సినిమాలో చూసి ఎంజాయ్‌ చేయడమే : విజయ్‌ | Vijay Devarakonda Best Wishes To Street Dancer 3D Team | Sakshi
Sakshi News home page

సినిమాలో చూసి ఎంజాయ్‌ చేయడమే : విజయ్‌

Published Thu, Dec 19 2019 4:32 PM | Last Updated on Thu, Dec 19 2019 4:56 PM

Vijay Devarakonda Best Wishes To Street Dancer 3D Team - Sakshi

వరుణ్‌ ధావన్‌, శ్రద్ధ కపూర్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘స్ట్రీట్‌ డ్యాన్సర్ 3డీ‌’. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా దర్శకత్వం వహించిన చిత్రంలో నోరా ఫతేహి, ప్రభుదేవా కీలక పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో డ్యాన్స్‌లు ఆదరగొట్టేలా ఉన్నాయని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.  

తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌పై సన్సేషన్‌ స్టార్‌ విజయ దేవరకొండ ట్విటర్‌లో షేర్‌ చేశారు. వరుణ్‌, శ్రద్ధ, రెమో, ప్రభుదేవాలకు బెస్ట్‌ విషెస్‌ చెప్పారు. ‘నా జీవితంలో ఇది నేను చేయలేను.. సినిమాలో చూసి ఎంజాయ్‌ చేయటమే’ అని విజయ్‌ పేర్కొన్నారు. రెమో గతంలో దర్శకత్వం వహించిన ఏబీసీడీ, ఏబీసీడీ2 లను మించిపోయేలా ఇందులో డ్యాన్స్‌ బీట్స్‌ ఉన్నాయి. కాగా, ఈ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement