Prabhu Deva
-
ప్రభుదేవా కన్సర్ట్.. కనీస గౌరవం లేదు, వివక్ష చూపిస్తున్నారు: నటి
నటి సృష్టి డాంగే (Srusti Dange)కు చేదు అనుభవం ఎదురైంది. ప్రభుదేవా నాట్య కచేరి (Prabhu Deva’s VIBE – LIVE IN DANCE CONCERT)లో తనకు సరైన గౌరవం, ప్రాధాన్యత దక్కలేదని వాపోయింది. ఆ వివక్షను భరించలేక లైవ్ షోకు రావాలనుకున్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చసింది.ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో.. అయినా..ప్రభుదేవా లైవ్ షోకు నేను వస్తానని ఎదురుచూస్తున్న అందరికీ ఓ విషయం చెప్పాలి. ఆ షోకు నేను రావడం లేదని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాను. ఈ నిర్ణయానికి, ప్రభుదేవా సర్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటికీ, ఎప్పటికీ నేను ఆయనకు పెద్ద అభిమానినే. కాకపోతే ఆ షో నిర్వాహకులు చూపించే వివక్షను నేను భరించలేను. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ నాకు దక్కాల్సిన వాటికోసం నేను ఇప్పటికీ పోరాడాల్సి వస్తోంది. క్షమాపణలు చెప్పట్లేదు..ఇచ్చిన మాటపై నిలబడకపోవడం, అబద్ధపు హామీలివ్వడం నిజంగా విచారకరం. అందుకే కన్సర్ట్కు రాకూడదని ఫిక్సయ్యాను. నేను మీ అందరినీ క్షమించమని అడగడం లేదు. ఎందుకు షోకు హాజరవడం లేదో కారణం చెప్పాలనుకున్నాను. కుదిరితే మరోసారి మంచి వాతావరణంలో, సముచిత గౌరవం దక్కే ప్రదేశంలో మిమ్మల్ని కలుస్తాను.ఎంతో ఆశగా ఎదురుచూశా.. చివరకు!ఈ షో నిర్వాహకులకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. క్రియేటివ్ టీమ్.. ఆర్టిస్టులను గౌరవిస్తే బాగుంటుంది. ఈ ప్రాజెక్టు గురించి ఎంతో ఆశగా ఎదురుచూశాను. దురదృష్టవశాత్తూ దానికి దూరంగా ఉండక తప్పడం లేదు అని రాసుకొచ్చింది. దీనిపై ప్రభుదేవా టీమ్ స్పందించాల్సి ఉంది. ప్రభుదేవా నాట్యకచేరి ఫిబ్రవరి 22న చెన్నైలో జరగనుంది. ఇక సృష్టి డాంగే తమిళంలో పలు సినిమాలు చేసింది. తెలుగులో ఏప్రిల్ ఫూల్, ఓయ్ నిన్నే, చంద్రముఖి 2 చిత్రాల్లో మెరిసింది. View this post on Instagram A post shared by S r u s h t i i D a n g e 🦋💫 (@srushtidangeoffl) చదవండి: ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ -
ప్రాణం లేని మనిషి ఈ సినిమా హీరో
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం జాలీ ఓ జిమ్ఖానా(Jolly O Gymkhana) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.కదలని బొమ్మ చిత్రమైతే, కదిలే బొమ్మ ఓ విచిత్రం. అటువంటి విచిత్రానికి వినోదం తోడైతే అదే మనం చూసే సినిమా. సినిమాలలో దర్శకుడు తన కాల్పనిక ధోరణితో ఓ కథను అనుకొని ఆ కథకు అనుగుణంగా పాత్రలను సృష్టించి ఆ పాత్రలచే ప్రేక్షకులకు విచిత్ర వినోదాన్ని అందిస్తాడు. ప్రస్తుతం వచ్చే సినిమాలలో ఔరా అని అబ్బురపరిచే సినిమాలనుండి అయ్యో అనే సినిమాల వరకూ పుష్కలంగా ఉన్నాయి. సన్ నెక్ట్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘జాలీ ఓ జిమ్ఖానా’(Jolly O Gymkhana) సినిమా ఔరా అనిపించే ఓ అద్భుతమని చెప్పాలి. ఈ సినిమాకి శక్తి చిదంబరం దర్శకత్వం వహించారు.ప్రముఖ కథానాయకుడు, కొరియోగ్రాఫర్ అలాగే దర్శకుడు అయిన ప్రభుదేవా(Prabhu Deva) ఈ సినిమాలోని ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇక అంతలా ఏముంది ఈ సినిమాలో... ఓసారి కథ గురించి చెప్పుకుందాం. భవానీ అనే అమ్మాయి తను చేసిన ఓ తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన కథ చెప్పుకోడానికి ఓ చర్చిలోని ఫాదర్ దగ్గరకు రావడంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. తంగసామి తన కూతురు చెల్లమ్మ, మనవరాళ్ళైన భవానీ, శివానీ, యాజినీతో ఓ హోటల్ నడుపుతుంటాడు. తెన్ కాశీకి చెందిన రాజకీయవేత్త అడైక్కళరాజ్తో హోటల్లో జరిగిన ఓ ఘర్షణ వల్ల తంగసామి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవుతాడు.తంగసామి ఆపరేషన్ కోసం దాదాపు రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుందని భవానీ అక్కచెల్లెళ్లకు చెబుతాడు డాక్టర్. అనూహ్యంగా ఆ డబ్బు భవానీ అకౌంట్లో డిపాజిట్ అయి, ఆపరేషన్ ఏ అవరోధం లేకుండా జరిగిపోతుంది. కానీ ఆ డబ్బు కోసం ఓ గ్యాంగ్ వీళ్ల వెంటపడి వేధిస్తూ ఉంటుంది. మరో పక్క ఇదే అడైక్కళరాజ్ ఓ కేస్ విషయమై న్యాయవాది పూన్గుండ్రన్తో పెద్ద విరోధం పెట్టుకొని ఉంటాడు. ఇంకో పక్క ఈ విషయం తెలిసిన తంగసామి హోటల్ విషయమై పూన్గుండ్రన్ని కలవమని భవానీ వాళ్లకి చెప్తాడు. భవానీ వాళ్ళు న్యాయవాదిని కలిసే సమయంలో అతను చనిపోయి ఓ హోటల్ గదిలో పడి ఉంటాడు. ప్రపంచానికి మాత్రం పూన్‌గుండ్రన్ బ్రతికే ఉన్న విషయం తెలుస్తుంది. మరి ఆడవాళ్ళైన భవానీ అక్కచెల్లెళ్ళు న్యాయవాది శవంతో తమ సమస్యను ఎలా పరిష్కరించుకున్నారన్నదే ఈ ‘జాలీ ఓ జిమ్ఖానా’ సినిమా. ఈ సినిమా ప్రారంభం నుండే సరదా సరదాగా సాగిపోతుంది. అనూహ్యమైన మలుపులకు చక్కటి వినోదం మేళవించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు దర్శకుడు. నాటి ఆడవాళ్లకు మాత్రమే సినిమాలోని అప్పటి నటుడు నగేశ్ నటించిన ఓ సన్నివేశం ఈ సినిమా కథకి ఓ స్ఫూర్తి అని చెప్పవచ్చు. సూపర్ ఎంటర్టైనర్ ఫర్ ది కంప్లీట్ ఫ్యామిలీ. వర్త్ టు వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు డబ్బింగ్ సినిమా
కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా.. ఆ తర్వాత దర్శకుడిగా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు నటుడిగా బిజీ అయిపోయాడు. ఇతడు హీరోగా నటించిన ఓ తమిళ సినిమా.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్)ప్రభుదేవా, సన్నీ లియోన్, వేదిక హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'పెట్టా రాప్'. అక్టోబరులో తమిళంలో థియేటర్లలో రిలీజ్ కాగా.. డిజాస్టర్‌గా నిలిచింది. ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. ప్రభుదేవా, వేదిక యాక్టింగ్‌తో పాటు సన్నీలియోన్ రోల్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.'పెట్టా రాప్' విషయానికొస్తే.. బాల (ప్రభుదేవా) సినిమా యాక్టర్ కావాలనే కలతో బతుకుతుంటాడు. వందకుపైగా ఆడిషన్స్ ఇచ్చిన ఒక్క అవకాశం రాదు. ఎప్పటికీ నటుడివి కాలేవని స్నేహితులు బాలను అవమానిస్తారు. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. జానకి (వేదిక) అనే సింగర్ ద్వారా బాల జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. బాల, జానకి మధ్య ఉన్న సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక) -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఫియర్’.. వేదిక ఫస్ట్‌లుక్ రిలీజ్
వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫియర్’. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. విడుదలకు ముందే ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది .(చదవండి: అభిమాని చివరి కోరిక తీర్చిన తారక్)తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ని స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఒక చీకటి గదిలో హీరోయిన్ భయపడుతూ చూస్తున్న స్టిల్ తో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన "ఫియర్" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. -
విజయ్ ‘ది గోట్’ మూవీ HD స్టిల్స్
-
ప్రభుదేవా ఇంట్లో విషాదం.. హుటాహుటిన ప్రయాణం
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రభుదేవా అమ్మమ్మ 'పుట్టమ్మన్ని' (97) అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆయన వెంటనే మైసూరు చేరుకున్నారు. కర్నాటకలోని మైసూర్లో జన్మించిన ప్రభుదేవా చైన్నైలో నివాసం ఉంటున్నారు.ప్రభుదేవా అమ్మమ్మ మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మైసూర్‌లోని మందకల్లి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తన సొంత గ్రామం 'తొరు' చేరుకున్నారు. నేడు జరిగిన ఈ అంత్యక్రియల్లో ప్రభుదేవా తమ్ముళ్ళు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్‌లు కూడా పాల్గొన్నారు. పుట్టమ్మన్ని మరణంతో ప్రభుదేవా కుటుంబంలో విషాదం నెలకొంది. -
Maharagni Teaser: యాక్షన్‌తో అదరగొట్టిన కాజోల్
జాతర సందడిగా జరుగుతోంది. అమ్మవారి తల్లి సాక్షిగా కొందర్ని రఫ్ఫాడించింది ఆ మహిళ. అమ్మవారిలా ఆమె ఉగ్రరూపం దాల్చిన తీరుకి ఎదుట ఉన్నది ఎవరైనా వణికి΄ోవాల్సిందే. ఆ మహిళ పాత్రలో కాజోల్ చేసిన ఫైట్‌తో విడుదలైంది ‘మహారాగ్ని’ చిత్రం టీజర్. ఇంకా ఈ టీజర్లో ప్రభుదేవా ఫైట్ చేస్తూ, ఏదో పగతో ఉన్నట్లు సంయుక్తా మీనన్, సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఓ రోల్లో కనిపించారు. కాజోల్, ప్రభుదేవా లీడ్ రోల్స్‌లో నసీరుద్దీన్ షా, సంయుక్తా మీనన్, జిషు సేన్ గు΄్తా, ఆదిత్యా సీల్ ఇతర పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ‘మహారాగ్ని’ టైటిల్ ఖరారు చేశారు. ‘క్వీన్ ఆఫ్ క్వీన్స్’ (రాణులకే రాణి) అనేది ట్యాగ్‌లైన్. ఈ టైటిల్, ట్యాగ్‌లైన్ కాజోల్ పాత్రను ఉద్దేశించి పెట్టి ఉంటారని ఊహించవచ్చు. నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో వెంకట అనీష్ దొరిగిల్లు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ టీజర్‌ని మంగళవారం విడుదల చేశారు. ‘‘భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మహారాగ్ని’. షారుక్ ఖాన్ ‘జవాన్’ చిత్రానికి పని చేసిన జీకే విష్ణు మా సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి వెన్నెముక. ఆయన మంచి సంగీతం, అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అని యూనిట్ పేర్కొంది. -
టాలీవుడ్లో నిర్మాత.. బాలీవుడ్‌లోకి డైరెక్టర్‌గా ఎంట్రీ
తెలుగులో సినిమాలు నిర్మించిన చరణ్ తేజ్ ఉప్పలపాటి ఇప్పుడు హిందీలో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఓ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌ని తీస్తున్నారు. కాజోల్, ప్రభుదేవా లీడ్ రోల్స్ చేస్తున్నారు. నసీరుద్దీన్ షా, సంయుక్త మేనన్, జిషు సేన్ గుప్తా తదితరలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. చరణ్ తేజ్ తెలుగులో 'స్పై', 'మళ్లీ మొదలైంది' సినిమాలని నిర్మించారు. ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు.(ఇదీ చదవండి: స్క్రీన్‌పై సమంతతో రొమాంటిక్ సీన్స్.. చైతూ రియాక్షన్ ఏంటంటే?)ప్రభుదేవా, కాజోల్.. 27 సంవత్సరాల క్రితం 'మెరుపు కలలు' సినిమా చేశారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అప్డేట్ వదిలారు. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తయిందని, త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. 'జవాన్' సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు, 'యానిమల్' ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తదితరలు వర్క్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' పునర్నవి ప్రేమలో పడిందా? మరి ఆ కుర్రాడెవరు?) -
ఆనందం.. ఉద్వేగం...
30న హైదరాబాద్‌లో ‘కన్నప్ప’ టీజర్... శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్ రోల్లో ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాన్స్ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ ప్రీమియర్ టీజర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విష్ణు మంచు, మోహన్‌బాబు, ప్రభుదేవా పాల్గొన్నారు. ‘‘కన్నప్ప’ టీజర్‌ను కాన్స్‌లో చూపించాం. అందరూ ప్రశంసించారు. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ‘కన్నప్ప’ టీజర్ చూసి ముగ్దులయ్యారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్ ‘కన్నప్ప’ టీజర్‌ను ప్రదర్శించనున్నాం. జూన్ 13న ఈ టీజర్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విష్ణు మంచు.కాన్స్‌లో తొలిసారి... కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మక ‘పామ్ డి ఓర్’ అవార్డు సినీ పరిశ్ర మకు సుదీర్ఘకాలంగా సేవలు అందించినవారికి ఇస్తుంటారు. ఈ ఏడాది 77వ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘పామ్ డి ఓర్’ అవార్డుకు మెరిల్ స్ట్రీప్, జార్జ్ లూకాస్‌లను ఎంపిక చేశారు. కాగా కాన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ స్టూడియోకు ఈ అవార్డు దక్కింది. జపాన్‌లోని యానిమేటెడ్ స్టూడియో ‘ఘిబ్లీ’కి ఫామ్ డి ఓర్ అవార్డును ప్రదానం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ స్టూడియో యానిమేషన్ రంగంలో ఉంది. ఇక హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ ఆల్రెడీ ఈ అవార్డు స్వీకరించారు. హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ లూకాస్ చిత్రోత్సవాల చివరి రోజున ఈ అవార్డు అందుకోనున్నారు.కన్నీళ్లు పెట్టుకున్న కెవిన్... కెవిన్ కాస్ట్నర్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’. అమెరికన్ సివిల్ వార్‌కు ముందు ఉన్న పరిస్థితులు, వార్ తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మూడు చాప్టర్స్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. తొలి చాప్టర్ ‘హరిజన్: యాన్ అమెరికన్ సాగ’ను కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రీమియర్‌గా ప్రదర్శించగా, మంచి స్పందన లభించింది. దాదాపు పది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కడంతో కెవిన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా నిర్మాణానికి 35 ఏళ్లుగా కెవిన్ కష్టపడుతున్నారని హాలీవుడ్ టాక్. ట్రంప్ బయోపిక్... అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ జీవితం ఆధారంగా ‘ది అప్రెంటిస్’ సినిమా తీశారు దర్శకుడు అలీ అబ్బాసి. ఈ సినిమాను తొలిసారిగా కాన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించగా, స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. సెబాస్టియన్ స్టాన్ ఈ చిత్రంలో డోనాల్డ్ ట్రంప్ పాత్రపోషించారు. ఫిల్మ్ మేకర్స్ పొలిటికల్ మూవీస్ మరిన్ని చేయాలని కాన్స్ వేదికగా అలీ అబ్బాసి పేర్కొన్నారు. శునకం సందడి... లాటిటియా డెస్చ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డాగ్ ఆన్ ట్రయిల్’. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ కుక్క కొంతమందిని కరుస్తుంది. అప్పుడు ఆ శునకాన్ని ఓ లాయర్ ఏ విధంగా కోర్టు కేసు నుంచి రక్షించారు? అన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. లాటిటియాతో పాటు ఈ సినిమాలో నటించిన శునకం చిత్రోత్సవాలకు హాజరైంది.కాన్స్‌లో భారతీయం... కాన్స్‌లో ఈ ఏడాది మన దేశీ తారలు ఐశ్వర్యా రాయ్, ఊర్వశీ రౌతేలా, కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ వంటి వారు సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదితీ రావ్ హైదరి ఈ చిత్రోత్సవాల్లో సందడి చేయడానికి ఫ్రాన్స్ వెళ్లారు. ఇక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు 35 ఏళ్ల తర్వాత పామ్ డి ఓర్ విభాగంలో పోటికి భారతీయ చిత్రం ‘అల్ వీ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ నిలిచిన సంగతి తెలిసిందే.భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కపాడియా ఫ్రాన్స్‌లోనే ఉన్నారు. అలాగే ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫిల్మ్‌మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ చిత్రం ఉంది. ఈ చిత్రంలో నటించిన సహానా గోస్వామి,సంజయ్ బిష్ణోయ్‌లతో పాటు సంధ్యా సూరి ఫ్రాన్స్ చేరుకున్నారు. -
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' నుంచి విజయ్ చివరి సాంగ్ విడుదల
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో జేజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 5న విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమా తర్వాత 'దళపతి 69' ప్రాజెక్ట్ మాత్రమే చేయనున్నాడు. 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రంలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తే.. తాజాగా విడుదలైన పాటను విజయ్‌తో పాటు వెంకట్ ప్రభు పాడటం జరిగింది. ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. పలు సినిమాల్లో విజయ్ పాటలు పాడుతూ ఉంటాడు. ఇప్పటివరకు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, హరీష్ జయరాజ్, అనిరుధ్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడగా అవన్నీ ప్రేక్షకాదరణ పొందాయి కూడా! తాజాగా యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రం కోసం చివరగా విజయ్ ఒక పాటను పాడడం విశేషం. కొన్నిరోజుల పాటు తమిళనాట ఈ సాంగ్ ఒక ఊపు ఊపేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
25 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో రిపీట్
-
25 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో రిపీట్
తమిళసినిమా: కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఆసక్తిని క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ నటుడు, నృత్యదర్శకుడు ప్రభుదేవా, ఆస్కార్ నాయకుడు ఏఆర్.రెహ్మాన్‌లది. ఇంతకుముందు 1990 ప్రాంతంలో వీరి కాంబినేషన్లో కాదలన్, మిస్టర్ రోమియో, లవ్‌బర్డ్స్ చిత్రాలు రూపొందాయి. కాగా ప్రభుదేవా, ఏఆర్.రెహమాన్ కలిసి చివరిగా 1997లో మిన్సార కనవు చిత్రం చేశారు. ఇప్పుడు అంటే 25 ఏళ్ల తరువాత ఈ క్రేజీ కాంబోలో చిత్రం రూపొందబోతోందన్నది తాజా సమాచారం. బిహైండ్ వుడ్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ఈ క్రేజీ కాంబోలో చిత్రాన్ని నిర్మించనుంది. దీని గురించి శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దీనికి ఈ సంస్థ వ్యస్థాపకుడు మనోజ్.ఎన్ఎస్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రక్తపాతం, హింసాత్మక సంఘటనలు వంటివి ఉండవని, వైవిధ్యభరిత కథాంశంతో తెరకెక్కించనున్న ఈ చిత్రం తమిళ సినీ చరిత్రలో గుర్తిండిపోతుందని దర్శకుడు మనోజ్ పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ను మే నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుదేవా హీరోగా నటించిన చివరి చిత్రం భగీరా. ప్రస్తుతం ఆయన నటుడు విజయ్ హీరోగా నటిస్తున్నది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారన్నది గమనార్హం. దీని తరువాత మనోజ్ దర్శకత్వంలో నటించనున్నారు. View this post on Instagram A post shared by Prabhudeva (@prabhudevaofficial) -
స్టార్ హీరోయిన్ బ్లాక్ బస్టర్ మూవీ.. దాదాపు 30 ఏళ్ల తర్వాత!
ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన ప్రేమికుడు చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్‌కు నిర్మాతలుగా రమణ, మురళీధర్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్‌కు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, దర్శకులు ముప్పలనేని శివ, శివనాగు, శోభారాణి పాల్గొన్నారు. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముప్పలనేని శివ మాట్లాడుతూ.. '30 ఏళ్ల క్రితం వచ్చిన ప్రేమికుడు ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ప్రభుదేవని చూసి స్ప్రింగ్‌లు ఏమన్నా మింగాడా అనుకునేవాళ్లం. ఒక మంచి ప్రేమ కథగా సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరితోపాటు ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా' అని అన్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..' ఈ సినిమా రీ రిలీజ్ కూడా మంచి విజయం అందుకుంటుంది. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవ నటన, డాన్సులు నగ్మ అందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మా సోదరి సుధారాణికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు శివనాగుమాట్లాడుతూ.. 'ప్రేమికుడు ఈ తరంలో వచ్చుంటే కచ్చితంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించేంది. అప్పుడున్న బడ్జెట్‌కి రూ.3 కోట్లతో చేసిన సినిమా ఇప్పుడు కూడా రూ.30 కోట్లు సాధిస్తుందని ఆశిస్తున్నా. ఎస్పీ బాలసుబ్రమణ్యం నటన అద్భుతంగా ఉంటుంది. ప్రభుదేవా డాన్సులు ఈ సినిమాకి హైలెట్. రీ రిలీజ్ కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించగా.. కేటి కుంజుమన్ నిర్మించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
23 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్.. ఏ సినిమా కోసమంటే?
హీరోహీరోయిన్ కావొచ్చు.. హీరో-కమెడియన్ కావొచ్చు.. కొన్ని కాంబోలు సూపర్ హిట్ అవుతుంటాయి. అలా 'ప్రేమికుడు'(కాదలన్)లో ప్రభుదేవా, వడివేలుల కాంబో కేక పుట్టించింది. దీని తర్వాత 'మనదై తిరుడి విట్టాయ్'లోనూ కలిసి నటించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత ఎందుకో ఈ జోడీ సెట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు 23 ఏళ్ల తరువాత ఈ కాంబో తిరిగి ఓ మూవీలో కనిపించనుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) వరుత్త పడాద వాలిభర్ సంఘం, రజనీ మురుగన్ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు పొన్రామ్ కొత్తగా ఓ చిత్రం చేస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. దీనికి 'లైఫ్ ఈజ్ బ్యూటిపుల్' అనే టైటిల్ నిర్ణయించారని టాక్. ఇందులోనే ప్రభుదేవా-వడివేలు కలిసి నటించబోతున్నారట. ప్రస్తుతం ప్రభుదేవా దళపతి విజయ్ 'ద గోట్' మూవీలో కీలక పాత్ర చేస్తున్నాడు. వడివేలు.. మరోసారి ఫహాద్ ఫాజిల్‌తో కలిసి నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన మరో స్టార్ హీరోయిన్) -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. స్టార్ కొరియోగ్రాఫర్ ఎంట్రీ!
టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఇటీవలే ఈ మూవీ రెండో షెడ్యూల్‌ను న్యూజిలాండ్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో ఇండియాలోని ప్రముఖ స్టార్స్ భాగం కానున్నారు. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా కన్నప్ప కోసం పని చేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియెగ్రాఫర్, ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభు దేవా రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ప్రభు దేవాకు కన్నప్ప టీం స్వాగతం పలికింది. ఇండియాలోనే స్టార్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా 'కన్నప్ప' సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా రేంజ్ మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రభు దేవా కొరియోగ్రఫీ ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం న్యూజిలాండ్, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లు షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మహా భారతం సీరియల్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు. #Prabhudeva joins @iVishnuManchu on #Kannappa shoot in #NewZealand pic.twitter.com/StgCcLO3Os — FridayWall Films (@FridayWallMag) March 4, 2024 -
Prabhu Deva: తిరుమల శ్రీవారిని దర్శించిన హీరో ప్రభుదేవా కుటుంబం (ఫోటోలు)
-
స్టార్ కొరియోగ్రాఫర్ సినిమా.. హీరోయిన్గా లియో భామ!
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కథానాయకుడిగా, దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈయన దర్శకుడుగా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ రాణించారు. అయితే ప్రస్తుతం ప్రభుదేవా నటన పైనే దృష్టి సారిస్తున్నారు. అలరించడానికి వివిధ రకాల పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. అయినప్పటికీ ఈయనకు ఇటీవల సరైన హిట్టు పడలేదన్నది వాస్తవం. కాగా తాజాగా మంచి వినోదంతో కూడిన ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జంటగా నటి మడోనా సెబాస్టియన్ నటిస్తున్నారు. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇది. ట్రాన్స్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రాజేంద్ర రాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు ప్రభుదేవా, శక్తి చిదంబరం కాంబినేషన్లో చార్లీ చాప్లిన్ 1, 2 వంటి సక్సెస్ఫుల్ చిత్రాలు వచ్చాయి. కాగా వినోదానికి ప్రాముఖ్యతను ఇచ్చే దర్శకుడు శక్తి చిదంబరం. ఈ తాజా చిత్రాన్ని అలాంటి మంచి వినోదంతో కూడిన ప్రేమ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్ర టైటిల్‌ను చిత్ర వర్గాలు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దీనికి జాలియో జింఖానా అనే టైటిల్ ఖరారు చేశారు. ఇది నటుడు విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలోని పాటలో వచ్చే పల్లవిలో పదం కావడం గమనార్హం. దీంతో ఈ చిత్ర టైటిల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రంలో యోగిబాబు, నటి యాషిక ఆనంద్, అభిరామి, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) -
సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రభుదేవా కొత్త సినిమా!
ఇంతకు ముందు ప్రభుదేవా కథానాయకుడిగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన చార్లీ చాప్లిన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రం తెలుగు, ములయాళం, కన్నడం, హిందీ భాషల్లో రీమేక్ అయ్యి హిట్ అయ్యింది. కాగా ఇదే కాంబినేషన్లో నూతన చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ప్రభుదేవా సరసన మడోనా సెబాస్టియన్ నటించగా, యాషిక ఆనంద్, అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్ లీ, వైజీ.మహేంద్రన్, ఆడుగళం నరేన్, జాన్ విజయ్, మధుసూదన్ రావ్, రోబో శంకర్, సాయి దీనా, ఎంఎస్ భాస్కర్, డాక్టర్ శివ, కల్లూరి వినోద్, కోదండం, ఆదిత్యా కదీర్, ఆదవన్, తెలుగు నటుడు రఘుబాబు, పూజిత పొన్నాడ, మరియా, అభి భార్గవన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ట్రాన్సిండియా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎం.రాజేంద్ర రాజన్ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఈయన ఇంతకు ముందు నాగేశ్ తిరిగి అరంగం చిత్రంతో పాటు ఒక మరాఠీ చిత్రాన్ని నిర్మించారు. కాగా తాజా చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ తెన్‌కాశీ, కొడైక్కానల్ పరిసర ప్రాంతాల్లోని సుందరమైన ప్రదేశాల్లో షూటింగ్‌ను నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడనటువంటి సన్నివేశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. చిత్రంలో స్క్రీన్ ప్లే, సంగీతం హైలైట్ గా ఉంటాయన్నారు. త్వరలోనే టైటిల్‌ను ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తామన్నారు. దీనికి గణేష్ చంద్ర ఛాయాగ్రహణం, అశ్విన్ వినాయక మూర్తి సంగీతాన్ని అందించారు. -
సరికొత్త వూల్ఫ్
ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో వినూ వెంకటేష్ దర్శకత్వంలో సందేశ్ నాగరాజు, ఎన్. సందేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘వూల్ఫ్’. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమా ప్రేక్షకు లను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రభుదేవా యాక్షన్ సీక్వెన్స్‌లు, అనసూయ గెటప్ కొత్తగా ఉంటాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
వూల్ఫ్ టీజర్: అనసూయ గెటప్ ఏంటి? ఇలా ఉంది!
ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వూల్ఫ్. వినూ వెంకటేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సందేశ్ నాగరాజు, సందేశ్ ఎన్ నిర్మాతలుగా, బృందా జయరామ్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రభుదేవా కెరీర్లో 60వ సినిమాగా తెరకెక్కుతోందీ చిత్రం. గురువారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వూల్ఫ్ టీజర్ చూస్తుంటే కొత్త ప్రపంచానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. అనసూయ, ప్రభుదేవాలు సరికొత్త లుక్‌లో కనిపించారు. 69 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్లో ఉంది. ప్రభుదేవా యాక్షన్ సీక్వెన్స్‌లు, అనసూయ గెటప్ ఈ సినిమా మీద మరింతగా ఆసక్తిని పెంచేస్తున్నాయి. అనసూయ గెటప్ అయితే తాంత్రికురాలిలా అనిపిస్తోంది. ఆమె లుక్ జనాలను భయపెట్టేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు వశిష్ట ఎన్ సింహా, అంజు కురియన్, రమేష్ తిలక్, లొల్లు సభా స్వామినాథన్, దీప, శ్రీ గోపిక, అవినాష్, సుజాతలు కీలక పాత్రల్లో నటించారు. అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా, అమ్రిష్ సంగీత దర్శకుడిగా, లారెన్స్ కిషోర్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ , హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. చదవండి: గతేడాది ప్రియుడితో పెళ్లి, అంతలోనే నటికి పుట్టెడు శోకం -
ప్రభుదేవా కోసం విజయ్ సేతుపతి పాట
సినిమాల్లో ఇప్పుడు హీరోలు పాడటం సర్వసాధారణం అయ్యింది. నటుడు విజయ్, ధనుష్, శింబు ఇలా చాలా మంది నటనతో పాటు పాటలను కూడా పాడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి నటుడు విజయ్‌సేతుపతి చేరారు. ఈయన నటుడిగా తమిళం దాటి తెలుగు, హిందీ తదితర భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా ఎదిగారు. పాత్రలో వైవిధ్యం ఉందనుకుంటే హీరో, విలన్ అంటూ చూడకుండా నటించేస్తున్నారు. ఇకపోతే నృత్య దర్శకుడు, నటుడు ప్రభుదేవా తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉల్ఫ్. ఇది ఈయన నటిస్తున్న 60వ చిత్రం. ఇందులో నటి అంజు కురియన్ నాయకిగా నటిస్తుండగా పుష్ప చిత్రం ఫేమ్ అనసూయ భరద్వాజ్, రాయ్ లక్ష్మీ, శ్రీగోపిక, రమేశ్ తిలక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అరుళ్విన్సెంట్ చాయాగ్రహణం, అమ్రేశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సైకిలాజికల్ సైంటిఫిక్ థ్రిల్లర్ ఇతి వృత్తంతో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రానికి సిండ్రిల్లా చిత్రం ఫేమ్ వినూ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం కోసం నటుడు విజయ్ సేతుపతి ఒక పాట పాడటం విశేషం. ఈ పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. -
కుటుంబంతో స్వామివారిని దర్శించిన ప్రభుదేవా, పాప పుట్టాక తొలిసారి..
సాక్షి, తిరుపతి: నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రభుదేవా, ఆయన భార్య హిమాని, తమ పాపతో పాటు తండ్రి సుందరం మాస్టరుతో కలిసి సాధారణ భక్తులు నిలబడే క్యూ లైనులో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. మొదటి పెళ్లి- విడాకులు కాగా ప్రభుదేవా గతంలో రమాలత్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించగా అందులో ఓ అబ్బాయి చిన్నవయసులోనే మరణించాడు. తర్వాత హీరోయిన్ నయనతారతో ప్రభుదేవా సన్నిహితంగా మెదలడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారడంతో వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. తర్వాత ప్రభుదేవా 2020లో ఫిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్‌ను పెళ్లాడాడు. గత నెలలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిందంటూ వార్తలు వచ్చాయి. 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రైన ప్రభుదేవా దీనిపై ప్రభుదేవా సైతం స్పందిస్తూ 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యానని, ఇప్పుడే జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. కొంతకాలంపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలని భావిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. అయితే తన కూతురి ఫోటోను మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడా చూపించలేదు. తాజాగా అతడు భార్యాపిల్లలతో కలిసి తిరుమలలో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ప్రభుదేవాతో సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడ్డారు. చదవండి: శివజ్యోతిని అక్కా అంటూనే ఇలాంటి కామెంట్లా? -
అవును, నేను తండ్రినయ్యా, ఇప్పటిదాకా పరిగెత్తింది చాలు: ప్రభుదేవా
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా తండ్రయ్యాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అతడి రెండో భార్య హిమానీ తొలిసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిందన్నది సదరు వార్తల సారాంశం. తాజాగా ఈ వార్తలపై ప్రభుదేవా స్పందించాడు. లేటు వయసులో మరోసారి తండ్రి అయ్యానని వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. 'అవును, నా గురించి వస్తున్న వార్తలు నిజమే! 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యాను. చాలా సంతోషంగా ఉంది. నా జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోంది. ఇప్పటికే నేను క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నాను. ఒకరకంగా చెప్పాలంటే పరిగెడుతున్నాను. అందుకే పనిభారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటిదాకా చేసింది చాలు.. ఇప్పుడు నా కుటుంబంతో కొంత సమయం గడపాలనుంటున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రభుదేవా గతంలో రమాలత్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. ఇందులో ఒక అబ్బాయి చిన్న వయసులో మరణించాడు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రభుదేవా, రమాలత్ ల మధ్య పొరపచ్చాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తాము విడిపోవడానికి హీరోయిన్ నయనతారే కారణమని ఆ మధ్య రమాలత్ మీడియా ముఖంగానే వెల్లడించింది. అనంతరం ప్రభుదేవా 2020లో ఫిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్‌ను పెళ్లాడాడు. తాజాగా ఆమె పండంటి పాపాయికి జన్మనిచ్చింది. చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి హాజరైన హీరోయిన్ -
50 ఏళ్ల వయసులో తండ్రిగా ప్రమోషన్ పొందిన ప్రభుదేవా!
ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరు గడించిన కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా మరోసారి తండ్రి అయ్యాడట! 50 ఏళ్ల వయసులో తండ్రిగా ప్రమోషన్ పొందాడంటూ ఓ వార్త కోలీవుడ్‌లో తెగ వైరలవుతోంది. ప్రభుదేవా రెండో భార్య హిమానీ ఆడపిల్లకు జన్మనిచ్చిందని, సుందరం మాస్టర్ ఇంట ఆనందాలు అంబరాన్నంటాయనేది సదరు వార్త సారాంశం. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది. భార్య ఉండగా నయన్‌తో లవ్ కాగా ప్రభుదేవా 1995లో రామలతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రభుదేవా కోసం ఆమె హిందూ మతానికి మారింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్య ఉండగానే నయనతారతో ప్రేమాయణం సాగించాడు ప్రభుదేవా. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో 2011లో విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై ఓసారి రామలత మాట్లాడుతూ.. పచ్చని సంసారంలో నయనతార నిప్పులు పోసిందని, తను కనిపిస్తే చెంప పగలగొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రహస్యంగా రెండో పెళ్లి అయితే ప్రభుదేవాకు నయనతారను పెళ్లి చేసుకోవాలన్న ఆశ కూడా అడియాసే అయింది. వీరి మధ్య కూడా భేదాభిప్రాయాలు తలెత్తడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. తర్వాత నయన్ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. ఆమె కంటే ముందే ప్రభుదేవా 2020లో ఓ యువతిని రహస్య వివాహం చేసుకున్నాడు. వెన్ను నొప్పితో బాధపడ్డ తనకు చికిత్స అందించిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ హిమానీ సింగ్ మెడలో మూడు ముళ్లు వేశాడు. ప్రభుదేవాకు రెండో భార్య బర్త్‌డే విషెస్ పెళ్లయి మూడేళ్లవుతున్నా వీరిద్దరూ బయట ఎక్కడా పెద్దగా కలిసి కనిపించలేదు. ఈ మధ్య ఓ షోలో ప్రభుదేవా 50వ పుట్టినరోజు సెలబ్రేట్ చేయగా.. హిమానీ సింగ్ విషెస్ చెప్పిన వీడియోను ప్లే చేయడంతో మురిసిపోయాడు ఈ కొరియోగ్రాఫర్. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ పాప పుట్టిందని అంటున్నారు. దీనిపై ప్రభుదేవా స్పందించాల్సి ఉంది. చదవండి: సౌత్ హీరోయిన్ అని చులకనగా చూశారు: హన్సిక -
పెట్టరాప్ సాంగ్.. ఇదే టైటిల్‌తో ప్రభుదేవా కొత్త సినిమా!
కాదలన్ చిత్రంలో పెట్టరాప్ అనే పల్లవితో సాగే పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ పాటలో నటుడు ప్రభుదేవా, వడివేలు నటించారు. కాగా అదే టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభుదేవా కథానాయకుడిగా నటించనున్నారు. దీనికి 'పాట్టు అడి.. ఆట్టం.. రిపీట్' అనే ట్యాగ్‌ను పెట్టారు. ఇందులో వేదిక హీరోయిన్గా నటించనున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈమె తమిళంలో నటిస్తున్న చిత్రమిది. ఇతర ముఖ్యపాత్రల్లో వివేక్ ప్రసన్న, భగవతి పెరుమాళ్, రమేశ్ తిలక్, రాజీవ్ పిళ్లై, కళాభవన్ షాజన్, మైమ్ గోపీ, రియాజ్‌ఖాన్ నటించనున్నారు. మలయాళ దర్శకుడు ఎస్జే.శీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బ్లూహిల్స్ ఫిలింస్ పతాకంపై జోబీ పి.శ్యామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురువారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. దీని గురించి దర్శకుడు తెలుపుతూ ఇది రొమాన్స్ కామెడీ,యాక్షన్ థ్రిల్లర్, మ్యూజికల్ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ జూన్ 15వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. చిత్రంలోని ముఖ్య సన్నివేశాలను పుదుచ్చేరి, చెన్నైలో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. కాగా దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని, జిత్తు దామోదరన్ చాయాగ్రహణం అందిస్తున్నారని చెప్పారు. చదవండి: గ్రాండ్‌గా మొదలైన శర్వానంద్ పెళ్లి వేడుకలు -
ప్రభుదేవా రెండో భార్యను ఎప్పుడైనా చూశారా? తొలిసారి కెమెరా ముందుకు..
ఇండియన్ మైఖేల్ జాన్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో వివాదాలు ఉన్నాయి. హీరోగా, డ్యాన్సర్, కొరియోగ్రఫర్‌గా, దర్శకుడిగా..ఇలా మల్టీటాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ పొందిన ప్రభుదేవా పర్సనల్ లైఫ్ మాత్రం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. భార్య ఉండగానే హీరోయిన్ నయనతారతో ప్రేమాయణం నడిపిన ప్రభుదేవాకు ఆ బంధం కూడా చేదు ఙ్ఞాపకాన్నే మిగిల్చింది. చదవండి: 'ఖుషి' మూవీ నుంచి సమంత లుక్ చూశారా? ఫోటో వైరల్ అప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలున్న ప్రభుదేవా నయనతార కోసం కుటుంబాన్ని వదిలేశాడని, పచ్చని సంసారంలో నయనతార నిప్పులు పోసిందంటూ ప్రభుదేవా మొదటి భార్య రమాలత్ బహిరంగంగానే అప్పట్లో చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో ఇప్పటికీ సంచనలమే. కట్ చేస్తే.. చాన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట ఆ తర్వాత తమ దారులు వేరంటూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. దీంతో నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకోగా,ప్రభుదేవా 2020లో హిమానీ సింగ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ వీరిద్దరూ బయట ఎక్కడా కలిసి కనిపించలేదు. అయితే ఇటీవలె ప్రభుదేవా 50వ పుట్టినరోజు సందర్భంగా అతడికి విషెస్ తెలియజేస్తూ తొలిసారి ఓ షోలో కనిపించింది హిమానీ సింగ్. చదవండి: హీరోయిన్‌తో వీడియో కాల్ మాట్లాడాలా? జస్ట్ రూ. 14వేలు చెల్లించండి 'మీరు చాలా అద్భుతమైన మనిషి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా' అంటూ భర్తను ఆకాశానికెత్తేసింది. తాజాగా వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Prabhu Deva Fans (@prabhu_deva_fans) -
ఓటీటీలో మై డియర్ భూతం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా అన్ని అన్నిరకాలుగా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు ప్రభుదేవా. ఇటీవలే ఆయన మై డియర్ భూతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఈ సినిమాను నిర్మించగా శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ దీన్ని తెలుగులో విడుదల చేశారు. జూలై 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 2న ఈ సినిమా జీ5లో ప్రసారం కానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. మరింకే.. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయిన పిల్లలు ఈ శుక్రవారం ఎంచక్కా మై డియర్ భూతం చూసేయండి.. Karkimuki is coming to your houses on the 2nd of September. Stay tuned!#MyDearBootham #MyDearBoothamOnZee5 #ZEE5 #ZEE5Tamil@PDdancing @sureshmenonnew @samyuktha_shan @actorashwanth @immancomposer @RSeanRoldan @naviin2050 @nambessan_ramya @immancomposer @uksrr @Sanlokesh pic.twitter.com/WIJFvvnbfN — ZEE5 Tamil (@ZEE5Tamil) August 28, 2022 చదవండి: ఒకే భవనంలో అపార్ట్మెంట్స్ కొన్న ఇద్దరు స్టార్ హీరోలు! విమానాశ్రయంలో ఇళయరాజా పడిగాపులు -
గాడ్ ఫాదర్‌ని కలిసిన లైగర్
ముంబైలో ‘గాడ్ ఫాదర్’ని కలిశారు ‘లైగర్’. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరిగింది. చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లపై ప్రభుదేవా కొరియోగ్రఫీలో ఓ పాటను చిత్రీకరించారు. కాగా ‘లైగర్’ ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉన్న ఈ సినిమా టీమ్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లొకేషన్‌కి వెళ్లింది. చిరంజీవి, సల్మాన్‌తో కాసేపు టైమ్ స్పెండ్ చేసింది. ఇక్కడున్న ఫొటో ఆ లొకేషన్‌కి సంబంధించినదే. ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబరులో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లైగర్’ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. -
సల్మాన్‌తో మెగాస్టార్ స్టెప్పులు.. కనువిందు ఖాయం
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పేస్తే ఎలా ఉంటుంది? ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. చిరంజీవి కూడా ఈ మాటే అంటున్నారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరు, సల్మాన్ కాంబినేషన్ లో ఈ చిత్రం కోసం ఓ పాట చిత్రీకరిస్తున్నారు. (చదవండి: కేరాఫ్ లండన్ అంటున్న టాలీవుడ్ స్టార్స్) ‘‘భాయ్ (సల్మాన్)తో కలిసి కాలు కదుపుతున్నాను. ప్రభుదేవా అద్భుతంగా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఐ ఫీస్ట్ ఖాయం’’ అని ఈ సందర్భంగా చిరంజీవి పేర్కొన్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. నయనతార కీలక పాత్ర చేస్తుండగా, దర్శకుడు పూరి జగన్నాధ్ అతిథి పాత్ర చేస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన లూసీఫర్‌కి తెలుగు రీమేక్ ఇది. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. Shaking a leg with The Bhai @BeingSalmanKhan for #GodFather @PDdancing is at his Choreographing Best!! A sure shot Eye Feast!!@jayam_mohanraja @AlwaysRamcharan@MusicThaman @SuperGoodFilms_@KonidelaPro #Nayanthara @ProducerNVP @saregamasouth pic.twitter.com/mRjXRNhaJB — Chiranjeevi Konidela (@KChiruTweets) July 29, 2022 -
అనసూయ-రెజినా ‘ఫ్లాష్ బ్యాక్’ నుంచి ఆసక్తికర అప్డేట్
రెజీనా, అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ఫ్లాష్ బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా కీ రోల్ పోషిస్తున్నాడు. డాన్ సాండీ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్లో ఏఎన్ బలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇటీవలె షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఇప్పటి వరకు పోస్ట్ ప్రాడక్షన్ పనులతో బిజీగా ఉంది. తాజాగా ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ వదిలారు మేకర్స్. ‘ఫ్లాష్ బ్యాక్’ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే సీజీ పనులు కూడా పూర్తవుతాయని మేకర్స్ తెలిపారు. చదవండి: ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ ఇక అతిత్వరలోనే మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేస్తామని ఈ నేపథ్యంలో ముందుగా ట్రైలర్ విడుదల చేస్తామన్నారు. ఇక తొందర్లోనే మూవీ విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని దర్శక-నిర్మాతలు చెప్పారు. కాగా తెలుగు తమిళంలో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. కాగా మేరకు దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో రెజినా ఆంగ్లో-ఇండియన్ టీచర్ పాత్రలో కనిపిస్తారు. అనసూయ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుదేవా పాత్ర చాలా కొత్తగా ఉండబోతుంది’ అని తెలిపారు. శామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చల్లా భాగ్యలక్ష్మీ, అనిరుధ్ శాండిల్య తెలుగులో పాటలు రాశారు. నందు తుర్లపాటి మాటలు అందించారు. -
అద్దంలో చూసుకుని ఇలా అయిపోయానేంటి అనుకునేవాడిని
హీరోగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా.. ఇలా ఎన్నో విధాలుగా ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు ప్రభుదేవా. ఇప్పుడు సరికొత్తగా ‘మై డియర్ భూతం’ అంటూ రాబోతున్నారు. అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. మై డియర్ భూతం ఈ నెల 15న విడుదలకానుంది. ఈ క్రమంలోనే ప్రభుదేవా మీడియాతో ముచ్చటించారు. ► ఇదొక భూతం సినిమా. ఈ క్యారెక్టర్ కొత్తది. ఓ రెఫరెన్స్ అంటూ ఏమీ లేదు. క్లైమాక్స్ మాత్రం హార్ట్ టచింగ్‌గా అనిపించింది. ► ఈ సినిమా కోసం గడ్డం, మీసం తీసేశాను. పిలక కూడాపెట్టుకున్నాను. నాకు ఒకలా అనిపించింది. ఐదు సెకన్ల సీన్ కోసం మీసం తీసేశాను. పిల్లలకు బాగా రీచ్ అవుతుందని అనడంతో చేసేశాను. ► ఇది తారే జమీన్ పర్ లాంటి చిత్రం. అల్లావుద్దీన్కు దీనికి సంబంధం ఉండదు. పిల్లాడి జీవితంలో భూతం ఏం చేస్తుందనేది ఈ చిత్రం. ► నేను యాక్టర్‌గా ఉన్నప్పుడు యాక్టర్‌గానే ఉండేవాడిని. దర్శకుడికి ఎలాంటి సలహాలు ఇచ్చేవాడిని కాదు. చాలా అరుదుగా సలహాలు ఇస్తుంటాను. ఆయన ఇది వరకు రెండు సినిమాలు చేశారు. ఆయన చాలా మంచి వారు. అందుకే ఈ చిత్రాన్ని చేశాను. ఈ చిత్రాన్ని 45 రోజుల్లో చేశాం. కానీ సీజీ వర్క్‌కు మాత్రం 11 నెలల సమయం పట్టింది. ► తరువాత రాబోయే చిత్రంలో ఒంటి కాలితో నటిస్తాను. కమర్షియల్‌గా చేసినా కూడా ఓ కొత్త పాయింట్ ఉండాలని అనుకుంటాను. భూతం లాంటి కొత్త పాత్ర మళ్లీ మళ్లీ వస్తుందో చెప్పలేను. ► నేను ఉన్నాను కాబట్టి ఓ పాట పెట్టారు. కరోనా తరువాత ఆ పాటను చిత్రీకరించారు. ఆ పాటను శ్రీధర్ కంపోజ్ చేశారు. చాలా గ్యాప్ రావడంతో.. కాలు కదపలేకపోయాను. వారం రోజులు రిహార్సల్స్ చేశాను. ► భూతం అనే పాత్రే కొత్తది. అది ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది? అనే రెఫరెన్స్‌లు ఉండేవి కాదు. నేనే ఊహించుకుని చేసే వాడిని. వాటిని దర్శకుడు కూడా ఓకే అనేవారు. ఇందులో నేను, ఒక అబ్బాయి, అతని తల్లి పాత్రల చుట్టే తిరుగుతుంది. నేను ఇంకా ఈ సినిమాను చూడలేదు. నేను తప్ప అందరూ చూసేశారు. నేను తెలుగుకు డబ్బింగ్ చెప్పలేదు. నా తెలుగు ఇలా ఉంటుంది (నవ్వులు). ఇక నా గెటప్ చూసి అందరూ వింతగా చూసేవారు. అందరూ నవ్వుకునే వారు. ఇంట్లో అద్దంలో నాది నేను చూసుకుని ‘ఏంట్రా ఇలా అయిపోయింద’ని అనుకునేవాడిని. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. హారర్ కాన్సెప్ట్ ఉండదు. ► చిరంజీవి గారితో ఒక సాంగ్ చేస్తున్నా మీ అందరి అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. నాకే భయంగా ఉంది. జూలై చివరి వారంలో షూటింగ్ ఉంటుంది. ► త్వరలో మళ్లీ దర్శకత్వం చేస్తాను. కానీ ఇంకా ఏది కూడా ఫిక్స్ అవ్వలేదు. తెలుగు, తమిళ్, కన్నడ ఇలా ఎక్కడైనా చేయొచ్చు. ► తమిళంలో చిత్రాలు చేస్తున్నాను. ఓ యాక్షన్ సినిమా, ఒంటికాలితో మరో చిత్రం చేస్తున్నాను. ఇంకో సినిమాలో శవంలా నటిస్తాను. సినిమా మొత్తం శవంలానే కనిపిస్తాను. ఆ శవం ఎలా చనిపోయిందనేదే కథ. చదవండి: స్టేజీపైనే యాంకర్ శ్యామలపై సీరియస్ అయిన ఆర్జీవీ డాక్టర్.. పోలీస్ అయితే..? 'ది వారియర్' సినిమా రివ్యూ.. -
నవ్వులు పూయిస్తోన్న ప్రభుదేవా ‘అబ్బాక డర్’ సాంగ్
ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మై డియర్ భూతం’. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ మూవీ జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, మాస్టర్ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. (చదవండి: షాకింగ్.. రియాపై ఎన్సీబీ చార్జిషీట్, పదేళ్లు జైలు శిక్ష తప్పదా?) తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘అబ్బాక డర్’ అంటూ సాంగే పాట నవ్వులు పూయిస్తోంది. ఇందులో ప్రభుదేవా, అశ్వంత్ చేసిన అల్లరికి అందరూ పగలబడి నవ్వాల్సిందే. ఇమ్మాన్ సంగీతాన్ని అందించగా.. ఆదిత్య సురేష్, సహన ఆలపించారు. డా. చల్లా భాగ్యలక్ష్మీ సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ చిత్రానికి తెలుగులో మాటలను నందు తుర్లపాటి అందించారు.అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. -
ఆ ఒక్క మాటతో ఫిదా చేసిన ప్రభుదేవా..
Prabbhudeva My Dear Bhootham Trailer Launch: టాప్ కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రభుదేవా ప్రేక్షకులపై మంచి ముద్ర వేసుకున్నారు. ప్రభుదేవా నటించిన మరో ప్రయోగాత్మక చిత్రం 'మై డియర్ భూతం'. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా జూలై 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హైద్రాబాద్‌లో ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుదేవా మాట్లాడుతూ.. ‘భాగ్యలక్ష్మీ పాటలు బాగా రాశారు. ఇది నాకు హోం గ్రౌండ్. నన్ను తెలుగు చిత్రపరిశ్రమే పైకి తీసుకొచ్చింది. టీం అంతా చాలా కష్టపడింది. మంచి సినిమా చేశాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మీ అందరికీ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. అనంతరం అభిమానుల కోరిక మేరకు ప్రభుదేవా స్టేజ్ మీదే స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. రైటర్ నందు తుర్లపాటి మాట్లాడుతూ .. ‘రమేష్ అన్న, బాలాజీ అన్న, మా మాస్టార్‌కు థ్యాంక్స్. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక వేళ మీరు ఈ సినిమాను చూడకపోతే ఓ నోస్టాల్జిక్ మూమెంట్‌ను మిస్ అవుతారు. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూడండి’ అని అన్నారు. చదవండి: నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ డైరెక్టర్ ఎన్. రాఘవన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలుగు అంతగా రాదు. తప్పులు మాట్లాడితే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రమేష్ పిళ్లైకు థ్యాంక్స్. ఆయనకు వేరే కథ చెప్పడానికి వెళ్లాను. కానీ ఆయన మాత్రం భూతం కథ ఉంది కదా? అది చెప్పమని అడిగారు. నేను ఈ స్క్రిప్ట్‌ను ప్రభుదేవా మాస్టర్ని దృష్టిలో పెట్టుకునే రాశాను. కానీ ఈ విషయాన్ని నిర్మాతకు చెప్పలేదు. ఆయనే స్క్రిప్ట్ అంతా చదివి ఈ కథకు ప్రభుదేవా అయితే బాగుంటుందని అన్నారు. నిజంగా ఈ స్క్రిప్ట్‌ని ఆయన్ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాను అని చెప్పాను. వెంటనే ప్రభుదేవాతో మాట్లాడారు. సినిమా మొదలైంది. ఇప్పుడు మీ ముందుకు వస్తోంది. ఈ సినిమా కోసం ప్రభుదేవా 45 రోజులు కష్టపడ్డారు. ఆ కష్టం మీకు తెరపై కనిపిస్తుంది’ అని అన్నారు. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా! -
My Dear Bootham Trailer: నవ్వులు పూయిస్తోన్న భూతం
కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, నటుడిగా చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభుదేవా. ఒకవైపు చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా చేస్తూనే మరోవైపు వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నుంచి వచ్చిన ప్రయోగాత్మక చిత్రం ‘మై డియర్ భూతం’. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ మూవీ జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: అల్లు అర్జున్ స్టార్ట్ చేస్తే.. రామ్ పూర్తి చేశాడు! ) పిల్లవాడితో మంచి అనుబంధం పెంచుకున్న భూతలోక చక్రవర్తి కర్ణముఖిగా ప్రభుదేవా పరిచయంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. భూతమైన జీని పిల్లవాడికి సహాయం చేయడానికి కిందకు వస్తాడు. ఆ తర్వాత వీరిద్దరు కలిసే చేసే పనులు నవ్వులు పూయిస్తున్నాయి. డి ఇమ్మాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కామెడీ స్థాయిని పెంచేసింది. పిల్లాడి తల్లిగా రమ్యా నంబీశన్ నటించారు. జీనీకి కిడ్స్‌కి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ‘ఈ మూవీ కోసం టీం అంతా చాలా కష్టపడింది. మంచి సినిమా చేశాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మీ అందరికీ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని ప్రభుదేవా అన్నారు. -
‘మై డియర్ భూతం’ అంటున్న ప్రభుదేవా
‘మై డియర్ భూతం’ అంటున్నారు ప్రభుదేవా. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం టైటిల్ ఇది. ఎన్. రాఘవన్ దర్శకత్వంలో రమేష్ పి. పిళ్లయ్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఈ ఫ్యాంటసీ సినిమాలో ప్రభుదేవా జీనీ పాత్ర చేశారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీనీ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. రమ్యా నంబీశన్ కీలక పాత్ర చేసిన ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమాన్, కెమెరా: యూకే సెంథిల్ కుమార్. -
ప్రభుదేవా హీరోగా ముసాషీ, హీరోయిన్ ఎవరూ లేరంట!
డాన్స్ మాస్టర్ ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ముసాషీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవల నటనపైనే దృష్టి సారి స్తున్న ఈయన వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. నవ దర్శకుడు శ్యామ్ రోట్రిగ్స్ దర్శకత్వంలో జాయ్ ఫిలిం బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జాన్ బ్రిట్టో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పోలీసు అధికారిగా నటిస్తున్నారు. హీరోయిన్ లేని ఈ చిత్రంలో జాన్ విజయ్, వీటీవీ గణేష్, జార్జ్ మరియాన్, మలయాళ నటుడు బినూపప్పు అరుళ్ దాస్, మాస్టర్ మహేంద్రన్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. దీనికి ఎస్ఎన్ ప్రసాద్ సంగీతాన్ని, విఘ్నేష్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గురువారం దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ప్రభుదేవా మాస్ గెటప్‌తో కూడిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
హీరోగా ప్రభుదేవా నెక్ట్స్ మూవీ ఇదే.. టైటిల్ వచ్చేసింది
Prabhu Deva Next Action Entertainer Film Titled Rekla: డాన్సింగ్ స్టార్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా ప్రస్తుతం నటన పైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హీరోగా వరుస చిత్రాలకు కమిట్ అవుతున్నారు. ఆయన నటించడానికి అంగీకరించిన తాజా చిత్రానికి రెక్లా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది ప్రభుదేవా నటిస్తున్న 58వ చిత్రం కావడం గమనార్హం. ఒలింపియా మూవీస్ పతాకంపై అంబేత్‌కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి వాల్టర్ చిత్రం ఫేమ్ అన్భు దర్శకత్వం వహించనున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు ఆర్య బుధవారం తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ టైటిల్ లుక్ పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండీగా మారి చిత్రంపై భారీ అంచనాలు నెలకునేలా చేస్తోందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. కాగా ఇందులో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత పేర్కొన్నారు. -
ఫ్లాష్‌బ్యాక్ ఫస్ట్‌లుక్: అనసూయను చూశారా?
Flashback Movie First Look: ప్రభుదేవా, రెజినా, అనసూయల కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫ్లాష్‌బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ మీద పి రమేష్ పిళ్లై నిర్మిస్తున్నారు. డాన్ సాండీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల మూవీకి సంబంధించిన రెండు విభిన్న పోస్టర్లను విడుదల చేశారు. మొదటి దాంట్లో ప్రభుదేవా, రెజీనాల లవ్ ట్రాక్ చూపిస్తే. రెండో దాంట్లో అనసూయ తన లుక్‌తో ఆకట్టుకుంది. ఈ రెండు పోస్టర్లకు విశేషమైన స్పందన లభిస్తోంది. ‘ఈ చిత్రం యూత్‌ను ఇట్టే కట్టిపడేస్తుంది. ఇందులో హై ఎమోషన్స్ ఉంటాయి. అంతకు మించి కథను చెప్పే విధానం బాగుంటుంది. టైటిల్, ట్యాగ్ లైన్‌తోనే సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమాలో ప్రతీ సీన్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రెజీనా ఇందులో ఆంగ్లోఇండియన్ టీచర్ పాత్రలో కనిపిస్తారు. అనసూయ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుదేవా పాత్ర చాలా కొత్తగా ఉండబోతోంది. అనసూయ పాత్ర సినిమాకు హైలెట్ కానుంది’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. శామ్ సీఎస్ అందిస్తున్న మ్యూజిక్ ప్రధాన బలం. చల్లా భాగ్యలక్ష్మీ, అనిరుధ్ శాండిల్య తెలుగులో పాటలు అందిస్తున్నారు. ద్విభాష చిత్రంగా రాబోతోన్న ‘ఫ్లాష్ బ్యాక్’కు తెలుగులో నందు తుర్లపాటి సంభాషణలు రచిస్తున్నారు. తమిళ డైలాగ్స్‌ను దర్శకుడే రాసుకున్నారు. నిర్మాతలు ఈ సినిమా సక్సెస్ మీద ఎంతో నమ్మకంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. -
యాక్షన్ చేయబోతున్న ప్రభుదేవా.. కొత్త చిత్రం ప్రారంభం
డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా డాన్సర్‌గానే కాకుండా, నటుడిగా, దర్శకుడిగా నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన యాక్షన్ అవతారం ఎత్తనున్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ద్వారా శ్యామ్ రోట్రిక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జాయ్ ఫిలిం బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జాన్ బ్రట్టో నిర్మిస్తున్నాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ఓటైనర్గా వస్తున్న ఈ మూవీలో నటుడు జాన్ విజయ్, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఎస్ఎన్ ప్రసాద్ సంగీతాన్ని, విఘ్నేష్ చాయాగ్రహణను అందిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ.. ప్రభుదేవాను ఈ చిత్రంలో ఫుల్ యాక్షన్ హీరోగా చూడబోతున్నారని తెలిపారు. చదవండి: కృత్రిమ కాలుతో ప్రభుదేవా.. పోస్ట్ వైరల్ -
సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుదేవా
Prabhu Deva Sensational Decision: ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా..నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటారు. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా తొలి చిత్రంతోనే హిట్ కొట్టారు. ఆ తర్వాత రూపొందించిన పౌర్ణమి సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే పోకిరి సినిమాను రీమేక్ చేసి హిందీ, తమిళ భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. చదవండి : ఆ సమస్యతో బాధపడుతున్న హీరోయిన్ తమన్నా అయితే ఆ తర్వాత మాత్రం డైరెక్టర్‌గా ఆశించినంత స్థాయిలో ప్రభుదేవా కెరీర్ లేదని చెప్పుకోవచ్చు. ఇటీవలె సల్మాన్‌ఖాన్‌తో తెరకెక్కించిన రాధే చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘోరంగా పరాజయం పాలయ్యింది. దీంతో ఇకపై డైరెకక్షన్కు గుడ్‌బై చెప్పాలని ప్రభుదేవా నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా నటుడిగా వరుస అవకాశాలు వస్తుండటంతో దానిపైనే ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయన భగీరా అనే చిత్రంలో మెయిన్ లీడ్‌లో నటించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది. చదవండి : బాలీవుడ్ నటిపై యాసిడ్ దాడి.. గాయాలు -
కృత్రిమ కాలుతో ప్రభుదేవా.. పోస్ట్ వైరల్
చెన్నై: ప్రభుదేవా హీరోగా నటిస్తున్న చిత్రం పొయిక్కల్ కుదిరై. ఇప్పటికే డ్యాన్సర్‌గా, నటుడిగా, దర్శకుడిగా అలరించిన ప్రభుదేవా మళ్లీ చాలా గ్యాప్ తర్వాత నటుడిగా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. సంతోష్ పి.జయకుమార్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రం బుధవారం విడుదల చేశారు.ప్రభుదేవా కృత్రిమ కాలుతో కనిపిస్తున్నాడు. ఒక చేతితో రెంచ్ పట్టుకుని, మరోచేతితో పసిబిడ్డను ఎత్తుకున్నారు. శత్రువుల బారి నుంచి ఆ పాపను కాపాడే ఎలా కాపాడాడన్న నేపథ్యంలో కథ ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జంటగా వరలక్ష్మీశరత్‌కుమార్, రైజానెల్సన్ నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్- సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. -
హీరోగా డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా.. షూటింగ్ స్టార్ట్
చెన్నై: డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గురువారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సంతోష్ విజయ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మినీ స్టూడియో పతాకంపై ఎస్.వినోద్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభుదేవాకి జంటగా వరలక్ష్మీశరత్‌కుమార్, రైసా విల్సన్ కథానాయికలుగా నటించనున్నారు. దీనికి బల్లు ఛాయాగ్రహణం, డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యానర్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. -
Bollywood: విభేదాలు.. విడాకులు.. కోట్లలో నష్ట పరిహారం
సినీ ఇండస్ట్రీ వాళ్ళ పెళ్లిళ్లు అసలు నిలబడవనేది తరచూ వినిపించే మాట. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడమనేది చాలా సహజం. చివరి వరకు నిలబడే వివాహ బంధాలకన్నా వెంటనే విడిపోయే జంటలే ఎక్కువగా ఉండటం ఈ అభిప్రాయాలకు కారణం. ముఖ్యంగా బాలీవుడ్లో విడాకులు అనేది కామన్ అయిపోయింది. నచ్చకపోతే విడిపోవడమే మంచిదని వారి భావన. కోట్లల్లో భరణాలు ఇచ్చి మరీ భార్యకు విడాకులు ఇచ్చిన హీరోలు ఎందరో ఉన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ అమీర్ ఖాన్,కిరణ్ రావులు విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో భారీగా భరణాలు ఇచ్చి విడాకులు తీసుకున్న జంటల గురించి.. హృతిక్ రోషన్‌లాంటి భర్త రావాలని కోరుకోని అమ్మాయి ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన్ని అందరూ బాలీవుడ్ గ్రీక్ గాడ్ అని అంటూ ఉంటారు. అంతటి అందగాడిని పెళ్లి చేసుకునే అదృష్టం సుసాన్ ఖాన్‌కు దక్కింది. దాదాపు పదేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం ఆనందంగా గడిచింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఏమైందో తెలీదు కానీ హృతిక్ రోషన్, సుసాన్‌కు మధ్య గొడవలు తలెత్తాయి. దాంతో ఇద్దరూ విడిపోయారు. సుసాన్ ఖాన్‌కి విడాకులు ఇచ్చాడు హృతిక్. అయితే భరణంగా దాదాపు 400 కోట్ల రూపాయాలను అడిగిందట సుసాన్. అప్పట్లో ఈ వార్తలు దుమారం లేపాయి. హృతిక్ ఆ వార్తల్ని ఖండించినప్పటికీ.. ఆమెకు రూ.380 కోట్లను భరణంగా ఇచ్చినట్లు బాలీవుడ్లో ప్రచారం జరిగింది. మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కూడా భరణంగా రీనా దత్తాకు భారీగానే అప్పగించారట. ఆమిర్, రీనా పెద్దల అమోదం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లకే ఇద్దరూ విడిపోవాల్సిన స్థితి వచ్చింది. అయితే, ఆమిర్ రూ. కోట్లలో రీనా దత్తాకి ఇచ్చాడని టాక్. ఎంత అనేది మాత్రం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. సైఫ్ అలీఖాన్ కూడా మొదటి భార్య అమృతా సింగ్‌కు భారీ నష్టపరిహారమే చెల్లించాడట. 13 ఏళ్ల కాపురం తర్వాత సైఫ్, అమృత విడాకులు తీసుకున్నారు. భరణంగా తన ఆస్తిలో సగ భాగం అమృత పేర రాసించ్చాడట సైఫ్ అలీఖాన్. అయితే అప్పట్లో ఆయన ఆస్తుల విలువ ఎంత అనేది తెలియరాలేదు. ఇక అమృతా సింగ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కరీనాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సైఫ్ అలీ ఖాన్. సంజయ్ దత్, రియా పిళ్లై కూడా విభేదాల కారణంగా విడిపోయారు. సంజయ్ నుంచీ విడిపోతూ రియా ఒక సీ ఫేసింగ్ అపార్ట్మెంట్, ఖరీదైన కార్ భరణంగా పొందిందట! ఇక కొరియో గ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా విడాకుల వ్యవహారం కూడా అప్పట్లో దేశమంతా చర్చనీయాంశంగా మారింది నయనతారతో ఎఫైర్ కారణంగా భార్య రమాలత్‌తో ప్రభుదేవాకు చెడిందనే వార్తలు వినిపించాయి. ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరి, చివరకు విడాకుల వరకు వెళ్లింది. నష్టపరిహారంలో భాగంగా రూ.10 లక్షల నగదుతో పాటు ఖరీదైన రెండు కార్లు, రూ. 20-25 కోట్ల విలువ చేసే ఆస్తులను ఆమె పేరిట రాసిచ్చారని ప్రచారం జరిగింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా సైతం మొదటి భార్య పాయల్ ఖన్నాకి విడాకులు ఇచ్చాడు. ఆయన రాణీ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం నడపడంతో వారి దాంపత్యంలో గొడవలు మొదలయ్యాయి. చివరకు అది విడాకుల వరకు వెళ్లింది. అప్పట్లో ఆదిత్య పెద్ద మొత్తంలోనే పాయల్ ఖన్నాకి అప్పజెప్పాడట. ఎంత ఇచ్చాడన్నది బయటకు రాలేదు. కానీ, బడా నిర్మాత కదా పెద్ద మొత్తమే ఇచ్చి ఉంటాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ విడాకుల వ్యవహారం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. వారు విడిపోయే క్రమంలో కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ 14 కోట్ల విలువైన బాండ్లను పిల్లల పేరు మీద కొనుగోలు చేశారట. వాటిపై నెలకు పది లక్షల దాకా వడ్డీ వస్తుందని అంటారు. వీటితో పాటు ముంబైలోని ఖర్ ఏరియాలో ఉన్న తన ఖరీదైన ఇంటిని కూడా ఆమెకు నష్టపరిహారంగా ఇచ్చాడట. చదవండి : చెల్లం సర్, నాకు పెళ్లెప్పుడు అవుతుంది? ఫ్యామిలీ మ్యాన్ 2: సమంత ఎంత తీసుకుందో తెలుసా? షారుక్, సల్మాన్‌లో ఎవరు కావాలి? విద్యాబాలన్ రిప్లై ఇదే! -
సల్మాన్ బ్యాడ్‌లక్.. ఈ ఏడాది కూడా లేనట్లే
‘రాధే’ రావడం మరోసారి వాయిదా పడ్డట్లేనని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. గత ఏడాది ఈద్‌కు విడుదల కావాల్సిన ‘రాధే’ సినిమా అప్పటి కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రంజాన్‌కు రావడానికి రెడీ అయింది. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను చిత్రబృందం మరోసారి వాయిదా వేసిందని బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం ‘రాధే’ సినిమా ఈ రంజాన్ కు విడుదల కాకపోతే బక్రీద్ సందర్భంగా జూలై 21న విడుదలవుతుందని బాలీవుడ్లో ప్రచారం సాగింది. కానీ మహారాష్ట్రలో థియేటర్స్ మూసివేత, ఢిల్లీ థియేటర్లలో ముపై శాతం సీటింగ్ సామర్థ్యం వంటి కారణాలతో ‘రాధే’ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేయాకూడదని అనుకుంటున్నారట నిర్మాతలు. గత ఏడాది వచ్చిన 200 కోట్ల ఓటీటీ ఆఫర్ వద్దనుకుని పంపిణీదారులు, థియేటర్ అధినేతల విజ్ఞప్తుల మేరకు ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తామని సల్మాన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో.. ‘రాధే’ ఓటీటీకి వచ్చే అవకాశం లేదు. మరి.. తాజా పరిస్థితుల దృష్ట్యా చిత్రనిర్మాతలు మనసు మార్చుకుంటారేమో చూడాలి. -
ప్రభుదేవతో రొమాన్స్ చేయనున్న కాజల్..
‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ ఇక్కడ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా ఆఫర్లును అందిపుచ్చుకుంటూ అగ్ర హీరోయిన్గా రాణిస్తున్న క్రమంలోనే కాజల్, ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగు పెట్టిన హీరోయిన్లు సినిమాల్లో వేగం తగ్గించడం వల్ల వారికి అవకాశాలు తగ్గుతాయని అందరూ అభిప్రాయపడుతుంటారు. కానీ కాజల్ మాత్రం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అలా అని పూర్తిగా సినిమాలకే అంకితం కాకుండా అటూ భర్త కిచ్లుకు కూడా తగినంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇటూ వైవాహిక బంధాన్ని.. అటూ సినీ కెరీర్‌ను బాగానే మేనేజ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ భామ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే. (చదవండి: ప్రపంచాన్ని మార్చేయాలని ఉంది) దీనితో పాటు కమల్ హాసన్ ‘ఇండియన్-2’లో కూడా నటిస్తున్నారు. అంతేగాక డైరెక్టర్ తేజ తెరకెక్కించనున్న ‘అలివేలు వెంకటరమణ’లో నటించేందుకు మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఆ తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకుంంది కాజల్. తాజాగా ప్రముఖ కోరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవతో మొదటిసారిగా జతకట్టనున్నదంట ఈ ‘చందమామ’ బ్యూటీ. తమిళ చిత్రం ‘గులేబకావలి’ ఫేం డి. కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రోమాంటిక్, కామెడీ, థ్రీల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుందట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. కాగా ప్రభుదేవా 50వ చిత్రం ‘పోన్ మణికవేల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేగాక బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, దిషా పటానీలు జంటగా నటిస్తున్న ‘రాధే’ సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!) -
22 ఏళ్ల తర్వాత..
కమల్‌హాసన్–ప్రభుదేవా మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? అంటే కోలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ వార్త నిజమైతే 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. లోకేశ్ కనగరాజన్ దర్శకత్వంలో కమల్ హీరోగా ‘విక్రమ్’ అనే చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రను ప్రభుదేవా చేయనున్నారని సమాచారం. 1998లో కమల్–ప్రభుదేవా ‘నవ్వండి లవ్వండి’ అనే చిత్రంలో నటించారు. అది కామెడీ ఎంటర్టైనర్. తాజా చిత్రం ‘విక్రమ్’ పొలిటికల్ థ్రిల్లర్. త్వరలో షూటింగ్ ఆరంభించి, తమిళనాడు ఎన్నికల ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం అనుకుంటోందట. -
కొత్త స్టెప్ వేశారు
ఇండియన్ ఇండస్ట్రీలో స్టార్స్ అందరితో ప్రభుదేవా స్టెప్స్ వేయిస్తుంటారు. అయితే ఆయన లైఫ్‌లో ఓ కొత్త స్టెప్ వేశారని తెలిసింది. రెండోసారి పెళ్లి చేసుకున్నారట. కొన్ని రోజులుగా ప్రభుదేవా తన మేనకోడల్ని పెళ్లి చేసుకుంటున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. అయితే అది నిజం కాదట. ముంబైలోని ఓ ఫిజియోథెరపిస్ట్‌ను వివాహం చేసుకున్నారట ప్రభుదేవా. సెప్టెంబర్‌లో వీరి వివాహం చాలా చిన్న వేడుకగా జరిగిందట. ఈ ఇద్దరి పరిచయం కూడా విచిత్రంగా జరిగిందని టాక్. వెన్ను నొప్పి సమస్యలో భాగంగా ఈ ఫిజియోథెరపిస్ట్‌ను కలిశారట ప్రభుదేవా. అక్కడి నుంచి వీళ్ల మధ్య స్నేహం ఏర్పడి, ప్రేమగా మారి, పెళ్లి వరకూ వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ చెన్నైలో ఉంటున్నారని సమాచారం. గతంలో రమలత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ప్రభుదేవా. రమలత్ ప్రభుదేవా జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత నయనతారతో ప్రేమలో పడటం, బ్రేకప్ విషయం తెలిసిందే. మరి.. ఫిజియోథెరపిస్ట్, ప్రభుదేవా సెవన్ స్టెప్స్ వేసారా? నిజమేంటో? -
సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!
చెన్నై : దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుధేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. బిహార్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్‌తో సెప్టెంబర్‌లోనే ఏడడుగులు వేసినట్టు తెలిసింది. ముంబైలోని ప్రభుదేవా నివాసంలో అత్యంత రహస్యంగా వివాహం చేసుకున్న ఈ కొత్త జంట ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుదేవాకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీడియాతో పంచుకున్నారు. అయితే ఈ విషయంపై ప్రభుదేవా మాత్రం స్పందించలేదు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెన్నముక సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రభుదేవా పిజియోథెరపీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చికిత్స అందించిన డాక్టర్‌తో ప్రభుదేవా ప్రేమలో పడ్డారు. కొంతకాలం డేటింగ్ అనంతరం వీరిద్దరూ పెళ్లిబంధంతో ఒకటయ్యారు. అయితే ప్రభుదేవా రెండో పెళ్లిపై గత కొంతకాలంగా కోలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన చుట్టాలమ్మాయితో రిలేషన్ షిప్లో ఉన్నట్లు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు షికార్లు చేయగా ప్రస్తుతం అది ఫేక్ న్యూస్ అని స్పష్టమవుతోంది. (ముక్కాల ముక్కాబులా అంటున్న వార్నర్) మొదట 1995లో రామలతను వివాహం చేసుకున్న ప్రభుదేవా 2011లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ నయనతారతో ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రేమ ఎక్కువకాలం నిలవలేదు. ఇక నయనతార కూడా ముందు శింబు, ప్రభుదేవాతో ప్రేమలో పడిన ఈ భామ ప్రస్తుతం డెర్టెక్టర్ విఘ్నేష్ శివన్‌తో రిలేషన్షిప్లో ఉన్నారు. ప్రభుదేవా ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘రాధే’ సినిమా చేస్తున్నాడు. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీటీలో విడుదల చేసేది లేదని వచ్చే ఏడాది జనవరిలో లేదా ఈద్ పండగకు థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తునట్లు ప్రభుదేవా వెల్లడించారు. (గర్ల్‌ఫ్రెండ్‌కు విఘ్నేశ్ ప్రత్యేక బర్త్‌డే విషెస్) -
డ్యూటీ ముగిసింది
క్రిమినల్స్ అంతు చూడటానికి పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా మారారు సల్మాన్ ఖాన్. విజయవంతంగా డ్యూటీ పూర్తి చేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రాధే’. ‘మోస్ట్ వాంటెడ్ భాయ్’ అన్నది ఉపశీర్షిక. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమాలో స్టయిలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు సల్మాన్. లాక్డౌన్ వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. ఇటీవలే ముంబైలో చిత్రీకరణ ప్రారంభించారు. అనుకున్న తేదీ కంటే చిత్రీకరణ ముగిసిందని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో లేదా ఈద్ పండగకు థియేటర్స్‌లోకి తీసుకురావాలన్నది యూనిట్ ప్లాన్ అని తెలిసింది. -
రాదే ఓటీటీలోకి రాదు
‘‘రాధే’ చిత్రాన్ని థియేటర్స్ కోసం రూపొందించాం. ఇది థియేటర్స్‌లోనే విడుదలవుతుంది’’ అన్నారు దర్శకుడు ప్రభుదేవా. సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా తెరకెక్కించిన చిత్రం ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ అన్నది క్యాప్షన్. ఇందులో దిశా పటానీ కథానాయిక. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు సల్మాన్ ఖాన్. ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. వాటిని కొట్టి పారేశారు దర్శకుడు ప్రభుదేవా. ఈ విషయం గురించి మాట్లాడుతూ– ‘‘రాధే’ చిత్రానికి సంబంధించి 3–4 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపు పూర్తయింది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్‌కు జనాలు మళ్లీ వస్తారా లేదా అనే ఆందోళ అందరిలోనూ ఉంది. కానీ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే స్టార్ సల్మాన్ మాత్రమే. థియేటర్స్ ఎప్పుడు తెరిస్తే అప్పుడు మా సినిమా విడుదలవుతుంది. అది దీపావళి అయినా క్రిస్మస్ అయినా రిపబ్లిక్ డే అయినా సరే’’ అన్నారు ప్రభుదేవా. -
సినీ మువ్వల సివంగి
‘ఏక్ దో తీన్.. చార్ పాంచ్ ఛే సాత్’.... ‘తేజాబ్’కు ఆ పాట కలెక్షన్ల వరద సృష్టించింది. ‘కాటే నహి కట్ తే ఏ దిన్ ఏ రాత్’... ‘మిస్టర్ ఇండియా’ ఈ పాటతో శ్రీదేవిని టాప్ చైర్ మీద కూచోబెట్టింది. ‘నింబొడ నింబొడ నింబొడ’... ఏంటి.. ఐశ్వర్యా రాయ్ ఇంత బాగా డాన్స్ చేస్తుందా అనిపించింది. ‘ఏ కాలే కాలే ఆంఖే’... షారూక్‌ఖాన్ ఆమె ఆడమన్నట్టు ఆడాడు. ‘రాధా క్యూ న జలే’ ఆమిర్‌ఖాన్ ఆమె చెప్పినట్టు గెంతాడు. సరోజ్ ఖాన్. బాలీవుడ్‌ను సుదీర్ఘకాలం ఏలిన ఏకైక మహిళా కొరియోగ్రాఫర్. ప్రభుదేవా, లారెన్స్, ఫర్హా ఖాన్ల జేజమ్మ. మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ ఇన్ ఇండియా. సరోజ్ ఖాన్‌కు మూడేళ్ల వయసున్నప్పుడు గోడ మీద తన నీడను చూస్తూ డాన్స్ చేసేది. తల్లి అది చూసి భయపడింది. కూతురు పుట్టిందనుకుంటే పిచ్చి పిల్ల పుట్టిందేమిటా అని ఆఘమేఘాల మీద డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ‘ఇది పిచ్చేగాని డాన్స్ పిచ్చి. మీ పాపను చైల్డ్ ఆర్డిస్టును చేయండి. ఎలాగూ మీకు డబ్బులు అవసరం కదా’ అన్నాడు తెలిసిన డాక్టరు. అప్పటికి ముంబైలో నిరుపేద చాల్లో ఉంటున్న ఆ కుటుంబంలోని వారికి ఈ మాటలు నచ్చాయి. సరోజ్ ఖాన్‌కు ఐదారేళ్లు వచ్చేటప్పటికి చైల్డ్ ఆర్టిస్టును చేశారు. నాలుగైదు సినిమాలు చేసింది. ఆ తర్వాత వేషాలు రాలేదు. సరోజ్ ఖాన్‌కు పదేళ్లు వచ్చేసరికి తండ్రి చనిపోయాడు. తన తర్వాత ఇంకా నలుగురు తోబుట్టువులున్నారు. తల్లికి ఏమీ తెలియదు. కుటుంబాన్ని తనే నిలబెట్టాలి. సరోజ్ ఖాన్ గ్రూప్ డాన్సర్ అయ్యింది. హీరో హీరోయిన్ల వెనుక పరిగెత్తే పది మందిలో ఒకత్తి అయ్యింది. తిండికి ఎలాగో గడుస్తుంది. కాని ఇది చాలదు. ‘ఏక్ దో తీన్’ పాటలో మాధురీ దీక్షిత్ గురు పరిచయం అప్పటికి డాన్స్ మాస్టర్ బి.సోహన్‌లాల్ (సుప్రసిద్ధ డాన్స్ మాస్టర్ హీరాలాల్ పెద్దన్న) మద్రాసు (చెన్నై)లో పని చేస్తూ అప్పుడప్పుడు బాంబే (ముంబై) వచ్చి పాటలు చేసేవాడు. అతను గ్రూప్డాన్సర్స్లో చురుగ్గా ఉంటున్న సరోజ్ ఖాన్‌ను గమనించాడు. ఒకరోజు సెట్లో సరోజ్ ఖాన్ హెలెన్‌ను అనుకరిస్తూ స్టెప్స్ వేస్తుంటే ‘ఏదీ మొత్తం పాటకు చేసి చూపించు’ అని అడిగాడు. సరోజ్ ఖాన్ తొణక్కుండా అచ్చు హెలెన్లాగే డాన్స్ చేసి చూపించింది. అప్పటి దాకా సోహన్లాల్కు అసిస్టెంట్లు లేరు. పదమూడేళ్ల వయసున్న సరోజ్ ఖాన్‌ను అతడు అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు. ఆయనే ఆమెను తీర్చిదిద్దాడు. సోహన్‌లాల్ యూరప్‌కు షూటింగ్ కోసం వెళ్లినప్పుడు ఆయన చేయాల్సిన పాటను 13 ఏళ్ల వయసులో సరోజ్ కొరియోగ్రాఫ్ చేసింది. ఆ సినిమా ‘దిల్ హి తో హై’ (1963). అందులో రాజ్ కపూర్ హీరో. నూతన్ హీరోయిన్. వాళ్లిద్దరి మీద పాట– ‘నిగాహే మిలానే కో జీ చాహ్ తాహై’. కాని సరోజ్ ఖాన్ తొట్రు పడలేదు. చేసింది. ప్రయాణం మొదలైంది. ధక్ ధక్ కర్నే లగా’లో మాధురీ, అనిల్‌కపూర్ మగ ప్రపంచం సినిమా ప్రపంచం అంటే మగ ప్రపంచం. మగవారు పెత్తనం చేసే ప్రపంచం. సరోజ్ ఖాన్‌కు ఎంత ప్రతిభ ఉన్నా ఎంత బాగా పాటలు చేస్తున్నా గుర్తింపు ఇచ్చేవారు కాదు. అసలు టైటిల్స్‌లో పేరే ఉండేది కాదు. ఒకసారి షూటింగ్లో ఉంటే సీనియర్ నటుడు అశోక్ కుమార్ ఆమెను గమనించి పిలిచాడు. ‘నువ్వు ఇంత బాగా చేస్తున్నావు కదా. నీ పేరు స్క్రీన్ మీద ఎందుకు వేయరు?’ అని అడిగాడు. సరోజ్ ఖాన్ మౌనంగా ఉండిపోయింది. సరే.. ఈ సినిమాలో నీ పేరు వేయిస్తాను అని చెప్పి వేయించాడు. అలా ‘ఇంక్విలాబ్ కీ ఆగ్’ అనే సినిమాలో సరోజ్ ఖాన్ పేరు మొదటిసారిగా పడింది. కాని అప్పటికీ గుర్తింపు రాలేదు. సుభాష్ ఘాయ్ ‘హీరో’ (1983) సినిమాలో సరోజ్ ఖాన్‌ను కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నాడు. ‘హీరో’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సుభాష్ ఘాయ్ తీసుకున్నాడంటే ఏదో టాలెంట్ ఉండే ఉంటుంది అని మిగిలిన నిర్మాత, దర్శకులు అనుకుని ఆమెను పిలవడం మొదలెట్టారు. టాలెంట్ ఎప్పటి నుంచో ఉంది. సుభాష్ ఘాయ్ లైట్ వేశాడంతే. ‘డోలారే డోలారే’లో మాధురీ, ఐశ్వర్యరాయ్ ఏక్.. దో... తీన్... ఎన్.చంద్ర ‘తేజాబ్’ (1988) తీశాడు. అందులో మాధురి దీక్షిత్ అనే కొత్త హీరోయిన్ని తీసుకున్నాడు. ఆమెకు ఒక మంచి పాట పెట్టాడు. ‘ఈ పాట వస్తున్నప్పుడు ప్రేక్షకులు సీట్లలో ఉండకూడదు. అంతే మీకు నేను చెప్పేది’ అన్నాడు సరోజ్‌ఖాన్‌తో. సరోజ్ ఖాన్ ఈ పాటను ఛాలెంజింగ్‌గా తీసుకుంది. మాధురి దీక్షిత్‌కు ఉన్న డాన్స్ టాలెంట్‌ను ఉపయోగించుకుంది. ‘ఏక్.. దో... తీన్.. చార్.. పాంచ్’... పాటను అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసింది. జనం సినిమా కోసం ఒకసారి, ఈ పాట కోసం ఒకసారి థియేటర్లకు వచ్చారు. మాధురి దీక్షిత్ రాత్రికి రాత్రి సూపర్‌స్టార్ అయ్యింది. ఫిల్మ్‌ఫేర్ వాళ్లు అప్పటివరకు కొరియోగ్రాఫర్‌కు అవార్డ్ పెట్టనేలేదు. ఈ సినిమా వచ్చాక ఆ అవార్డును ఇంట్రడ్యూస్ చేసి సగౌరవంగా సరోజ్ ఖాన్‌కు తొలి అవార్డు ఇప్పించారు. సరోజ్ ఖాన్ దేశంలోని సినిమా ఇండస్ట్రీలన్నీ తలెత్తి చూసే కొరియోగ్రాఫర్ అయ్యిందిప్పుడు. హిట్ల వరుస సరోజ్ ఖాన్ అక్షరాభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దేహ కవళికలతో పాటు ముఖ కవళికలు కూడా ముఖ్యం. వాటికోసం నటీ నటులను సానపెడుతుంది. అందుకే ఆ పాటలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. హిందీలో శ్రీదేవి సరైన హిట్ కోసం చూస్తున్నప్పుడు ‘మిస్టర్ ఇండియాలో’ నీలిరంగు చీర కట్టుకుని ఆమె వేసిన ‘కాటే నహి కట్ తే ఏ దిన్ ఏ రాత్’ పాట స్టెప్పులు ఆమెకు భారీ ఎట్రాక్షన్‌ను తీసుకొచ్చాయి. అదే సినిమాలోని ‘హవా హవాయి’ కూడా శ్రీదేవి మరణించే వరకు ప్రస్తావనకు వస్తూనే ఉండేది. వీటిని చేయించింది సరోజ్ ఖాన్. ‘చాందినీ’లో శ్రీదేవి చేసిన ‘మేరే హాతో మే నౌనౌ చూడియా’ పాట ఆ ఇద్దరికీ పేరు తెచ్చింది. ఇక మాధురి దీక్షిత్‌తో సరోజ్ ఖాన్ హిట్స్‌కు లెక్కే లేదు. ‘బేటా’లో ‘ధక్ ధక్ కర్ నే లగా’, ఖల్ నాయక్‌లో ‘చోళీ కే పీఛే క్యా హై’, యారానాలో ‘మేరా పియా ఘర్ ఆయా’... చాలా పెద్ద హిట్లు. ఇక సంజయ్ లీలా బన్సాలీ తీసిన ‘దేవదాస్’లో ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్ చేసిన ‘డోల రే డోలరే’ పాట సరోజ్ ఖాన్ ప్రతిభకు పతాక. శ్రీదేవితో... జాతీయ పురస్కారం సరోజ్ ఖాన్ అంటే ఎద విరుపులు, కటి కుదుపులు అనుకునే వారు కొందరు ఉండొచ్చు. కాని ఆమె తనకు వచ్చిన అవకాశాన్ని గౌరవించడమే తెలిసిన ప్రతిభాశాలి. దానికి నూరుశాతం న్యాయం చేయడం బాధ్యత అనుకుంటుంది. అయితే తమిళంలో వచ్చిన ‘శ్రింగారం’ (2005) అనే సినిమాకు ఆమె సమకూర్చిన భరతనాట్య నృత్యరీతులు ఆమెకు జాతీయ అవార్డును తెచ్చి పెట్టాయి. చెన్నైలోని సనాతన నృత్య సంస్థ ‘శ్రీకృష్ణ గానసభ’ ఆ సినిమాలో ఆమె చూపిన ప్రతిభను గౌరవించి మొదటిసారిగా ఒక సినిమా కొరియాగ్రాఫర్ని– సరోజ్ ఖాన్ని– పిలిచి సత్కరించుకుంది. అదీ సరోజ్ ఖాన్ ప్రతిభ. ముగింపు సరోజ్‌ఖాన్ స్థూలకాయురాలు. కాని ఆమె డాన్స్ చేయడం మొదలెడితే ఆ దేహం విల్లులా వొంగేది. ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నా ఆమె నృత్యం మానలేదు. ఆపలేదు. ఎందరో శిష్యులను సినిమా రంగానికి ఇచ్చింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మూడేళ్ల వయసు నుంచి నర్తిస్తున్న ఆమె పాదాలు 71వ ఏట శాశ్వత విశ్రాంతిని తీసుకున్నాయి. కాని భారతీయ వెండితెర మీద ఆమె వేసిన పాదముద్రలు మాత్రం బహుకాలం సజీవంగా ఉంటాయి. – సాక్షి ఫ్యామిలీ -
ప్రభుదేవా స్టెప్పులేసిన వార్నర్.. వావ్ అనాల్సిందే!
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరుస టిక్‌టాక్ వీడియోలతో దూసుకపోతున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తుండటతో వార్నర్‌కు హైదరాబాద్, టాలీవుడ్‌తో మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ క్రమంలో టాలీవుడ్ సినిమాల్లోని పాటలు, డైలాగ్స్‌కు టిక్‌టాక్ చేసి అలరిస్తున్నాడు. వార్నర్‌తో పాటు ఆయన సతీమణి క్యాండిస్, కుమార్తె ఇవీ కూడా ఆ వీడియోలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇప్పటికే ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలోని బుట్టబొమ్మ పాటకు, పోకిరి, బాహుబలి సినిమాల్లోని డైలాగ్‌లకు వార్నర్ టిక్‌టాక్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తాజాగా ప్రేమికుడు సినిమాలోని ముక్కాల ముక్కాబుల పాటకు డ్యాన్స్ చేశాడు. తన భార్య క్యాండిస్‌తో కలిసి స్టెప్పులేశాడు. మధ్యలో కూతురు ఇవీ కూడా ప్రదాన ఆకర్షణగా నిలిచి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వార్నర్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేయడం మరో విశేషం. చదవండి: ఛేజింగ్‌ల్లో సచిన్ కన్నా కోహ్లినే మిన్న ‘అమరేంద్ర బాహుబలి అనే వార్నర్’ -
నయనతార పచ్చబొట్టు మారింది
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, కొరియోగ్రాఫర్, నటుడు, డ్యాన్సర్, దర్శకుడు ప్రభుదేవాల మధ్య చిగురించిన ప్రేమ ఎక్కువకాలం నిలవలేదు. అయితే వీరు గాఢంగా ప్రేమించుకుంటున్న సమయంలో నయన్ అతని పేరును పచ్చబొట్టు పొడిపించుకుంది. ప్రభుదేవా పేరుని సగం ఇంగ్లీషులో, మిగతా సగం తమిళంలో వేయించుకుంది. అయితే తర్వాత ఏమైందో కారీ ఈ ప్రేమపక్షులు విడిపోయారు. కానీ ఆ టాటూ మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే నయన్ తాజాగా షేర్ చేసిన ఫొటో ద్వారా టాటూను మార్చివేసినట్లు తెలుస్తోంది. ప్రభుదేవాని కాస్తా రీడిజైన్ చేయించి పాజిటివిటీగా మార్చింది. (మళ్లీ ఒంటరైన నయన) నయన్ తీసుకున్న అభిప్రాయం సరైనదని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో శింబుతో, తర్వాత ప్రభుదేవాతో.. ఇలా రెండుసార్లు ప్రేమ బెడిసికొట్టడంతో నయన్ మానసిక వేదనకు గురైంది. అనంతరం దాని నుంచి కోలుకుని సినిమాలపై దష్టి పెట్టిన ఈ హీరోయిన్ ప్రస్తుతం డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2015 నుంచి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే రెండుసార్లులో ప్రేమలో విఫలమైన నయన్ ఈసారైనాపెళ్లివరకు వెళుతుందో లేదో చూడాలి. (నయన్ విషయంలోనూ అలాగే జరగనుందా?) View this post on Instagram us ❤️ #vn💍#santorini A post shared by nayanthara🔵 (@nayantharaaa) on Jun 10, 2019 at 7:21am PDT -
ప్రభుదేవా సినిమా విడుదలయ్యేది అప్పుడే
దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, హీరోగా అన్నింటిలోనూ అవలీలగా పరకాయ ప్రవేశం చేసే ప్రభుదేవా తొలిసారిగా ఓ పోలీస్ గెటప్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘పొణ్ మానిక్యవేల్’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'కృష్ణమనోహర్ ఐపీఎస్' పేరుతో మార్చి 6న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవకు జోడీగా డస్కీ బ్యూటీ నివేదా పేతురాజ్ నటించింది. ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’ నివేదా నటించిన సంగతి తెలిసిందే. బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.(ఓ పోలీసాఫీసర్ కథ ఇది) ఈ సినిమా గురించి నిర్మాత ఆర్.సీతారామరాజు మాట్లాడుతూ.. అడుగుపెట్టిన అన్నిరంగాల్లోనూ ప్రభుదేవా సంచలన విజయాలు సాధించాడు. ఆయన తొలిసారిగా డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తూ సంఘ విద్రోహశక్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచే పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: రాజేష్, పాటలు: భువనచంద్ర, సంగీతం: డి.ఇమ్మాన్, నిర్వహణ: ఎస్.చంద్రశేఖర్ నాయుడు, సమర్పణ: యనమల సుధాకర్ నాయుడు, నిర్మాత: ఆర్.సీతారామరాజు, దర్శకత్వం: ముఖిల్ చెల్లప్పన్ (నెవర్ బిఫోర్ లాంటి పాత్రలో నటిస్తున్న ప్రభుదేవా) -
సింహస్వప్నంలా వస్తున్నాడు
మల్టీటాలెంటెడ్ ప్రభుదేవా తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో హీరోగా నటించిన చిత్రం ‘పొన్ మాణిక్వెల్’. ఎ. ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించారు. ‘బాహుబలి’ ప్రభాకర్, సురేష్ మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు తెలుగులో ‘కృష్ణ మనోహర్ ఐ.పి.ఎస్’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 7న విడుదల కానుంది. పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో ఆర్. సీతారామరాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో సంఘవిద్రోహ శక్తుల పాలిట హీరో సింహస్వప్నంలా ఎలా నిలిచాడు? అన్నదే కథ’’ అన్నారు సుధాకర్. ఈ సినిమాకు భువన చంద్ర సంగీతం అందించారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ దబాంగ్ 3
-
సినిమాలో చూసి ఎంజాయ్ చేయడమే : విజయ్
వరుణ్ ధావన్, శ్రద్ధ కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా దర్శకత్వం వహించిన చిత్రంలో నోరా ఫతేహి, ప్రభుదేవా కీలక పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో డ్యాన్స్‌లు ఆదరగొట్టేలా ఉన్నాయని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌పై సన్సేషన్ స్టార్ విజయ దేవరకొండ ట్విటర్లో షేర్ చేశారు. వరుణ్, శ్రద్ధ, రెమో, ప్రభుదేవాలకు బెస్ట్ విషెస్ చెప్పారు. ‘నా జీవితంలో ఇది నేను చేయలేను.. సినిమాలో చూసి ఎంజాయ్ చేయటమే’ అని విజయ్ పేర్కొన్నారు. రెమో గతంలో దర్శకత్వం వహించిన ఏబీసీడీ, ఏబీసీడీ2 లను మించిపోయేలా ఇందులో డ్యాన్స్ బీట్స్ ఉన్నాయి. కాగా, ఈ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. Ee life time lo idhi nenu cheyalenu, cinema lo chusi enjoy cheyatame 😀 Wishing brother @Varun_dvn @ShraddhaKapoor @remodsouza @PDdancing and all the street dancers the very best for #StreetDancer3D Releasing in Telugu on the 24th of Jan 2020. https://t.co/CTtA30ZPVx — Vijay Deverakonda (@TheDeverakonda) December 19, 2019 -
సింహస్వప్నం
కృష్ణమనోహర్ ఐపీఎస్ అనగానే ప్రేక్షకులకు తెలుగు సూపర్‌హిట్ ‘పోకిరి’ సినిమాలో మహేశ్‌బాబు చేసిన పాత్ర ఇట్టే గుర్తుకు వస్తుంది. ఈ పాత్ర పేరే టైటిల్‌గా ఇప్పుడు ఓ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రభుదేవా హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘పొన్ మాణిక్యవేల్’ని ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించారు. ముఖిల్ చెల్లప్పన్ దర్శకుడు. పవన్‌పుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్‌నాయుడు సమర్పణలో ఆర్. సీతారామరాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘సంఘవిద్రోహుల పాలిట సింహస్వప్నంలా వీరవిహారం చేసే ఓ పోలీసాఫీసర్ కథ ఇది. ప్రభుదేవా, నివేదా నటన హైలైట్. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘బాహుబలి’ ప్రభాకర్, సురేష్ మీనన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు డి. ఇమ్మాన్ స్వరకర్త. -
స్మాల్ స్టెప్ తీసుకున్నా
తమిళ పాఠాలు నేర్చుకుంటున్నారు హీరోయిన్ అమైరా దస్తూర్. హిందీలో ‘మెంటల్ హై క్యా’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసి ‘మేడిన్ చైనా, ప్రస్థానం’ (తెలుగు ‘ప్రస్థానం’ హిందీ రీమేక్) సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళం నేర్చుకోవడానికి కారణం ఉంది. అధిక్ రవిచందర్ దర్శకత్వంలో ప్రభుదేవా నటించనున్న ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటించనున్నారట అమైరా. ఈ సినిమాలో సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యారట. అందుకే తమిళం నేర్చుకుంటున్నారు. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లో సొంత డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల వెండితెరపై ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ పర్ఫెక్ట్గా రిప్లెక్ట్ అవుతాయి. అలాగే మన పెర్ఫార్మెన్స్లోనూ తేడా కనిపిస్తుంది. సినిమా ప్రమోషన్ టైమ్‌లోనూ నాకు బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైనా తమిళంలో ఏదైనా చెప్పినప్పుడు పక్కవారిని ట్రాన్స్‌లేట్ చేయమనే బాధ కూడా పోతుంది. నటిగా నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఇదొక స్మాల్ స్టెప్‌గా భావిస్తున్నాను’’ అని అమైరా చెప్పుకొచ్చారు. ఇంతకుముందు తమిళంలో ‘అనేగన్’ చిత్రంలో ధనుష్ సరసన నటించారామె. -
మంచి వరుడు దొరికితే..!
నటి తమన్నా బోల్డ్ అండ్ బ్యూటీ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మరింత అందాన్ని సంతరించుకున్నారనే చెప్పాలి. అవకాశాలు కూడా మధ్యలో కాస్త తడబడ్డా ఇప్పుడు వరుస కడుతున్నాయి. తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న భారీ చారిత్రాత్మక కథ చిత్రం సైరా నరసింహారెడ్డిలో చాలా ముఖ్యమైన పాత్రను షోషిస్తున్నారు. ఇక హిందీలో ప్రభుదేవాతో జత కట్టిన ఖామోషి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం విశాల్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. కాగా ప్రభుదేవాతో నటిస్తున్న మరో చిత్రం దేవి–2 శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇది ఇంతకు ముందు ఈ జంట నటించిన దేవి చిత్రానికి సీక్వెల్. దేవీ–2 తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా తమన్నా గురువారం చెన్నైలో విలేకరులతో ముచ్చటించారు. దేవి–2 చిత్రం గురించి? దేవి–2 చిత్రంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకు ముందు తెరపైకి వచ్చిన దేవి చిత్రం మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. ఇప్పుడు దేవీ–2 చిత్రం అంతకంటే మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. దేవి 2 చిత్రాన్ని అంగీకరించడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా? కథే ప్రధాన కారణం. దర్శకుడు విజయ్ కథ చెప్పగానే నచ్చేసింది. ఇందులో ప్రభుదేవాకు భార్యగా నటించాను. దేవి–2లోనూ డీగ్లామర్‌గా నటించారటగా? అయ్యో ఆ రూపం కోసం చాలా కష్ట పడ్డాను. ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు అందరూ తమ చిత్రాల్లో అలానే కనిపించమంటున్నారు. సైరా చిత్రంలో కూడా నా గెటప్ విభిన్నంగా ఉంటుంది. అందులో చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను. సైరా చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నటించారటగా? ఇకపై కూడా అలాంటి పాటల్లో నటించడం కొనసాగిస్తారా? ఖచ్చితంగా. అయితే ఆ పాటకు చిత్రంలో ప్రాధాన్యత ఉండాలి. పాట నాకు నచ్చాలి. మీపై వస్తున్న వదంతుల గురించి? అలాంటి వాటిని చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి వాటిని ఎవరు?ఎలా కల్పిస్తారో అర్థం కావడం లేదు. పెళ్లెప్పుడు చేసుకుంటారు? మంచి పెళ్లి కొడుకు దొరకాలి. దర్శకుడు విజయ్‌కి కూడా చెప్పాను మంచి పెళ్లి కొడుకు ఉంటే చెప్పమని. మీలో ఎవరైనా మంచి వ్యక్తిని చూస్తే అతన్ని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. చాలా మంది హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చి, ఎంఎల్ఏలు, ఎంపీలు అవుతున్నారు.మీకూ అలాంటి ఆలోచన ఉందా? అలాంటి ఆలోచన నాకు లేదు.నిజం చెప్పాలంటే నాకు రాజకీయాలు తెలియవు. ఏమో మరో ఐదేళ్లలో రాజకీయాల గురించి నేర్చుకుని, ఆ దిశగా పయనిస్తానేమో. -
రెండింతలు భయపెడతాం
‘అభినేత్రి’ చిత్రంతో తమన్నా, ప్రభుదేవా ప్రేక్షకులను భయపెట్టారు. మొదటిసారి కంటే రెట్టింపు భయపెట్టడానికి ‘అభినేత్రి’ సీక్వెల్ ‘అభినేత్రి 2’తో రెడీ అయ్యారు. ప్రభుదేవా, తమన్నా జంటగా ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘అభినేత్రి 2’. సోనూ సూద్, నందితా శ్వేత, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మే 31న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్ చేస్తూనే మనసును ఆకట్టుకునే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయి. టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేతల నటన ఈ సినిమాకు హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అయాంకా బోస్, సంగీతం: శ్యామ్ సీఎస్. -
ప్రేమికుడి వినోదం
ప్రభుదేవా హీరోగా, అదాశర్మ, నిక్కీగల్రాని హీరోయిన్లుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్’. ఈ చిత్రాన్ని ఎమ్.వి. కృష్ణ సమర్పణలో శ్రీ తారకరామ పిక్చర్స్ పతాకంపై వి.శ్రీనివాసరావు తెలుగులోకి ‘మిస్టర్ ప్రేమికుడు’ పేరుతో అనువదిస్తున్నారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ప్రభుదేవా హీరోగా నటించిన సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఆయన నటించిన లేటెస్ట్ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాం. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. పాటలు, సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయి. తెలుగు అనువాద కార్యక్రమాలు ఫైనల్ దశలో ఉన్నాయి. త్వరలో ఆడియోను, ఈ నెలలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్; కెమెరా: సౌందర్ రాజన్, సహ నిర్మాతలు: మహేష్ చౌదరి గుర్రం, శంకరరావు సారికి. -
తను చాలా నచ్చింది!
‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’... ప్రభుదేవాని అభిమానులు ముద్దుగా ఇలానే పిలుచుకుంటారు. తన డ్యాన్స్‌తో ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు హీరోల చేత కూడా తనదైన శైలిలో స్టెప్పులేయించి, ప్రేక్షకులు, అభిమానుల చేత ఈలకొట్టించి గోల చేయించగలరు. ప్రభుదేవా బహుముఖ ప్రజ్ఞాశాలి అనే సంగతి తెలిసిందే. డ్యాన్స్ మాస్టర్‌గా, యాక్టర్‌గా, డైరెక్టర్‌గా అందరికీ సుపరిచితులే. తాజాగా పాటల రచయితగా మరో అవతారం ఎత్తారాయన. ప్రభుదేవా, నిక్కీగల్రానీ, అదా శర్మ ముఖ్య తారలుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చార్లీ చాప్లిన్ 2’. 2002లో విడుదలై ఘన విజయం సాధించిన ‘చార్లీ చాప్లిన్’ చిత్రానికి ఇది రీమేక్. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ‘ఇవళ ఇవళ రొంబ పిడిచిరుక్కు...’ (తను తను చాలా నచ్చింది) అనే పాటను ప్రభుదేవా రాశారు. ఈ పాటకి అమ్రిష్ చక్కని స్వరాలు అందించారు. హీరోగా మారిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఈ పాటని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. ప్రభుదేవా రాసిన తొలి పాట వినేస్తే పోలా! -
వెంటనే స్టెప్పేశా
‘అవకాశం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా చాన్స్ మిస్ చేసుకుంటాం’ అని అంటున్నారు అమైరా దస్తూర్. ధనుశ్ సరసన నటించిన ‘అనేకుడు’ (డబ్బింగ్) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమైరా.. స్ట్రయిట్ సినిమా ‘మనసుకు నచ్చింది’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తాజాగా ఈ భామ ప్రభుదేవాతో నటించే చాన్స్ కొట్టేశారు. ప్రస్తుతం దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘కాదలై తేడి నిత్యానంద’ సినిమా చేస్తున్నారామె. ఆ సినిమా తర్వాత ప్రభుదేవా కీలక పాత్రధారిగా ఆదిక్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కించనున్నారు. ఇందులో ప్రభుదేవాతో యాక్ట్ చేసే చాన్స్ వచ్చిందని ఎగై్జట్ అవుతున్నారు అమైరా. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘కాదలై తేడి..’ సమయంలోనే ఈ సినిమా గురించి దర్శకుడు చెప్పారు. కథ నాకు బాగా నచ్చింది. ఇందులో భాగమవ్వాలని అనుకున్నాను. ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తావా? అని ఆయనే అడిగారు. ప్రభుదేవా సరసన చాన్స్ వస్తే ఎవరు మిస్ చేసుకుంటారు? వెంటనే యస్ చెప్పాను. స్క్రిప్ట్‌పరంగా ఫస్ట్ హాఫ్‌లో సంప్రదాయంగా కనిపిస్తా. సెకండ్ హాఫ్‌లో చాలా బోల్డ్‌గా, సెక్సీగా కనిపిస్తాను. అలాగే ప్రభుదేవాగారితో కాబట్టి డ్యాన్స్ విషయంలో బాగా కేర్ తీసుకుంటున్నాను’’ అన్నారు అమైరా. -
‘ఆ విషయంలో ప్రభుదేవా నాకు చాలా సాయం చేశారు’
సాధరణంగా ఏదైనా డ్యాన్స్ చేసేటప్పుడు అది జాజ్ డ్యాన్సా, ఫోకా లేకా మరేదైనా అనే విషయం ముందే తెలుస్తుంది. కానీ ప్రభుదేవాతో డ్యాన్స్ చేసేటప్పుడు మాత్రం ఎంజాయ్ చేయడం తప్ప దానికి పేరు పెట్టలేం అంటున్నారు కత్రినా కైఫ్. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం థగ్స్ ఆఫ్ హిందోస్థాన్. ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం సురయ్యా టైటిల్‌తో ఉన్న పాట ప్రోమోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో కత్రినా డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేశారు. శరీరాన్ని స్ప్రింగ్‌లా వంచుతూ కత్రినా చేసిన మూవ్మెంట్స్ అభిమానులను ఫిదా చేశాయి. అయితే ఈ క్రేడిట్ అంతా కొరియోగ్రాఫర్ ప్రభుదేవాకే చేందుతుందంటున్నారు కత్రినా. ఈ పాట రిహార్సిల్స్‌లో భాగంగా తీసిన వీడియోను కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుదేవాను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ప్రభుదేవా స్టైల్‌ను నిర్వచించడం చాలా కష్టం. ఆయన శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రభుదేవా తన కొరియోగ్రఫీతో ఈ పాటకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశారు. నేను ఆయన అనుకునే స్టైల్లో డ్యాన్స్ చేయడానికి చాలా సహాయం చేశారు. కొన్ని సార్లు కోపంతో కన్నీళ్లు వచ్చాయి. కానీ చివరకూ చాలా ఎంజాయ్ చేశాం’ అంటూ కత్రినా వీడియోను పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియోను దాదాపు 19 లక్షల మందికిపైగా చూశారు. View this post on Instagram When I first saw the choreo for suraiyya, I was like is it jazz ,is it ballet, is it folk ,,, but that’s dancing with prabhudeva ... u cannot define his style it’s so unique ,he gives the song such a unique personality with his choreography. He spent a lot of time with me in rehearsals helping me figure the style , I loved it all (apart from a few moments of tears of frustration ☺️)but in the end it was the hook step which we had so much fun with . #ThugsOfHindostan @_aamirkhan | @ajayatulofficial | @vishaldadlani1 | @shreyaghoshal | #AmitabhBhattacharya | @prabhudheva | @yrf A post shared by Katrina Kaif (@katrinakaif) on Oct 25, 2018 at 10:14pm PDT -
నేను ప్రభుదేవా అభిమానిని
సినిమా: నేను ప్రభుదేవా అభిమానిని. ఆయన డాన్స్ అంటే ఎంత ఇష్టమో అని తెగ పొగిడేస్తోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్. ఇండియాలోనే మోస్ట్ గ్లామరస్ హీరోయిన్గా పేరుగాంచిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అమీర్‌ఖాన్‌తో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో రీల్ ప్రేమాయణం సాగిస్తోంది. ఈ భారీ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అసలు విషయం ఏమిటంటే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో నటి కత్రినాకైఫ్‌కు ఒక ఐటమ్ సాంగ్ తరహాలో ఒక దుమ్మురేపే పాట చోటుచేసుకుంటుందట. ఈ పాటకు డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా నృత్యరీతులను సమకూర్చారు. దీని గురించి కత్రినాకైఫ్ తెలుపుతూ ప్రభుదేవా తన ఫేవరేట్ నృత్యదర్శకుడు అని పేర్కొంది. ఆయన డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పింది. ముఖ్యంగా ముక్కాబలా పాట తన ఫేవరేట్ సాంగ్ అని పేర్కొంది. తాను థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో ఈ పాటలో నటించడానికి కారణం ప్రభుదేవా కొరియోగ్రఫినేనని అంది. ఆయన నృత్యదర్శకత్వాన్ని చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. ఇలాంటి వినూత్న కొరియోగ్రఫీని ప్రభుదేవా మాత్రమే చేయగలరని పేర్కొంది. తాను ప్రభుదేవా నృత్యదర్శకత్వంలో నటించడం ఇదే ప్రప్రథమం అని చెప్పింది. అదేవిధంగా అమితాబ్‌తో కలిసి ఈ పాటలో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌లో ప్రభుదేవా నృత్యదర్శకత్వంలో తాను నటించిన సురైయ్యా అనే పాట హైలెట్‌గా ఉంటుందని చెప్పింది. యాష్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. ఇందులోని సురైయ్యా అనే పాటలో అమితాబ్, కత్రినాకైఫ్‌ల మధ్య మంచి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని ఆయన తెలిపారు. ఈ చిత్రం నవంబర్ 8న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. -
టేక్ ఇట్ ఈజీ
‘ప్రేమికుడు’ చిత్రంలోని ‘ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి’ పాట ఎంత పాపులరో తెలిసిందే. ప్రభుదేవా, నగ్మా జంటగా శంకర్ దర్శకత్వంలో 1994లో వచ్చిన ఈ చిత్రంలోని ఆ పాట కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఆ పాటలో ప్రభుదేవా వేసిన నృత్యాలను అంత సులభంగా మరచిపోలేరు ప్రేక్షకులు. ఎంతో క్రేజ్ ఉన్న ఈ పాటను తాజాగా హిందీలో షాహిద్ కపూర్, కియారా అద్వానీలపై రీమిక్స్ చేశారు. డైరెక్టర్ గిఫ్టీ ఈ పాటకు దర్శకత్వం వహించగా, నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించారు. ప్రముఖ గాయకుడు యోయో హనీ సింగ్ ఈ పాటను కంపోజ్ చేసి, పాడటం విశేషం. అయితే పాటలోని లిరిక్స్‌ని మార్చి కేవలం ‘ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి’ని మాత్రమే తీసుకున్నారు. నైట్ క్లబ్లో చిత్రీకరించిన ఈ పాటలో షాహిద్ కపూర్ తన నృత్యాలతో ఆకట్టుకున్నారు. ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ పాటలో మరింత అందంగా కనిపించారు. ప్రస్తుతం షాహిద్, కియారా తెలుగులో ఘన విజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీ రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పాటను ఆ సినిమా కోసం రీమిక్స్ చేయలేదట. ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసమట. -
‘లక్ష్మీ’ మూవీ రివ్యూ
టైటిల్ : లక్ష్మీ జానర్ : డాన్స్ బేస్డ్ మూవీ తారాగణం : ప్రభుదేవా, దిత్య, ఐశ్వర్య రాజేష్ సంగీతం : సామ్ సీఎస్ దర్శకత్వం : ఏఎల్ విజయ్ నిర్మాత : ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్.రవీంద్రన్ తెలుగు తెర మీద డ్యాన్స్ బేస్డ్ సినిమాలు చాలానే వచ్చాయి. అదే జానర్లో తెరకెక్కిన మరో మూవీ లక్ష్మీ. ఇండియన్ డాన్సింగ్ లెజెండ్ ప్రభుదేవా ప్రధాన పాత్రలో దిత్యను పరిచయం చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన సినిమా లక్ష్మీ. అభినేత్రి, అన్న, నాన్న లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఏఎల్ విజయ్ మరోసారి తనదైన స్టైల్లో లక్ష్మీ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరి ఈ ప్రయత్నం ఎవరకు విజయవంతమైంది..? కథ ; లక్ష్మీ (దిత్య)కి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే పిచ్చి. కానీ తల్లి నందిని (ఐశ్వర్య రాజేష్)కి మాత్రం డాన్స్ అంటే గిట్టదు. అందుకే కూతుర్ని డాన్స్‌కు దూరంగా పెంచాలనుకుంటుంది. ఎలాగైనా డాన్సర్ కావాలని కలలు కంటున్న లక్ష్మీ టీవీలో ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ యాడ్ చూసి ఆ కాంపిటీషన్లో పాల్గొనాలని నిర్ణయించుకుంటుంది. అందుకే తల్లికి తెలియకుండా కాంపిటీషన్లో పాల్గొనటం కోసం ఓ రెస్టారెంట్ ఓనర్ కృష్ణ(ప్రభుదేవా) సాయం తీసుకుంటుంది. కృష్ణను తన నాన్నగా పరిచయం చేసి హైదరాబాద్ డాన్స్ అకాడమీ లో జాయినవుతుంది. అదే సమయంలో కృష్ణకు లక్ష్మీ తను ప్రేమించిన నందిని కూతురు అని తెలుస్తుంది. లక్ష్మీ స్టేజ్ ఫియర్ కారణంగా టీం క్వాలిఫయింగ్ రౌండ్ నుంచి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. కానీ లక్ష్మీ, కృష్ణ కూతురని తెలుసుకున్న సెలక్టర్ యూసుఫ్.. టీంకు కృష్ణ కోచ్‌గా ఉంటే కాంపిటీషన్ లో పాల్గొనేందుకు ఛాన్స్ ఇస్తానని చెప్తాడు. (సాక్షి రివ్యూస్) అసలు యూసుష్‌కు కృష్ణకు ఉన్న సంబంధం ఏంటి..? లక్ష్మీ టీంకు కోచ్‌గా ఉండేందుకు కృష్ణ ఒప్పుకున్నాడా..? లక్ష్మీ డాన్స్ కాంపిటీషన్లో పాల్గొంటున్న విషయం తెలిసి తల్లి నందిని ఎలా రియాక్ట్ అయ్యింది.? అన్నదే మిగతా కథ. విశ్లేషణ ; ప్రభుదేవా, కొవై సరళ లాంటి ఒకరిద్దరు తప్ప మిగతా నటీనటులంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తవారే. ఫస్ట్ హాఫ్ లో కాసేపు సత్యం రాజేష్ నవ్వించే ప్రయత్నం చేసిన రెండు మూడు సీన్స్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ప్రధాన పాత్రలో ప్రభుదేవా అద్భుతం గా నటించాడు. అయితే గతంలో ప్రభుదేవా ఈ తరహా పాత్రలో చాలా సార్లు చూశాం అనిపిస్తుంది. మరో కీలక పాత్రలో కనిపించిన దిత్య డాన్సర్‌గానే కాదు నటిగానూ మంచి మార్కులు సాధించింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో దిత్య నటన ఆకట్టుకుంటుంది. లక్ష్మీ తల్లి పాత్రలో ఐశ్వర్య రాజేష్ హుందాగా కనిపించారు. క్లైమాక్స్ సీన్స్‌లో మంచి ఎమోషన్స్ పండించారు. గతంలో డాన్స్ బేస్డ్ సినిమాలు చాలానే వచ్చాయి. ఆ సినిమాల ప్రభావం లక్ష్మీ మీద గట్టిగానే కనిపిస్తుంది. స్టైల్, డాడీ, ఏబీసీడీ లాంటి సినిమాలు ఛాయలు చాలా చోట్ల కనిపిస్తాయి. కథా కథనాల్లో పెద్దగా కొత్తదనం కనిపించకపోయినా డాన్స్ సీక్వెన్స్‌లు ఎంగేజింగ్ గా ఉన్నాయి. చాలా వరకు టీవీలో డాన్స్ రియాలిటీ షో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ లో మాత్రం దర్శకుడు విజయ్ తన మార్క్ చూపించాడు. బలమైన ఎమోషన్స్ పండించటంలో సక్సెస్ అయ్యాడు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే డాన్స్ సీక్వెన్స్ తో పాటు క్లైమాక్స్ లో లక్ష్మీకి యాక్సిడెంట్ అవ్వటం ఆ తరువాత స్టేజ్ మీద పర్ఫామ్ చేయటం లాంటి సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. సంగీత దర్శకుడు సామ్ డాన్స్ బేస్డ్ సినిమాకు కావాల్సిన స్థాయి సంగీతమందించారు. నేపథ్య సంగీతంపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన విషయం కొరియోగ్రఫి. దాదాపు అన్ని రకాల డాన్స్ ఫామ్స్‌ను పిల్లలతో చేయించారు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; డాన్స్ సీక్వెన్స్‌లు ప్రభుదేవా, దిత్య క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ; రొటీన్ కథా కథనాలు నేపథ్య సంగీతం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
నా పిల్లలకి నా డ్యాన్స్ నచ్చదు
‘‘నా నటన చూసి బాగుందని థియేటర్లో ప్రేక్షకులు కొట్టే చప్పట్లే నా ఎనర్జీ. నేను హ్యాపీగా, మరింత ఎనర్జీగా ఉండాలంటే తెలుగు సినిమాల్లోని పాటలు చూస్తా. ఆ పాటల్లో సెట్టింగ్స్, డ్యాన్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. ‘రంగస్థలం’ సినిమా చాలా బాగుంది’’ అని ప్రభుదేవా అన్నారు. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మి’. సి. కల్యాణ్, ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్.రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా ప్రభుదేవా చెప్పిన విశేషాలు. విజయ్ ఫస్ట్ నన్ను కలిసినప్పుడు ‘లక్ష్మి’ చిత్రకథ చెప్పలేదు. డ్యాన్స్ బేస్డ్ ఫిల్మ్ చేయాలన్నాడు. డ్యాన్స్ నేపథ్యంలో ‘ఏబీసీడీ’ సినిమా చేశా. ఇప్పుడు చేసే చిత్రం ఇండియా లెవల్లో ఉండా లన్నాను. అలాగే ఉంటుందన్నాడు. ఇండియా మొత్తం వెతికి అద్భుతంగా డ్యాన్స్ చేసే పదిమంది పిల్లల్ని తీసుకొచ్చాడు. పూర్తిగా డ్యాన్స్ నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. ∙గురు శిష్యుల మధ్య కథే ఈ చిత్రం. నేను డ్యాన్స్ నేర్పిస్తుంటాను. ఎమోషన్స్ ఉంటాయి. ఈ చిత్రంలో 4 నిమిషాల డ్యాన్స్‌ను సింగిల్ టేక్‌లో చేయడం జరిగింది. దీని కోసం నేను కూడా వారం ప్రాక్టీస్ చేశా. పిల్లలందరూ బాగా చేశారు. ప్రత్యేకించి దిత్య సూపర్బ్‌గా చేసింది. కష్టమైన స్టెప్స్ ఉండాలని పరేష్, రూయల్లకు చెప్పా. వారు చక్కగా కొరియోగ్రఫీ చేశారు. ∙‘లక్ష్మి’ చిత్రంలో కొరియోగ్రఫీలో నేను ఇన్వాల్వ్ కాలేదు. కేవలం నటించానంతే. నేను నటిస్తున్నప్పుడు డైరెక్షన్, కొరియోగ్రఫీలో కలగజేసుకోను. డైరెక్టర్‌గా డైరెక్షన్ గురించే ఆలోచిస్తా. కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు డ్యాన్స్ మాత్రమే నా మైండ్‌లో ఉంటుంది. ఒకటి చేస్తున్నప్పుడు మరో దాంట్లో ఇన్వాల్వ్ కాను. ‘లక్ష్మి’ టైటిల్ పాజిటివ్‌గా, బాగుందని నేనే పెట్టమని చెప్పా. ∙నాది, డైరెక్టర్ విజయ్‌ది విభిన్నమైన మనస్తత్వాలు అయినా మా ఇద్దరికీ సెట్ అయింది. అందుకే తనతో ‘అభినేత్రి, లక్ష్మి’ సినిమాలు చేశా. మా కాంబినేషన్లో ‘అభినేత్రి 2’ కూడా వస్తుంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్నా. ప్రస్తుతం పోలీసాఫీసర్‌గా చేస్తున్నా. 1948 కుల్ఫూ నేపథ్యంలో ఓ సినిమా, సీరియల్ థ్రిల్లర్‌గా మరో సినిమా చేస్తున్నా. జనవరిలో ఓ హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తా. ∙వేరే హీరోల పాటలకి కొరియోగ్రఫీ చేయాలని ఉన్నా ఎవ్వరూ పిలవడం లేదు (నవ్వుతూ). ఇటీవల ధనుష్‌కి ఓ పాటకి కొరియోగ్రఫీ చేశా. ‘ప్రేమికుడు 2’ చేసే ఏజ్ దాటిపోయా. ‘ప్రేమికుడు 10’ చేయమంటే చేస్తా (నవ్వుతూ). ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ అని ఫ్యాన్స్, ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తు్తంటే సంతోషంగా ఉంది. నా పిల్లలకి నా డ్యాన్స్ ఒక్కశాతం కూడా నచ్చదు. వేరేవాళ్ల డ్యాన్స్ 10% నచ్చుతుంది. ఎందుకో మరి? వాళ్లు అలా ఫిక్స్ అయ్యారు. -
అది వేరే లెవల్
తమిళసినిమా: ఆ చిత్రం వేరే లెవల్. దానితో పోల్చకండి అని అన్నారు నటుడు ప్రభుదేవా. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన చిత్రం లక్ష్మీ. దేవి చిత్రంతో హిట్ కొట్టిన ఈయన ఇప్పుడు లక్ష్మీ అంటున్నారు. ఇది డాన్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. ప్రమోద్ ఫిలింస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు. ప్రభుదేవాకు జంటగా నటి ఐశ్వర్యరాజేశ్ నటించిన ఇందులో బేబీ దిత్య ప్రధాన పాత్రలో నటించింది. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో నటి ఐశ్వర్యరాజేశ్ మాట్లాడుతూ..ఈ చిత్రంలో తన పాత్ర చిన్నదే అయినా కథ అంతగా తనను ఆకట్టుకుందని ఐశ్వర్యరాజేశ్ అన్నారు. ప్రభుదేవాతో కలిసి నటించడం చాలా మంచి అనుభవం అని పేర్కొన్నారు. ప్రభుదేవా మాట్లాడుతూ లక్ష్మీ చిత్రాన్ని చూసి రవీంద్రన్ విడుదల హక్కులను పొందారన్నారు. దర్శకుడు విజయ్ కలిసి డాన్స్ ఇతి వృత్తంతో చిత్రం చేద్దాం అని చెప్పగానే సాధా సీదా చిత్రంలా కాకుండా ఇండియా స్థాయిలో ఆ చిత్రం ఉండాలని చెప్పానన్నారు. పలువురు చిన్నారులతో విజయ్ అదే స్థాయిలో లక్ష్మీ చిత్రాన్ని తీశారని చెప్పారు. ఆయన దర్శకత్వంలో దేవీ, లక్ష్మీ చిత్రాల్లో నటించానని, అదే విధంగా దేవి– 2 చిత్రంలోనూ నటించాలని నిర్ణయించుకున్నానన్నారు. తాను ఈ చిత్రంలో 4,5 టేక్‌లు తీసుకున్నా, పిల్లలు ముఖ్యంగా దిత్యా సింగిల్ టేక్‌లో ఫుల్ మూమెంట్‌ను ఆడేసేదన్నారు. ఇంతకు ముందు డాన్స్ నేపథ్యంలో సలంగై ఒళి వచ్చిన విషయం తెలిసిందేనన్నారు. అది వేరే లెవల్ అని, ఆ చిత్రంతో లక్ష్మీ చిత్రాన్ని పోల్చవద్దు అని అన్నారు. అయితే ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని ప్రభుదేవా అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ ఈ చిత్రం కోసం ప్రభుదేవా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నటించారని అన్నారు. ఆయన తమ టీమ్‌కు అతి పెద్ద పిల్లర్ అని పేర్కొన్నారు. -
కొత్త ఉత్తేజం
ముందు ప్రభుదేవా వేసి చూపించిన స్టెప్‌కి ధనుష్ కాలు కదిపారు. టైమింగ్ కుదర్లేదట. నెక్ట్స్ ఆ డ్యాన్స్ మూమెంట్‌లోని ట్రిక్‌ను ధనుష్‌కు చెప్పారు ప్రభుదేవా. అంతే..సేమ్ టు సేమ్ స్టెప్ వచ్చేసింది. ‘మారి 2’ సినిమా సెట్లో ఇదంతా జరిగింది. బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘మారి 2’. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. మూడేళ్ల క్రితం బాలాజీ మోహన్, ధనుష్ కాంబినేషన్లోనే వచ్చిన ‘మారి’ చిత్రానికి సీక్వెల్ ఇది. శుక్రవారంతో ఈ సినిమాలోని ఓ సాంగ్‌ను కంప్లీట్ చేశారు. ఈ సాంగ్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ‘‘ డ్యాన్సింగ్ లెజెండ్ ప్రభుదేవాగారి కొరియోగ్రఫీలో ‘మారి 2’ కోసం ఓ సాంగ్‌ను కంప్లీట్ చేశాం. ఆయన ప్రోత్సాహం మాలో కొత్త ఉత్తేజాన్ని నింపింది. థ్యాంక్స్ సర్’’ అని ప్రభుదేవా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారట. -
ప్రభుదేవాతో మరోసారి..
తమిళసినిమా: దేవి చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని చవిచూసింది. అందులో జంటగా నటించిన ప్రభుదేవా, తమన్నా మరోసారి జతకట్టనున్నారన్నది తాజా వార్త. అవును ఈ హిట్ పెయిర్‌తో నటుడు, దర్శకుడు పార్థిబన్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వైవిధ్య కళా చిత్రాల దర్శకుడైన ఈయన కొడిట్ట ఇడంగళ్ విరంబుగా చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. ఇప్పుడు కొత్త చిత్రానికి రెడీ అయ్యారు. దీని గురించి ఆయనే వెల్లడించారు. తాను ప్రభుదేవా హీరోగా చిత్రం చేయబోతున్నట్లు తెలిపారు. ప్రభుదేవాకు కథ వివరించానని తామిద్దం కలసి పని చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన రివెంజ్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా నాయకిగా నటించనున్నట్లు చెప్పారు. అయితే ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించేది నిర్ణయం కాలేదన్నారు. ఆ విషయాలన్ని ఒక కొలిక్కి వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. ఇందులో పార్థిబన్ కూడా నటిస్తారా? అన్నది వెల్లడించలేదు. అయితే ఇంతకుముందు ప్రభుదేవా, పార్థిబన్ కలిసి జేమ్స్‌బాండ్ చిత్రంలో నటించారన్నది గమనార్హం. మొత్తం మీద ఈ సంచలన కాంబినేషన్ ఒక భారీ చిత్రం రాబోతుందన్నమాట. -
గెలుపు పోరాటం
ఊహించని ఓ సంఘటన ఒక పోలీస్ జీవితాన్ని కుదిపేసింది. కానీ అతను నిరుత్సాహపడలేదు. ఆ తర్వాత కష్టపడి పర్సనల్‌గా, ప్రొఫెనల్‌గా సక్సెస్ అయ్యాడు. ఇందుకోసం ఆయన ఎలా గెలుపు పోరాటం చేశాడు? ఎదుర్కొన్న కష్టనష్టాలు ఏంటి? అనే అంశాలతో తమిళంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ‘పొన్ మాణిక్కవేల్’. ముగిల్ దర్శకత్వంలో ప్రభుదేవా, నివేథా పేతురాజ్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభుదేవా తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ‘‘ఒక పోలీసాఫీసర్ జీవితంలో జరిగిన ఇన్వెస్టిగేటివ్ ఎపిసోడ్స్ ఆధారంగా ఈ సినిమా కథనం సాగుతుంది. అలాగే ప్రస్తుత పరిస్థితులను టచ్ చేస్తున్నాం. అచ్చమైన పోలీస్‌లా కనిపించడానికి ప్రభుదేవా చాలా కృషి చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా తన స్టడీస్‌ను కంటిన్యూ చేయాలనుకుని ఆశపడే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నివేథా పేతురాజ్ నటిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
సల్మాన్, కత్రినా, రణ్‌వీర్‌లపై దావా
ఇల్లినాయిస్, అమెరికా : సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, రణ్వీర్ సింగ్, ప్రభుదేవా, అక్షయ్ కుమార్లపై అమెరికాలో భారతీయ అమెరికన్ ప్రమోటర్ కంపెనీ దావా వేసింది. డబ్బు తీసుకుని కన్సర్ట్‌లో పాల్గొనడానికి నటీనటులు నిరాకరిస్తున్నారని దావాలో పేర్కొంది. చికాగోకు చెందిన వైబ్రంట్ మీడియా గ్రూప్ ఇల్లినాయిస్ కోర్టులో దావాను వేసింది. వైబ్రంట్ మీడియా వేసిన దావాలో నటీనటులు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, రణ్వీర్ సింగ్, ప్రభుదేవా, అక్షయ్ కుమార్, సింగర్లు ఉదిత్ నారాయణ్, ఆల్కా యాజ్ఞిక్, ఉషా మంగేష్కర్లు, మాట్రిక్స్ ఇండియా ఎంటర్టైన్మెంట్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, యాష్‌రాజ్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు కాంట్రాక్టును ఉల్లంఘించాయని పేర్కొంది. సల్మాన్‌తో మిగిలిన ఆర్టిస్టులు తమతో ఒప్పందం కుదుర్చుకుని వేరే ప్రమోటర్‌తో కన్సర్ట్ చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలిసిందని పిటిషన్లో వైబ్రంట్ మీడియా వెల్లడించింది. తమకు నష్టపరిహారంగా 1 మిలియన్ డాలర్లు ఇప్పించాలని కోర్టును కోరింది. -
నివేదాకు లక్కీచాన్స్
తమిళసినిమా: యువ నటి నివేదా పేతురాజ్‌కు అవకాశాలు వరుసగా తలుపుతడుతున్నాయి. ఒరునాళ్ కూత్తు చిత్రంతో కోలీవుడ్‌లో హీరోయిన్గా పరిచయమైన ఈ దుబాయ్ రిటర్న్ తమిళ నటికి ఆ తరువాత కెరీర్ కాస్త తడబడ్డా తాజాగా వేగం పుంజుకుంది. నిజం చెప్పాలంటే జయంరవితో టిక్ టిక్ టిక్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశం రావడంతోనే ఈ అమ్మడి లక్కు స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు. ఈ చిత్రం వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తొలి ఇండియన్ స్పేస్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలనంతరం తన టైమ్ బాగుంటుందని భావించిన నివేదా పేతురాజ్‌కు అంతకు ముందే భారీ అవకాశాలు వరించడం విశేషమే. ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంటున్న ఈ బ్యూటీ నటించిన మూడు చిత్రాలు 2018లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. జయంరవితో నటించిన టిక్ టిక్ టిక్, వెంకట్‌ప్రభు నిర్మించిన పార్టీ, విజయ్‌ఆంథోనికి జంటగా నటిస్తున్న తిమిరు పుడిచవన్ చిత్రాలు ఈ ఏడాదిలో విడుదల కానున్నాయి. తాజాగా మరో లక్కీఛాన్స్ నివేదా పేతురాజ్‌ను వరించింది. డాన్సింగ్‌స్టార్ ప్రభుదేవాతో రొమాన్స్ చేసే అవకాశమే అది. అవును ప్రభుదేవా తాజాగా హీరోగా జపక్ నెమీచంద్ ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుతో ప్రభుదేవా తొలిసారిగా పోలీస్ అధికారిగా నటించనున్నారు. మంచి యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుందంటున్నారు చిత్ర వర్గాలు. ఏసీ.మౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాయకిగా నివేదా పేతురాజ్‌ను ఎంపిక చేశారు. ఈమెతో పాటు ముఖ్యపాత్రల్లో సీనీయర్ దర్శకుడు మహేంద్రన్, సురేశ్‌మీనన్ నటించనున్నారు. మరోవిశేషం ఏమిటంటే ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారు. అజిత్ నటిస్తున్న విశ్వాసం చిత్రం తరువాత ఈయన కమిట్ అయిన చిత్రం ఇదే అవుతుంది. -
వారితో రొమాన్సే చాలు !
