పార్కర్' మూవీలోనూ నటించాడు. Actor Shraddha Kapoor's brother Siddhanth detained in Bengaluru for consuming drugs Read @ANI Story | https://t.co/3pl5WyDdnn#ShraddhaKapoor #Siddhanth #Bengaluru #Detained pic.twitter.com/AYvMSOEAHo — ANI Digital (@ani_digital) June 13, 2022 చదవండి: మాజీ భర్త మోసం చేస్తే సల్మాన్ సాయం చేశాడు -
వరస్ట్ కండీషన్స్, డిప్రెస్డ్ ఫీలింగ్స్.. మీకోసమే ఇది.. ఒక్కసారి చదివితే!
‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రద్ధా కపూర్‌కు పుస్తకాలు శ్రద్ధగా చదువుకోవడం చాలా ఇష్టమైన పని. ఆమెకు బాగా నచ్చిన పుస్తకాల్లో ఒకటి...మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. ఈ పుస్తకం గురించి తెలుసుకుందాం... ‘ఈ జీవిత పరమార్థం ఏమిటి?’ అనే బరువైన ప్రశ్నకు అంతకంటే బరువైన సమాధానాలు చెప్పిన పుస్తకాలు వచ్చాయి. చాలా తేలికగా చెప్పిన పుస్తకాలు వచ్చాయి. ఈ పరంపరలోనిదే ఈ పుస్తకం. ఆస్ట్రియా న్యూరోలజిస్ట్, సైకియాట్రిస్ట్ రాసిన పుస్తకం...మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. ఎంత గట్టి మనిషికి అయినా బేలగా మారిపోయి నిరాశలోకి జారిపోయే సందర్భాలు ఎదురవుతుంటాయి. వరస్ట్ కండీషన్స్, డిప్రెస్డ్ ఫీలింగ్స్ నుంచి బయటపడడానికి ఎంతో ఉపకరించే పుస్తకం ఇది. ‘లోగోథెరపీ’ ఫౌండర్‌గా ప్రసిద్ధి పొందిన విక్టర్ ఫ్రాంక్ల్ ఈ పుస్తకంలో తన నిజజీవిత సంఘటనలు, కేస్స్టడీస్లను ఉదహరించారు. పేథాలాజికల్ టర్మ్స్‌ను ఉపయోగించి వాటి గురించి వివరించారు. ఫస్ట్ సెక్షన్లో కాన్సన్ట్రేషన్ క్యాంపులలో ఖైదీల దుర్భర జీవితాన్ని గురించి వివరిస్తారు. ఆ అనుభవం తనకు స్వయంగా ఉండడం, ఇతర ఖైదీలతో మాట్లాడే అవకాశం లభించడంతో బలంగా రాయగలిగారు. మొదటి సెక్షన్ ముగిసేలోపు ‘జీవితపరమార్థం ఏమిటి?’ అనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లే అనిపిస్తుంది. రెండో సెక్షన్లో లోగోథెరపీ అంటే ఏమిటి? లోగోథెరపీకి, సైకోఎనాలసిస్కు మధ్య ఉండే తేడా ఏమిటి? అనేది తెలియజేస్తారు. ఎగ్జిస్టెన్షియల్ వాక్యూమ్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సర్వైవల్.... మొదలైన ‘లోగోథెరపీ’ కాన్సెప్ట్‌ల గురించి వివరంగా తెలియజేస్తారు. ‘ఖాళీ ఛాంబర్లోకి గ్యాస్ వదిలితే కొద్దిసేపట్లోనే ఆ గ్యాస్ ఛాంబర్‌ను పూర్తిగా ఆక్రమిస్తుంది. ఆ ఛాంబర్ పెద్దదా? చిన్నదా? అనేది విషయం కాదు. గ్యాస్ అంతటా విస్తరించడం అనేది వాస్తవం’ ‘గ్యాస్’ అనేది సమస్య అనుకుంటే అది ఎంతైనా విస్తరిస్తుంది. 170 పేజీల ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ పుస్తకం ‘షార్ట్ అండ్ స్వీట్’ అని పేరు తెచ్చుకుంది. ఈ పుస్తకాన్ని ఒక్కరోజులో చదివేయవచ్చు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ, మనలోకి మనం ప్రయాణం చేస్తూ సంవత్సరాలు చదివేయవచ్చు. జీవితం అనేది అదుపుతప్పిన బండిలా పరుగులు తీస్తున్నప్పుడో, లక్ష్యం లేని బాణంలా దూసుకుపోతున్నప్పుడో, మనిషిగా కాకుండా మనకు మనమే భౌతికవస్తువుగా అనిపిస్తున్నప్పుడో... ఒక ప్రశ్న తప్పనిసరిగా వేసుకోవాల్సిందిగా చెబుతుంది ఈ పుస్తకం. ‘జీవిత పరమార్థం ఏమిటి?’ ఈ ప్రశ్న తీసుకువచ్చే సమాధానం మన జీవితాన్ని వెలుగుమయం చేయవచ్చు. వేనవేల కొత్తశక్తులను బహుమానంగా ఇవ్వవచ్చు. చదవండి👉🏾 ∙ Pooja Hegde: థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో.. ‘రెండూ అబద్ధాలే ఎందుకు కాకూడదు’! -
ప్రియుడితో బ్రేకప్ తర్వాత తొలిసారి పోస్ట్ చేసిన శ్రద్దా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ బ్రేకప్ ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాలుగేళ్లుగా ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో మునిగి తేలుతున్న శ్రద్దా ఊహించని విధంగా బ్రేకప్ చెప్పేయడం ఆమె అభిమానులకు షాకింగ్‌గా అనిపింస్తుంది. బాలీవుడ్లో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఏంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీనిపై ఇంతవరకు వీరిద్దరు స్పందించకపోయినా వీరి బ్రేకప్ నిజమేనని బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.చదవండి: ప్రియుడితో స్టార్ హీరోయిన్ బ్రేకప్!.. నాలుగేళ్ల బంధానికి ముగింపు గత నాలుగేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఊహించని విధంగా బ్రేకప్‌తో తమ లవ్‌స్టోరికి ఎండ్‌కార్డ్ వేసేశారు. గోవాలో జరిగిన శ్రద్దా కపూర్ బర్త్‌డే పార్టీ ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూర్చింది. కాగా సోషల్ మీడియాలో శ్రద్దా బ్రేకప్‌పై జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ఔర్ సునావో( ఇంకా వినిపించండి)అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సాహో చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైన శ్రద్దా రణబీర్ కపూర్ సరసన ఓ సినిమా చేస్తుంది. వీటితో పాటు`చాల్ బాజ్`..`నాగిన్` లాంటి సినిమాలు చేతిలో ఉన్నాయి. చదవండి: 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ వాడిన బైక్ కోసం అంత ఖర్చయిందా? -
ప్రియుడితో స్టార్ హీరోయిన్ బ్రేకప్!.. నాలుగేళ్ల బంధానికి ముగింపు
Shraddha Kapoor Rohan Shrestha Break Up: చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోవడం చూస్తుంటాం. ఇటీవలి కాలంలో బ్రేకప్ కహానీలు మరీ ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది. బాయ్‌ఫ్రెండ్ రోహన్ శ్రేష్టతో నాలుగేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ అతడి నుంచి విడిపోయింది. దీనిపై ఇంతవరకు ఇద్దరూ స్పందించలేదు. గత కొన్నాళ్లుగా సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ట- శ్రద్దా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. పార్టీలు, పబ్‌లు, టూర్స్ అంటూ పలుమార్లు మీడియాకు చిక్కిన వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. అయితే అనూహ్యంగా నాలుగేళ్ల లవ్‌స్టోరీకి ఫుల్స్టాప్ పెట్టేశారు. అయితే విడిపోవడానికి గల కారణాలు ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇటీవలె గోవాలో శ్రద్దాకపూర్ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్నేహితుల,సన్నిహితులు అంతా హజరయ్యారు. కానీ ప్రియుడు రోహన్ మాత్రం హాజరు కాలేదు. సోషల్ మీడియాలో కూడా రోహాన్ బర్త్‌డే విషెస్ చెప్పలేదు. దీంతో వీరిద్దరి బ్రేకప్ నిజమేనని బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. -
సౌకర్యంగా ఉంటేనే కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాం
సెట్స్ మీద స్క్రిప్ట్‌లోని పాత్రల పట్లే కాదు ఆఫ్సెట్స్లో అటెండ్ అవబోతున్న అకేషన్స్‌కి ధరించబోయే అవుట్ ఫిట్స్ మీదా అంతే శ్రద్ధ పెడుతుంది శ్రద్ధా కపూర్! అందుకే హీరోయిన్గా ఆమెకు ఎంత క్రేజో... ఫ్యాషన్ దివాగానూ ఆమె పట్ల అంతే అభిమానం సినీప్రియులకు. ఆమెను దివానీగా మార్చిన బ్రాండ్స్ ఇవే.. సౌకర్యంగా ఉండే దుస్తులనే ఇష్టపడతా. సౌకర్యంగా ఉంటేనే కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాం. అందుకే నా దృష్టిలో ఫ్యాషన్ అంటే సౌకర్యం. ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం. – శ్రద్ధా కపూర్ ఐవరీ లెహెంగా డిజైనర్: అనీతా డోంగ్రే ధర:రూ. 1,99,000 త్యానీ బంగారు, వజ్రాభరణాలను భారతీయులు ఇష్టపడ్డంతగా ప్రపంచంలో ఇంకెవరూ ఇష్టపడరు. నగలు చేయించడమంటే ఒకరకంగా ఆస్తిని కూడబెట్టడమే మన దగ్గర. అదో ఆనవాయితీగానూ స్థిరపడింది. ఈ పాయింటే ‘త్యానీ’ బ్రాండ్ స్థాపనకు ప్రేరణనిచ్చింది. దీని వెనకున్న వ్యక్తి కరణ్ జోహార్. మీరు సరిగ్గానే చదివారు. బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్ జోహారే. తన సృజన తృష్ణకు మరో విండోనే ఈ ‘త్యానీ’. భారతీయ సంప్రదాయ నగలను ఆధునిక మహిళ అభిరుచికి తగ్గట్టుగా మలుస్తోందీ త్యానీ. అదే దాని మార్క్.. బ్రాండ్ వాల్యూనూ! 27 వేల రూపాయల నుంచి లక్షల్లో పలుకుతుంది త్యాగీ జ్యూయెలరీ. అనీతా డోంగ్రే బాల్యంలోని సెలవులను జైపూర్‌లోని అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో గడపడం వల్ల స్థానిక సంప్రదాయ కుట్లు, అల్లికలను చూస్తూ పెరిగింది అనీతా డోంగ్రే. దాంతో చిన్నప్పుడే ఫ్యాషన్, డిజైనింగ్ పట్ల మక్కువ పెంచుకుంది. అందుకే పెద్దయ్యాక ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ చేసింది. సంప్రదాయ కళకు ఆధునిక హంగులను జోడించి సరికొత్త డిజైన్స్‌ను రూపొందించింది. ఆ సృజనే ఆమె బ్రాండ్ వాల్యూగా మారింది. అంతేకాదు ఎంతో మంది గ్రామీణ మహిళలకు చక్కటి ఉపాధినీ ఇస్తోంది. ఆమె ప్రత్యేకతల్లో ఇంకో మాటా చేర్చాలి. అనీతా డోంగ్రే డిజైన్స్ పర్యావరణ ప్రియంగా ఉంటాయి. రసాయన రంగులు, లెదర్, ఫర్ వంటివి ఉండవు. -
పెళ్లికి సిద్ధమవుతున్న మరో స్టార్ హీరోయిన్, హింట్ ఇచ్చిన నటి
Actress Padmini Kolhapure Hints Shraddha Kapoor Marriage To Be Soon: బాలీవుడ్ యంగ్ స్టార్స్ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే రాజ్‌కుమార్, పత్రలేఖ వివాహం చేసుకోగా నేడు(డిసెంబర్ 9, 2021) విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్‌లు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇక త్వరలోనే రణ్‌బీర్ కపూర్-అలియా భట్లు కూడా ఒకటి కాబోతున్నారు. ఈ క్రమంతో మరో బి-టౌన్ బ్యూటీ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకుని సెటిలైపోవాలనుకుంటుందట. చదవండి: ఊహ నన్ను చూసి వణికిపోయింది: శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా కొంతకాలంగా సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో శ్రద్ధా ప్రేమలో ఉన్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక శ్రద్ధా కజిన్ పెళ్లి వేడుకల్లో రోహాన్ సందడి చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో శ్రద్దా-రోహాన్‌లు నిజంగా డెటింగ్‌లో ఉన్నట్లు ఫిక్సైయిపోయారు. కాగా శ్రద్ధా కపూర్ వివాహాంపై సీనియర్ నటి, ఆమె బంధువు పద్మిని కొల్హాపురి తాజాగా ఓ హింట్ ఇచ్చింది. పద్మిని కొల్హాపురి గతంలో తను పాడిన పాటను మళ్లీ రీక్రియేట్ చేసింది. శ్రద్ధ ఈ పాటను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో షేర్ చేసుకుంది. చదవండి: Katrina-Vicky wedding: సినీ స్టార్ట్స్తోపాటు, అంబానీ ఫ్యామిలీ దీనికి స్పందించిన పద్మిని ‘నీ పెళ్లిలో ఈ పాటనే పాడుబోతున్న’ అని రిప్లై ఇచ్చింది. దీంతో శ్రద్ధా వివాహం అతి త్వరలోనే ఉండబోతుందంటూ ఆమె ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రద్ధా వివాహం త్వరలోనే అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రభాస్ ‘సాహో’ సినిమాతో తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకున్న శ్రద్ధా కపూర్… శక్తి కపూర్ ముద్దుల తనయగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన అందం, అభినయంతో హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ‘ఆషికీ-2’ , ‘భాఘి’ సిరీస్, ‘ఏక్ విలన్’, ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’, ‘హైదర్’, ‘స్ట్రీట్ డ్యాన్సర్’, ‘చిచ్చోరే’ తదితర హిట్ సినిమాలతో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
'సలార్'లో ఆ సీన్ రీషూట్.. స్పెషల్ సాంగ్‌లో 'సాహో' బ్యూటీ ?
Interval Scenes From Salaar Movie May Be Reshoot: దర్శకధీరుడు రాజమౌళి తీసిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాకా ప్రభాస్ నుంచి రాబోతున్న మరో భారీ యాక్షన్ చిత్రం 'సలార్'. కేజీఎఫ్‌తో అద్భుతమైన హిట్ సొంత చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న 'సలార్' చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇండియన్ స్క్రీన్‌పైనే మోస్ట్ అవైటెడ్ మూవీగా 'సలార్' మారింది. అయితే ఈ అంచనాలను అందుకోవాలని తపనతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. అయితే సలార్ ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను మళ్లీ రీషూట్ చేస్తున్నారట. నిజానికి ఈ సీన్ షూట్ ఇదివరకే పూర్తయిన.. ఔట్పుట్ విషయంలో ప్రశాంత్ అసంతృప్తిగా ఉన్నాడట. అందుకే ఈ సీన్‌ను రీషూట్ చేయాలని భావిస్తున్నారట. ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలెట్‌గా ఉంటుందన్న నమ్మకంతో ప్రశాంత్ పట్టుదలగా ఉన్నాడని సమాచారం. ఇక 'సలార్' స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించనుందని తెలుస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధాను ఎంపిక చేశారట మేకర్స్. సాహో సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా అలరించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ప్రభాస్ మంచి మనసు.. ఏపీ వరద బాధితులకు భారీ విరాళం -
ఖరీదైన కారును వదిలి ఆటోలో ప్రయాణించిన హీరోయిన్
Shraddha Kapoor Auto Ride In Mumbai: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఆటోలో ప్రయాణించింది. ఖరీదైన కారు ఉన్నా సాధారణ అమ్మాయిలా ఆటోలోనే ప్రయాణం చేసింది. దీనికి సంబంధించి ఆటో జర్నీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. దీనికి లవ్ సింబర్‌ను జోడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సెలబ్రిటీ అయ్యుండి కూడా సింపుల్‌గా ఆటోలో ప్రయాణించడంపై సాహో బ్యూటీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రద్ధా సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. నేను కూడా అదే ఆటోలో ఉంటే బాగుండేది అంటూ ఓ అభిమాని వీడియోను రీట్వీట్ చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రద్ధా చల్బాజ్ ఇన్ లండన్‌లో నటిస్తుంది. దీనితో పాటు నాగిన్ సీరియల్ ఆధారంగా తెరకెక్కుతున్న ఓ సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమాకు నిఖిల్ ద్వివేది నిర్మించనున్నారు. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
హల్చల్ : క్యూట్‌గా నజ్రియా...స్టన్నింగ్ లుక్‌లో కాజల్
► క్యూట్‌గా నజ్రియా... స్టన్నింగ్ లుక్‌లో కాజల్ ► పింక్ శారీలో నాజ్రియా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ► కాజల్ స్టన్నింగ్ లుక్స్ ► పర్పుల్ శారీలో యాంకర్ అనసూయ ► వెకేషన్ మూడ్‌లో అల్లు స్నేహా రెడ్డి ► కత్రినా చేతిలో బ్రేక్‌ఫాస్ట్ కూడా అందంగా.. ►ప్రేమ పంపిస్తున్న రాశీ ఖన్నా View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
టవల్‌తో అదితి.. ఇండియా వదిలి వెళ్తున్న పునర్నవి
► ఏమీ చేయకపోయినా పర్వాలేదంటున్న కాజోల్ ► ఇండియా వదిలి వెళ్లిపోతున్న పునర్నవి ► నన్నే చూడండి అంటున్న హీనా ఖాన్ ► వింటేజ్తో పాటు ట్రెండీ లుక్‌లో శిల్పాశెట్టి ► కొంటెగా చూస్తున్న శ్రద్దా కపూర్ ► టవల్ చుట్టుకొని స్టైల్‌గా ఫోజిచ్చిన అదితి భాటియా ► కఠిన వ్యాయామాలు చేస్తున్న జాన్వీ కపూర్ ► వీకెండ్ వైబ్స్ అంటున్న సదా View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by HK (@realhinakhan) -
రోహన్‌తో శ్రద్ధా కపూర్ ప్రేమ వ్యవహరం, స్పందించిన శక్తి కపూర్
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో ఆమె ప్రేమ లోకంలో విహరిస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత మార్చిలో శ్రద్ధా కజిన్ వివాహా వేడుకకు రోహన్ హాజరు కావడం, ఆ వేడుకలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు బి-టౌన్లో ఎక్కడ చూసిన వీరిద్దరూ జంటగా కనిపించడం, విందులు వినోదాలకు జంటగా హాజరు కావడంతో నిజంగానే వీరు ప్రమలో మునిగితెలుతున్నారని అందరూ ఫిక్స్ అయ్యారు. అంతేకాదు ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతోందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. చదవండి: భర్త రాజ్‌కుంద్రాకు శిల్పా విడాకులు ఇవ్వబోతోందా?! ఇదిలా ఉండగా రోహన్, శ్రద్ధాల ప్రేమ, పెళ్లి పుకార్లపై ఆమె తండ్రి, నటుడు శక్తికపూర్లు స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘రోహన్ ఫ్యామిలీ ఫ్రెండ్. అతడి తండ్రి రాకేష్ శ్రేష్ట్ నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం. తరచూ మేము ఫ్యామిలీ మీటింగ్స్‌లో కలుసుకుంటూనే ఉంటాం. రోహన్ ఎప్పుడూ మా ఇంటికి వస్తుంటాడు. కానీ శ్రద్ధాను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు అతడు నా దగ్గర ప్రస్తావించలేదు. ఇదంత పక్కన పెడితే ఈ రోజుల్లో పిల్లలు సొంతంగా నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఒకవేళ శ్రద్ధా తన జీవిత భాగస్వామని తానే చూసుకున్నానని చెప్పినా ఒప్పుకునేందుకు సిద్దంగా ఉన్నాను. తన ఇష్టాన్ని గౌరవిస్తాను. అయినా నేనేందుకు తిరస్కరిస్తా?. అయితే ప్రస్తుతం శ్రద్ధా తన కేరీర్‌పై ఫోకస్ పెడుతోంది. చదవండి: పీకల్లోతు కష్టాల్లోకి బాలీవుడ్.. నార్త్ ఆడియెన్స్ కు ఏమైంది? అయితే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా ముఖ్యమైనది. కానీ ప్రస్తుత కాలంలో కొందరూ సొంతంగా నిర్ణయాలు తీసుకోని పెళ్లి చేసుకుంటున్నారు, ఆ తర్వాత సులువుగా విడిపోతున్నారు. అలాంటివి చూసినప్పుడు నాకు కాస్తా కంగారుగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ‘శ్రద్ధా, సిద్దాంత్ కపూర్(శక్తికపూర్ కుమారుడు, శ్రద్దా సోదరుడు) ఇష్టాలను నేనేప్పుడు కాదనను. తన నటిస్తానని చెప్పినప్పుడు నేను నిరాకరించానని అన్నారు. అలా నేను ఎందుకు చేస్తాను. ఓ తండ్రిగా నా కూతురు షైన్ అవుతుంటే గర్వపడతాను కదా. తనని నేను ‘గోల్డ్ గర్ల్’ అని ముద్దుగా పిలుచుకుంటాను’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇటీవల శ్రద్దా కపూర్ కజిన్ ప్రియాంక శర్మ కూడా శ్రద్ధా, రోహన్‌ల ప్రేమ, పెళ్లీపై హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి తానేమి మట్లాడలేనని, త్వరలోనే మీకే తెలుస్తుందంటూ ఆమె చెప్పకనే చెప్పింది. అదే విధంగా ఇలాంటి ఏమైన ఉంటే, వారు పెళ్లి చేసుకుంటే మీకు కూడా పిలుపు అందుతుంది కదా అంటూ ఆమె స్పష్టం చేసింది. (చదవండి: శ్రద్ధా కపూర్ పెళ్లి; వాళ్లకు ఇష్టమైతే నేను సిద్ధమే!) -
ఆమెకు వీడ్కోలు.. శ్రద్ధాతో రొమాన్స్, చివరకు.. ఆదిత్య రాయ్ బ్రేకప్ స్టోరీ
ఆదిత్య రాయ్ కపూర్..సినిమా హీరోగా కన్నా ప్రేమికుడిగానే ఫేమస్. అతని విఫల ప్రేమ గాథే ఈ ‘మొహబ్బతే’లో... సిద్ధార్థ రాయ్ కపూర్ తమ్ముడిగా కాకుండా సొంత గుర్తింపుతోనే రాణిస్తున్నాడు ఆదిత్య రాయ్ కపూర్. అలాంటి ఐడెంటిటీ, సింప్లిసిటీ తోవలోనే నడుస్తున్న అహానా డియోల్ అంటే మనసు పడ్డాడు. అహానా ఎవరంటే.. ధర్మేంద్ర, హేమమాలినిల రెండో కూతురు. అమ్మ, నాన్న ఫేమ్‌తో కాకుండా స్వీయ ప్రతిభతోనే గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం.. ప్రయత్నం ఆమెది. అందుకే సంజయ్ లీలాభన్సాలీ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది. ‘గుజారిష్’ సినిమాకు పనిచేయసాగింది. ఆ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్ది కూడా ముఖ్య భూమిక. ఆ షూటింగ్‌లోనే ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఇద్దరి ఆలోచన, ఆచరణ ఒకటే అవడంతో త్వరగానే స్నేహం కుదిరింది. ‘గుజారిష్’ విడుదలయ్యేలోపు ఆ ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించింది. చెట్టపట్టాల్, చాటింగ్, అవుట్స్కట్స్లో హ్యాంగవుట్స్ ఈ లవ్ స్టోరీలోనూ షెడ్యూల్ అయ్యాయి. ఈ ప్రేమను ఆశీర్వదించే వాళ్లకంటే ఆ జంటను చూసి ఆందోళన చెందిన వాళ్లే ఎక్కువ.. అయ్యో.. చక్కటి కెరీర్‌ను ప్రేమ పాశంతో కట్టేసుకుంటున్నారే అని. అయినా నాలుగేళ్లు ఆ మోహంలో పడి కొట్టుకుపోయారిద్దరూ. అప్పుడు కలగజేసుకున్నారు ఇరువైపు పెద్దలు. పని మీదే దృష్టిపెట్టండని హెచ్చరించారు. లక్ష్యం గుర్తొచ్చింది ఇద్దరికీ. కలల్లోంచి బయటకు వచ్చారు. ఇద్దరి గమ్యం ఒకటే అయినా కలిసి చేయాల్సిన ప్రయాణం కాదని అర్థం చేసుకున్నారు. స్నేహపూర్వకంగానే వీడ్కోలు చెప్పుకున్నారు తమ ప్రేమకు. విడివిడిగా ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. ఆ బ్రేకప్ తర్వాత.. ఆదిత్య రాయ్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. శ్రద్ధా కపూర్‌తో. ‘ఆశికీ 2’ సినిమా సెట్స్ మీద. ఈ ఇద్దరూ కలసి నటించిన తొలి సినిమా అది. ఆ జంట కెమిస్ట్రీకి బాక్సాఫీస్ బ్రహ్మరథం పట్టింది. ఆ సినిమా విషాదంతం కావడంతో బాధపడ్డారు. నిజ జీవితంలో ఈ ఇద్దరు జతకూడితే బాగుండు అని ఆశపడ్డారు అభిమానులు. వాళ్లు ఆశించినట్టుగానే మిత భాషి అయిన ఆదిత్యకు గలగలా మాట్లాడుతూ చలాకీగా ఉండే శ్రద్ధా అంటే ఇష్టం ఏర్పడింది. అలా ఆమె తన ఎదురుగా ఉండి మాట్లాడుతుంటే చాలు.. అంతకన్నా జీవితానికింకేం కావాలి అనుకున్నాడు. ఆ మాటే ఆమెతో చెప్పాడు. స్వచ్ఛమైన నవ్వుతో ‘ఓకే’ అంది. ఆ ప్యార్ కంటిన్యూ అయింది. లేట్ నైట్ పార్టీలు.. ఏ కొంచెం టైమ్ దొరికినా ఏకాంతవాసాలు.. హాలీడేయింగ్లతో కాలాన్ని క్వాలిటీగా మలచుకున్నారు. పెళ్లితో శుభం కార్డ్ వేసుకుంటారనే భావించారు బాలీవుడ్ జనాలు. అయితే.. ‘ఆశికీ 2’ సినిమా స్క్రిప్ట్లాగే సాగింది వాళ్ల ప్రేమ కథ. శ్రద్ధా కపూర్ నటించిన సినిమాలు సక్సెస్ అవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ పైకి వెళ్లిపోయింది. ఆదిత్య రాయ్ కపూర్‌కు మాత్రం ఇంకా స్ట్రగుల్ తప్పలేదు. అతని మనసులో ఎక్కడో ఓడిపోతున్న భావన. తగ్గట్టుగానే శ్రద్ధా తల్లిదండ్రులు ఆమె మీద ఆంక్షలు పెట్టారట.. ఆదిత్యతో చెలిమికి హద్దులు పెట్టుకోమని. శ్రద్ధా లెక్క చేయకపోయినా.. ఆదిత్య గ్రహించాడు. ఏ చలాకితనాన్నయితే జీవితాంతం తోడుగా కావాలనుకున్నాడో ఆ చలాకితనం నుంచి దూరం కోరుకోసాగాడు. ఆమె సక్సెస్ అతనిలో ఆత్మన్యూనత పెంచసాగింది. అది అసూయగా మారకముందే ఆ బంధంలోంచి బయటపడాలనుకున్నాడు. ఆదిత్యను అర్థం చేసుకున్న శ్రద్ధా అతనికి స్పేస్ ఇచ్చింది. పక్కకు తప్పుకున్నాడు. అతని నిర్ణయాన్ని గౌరవించింది ఆమె. అలా ఇద్దరూ విడిపోయారు. కాని మంచి స్నేహితులుగా మిగిలిపోయారు. అయితే..ఈ జంట తమ ప్రేమ కథను ఎప్పుడూ ఒప్పుకోలేదు. చాలా పత్రికలు.. చానెళ్లు వాళ్ల మధ్య ఉన్న చనువు గురించి ప్రశ్నల వర్షం కురిపించినా బయటపడలేదు. ‘నేను సింగిలే. నా రిలేషన్షిప్ స్టేటస్ మారలేదు. నా దృష్టిలో ప్రేమ ఒక బాధ్యత. ఆ బాధ్యతను మోసేందుకు సిద్ధమయ్యాకే నచ్చిన మనిషితో కమిట్ అవుతా. ప్రస్తుతానికి నేను, శ్రద్ధా గుడ్ ఫ్రెండ్స్‌మి అంతే’ అని ఆదిత్య రాయ్ కపూర్, ‘ఆశికీ 2 సినిమా షూటింగప్పుడు, తర్వాత.. మాకు మంచి అనుభూతులను మిగిల్చింది. మాకు అంటే నాకు, ఆదిత్యకే కాదు మోహిత్ సూరి (దర్శకుడు)కి కూడా. అలా ఆ సినిమా మమ్మల్ని మంచి స్నేహితులుగా మార్చింది. స్నేహం తప్ప మా మధ్య ఇంకేం లేదు. ఆ స్నేహాన్ని జీవితాంతం కాపాడుకుంటాం’ అని శ్రద్ధా కపూర్ చెప్పారు. - ఎస్సార్ -
గొరిల్లాతో హీరోయిన్ డ్యాన్స్, అర్హ ఆటలు
► కుక్కపిల్లతో ఆడుకుంటున్న అల్లు అర్హ ► శక్తివంతమైన ఓటు హక్కును వినియోగించుకున్న శృతి హాసన్ ► గొరిల్లాతో డ్యాన్స్ చేస్తున్న శ్రద్ధా కపూర్ ► అమితాబ్ బచ్చన్‌తో రష్మిక మందన్నా బర్త్‌డే సెలబ్రేషన్స్ ► పూల పరవశమే అంటోన్న రీతూ వర్మ ► బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న జెన్నిఫర్ లోపెజ్ ► పొట్టి డ్రెస్సులో ప్రియా ప్రకాశ్ వారియర్ ► 1 మిలియన్ ఫాలోవర్లు అయినందుకు గాల్లో తేలిపోతున్న ప్రియమణి ► ప్రేమలేఖను పాడి వినిపిస్తున్న మితిలా పాల్కర్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) -
సముద్రంలో మునకేసిన శ్రద్ధ కపూర్
-
సముద్రంలో మునకేసిన 'సాహో' బ్యూటీ
సెలబ్రిటీలు వెకేషన్‌కు వెళ్లాలనుకుంటే ముందు గుర్తొచ్చేది మాల్దీవులే. ఏ కాస్త సమయం దొరికినా చాలు అనేకమంది తారలు మరో ఆలోచనే లేకుండా మాల్దీవులకు చెక్కేస్తుంటారు. ఫ్రెండ్స్‌తో, లవర్‌తో, ఫ్యామిలీతో లేదంటే సోలోగా అయినా సరే వెళ్లిపోతుంటారు. 'సాహో' బ్యూటీ శ్రద్దా కపూర్ కూడా ప్రస్తుతం అక్కడే ఉంది. తన కుటుంబంతో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలో సాగరకన్యగా మారిపోయి సముద్రంలో మునకేసింది. నీటి లోపల జలరాశులతో పోటీపడుతూ స్విమ్ చేసింది. 'సముద్ర గర్భంలో జీవితం' అంటూ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఇందులో సముద్రం లోపలి జీవరాశులు కనువిందు చేస్తున్నాయి. శ్రద్దా వాటితో స్నేహం చేస్తున్నట్లుగా ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. శ్రద్ధా కెరీర్ విషయానికొస్తే.. తీన్‌పత్తి చిత్రంతో ఆమె వెండితెరపై కాలు మోపింది. హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా హిందీలో పదుల సంఖ్యలో సినిమాలు చేసుకుంటూ పోయిన ఈ భామ ప్రభాస్ సరసన సాహోలో నటించి తెలుగు ప్రేక్షకులనూ పలకరించింది. శ్రద్ధా చివరిసారిగా గతేడాది రిలీజైన భాగీ 3, స్ట్రీట్ డ్యాన్సర్ సినిమాలతో ఆకట్టుకుంది. మరోవైపు విశాల్ ప్యూరియా దర్శకత్వం వహించనున్న చిత్రంలో నాగకన్యగా కనిపించనుంది. చదవండి: ‘జాతిరత్నాల’మధ్య చిచ్చు... నవీన్, దర్శిలకు రాహుల్ వార్నింగ్ -
బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌కు వెళ్లిన హీరోయిన్.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో శ్రద్దాలో ప్రేమలో ఉన్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఇటీవల మాల్దీవుల్లో జరిగిన శ్రద్దా కజిన్ పెళ్లి వేడుకల్లో రోహాన్ సందడి చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో శ్రద్దా-రోహాన్‌లు నిజంగా డెటింగ్‌లో ఉన్నట్లు అందరూ భావించారు. అయితే ఇంతరకూ దీనిపై ఈ రూమర్డ్ కపుల్ నోరు విప్పలేదు. కానీ తాజాగా వీరిద్దరూ మరోసారి జంటగా మీడియా కెమెరాలకు చిక్కారు. ముంబైలోని ఓ చైనీస్ రెస్టారెంట్‌కు డిన్నర్ డేట్‌కు వెళ్లిన వీరి ఫొటోలు సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో ఈ జంట రెస్టారెంటు నుంచి బయటకు వస్తూ కనిపించారు. శ్రద్ధా బ్లాక్ అండ్ ఫాన్ షేడ్స్ లో ఉన్న ప్యాంట్ షూట్లో ధరించగా, క్యాజువల్ లుక్‌లో రోహన్ శ్రేష్ఠ కనిపించాడు. అయితే వీరిద్దరిపై వస్తున్న పుకార్లపై రోహాన్ తండ్రి రాకేశ్ శ్రేష్ట ఇటీవల స్పందించాడు. కాలేజీ రోజుల నుంచే వాళ్లు మంచి స్నేహితులని, వీళ్లకు జుహులో చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నట్లు చెప్పాడు. వారిద్దరూ అప్పడప్పుడూ ముంబైలో సరదాగా షికారు చేస్తూనే ఉంటారని చెప్పాడు. ప్రస్తుతానికి వీళ్లిద్దరూ తమ వృత్తిపరమైన పనులతో బిజీగా ఉంటున్నారన్నారు. చదవండి: శ్రద్ధా కపూర్ పెళ్లి; నాకేం అభ్యంతరం లేదు.. సిద్ధమే! మాల్దీవుల్లో పెళ్లిలో 'సాహో' హీరోయిన్! -
ముద్దులు పంచుతున్న రాశీ, అబ్బా అనిపిస్తున్న హెబ్బా
♦ సముద్ర తీరాన సాగరకన్యగా మైమరపిస్తోన్న 'సాహో' హీరోయిన్ శ్రద్దా కపూర్ ♦ తన అందాన్ని ముసుగుతో దాచలేకపోతున్న ప్రియా వారియర్ ♦ జీన్స్‌లో అబ్బా.. అనిపిస్తున్న హెబ్బా పటేల్ ♦ చూపులతో చంపేస్తున్న కాజల్ అగర్వాల్ ♦ తెల్ల చీరలో హొయలు పోతున్న జాన్వీ కపూర్ ♦ పిల్లలకు ముద్దులు పంచుతున్న రాశీ ఖన్నా ♦ కళ్లతోనే సైగలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ ఒక్క ఫొటోతో సెగలు రేపుతున్న లక్ష్మీరాయ్ View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
శ్రద్ధా కపూర్ పెళ్లి; వాళ్లకు ఇష్టమైతే నేను సిద్ధమే!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో ఈ భామ ప్రేమ లోకంలో విహరిస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు వీళ్లిద్దరూ కలిసి పలు ఫంక్షన్లలో కనిపించడంతో నిజంగానే డేటింగ్లో ఉన్నట్లు అందరూ భావిస్తున్నారు. ఇక ఇటీవల శ్రద్ధా, రోహన్ కలిసి మాల్దీవులకు వెళ్లారు. అక్కడ కజిన్ పెళ్లితోపాటు శ్రద్ధా బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలో వీరిద్దరూ అతి సన్నిహితంగా ఉన్న ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇక ఈ జంట పెళ్లి పీటలు ఎప్పుడమే ఆలస్యమనేలా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై వీరిద్దరూ ఎప్పడూ నోరు విప్పలేదు. కానీ తాజాగా ఈ వదంతులపై రోహన్ తండ్రి రాకేష్ శ్రేష్ట స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో రాకేష్ మాట్లాడుతూ.. రోహన్, శ్రద్ధ కాలేజీ రోజుల నుంచే మంచి స్నేహితులని వెల్లడించారు. ‘‘కాలేజీ రోజుల నుంచే వాళ్లు స్నేహితులు. వీళ్లకు జుహులో చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్లిద్దరూ తమ వృత్తిపరమైన పనులతో బిజీగా ఉంటున్నారు. ఒకవేళ వాళ్లిద్దరూ కలిసి ఉండాలనే నిర్ణయం తీసుకుంటే బాగా ఆలోచించి, పరిణతితో తీసుకున్న నిర్ణయమే అవుతుంది. ఒకవేళ వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, వాళ్ల కోసం ఏం చేయడానికి అయినా నేను సిద్ధం. ‘అభ్యంతరం’ అనే పదం నా డిక్షనరీలోనే లేదు. మరో విషయం ఏంటంటే నేను రోహన్‌ను ‘మై డ్రీమ్’ అని పిలుస్తాను. చాలా అరుదుగా ‘రోహన్’ అని పిలుస్తుంటాను’’ అని రాకేష్ వివరణ ఇచ్చారు. కాగా రాకేష్ ప్రముఖ సినిమా స్టిల్ ఫొటోగ్రాఫర్. 600 వందలకు పైగా సినిమాలకు ఆయన పనిచేశారు. బాలీవుడ్లో తాను ఫొటోగ్రాఫర్‌గా పనిచేసినప్పుడు ప్రతి ఒక్క సూపర్‌స్టార్‌ను తన కెమెరాలో బంధించారు. ఇదిలా ఉంటే, శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ కూడా ఈ విషయంపై కొన్ని రోజుల క్రితం స్పందించిన విషయం తెలిసిందే. రోహన్‌ను శ్రద్ధ పెళ్లి చేసుకుంటాను అంటే తాను ఎలాంటి అభ్యంతరం చెప్పనని ఆయన పేర్కొన్నారు. చదవండి: మాల్దీవుల్లో పెళ్లిలో 'సాహో' హీరోయిన్! ఆమె సంగతి సరే, మరి నీ పెళ్లెప్పుడు? -
శ్రద్ధా కపూర్ బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
మాల్దీవుల్లో పెళ్లిలో 'సాహో' హీరోయిన్!
రెబర్ స్టార్ ప్రభాస్ సరసన 'సాహో'లో నటించి ఆకట్టుకున్న శ్రద్ధా కపూర్ ఆ మధ్య మాల్దీవ్స్‌కు వెళ్లింది. విహారయాత్రకో, రిలాక్స్ అవడానికో వెళ్లిందనుకుంటున్నారా? కానే కాదు, పెళ్లితంతు కోసం వెళ్లింది. క్షణం తీరిక లేకుండా పెళ్లి పనుల్లో, ఫొటోలు దిగడంలో చాలా బిజీ బిజీగా గడిపింది కూడా! అయితే ఆమె అంతగా లీనమైంది తన పెళ్లి పనుల్లో కాదులెండి.. తన కజిన్ వివాహ కార్యక్రమాల్లో. పద్మిని కొల్లాపూర్ తనయుడు ప్రియాంక్ శర్మ, నిర్మాత కరీమ్ మొరానీ కూతురు షాజా మొరానీ ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు మాల్దీవులు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇరు కుటుంబాలతో కజిన్లు శ్రద్ధా కపూర్, సిద్ధాంత్ కపూర్ సమక్షంలో ఈ పెళ్లి వైభవంగా జరిగింది. View this post on Instagram A post shared by Shraddha♡Varun (@mine.shraddhu_) తాజాగా ప్రియాంక్- మొరానీ ప్రీ వెడ్డింగ్, హల్దీ ఫంక్షన్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో వధూవరుల వెంటే ఉంటూ ఫొటోలకు పోజులిస్తున్న శ్రద్ధా పెళ్లి పనుల్లో మరింత చురుకుగా పాల్గొన్నట్లు కనిపిస్తోంది. ఇదిలా వుంటే బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, ఫొటోగ్రాఫర్ రోహన్శ్రేష్ట ప్రేమించుకున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ వార్తలపై స్పందించిన శ్రద్ధా తండ్రి శక్తి కపూర్ రోహన్ చాలా మంచి వాడని చెప్తూనే వాళ్లు ఇప్పటికీ స్నేహితులు అనుకుంటున్నట్లు తెలిపాడు. View this post on Instagram A post shared by Shraddha♡Varun (@mine.shraddhu_) View this post on Instagram A post shared by Shraddha♡Varun (@mine.shraddhu_) View this post on Instagram A post shared by Shraddha♡Varun (@mine.shraddhu_) చదవండి: ఫొటోగ్రాఫర్‌తో సాహో హీరోయిన్ పెళ్లి? -
సాహో హీరోయిన్ పెళ్లి! : 'తనిష్టమే నా ఇష్టం'
ఇష్టపడిన ప్రేయసి చేయి పట్టుకుని ఏడడుగులు నడిస్తే ఆ సంతోషం ఎలా ఉంటుందో వరుణ్ ధావన్‌ను అడిగితే చెప్తారు. ఈ మధ్యే తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేమికురాలు నటాషా దలాల్‌కు మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడయ్యాడు. అతడికి సినీలోకం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫొటోగ్రాఫర్ రోహన్శ్రేష్ట కూడా ఈ కొత్తజంటకు విషెస్ చెప్తూ మీరు ఎంతో లక్కీ అని రాసుకొచ్చారు. దీనికి వరుణ్‌ధావన్ స్పందిస్తూ త్వరలోనే నువ్వు కూడా పెళ్లికి రెడీ అవుతున్నావని ఆశిస్తున్నానని చెప్పాడు. దీంతో అతడు, హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. (చదవండి: దీపికను వెనక్కి నెట్టిన శ్రద్ధా.. మూడో స్థానంలోకి!) ఈ క్రమంలో శ్రద్ధా పెళ్లి గురించి ఆయన తండ్రి, సీనియర్ నటుడు శక్తికపూర్ స్పందిస్తూ.. "నా కూతురు పెళ్లి గురించి బయట ఎలాంటి టాక్ నడుస్తుందో నాకు తెలీదు. కానీ ఆమె తీసుకునే ప్రతీ నిర్ణయానికి నేను మద్దతిస్తాను. అది ఆమె పెళ్లి విషయమైనా సరే! రోహన్ శ్రేష్టనే కాదు ఎవరిని తీసుకొచ్చినా పెళ్లికి నేను అంగీకరిస్తాను. రోహన్ చాలా మంచి అబ్బాయి. అతడు చిన్నప్పటి నుంచే మా ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఇప్పటివరకైతే శ్రద్ధా తన పెళ్లి గురించి ఏమీ చెప్పలేదు. వాళ్లింకా బాల్య స్నేహితులే అనుకంటున్నాను. ప్రేమలో ఉన్నారనైతేనే భావించడం లేదు" అని చెప్పుకొచ్చారు. (చదవండి: కరోనా కష్టాలు చెప్పి బాధపడిన హీరోయిన్) -
యాక్టర్ బోనీ కపూర్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కొత్త ప్రయాణం ప్రారంభించారు. దాదాపు నలభై ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న బోనీ ఇప్పుడు నటుడిగా మారారు. లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ ఓ సినిమా చేస్తున్నారు. శ్రద్ధా కపూర్ కథానాయిక. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ తండ్రి పాత్రలో కనిపించనున్నారు బోనీ కపూర్. ఈ పాత్రకు బోనీ కపూరే సరిగ్గా సరిపోతారని దర్శకుడు భావించి, ఆయన్ను ఒప్పించారట. త్వరలోనే ఈ సినిమా సెట్లో జాయిన్ అవుతారు బోనీ. ఇటీవలే అనిల్ కపూర్ ముఖ్య పాత్రలో వచ్చిన ‘ఏకే వర్సెస్ ఏకే’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు బోనీ. ఇప్పుడు రణ్‌బీర్ సినిమాలో పూర్తి స్థాయి పాత్రలో కనిపిస్తారు. -
దీపికను వెనక్కి నెట్టిన శ్రద్ధా కపూర్!
సెలబ్రిటీలకు తమ వృత్తితోపాటు సోషల్ మీడియా కూడా ముఖ్యమే.. తమను ఆరాధించే అభిమనులకు చేరువుగా ఉండేందుకు సోషల్ మీడియా ముఖ్యపాత్ర పోషిస్తుంది. తమకు చెందిన వృత్తి, వ్యక్తిగత విషయాలను ఈ వేదిక ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో వీరికి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న ఇండియన్ సెలబ్రిటీలలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ మూడో స్థానంలో నిలిచారు. ఇటీవల వరకు నాలుగో స్థానంలో ఉన్న ఈ సాహో భామ మరో నటి దీపికా పదుకొనెను వెనక్కునెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. చదవండి: నాగకన్యగా.. శ్రద్ధా కపూర్ ఫోటోలు, వీడియోలు షేరే చేసే ఈ సోషల్ మీడియా యాప్‌ను ఇండియాలో కొన్ని మిలియన్ల ప్రజలు ఉపయోగిస్తున్నారు. వినోదం, సామాజిక, ఇతరాత్ర కంటెంట్‌తో తమ సంబంధాలను మెరుగు పురుచుకుంటున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న భారతీయ వ్యక్తి క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఇతనిని 82.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక విరాట్ తరువాత 58.1 మిలియన్ల అభిమానులతో ప్రియాంక చోప్రా జోనాస్ రెండో స్థానంలోఉన్నారు. ఇప్పటి వరకు దీపికా పదుకొనె 52.3 మిలియన్లతో మూడో స్థానంలో ఉంటే తాజాదా శ్రద్ధా కపూర్ ఆమెను దాటుకొని 56.4 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచింది. చదవండి: దీపికా మేనేజర్‌కు మరోసారి ఎన్సీబీ సమన్లు వీరితో పాటు మిగతా బాలీవుడ్ ప్రముఖులు 50.1 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో అలియా భట్, 48.2 మిలియన్లతో నేహా కక్కర్, అక్షయ్ కుమార్ 46.8, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 46.2 మిలియన్, కత్రినా కైఫ్ 44.8 మిలియన్ల అభిమానులను కలిగి ఉన్నారు. బాలీవుడ్ నటులు, ప్రముఖులే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రపంచ వ్యాప్తంగా 49.7 మిలియన్ల మంది ఫాలో అవుతన్నారు. -
సూపర్ హీరోయిన్లు
సూపర్ హీరోల సినిమాలు తరచూ చూస్తూనే ఉంటాం. సూపర్‌మేన్, స్పైడర్‌మేన్ వంటివి. మన దేశీ సూపర్ హీరోలు శక్తిమాన్, క్రిష్ కూడా ఉన్నారు. కానీ సూపర్ హీరో సినిమాలతో పోల్చు కుంటే సూపర్ హీరోయిన్ల సినిమాలు తక్కువ. హాలీవుడ్లో వండర్ ఉమెన్, బ్లాక్ విడో, కెప్టెన్ మార్వెల్ సినిమాలు ఉన్నాయి. కానీ భారతీయ చిత్రాల్లో సూపర్ హీరోయిన్ సినిమాలు అసలు రాలేదు. ప్రస్తుతం సూపర్ హీరోయిన్ సినిమాలను స్క్రీన్ మీదకు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ విశేషాలు... శ్రద్ధ... నాగకన్య శ్రద్ధా కపూర్ ఓ సినిమాలో నాగకన్యగా నటించనున్నారని తెలిసిందే. మూడు భాగాలుగా రూపొందించనున్న ఈ సినిమాను ఓ సూపర్ హీరోయిన్ ఫిల్మ్‌లా డిజైన్ చేస్తున్నారట చిత్రబృందం. విషాల్ ఫూరియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అవసరమైనప్పుడు నాగకన్యగా మారే శక్తులు శ్రద్ధకపూర్కి ఉంటాయని తెలిసింది. మరి సూపర్ హీరోలకు ప్రేక్షకులు ప్రేమను పంచినట్టే సూపర్ హీరోయిన్లను కూడా ఆదరిస్తారా? వేచి చూడాలి. అదితీ... ఆనా కన్నడంలో ‘ఆనా’ అనే సూపర్ హీరోయిన్ ఫిల్మ్ చిత్రీకరణ పూర్తయింది. అదితీ ప్రభుదేవా లీడ్ రోల్లో పి. మనోజ్ దర్శకత్వం వహించారు. ‘తొలి ఫీమేల్ సూపర్ హీరోయిన్ చిత్రం’ ఇదే అని చిత్రబృందం ప్రకటించింది. రెండు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమా తొలి భాగానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా మిగతా భాషల్లోనూ విడుదల కావచ్చు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో మరింత యాక్షన్ ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. కత్రినా... ది సూపర్ ఉమన్ ‘సుల్తాన్, టైగర్ జిందా హై’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఓ సూపర్ హీరోయిన్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం కత్రినా కైఫ్ తొలిసారి సూపర్ హీరోయిన్గా మారుతున్నారు. ఆల్రెడీ ఇందులో చేయబోయే యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుంటున్నారు కత్రినా. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. సుమారు నాలుగైదు దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నట్టు ప్రకటించారు అలీ అబ్బాస్. -
నాగకన్యగా.. శ్రద్ధా కపూర్
‘సాహో’ ఫేమ్ శ్రద్ధా కపూర్ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపారు. నాగకన్య అవతారంలో కనిపించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని శ్రద్ధాకపూర్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. ‘‘శ్రీదేవిగారి ‘నగీనా, నిగాహే’ సినిమాలను చూస్తూ, ఆమెను ఆరాధిస్తూ పెరిగాను. ఆ సినిమాల్లో ఆమె చేసిన నాగకన్య పాత్ర చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతటి గొప్ప పాత్ర చేసే అవకాశం నాకు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు శ్రద్ధాకపూర్. విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని నిఖిల్ ద్వివేది నిర్మించనున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా తెరకెక్కనుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. -
‘హీరోల’ కంటే వీళ్లకే ఎక్కువ రెమ్యునరేషన్!
ఒకప్పుడు ‘హీరోయిన్లు’ అంటే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమయ్యేవారు. నాలుగు డ్యూయెట్లు, ‘హీరో’ బాధలో ఉన్నపుడు ఓదార్చే ఐదారు ప్రేమ సన్నివేశాలు, క్లైమాక్స్‌లో పెళ్లితో శుభం కార్డు.. సాధారణంగా ఇలాంటి సీన్లలోనే కనిపించేవారు. అయితే గత కొన్నేళ్లుగా ట్రెండ్ మారింది. పాతతరం నటీమణుల స్ఫూర్తితో నయా కథానాయికలు సైతం తమలో దాగున్న నటనా నైపుణ్యానికి పదును పెడుతున్నారు. తాము కేవలం ‘‘గ్లామర్ డాల్స్’’ కాదని, సరికొత్త, విభిన్న కథాంశాలను ఎంచుకుని హీరోలకు పోటీ ఇస్తున్నారు. సినిమా మొత్తాన్ని భుజాలపై మోస్తూ ‘‘వన్ వుమన్ షో’’ చేస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటుతున్నారు. ప్రతిభకు తగ్గ పారితోషికం డిమాండ్ చేస్తూ ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదంటూ దూసుకుపోతున్నారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా నవతరం నాయికలంతా ఈ ఫీట్‌ను సాధిస్తున్నప్పటీ బాలీవుడ్‌కు ఉన్న విస్తృతి దృష్ట్యా.. సహజంగానే అక్కడి సినిమాల్లో నటించే వారికే పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ దక్కుతోంది. ఒక్కోసారి చిన్న హీరోలు తీసుకునే మొత్తం కంటే ఇది ఎక్కువగానే ఉంటుందని సినీ పండితులు అంటున్నారు. ‘క్వీన్’కే అగ్రతాంబూలం! ఫ్యాషన్, తను వెడ్స్ మను, క్వీన్, మణికర్ణిక, వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హిమాచల్ ప్రదేశ్ ఆడపడుచు కంగనా రనౌత్. వెండితెరపై వెలిగిపోవాలనే కలతో చిన్న గ్రామం నుంచి ప్రయాణం మొదలుపెట్టి.. నేడు బీ- టౌన్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటి స్థాయికి చేరుకుంది. ఈ ప్రయాణంలో ఎన్నో కఠిన సవాళ్లు, అవమానాలు, ఛీత్కారాలు, విమర్శలు ఎదుర్కొంది. అయినా వెనకడుగు వేయక ధైర్యంగా ముందుకు సాగుతూ ఫైర్‌బ్రాండ్ నటిగా గుర్తింపు పొందింది. జాతీయ అవార్డుతో పాటు సినీ రంగంలోని ఇతర ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకుంది. ఇక అంచెలంచెలుగా ఎదుగుతూ స్వతహాగా సినిమాలు నిర్మించే స్థాయికి చేరుకున్న కంగన.. రానున్న రోజుల్లో తలైవి, తేజస్, ధాకడ్ వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరక్కెక్కుతున్న తలైవి సినిమాలో నటించేందుకు ఈ భామ ఏకంగా రూ. 20 కోట్ల పైగా వసూలు చేస్తోందని బీ- టౌన్ టాక్. ఇక వినూత్న కథాంశాలను ఎంచుకునే కంగన.. జడ్జిమెంటల్ హై క్యా సినిమాలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న రాజ్‌కుమార్‌రావు(రూ. 6 కోట్లు) కంటే రెట్టింపు మొత్తం తీసుకుందని సినీ వర్గాలు అంటున్నాయి. తొలి సినిమాతోనే సెన్సేషన్ వర్ధమాన హీరోయిన్లకు సూపర్ స్టార్లతో నటించే ఛాన్స్ రావడం చాలా అరుదు. కానీ దీపికా పదుకొనె మాత్రం తొలి సినిమాలోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో జతకట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. వృత్తిగత, వ్యక్తిగత ఎదురైన ఆటుపోట్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన దీపికా.. రామ్‌లీలా, పద్మావత్, బాజీరావు మస్తానీ వంటి చిత్రాలతో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. బీ- టౌన్లో అగ్ర కథానాయిక స్థాయికి చేరుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తెలుగు తెరపై అభిమానులకు కనువిందు చేయనుంది. ఇందులో పాన్ ఇండియా హీరో, డార్లింగ్ ప్రభాస్‌తో జతకట్టి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ సినిమా కోసం దీపికా అక్షరాలా రూ. 20 కోట్లు తీసుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. పద్మావత్ సినిమాకు గానూ దీపికకు, ఆ సినిమాలో విలన్, ఆమె భర్త రణ్వీర్ సింగ్(అప్పటికింకా పెళ్లికాలేదు, రూ. 8 కోట్లు) కంటే ఓ నాలుగు కోట్లు ఎక్కువగానే చెల్లించారట నిర్మాతలు. ‘సాహో’ భామ సైతం.. శక్తి కపూర్ కూతురుగా గాకుండా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఇండస్ట్రీలో ఉన్న ప్రతిభావంతులైన నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. ఆషికి- 2, స్త్రీ, హైదర్, చిచోర్ వంటి సినిమాల్లో నటించిన శ్రద్ధకు ఒకటి రెండు మినహా పెద్దగా హిట్లు లేనప్పటికీ తనలోని నటికి బారీగానే పారితోషికం ముట్టజెప్పుతున్నారట నిర్మాతలు. చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఈ అమ్మడు ఓ సినిమాలో నటించనుందని, అందుకుగానూ రూ. 10 కోట్లకు పైగానే అందుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె మళంగ్ 2, స్త్రీ రిటర్న్స్ అనే సినిమాల్లో నటిస్తోంది. ఇక స్త్రీ సినిమాలో తనకు జోడీగా కనిపించిన రాజ్‌కుమార్ రావు కంటే శ్రద్ధ కోటి రూపాయలు(సుమారు 7 కోట్లు) ఎక్కువగానే వసూలు చేసిందట. భట్ వారసురాలు అలియా.. స్టార్ కిడ్ అలియా భట్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో సిల్వర్ స్క్నీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. ఉడ్తా పంజాబ్, రాజీ, గల్లీ బాయ్ వంటి సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భామ.. రాజీ సినిమాకు గానూ దాదాపు రూ. 10 కోట్లు తీసుకుందట. ఆ మూవీలో అలియాకు జోడీగా కనిపించిన విక్కీ కౌశల్ రెమ్యునరేషన్ కంటే ఇది మూడు రెట్లు ఎక్కువని వినికిడి. బెబో కూడా తక్కువేం కాదు కపూర్ ఖాన్దాన్ వారసురాలు కరీనా కపూర్ ఖాన్ పెళ్లైన తర్వాత కూడా వరుస సినిమాల్లో నటిస్తూ తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. తైమూర్‌కు జన్మనిచ్చిన తర్వాత వీరే దీ వెడ్డింగ్, గుడ్ న్యూస్ వంటి చిత్రాల్లో కనిపించింది. వీరే దీ వెడ్డింగ్ మూవీలో సోనం కపూర్, స్వరా భాస్కర్ వంటి తోటి నటీమణులతో స్క్రీన్ షేర్ చేసుకున్న బెబో.. అందరి కంటే ఎక్కువ పారితోషికం(రూ. 7 కోట్లు )అందుకుందట. రెమ్యునరేషన్ విషయంలో ఈ సినిమాలో తనతో జతకట్టిన సుమిత్ వ్యాస్ కేవలం రూ. 80 లక్షలతో సరిపెట్టుకున్నాడు. క్రేజీ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కరీనా పక్కన కనిపించినా... ‘మనీ’ విషయంలో ఆమె దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. ఇక ప్రస్తుతం బెబో గర్భవతి అన్న సంగతి తెలిసిందే. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌తో ఆమె కలిసి నటించిన లాల్ సింగ్ చద్ధా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక వీరితో పాటు అనుష్క శర్మ, కత్రినా కైఫ్, సోనం కపూర్, విద్యా బాలన్, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, సొనాక్షి సిన్హా తదితర హీరోయిన్లు రూ. 5 కోట్లకు తక్కువ గాకుండా రెమ్యునరేషన్ అందుకుంటుండగా, తాప్సీ పన్ను, భూమి పెడ్నేకర్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, జాన్వీ కపూర్, ఊర్వశీ రౌతేలా వంటి హీరోయిన్లు కనీసంగా 2 కోట్లు తీసుకుంటున్నారని ఫిల్మీ దునియాలో ప్రచారం సాగుతోంది. ఇవి అధికారిక లెక్కలు కాకపోయినప్పటికీ, సినిమా స్థాయి, బడ్జెట్, పాత్ర పరిధిని బట్టి సదరు కథానాయికలు ఈ మాత్రమైనా డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని సినీ ప్రేమికులు లెక్కలు వేస్తున్నారు. -
ఉడ్తా బాలీవుడ్
-
నలుగురిదీ ఒక్కటే మాట..