తమిళసినిమా : ఇప్పటికీ హీరోలతో రొమాన్సే చాలనుకుంటున్నాను అంటోంది నటి నిక్కీగల్రాణి. కోలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్గా పేరొందిన ఉత్తరాదిభామ ఈ జాణ. డార్లింగ్, కలగలప్పు–2 చిత్రాలతో తమిళ సినీరంగంలో సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నిక్కీగల్రాణికి ఇటీవల నటించిన పక్కా చిత్రం నిరాశపరచింది. ప్రస్తుతం కీ, చార్లిన్చాప్లిన్–2 చిత్రాల్లో నటిస్తోంది. ప్రభుదేవాకు జంటగా చార్లిన్ చాప్లిన్–2 చిత్ర షూటింగ్‌ను పొల్లాచ్చిలో పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగి వచ్చిన నిక్కీగల్రాణితో చిన్న ఇంటర్వ్యూ.. ప్ర: ప్రేమ, రొమాన్స్లాంటి పాత్రలతో పాటు యాక్షన్ కథా పాత్రల్లో నటించాలన్న ఆసక్తి లేదా? జ: నిజం చెప్పాలంటే నేను కథ, నా పాత్ర బాగుండాలన్న కోణంలోనే ఆలోచిస్తాను. అందులో ప్రేమ, రొమాన్స్, సెంటిమెంట్, యాక్షన్ సన్ని వేశాలు ఉన్నాయా అన్నది ఆలోచించను. నచ్చిన కథా చిత్రాలను ఎంచుకుని నటించడం వల్లే వరుసగా అవకాశాలతో ముందుకు సాగుతున్నాను. ప్ర: ప్రస్తుతం హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్న కథలను తయారు చేసుకుంటున్న క్రియేటర్స్ అధికం అవుతున్నారు. అలాంటి కథా చిత్రాల్లో నటించే ఆలోచన ఉందా? జ: ప్రస్తుతానికి అలాంటి కథా చిత్రాల్లో నటించాల్సిన అవసరం నాకు లేదు. మరొ కొన్నేళ్లు నేను హీరోహీరోయిన్ల చుట్టూ తిరిగే ప్రేమకథా చిత్రాల్లోనే నటించాలని కోరుకుంటున్నాను. నా చుట్టూ తిరిగే కథా చిత్రాలు ఇప్పుడే అవసరం అనుకోవడం లేదు. మరి కొన్ని ఏళ్లు హీరోలతో రొమాన్స్ చేసే పాత్రల్లో నటించి, ఆ తరువాత మీరంటున్న ఆ హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల గురించి ఆలోచిస్తాను. ప్ర: ప్రస్తుతం నటిస్తున్న కీ, చార్లిన్ చాప్లిన్ 2 చిత్రాల గురించి? జ: నిజం చెప్పాలంటే జీవాకు జంటగా నటించడానికి అంగీకరించింది కీ చిత్రంలోనే. అయితే ఆ తరువాత ఒప్పుకున్న కలగలప్పు–2 చిత్రం ముందుగా తెరపైకి వచ్చింది. కీ చిత్రంలో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉండడంతో ఆ చిత్ర విడుదల్లో జాప్యానికి కారణం అని నా అభిప్రాయం. ఇందులో చలాకీగా ఉండే యువతిగా నటిస్తున్నాను. నాకు ఏది అనిపిస్తే అది చేసే పాత్ర. ఆ తరువాత జరిగే పరిణామాల గురించి ఆలోచించని పాత్ర. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ చిత్రంలో నటించాను. చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇక చార్లిన్ చాప్లిన్–2 చిత్రం గురించి చెప్పాలంటే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా ఒక్క పాటనే చిత్రీకరించాల్సి ఉంది. దర్శకుడు శక్తిచిదంబరం, ప్రభుదేవా వంటి జాలీ అయిన కాంబినేషన్లో నటిస్తున్నాను. చిత్ర షూటింగ్ పండగ వాతావరణంలో సాగింది. షూటింగ్ అంతా చాలా సరదాగా సాగింది. ఇందులో నా పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ప్ర: నెరుప్పుడా, పక్కా చిత్రాలు ఆశించిన విధంగా సక్సెస్ కాలేదు.దీనికి మీ స్పందన? జ: చిత్రం విజయం సాధింస్తుందని భావించే 100 శాతం శ్రమిస్తాం. అలాంటి చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందక పోతే బాధే కదా. అయితే దేశవ్యాప్తంగా ఏడాదికి 500లకు పైగా చిత్రాలు విడుదలవుతున్నాయి. అందులో నా చిత్రం ఒకటి అని సరిపెట్టుకుంటాను. -
ఫ్రెండ్ మాత్రమే
అడిగిన ప్రశ్నకు సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెబితే ఏ తంటా ఉండదు. అలా కాకుండా వేరే విధంగా చెబితే చిక్కులు వచ్చి పడతాయి. ‘పులి’ ఫేమ్ నికిషా పటేల్‌కి అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రభుదేవాతో కలిసి యాక్ట్ చేసే ఆలోచన ఉందా? అని ఓ విలేకరి నికిషాని అడిగితే.. ‘‘మీరేమో ప్రభుదేవాతో కలిసి యాక్ట్ చేస్తారా? అని అడుగుతున్నారు. బట్ నాకు ప్రభుదేవాని పెళ్లాడాలని ఉంది’’ అని పేర్కొన్నారట నికిషా. దాంతో ప్రభుదేవా, నికిషా పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు ఇంటర్నెట్లో హడావిడి చేశాయి. ఇది తెలుసుకున్న నికిషా.. ఈ వార్తలకు వెంటనే ట్వీటర్లో స్పందిస్తూ – ‘‘ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో విసిగిపోయాను. ప్రభుదేవా సార్, నేనూ పెళ్లి చేసుకోబోతున్నాం అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎక్కడో మిస్ అండర్స్టాండింగ్ జరిగింది. ప్రభుదేవా సార్ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. నా వెల్ విషర్. నేను ఆయన్ను సార్ అనే పిలుస్తాను. ప్రస్తుతం నా వర్క్, నా ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను’’ అని క్లారిఫై చేశారు. -
ఆయన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ!
తమిళసినిమా: డాన్సింగ్ స్టార్‌ను పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ అంటోంది నటి నికీషాపటేల్. తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా పులి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన గుజరాతీ బ్యూటీ నికీషాపటేల్. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో అక్కడ అవకాశాలను రాబట్టుకోలేకపోయింది. ఆ తరువాత తమిళ చిత్రం పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఎన్నమో ఏదో, కరైయోరం, నాదన్ చిత్రాల్లో నటించినా ఇప్పటికీ సరైన సక్సెస్ లేక స్టార్డమ్ కోసం పోరాడుతూనే ఉంది. ఆ మధ్య కన్నడ చిత్రపరిశ్రమలోకి కూడా అడుగుపెట్టిన నికీషాపటేల్‌కు బాలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయట. అయితే ప్రముఖ హీరోల సరసన, అదే విధంగా హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటిస్తానని అంటోందట. ఈ అమ్మడికి తాజాగా కోలీవుడ్‌లో పాండిముని చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం పరిచయం కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన నికీషాపటేల్ మీడియాతో ముచ్చటించింది. అదేంటో చూద్దాం. రెండేళ్ల తరువాత నేను నటిస్తున్న తమిళ చిత్రం ఇది. చిత్రపరిశ్రమలో ఇటీవల కాస్టింగ్ కౌచ్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. అవకాశాల కోసం నటీమణులను పడక గదికి రమ్మంటున్నారని కొందరు బహిరంగంగా చెబుతున్నారు. అయితే ఇదే విషయాన్ని నేను ఎప్పుడో చెప్పాను. అలాంటి సంస్కృతి ఉందన్నది చేదు నిజం. అయితే ఇది సినిమారంగంలో మాత్రమే కాదు అన్ని రంగాల్లోనూ జరుగుతున్న తతంగమే. సినిమా రంగం కాబట్టి బహిరంగంగా ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఏ హీరో నటన అంటే మీకు ఇష్టం అని అడుగుతున్నారు. చాలా మంది హీరోల నటన నాకు ఇష్టం. ముఖ్యంగా ప్రభుదేవా అంటే చాలా ఇష్టం. ఆయన, మా కుటుంబం మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రభుదేవాతో నటిస్తారా అని అడుగుతున్నారు. నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడానికే రెడీ అంటున్నాను అని నికీషా పటేల్ పేర్కొంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ప్రభుదేవాకు చాలా కాలం క్రితమే పెళ్లి అయ్యింది.ఆయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మనస్పర్థల కారణంగా భార్యకు విడాకులు తీసుకున్న ప్రభుదేవా నటి నయనతారను ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అదీ చివరి నిమిషంలో పెళ్లి పీటలెక్కలేదన్న విషయం తెలిసిందే. -
మెర్క్యురీకి టైమ్ వచ్చింది!
సాక్షి, సినిమా : ప్రభుదేవా మెర్క్యురీకి టైమ్ వచ్చింది. 48 రోజుల చిత్రపరిశ్రమ సమ్మె తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం, సినీ సంఘాలతో ఇటీవల జరిపిన ద్వైపాక్షిక చర్చలు సఫలం కావడంతో శుక్రవారం కొత్త చిత్రాలు విడుదల అవుతాయని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ బుధవారం వెల్లడించారు. అదేవిధంగా చిత్ర షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి పరిస్థితిలో సమ్మె విరమణ తరువాత తెరపైకి వస్తున్న తొలి చిత్రంగా మెర్క్యురీ నమోదైంది. ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఇది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఇందులో రమ్యా నంబీశన్, మేయాదమాన్ చిత్రం ఫేమ్ ఇందుజా నాయికలుగా నటించారు. ఇది హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన మూఖీ చిత్రం. మొత్తం మీద ఇదో ప్రయోగాత్మక సైలెంట్ థ్రిల్లర్ చిత్రం. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని చిత్రపరిశ్రమ సమ్మె కొనసాగుతుండగానే విడుదల చేస్తానని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ప్రకటించారు. ఆ తరువాత సినీవర్గాల వ్యతిరేకతతో వెనక్కు తగ్గారు. అయితే తమిళంలో మినహా ప్రపంచవ్యాప్తంగా మెర్క్యురీ చిత్రం గత వారమే విడుదలైంది. అంతేకాదు ఈ చిత్రం ఇతర భాషల్లో వెబ్‌సైట్స్‌ల్లో కూడా హల్చల్ చేస్తోంది. దీంతో ప్రభుదేవా ఈ చిత్రాన్ని పైరసీ సీడీలో చూడకండి అని విజ్ఞప్తి చేశారు. ఈ రీజన్‌తోనే అయ్యి ఉండవచ్చు సమ్మె విరమణ తరువాత మొదట ఈ చిత్రాన్ని విడుదలకు నిర్మాతల మండలి అనుమతి ఇచ్చి ఉండవచ్చు. అయితే దీనితో పాటు రెండు చిన్న చిత్రాలు శుక్రవారం తెరపైకి రానున్నాయి. -
ఐపీఎల్: 10 నిమిషాలకు తమన్నా అంత తీసుకుందా!
ముంబై : మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్-2018 ఆరంభోత్సవ వేడుకల్లో సౌత్‌బ్యూటీ తమన్నా చిందేయనుంది. పదినిమిషాల ప్రదర్శనకు ఈ అమ్మడు ఏకంగా 50 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో తమన్నాతో కలిసి డ్యాన్సింగ్ మ్యాస్ట్రో ప్రభుదేవా ప్రేక్షకులను అలరించనున్నాడు. నాలుగు దక్షిణాది పాటల్లో చిందేసే వీరి నృత్యాన్ని శైమక్ దేవర్ కొరియోగ్రఫి చేసినట్లు సమాచారం. ఇక ఈ అవకాశంపై తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. తొలిసారి క్రీడా ఈవెంట్లో ప్రదర్శన చేస్తున్నానని సంబరపడిపోయింది. ఇంతకముందు ఇలాంటి వేడుకల్లో ఎప్పుడు పాల్గొనలేదని, ఐపీఎల్ వంటి అద్భుతమైన టోర్నీకి అవకాశం రావడం సంతోషంగా ఉందని ఈ మిల్కీబ్యూటీ చెప్పుకొచ్చింది. సినిమాల్లో నటించడం వేరు స్టేడియంలో ప్రేక్షకుల ముందు చేయడం వేరని, మనమంతా పిచ్చిగా ఆరాధించే క్రికెట్ పండుగ ఈ రాత్రి మొదలవుతుందని ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఈ వేడుకల్లో తమన్నా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రదర్శన చేయనుంది. దీనిపై స్పందిస్తూ.. ముంబై, హైదరాబాద్, చెన్నైలు తన సొంత నగరాలని తెలిపింది. తాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ నాలుగు భాషలకు చెందిన నాలుగు పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే ఈ వేడుకల్లో తమన్నా, ప్రభుదేవాలతో పాటు స్టార్ హీరోలు హృతిక్ రోషన్, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు డ్యాన్సులతో అభిమానులను కనువిందు చేయనున్నారు. అయితే ఈ వేడుకల నుంచి భుజగాయంతో రణవీర్‌సింగ్, షూటింగ్ బిజీతో పరణితీ చోప్రాలు తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ ఆరంభ వేడుకలు అనంతరం చెన్నైసూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ మొదలవుతుంది. It's time for some great adrenaline, it's time for IPL!! #vivoipl A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on Apr 6, 2018 at 10:47pm PDT -
‘సింగం–3’ తర్వాత సినిమాలు చేయకూడదనుకున్నా
‘‘గతంలో ‘గులేబకావళి’ టైటిల్‌తో విడుదలైన సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది. ట్రైలర్, పాటలు చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తి కలుగుతోంది’’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ప్రభుదేవా, హన్సిక జంటగా రేవతి ప్రధాన పాత్రలో కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గులేబకావళి’. తమిళంలో సంక్రాంతికి విడుదలై హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే పేరుతో మల్కాపురం శివకుమార్ తెలుగులో ఏప్రిల్ 6న విడుదల చేస్తున్నారు. వివేక్ మెర్విన్ స్వరపరచిన ఈ సినిమా బిగ్ సీడీని రసమయి బాలకిషన్ విడుదల చేశారు. ఆడియో సీడీలను దర్శకుడు ఎన్.శంకర్ విడుదల చేయగా, నటి జీవిత తొలి సీడీ అందుకున్నారు. ఈ సందర్భంగా మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ– ‘‘సింగం 3’ తర్వాత సినిమాలు చేయడం ఆపేద్దామనుకున్నా. ఇండస్ట్రీలో సక్సెస్ అయితే తర్వాతి సినిమా ఏంటని అడుగుతారు. ఫ్లా్లప్ అయితే ఎవరూ కనిపించరు. కానీ, పది మందికి ఆదరణ చూపే ఇండస్ట్రీ ఇది. ఎంతోమంది చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. తమిళం రాకున్నా ‘గులేబకావళి’ సినిమా చూసి సాధారణ ప్రేక్షకునిగా ఎంజాయ్ చేశా. తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనిపించి విడుదల చేస్తున్నా’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రమిది. తమిళ ప్రేక్షకులను అలరించినట్టు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు కల్యాణ్. -
వారితో నటించడం మంచి అనుభూతి
-
వారితో నటించడం మంచి అనుభూతి
‘‘దర్శకుడు విజయ్‌తో ‘అభినేత్రి’ సినిమా చేయడం గొప్ప అనుభవం. ‘అభినేత్రి 2’ కూడా చేద్దామనుకున్నాం. ఆ సమయంలో ‘లక్ష్మి’ కథ విన్నా. బాగా నచ్చింది. ఇలాంటి సినిమాకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. శ్యామ్ అద్భుతమైన సంగీతం అందించారు’’ అని ప్రభుదేవా అన్నారు. ప్రభుదేవా, ఐశ్వర్యా రాజేష్ జంటగా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్.రవీంద్రన్ నిర్మిస్తోన్న ‘లక్ష్మీ’ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రభుదేవా మాట్లాడుతూ– ‘‘డ్యాన్స్ బేస్డ్ ఫిల్మ్ చేయాలని విజయ్ అంటే ఓ రేంజ్లో చేయాలనుకున్నా. నిర్మాతలు కూడా నా అభిప్రాయాన్ని అర్థం చేసుకుని మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమాలో నటించిన పిల్లలను ఇండియా మొత్తం నుంచి ఎంపిక చేశారు. వారు బాగా నటించారు. వారితో నటించడం మంచి అనుభూతినిచ్చింది’’ అన్నారు. ‘‘ప్రభుదేవా డ్యాన్సింగ్ లెజెండ్. ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా ఓ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్’’ అన్నారు దర్శకుడు విజయ్. ‘‘భవిష్యత్‌లో తెలుగు, తమిళంలో మరిన్ని సినిమాలు చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: నిరవ్ షా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: గణేశ్, ఓమార్. -
వాంటెడ్ దబాంగ్
సల్మాన్‌ఖాన్–ప్రభుదేవా దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘వాంటెడ్’ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. మరోసారి వీరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. అది కూడా సల్మాన్‌కి మాంచి హిట్స్ ఇచ్చి కలెక్షన్ల వర్షం కురిపించిన ‘దబాంగ్’ సిరీస్ కావడం విశేషం. ‘దబాంగ్’ కి అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, ‘దబాంగ్ 2’ ని సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్‌లో ‘దబాంగ్ 3’ రాబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై అర్బాజ్‌ఖాన్‌తో పాటు పలువురి పేర్లు వినిపించాయి. అయితే.. ఆ అవకాశం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాని వరించింది. ఈ విషయాన్ని ప్రభుదేవా స్వయంగా ప్రకటించారు. ‘‘దబాంగ్ 3’ సినిమాకు సంబంధించి గత వారం ముంబాయిలో చర్చలు జరిపాం. ఈ చిత్రానికి నన్నే దర్శకత్వం వహించమని సల్మాన్‌ఖాన్, అర్బాజ్ ఖాన్ కోరారు. నేనే దర్శకత్వం వహిస్తున్నా. కథానాయిక సోనాక్షీసిన్హా నటిస్తారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ పాతవారే ఉంటారు’’ అన్నారు ప్రభుదేవా. -
దబాంగ్ 3 డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలలో దబాంగ్‌ది ప్రత్యేక స్థానం. 2010లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సల్మాన్ స్టామినా చాటిచెప్పింది. ఆ తర్వాత వచ్చిన దబాంగ్ 2 కూడా సల్మాన్‌కి మంచి విజయాన్ని అందించింది. తాజాగా దబాంగ్ 3 నిర్మిస్తున్నట్టు వార్తలు రావడంతో ఆ సినిమా విశేషాలపై ఆసక్తి నెలకొంది. ఈ సీరిస్‌లో విడుదలైన సినిమాలు భారీగా కలెక్షన్లు రాబట్టడంతో, తాజా సినిమాపై పెద్ద ఎత్తున్న అంచనాలు నెలకొన్నాయి. దబాంగ్, దబాంగ్ 2 లలో సల్మాన్‌కు జోడిగా సోనాక్షి సిన్హా నటించారు. ఈ రెండింటిని నిర్మించిన సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్, తాజా చిత్రానికి కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. దబాంగ్‌కు అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, దబాంగ్ 2 కి అర్భాజ్ ఖాన్ ఆ బాధ్యతలు చేపట్టారు. తాజా చిత్రంపై అంచనాలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో దర్శకుడు ఎవరనేది తెలుసుకోవడానికి అందరు ఆసక్తి కనబరుస్తున్నారు. వీటన్నింటికి ఇండియన్ మైఖల్ జాక్సన్ ప్రభుదేవా తెరదించారు. ఈ సినిమాకు తనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. రెండు సినిమాలకు పనిచేసిన హీరోయిన్ సోనాక్షి, మ్యూజిక్ అందించిన సాజిద్-వాజిద్లతో పాటు, ఇతర బృందం అంత పాతదే ఉంటుందని, తాను ఒక్కన్ని మాత్రమే కొత్తగా చేరుతున్నానని తెలిపారు. సల్మాన్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఒదులుకొవడానికి ఎవరు సిద్ధపడరని ఆయన అన్నారు. సినిమా హిట్, ప్లాఫ్ అనేది హీరో భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయి, కానీ సల్మాన్‌కి వాటితో ఏ మాత్రం సంబంధం లేని సూపర్‌స్టార్ అని పేర్కొన్నారు. గతంలో ప్రభుదేవా సల్మాన్ నటించిన వాంటెడ్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మహేశ్‌బాబు నటించిన తెలుగు మూవీ పోకిరి రిమేక్. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు రాబట్టడంతో, దబాంగ్ 3పై అంచనాలు మరింతగా పెరగనున్నాయి. -
ఏడేళ్ల తరువాత.. ఆ నటి మళ్లీ..!
సాక్షి, చెన్నై: ఏడేళ్ల తర్వాత నూతన ఉత్సాహంతో హీరోయిన్ మమతా మోహన్‌దాస్ మళ్లీ తెరపైకి రానుంది. ఆమె చాలా మంది యువతకు స్పూర్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే క్యాన్సర్ మహమ్మారిని జయించి నిలిచిన అతికొద్ది మందిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. పలు చిత్రాలో నటించిన ఈ నటి తాజాగా తన రీఎంట్రీని మొదలెట్టింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో రెండు అవకాశాలను దక్కించుకుంది ఈ బ్యూటీ. అందులో ఒకటి డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేసే అవకాశం. ఆయన నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్ చిత్రం నిర్మాణంలో ఉంది. కార్తీక్ సుబ్బారాజ్ దర్శకత్వంలో మెర్కురీ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఆయన మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జంటగా నటి మమతా మోహన్‌దాస్ నటిస్తోంది. ఆ చిత్రానికి ఊమై విళిగల్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. మరో చిత్రాన్ని కూడా ఆమె అంగీకరించింది. పార్థిబన్ స్వీయ దర్శకత్వంలో నటించనున్న ఉళై వెళియో 2 చిత్రంలో ఆయనకు జంటగా నటించబోతుంది. ఈ చిత్రాల విడుదల తర్వాత ఈ అమ్మడిని మరిన్ని అవకాశాలు వరించే అవకాశం ఉందని చెప్పవచ్చు. -
అంచనాలు పెంచుతున్న మూకీ మూవీ టీజర్
సాక్షి, హైదరాబాద్: డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్క్యూరి టీజర్ తాజాగా విడుదలైంది. టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ఎలాంటి సంభాషణలు లేకుండా మూకీ మూవీ కావడంతో ఈ సైలెంట్ థ్రిల్లర్‌పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. గతంలో కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన పుష్పక విమానం మూవీ తరహాలోనే ‘మెర్క్యూరి’ మూవీలో పాత్రలు మాట్లాడవు. కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే మూవీ కొనసాగనుంది. ఇంతవరకూ డైలాగ్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను దర్శకులు భయపెట్టారు. కానీ ఇందులో ప్రభుదేవా లుక్ చూశాక.. డైలాగ్స్ లేని సైలెంట్ థ్రిల్లర్‌ను కేవలం ఆ నటీనటుల హావభావాలతో ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సైలెంట్ థ్రిల్లర్‌గా మెర్క్యూరి తెరకెక్కింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సైలెంట్ హార్రర్ థ్రిల్లర్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సంతోష్ నారాయణ్ సంగీతం మూవీకి ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. మెర్క్యూరి ఈ ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది. -
ప్రభుదేవాతో పోటీపడి మరీ డ్యాన్సులు
సాక్షి, సినిమా : ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా వయసు పెరుగుతున్న డాన్సుల్లో ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఆయన నటించిన లక్ష్మీ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఆయన వేసిన బ్రేకింగ్ స్టెప్పులు ఆకట్టుకోగా.. డాన్సింగ్ సెన్సేషన్ కిడ్ దిత్యా భాండే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డాన్స్ నేపథ్యంగానే సాగుతుందని స్పష్టమౌతోంది. బాలీవుడ్ హిట్ సిరీస్ ఏబీసీడీ తరహాలో సాగే కథనంలా కనిపిస్తున్నప్పటికీ.. చిన్నపిల్లల పోటీ అనిపిస్తోంది. ముఖ్యంగా చిన్నారి దిత్యా భాండే పోటీ పడి మరీ ప్రభుదేవాతో డాన్సులేసింది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో ఇది తెరకెక్కగా.. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసేసుకుంది. సమ్మర్ కానుకగా లక్ష్మీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
ప్రభుదేవాతో పోటీపడి మరీ డ్యాన్సులు
-
సోల్‌మేట్ కోసం తపన!
బుధవారం వేలంటైన్స్ డే. సోలోగా ఉన్నవారికి సోల్‌మేట్ దొరికితే ఫుల్ ఖుష్ అవుతారు. లేనివాళ్లు సోల్‌మేట్‌ని వెతికే పనిలో ఉంటారు. సింగిల్‌గా ఉన్న ‘హార్ట్ ఎటాక్’ గాళ్ అదా శర్మ కూడా తన సోల్‌మేట్‌ను వెతికే పనిలో బిజీగా ఉన్నారు. అతగాడు ఎప్పుడెప్పుడు కలుస్తాడా? అని తపన పడుతున్నారు. ఏంటీ.. అదా పెళ్లికి తొందరపడుతున్నారా? అంటే కాదు. సోల్‌మేట్‌ను వెతుకుతున్నది రియల్‌లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్‌లో. రెండేళ్ల క్రితం ‘క్షణం’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన అదా వేలంటైన్స్ డే రోజున ‘సోల్‌మేట్’ అనే చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. అబిర్‌సేన్ గుప్తా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో అదా డ్యూయెల్ రోల్ చేయనున్నారు. ‘‘ఎంతో తపనతో సోల్‌మేట్‌ను వెతుక్కునే మోడ్రన్ గాళ్ క్యారెక్టర్లో నటించనున్నాను. ఇంకా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఉంది. కానీ అందుకు టైమ్ ఉంది’’ అన్నారు అదా శర్మ. తెలుగులో ఈ చిత్రంతో పాటు అటు తమిళంలో ప్రభుదేవా హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో అదా కథానాయికగా నటిస్తున్నారు. నిక్కీ గల్రానీ మరో కథానాయిక. -
ప్రభుదేవా మూకీ సినిమా ‘మెర్క్యూరి’
డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్క్యూరి. పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సైలెంట్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన పుష్పక విమానం సినిమా తరహాలోనే ఈ సినిమాలోని పాత్రలు కూడా మాట్లాడవని తెలుస్తోంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సంతోష్ నారాయణ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
ప్రభుదేవా ఫేస్ ఆఫ్ ఇండియా
తమిళసినిమా: ప్రభుదేవా ఈ పేరు వింటే యువతలో ఉత్సాహం పొంగుతుంది. తామూ సాధించాలనే తపన ఉరకలు వేస్తుంది. 20 ఏళ్లుగా తనదైన నటన, డాన్స్‌తో యువతను ఉర్రూతలూగిస్తున్న ప్రభుదేవా, దర్శక, నిర్మాతగానూ తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం కథానాయకుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఈయన తాజాగా ఒక సంగీత ఆల్బమ్‌ను రూపొందించారు. దాని పేరే ఫేస్ ఆఫ్ ఇండియా. వేల్స్ యూనివర్సిటీ అధినేత కే.గణేశ్‌తో కలిసి ప్రభుదేవా రూపొందించిన ఈ సంగీత ఆల్బమ్‌కు ఏజే దర్శకత్వం వహించారు. దీని గురించి యూనిట్ వర్గాలు తెలుపుతూ గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ మూజికల్ ఆల్బమ్ గ్రామీణ పాటలతో మన దేశంలోని భిన్న సంస్కృతులను, భాషల ప్రాముఖ్యతలను ఆవిష్కరించేదిగా ఉంటుందన్నారు. తరుణ్, వికాశ్, వినోద్, అంజలి జయప్రకాశ్ నటించిన ఈ ఆల్బమ్‌కు దీపక్కుమార్పదీ ఛాయాగ్రహణం అందించారని చెప్పారు. ఈ ఆల్బమ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. అదే విధంగా ఆల్బమ్ టీజర్‌ను నటుడు ఆర్జే.బాలాజీ శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. -
రెండు రోజులు ముందే పండగ!
ఇక్కడ సంక్రాంతి.. అక్కడ (తమిళనాడు) పొంగల్... పేర్లు వేరైనా పండగ జోష్‌లో మాత్రం ఏ తేడా ఉండదు. తెలుగు బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి... తమిళ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సినిమాలు ఉన్నాయి అంటే.. అక్కడ కూడా నాలుగే. అయితే ఇంట్రస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ నాలుగు సినిమాలు ఒకే తేదీన.. అది కూడా పండగ రెండు రోజులు ముందే (12.01.18) విడుదల కానున్నాయి. సంక్రాంతికి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు అందరికంటే ముందు కర్చీఫ్ వేసింది హీరో సూర్యానే. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన సినిమా ‘తానా సేంద కూట్టమ్’. తెలుగులో ‘గ్యాంగ్’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు. హిందీ చిత్రం ‘స్పెషల్ 26’లో ఉన్న మెయిన్ పాయింట్ ఇందులో ఉందట. సూర్య తర్వాత పండక్కి మేం వస్తున్నాం అని ఎనౌన్స్ చేశారు ప్రభుదేవా. కల్యాణ్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన సినిమా ‘గులేభకావళి’. హన్సిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి రేవతి కీలక పాత్ర చేశారు. అయితే.. టైటిల్ చదవగానే పాత సినిమా గుర్తుకు రావచ్చు. అందుకే.. గతంలో ఇదే టైటిల్స్‌తో వచ్చిన సినిమాలకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఏదో ప్లాన్ చేశారట చిత్రబృందం. ఇక, పొంగల్ సందడిలో బాక్సాఫీస్ వద్ద స్కెచ్ వేస్తున్నామని విక్రమ్ ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు కానీ.. ఎప్పుడో కరెక్ట్‌గా చెప్పలేదు. ఫైనల్‌గా జనవరి 12న బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అయ్యారాయన. విజయ్ చందర్ దర్శకత్వంలో విక్రమ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘స్కెచ్’. ఈ సినిమాను కేరళలో కూడా 12నే రిలీజ్ చేస్తున్నారు. ముగ్గురు బడా హీరోలు పండక్కి బాక్సాఫీస్ వద్ద కాచుకుని ఉంటే.. ఏం పర్లేదు. మా సినిమా కంటెంట్‌పై భరోసా ఉంది. సో.. పండగ బరిలో దిగేందుకు సిద్దమే అని ‘మధుర వీరన్’ టీమ్ సై అంటూ సంక్రాంతి బరిలోకి దిగారు. పీజీ ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సీనియర్ నటుడు విజయకాంత్ తనయుడు షణ్ముగ పాండియన్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు. ఇవికాక.. సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘కలకలప్పు–2’, అరవింద్‌స్వామి నటించిన ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయన్న ఊహాగానాలున్నాయి. అయితే.. ఇప్పటివరకూ ఈ చిత్రాల విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించలేదు. ఆల్రెడీ నాలుగు సినిమాలు రెడీ అయిపోవడంతో ఈ సినిమాలు రాకపోవచ్చన్నది కొందరి వాదన. పండక్కి ఎన్ని సినిమాలు విడుదలైనా చూసే తీరిక ప్రేక్షకులకు ఉంటుందన్నది మరికొందరి వాదన. మరి.. సంక్రాంతి కి ఎన్ని సినిమాలొస్తాయి? బరిలో గెలుపు ఎవరిది? ‘వెట్రి యారుక్కున్ను అంజు నాళ్ పొరుత్తిరిందు పార్పోమ్’. అర్థం కాలేదా? ‘గెలుపు ఎవరికన్నది ఐదు రోజులు వేచి చూద్దాం’ అని అర్థం. హన్సిక, ప్రభుదేవా షణ్ముగ విక్రమ్, తమన్నా -
చిన్న విరామం.. బోలెడంత ఉత్సాహం !
సాక్షి, చెన్నై: చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చిన్న బ్రేక్ రాగానే చాప్టర్ క్లోజ్. ఇక మూటా ముల్లె సర్దుకోవాల్సిందే లాంటి మాటలు వినాల్ని రావచ్చు. అయితే అలాంటివి సంబంధిత వ్యక్తుల్ని కుంగదీయవచ్చు. ఈ ఉపోద్ఘాతం ఎందుకనుకుంటున్నారా? నటి హన్సిక మంచి నటి అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ కథానాయకులతోనే నటించి శభాష్ అనిపించుకుంది. విజయ్, విశాల్ లాంటి స్టార్ హీరోలతో నటించి సకెస్స్లు అందుకుంది. తెలుగు, మలయాళం, హిందీ మొదలగు భాషల్లో నటించి బహుబాషా నటిగానూ గుర్తింపు పొందింది. అలాంటి హీరోయిన్‌కు అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. ఇక అమ్మడి పని అయిపోయింది. ముంబైకి చెక్కేయడమే తరువాయి అనే వార్తలు హల్చల్ చేశాయి. ఇందుకు కారణం చిన్న బ్రేక్ రావడమే. అయితే హన్సిక సినిమాలు లేక ఖాళీగా కూర్చోలేదు. ఆ మధ్య ఒక తెలుగు చిత్రం, ఇటీవల మోహన్‌లాల్, విశాల్ కలిసి నటించిన మలయాళం చిత్రం విలన్లో నటించింది. ప్రస్తుతం ప్రభుదేవాకు జంటగా గులేబకావళి చిత్రంలో నటిస్తోంది. వరుస అవకాశాలతో మళ్లీ పుంజుకుంటోంది. తాజాగా యువ నటుడు అధర్వతో జోడీ కట్టడానికి రెడీ అవుతోంది. వీరి కాంభినేషన్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని డార్లింగ్ చిత్రం ఫేమ్ జాన్ అంటాన్ తెరకెక్కించనున్నారు. యోగిబాబు హాస్య భూమికను పోషించనున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్.సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో అధర్వ తొలిసారిగా పోలీస్ అధికారిగా నటించనున్నారు. షూటింగ్ ఈ నెల 10వ తేదీన చెన్నైలో ప్రారంభం కానుంది. అధర్వ ఇప్పటికే చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నయనతారతో కలిసి నటించిన ఇమైకా నోడిగళ్ చిత్రం జనవరిలో విడుదలకు ముస్తాబవుతోందన్నది గమనార్హం. -
కొత్త సినిమాలో పాత సినిమాలు!
సంక్రాంతి పండగొస్తోంది. కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని సినిమాలు బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నాయి. అయితే అనౌన్స్మెంట్ కొంచెం లేటయినా.. పండక్కి మా సినిమా కూడా వస్తోంది. చూసి ఎలా ఉందో చెప్పండి అంటున్నారు హీరోయిన్ హన్సిక. ఎస్. కల్యాణ్ దర్శకత్వంలో ప్రభుదేవా, హన్సిక జంటగా తమిళంలో రూపొందుతోన్న చిత్రం ‘గులేబకావళి’. ఈ సినిమా లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. అయితే తమిళంలో ‘గులేబకావళి’ అనే టైటిల్‌తో గతంలోనే రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి 1935లో, మరొకటి 1955లో. ఈ రెండు సినిమాలను లింక్ చేసేలా దర్శకుడు కల్యాణ్ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ను ప్లాన్ చేశారు. -
రారండోయ్ వేడుక చేద్దాం
పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. శుభలేఖలు పంచారు. తిరుపతిలో పెళ్లి మండపం బుక్ చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లికూతురి కుటుంబాలు రారండోయ్ వేడుక చేద్దాం అని తిరుపతికి బయల్దేరాయి. అలకలు, బుజ్జగింపులు, సరదాలతో పెళ్లిసందడి మొదలైంది. అంతలో సడన్‌గా ఓ ట్విస్ట్. అంతే పెళ్లాగిపోయే పరిస్థితులు వచ్చాయట. ఆ ట్విస్ట్ ఏంటి? అసలు పెళ్లి జరిగిందా? అన్న ప్రశ్నలకు ఆన్సర్ కావాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శకులు శక్తీ చిదంబరం. ప్రభుదేవా, నిక్కీ గల్రానీ, అదా శర్మ ముఖ్యపాత్రల్లో ఆయన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. 15ఏళ్ల క్రితం చిదంబరం డైరెక్ట్ చేసిన ‘చార్లీ చాప్లీన్’ కు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారన్నది కోలీవుడ్ సమాచారమ్. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ‘‘చార్లీ చాప్లీన్ 2’ సినిమాలో ప్రభుదేవాతో డ్యాన్స్ చేస్తున్నాను. ఆయన ఎక్స్ప్రెషన్స్ సూపర్. ఇక్కడ మరికొన్ని సాంగ్స్‌ను షూట్ చేసిన తర్వాత చెన్నైలో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నాం’’అని పేర్కొన్నారు అదా శర్మ. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
రియల్ పెళ్లి కాదండోయ్.. రీల్ పెళ్లి తతంగం !
తిరుపతిలో ప్రభుదేవా, నిక్కీగల్రాణిల పెళ్లి జరగనుందట. ఏమిటీ నమ్మశక్యంగా లేదా ? ప్రభుదేవా, నయనతారల ప్రేమ పెళ్లి వరకూ ఆగిపోయిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివతో ప్రేమలో పడి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనే ప్రచారం కూడా చాలా కాలంగానే జరుగుతోంది. అయితే ప్రభుదేవా మాత్రం ఒంటరిగానే జీవిస్తున్నారు. తాజాగా నిక్కీగల్రాణితో పెళ్లికి సిద్ధం అయ్యారనే ప్రచారం జోరందుకుంది. తిరుపతిలో బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇది రియల్ పెళ్లి కాదండోయ్. రీల్ పెళ్లి తతంగం. ఇదన్నా సవ్యంగా జరుగుతుందా? ఏమో చెప్పలేం ఎందుకంటే ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఆదాశర్మ కూడా నటిస్తోంది. ఇంతకు ముందు ప్రభు, ప్రభుదేవా కలిసి నటించిన చార్లీచాప్లిన్‌కు స్వీకెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిక్కీగల్రాణి, ఆదాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమ్మా క్రియేషన్స్ టి. శివ నిస్తున్న ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకుడు. ఈయన చిత్రాలంటే హాస్యంతో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయి. చార్లీచాప్లిన్-2 గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ప్రభుదేవా, నిక్కీగల్రాణి పెళ్లి కోసం ఇద్దరి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లేటప్పుడు, ఆ తర్వాత జరిగే సంఘటనలే చార్లీచాప్లిన్-2 చిత్రం అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం అమ్నేశ్, ఛాయాగ్రహణను సౌందర్‌రాజన్‌లు అందిస్తున్నారు. -
చార్లీ చాప్లిన్తో స్టెప్పులు.. ప్రేమలు!
ఇప్పుడు చార్లీ చాప్లిన్ లేరు. కానీ, ఆయన పంచిన నవ్వులు ఈ లోకంలో ఉన్నాయి. చాప్లిన్‌లా పీపుల్ని ఫుల్లుగా నవ్వించడానికి తమిళంలో ఓ సిన్మా రూపొందుతోంది. శక్తీ చిదంబరం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభుదేవాకి జోడీగా ‘హార్ట్ ఎటాక్’ ఫేమ్ అదా శర్మ నటిస్తున్నారు. 2002లో ప్రభు, ప్రభుదేవా హీరోలుగా వచ్చిన ‘చార్లీ చాప్లిన్’కి సీక్వెల్ ఇది. గురువారం గోవాలో చిత్రీకరణ మొదలైంది. ఆల్రెడీ అదా శర్మ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్‌డే ప్రభుదేవా, అదాలపై కొన్ని సీన్స్ తీశారు. ప్రభుదేవా అంటే జస్ట్ కామెడీ మాత్రమేనా? సాంగుల్లో స్టెప్పులు ఇరగదీసేస్తారు కదా! అండ్ రొమాంటిక్ లవ్ ట్రాక్ తప్పకుండా ఉంటుంది.సో, చార్లీ చాప్లిన్గా రాబోతున్న ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాతో అదా ఏ విధంగా స్టెప్పులు వేస్తారో! ప్రేమలు పండిస్తారో! అన్నట్టు... ఫస్ట్ పార్ట్ ‘చార్లీ చాప్లిన్’ని తెలుగులో శ్రీకాంత్, వేణు హీరోలుగా ‘పెళ్లాం ఊరెళితే’ పేరుతో రీమేక్ చేశారు. మరి, ఈ సీక్వెల్‌ని రీమేక్ చేస్తారో? లేదా ప్రభుదేవా, అదా శర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు కావడంతో డబ్ చేస్తారో? వెయిట్ అండ్ సీ!! తమిళ్లో అదాకి హీరోయిన్గా ఇదే మొదటి సినిమా. అంతకు ముందు శింబు ‘ఇదు నమ్మ ఆళు’లో అతిథి పాత్ర చేశారు. -
ఆయనకు ఇద్దరు..!
నృత్య దర్శకుడు ప్రభుదేవా, నటుడు, దర్శకుడు అంటూ ఆల్ రౌండర్‌గా హోల్ ఇండియాను చుట్టేశారు. ప్రస్తుతం ఆయన నటనపై దృష్టి సారిస్తున్నారు. హీరోగా ఆయనకు దేవి చిత్రం మంచి రీఎంట్రీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రభుదేవా చేతిలో అరడజనుపైగా చిత్రాలు ఉన్నాయి. అంతేకాక మరిన్ని అవకాశాలు ముంగిట వాలడానికి రెడీగా ఉన్నాయి. ప్రభుదేవా ఇటీవలే ఒకే చెప్పిన చిత్రంలోనే ఇద్దరు ముద్దుగుమ్మలు ఆయనతో రొమాన్స్ చేయడానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. 2002లో విడుదలైన చార్లీ చాప్లిన్ మంచి విజయాన్ని సాధించడంతోపాటు తెలుగు సహా ఆరు ఇతర భాషల్లో రీమేక్ అయ్యింది. ఆ చిత్రంలో ప్రభు, ప్రభుదేవా కలిసి నటించారు. వారికి జంటగా అభిరామి, గాయత్రి రఘురామ్ సీక్వెల్లోనూ నటించడంతోపాటు ప్రభు పాత్రను కూడా పోషించేస్తున్నట్లు సమాచారం. అంటే ద్విపాత్రాభినయం చేయనున్నారన్నమాట. ఆయనతో గ్లామర్ భామ నిక్కీగల్రాణి, తాన్యా రవిచంద్రన్‌లు రొమాన్స్ చేయనున్నారు. తాన్యా రవిచంద్రన్ ఇటీవల కరుప్పన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంతో పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకున్నారు. క్రేజీమోహన్ మాటలను అందిస్తున్న ఈ చిత్రాన్ని అమ్మాక్రియేషన్స్ టి.శివ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురువారం సాంగ్ చిత్రీకరణతో గోవాలో ప్రారంభం కానుందని తెలిసింది. -
విలన్... ఫన్!
వెండితెరపై విలన్లను చూస్తే ఎవరికైనా నవ్వొస్తుందా? అఫ్కోర్స్... కామెడీ విలన్లు ఉన్నారనుకోండి! కాసేపు వాళ్లను పక్కన పెట్టేసి, సీరియస్ విలన్ల సంగతికి వద్దాం! వాళ్లను చూస్తే నవ్వొస్తుందా? చూస్తున్నది తెరపైనే అయినా ఒక్కోసారి భయం వేస్తుంది. కానీ, ప్రభుదేవా ‘విలన్’ అంటే ‘ఫన్’ అంటున్నారు! ఎందుకిలా? అంటే... ‘మెర్క్యూరీ’ అనే తమిళ సినిమాలో ఈ కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సంగతి ప్రేక్షకులకు తెలిసిందే! ‘విలన్‌గా నటించడం ఎలా ఉంది?’ అనే ప్రశ్నను ప్రభుదేవా ముందుంచితే – ‘‘ఇంతకు ముందెప్పుడూ విలన్‌గా చేయలేదు. ఒక్కసారి ప్రపంచమంతా మారినట్టు, వింతగా అన్పిస్తోంది. బట్, ఇట్స్ ఫన్! యాక్టింగ్ అంటే అంతేగా... రియల్ లైఫ్‌లో మనం చేయలేని పనులను రీల్ లైఫ్‌లో చేసే చాన్స్ దొరుకుతుంది’’ అన్నారు. మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్! ‘మెర్క్యూరీ’కి ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే... మూకీ చిత్రమిది! నో డైలాగ్స్... ఓన్లీ యాక్షన్! కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. తమిళ్ డబ్బింగ్ హిట్ ‘పిజ్జా’ దర్శకుడీయనే. ‘పిజ్జా’లో హీరోయిన్గా నటించిన రమ్యా నంబీసన్ ఇందులోనూ నటిస్తున్నారు. మూకీ సినిమా కావడంతో తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నారు. మూకీకి డబ్బింగ్ అవసరం లేదు... దాంతో ఎన్ని లాభాలో చూడండి!! -
ఆయన పేరు చెప్పగానే ఓకే చెప్పేసిందట..!
సాక్షి, చెన్నై: నృత్య దర్శకుడిగా దుమ్మురేపిన ప్రభుదేవా ఆ తరువాత దర్శకుడిగా మారిపోయాడు. కోలీవుడ్, టాలీవుడ్లతోపాటు బాలీవుడ్లో కూడా సంచలనం సృష్టించారు. ప్రస్తుతం హీరోగా యమ బిజీ అయిపోయారు. ఆయన ప్రస్తుతం రెండు చిత్రాల నటిస్తున్నారు. మరో రెండు చిత్రాలు కమిట్మెంట్ దశలో ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సదూరం-2 చిత్రం దర్శకుడు సుమంత్ రాధాకృష్ణన్ చిత్రంలో ప్రభుదేవా హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ నివేథా పేతురాజ్ నటించే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. తొలి చిత్రం ఒరునాళ్ కూత్తులో ఈ బ్యూటీ మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల నటించిన పొదువాగ ఎన్ మనసు తంగం సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. దీంతో జయం రవితో జత కట్టిన టిక్ టిక్ టిక్ చిత్రంపైన నివేథా చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం అంతరిక్షంలో జరిగే కథతో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే రాధాకృష్ణన్ ఇటీవల నటి నివేథా పేతురాజ్‌ను కలిసి కథను వినిపించారట. కథ నచ్చడంతో పాటు ప్రభుదేవాతో నటించడానికి ఈ అమ్మడు చాలా ఆసక్తిని కనబరిచిందట. ఈ విషయాన్ని దర్శకుడు సుమంత్ రాధాకృష్ణన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద డాన్సింగ్కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేసే అవకాశాన్ని నివేథా పేతురాజ్ దాదాపుగా దక్కించుకున్నట్టే కనబడుతోంది. -
ప్రభుదేవా, విజయ్‌లతో దేవి సీక్వెల్
తమిళసినిమా: ప్రభుదేవా, విజయ్‌ల కాంబినేషన్లో దేవి–2 చిత్రం తెరక్కెనుందా? ఆ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. ప్రభుదేవా కోలీవుడ్, టాలీవుడ్లను దాటి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ క్రేజీ దర్శకుడిగా పేరు తెచుకున్నారు. ఆ తరువాత దేవి చిత్రంతో హీరోగా మళ్లీ కోలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు. దేవి చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ఎండ్ చేయకుండా పార్టు–2 వస్తుందనే సిగ్నల్‌ను ప్రేక్షకులకు ఇచ్చారు. దేవి చిత్రం తరువాత దర్శకుడు విజయ్, ప్రభుదేవా ఎవరి చిత్రాలతో వారు బిజీ అయిపోయారు. విజయ్ జయంరవి హీరో వనమగన్ చిత్రాన్ని చేసి ప్రస్తుతం సాయిపల్లవి ప్రధాన పాత్రలో కరు అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రభుదేవా యంగ్ మంగ్ చంగ్, గులేబాకావళి, కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో మెర్కూరి చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన దర్శకత్వంలో విశాల్, కార్తీ కలిసి నటించే కరుప్పురాజా వెళైరాజా చిత్రం ప్రారంభం కావలసి ఉన్నా, అది డ్రాప్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రభుదేవాతో విజయ్ దేవి–2 చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. దర్శకుడు విజయ్, ప్రభుదేవాల మధ్య ఈ చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఖల్నాయక్ అవుతున్న డాన్సింగ్ స్టార్
తమిళసినిమా: సినిమా కలర్ మారిపోతోందనడం సరికాదేమో కానీ, అందులోని తారల్లో మాత్రం మార్పు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. విలన్ పాత్రదారులు హీరోలుగా నటించడం ప్రమోట్గా భావిస్తే, ఇప్పుడు హీరోలు విలన్‌గా నటించడాన్ని ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. డాన్సింగ్‌స్టార్ ప్రభుదేవా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే ఇప్పటి వరకూ ఈయన్ని ఒక కథానాయకుడిగానూ, దర్శకుడిగానూ చూశాం. తాజాగా ప్రతినాయకుడిగా చూడబోతున్నామనే టాక్ కోలీవుడ్‌లో స్ప్రెడ్ అయ్యింది. ప్రభుదేవాకు బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌గా పేరుంది. అలాంటి ఆయన చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌కు దేవి చిత్రం ద్వారా కథానాయకుడిగా రీఎంట్రీ అయ్యి సక్సెస్ అయ్యారు. తాజాగా బ్యూటీ హన్సికతో కలిసి గులేభాకావళి, నటి లక్ష్మీమీనన్‌తో జత కట్టి యంగ్ మంగ్ జంగ్ చిత్రాల్లో రొమాన్స్ చేస్తున్నారు. వీటిలో గులేభాకావళి చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తాజాగా ఆయన నాయక్ నహీ ఖల్నాయక్ మేహూ అంటున్నారు. అవును మెర్కురీ చిత్రంలో ప్రభుదేవా ప్రతినాయకుడిగా నటిస్తున్నారన్నది తాజా సమాచారం. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఇందులో బుల్లితెర నటుడు సనత్‌రెడ్డి హీరోగా నటిస్తున్నారు.దీపక్ పరమేశ్, రమ్యానంబీశన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మెర్కురీ చిత్రం కూడా చాలా సైలెంట్‌గా చిత్రీకరణను పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇందులో ప్రభుదేవా విలనిజాన్ని చూడడానికి ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారని ప్రత్యేకంగా చెప్పాలా? -
విలన్ పాత్రలో టాప్ డైరెక్టర్!
సాక్షి, చెన్నై: ఒకప్పుడు విలన్ పాత్రధారులు హీరోలుగా నటించడం ప్రమోషన్‌గా భావించేవారు. కానీ, ఇప్పుడు హీరోలూ విలన్‌గా నటిస్తున్నారు. దర్శకులు నెగిటివ్ రోల్లో నటించేందుకు సై అంటున్నారు. ఇప్పటికే 'స్పైడర్'లో ప్రముఖ దర్శకుడు ఎస్జే సూర్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా కూడా విలన్ పాత్రపై మక్కువతో ఉన్నారు. ఆయన తాజాగా ప్రతినాయకుడిగా తెరపై కనిపించబోతున్నారు. ప్రభుదేవాకు బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌గా పేరుంది. అలాంటి ఆయన చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌కు 'దేవి' చిత్రం ద్వారా కథానాయకుడిగా రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. తాజాగా హన్సికతో కలిసి 'గులేబకావళి', నటి లక్ష్మీమీనన్‌తో 'యంగ్ మంగ్ జంగ్' చిత్రాల్లో నటిస్తున్న ఈయన.. 'మెర్క్యురీ'లో విలన్‌గా విశ్వరూపం చూపించబోతున్నారు. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బుల్లితెర నటుడు సనత్‌రెడ్డి హీరోగా నటిస్తున్నారు. దీపక్ పరమేశ్, రమ్యానంభీశన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'మెర్క్యురీ' సినిమా షూటింగ్ చాలా సైలెంట్‌గా పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాలో ప్రభుదేవా విలన్‌గా నటిస్తున్నారన్న కథనాలతో అభిమానులు ఆయన విలనిజాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
విజయ్ను ఎందుకు కలిశానంటే..
తమిళసినిమా: హీరోయిన్గా కోటీ ఆశలతో టాలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్. ప్రఖ్యాత హిందీ నటుడు దిలీప్‌కుమార్ మనవరాలైన ఈమె నటించిన తొలి తెలుగు చిత్రం అఖిల్. ఈ చిత్రం సాయేషాకు నిరాశనే మిగిల్సింది. అయితే అఖిల్ చిత్రంతో ఈ బ్యూటీకి ఏమైనా మేలు జరిగిందంటే అది కోలీవుడ్‌కు ఎంట్రీ అవడమే. నవ నటీమణులను పరిచయం చేయడంలో ముందుండే దర్శకుడు విజయ్ దృష్టిలో సాయేషాసైగల్ పడింది. అంతే జయంరవికి జంటగా తాను దర్శకత్వం వహించిన వనమగన్ చిత్రంలో నాయకిగా అవకాశం ఇచ్చేశారు. ఆ చిత్రం మిశ్రమ స్పందనను పొందినా, సాయేషాకు మాత్రం మంచి పేరే తెచ్చి పెట్టింది. వనమగన్ చిత్రంలో సాయేషా నటించిన ఒక పాటకు నృత్య దర్శకత్వం వహించిన డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాకు ఆమె డాన్స్ బాగా నచ్చేసింది. అంతే తాను విశాల్, కార్తీ హీరోలుగా తెరకెక్కించనున్న మల్టీస్టారర్ చిత్రం కరుప్పురాజా వెళ్లరాజా చిత్రంలో హీరోయిన్ చాన్స్ ఇచ్చేశారు. దీంతో తన కెరీర్ వెలిగి పోతుందని సంతోషంతో తబ్బిబ్బు అయిపోయిన సాయేషా ఆనందం అంతలోనే ఆవిరై పోయింది. కారణం కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రం డ్రాప్ అయ్యిపోయ్యిందనే ప్రచారం జరగడమే. అయితే ఇటీవల అనూహ్యంగా చెన్నైకి వచ్చిన సాయేషాసైగల్ కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రంలో నటించే అవకాశం రావడంతో చాలా సంతోషపడ్డానని, ఈ చిత్రానికి సంబంధించి నాలుగు రోజులు షూటింగ్ కూడా జరిగిందని చెప్పింది. అయితే చిత్రం డ్రాప్ అయిన విషయం తనకు తెలియదని, దర్శకుడు ప్రభుదేవా కూడా తనకు ఏమీ చెప్పలేదని పేర్కొంది. కాగా తాను చెన్నైకి రావడానికి కారణం ఏమిటని అడుగుతున్నారని తనకు కోలీవుడ్‌లో తొలి అవకాశం కల్పించడంతో పాటు, వనమగన్ చిత్ర షూటింగ్లో దర్శకుడు విజయ్ తనను ఒక సోదరిగా చాలా బాగా చూసుకున్నారని, అందుకే ఆయన్ని కలిసి రాఖీ పండగను పునస్కరించుకుని రాఖీ కట్టడానికి ముంబయి నుంచి ప్రత్యేకంగా చెన్నైకి వచ్చానని చెప్పింది. ఏదేమైనా సాయేషా సైగల్కిప్పుడు ఏ భాషలోనూ చిత్రం లేదన్నది వాస్తవం. -
అమ్మడూ... లెట్స్ డూ కుమ్ముడు!
అమ్మడు’ అంటే కాజల్ అగర్వాల్ కాదు. ‘లెట్స్ డూ కుమ్ముడు’ అంటే స్టెప్పులేయడం కాదు, ఈ మాట అంటున్నది చిరంజీవి అంతకన్నా కాదు. ఇక్కడ అమ్ముడు ఎవరంటే... హన్సిక. ‘లెట్స్ డూ కుమ్ముడు’ అంటోన్నది ఎవరంటే... యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్. ఈయన గురించి తెలుసుగా. మాంచి స్టంట్సీక్వెన్సులు కొరియోగ్రఫీ చేస్తారు. సో, కుమ్ముడు అంటే కన్ఫర్మ్గా కొట్టడమనే! రౌడీలను చితకొట్టేయమని హన్సికతో అంటున్నారు. ఇదంతా సినిమా కోసమే సుమా! ‘గులేబకావలి’ అనే తమిళ యాక్షన్ కామెడీ సిన్మాలో ప్రభుదేవాకు జోడీగా హన్సిక నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పాటలకు, హీరోతో రెండుమూడు సన్నివేశాలకు పరిమితమయ్యేది కాదు. హీరోయిన్‌తో ఫైట్లు కూడా చేయిస్తున్నారు. ఏయే సందర్భాల్లో హీరోయిన్ ఫైట్ చేస్తుందనేది సస్పెన్స్. ప్రస్తుతం చెన్నైలో హన్సిక, ఇతర ముఖ్య తారలపై కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగులో ఫైట్ సీన్స్ తీస్తున్నారు. అదండీ సంగతి!! -
ప్రభుదేవాకు ఝలక్!