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో జరుపుతున్న విచారణలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చేతికి కీలక విషయాలు లభ్యమైనట్లు సమాచారం. ఈ కేసు విచారణ సందర్భంగా హీరోయిన్లు దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్‌లు ఎన్సీబీకి చెప్పిన విషయాలు దాదాపు ఒకేలా ఉన్నాయని తెలుస్తోంది. ‘హ్యాష్’ మత్తు పదార్థం కాదనే విషయాన్నే వీరు నలుగురూ చెప్పినట్లు సమాచారం. అయితే, ఇదే విషయం వీరిని మరిన్ని చిక్కుల్లోకి నెట్టే అవకాశాలున్నాయని కూడా భావిస్తున్నారు. దీంతోపాటు, వీరు కీలక సమాచారాన్ని ఎన్సీబీ అధికారుల ఎదుట బయటపెట్టినట్లుగా సమాచారం. దీని ఆధారంగా ఈ హీరోయిన్లను మరోసారి ప్రశ్నించేందుకు ఎన్సీబీ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకు జరిపిన విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలపై ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా, సమీర్ వాంఖడే, అశోక్ జైన్ రూపొందించిన సమగ్ర నివేదికపై ఆదివారం రాత్రి ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ ఆస్తానా నేతృత్వంలో సమావేశం జరిగింది. ముంబైలో విస్తరించిన డ్రగ్ మాఫియా మూలాలను వెలికితీసి, చార్జిషీటు వేసేందుకు దాదాపు ఆరు నెలల సమయం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు కూడా ఆస్తానా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. 20 మంది బడా డ్రగ్ సరఫరాదారులపై ఎన్సీబీ కన్నువేసినట్లు సమాచారం. కోర్టులో కరణ్ పేరు సుశాంత్ సింగ్ మృతి, బాలీవుడ్– డ్రగ్స్ సంబంధాల కేసుల్లో దర్శకుడు కరణ్ జోహార్ పేరును ప్రస్తావించారు రియా చక్రవర్తి– క్షితిజ్ రవి ప్రసాద్ తరఫు లాయర్ సతీశ్ మనేషిండే. ఈ కేసులో కరణ్ పేరును ప్రస్తావిస్తూ వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా క్షితిజ్‌ను అధికారులు బెదిరింపులు, వేధింపులకు గురి చేశారని కోర్టుకు తెలిపారు. ముంబైలోని కోర్టు క్షితిజ్‌కు ఆదివారం రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో మనేషిండే..విచారణ సమయంలో అధికారులు క్షితిజ్‌పై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారనీ, కరణ్ జోహార్ పేరు కూడా వాంగ్మూలంలో చెప్పాలంటూ ఒత్తిడి చేశారని అన్నారు. ఆ పేరు చెబితే వదిలిపెడతామంటూ ఆశ చూపారన్నారు. క్షితిజ్ ఇంట్లో సోదాల సమయంలో సిగరెట్ పీక మాత్రమే అధికారులకు దొరికినా అది గంజాయి అంటూ ఆరోపించారని తెలిపారు. 2019లో కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న పలువురు బాలీవుడ్ నటులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీనిపై ముంబైకి వస్తున్న కరణ్‌ను గోవా ఎయిర్‌పోర్టులో మీడియా ప్రశ్నించగా ఆయన మాట్లాడలేదు. తనకు డ్రగ్స్ అలవాలు లేదనీ ఆయన గతంలోనే వ్యాఖ్యానించడం తెల్సిందే. -
ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్సీబీ
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ శనివారం హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌లను సుదీర్ఘంగా వేర్వేరుగా ప్రశ్నించింది. ఇదే కేసులో శుక్రవారం విచారించిన ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్‌ను అరెస్టు చేసింది. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న ఎన్సీబీ గెస్ట్‌హౌస్‌కు శనివారం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో చేరుకున్న దీపికా పదుకొణె మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయారు. దీపికను, ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను కలిపి విచారించినట్లు సమాచారం. కరిష్మా డ్రగ్స్ గురించి జరిపిన వాట్సాప్ చాట్‌లో ‘డి’అనే అక్షరం ఎవరిని ఉద్దేశించిందనే కోణంలో అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కరిష్మాను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించినట్లు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం వీరిరువురూ పది నిమిషాల వ్యవధిలోనే వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. వీరి విచారణ సమయంలో ఎన్సీబీ కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో మీడియా సిబ్బంది గుమికూడారు. దక్షిణ ముంబైలో..బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న ఎన్సీబీ జోనల్ కార్యాలయంలో శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌లను శనివారం సాయంత్రం ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఎన్సీబీ కార్యాలయానికి మధ్యాహ్నం 12గంటలకు శ్రద్ధాకపూర్ చేరుకోగా ఒక గంట తర్వాత సారా అలీఖాన్ వచ్చారు. వీరిద్దరినీ అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. దాదాపు నాలుగున్నర గంటల అనంతరం సాయంత్రం 5.30 గంటలకు సారా, 6 గంటల ప్రాంతంలో శ్రద్ధాకపూర్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇలా ఉండగా, డ్రగ్స్ కేసులో శుక్రవారం ప్రశ్నించిన నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్‌ను శనివారం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. వెర్సోవాలో ఉన్న ఆయన నివాసం నుంచి తీసుకెళ్లి, రోజంతా ప్రశ్నించినట్లు సమాచారం. తాజా అరెస్టుతో డ్రగ్స్ కేసుల్లో అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. మీడియాకు పోలీసుల వార్నింగ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు హాజరై తిరిగి వెళ్లే సినీ ప్రముఖుల వాహనాలను వెంబడించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని డిప్యూటీ కమిషనర్ సంగ్రామ్‌సింగ్ మీడియా సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. రోడ్డుపై వెళ్లే వారిని ప్రమాదంలోకి నెట్టవద్దని కోరారు. ఎవరైనా వెంబడిస్తున్నట్లు తేలితే ఆ వాహనాలను సీజ్ చేయడంతోపాటు సంబంధిత డ్రైవర్‌పై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం శ్రద్ధా కపూర్, దీపికా పదుకొణె ఎలాగోలా మీడియా కంటబడకుండా తప్పించుకోగా, మీడియా సిబ్బంది సారా అలీఖాన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఎన్సీబీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లే సమయంలో దీపిక పదుకొణె ప్రయాణిస్తున్న వాహనాన్ని మీడియా వెంబడించింది. అనంతరం పోలీసుల హెచ్చరికల ఫలితంగా శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ విచారణ అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ‘ఛేజింగ్’ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శాండల్‌వుడ్ కేసులో టీవీ యాంకర్.. మంగళూరు: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్ అనుశ్రీని శనివారం బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసులు ప్రశ్నించారు. స్నేహితుడు తరుణ్ రాజ్‌తోపాటు అనుశ్రీ పార్టీలకు హాజరైందంటూ ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన డ్యాన్సర్–కొరియోగ్రాఫర్ కిశోర్ అమన్ శెట్టి వెల్లడించడంతో పోలీసులు అనుశ్రీకి సమన్లు జారీ చేశారు. తరుణ్ డ్రగ్స్ వాడకంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. విచారణలో వీరేమన్నారు ఈ సుదీర్ఘ విచారణలో అధికారులు ముగ్గురి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ సందర్భంగా దీపిక.. 2017లో తన మేనేజర్ కరిష్మాతో డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్లు అంగీకరించారు. అయితే, డ్రగ్స్ తీసుకున్నదా లేదా అనేది వెల్లడికాలేదని సమాచారం. ఎన్సీబీ విచారణను ఎదుర్కొన్న సారా, శ్రద్ధా తమకు డ్రగ్స్ అలవాటు లేదని తెలిపారు. వీరి ఫోన్లను అధికారులు సీజ్‌చేశారు. -
ఫాంహౌజ్‌లో పార్టీ చేసుకున్నాం: శ్రద్ధ
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ నేడు ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గెస్ట్‌హౌజ్‌లో దీపికను, కార్యాలయంలో శ్రద్ధ, సారాలను విచారిస్తున్న అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఫాంహౌజ్‌లో జరిగే పార్టీల గురించి శ్రద్ధా కపూర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.(చదవండి: కీలక విషయాలు వెల్లడించిన దీపిక మేనేజర్!) ఇందుకు సమాధానంగా.. ‘‘చిచోరే’’ సినిమా సమయంలో సుశాంత్ పవనా ఫాంహౌజ్‌కు వెళ్లానని శ్రద్ధ చెప్పినట్లు సమాచారం. ‘‘ఆరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేం అక్కడికి చేరుకున్నాం. భోజనం చేసిన తర్వాత బోటులో పార్టీ చేసుకున్నాం. అర్ధరాత్రి దాటేంత వరకు అందరూ పార్టీలోనే ఉన్నారు. పాటలు వింటూ ఎంజాయ్ చేశాం. అయితే నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు’’అని శ్రద్ధ బదులిచ్చినట్లు ఓ జాతీయ మీడియా కథనం వెలువరించింది. అదే విధంగా సుశాంత్ గురించి ఆమె పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు పేర్కొంది. షూటింగ్ సమయంలో అతడు తన వానిటీ వాన్లో మత్తు పదార్థాలు సేవించడం చూశానని చెప్పినట్లు తెలిపింది.(చదవండి: ఎన్సీబీ రకుల్ విచారణలో ఏం చెప్పింది?) కాగా సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయ సాహాతో జరిపిన వాట్సాప్ చాట్ గురించి ప్రశ్నించగా, శ్రద్ధ సమాధానం దాట వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే ఎన్సీబీ ఎదుట హాజరైన మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. రియా చక్రవర్తితో తాను చాట్ చేసిన మాట వాస్తవేమనని, అయితే తానెన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించినట్లు వార్తలు వెలువడ్డాయి. -
దీపికకు నో క్లీన్చిట్.. మరోసారి విచారణకు!
ముంబై : సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కోణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నటుడు సుశాంత్ సింగ్ మరణంతో వెలుగులోకి వచ్చిన ఈ కేసు ప్రస్తుతం బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసుపై విచారణ జరుపుతున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారుల ఎదుట శనివారం నటి దీపికా పదుకొనె హాజరయ్యారు. ముంబై కొలాబాలోని ఎన్సీబీ గెస్ట్ హౌస్‌లో సాగిన ఆమె విచారణ ముగిసింది. మొత్తం నాలుగు రౌండ్లలో దాదాపు ఐదున్నర గంటలపాటు ఎన్సీబీ దీపికను ప్రశ్నించింది. ఈ క్రమంలో డ్రగ్స్ కొనుగోలు, సరాఫరా, వినియోగం, పార్టీ వంటి విషయాల్లో దీపిక నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. (డ్రగ్స్ కేసు: ఎన్సీబీ ఎదుట హాజరైన దీపికా) అయితే దీపిక ఇచ్చిన సమాధానాలతో ఎన్సీబీ అధికారులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. కరిష్మా, జయ, తదితరులతో వాట్సాప్ చాట్ నిజమేనని చెప్పిన దీపిక కొన్ని ప్రశ్నలను దాటవేస్తూ తప్పించుకునేలా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. చాలా సమయంపాటు దీపికను ఎన్సీబీ విచారించినప్పటికీ ఇంకా ఆమెకు ఈ కేసులో క్లీన్ చిట్ ఇవ్వలేదు. దీంతో దీపికను ఈ కేసులో మరోసారి విచారించే అవకాశాలు ఉన్నట్లు ఎన్సీబీ వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. (ఎన్సీబీ రకుల్ విచారణలో ఏం చెప్పింది?) కాగా డ్రగ్ కేసులో దీపికతోపాటు శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ హాజరవ్వగా శుక్రవారం విచారణకు హాజరైన దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ రెండో రోజు కూడా విచారణకు వచ్చారు. శ్రద్ధాను ఎన్సీబీకి చెందిన మరో బృందం విచారిస్తోంది. సుశాంత్ ఇచ్చిన ఫార్మ్ హౌజ్ పార్టీకి వచ్చానని అంగీకరించిన శ్రద్ధా కానీ తను డ్రగ్స్ తీసుకోలేదని విచారణలో వెల్లడించారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఎన్సీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మరో వైపు ఇదే కేసులో ధర్మ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవిప్రసాద్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు.. (దీపికకు నోటీసుల వెనుక ఇంత కుట్రనా..) -
రకుల్, దీపిక, సారా, శ్రద్ధలకు సమన్లు
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బాలీవుడ్లో డ్రగ్స్ కోణంపై సాగుతున్న విచారణ కీలక మలుపు తిరిగింది. అందరూ ఊహిస్తున్నట్టుగానే నటీమణులు దీపికా పదుకొనె, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు ఎన్సీబీ సమన్లు పంపింది. బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై మరింత దృష్టి సారించిన ఎన్సీబీ ‘‘ఏ’’లిస్ట్‌లో ఉన్న ప్రముఖుల్ని తొలుత విచారించడానికి నిర్ణయించినట్టుగా ఎన్సీబీ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. ఈ నెల 25 శుక్రవారం దీపికని విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్, సుశాంత్ ట్యాలెంట్ మేనేజర్ శ్రుతి మోదీ, డిజైనర్ సైమన్ ఖంబటాలను ఎన్సీబీ కార్యాలయానికి గురువారమే రావాల్సిందిగా చెప్పినట్టుగా ఆ అధికారి వెల్లడించారు. హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్‌లను 26వ తేదీ శనివారం ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్‌లను విచారించనున్నట్టు ఎన్సీబీ అధికారులు తెలిపారు. గోవా షూటింగ్లో దీపిక ప్రస్తుతం గోవా షూటింగ్లో ఉన్న దీపిక పదుకొనె 12 మంది సభ్యులున్న తన న్యాయ బృందంతో చర్చలు జరిపారు. ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలో న్యాయవాదులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ చర్చల్లో దీపిక భర్త రణవీర్ సింగ్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనట్టు సమాచారం. నోటీసుల నేపథ్యంలో రాత్రికి దీపిక గోవా నుంచి ముంబై వచ్చారు. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ వాట్సాప్ గ్రూప్ చాట్లలో హీరోయిన్ పేరులో ఇంగ్లిష్ అక్షరాలతో జరిగిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. అందులో డి అంటే దీపిక, ఎస్ అంటే శ్రద్ధ అని భావించిన విషయం తెలిసిందే. ఇక కరిష్మా ప్రకాశ్‌కు కూడా ఇప్పటికే సమన్లు పంపినప్పటికీ ఆమె అనారోగ్య కారణాలతో ఎన్సీబీ ఎదుట హాజరు కాలేదు. దీంతో శుక్రవారం వరకు ఆమెకు మినహాయింపునిచ్చారు. దీపికతో పాటు కరిష్మా కూడా ఎన్సీబీ విచారణలో పాల్గొనే అవకాశం ఉంది. బాలీవుడ్ డ్రగ్స్ వినియోగంలో హీరోల పాత్రపై కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కన్నేశారు. రియా చక్రవర్తి, జయ సాహా ఇచ్చిన సమాచారం ఆధారంగా అగ్ర హీరోలపై కూడా ఓ కన్నేసి ఉంచినట్టు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. కీలక సమాచారమిచ్చిన జయ! గత మూడు రోజులుగా జయ సాహాను ప్రశ్నిస్తున్న అధికారులు పలు విషయాలను రాబట్టారు. అత్యంత కీలకమైన సమాచారాన్ని జయ సాహా బయటపెట్టినట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. సుశాంత్‌తో పాటు నటి శ్రద్ధా కపూర్, రియా చక్రవర్తి, మధు, తాను డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆమె ఎన్సీబీ విచారణలో అంగీకరించినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. సీబీడీ ఆయిల్ అనే నిషేధిత డ్రగ్స్‌ని వారు సేవించినట్టుగా తెలుస్తోంది. మాదక ద్రవ్యాల చీకటి కోణంపై 2016లో వచ్చిన బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ సహ నిర్మాత అయిన మధు మాంతెనాను బుధవారం ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. జయ సాహా తన విచారణలో మధు పేరుని బయట పెట్టడంతో ఆయనను డగ్స్ర్ వినియోగంపై గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. -
డ్రగ్ కేసు; రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎన్సీబీ సమన్లు
ముంబై : బాలీవుడ్లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్నటివరకు కేవలం బాలీవుడ్, శాండల్‌వుడ్‌కే పరిమితమైన ఈ కేసు ఇపుడు టాలీవుడ్‌ను సైతం వెంటాడుతోంది. ముంబై డ్రగ్స్ కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో సారా అలీఖాన్, దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్ వంటి బీటౌన్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్‌లోనూ ప్రముఖ నటీమణుల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. డ్రగ్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, నమ్రత పేరు బయట పడటంతో సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. అంతేగాక టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతా చాట్ చేసినట్టుగా జాతీయ మీడియాలో వచ్చింది. (డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్: కంగనా) ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ స్టార్స్ దిపికా, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్‌లకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నోటీసులు జారీ చేసింది, మూడు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. (టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు..) -
డ్రగ్ కేసు: దీపికాకు కంగనా చురకలు
ముంబై: బాలీవుడ్లో డ్రగ్ కేసు కలకలం రేపుతోంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగు చూసిన ఈ డ్రగ్ కేసులో రోజు రోజుకు ఆసక్తిగా మారుతోంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో రోజు రోజుకు పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో సారా అలీ ఖాన్, రకుల్ ప్రిత్ సింగ్‌లకు ఎన్సీబీ ఇప్పటికే సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న(సోమవారం) బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె పేరు బయటకు వచ్చింది. కె అనే వ్యక్తితో దీపికా మాల్ ఉందా అంటూ చేసిన చాట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక అది తెలిసి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దీపికాపై విమర్శలు గుప్పించారు. గతంలో దీపికా డిప్రెషన్‌కు లోననై విషయం తెలిసిందే. (చదవండి: డ్రగ్స్ కేసులో దీపిక, శ్రద్ధా కపూర్ పేర్లు) Repeat after me, depression is a consequence of drug abuse. So called high society rich star children who claim to be classy and have a good upbringing ask their manager ,” MAAL HAI KYA?” #boycottBollywoodDruggies #DeepikaPadukone https://t.co/o9OZ7dUsfG — Kangana Ranaut (@KanganaTeam) September 21, 2020 దానిని ఉద్దేశిస్తూ కంగనా ‘డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్. క్లాస్‌గా కనిపించే కొందరూ స్టార్ల పిల్లలు వారి మేనేజర్లతో మాల్ గురించి అడుగుతుంటారు’ అని చురకలంటించారు. బాలీవుడ్ డ్రగ్స్ వాడే వాళ్లతో పాటు దీపికాను బాయ్‌కాట్ చేయాలంటూ ఆమె హ్యాష్ ట్యాగ్ జత చేశారు. కె అనే వ్యక్తి దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్‌గా అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ డ్రగ్ కేసులో నేరారోపణ రుజువు కావడంతో సుశాంత్ ప్రియురాలు రియ చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు పలువురి ఎన్సీబీ అరెస్టు చేసి జైలు తరలిచింది. విచారణలో రియా బాలీవుడ్‌కు చెందిన 25 మంది ప్రముఖుల పేర్లను, డ్రగ్స్ వాడే పార్టీ ల జాబితాను ఎన్సీబీకి వెల్లడిచింది. ఈ క్రమంలో సారా, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్, దీపికాలకు కూడా సంబంధం ఉన్నట్లు ఎన్సీబీ గుర్తించింది. (చదవండి: ఆ ఎనిమిదినీ అంతం చేయాలి) -
డ్రగ్స్ కేసులో దీపిక, శ్రద్ధా కపూర్ పేర్లు
ముంబై: సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై కొనసాగుతున్న దర్యాప్తు పలు మలుపులు తిరుగుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో బాలీవుడ్‌కు చెందిన ఐదుగురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వీరిలో టాప్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్ కూడా ఉన్నట్లు వినికిడి. త్వరలోనే వీరిద్దరికీ సమన్లు పంపే అవకాశాలున్నట్లు సమాచారం. ఎన్సీబీకి లభ్యమైన డ్రగ్స్ సరఫరాదారుల ఫోన్లలోని వాట్సాప్ కోడ్ చాట్లను బట్టి..డ్రగ్స్ కేసుకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖుల్లో ప్రధానంగా కె, డి, ఎస్, ఎన్, జెల పేర్లు ఉన్నాయి. ఇందులో ‘డి’ని వైరల్‌గా మారిన కరణ్ జోహార్ పార్టీ వీడియోలో కనిపించిన దీపికా పదుకొణెగాను, ‘కె’ను దీపికా పదుకొణె మేనేజర్, క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉద్యోగి అయిన కరీష్మాగా భావిస్తున్నారు. ‘ఎస్’అంటే శ్రద్ధా కపూర్ అనీ, ‘ఎన్’ను 90లలో బాలీవుడ్ ప్రముఖ నటి, ‘జె’ను జయ సాహాగా భావిస్తున్నారు. సుశాంత్‌తో కలిసి సారా అలీఖాన్ ‘కేదార్నాథ్’లోనూ శ్రద్ధాకపూర్ ‘చిభోర్’ సినిమాలోనూ నటించారు. వీరిద్దరూ కూడా సుశాంత్‌తో కలిసి పుణే సమీపంలోని ఓ దీవిలో జరిగిన పలు పార్టీల్లో పాల్గొన్నట్లు తాజా విచారణలో వెల్లడైందని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. ఎన్సీబీ అధికారులు సోమవారం సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయా సాహాను, మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీని ప్రశ్నించారు. ఈ విచారణలో జయా సాహా.. మరికొందరు సినీ ప్రముఖల పేర్లు వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకు ఎన్సీబీ ఈ వారంలోనే సారా అలీఖాన్‌తోపాటు మరికొందరికి కూడా సమన్లు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం కరీష్మాను ఎన్సీబీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా, నటి రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సిమోన్ ఖంబట్టాలను కూడా వచ్చే వారంలో విచారించే అవకాశం ఉంది. సుశాంత్ కేసులో రియా చక్రవర్తి సహా పలువురిని ఎన్సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌కు సమన్లు..?
మంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణలో భాగంగా సారా అలీఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు ఎన్సీబీ సమన్లు ఇవ్వనుంది. ఈ వారంలోనే ఎన్సీబీ వీరికి సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. కాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. (నన్ను మీడియా వేధిస్తోంది: రకుల్ ప్రీత్) ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్, శ్రద్ధాకపూర్, సిమోన్ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కారణంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరును బయటకు వెల్లడించడానికి ఎన్సీబీ నిరాకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో బాలీవుడ్ సెలబ్రిటీలకు ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం త్వరలో సమన్లు జారీచేయనున్నట్లు సమాచారం. (సుశాంత్‌కు అరుదైన నివాళి...) -
జపాన్ వెళ్లిన స్త్రీ
రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రల్లో అమర్ కౌశిక్ తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ‘స్త్రీ’. రాజ్, డీకే ఈ చిత్రకథను అందించారు. 2018లో బాలీవుడ్లో వచ్చిన పెద్ద హిట్స్‌లో ఈ సినిమా కూడా ఉంది. 100 కోట్ల పైగా కలెక్షన్లను సాధించింది. తాజాగా ‘స్త్రీ’ జపాన్ వరకూ వెళ్లింది. ఈ సినిమా సోమవారం జపాన్‌లో విడుదలయింది. ‘జపాన్‌లోనూ స్త్రీ అందరి మనసుల్ని దోచేస్తుంది’ అని పేర్కొన్నారు శ్రద్ధా కపూర్. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని సమాచారం. -
ప్రత్యేక పాటలో శ్రద్ధ
‘అల వైకుంఠపురములో’ వంటి భారీ హిట్ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా పతాకాలపై వై. నవీన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయిక. కాగా సుకుమార్ చిత్రాల్లో ప్రత్యేక పాటలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్పెషల్ సాంగ్ కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటారాయన. తాజాగా ‘పుష్ప’ చిత్రంలోనూ ప్రత్యేక పాట ఉందట. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ, ‘సాహో’ ఫేమ్ శ్రద్ధా కపూర్ నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
నంబర్ 3
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు. ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తుండటం, తన అప్డేట్స్ను అభిమానులతో షేర్ చేయడం వంటి వాటితో శ్రద్ధా కపూర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బాగానే యాక్టివ్‌గా ఉంటారు. అంత యాక్టివ్‌గా ఉంటారు కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌లో యాభై మిలియన్ల (ఐదు కోట్లు) ఫాలోయర్స్‌ను సంపాదించుకోగలిగారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాభై మిలియన్ల ఫాలోయర్స్ మైలురాయిని చేరుకున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారీ బ్యూటీ. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్‌ల తర్వాత అత్యధిక ఫాలోయర్లను సాధించిన మూడో హీరోయిన్ శ్రద్ధా కపూరే కావడం విశేషం. దాదాపు 47.8 మిలియన్ల ఫాలోయర్స్‌తో ఆలియా భట్ కూడా యాభై మిలియన్ల జాబితాలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లో వారసులపై పలువురు మండిపడుతున్నారు. ప్రముఖ దర్శక–నిర్మాత మహేశ్ భట్ కుమార్తెగా ఆలియా కూడా చాలామంది ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చాలామంది ‘అన్‌ఫాలో’ అయ్యారు. అలా ఫాలోయర్ల సంఖ్య ఆమెకు తగ్గుతూ వస్తోంది. -
‘సుశాంత్ నాకు చంద్రుడిని చూపించాడు’
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎక్కడైనా.. ఎప్పుడైనా పాటపాడుతూ అందుకనుగుణంగా డ్యాన్స్ చేసేవాడని.. ప్రతిరోజూ చాలా హుషారుగా ఉండేవాడని అంటున్నారు హీరోయిన్ శ్రద్ధాకపూర్. ‘చిచోరే’లో తన సహనటుడైన సుశాంత్‌తో ఉన్న జ్ఞాపకాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. సుశాంత్ మానవత్వం, తెలివి, జీవితంపై ఆసక్తిగల వ్యక్తి అని ఆమె గుర్తుచేసుకున్నారు. అంతేకాక టెలిస్కోప్ నుంచి సుశాంత్ తనకు చందమామను చూపించాడని.. ఆ అనుభవాన్ని ఎప్పటికి మర్చిపోలేనన్నారు శ్రద్ధ. ఈ క్రమంలో ‘ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. కానీ, ఇది చాలా కష్టంగా అనిపిస్తున్నది. అంతా శూన్యంలా తోస్తోంది.. సుశాంత్.. డియర్ సుశ్..’ అంటూ శ్రద్ధ వ్యాఖ్యానించారు. 2019లో విడుదలైన చిచోరే సినిమాలో శ్రద్ధాకపూర్, సుశాంత్ సరసన నటించిన సంగతి తెలిసిందే. (బాలీవుడ్ బంధుప్రీతిపై వైరల్ వీడియో) కాగా, సినిమా షూటింగ్ అప్పుడు సుశాంత్‌ను తాను సెట్లో గమనిస్తుండేదానినని, అతడితో మాట్లాడేందుకు ఇష్టపడేదానినని శ్రద్ధా కపూర్ గుర్తుచేసుకున్నారు. తాము ఎక్కువగా విశ్వం, లైఫ్ ఫిలాసఫీల గురించి చర్చించుకునేవాళ్లమని ఆమె తెలిపారు. అతనితో ఉన్నంతసేపు గమ్మత్తైన ప్రదేశంలో ఉన్నట్లు అనిపించేదన్నారు. పని విషయంలో సుశాంత్ ఎంతో అంకితభావం ప్రదర్శించేవాడని తెలిపారు. తనతో పాటు తన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించేవాడని గుర్తు చేసుకున్నారు. ఒకసారి ‘చిచోరే’ టీమ్ అంతా సుశాంత్ ఇంటికి వెళ్లారని.. అక్కడి ప్రకృతి సౌందర్యానికి తాము ఫిదా అయ్యామన్నారు. సుశాంత్ తనకు తానే సాటి అని తెలిపారు. మెసేజ్‌తో పాటు చిచోరే షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటోని, విన్సెంట్ వాన్ గోహ్ ‘స్టారి నైట్’ ఫోటోతో కలిపి ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. శ్రద్ధా కపూర్ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. View this post on Instagram Been trying to accept what has happened and coming to terms with it is very difficult. There is a huge void... Sushant...! Dearest Sush...! Full of humility, intelligence, curiosity about life, seeing beauty in everything, everywhere! He danced to his own tune! I always looked forward to seeing him on set, wondering what captivating interaction we would have next! Apart from being a wonderful co-actor who put his heart and soul in to his work, he was at his core, an amazing person. He cared for people and wanted to see them happy. His kind smile, the conversations we had at shoot about the Cosmos, different philosophies, the moments we spent together, were filled with magical wonderment! During a lovely musical and poetry filled get together at his home (he loved music and poetry), he showed me the moon from his telescope and I was so speechless that I could see it’s exquisite beauty up close!! He wanted to share that feeling! Our Chhichhore gang went to his beautiful home in Pavna, where we were awestruck together with the peace and calm of the nature around us - he loved nature! He saw things through a kaleidoscopic lens and wanted to share that with everyone around him. He was mesmerized by the simplest things and would muse on them in a genius way...! He was truly, One of a kind... I’ll miss you.. dearest Sush.. Shine on... ✨💜 A post shared by Shraddha ✶ (@shraddhakapoor) on Jun 18, 2020 at 3:56am PDT -
‘నేను వెళ్లను.. కుమార్తెను పంపను’
కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ అన్ని రంగాలను ప్రభావితం చేసింది. దాదాపు రెండున్నర నెలలుగా జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నెల ప్రారంభం నుంచి లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి షూటింగ్‌లకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తాజా పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఇలాంటి పరిస్థితుల్లో నేను బయటకి వెళ్లి పని చేయాలని భావించడం లేదు. అలానే నా కుమార్తె శ్రద్ధా కపూర్‌ని కూడా షూటింగ్స్‌కి పంపను’ అన్నారు. (లాక్డౌన్లో సీక్రెట్‌గా హీరోయిన్ పెళ్లి) అంతేకాక ‘కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. రానున్న రోజుల్లో వైరస్ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. పని కన్నా ప్రాణాలే ముఖ్యం. షూటింగ్స్ ఇప్పుడు ప్రారంభమైతే పరిస్థితులు దారుణంగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకొంత కాలం సినిమా షూటింగ్స్ చేయకపోవడమే మంచిదని నా స్నేహితులకి చెప్పాను. ఆస్పత్రి బిల్లులు కట్టడం కంటే.. మరి కొంత కాలం ఆగడం మంచిది’ అని శక్తి కపూర్ పేర్కొన్నారు. -
హీరోయిన్ శ్రద్ధా కపూర్ గ్లామర్ ఫోటోలు
-
వారికి మనుషులుగా బ్రతికే అర్హత లేదు: శ్రద్ధా
ముంబై: కేరళలో టపాసులతో నింపిన పైనాపిల్‌ను తిని ఓ గర్భిణి ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనుగు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. గర్భిణి ఏనుగును క్రూరంగా చంపిన సదరు వ్యక్తులపై జీవ హింస చట్టం కింద కేసు పెట్టి శిక్షపడేలా చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఘటపై భావోద్వేగానికి గురైన శ్రద్ధా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు షేర్ చేశారు. ‘గర్భిణి ఏనుగుకు కేరళలో కొంతమంది వ్యక్తులు టపాసులతో నింపిన పైనాపిల్ తినిపించారు. అది తినడంతో పైనాపిల్ నోటిలో పేలి దవడ భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఆ బాధతో గ్రామమంతా తిరిగి చివరకు ఓ సరస్సులో నిలబడే ప్రాణాలు విడిచింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాక్షసులు అంటే తల మీద కొమ్ములతో ఇరువైపుల రెండు పెద్ద పెద్ద దవడ పళ్లతో మాత్రమే ఉండరు. మన చూట్టూ మనుషుల రూపంలోనే ఉంటారు. వారు మీ పక్కనే నడుస్తారు. చాలా వరకు జంతువులు మనుషులను విశ్వసిస్తాయి. ఎందుకంటే గతంలో అవి మనుషులకు సాయం చేసేవి. వీరి క్రూరత్వం భరించలేని స్థాయిలో ఉంది. వారు మనుషులుగా బ్రతికే అర్హతను కోల్పోయారు. దయ, జాలి లేనప్పుడు మీరు మనుషులుగా పరిగణించరు. ఒకరిని బాధించేవారు మనుషులు కాదు. అందుచేత జీవ హింస చట్టం కింద వీరిపై పిటిషన్ దాఖలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. దోషులను దారుణంగా శిక్షించే వరకు ఈ దుష్ట రాక్షసులు భయపడరు. అయితే వీరిని పట్టుకోవడం కష్టతరమే. కానీ వారిని వీలైనంత త్వరగా పట్టుకుని శిక్షిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. View this post on Instagram A pregnant elephant was fed cracker stuffed pineapple by unidentified people in Kerala which exploded in her mouth and damaged her jaw. She walked around the village and finally passed away standing in a river. We keep searching for monsters hoping they would be having the devil's horns on their heads. But look around you, the monsters walk beside you. From anybody who throws stones at a stray dog to anybody hurting a living soul, choose one face. A lot of these animals trust human beings because they have been helped by them in the past. This is cruel beyond measure. When you lack empathy and kindness, you do not deserve to be called a human being. To hurt someone is not human. Just stricter laws won't help. We need a decent execution of the law too. Until the guilty are punished in the worst possible way, these wicked monsters will never fear the law. Though it's a difficult task, I hope they are able to find out the one who committed this crime and punish them accordingly. Artwork by Bratuti. Post reposted from @tedthestoner A post shared by Shraddha (@shraddhakapoor) on Jun 2, 2020 at 11:47pm PDT -
‘సక్సెస్‌తో మాత్రమే సంతోషం రాదు’
‘ఆషికీ–2’లో అరోషి, ‘హైదర్’లో అర్షియా, ‘ఏక్ విలన్’లో ఐషా, ‘సాహో’లో అమూ (అమృత నాయర్)... ఒకదానితో ఒకటి సంబంధం లేని సినిమాలు, పాత్రలు! యంగ్ ఫైర్‌బ్రాండ్ శ్రద్ధా కపూర్ ఏ పాత్రలోనైనా సులభంగా ఇమిడిపోగలదు. అదే ఆమె విజయ మంత్రం. ‘సక్సెస్‌తో మాత్రమే సంతోషం రాదు’ అంటున్న శ్రద్ధా కపూర్ ముచ్చట్లు ఆమె మాటల్లోనే... సంతోషం అంటే... సినిమాల్లోకి రావడానికి ముందు, వచ్చిన తరువాత వచ్చిన మార్పు ఏమిటంటే... అప్పుడు స్వేచ్ఛగా వీధుల్లో తిరిగేదాన్ని. మార్కెట్‌కు వెళ్లేదాన్ని. ఆటోలో సిటీ మొత్తం తిరిగేదాన్ని. ఇప్పుడు రోడ్‌సైడ్ పానీపూరీ మిస్సవుతున్నాను... అయితే ఇవన్నీ చాలా చిన్న విషయాలు. సినిమాల్లో నటించడం అనేది ఒక వరం. చాలామంది అనుకున్నట్లు సంతోషం సక్సెస్‌తో రాదు. నాకు నచ్చినట్లు జీవిస్తున్నానా? నేను ఇష్టపడింది చేయగలుగుతున్నానా? అనేది మాత్రమే నా సంతోషానికి కొలమానం. అలాంటి పాత్ర... నా కల! ‘ఇలాంటి సినిమాలు చేయాలి’ అని పెద్దగా ఎప్పుడూ అనుకోలేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాను. జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని ఏర్పర్చుకున్నాను. ‘గొప్ప అవకాశం రావాలి’ అంటే రాకపోవచ్చు. ఏమీ అనుకోని రోజు మనల్ని వెదుక్కుంటూ రావచ్చు. అందుకే అంటారు జీవితం అనేది ఆశ్చర్యాల సమహారం. ఇక నాకు నచ్చిన రొమాంటిక్ మూవీ గురుదత్ ‘ప్యాసా’. ఈ సినిమాలో వహీదా రెహమాన్ చేసిన పాత్రలాంటిది చేయాలనేది నా కల. ‘టైటానిక్’, ‘ది నోట్‌బుక్’... సినిమాలు కూడా నా ఫేవరేట్ జాబితాలో ఉన్నాయి. మరింత శక్తితో.... మా నాన్న సుపరిచిత నటుడు కాబట్టి, నేను సినిమాల్లోకి రావడం అనేది సులువుగా జరిగింది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఎన్నో పాత్రల కోసం అడిషన్‌కు వెళ్లాను. అక్కడ తిరస్కారానికి గురయ్యాను. ఆ తిరస్కారాలు నన్ను నేను మెరుగుపరుచుకోడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఫెయిల్యూర్ అంటే మనం ఆగిపోవడం కాదు... మరింత శక్తితో ముందుకు వెళ్లడం. సినిమాల్లోకి రావడానికి ముందు హిందీ సినిమాలపై నా ఆలోచన వేరుగా ఉండేది. కెరీర్లో అదృష్టం పాత్రే ఎక్కువ అనుకునేదాన్ని. కాని అదృష్టం కంటే కష్టపడడం అనేది ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానం ‘వ్యక్తిగత విషయాల గురించి ఎందుకు మాట్లాడరు?’ అనే ప్రశ్న నాకు తరచుగా ఎదురవుతుంటుంది. అవసరమైతే తప్ప మాట్లాడకూడదనేది నేను ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. ఒక నటిగా నటనకు సంబంధించిన విషయాలను మాట్లాడితేనే మంచిది, నటనపై మాత్రమే దృష్టి పెడితేనే మంచిది అనుకుంటాను. ఇక విమర్శల గురించి వస్తే అర్థం లేని విమర్శలను పట్టించుకోను. అదే సమయంలో నిర్మాణాత్మక విమర్శను స్వాగతిస్తాను, -
‘సల్మాన్‌తో నటించే ఆఫర్‌ను వదులుకున్నా’
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని వదులుకున్నానని చెప్పారు. ఇటీవల ఓ టీవీ షోలో సల్మాన్ ఖాన్‌తో కలిసి పాల్గోన్న శ్రద్ధా ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రద్దా మాట్లాడుతూ.. ‘నేను 16 సంవత్సరాల వయసులో ఉండగా సల్మాన్‌తో నటించే ఆఫర్ వచ్చింది. కానీ అప్పుడు నేను చదువుపై దృష్టి పెట్టాలనుకున్నాను. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. అప్పటికీ నేను చిన్న పిల్లను కాబట్టి స్కూలింగ్ పూర్తి చేసి కాలేజీలో చేరాలనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. (కరోనానూ ఢీకొన్న టైగర్..) అయితే ‘‘తిరిగి నేను సినిమా అవకాశాలను పొందానన్న ఆనందం కంటే.. ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని వదులుకున్నానని ఇప్పటికీ బాధపడుతుంటాను. అలాగే సల్మాన్‌తో కలిసి నటించే గొప్ప అవకాశాన్ని వదులుకుని.. చదువుపై దృష్టి పెట్టడం కూడా చాలా కష్టం’’ అని కూడా చెప్పారు. కాగా శ్రద్ధా, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, బెన్ కింగ్స్లీలతో కలిసి 2010లో వచ్చిన ‘టీన్ పట్టి’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో మాధవన్, రీమాసేన్లు కూడా కీలక పాత్రలో కనిపించారు. కాగా శ్రద్ధా హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించిన ‘భాగీ-3’ సినిమా ఇటీవల విడుదలై సంగతి తెలిసిందే. (హ్యపీ బర్త్‌డే స్వీటెస్ట్ అమృత: ప్రభాస్) -
కరోనానూ ఢీకొన్న టైగర్..
ముంబై : టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్లు జోడీగా విడుదలైన లేటెస్ట్ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ భాగీ 3 తొలి వీకెండ్లో రూ 50 కోట్ల మార్క్‌ను దాటింది. ఈ మూవీపై మిశ్రమ సమీక్షలు వచ్చినా కరోనా భయాలు, పరీక్షల హడావిడిని అధిగమించి మెరుగైన వసూళ్లను రాబట్టింది. శుక్రవారం తొలిరోజు రూ 17.50 కోట్లు రాబట్టిన భాగీ 3 రెండవరోజు రూ 16.03 కోట్లు, ఆదివారం రూ 20.3 కోట్లను వసూలు చేసి మూడు రోజుల్లో మొత్తం రూ 53.83 కోట్లు వసూలు చేసిందని ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మాస్ సెంటర్లలో ఈ మూవీ భారీ వసూళ్లు రాబడుతోందని, మెట్రోల్లోనూ మూడోరోజు పుంజుకుందని ఆయన ట్వీట్ చేశారు. భాగీ ఫ్రాంచైజీ టైగర్‌కు కలిసివచ్చిందనే చెప్పాలి. తొలి, మూడు పార్ట్‌ల్లో శ్రద్ధా కపూర్ టైగర్‌తో జతకట్టగా, భాగీ 2లో దిశా పటానీ టైగర్ సరసన ఆడిపాడింది. అహ్మద్‌ఖాన్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన భాగీ 3లో రితీష్ దేశ్‌ముఖ్, అంకితా లోఖండేలు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. -
హ్యపీ బర్త్‌డే స్వీటెస్ట్ అమృత: ప్రభాస్
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజుతో (మంగళవారం) శ్రద్ధా 33వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. దీంతో అటు బాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు ఇటు ప్రముఖుల నుంచి బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండే డార్లింగ్ ప్రభాస్ సైతం శ్రద్ధాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా విషెస్ చెప్పారు. కాగా శ్రద్ధా గతడేది విడుదలైన సాహో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్‌తో జంట కట్టింది ఈ భామ. ఇక సాహో చిత్రంలోని పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘నా స్వీటెస్ట్ అమృతకు పుట్టినరోజు ప్రత్యేక శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ చేశాడు. అమృత అంటే సాహో సినిమాలో శ్రద్ధా పాత్ర పేరు. ఆ పేరుతోనే ప్రభాస్ విషెస్ తెలిపారు. అలాగే సాహో దర్శకుడు సుజీత్ కూడా శ్రద్ధాకు శుభాకాంక్షలు చెప్పారు. ‘రాబోయే చిత్రం భాగీ 3 తో ఘనమైన విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా.. సూపర్ హ్యపీ బర్త్‌డే’ అంటూ విషెస్ తెలిపారు. ఇక శ్రద్ధా,టైగర్ ష్రాఫ్, నటించిన భాఘీ 3 చిత్రం మార్చి 6న విడుదలకు సిద్ధంగా ఉంది. View this post on Instagram Here’s wishing my sweetest Amritha @shraddhakapoor a very Happy Birthday! A post shared by Prabhas (@actorprabhas) on Mar 2, 2020 at 11:25pm PST -
అదిరిపోయిన ‘భాగీ-3’ ట్రైలర్
ఉగ్రమూక ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) దురాగతాలతో.. నిరంతరం బాంబుల వర్షంతో మోతమోగే సిరియాలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి దేశంలో టెర్రరిస్టుల చేతికి చిక్కిన తన సోదరుడిని కాపాడుకునేందుకు హీరో చేసిన పోరాటం ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా భాగీ 3. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కెరీర్‌ను మలుపుతిప్పిన భాగీ ప్రాంఛైజీలో వస్తున్న మూడో సినిమా ఇది. రితేశ్ దేశ్‌ముఖ్, టైగర్ ఇందులో అన్నదమ్ములుగా నటిస్తున్నారు. భాగీ సినిమాలో హీరోయిన్గా కనిపించిన శ్రద్ధా కపూర్.. ఈ సినిమాలోనూ టైగర్‌తో జోడీతో కట్టారు. కాగా అహ్మద్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. దాదాపు 4 నిమిషాల నిడివి గల అద్భుతమైన యాక్షన్ ఫీట్లతో అదిరిపోయింది. సోదరుడిని కాపాడుకునేందుకు హీరో ఉగ్రమూకతో తలపడే తీరు వన్ మ్యాన్ షోను తలపించింది. ఇక ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘అతడికి నా హృదయంలో ప్రత్యేక స్థానం’
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన హృదయంలో బాలీవుడ్ నటుడు వరుణ్ దావన్కు ప్రత్యేకమైన స్తానం ఉందని శ్రద్ధా కపూర్ తెలిపారు. వరుణ్, శ్రద్దా కపూర్ల జంటగా ‘స్ట్రీట్ డ్యాన్స్‌ర్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రద్ధా మీడియాతో మాట్లాడుతూ.. వరుణ్, తాను వేరే పాఠశాలలో చదివినప్పటికి అవి చాలా దగ్గరగా ఉండేవని తెలిపారు. తన జీవితంలో వరుణ్ చాలా ముఖ్యమైన వ్యక్తి అని అన్నారు. తన బాల్యంలో ఎవరి స్కూల్ మెరుగైనదో అంటు తరుచుగా చర్చించుకునే వాళ్లమని ఆమె గుర్తు చేశారు. అతడు తనకు చిన్ననాటి నుంచి తెలుసునని.. ఎవరితోనైతే ప్రత్యే క అనుబంధం ఉంటుందో వారితో కలిసి నటించడం ఎంతో ప్రత్యేకమన్నారు. వరుణ్‌లో మంచి లక్షణాలు ఉన్నాయని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం అతడి సొంతమన్నారు. వరుణ్‌ను ప్రేక్షకులు అభిమానిస్తారని.. అభిమానులను ఆకర్శించే శక్తి దాగి ఉందన్నారు. ప్రేక్షకులు వరుణ్‌ను తమ సొంత మనిషిలా ఆరాధిస్తారని పేర్కొన్నారు. ఏబీసీడీ 2, త్రీడీ స్ట్రీట్ డ్యాన్స్‌ర్ తనకు మైలురాయి లాంటి సినిమాలని అభిప్రాయపడ్డారు. ఈ రెండు సినిమాలు వల్ల తనకు విభిన్న రకాలుగా డ్యాన్స్‌లు చేయడానికి అవకాశం లభించిందన్నారు. తనకు చిన్నతనం నుంచే డ్యాన్స్‌లంటే విపరీతంగా ఇష్టమని... ప్రముఖ బాలీవుడ్ నటులు శ్రీదేవి, మాధరీ దీక్షిత్‌లు తనకు ఇష్టమైన వారని శ్రద్ధా కపూర్ వివరించారు. చదవండి: ‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’ -
సినిమాలో చూసి ఎంజాయ్ చేయడమే : విజయ్
వరుణ్ ధావన్, శ్రద్ధ కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా దర్శకత్వం వహించిన చిత్రంలో నోరా ఫతేహి, ప్రభుదేవా కీలక పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో డ్యాన్స్‌లు ఆదరగొట్టేలా ఉన్నాయని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌పై సన్సేషన్ స్టార్ విజయ దేవరకొండ ట్విటర్లో షేర్ చేశారు. వరుణ్, శ్రద్ధ, రెమో, ప్రభుదేవాలకు బెస్ట్ విషెస్ చెప్పారు. ‘నా జీవితంలో ఇది నేను చేయలేను.. సినిమాలో చూసి ఎంజాయ్ చేయటమే’ అని విజయ్ పేర్కొన్నారు. రెమో గతంలో దర్శకత్వం వహించిన ఏబీసీడీ, ఏబీసీడీ2 లను మించిపోయేలా ఇందులో డ్యాన్స్ బీట్స్ ఉన్నాయి. కాగా, ఈ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. Ee life time lo idhi nenu cheyalenu, cinema lo chusi enjoy cheyatame 😀 Wishing brother @Varun_dvn @ShraddhaKapoor @remodsouza @PDdancing and all the street dancers the very best for #StreetDancer3D Releasing in Telugu on the 24th of Jan 2020. https://t.co/CTtA30ZPVx — Vijay Deverakonda (@TheDeverakonda) December 19, 2019 -
మా జాగ్రత్తలు ఫలించలేదు
‘సైనా’ చిత్రానికి బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నాయి. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు అమోల్ గుప్తా ‘సైనా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలి సిందే. తొలుత ఈ సినిమాలో సైనా పాత్రకు శ్రద్ధాకపూర్‌ను ఎంపిక చేశారు. చిత్రీకరణ కూడా ప్రారంభించారు. శ్రద్ధాకు ఆరోగ్యం బాగోలేకపోవడం, ప్రాక్టీస్ సమయంలో గాయపడటం, డేట్స్ క్లాష్ అవ్వడం.. ఇలా పలు కారణాలతో ‘సైనా’ చిత్రం నుంచి శ్రద్ధాకపూర్ తప్పుకున్నారు. ఆ తర్వాత సైనా నెహ్వాల్ పాత్ర చేయడానికి పరిణీతి చోప్రా పచ్చజెండా ఊపారు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. చిత్రీకరణ మొదట్లోనే పరిణీతి చోప్రా గాయపడటం చిత్రబృందాన్ని కలవరపెడుతోంది. ‘‘బ్యాడ్మింటన్ సాధనలో భాగంగా గాయపడకూడదని నేనూ, చిత్ర బృందం చాలా జాగ్రత్తలు వహించాం. కానీ, మా జాగ్రత్తలు ఫలించలేదు. నేను గాయపడ్డాను. కోలుకొని త్వరలో చిత్రీకరణలో పాల్గొనాలని ఉంది’’ అన్నారు పరిణీతి చోప్రా. -
అమెజాన్ ప్రైమ్‌లో సాహో మూవీ!
బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా అదేస్థాయి అంచనాలతో తెరకెక్కిన భారీ సినిమా సాహో.. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయినా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. దక్షిణాదిలో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ‘సాహో’ హిందీలో మాత్రం అదిరిపోయే కలెక్షన్లతో ‘సాహో’ అనిపించింది. త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఈ నెల 19 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సాహో సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. రూ.42 కోట్ల భారీ ధరతో ‘సాహో’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇక, ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఉండనుందని సమాచారం. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సాహో సినిమాను తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 425 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, చంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిశోర్, మందిర బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
డిష్యుం డిష్యుం
బాలీవుడ్లో యాక్షన్ హీరోగా టైగర్ ష్రాఫ్‌కు మంచి పేరుంది. అందుకు తగ్గట్టే ఎప్పటికప్పుడు కొత్త కొత్త యాక్షన్ స్టంట్స్‌ను చేస్తూ ప్రేక్షకులకు కిక్ ఇస్తుంటారాయన. తాజాగా టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ‘భాగీ 3’ సినిమా కోసం దాదాపు 400 కార్లు ఉండే ఓ జంక్‌యార్డ్‌లో విలన్స్‌ను రఫ్పాడిస్తున్నారట టైగర్. ముంబైలో జరుగుతున్న ఈ యాక్షన్ సీన్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందట. ఈ షూటింగ్ సెట్‌ను రెడీ చేయడానికి టీమ్ 15 రోజులు కష్టపడ్డారు. అహ్మద్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ అన్న పాత్రలో పోలీసాఫీసర్‌గా రితేష్ దేశ్‌ముఖ్ నటిస్తున్నారు. ముంబై షెడ్యూల్ తర్వాత ‘భాగీ 3’ బృందం నవంబరులో సెర్బియా వెళ్లనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నారు. -
'బాగీ-3లో మణికర్ణిక ఫేమ్ అంకితా లోఖండే'
మణికర్ణిక ఫేమ్, పవిత్ర రిష్తా సీరియల్‌తో టీవీ ప్రేక్షకులకు చేరువైన నటి అంకితా లోఖండే తాజాగా మరో భారీ బడ్జెట్ బాలీవుడ్ చిత్రాన్ని చేజిక్కించుకుంది. హీరో టైగర్‌ష్రాఫ్, సాహో ఫేమ్ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న బాగీ-3 చిత్రంలో అంకితాకు నటించే అవకాశం దక్కింది. కాగా బాలీవుడ్‌లోకి అంకితా లోఖండే డెబ్యూ మూవీ మణికర్ణికతో అడుగుపెట్టారు. ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మూవీలో ఆమె రితేష్ దేశ్ముఖ్తో పాటు నటిస్తున్నారని ఈ మేరకు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. బాగీ-3లో ఆమె శ్రద్ధాకపూర్‌కు అక్కగా నటిస్తుండగా, మరోవైపు రితేష్ దేశ్‌ముఖ్ ఈ చిత్రంలో టైగర్‌కు అన్నగా నటించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో తనని మునుపటి కంటే కొత్తగా చూపనున్నారని, ప్రేక్షకులకు తన పాత్ర బాగా నచ్చుతుందని అంకితా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ చిత్రం మార్చి 2020లో రిలీజ్ కానుంది. -
యాక్షన్ ప్లాన్
శత్రువులపై దాడి చేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్. ఈ ప్లాన్‌లో నేనూ పాలుపంచుకుంటాను అంటున్నారు శ్రద్ధా కపూర్. ‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం ‘భాగీ 3’. ౖటైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అహ్మద్‌ఖాన్ దర్శకుడు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం టైగర్ ష్రాఫ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ముంబైలో ప్రారంభమైంది. టైగర్, శ్రద్ధా, రితేష్ దేశ్‌ముఖ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేశారు. అక్టోబ రులో ‘భాగీ 3’ బృందం జార్జియా వెళ్లనుందని టాక్. -
‘సాహో’ రిలీజ్ తరువాత తొలిసారి మీడియాతో ప్రభాస్
బాహుబలి తరువాత అదే స్థాయి అంచనాలతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా సాహో. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటింది. అయితే సినిమా రిలీజ్‌కు ముందు వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రభాస్ రిలీజ్ తరువాత మాత్రం మీడియాకు దూరంగా ఉంటున్నారు. సాహో రిలీజ్ అయిన రెండు వారాల తరువాత ప్రభాస్ మీడియా ముందుకు వచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో హిందీ సినిమాల పట్ల పక్షపాత ధోరణిపై ప్రభాస్ స్పందించాడు. ఇతర భాషల సినిమాలను బాలీవుడ్ జనాలు పెద్దగా ఆదరించరన్నా విషయాన్ని అంగీకరిస్తూనే, ఇలాంటి పరిస్థితులు అన్ని రంగాల్లో ఉన్నాయన్నాడు. ‘ప్రతి భాషలో అక్కడి ప్రాంతీయ నటులు ఉంటారు. వారు 20, 30 సంవత్సరాలుగా వారికి తెలుసు. అందుకే కొత్తగా వచ్చిన వారిని త్వరగా యాక్సెప్ట్ చేయలేరు. కానీ సినిమా బాగుంటే ఇవ్వని పక్కన పెట్టి ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు. లేదంటే కొత్త నటుడికి, దర్శకుడికి అసలు అవకాశమే రాదు. బాహుబలి గతంలో ఉన్న ఎన్నో హద్దులను చెరిపేసి జాతీయ స్థాయి సినిమాలకు అవకాశం కల్పించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి’ అన్నారు. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన సాహో ఇప్పటికే 425 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరిన్ని రికార్డ్ల దిశగా దూసుకుపోతోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, చంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిశోర్, మందిర బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’
‘ఆషికీ–2’ ‘ఏక్ విలన్’ ‘హైదర్’ ‘ఓకే జాను’ సినిమాలతో బాలీవుడ్లో పేరు తెచ్చుకున్న శ్రద్ధా కపూర్ ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆమె అంతరంగ తరంగాలు... స్టైల్ స్టేట్మెంట్ నేను నాలాగే ఉండాలనేది నా స్టైల్ స్టేట్మెంట్. ఎవరినో అనుకరిస్తే మిగిలేది ‘అనుకరణ’ తప్ప ‘అందం’ కాదు! నా దృష్టిలో నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్ అంటే... మాంచి నిద్ర! ఒళ్లు తెలియకుండా నిద్రపోయేవాళ్లను చూస్తే ముచ్చటేస్తుంది. సరిౖయెన నిద్ర లేకపోతే ఎంత కష్టపడి ఏంలాభం! సరిౖయెన నిద్ర, ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం, అందంగా ఉంటాం! అందం విశాల్ భరద్వాజ్ ‘హైదర్’ సినిమాలో కశ్మీరీ అమ్మాయి ‘అర్షియా’ పాత్ర పోషించాను. మేకప్ లేకుండా నటించాను. ‘అందంగా కనిపించలేదు’ అని ఒక్కరూ అనలేదు. మేకప్‌తోనే అందం వస్తుందంటే నేను నమ్మను. నిజంగా చెప్పాలంటే మేకప్ లేకపోతేనే నాకు సౌకర్యంగా, సంతోషంగా, సహజంగా అనిపిస్తుంది. కానీ సినిమాల్లో ఉన్నాం కాబట్టి తప్పదు కదా! ఒత్తిడి లేకుండా ఉండాలంటే? ఈ పెద్ద ప్రశ్నకు చిన్న సమాధానం... పని! అదేమిటీ పనితోనే కదా ఒత్తిడి వచ్చేది అంటారా! పని మీద ప్రేమ ఉంటే... ఒత్తిడే ఉండదు. నావరకైతే ఫిల్మ్సెట్లో లేనప్పుడే ఒత్తిడికి గురవుతాను. ‘ఇప్పుడు ఏం చేయాలి?’ ‘ఇప్పుడు ఏం చేయాలి?’ అని పదేపదే ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతుంటాను. ఒత్తిడిని దూరంగా ఉంచడానికి మరో మార్గం కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపడం. ఈ పని నేను ఎక్కువగా చేస్తుంటాను. అంతమాత్రాన... నా పనికి ఎంత న్యాయం చేశాను? అనేదే ఆలోచిస్తాను తప్ప... హిట్, ఫ్లాప్‌లను మనసుకు తీసుకోను. ఫ్లాప్ ఎదురైందని బాధ పడితే ‘బాధ’ తప్ప ఏమీ మిగలదు కాబట్టి బాధపడడం ఎందుకు? స్క్రిప్ట్ వింటున్నప్పుడు ‘ఈ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుంది’ అనిపిస్తుంది. అన్నిసార్లూ మన అంచన నిజం కాకపోవచ్చు. జయాపజయాలు ప్రేక్షకుల చేతుల్లో ఉన్నాయి. దాన్ని మనం అంగీకరించాల్సిందే. దె....య్యం! చిన్నప్పుడు దెయ్యాల కథలు, దెయ్యాల సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. ‘జీ హారర్ షో’ అంటే చాలా ఇష్టం. మిస్టరీలను ఛేదించే ఆటలు ఆడేవాళ్లం. ఆత్మలు ఉన్నాయా? లేవా? అనేది నేను కచ్చితంగా చెప్పలేనుగానీ... ఒకసారి సెట్స్‌లో ఒక విచిత్ర సంఘటన జరిగింది. చాలా ఎత్తు నుండి లైట్–మ్యాన్ హఠాత్తుగా కిందపడిపోయాడు. ఏదో అదృశ్యశక్తి తనను నెట్టివేసిందని చెప్పడంతో మేమంతా ఆశ్చర్యపోయాం! -
‘సాహో’ మూవీ స్టిల్స్
-
టెన్నిస్ ఆడతా!
‘సాహో’ సినిమాతో సౌత్ ఇండియాకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారు శ్రద్ధాకపూర్. మొన్నామధ్య ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’ నుంచి శ్రద్ధాకపూర్ తప్పుకున్న విషయం తెలిసిందే. ‘సైనా’లో ఇప్పుడు పరిణీతీ చోప్రా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తప్పుకున్నందుకు ఏమైనా పశ్చాత్తాప పడుతున్నారా? అనే ప్రశ్నను శ్రద్ధాకపూర్ ముందు ఉంచితే... ‘‘నా జీవితంలో నేను దేని గురించీ రిగ్రెట్ ఫీలవ్వను. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను. దురదృష్టవశాత్తు ‘సైనా’ ఫస్ట్ డే షూటింగ్‌లోనే నేను అనారోగ్యానికి గురయ్యాను. దాంతో షూటింగ్ కాస్త వాయిదా పడింది. ఆ లోపు ‘ఏబీసీడీ 3’లో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. ‘ఏబీసీడీ 2’ సినిమా నా కెరీర్లో మంచి హిట్. అలాంటప్పుడు ‘ఏబీసీడీ 3’ సినిమాకు నో చెప్పాలనుకోలేదు. అప్పటికే నేను ‘చిచ్చోరే’, ‘సాహో’ సినిమాలతో బిజీగా ఉన్నా. అందుకే ‘సైనా’ చిత్రానికి తిరిగి డేట్స్ కేటాయించలేకపోయాను. ఫలితంగా ఆ ప్రాజెక్ట్ చేజారింది’’ అని చెప్పారు. ఒక బయోపిక్‌ని మిస్సయిన మీకు ఇప్పుడు ఎవరి బయోపిక్‌లో అయినా నటించాలని ఉందా? అనే ప్రశ్నను శ్రద్ధా ముందు ఉంచితే – ‘‘సానియా మీర్జా (ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి) బయోపిక్ ఆలోచన ఉంది. ఆమెది గ్రేట్ జర్నీ. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. రోనీ స్క్రూవాలా దగ్గర సానియా మీర్జా బయోపిక్ హక్కులు ఉన్న సంగతి తెలిసిందే. మరి.. శ్రద్ధాని రోనీ నాయికగా తీసుకుంటారా? అనేది కాలమే చెప్పాలి. -
తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’
టాలీవుడ్లో ఇప్పటివరకు ఏ చిత్రానికి దక్కని అరుదైన ఘనతను ‘సాహో’ సొంతం చేసుకుంది. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. యువీ క్రియేషన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిని చిత్ర బృందానికి మరింత జోష్ కలిగించే వార్త లభించింది. తాజాగా సాహోకు ట్విటర్ ఎమోజీ వచ్చింది. ఇందులో వింతేముంది అనుకోకండి. ట్విటర్ ఎమోజీ లభించిన తొలి తెలుగు సినిమాగా ‘సాహో’నిలిచింది. టాలీవుడ్‌ను ఏలిన అగ్రహీరోల సినిమాలకు సాధ్యంకానీ ఘనతను ప్రభాస్ సాహో సాధించింది. ఈ మధ్యకాలంలో తమిళంలో కాలా, సర్కార్, బాలీవుడ్లో జీరో, సుల్తాన్ సినిమాలకు ట్విటర్ ఎమోజీలు వచ్చాయి. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లతో ‘సాహో’పై భారీ అంచనాలే నమోదయ్యాయి. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చదవండి: ‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు ‘సాహో నుంచి తీసేశారనుకున్నా’ సాహో : ప్రభాస్ సింగిలా.. డబులా? -
‘సాహో’ రన్‌టైం ఎంతంటే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో. 350 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ వైరల్‌గా మారుతోంది. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా నిడివి 2 గంటల 46 నిమిషాలకు ఫిక్స్ చేశారట. స్మోకింగ్ యాడ్స్ కూడా కలుపుకుంటే దాదాపు 2 గంటల 50 నిమిషాల అని తెలుస్తోంది. ఈ రన్‌టైంతోనే సినిమాను సెన్సార్‌కు పంపేందుకు ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. కాస్త లెంగ్తీగా అనిపించినా అనుకున్న కథను ఇంట్రస్టింగ్‌గా చెప్పేందుకు ఆ డ్యూరేషన్ తప్పదని ఫిక్స్ అయ్యారట సాహో టీం. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సాహో.. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్రయూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకను రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్నారు. -
సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!
బాహుబలి చిత్రాన్ని మెచ్చిన ప్రేక్షకులను సాహో అలరిస్తే చాలని నటుడు ప్రభాస్ పేర్కొన్నారు. బాహుబలి 1, 2 చిత్రాలతో భారతీయ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులను అలరించిన నటుడు ప్రభాస్. ముఖ్యంగా తమిళంలో మంచి పేరు తెచ్చుకున్నారు. బాహుబలి 1, 2 చిత్రాల తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. బాహుబలి చిత్రాలకు మించిన భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్న చిత్రం సాహో. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాలో నటుడు అరుణ్‌విజయ్, నీల్‌నితిన్ ముఖేశ్, జాకీష్రాఫ్ ముఖ్యపాత్రలను పోషించారు. యువదర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా సాహో నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 30న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సాహో చిత్ర తమిళ వెర్షన్ ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు ప్రభాస్ మాట్లాడుతూ ‘సాహో అంటే జయహో అని అర్థం. చిత్రం చూస్తే అది మీకే అర్థం అవుతుంది. సాహో చిత్రం కోసం రెండేళ్లు కాల్షీట్స్ ఇవ్వాల్సి వస్తుందని అనుకోలేదు. బాహుబలి చిత్రాల తరువాత ఆ స్థాయిలో మంచి కథా చిత్రాన్ని చేయాలని అనుకున్నా. అలాంటి సమయంలో సుజిత్ చెప్పిన కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించా’ అని తెలిపారు. నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెట్టారని, ఒక్కో యాక్షన్ సన్నివేశానికి ముందు చాలా ప్రీ ప్రొడక్షన్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. తమిళ్, తెలుగు, హాలీవుడ్‌లకు చెందిన పలువురు స్టంట్‌మాస్టర్లు కలిసి ఫైట్స్ సన్నివేశాలను రూపొందించినట్లు చెప్పారు. అందుకు చాలా సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని అన్నారు. ఇకపోతే తాను పుట్టింది చెన్నైలోనేనని, తమిళంలో స్ట్రయిట్ చిత్రం చేయాలని చాలా ఆశగా ఉందని అన్నారు. అందుకు మంచి కథ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. త్వరలోనే తమిళంలో స్ట్రయిట్ చిత్రంలో నటిస్తానని ప్రభాస్ అన్నారు. బాహుబలి చిత్రాన్ని మెచ్చిన ప్రేక్షకులను ఈ సాహో చిత్రం అలరిస్తే చాలునని ఆయన పేర్కొన్నారు. అయితే సాహో చిత్రాన్ని బాహుబలి చిత్రంతో పోల్చరాదని, అది చారిత్రక కథా చిత్రం కాగా సాహో ఈ కాలానికి చెందిన సోషల్ కథా చిత్రం అని అన్నారు. అయితే ఇందులో మీరు ఇంత వరకూ చూడనటువంటి యాక్షన్ సన్నివేశాలను చూస్తారని అన్నారు. ఇకపోతే తమిళ ప్రేక్షకులకు సాహో చిత్ర యూనిట్ నుంచి చిన్న సర్ఫ్రైజ్ ఉంటుందన్నారు. అదేమిటన్నది ఈ నెల 23న తెలుస్తుందని ప్రభాస్ పేర్కొన్నారు. అదేవిధంగా తనకు హిందీ, ఇంగ్లిష్ చిత్రాల్లో నటించాలన్న ఆశ లేదని చెప్పారు. ఈ సమావేశంలో నటి శ్రద్ధాకపూర్, అరుణ్‌విజయ్, దర్శకుడు సుజిత్ పాల్గొన్నారు. -
ప్రపంచ ప్రఖ్యాత థియేటర్లో ‘సాహో’ షో
రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్న సాహో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రపంచ ప్రఖ్యాత థియేటర్ గ్రాండ్ రెక్స్‌లో ప్రదర్శించనున్నారు. పారిస్‌లోని ఈ థియేటర్లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమా చూసే వీలుంది. ఇప్పటికే సౌత్ నుంచి కబాలి, బాహుబలి, మెర్సల్, విశ్వరూపం 2 లాంటి సినిమాలను ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజా సాహోకు ఈ ఘనత దక్కింది. అద్భుతమైన ఇంటీరియర్‌లో అత్యాధునిక సదుపాయాలున్న ఈ థియేటర్లో సినిమా ప్రదర్శనకు అవకాశం దక్కటం గౌరవంగా భావిస్తారు. ఇప్పటికే గ్రాండ్ రెక్స్ థియేటర్ వద్ద సాహో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన సాహో సినిమా ఆగస్టు 30 ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుంది. -
‘సాహో’ టీం మరో సర్ప్రైజ్
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్ సాహో. ఈ నెల 30 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా దాదాపు 350 కోట్లతో యూవీ క్రియేషన్ సంస్థ సినిమాను రూపొందించింది. ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా మరో సర్ప్రైజ్ ఇచ్చారు. సాహో గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు ప్రభాస్. యాక్షన్ జానర్‌లోరూపొందించిన ఈ గేమ్‌లో లీడ్ క్యారెక్టర్‌గా ప్రభాస్ కనిపిస్తున్నాడు. ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో రూపొందించిన ఈ గేమ్ టీజర్‌కు మంచి రెస్సాన్స్ వస్తోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
డిఫెన్స్ ఇష్టముండదు.. కొడితే సిక్సరే!
‘‘గల్లీ క్రికెట్లో సిక్సర్ ఎవడైనా కొడతాడు. స్టేడియంలో సిక్స్ కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది’’ అనే డైలాగ్‌తో ‘సాహో’ ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ కథానాయిక. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘ స్క్రీన్‌ప్లే ప్రధానమైన స్క్రిప్ట్ ఇది. నిఖిల్, సుజీత్ ఇద్దరూ ట్రైలర్ కట్ చేశారు. 137 వెర్షన్స్ కట్స్ చేశారు. సినిమా చూశాక ట్రైలర్ కట్ చేయడం ఎంత కష్టమో అనిపిస్తుంది. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. ప్రమోద్, నేను కలసి పెరిగాం. మేం ఫ్రెండ్స్ కాదు.. ఫ్యామిలీ. అందుకే ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ‘సాహో’ లో యాక్షన్ సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయి’’ అన్నారు. ‘‘హైదరాబాద్ నా రెండో ఇల్లు. రెండేళ్లుగా ‘సాహో’ షూటింగ్ చేస్తున్నాం. ఇలాంటి సినిమాతో తెలుగులో పరిచయం కావడం చాలా బావుంది’’ అన్నారు శ్రద్ధా కపూర్. ‘‘సాహో’ ఫస్ట్ తెలుగు సినిమా. ఆ తర్వాత ప్యా¯Œ ఇండియా సినిమా. ఇక నుంచి నాన్‌స్టాప్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు ప్రమోద్. ‘‘సాహో’ను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. కొన్ని థియేటర్స్‌లో ‘సాహో’ కోసమని స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్‌లు అప్డేట్ చేస్తున్నారు. ఐమాక్స్ ఫార్మాట్లోనూ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు విక్కీ. ఈ సందర్భంగా విలేకరులతో ప్రభాస్, శ్రద్ధా మాటామంతీ... ► ప్రభాస్‌తో రొమాన్స్, యాక్షన్ రెండూ చేశారు. దేన్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు? శ్రద్ధా కపూర్ : రెండూ (నవ్వుతూ) ► శ్రద్ధా సెట్స్‌లో తెలుగులో ఎలా మాట్లాడారు. ప్రభాస్: షూటింగ్ ఫస్ట్‌డే నుంచి తెలుగు డైలాగ్స్ బాగా చెప్పింది. మేం షాక్ అయ్యాం. చాలా కష్టపడి నేర్చుకున్నారు. శ్రద్ధా మంచి లవ్‌స్టోరీలు చేసింది. యాక్షన్ మూవీలో ఎలా ఉంటుందో అనుకున్నాం. మమ్మల్ని సర్ప్రైజ్ చేసింది. ► సుజీత్ మీద ‘బాహుబలి’ సినిమా తాలుకా ఒత్తిడి ఏమైనా ఉందా? ప్రభాస్ : సుజీత్ మీదే కాదు.. మా అందరి మీద కూడా ఒత్తిడి ఉంది. అందుకే టైమ్ తీసుకుని క్వాలిటీగా చేశాం. అతని వయసు తక్కువ. సినిమాలో పెద్ద టెక్నీషియన్స్‌ని బాగా డీల్ చేశాడు. సెట్లో తను కోప్పడటం, అరవడం కనబడలేదు. ► ఒక సినిమా అనుభమున్న సుజీత్‌ని ఎలా నమ్మారు? సినిమా అనుకున్నట్టే తీస్తున్నాడు అని ఏ పాయింట్లో అనిపించింది. ప్రభాస్ : ఫస్ట్ డే షూట్ చాలా క్లిష్టమైన సన్నివేశం. ఒక్క సీన్ 5–6 వేరియేషన్స్ ఉంటాయి. సినిమాలో నాలుగైదు సార్లు వస్తుంది. సినిమాను దాంతోనే స్టార్ట్ చేశాం. రీషూట్ చేయలేదు, కరెక్షన్ లేదు. స్టోరీలో 8 లేయర్స్ ఉంటాయి. అంత ఈజీగా డీల్ చేసినప్పుడే తను చేయగలడనిపించింది. ► ‘సాహో’తో బాలీవుడ్ బాద్షా అవుతారని అనుకుంటున్నారా? ప్రభాస్: ‘బాహుబలి’ ఆడియన్స్‌ను, ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేయాలి. దానికోసం పగలు, రాత్రి కష్టపడ్డాం. వాళ్లు సంతృప్తి చెందితే చాలు. సినిమా బాగా ఆడాలనుకుంటున్నాను. ► ట్రైలర్లో సిక్సర్ డైలాగ్ ఉంది. మీరు సిక్సర్ కొడతారా? ప్రభాస్ : నేను క్రికెట్ ఆడటానికి వెళ్లినప్పుడు లాగి కొట్టడమే. తగిలితే సిక్సరే. డిఫెన్స్ ఆడటం ఇష్టముండదు. ► యాక్షన్స్ సీన్స్ చాలెంజింగ్‌గా అనిపించాయా? ప్రభాస్ : చాలా మంది ఫైట్ మాస్టర్స్ ఉన్నారు. చాలా యాక్షన్ సన్నివేశాలున్నాయి. కొన్నిటి కోసం 6 నెలలు శిక్షణ తీసుకున్నాం. స్టోరీ బోర్డ్‌లు వేశాం. ప్రీ– ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. శ్రద్ధా : మొదట్లో గన్ పట్టుకున్నప్పుడు చేతులు వణికేవి. నేను పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తూ అలా వణకకూడదు. తర్వాత గన్ పట్టుకోవడం అలవాటు అయింది. ► ‘సాహో’తో ఖాన్స్‌కి షాక్ ఇవ్వబోతున్నారా? ఖాన్స్ (సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్) ఇండియాను ఇన్స్పైర్ చేశారు. వాళ్లకు పోటీ అని అనకూడదు. బాలీవుడ్ వాళ్లు నన్ను బాగా ఆదరించారు. పెద్ద పెద్ద స్టార్స్ నాకు మెసేజ్‌లు పంపారు. ‘సాహో’ ట్రైలర్ చూసి రాజమౌళిగారు బావుందని చెప్పారు. షాక్ ఏంటంటే చిరంజీవిగారు ఫోన్ చేశారు. బావుందని అభినందించారు. మెసేజ్ కూడా చేశారు. ఫుల్ హ్యాపీ అనిపించింది. -
హైదరాబాద్‌లో సాహో మీడియా సమావేశం
-
‘సాహో’ ట్రైలర్ వచ్చేసింది
దేశవ్యాప్తంగా హీట్ పెంచేస్తున్న సినిమా సాహో. బాహుబలితో జాతియ స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్.. సాహోతో రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఇదివరకెన్నడూ చూడని యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే టీజర్స్, సాంగ్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సాహో.. యూట్యూబ్‌ను షేక్చేసేందుకు సిద్దమైంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు వేల కోట్ల రాబరీ.. దాన్ని చేజ్ చేసేందుకు పోలీసులు.. చేజిక్కించుకునేందుకు అండర్ వరల్డ్ డాన్స్.. ఇది వరకు చూడని పోరాట సన్నివేశాలను మన ముందుకు తీసుకొస్తుంది సాహో. ఈ రెండు నిమిషాల 46 సెకన్లలోనే ఈ రేంజ్లో చూపించాము.. ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించుకోండి అనేట్టుగా ట్రైలర్‌ను కట్‌చేశారు. అశోక్ చక్రవర్తి అనే క్యారెక్టర్లో ప్రభాస్.. క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో అమృతా నాయర్‌గా శ్రద్దా నటిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్నీ ఉన్నాయని తెలిసేట్టుగా ట్రైలర్‌ను డిజైన్ చేసి రిలీజ్ చేశారు. జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, మందిరా బేడీ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘సాహో’ ట్రైలర్ వచ్చేస్తోంది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో. అంతర్జాతీయ స్థాయి పోరాట సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్దాకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న సాహో ఈ నెల 30 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్లతో పాటు పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్లను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. భారీ అంచనాలున్న సాహో ట్రైలర్‌ను ఆగస్టు 10న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పటికే టీజర్ ఆన్లైన్ వ్యూస్‌లో రికార్డ్ సృష్టించగా ట్రైలర్ మరిన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మందిరా బేడీ, వెన్నెల కిశోర్, మలయాళ నటుడు లాల్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. The wait is over! The biggest and most anticipated trailer of the year will be out on 10th August! 😎 #SaahoTrailer#Saaho releases worldwide on 30th August! #30AugWithSaaho pic.twitter.com/2ECUmJMvOu — UV Creations (@UV_Creations) August 8, 2019 -
ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా?
ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా? అంటూ బాలీవుడ్ నటుడు అర్జున్‌కపూర్ శ్రద్ధాకపూర్‌ని ఆటపట్టించారు. సాహో చిత్రంలోని కొన్ని ఫోటో స్టిల్స్‌ను శ్రద్ధాకపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఒక ఫోటోలో శ్రద్ధ రెడ్‌కలర్ గౌన్ ధరించి ఉండగా, అదే కలర్ ఉన్న పౌడర్ ఆమె చూట్టూ ఆవరించి ఉంది. అర్జున్ ఈ ఫోటోకే ఫన్నీగా కామెంట్ పెట్టారు. శ్రద్ద గట్టిగా తుమ్మడం వల్లే అంత దుమ్ము లేచిందని అన్నారు. సాహో సినిమా యూనిట్ రీసెంట్గా ఏ చోట నువ్వున్నా.. అనే పాటని విడుదల చేసింది. ఈ పాటను ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్లలో షూట్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోన్న శ్రద్ధా పాట చిత్రీకరణ సందర్భంగా మంచుపర్వతాల ముందు నిల్చుని కొన్ని ఫోటోలు దిగారు. వాటిని ఈ మధ్యనే సోషల్‌మీడియాలో షేర్ చేశారు. అర్జున్‌కపూర్ ఇలా హీరోయిన్స్‌ను ఆట పట్టించడం ఇదే మొదటిసారి కాదు. కత్రినాకైఫ్ బికినీ వేసుకొని పిల్లర్ పక్కన నిలబడిన ఫోటోను చూపిస్తూ. ‘ఈ అమ్మాయి ఎక్కడికిపోతోంది.. అలాగే పిల్లర్లోకి వెళ్తుందేమో జాగ్రత్త’ అని కామెంట్ చేశారు. ఈ కామెంట్‌కు స్పందించిన కత్రినా ‘నా జాగ్రత్త నేను చూసుకుంటానులే’ అని రిప్లై కూడా ఇచ్చింది. కాగా అర్జున్, శ్రద్ధాలు హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్ చిత్రంలో కలసి నటించారు. -
పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది
‘‘ఇలాంటి భారీ సినిమాకి అవకాశం రావడం గ్రేట్. పాటల్లోని పదాలు సందర్భానికి తగ్గట్టుగా ఉంటాయి. కమర్షియాల్టీ కోసం పాట రాయలేదు. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని పాటల రచయిత కృష్ణకాంత్ అన్నారు. ‘ఏ చోట నువ్వున్నా.. ఊపిరిలా నేనుంటా, వెంటాడే ఏకాంతం.. లేనట్టే నీకింక, వెన్నంటే నీవుంటే.. నాకేమైనా బావుంటా, దూరాల దారుల్లో.. నీ వెంట నేనుంటా....’ అంటూ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌తో యూరప్‌లోని అందమైన మంచుకొండల్లో ఆడిపాడారు ప్రభాస్. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సాహో’. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. కృష్ణకాంత్ సాహిత్యం అందించగా గురు రాంధ్వా స్వరాలు సమకూర్చిన ‘ఏచోట నువ్వున్నా...’ అనే పూర్తి నిడివిగల వీడియో పాటను హైదరాబాద్‌లో విడుదల చేసి, ప్రదర్శించారు. ఈ సందర్భంగా సుజిత్ మాట్లాడారు... ► నా తొలి సినిమా ‘రన్ రాజా రన్’ వచ్చి గురువారంతో ఐదేళ్లు అయింది. నా రెండో సినిమా ‘సాహో’. తొలి, ద్వితీయ సినిమాకి చాలా టైమ్ పట్టింది. ఈ సమయంలో వేరే సినిమా చేసి ఉండొచ్చు కదా? అని అడుగుతున్నారు. భవిష్యత్ అనేది మన చేతుల్లో ఉండదు. ప్రభాస్‌గారు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఆయనంటే చాలా ఇష్టం. అందుకే ఇన్ని రోజులు వేచి చూశానేమో. ఇన్నేళ్ల నిరీక్షణలో నేను చాలా నేర్చుకున్నా. ఒక్క ‘సాహో’కే పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది. ► ‘బాహుబలి’కంటే ముందే ‘సాహో’ కథ చెప్పాను. అయితే ‘బాహుబలి’ విడుదల తర్వాత ప్రభాస్‌గారి స్టార్డమ్, మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని ‘సాహో’ కథలో మార్పులు చేయలేదు. యాక్షన్ సీక్వెన్స్ మరింత బెటర్‌గా ఉండేలా చూసుకున్నా. ‘బాహుబలి’ని దాటాలనుకోలేదు. దాని ప్రభావం నాపై లేదు. మా సినిమాని ‘బాహుబలి’తో పోల్చకూడదు. ► నా రెండో సినిమానే ప్రభాస్‌గారితో చేయడం సంతోషం. ఆయనతో పని చేస్తున్నప్పుడు ఓ స్టార్ హీరోతో చేస్తున్నాననే భావన కలగలేదు. అంత సరదాగా షూటింగ్ జరిగింది. ఈ నెల 15న సినిమా విడుదల చేయాల్సి ఉంది. అయితే హైస్టాండర్డ్ వీఎఫ్ఎక్స్ వల్ల ఆలస్యమైంది. వినాయక చవితి పండగ సమయంలో ఈ 30న సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ► ఫారిన్లో షూటింగ్ పర్మిషన్స్ కోసం కొంచెం ఎక్కువ సమయం పట్టింది. అయితే చిత్రీకరణ సాఫీగా సాగింది. షూటింగ్ ఆలస్యం అయిందని అందరూ అంటున్నారు. బడ్జెట్ తగ్గించాలనుకుని ముందుగానే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. అందుకే కొంచెం ఆలస్యం అయింది. షూటింగ్ స్టార్ట్ చేశాక ఎక్కడా ఆలస్యం కాలేదు. ‘బాహుబలి 2’ చిత్రంతోపాటు ‘సాహో’ టీజర్ రిలీజ్ చేశాం. అయితే అప్పటికి షూటింగ్ కూడా మొదలు పెట్టలేదు. ఆ తర్వాతే మొదలైంది. ► ‘సాహో’లో లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. మూడు నాలుగు పాటలుంటాయి. అవి కథను ఎక్కడా డిస్టర్బ్ చేయవు. ముందుగా ఒకే సంగీత దర్శకుడితోనే పాటలన్నీ చేయించాలనుకున్నాం. అయితే ఒక్కో పాటకు ఒక్కరు చేయాల్సి వచ్చింది.. దానివల్ల బెస్ట్ వర్క్ వచ్చింది. నేపథ్యసంగీతం ఇద్దరు ముగ్గురు చేస్తే బాగుండదు కానీ, ఒక్కో పాటను ఒక్కరు చేయడం వల్ల నష్టం ఏమీ లేదు. ► ‘బాహుబలి’ తర్వాత ఇమేజ్‌కి తగ్గ సినిమా చేయాలని ప్రభాస్‌గారు కానీ, నేను కానీ అనుకోలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనో, బాలీవుడ్ సినిమాతో మ్యాచ్ చేయాలనో తీయలేదు. ప్రేక్షకులకు కొత్తగా ఏం చూపిద్దాం అనుకుని స్టార్ట్ చేశాం. మేం అనుకున్న దాన్ని రీచ్ అయ్యాం. దర్శకులు రాజమౌళి, శంకర్గార్లతో నన్ను పోల్చకూడదు. శంకర్‌గారి సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి. ‘సాహో’ సినిమాలో ఆయన రేంజ్లో ఓ పాట ఉండేలా ట్రే చేశా. -
సాహో: శ్రద్ధాకి కూడా భారీగానే!
ఇప్పటికే దేశవ్యాప్తంగా సాహో ఫీవర్ మొదలైంది. ఈ నెలాఖరున ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను రూ. 300 కోట్లకుపైగా బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా నటీనటులకు భారీ పారితోషికం ముట్టజెపుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో షేర్ రూపంలో ప్రభాస్‌కు రూ. 100 కోట్లకు పైగా పారితోషికం అందనుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు కూడా భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు గానూ శ్రద్ధా రూ. 7కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ సినిమాలకు కూడా రెండు మూడు కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే అందుకునే శ్రద్ధాకు సాహో టీం భారీ ఆఫర్ ఇచ్చి హీరోయిన్గా తీసుకున్నారట. ఈ సినిమా సక్సెస్ అయితే బాలీవుడ్లో కూడా తన క్రేజ్ డబుల్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు శ్రద్ధా. యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సాహో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడీలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
సాహో: ది గేమ్
పోస్టర్, టీజర్లు చూస్తుంటే ‘సాహో’లో ప్రభాస్ చేసే యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయని అర్థమవుతోంది. ఈ యాక్షన్‌ను మీరూ ఫీల్ అవ్వండి అంటూ ‘సాహో’ గేమ్‌ను తయారు చేసింది చిత్రబృందం. రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది టీమ్. ‘సాహో: ది గేమ్’ పేరుతో ఓ గేమ్‌ను రెడీ చేస్తోంది. త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. -
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే......అని బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌తో కలిసి ప్రభాస్ ప్రేమరాగం తీశారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మించిన చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటించారు. ఈ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఒక్కో పాటకు ఒక్కో సంగీతదర్శకుడు స్వరాలందించారు. ఇటీవల ‘సైకో సయ్యా’ పాటను విడుదల చేసిన ‘సాహో’ టీమ్ తాజాగా ఈ సినిమాలోని ‘ఏ చోట నువ్వున్నా?’ పాట టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే... నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే’ అన్న లిరిక్స్ ఉన్న ఈ పాట టీజర్ శ్రోతలను అలరిస్తోంది. యూరప్‌లోని అందమైన లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. గురు రాంధ్వా సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అదించారు. హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్ ఆలపించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈ పాట టీజర్‌ను విడుదల చేశారు. ఆగస్టు 2న పూర్తి పాటను విడుదల చేయనున్నారు. ‘సాహో’ చిత్రం ఆగస్టు 30న విడుదల కానుంది. -
సాహో రెండో పాట.. డార్లింగ్‌లా ప్రభాస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో ఆగస్లు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్, సాంగ్ టీజర్లతో అలరించిన చిత్రయూనిట్ తాజాగా రెండో పాటకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. తొలి పాటగా ఓ పెప్పీ నంబర్‌ను రిలీజ్ చేసిన యూనిట్, తాజాగా ఏ చోట నువ్వున్నా అంటే సాగే రొమాంటిక్ సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో ప్రభాస్ డార్లింగ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ పాటకు గురు రణ్ధవ సంగీతమందించగా కృష్ణకాంత్ లిరిక్స్ రాశారు. హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్‌లు ఆలపించారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడీ, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘సాహో’ కొత్త యాక్షన్ పోస్టర్
ఎప్పటికప్పుడు తమ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్లను విడుదల చేస్తూ అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది ‘సాహో’ టీం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో... బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ టాలీవుడ్‌కు పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త యాక్షన్ పోస్టర్‌ను శ్రద్ధాకపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ప్రభాస్, శ్రద్ధా ఇద్దరూ తుపాకులతో ప్రత్యర్థులపై దాడి చేస్తూ కనిపిస్తున్నారు. ఇంతకు మించిన భారీ యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. అయితే ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాల కోసం చిత్ర నిర్మాణ సంస్థ భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేశ్, ఎవలీన్ శర్మ, అరుణ్ విజయ్, జాకీష్రాఫ్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తనిష్క్ బాగ్చీ, జిబ్రాన్ సంగీతం అందించారు. మొదట ఈ చిత్రాన్ని ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించినా తరువాత ఆగష్టు 30కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. pic.twitter.com/I33rExNURF — Shraddha (@ShraddhaKapoor) July 25, 2019 -
రొమాంటిక్ మూడ్‌లో ‘సాహో’
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో. బాహుబలి లాంటి బిగ్ హిట్ తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమాకావటంతో సాహో పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది యూవీ క్రియేషన్స్ సంస్థ. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా ప్రభాస్, శ్రద్ధా కపూర్లకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌తో రిలీజ్ డేట్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్. ముందుగా సాహో సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని భావించినా నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో ఆగస్టు 30న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఇవ్లిన్ శర్మ, మందిరా బేడీ, చుంకీ పాండేలతో పాటు తమిళ నటుడు అరుణ్ విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
బేడీలు వేస్తాం!
పువ్వులు పట్టుకున్న ముద్దుగుమ్మల చేతులు లాఠీలు పట్టుకున్నాయి. తమ పెర్ఫార్మెన్స్తో థియేటర్స్‌లో ప్రేక్షకుల మనసులను లాక్ చేయాలని ఈ ముద్దుగుమ్మలు తమలోని అదర్ సైడ్‌ని చూపించడానికి రెడీ అయిపోయారు. సీరియస్ అండ్ సిన్సియర్ పోలీసాఫీసర్లుగా కనిపించి, విలన్లను రప్ఫాడించడానికి సిద్ధమైన ఆ హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. ‘నిశ్శబ్దం’ చిత్రం కోసం ఆమెరికా పోలీసాఫీసర్ అవతారం ఎత్తారు అంజలి. ఈ గెటప్‌లో సెట్ కావాలని దాదాపు ఎనిమిది కిలోల బరువు కూడా తగ్గారామె. ఇటీవల ఈ సినిమాలో అంజలి పాత్ర చిత్రీకరణ మొదలైంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క, మాధవన్, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇక ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో గ్లామరస్‌గా రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్ ఇటీవల పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పాయల్ రాజ్‌పుత్, రాయ్ లక్ష్మి, రేవతి, జ్యోతిక అటు చెన్నైకి వెళితే హీరోయిన్లు జ్యోతిక అండ్ రేవతి ఇద్దరూ కలిసి ఒకే పోలీస్‌స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నారు. వీరిద్దరి డ్యూటీ ‘జాక్‌పాట్’ అనే తమిళం సినిమా కోసం. ఈ సినిమాకు కల్యాణ్ దర్శకత్వం వహించారు. తమిళంలో మరో భామ పోలీస్‌గా కనిపించబోతున్నారు. ఆమె ఎవరో కాదు.. నటి, డాటరాఫ్ శరత్‌కుమార్. ఓ డాగ్‌ని వెంటపెట్టుకుని పోలీసాఫీర్‌గా ఓ కేసును దర్యాప్తు చేస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఆమె ఇన్విస్టిగేషన్ రిపోర్ట్‌ను ‘డానీ’ సినిమాలో చూడాలి. ఈ కేసును సంతానమూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగులో పలు చిత్రాల్లో గ్లామరస్ హీరోయిన్గా కనిపించిన రాయ్ లక్ష్మి ఇప్పుడు కన్నడంలో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ఓ సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆమె స్కెచ్ హీరో సుదీప్ కోసమే. పోలీస్‌గా ఆమె వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ‘కోటిగొబ్బ 3’ సినిమాలో తెలుస్తుంది. మొన్నామధ్య ఫైటింగ్, ఫైరింగ్ గట్రా నేర్చుకున్నారు హీరోయిన్ రాయ్‌లక్ష్మీ. ఇంత కష్టపడింది ఆమె కన్నడ చిత్రం ‘ఝాన్సీ’లో పోలీస్ గెటప్ వేయడం కోసమే. పీవీఆర్ గురుప్రసాద్ ఈ చిత్రానికి డైరెక్టర్. సౌత్‌లోనే కాదు.. బాలీవుడ్ భామలు కొందరు పోలీస్‌సైరన్ మోగిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమాతో సౌత్‌కు పరిచయం అవుతున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్. ఈ సినిమాలో శ్రద్ధాది పోలీస్ పాత్రే అని ఆల్రెడీ విడుదలైన ‘సాహో’ టీజర్ చెబుతోంది. ‘అంగ్రేజీ మీడియం’ సినిమా కోసం గన్ పట్టుకున్నారు కరీనా కపూర్. ఈ సినిమాకు హోమి అడ్జానియా దర్శకుడు. ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ముంబైలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని మళ్లీ శివానీ శివాజీ రాయ్‌గా డ్యూటీ చేస్తున్నారు రాణీ ముఖర్జీ. శివాజీ రాయ్ అనగానే ‘మర్దానీ’ చిత్రం గుర్తుకు వచ్చే ఉంటుంది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సినిమా సీక్వెల్ ‘మర్దానీ 2’లో రాణీముఖర్జీ నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌కి కథ అందించిన∙గోపీ పుత్రన్ సీక్వెల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. వరలక్ష్మి, రాణీ ముఖర్జీ, కరీనా కపూర్ -
నో కాంప్రమైజ్
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మించారు. తొలుత ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నారు. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాను పదిహేను రోజులు ఆలస్యంగా ఆగస్టు 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఇప్పటివరకు మా బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ క్వాలిటీకి కేరాఫ్‌గా నిలిచాయి. ‘సాహో’ చిత్రాన్ని కూడా అలాగే తీర్చిదిద్దుతున్నాం. ‘బాహుబలి’ వంటి సూపర్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం ఇష్టంలేదు. కొంచెం ఆలస్యమైనా బెస్ట్ క్వాలిటీతో విజువల్స్‌ని ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నాం. అందుకే ‘సాహో’ చిత్రాన్ని ఆగస్టు 30న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటించారు. -
‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?
సాక్షి, హైదరాబాద్: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సాహో’ సినిమా విడుదల వాయిదా పడింది. ఆగస్టు 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని యూవీ క్రియేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కంటెంట్, క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదన్న ఉద్దేశంతో సినిమా విడుదల వాయిదా వేసినట్టు వెల్లడించింది. పోరాట దృశ్యాలకు మరింత సమయం అవసరం కావడంతో విడుదల తేదీని ఈనెల 15 నుంచి 30కు మార్చినట్టు తెలిపింది. భారీ యాక్షన్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ అందించేందుకు పెద్ద ఎత్తున తెరకెక్కిస్తున్నట్టు వివరించింది. సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, మురళీ శర్మ, మందిరా బేడీ, వెన్నెల కిశోర్, ప్రకాశ్ బేలవాది, ఎల్విన్ శర్మ, మహేష్ మంజ్రేకర్, టినూ ఆనంద్, లాల్, శరత్ లోహితశ్వా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ‘సాహో’ ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. -
వందమందితో డిష్యూం డిష్యూం
ప్రభాస్ కటౌట్ ఆరడుగులు ఉంటుంది. ఇలాంటి బలమైన హీరోని ఎదుర్కోవాలంటే ఒకరిద్దరు విలన్లు కచ్చితంగా సరిపోరు. డజన్ల కొద్ది రౌడీలు రావాల్సిందే. ‘సాహో’ సినిమా క్లైమాక్స్‌లో ఏకంగా వందమందికి పైగా కరుడుగట్టిన రౌడీలతో ప్రభాస్ తలపడతారని తెలిసింది. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మించారు. శ్రద్ధా కపూర్ కథానాయిక. ‘సాహో’ క్లైమాక్స్‌ను దాదాపు వందమంది ఫైటర్స్‌తో చిత్రీకరించారట. ఈ సన్నివేశం కోసం అబుదాబిలో ప్రత్యేకంగా సెట్‌ను రూపొందించారు. పది ఎకరాలలో ఓ ఎడారి, అందులో పాడుబడిన భవంతిని తలపించే సెట్‌ను తయారు చేశారు. ఎడారి లుక్ పర్ఫెక్ట్గా సెట్ కావడం కోసం సెట్ మొత్తాన్ని నల్ల మట్టితో నింపారని సమాచారం. పెంగ్ జాంగ్ ఈ ఫైట్‌ని కంపోజ్ చేశారు. ఈ ఫైట్ కోసం భారీగా ఖర్చుపెట్టారట. జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, మందిరా బేడీ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మది కెమెరామేన్‌గా చేశారు. ముందు ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే వాయిదాపడిందని సమాచారం. ‘సాహో’ రిలీజ్ డేట్‌పై స్పష్టత రావాల్సి ఉంది. -
8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాహో. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్‌తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రోజుకో వార్తను వదులుతూ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. తాజాగా సాహోకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో కీలకమైన ఓ చేజ్ సీన్‌ను అబుదాబిలో భారీ ఎత్తున చిత్రీకరించారు. దాదాపు 8 నిమిషాల నిడివి ఉన్న ఈ సన్నివేశం కోసం ఏకంగా 70 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేసిన ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. బాలీవుడ్ నటులు ఇవ్లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, చుంకీ పాండేలతో పాటు మహేష్ మంజ్రేకర్, అరుణ్ విజయ్, మురళీ శర్మలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘నా కూతురు పెళ్లా.. ప్లీజ్ నన్నూ పిలవండే’
బాలీవుడ్ మీడియా గురువారం శ్రద్ధాకపూర్ పెళ్లి వార్తలతో మరోసారి బిజీగా మారింది. త్వరలోనే శ్రద్ధా కపూర్, తన బాయ్‌ఫ్రెండ్ రోషన్ శ్రేష్టను వివాహం చేసుకోబోతున్నారంటూ ఊదరగొట్టింది. అంతటితో ఊరుకోక ఈ విషయం గురించి శ్రద్ధ తండ్రి శక్తి కపూర్‌ను కూడా ప్రశ్నించింది. అయితే మీడియా అత్యుత్సాహానికి తగ్గట్టు శక్తి కపూర్ మాంచి సమాధానం ఇచ్చారు. ‘నిజంగానా.. నా కూతురు పెళ్లి చేసుకోబోతుందా.. ఎప్పుడు.. ఎక్కడా. తండ్రిగా నేను అక్కడ ఉండాలి కదా. కానీ ఈ పెళ్లి గురించి నాకేం తెలీదు. ప్లీజ్ నా కూతురు పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోకండే’ అంటూ వ్యగ్యంగా సమాధానమిచ్చారు. శ్రద్ధాకపూర్ పెళ్లి గురించి వస్తోన్న వార్తలన్ని అవాస్తవాలే అంటూ ఆయన కొట్టి పారేశారు. ముంబైకు చెందిన ఓ టాబ్లాయిడ్ ముందుగా ఈ వార్తల్ని ప్రచురించింది. శ్రద్ధా కపూర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచురించింది. దాంతో మిగతా చానెల్స్, వెబ్సైట్లు కూడా ఈ వార్తల్ని ప్రసారం చేశాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ‘స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇక శ్రద్ధా కపూర్ నటించిన సాహో చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. -
వదలను నిన్నే...మన కథ రాస్కో!!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం సాహో. బాహుబలి సక్సెస్‌తో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంతో సాహోను కూడా బహు భాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలోని తొలి పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆగడిక సైకో సయ్యారే అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్‌కు గిలిగింతలు పెడుతోంది. ప్రభాస్, శ్రద్ధ తమ స్టైలిష్ స్టెప్పులతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కాగా ఈ సినిమాకు సంగీత దర్శకులుగా ముందు శంకర్ ఇషాన్ లాయ్‌లను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సంగీత త్రయం సాహో నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. శంకర్ ఇషాన్ లాయ్‌లు తప్పుకున్న విషయాన్ని దృవీకరించిన సాహో టీం తరువాత సంగీత బాధ్యతలను తనిష్క్ బాగ్చికి అప్పగించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గిబ్చాన్ అందిస్తున్నాడు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. -
‘సైకో సయ్యా’... టీజ్ చేస్తున్న శ్రద్ధ!
అంతర్జాతీయ స్థాయి యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’. బాహుబలి వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఇప్పటికే టీజర్‌తో వావ్ అనిపించిన సాహో టీం.. తాజాగా ఓ సాంగ్ టీజర్‌ను నాలుగు(తెలుగు, తమిళ, హిందీ, మలయాళం) భాషల్లో విడుదల చేసింది. సైకో సయ్యా అంటూ సాగే ఈ పాటలో ప్రభాస్, శ్రద్ధ లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ పూర్తి పాటను జూలై 8న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. కాగా ఈ సినిమాకు సంగీత దర్శకులుగా ముందు శంకర్ ఇషాన్ లాయ్‌లను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సంగీత త్రయం సాహో నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. శంకర్ ఇషాన్ లాయ్‌లు తప్పుకున్న విషయాన్ని దృవీకరించిన సాహో టీం సంగీత బాధ్యతలు ఎవరికి అప్పగించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకుడు. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిసస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్‌లకు చెందిన ప్రముఖ నటులు నటింస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఇది అద్భుతమైన అనుభూతి : ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. వరుస అప్డేట్స్తో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా హీరో ప్రభాస్ ఆస్ట్రియాలో జరుగుతున్న షూటింగ్‌కు సంబంధించిన ఓ స్టిల్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. ‘ఆస్ట్రియాలోని ఇన్స్బ్రక్, టిరోల్ ప్రాంతంలో షూటింగ్.. గతంలో ఎన్నడూ లేని ఓ అద్భుతమైన అనుభూతి’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రభాస్, శ్రద్ధాకపూర్‌లపై చిత్రీకరిస్తున్న ఈ పాటకు వైభవీ మర్చంట్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ అప్డేట్స్ను తెలియజేస్తూ చిత్ర నిర్మాణం సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాతో మురళీ శర్మ, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాప్, చుంకీ పాండే, మందిరా బేడీ, అరుణ్ విజయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. View this post on Instagram Hi Darlings ! Shooting in Innsbruck and Tirol region of Austria, was one of the most incredibly awesome experiences I have ever had... @shraddhakapoor @vaibhavi.merchant #myinnsbruck #cineTirol #robinville #gaislachkogelbahn #topoftyrol #kühtai #nordkette #redbullhangar7 #FISA #locationaustria #uvcreationsoffical #saaho #saahoinaustria #saahointirol A post shared by Prabhas (@actorprabhas) on Jul 2, 2019 at 5:00am PDT The shooting locations in Austria were the most spectacular ones where we managed to capture some breathtaking shots for #Saaho. Thanks to @InnsbruckTVB and our service providers @Robin_Ville#Prabhas @ShraddhaKapoor @sujeethsign @UV_Creations #myinnsbruck #cineTirol #robinville pic.twitter.com/NsI2dtuuh5 — UV Creations (@UV_Creations) 2 July 2019