ముంబై: వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ప్రభుదేవాకు మరో షాక్ తగిలింది. భారీ సినిమా చేసే అవకాశం చేజారినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సీక్వెల్‌కు దర్శకత్వం వహించే ఛాన్స్ తప్పిపోయినట్టు ‘ముంబై మిర్రర్’ పత్రిక వెల్లడించింది. ‘దబాంగ్ 3’ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారని అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ అవకాశం ‘బాగీ’ ఫేమ్ సబీర్ ఖాన్ దక్కినట్టు సమాచారం. దబాంగ్ నిర్మాతలు ఆయనను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అతడు మూడు, నాలుగు స్ర్కిప్ట్లపై పనిచేస్తున్నట్టు సమాచారం. దీనిపై సబీర్ ఖాన్ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ... ‘అవును.. దబాంగ్ 3 సినిమా కోసం పని ప్రారంభించాం. కథ పూర్తయ్యే వరకు నేనేమీ చెప్పలేను. చిత్ర యూనిట్లో సంప్రదింపులు జరుపుతున్నాను. ఫైనల్ స్ర్కిప్ట్ పూర్తయ్యాక దర్శకుడిగా ఎంపికైతే సంతోషిస్తాన’ని చెప్పారు. దబాంగ్ కథకు ఫ్రీక్వెల్‌గా దబాంగ్ 3 కథ ఉంటుందని ఊహాగాహాలు వస్తున్నాయి. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఏక్తా టైగర్‌కు సీక్వల్గా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై సినిమాలో సల్మాన్ నటిస్తున్నాడు. -
నేను ఆడిస్తాగా అన్నారు!
తమిళసినిమా: హన్సికను నిన్ను నేను ఆడిస్తాగా అన్నారట. ఈ విషయాన్ని ఆ అమ్మడే స్వయంగా తెలిపారు. హన్సిక ప్రస్తుతం ప్రభుదేవాతో గుళేబకావళి చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ చాలా మంది హీరోయిన్లు 14–15 ఏళ్ల వయసులో చిత్ర రంగప్రవేశం చేస్తారన్నారు. అయితే తాను బాల నటిగానే రంగప్రవేశం చేశానని చెప్పారు. ఇప్పుడు తన వయసు 25 అని, నటించడానికి ఇంకా చాలా టైమ్ ఉందని అన్నారు. మరో ఐదేళ్ల వరకూ నటిగా బాగా శ్రమించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇంతకు ముందు ప్రభుదేవా దర్శకత్వంలో ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో నటించానని, ఆ తరువాత ఆయన నిర్మాతగా బోగన్ చిత్రంలో జయంరవికి జంటగా నటించానని గుర్తు చేశారు. తాజాగా ప్రభుదేవాతోనే గుళేబకావళి చిత్రంలో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొన్నారు. ఆయన దర్శకుడిగా ఉన్నప్పుడు ప్రశ్నలేమీ వేసే దాన్ని కాదని, ఇప్పుడు చాలా ప్రశ్నలు వేస్తున్నానని అన్నారు. రోజూ ప్రభుదేవా సెట్లోకి వచ్చేటప్పుడు తాను ఎవరినో ఒకరిలా మిమిక్రీ చేస్తుంటానని, అది చూసి ఆయన నవ్వుకుంటారని చెప్పారు. అయితే ఆయనతో నటించేటప్పుడు మాత్రం కాస్త గాబరా పడుతుంటానన్నారు. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో డాన్స్ చేసేటప్పుడు దడ పుడుతుందన్నారు. అయితే ప్రభుదేవా మాత్రం కూల్‌గా ఉంటారని చెప్పారు. ఎలాంటి భయం అవసరం లేదు నేను నిన్ను ఆడిస్తాగా అని ప్రభుదేవా ఎంతో ఎంకరేజ్ చేస్తారని హన్సిక చెప్పుకొచ్చారు -
అదిరేటి సెట్టులో... అదిరేటి స్టెప్పులు!
అక్షరాలా రెండు కోట్ల రూపాయలు... ఓ చిన్న సినిమా బడ్జెట్ కాదు ఇది. ఓ పెద్ద సినిమాలో లాంగ్ షెడ్యూల్ షూట్ సెట్ కోసం కేటాయించిన అమౌంట్ అసలే కాదు. జస్ట్... ఒక సాంగ్ షూట్ చేయడం కోసం పెట్టిన ఖర్చు. తమిళ చిత్రం ‘గులేబకావళి’ కోసం ఇటీవల ఈ పాట చిత్రీకరించారు. ప్రభుదేవా, హన్సిక జంటగా కల్యాణ్ డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతోంది. పాట కోసం రెండు కోట్ల రూపాయలతో ఆర్ట్ డైరెక్టర్ కదిర్ అదిరిపోయే సెట్ వేశారట. వివేక్ మెర్విన్ స్వరపరచిన ఈ పాటలో ప్రభుదేవా, హన్సిక వేసిన అదిరిపోయే స్టెప్పులు మాస్‌ని హుషారెక్కించే విధంగా ఉంటాయట. సెట్, స్టెప్స్ ఐ–ఫీస్ట్ అని కోలీవుడ్ టాక్. -
ఖరీదైన సెట్లో ఆ ఇద్దరి ఆటాపాట!
తమిళసినిమా: బాహుబలి చిత్రం తరువాత చిత్ర నిర్మాణ వ్యయాన్ని ఊహించలేకపోతున్నాం. ఆ చిత్రం ప్రేక్షకులకు బ్రహ్మాండాన్ని పరిచయం చేసిందనే చెప్పాలి. దీంతో చాలా మంది దర్శక నిర్మాతలు భారీ వ్యయాన్ని వెచ్చించి చిత్రాలను నిర్మించడానికి సాహసిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా ప్రభుదేవా చిత్రంలోనూ అలాంటి బ్రహ్మాండాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుదేవా, నటి హన్సిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం గులేబాకావళి. కేసేఆర్.స్డూడియోస్ పతాకంపై కేసేఆర్.రాజేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవ దర్శకుడు ఎస్.కల్యాణ్ మెగాఫోన్ పట్టారు. కాగా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో వివేక్–మెర్విన్ల ద్వయం సంగీత బాణీలు సమకూర్చిన ఒక పాట కోసం రూ.2 కోట్ల వ్యయంతో ఒక బ్రహ్మాండమైన సెట్‌ను కళాదర్శకుడు కదిర్ నేతృత్వంలో వేశారు. కొరియోగ్రాఫర్ జానీ నృత్యరీతులు సమకూర్చుతున్న ఈ పాటను ఛాయాగ్రాహకుడు ఆనందకుమార్ అతి నవీన సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ గ్రాఫిక్ నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారట. గులేబాకావళి చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని సన్‌టీవీ పెద్ద మొత్తానికి కొనుగోలు చేయడం మరో విశేషం అవుతుంది. -
పక్కా మాస్!
ప్రభాస్... మాంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో! ప్రభుదేవా... సపరేట్గా చెప్పాలా? సేమ్! మాస్లో మాంచి ఫాలోయింగ్ ఉన్న కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్! అలాంటప్పుడు ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడనగానే ప్రేక్షకులు మాస్ మసాలా సినిమా ఆశిస్తారు. దీనికి డిఫరెంట్‌గా కాస్త క్లాస్ టచ్ ఉన్న ‘పౌర్ణమి’ చేశారు. తర్వాత ప్రభుదేవా దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘యాక్షన్ జాక్సన్’లోని ఓ పాటలో ప్రభాస్ అతిథిగా స్టెప్పులేశారు. ఈసారి మాత్రం ప్రభాస్ హీరోగా పక్కా మాస్ మసాలా యాక్షన్ ఫిల్మ్ తీయాలని ప్రభుదేవా నిర్ణయించుకున్నారట! ‘సాహో’ తర్వాత ఈ సినిమా ఉంటుందని కెప్టెన్ ఆఫ్ ది షిప్ (ప్రభుదేవా) కన్ఫర్మ్ చేశారు. ‘‘ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ‘బాహుబలి’ వచ్చిందనో... బిజినెస్ బాగా జరుగుతుందనో... మేం సినిమా చేయాలనుకోవడం లేదు’’ అన్నారు ప్రభుదేవా. బహుశా... వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. -
బాలీవుడ్‌కి అతిథిగా!
ప్రభాస్ రేంజ్ ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’కి తర్వాత అన్నట్టు మారిపోయింది. ఈ చిత్రంతో ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆయనతో సినిమాలు తీసేందుకు టాలీవుడ్ దర్శక–నిర్మాతలే కాదు... బాలీవుడ్ దర్శక–నిర్మాతలు సైతం ఇప్పుడు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రభాస్‌తో స్ట్రైట్ ఫిల్మ్ తీసేందుకు దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు పలువురు చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి కూడా. ఆ వార్తల సంగతెలా ఉన్నా.. ప్రభాస్ హిందీ తెరపై ఓ స్ట్రైట్ సినిమాలో హీరోగా కనిపించే ముందు గెస్ట్ రోల్లో అలరించనున్నారని భోగట్టా. హిందీ చిత్రం ‘ఖామోషీ’లో ప్రభాస్ గెస్ట్ రోల్ చేయను న్నారనే వార్త షికారు చేస్తోంది. ప్రభుదేవా, తమన్నా జంటగా దర్శకుడు చక్రి తోలేటì ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ ‘కొలైయుదిర్ కాలమ్’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కథను మలుపు తిప్పే పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర కోసం ప్రభాస్‌ని సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘పౌర్ణమి’లో హీరోగానూ, దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘యాక్షన్ జాక్సన్’లోనూ ప్రభాస్ ఓ సాంగ్‌లో కనిపించారు. ఇక, తమన్నాతోనూ ప్రభాస్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కోసం గెస్ట్ రోల్‌కి ఒప్పుకున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. -
కొత్త స్టెప్!
సినిమాల్లోకి ప్రభుదేవా ఫస్ట్ స్టెప్ కొరియోగ్రఫీ – సక్సెస్. సెకండ్ స్టెప్ హీరో – సక్సెస్. థర్డ్ స్టెప్ డైరెక్షన్ – సక్సెస్. రెండు తమిళ సినిమాలకు పాటలు పాడారు. ఓ సినిమాకి పాట రాశారు. ఇప్పుడు ప్రభుదేవా ఇంకో స్టెప్ వేయనున్నారు. ఇప్పటివరకూ వేసిన అడుగులకన్నా అది ఫుల్ డిఫరెంట్. ప్రభుదేవా విలన్‌గా స్టెప్ వేయనున్న ఆ సినిమా పేరు ‘మెర్క్యురీ’. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ అండ్ ఒరిజినల్స్ పతకాంపై ‘పిజ్జా’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది థ్రిల్లర్ మూవీ. ‘నిశ్శబ్దం ఎంతో శక్తిమంతమైనది’ అనేది ట్యాగ్‌లైన్. ప్రభుదేవా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. టీనేజ్‌లో కెరీర్ ఆరంభించి, వేసిన ప్రతి అడుగులోనూ సక్సెస్ అయిన ప్రభుదేవా ఇప్పుడు వేయనున్న ఈ కొత్త స్టెప్‌లోనూ సక్సెస్ అవుతారని ఊహించవచ్చు. -
వాంటెడ్ డైరెక్టర్‌తో దబాంగ్ 3
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో సీక్వల్కు సిద్ధమవుతున్నాడు. వాంటెడ్ సినిమా తరువాత జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న సల్మాన్, ఇటీవల ప్రయోగాత్మక చిత్రాలతోనూ ఆకట్టుకుంటున్నాడు. అయితే తనకు తిరుగులేని ఫాలోయింగ్ తీసుకొచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లను మాత్రం వదిలిపెట్టడం లేదు. అందుకే1 సక్సెస్ ఫుల్ దబాంగ్ సీరీస్‌లో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. దబాంగ్, దబాంగ్ 2 సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్లను బద్ధలు కొట్టిన సల్లూ భాయ్ ఇప్పుడు దబాంగ్ 3ని రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఏక్తా టైగర్‌కు సీక్వల్గా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై షూటింగ్లో బిజీగా ఉన్న సల్మాన్, త్వరలో దబాంగ్ సీక్వల్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మాణంలో ప్రభుదేవ దర్శకత్వంలో దబాంగ్ 3 రూపొందనుంది. సల్మాన్ హీరోగా తెరకెక్కిన ట్యూబ్‌లైట్ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
ఓరి... ఏం వేషాలో...
చేపకు తానే ఈత నేర్పుతున్నట్టు... గువ్వకు ఎలా ఎగరాలో చెబుతున్నట్టు... సీరియస్‌గా ప్రభుదేవాకు ఏది ఎలా చేయాలో చెబుతున్నట్టు... డైరెక్టర్ రేంజులో హన్సిక ఫోజులిస్తుంటే షాకవ్వడం షూటింగ్ స్పాట్లో జనాల వంతైంది. కొరియోగ్రఫీనా... యాక్టింగా... డైరెక్షనా... అసలు ప్రభుదేవాకు రానిదేది? సారుగారు ఆల్మోస్ట్ ఆల్ 24 క్రాఫ్ట్స్‌లో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసి, కొన్నింటిలో డిస్టింక్షన్లో మార్కులు సాధించారు కదా! దాంతో సెట్లో జనాలు ‘హనుమంతుని ముందు కుప్పి గంతులా! ఓరి... ఏం వేషాలో!’ అన్నట్టు ఫేసులు పెట్టారు. కానీ, ప్రభుదేవా ఇప్పుడు హన్సికకు డైరెక్టరో, కొరియోగ్రాఫరో కాదు... కో–స్టార్. వీళ్లిద్దరూ ‘గులేబకావళి’ అనే తమిళ సినిమాలో జంటగా నటిస్తున్నారు. కో–స్టార్‌తో కెమిస్ట్రీ కుదరాలంటే... ఇద్దరి మధ్య మాంచి వేవ్‌లెంగ్త్ కుదరాలి కదా! అలా కుదరాలంటే... డిస్కషన్ కంపల్సరీ కదా! నేను చేస్తున్నదదేనంటూ హన్సిక గట్టిగా నవ్వేశారు. -
డాన్స్‌మాస్టర్.. కుంగ్‌ఫూ మాస్టర్
డాన్స్‌మాస్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ప్రభుదేవా ఆ తరువాత ఎలా డాన్సింగ్ కింగ్ అయ్యారో అందరికీ తెలిసిందే. అనంతరం కథానాయకుడిగా.. ఆపై దర్శకుడు, నిర్మాత అంటూ అనూహ్యగా ఎదిగిపోయిన విధంబు ఎరిగినతదే. ఒక దశలో బాలీవుడ్లో దర్శకుడిగా దుమ్మురేపిన ప్రభుదేవా కథానాయకుడిగా రీఎంట్రీ ఇచ్చి దేవి చిత్రంతో సూపర్సక్సెస్ను అందుకున్నారు. ఆ తరువాత నటిస్తున్న చిత్రం యంగ్ మంగ్ ఛంగ్. బాలాజీధరణీధరన్ దర్శకత్వంలో కాళిదాస్ జయరాం హీరోగా ఒరు పక్కకథై చిత్రాన్ని నిర్మించిన వాసన్ విజువల్స్ వేంచర్స్ సంస్థ అధినేతలు కేఎస్. శ్రీనివాసన్, కేఎస్. శివరామ్‌లు త్వరలో ఈ చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా సంతానం కథానాయకుడిగా ఓడి ఓడి ఉళక్కనుమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమిరా దస్తూరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ప్రభుదేవా కథానాయకుడిగా యంగ్ మంగ్ ఛంగ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటి లక్ష్మీమీనన్ నాయకిగా నటిస్తున్న ఇందులో దర్శకుడు తంగర్‌బచ్చన్, ఆర్జే.బాలాజీ, చిత్రాలక్ష్మణన్, కే.రాజన్, బాహుబలి ప్రభాకర్, కుంకీ అశ్విన్, నాగేంద్రప్రసాద్, మునీష్కాంత్, కాళీవెంకట్, మారి ముత్తు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్పీ.గురుదేవ్ ఛాయాగ్రహణం, అమ్రిష్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా నిజ జీవితంలో డాన్స్‌మాస్టర్ అయిన ప్రభుదేవా ఈ యంగ్ మంగ్ ఛంగ్ చిత్రంలో కుంగ్‌ఫూ మాస్టర్‌గా అదరగొట్టనున్నారట. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. -
డాన్స్‌మాస్టర్.. కుంగ్‌ఫూ మాస్టర్
డాన్స్‌మాస్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ప్రభుదేవా ఆ తరువాత ఎలా డాన్సింగ్ కింగ్ అయ్యారో అందరికీ తెలిసిందే. అనంతరం కథానాయకుడిగా.. ఆపై దర్శకుడు, నిర్మాత అంటూ అనూహ్యగా ఎదిగిపోయిన విధంబు ఎరిగినతదే. ఒక దశలో బాలీవుడ్లో దర్శకుడిగా దుమ్మురేపిన ప్రభుదేవా కథానాయకుడిగా రీఎంట్రీ ఇచ్చి దేవి చిత్రంతో సూపర్సక్సెస్ను అందుకున్నారు. ఆ తరువాత నటిస్తున్న చిత్రం యంగ్ మంగ్ ఛంగ్. భాలాజీధరణీధరన్ దర్శకత్వంలో కాళిదాస్ జయరాం హీరోగా ఒరు పక్కకథై చిత్రాన్ని నిర్మించిన వాసన్ విజువల్స్ వేంచర్స్ సంస్థ అధినేతలు కేఎస్. శ్రీనివాసన్, కేఎస్. శివరామ్‌లు త్వరలో ఈ చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా సంతానం కథానాయకుడిగా ఓడి ఓడి ఉళక్కనుమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమిరా దస్తూరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ప్రభుదేవా కథానాయకుడిగా యంగ్ మంగ్ ఛంగ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటి లక్ష్మీమీనన్ నాయకిగా నటిస్తున్న ఇందులో దర్శకుడు తంగర్‌బచ్చన్, ఆర్జే.బాలాజీ, చిత్రాలక్ష్మణన్, కే.రాజన్, బాహుబలి ప్రభాకర్, కుంకీ అశ్విన్, నాగేంద్రప్రసాద్, మునీష్కాంత్, కాళీవెంక ట్, మా రి ముత్తు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్పీ.గురుదేవ్ ఛాయాగ్రహంణం, అమ్రిష్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా నిజ జీవితంలో డాన్స్‌మాస్టర్ అయిన ప్రభుదేవా ఈ యంగ్ మంగ్ ఛంగ్ చిత్రంలో కుంగ్‌ఫూ మాస్టర్‌గా అదరగొట్టనున్నారట. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. -
మాజీ ప్రియుడితో నయన?
మాజీ ప్రియుడితో సంచలన నటి నయనతార నటించనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాఫిక్ ఇదే. టాప్ కథానాయకిగా వెలుగొందుతున్న నటి నయనతార. అయితే నిజజీవితంలో ప్రేమలో రెండుసార్లు ఓడిపోయిన ఈ అమ్మడు ఆ తరువాత కూడా నటిగా రాణించడం విశేషమే అవుతుంది. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్‌శివతో సహజీవనం చేస్తుందనే ప్రచారం గరం గరంగా సాగుతోంది. తన మాజీ ప్రియుల్లో ఒకరైన సంచలన నటుడు శింబుతో ఇదునమ్మఆళు చిత్రంలో నటించిన నయనతారను ఇప్పుడు రెండో మాజీ ప్రియుడు ప్రభుదేవాతో నటింపజేసే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నట్లు సమాచారం. ఒక పక్క లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తున్న ఈ క్రేజీ నటి మరో పక్క శివకార్తికేయన్ వంటి యువ నటుడితోనూ నటిస్తోంది. ప్రభుదేవా కూడా ఇటీవల కోలీవుడ్‌లో నటుడు, దర్శకుడిగా బిజీ అయ్యారు. ఇకపోతే ఈయన అంగీకరించిన తాజా చిత్రాన్ని యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ హ్యాండిల్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. ఇందులో కన్నడ నటి సంయుక్తను కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆమెను కాదని నటి నయనతారను ప్రభుదేవాకు జంటగా నటింప జేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త. అయితే నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో ఇకటైన కోలైయుధీర్ కాలంలో విలన్‌గా ప్రభుదేవాను నటింప జేసే ప్రయత్నాలు చేయగా అందుకు ఈ అమ్మడు సుముఖం వ్యక్తం చేయలేదనే ప్రచారం జరిగింది. దీంతో అదే చిత్రం హిందీ వెర్షన్లో ప్రభుదేవా ప్రతినాయకుడిగా నటిస్తుండగా నటి తమన్నా నాయకిగా నటిస్తుండడం విశేషం. అలాంటిది ఇప్పుడు కార్తీక్‌సుబ్బరాజ్ తను చిత్రంలో ప్రభుదేవాను, ఆయన మాజీ ప్రియురాలిని కలపడం సాధ్యం అవుతుందా? అయితే ఇక్కడ అసాధ్యానికి తావు ఉండదు. పారితోషికం బాగా పనిచేస్తుంది. మరి అది ఇక్కడ ఈ మాజీ ప్రేమజంటను కలుపుతుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. -
బాలీవుడ్లో బిజీ బిజీగా..
ముంబై ముద్దుగుమ్మ తమన్నా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో నటిస్తూనే మాతృ భాష హిందీలో కూడా పట్టు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తోంది. అయినప్పటికీ అమ్మడు హిందీలో నటించిన హింసక్కల్, హిమత్వాలా వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో తమన్నాకు పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. అందువల్ల దక్షిణాది సినిమాల్లోనే నటిస్తూ వచ్చిన ఈ అమ్మడుకు ప్రభుదేవాతో తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లో నటించిన ‘దేవి’ చిత్రం హిందీలో విజయాన్ని అదించింది. దీంతో ఈ అమ్మడికి రెండు కొత్త సినిమాల్లో మంచి అవకాశాలు లభించాయి. అంతేకాకుండా తమిళంలో నయనతార నటిస్తున్న ‘కొలైయుదిర్‌కాలం’ చిత్రం హిందీలో నయన పాత్రలో తమన్నా నటిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హిందీ సినిమాల్లో కూడా కలల రాణిగా మారడానికి తమన్నా అక్కడే మకాం వేసి కథలు వింటోంది. అదే సమయంలో అందచందాల ప్రదర్శనను పక్కన పెట్టి, నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలను పసిగట్టే పనిలో పడింది తమన్నా. ఈ అమ్మడు అనుకున్నది నెరవేరాలని ఆశిద్దాం. -
నా హీరోను చూడండి!
ప్రభుదేవా అంటే హన్సికకు ఎంతో స్పెషల్. ఎందుకంటే, అతని దర్శకత్వంలో చేసిన ‘ఎంగేయుమ్ కాదల్’ అనే తమిళ సినిమా ఆమెకు చాలా పేరు తెచ్చింది. ఆ మధ్య ఈ బబ్లీ బ్యూటీ చేసిన తమిళ సినిమా ‘బోగన్’కు ప్రభుదేవా ఓ నిర్మాత. అటు దర్శకుడిగా ఇటు నిర్మాతగా ప్రభుదేవా చేసిన ఈ రెండు సినిమాలూ హన్సిక కెరీర్‌కి హెల్ప్ అయ్యాయి. ప్రభుదేవాలో దర్శక–నిర్మాతను చూసిన హన్సికకు ఇప్పుడు అతనిలోని హీరో పరిచయం కానున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ‘గులేబగావళి’ అనే తమిళ సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్పాట్లో దిగిన ఓ ఫొటోను రెండు రోజుల క్రితం హన్సిక ట్వీట్ చేశారు. వెనుక నుంచి తీసిన ఫొటో కావడంతో అందులో ముఖాలు కనిపించలేదు. ‘నా పక్కనున్నది ఎవరో చెప్పుకోండి చూద్దాం’ అంటూ అభిమానులను ఊరిస్తూ, ఉడికిస్తూ... అతడు ఎవరు? అనే ఆలోచనలో పడేశారు. చివరకు, ఆదివారం ‘మీట్ మై కరెంట్ మూవీ హీరో’ అని ఇన్సెట్లో చూస్తున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రభుదేవా, హన్సిక జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. -
అప్పుడు దర్శకత్వంలో ఇప్పుడు జంటగా..
ఎంతటి వారికైనా గ్యాప్ రావడం అన్నది సహజం. ప్రతిభ ఉన్నవారికి ఆ గ్యాప్ ఎంతో కాలం కొనసాగదు. అందులోనూ అందం కూడా మెండుగా ఉన్న నటి హన్సిక లాంటి వారికి చిన్నగ్యాప్ పెద్ద సమస్య కానేకాదు. ఈ మధ్యనే రోమియో జూలియట్, భోగన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన హన్సిక ఆ తరువాత కోలీవుడ్‌లో నూతన అవకాశాలు రావడానికి కాస్త సమయం పట్టింది. దీంతో హన్సిక పనైపోయింది. మూటాముల్ల సర్దుకుంది అనే టాక్ వేగంగా ప్రచారమైంది. అలాగే ఒక మలయాళ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అలాగని ఈ బ్యూటీ కాళీగా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోలేదు. టాలీవుడ్లో ఒక చిత్రం చేస్తూ బిజీగానే ఉన్నారు. తాజా సమాచారం ఏమిటంటే కోలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్ హన్సిక తలుపు తట్టింది. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేస్తున్నారు. చాలా కాలం క్రితం దక్షిణాది వదిలి ఉత్తరాది సినిమాలో జెండా పాతి అక్కడ తనదైన ముద్ర వేసుకున్న ప్రభుదేవా ఇటీవల దేవి చిత్రంతో కథానాయకుడిగా రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. భోగన్ చిత్రంతో నిర్మాతగా కూడా అవతారమెత్తిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇప్పుడు హీరోగా, డైరెక్టర్‌గా చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే నవ దర్శకుడు అర్జునకు అవకాశం ఇచ్చి యగ్ మంగ్ జంగ్ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు.ఇందులో ఆయనతో నటి లక్ష్మీమీనన్ రొమాన్స్ చేస్తోంది. మరో పక్క ఆయన మాజీ ప్రియురాలు నయనతార ప్ర«ధాన పాత్రను పోషిస్తున్న కోలైయుదీర్ కాలం చిత్ర హిందీ రీమేక్‌లో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇక నటుడు విశాల్, కార్తీ హీరోలుగా కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రానికి మెగాఫోన్ పట్టారు.ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాయేషా నాయకి. కాగా కథానాయకుడిగా మరో చిత్రానికి కూడా ప్రభుదేవా పచ్చజెండా ఊపారని, ఇందులో నటి హన్సిక నాయకిగా నటిస్తున్నారన్న సమాచారం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉందని, దీనికి గులేభాహావళి అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారని తెలిసింది. దీనిని నవదర్శకుడు కర్ణన్ తెరకెక్కిస్తున్నారు.అమ్మడు హన్సిక ఇంతకు ముందు ప్రభుదేవా దర్శకత్వంలో ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో నటించారు. తాజాగా ఆయనతో డ్యూయెట్లు పాడుతున్నారన్నమాట. -
నయనకు విలన్‌గా ప్రభుదేవా?
నటి నయనతారకు ప్రభుదేవా విలన్‌గా మారనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో సంచలనంగా మారిన అంశం ఇదే. నిజా నికి ప్రభుదేవా, నయనతారల ప్రస్థావన రావడమే ఒక సంచలనం. ఎందుకుంటే వీరిద్దరూ ఒకప్పుడు అందుకు కేంద్రబిందువులుగా మారారు కాబట్టి. డీప్‌గా ప్రేమించికుని పెళ్లి దాకా వచ్చి విడిపోయిన మాజీ ప్రేమజంట అన్నది అందరికీ తెలిసిందే. అంతకు ముందు మాజీ ప్రేమికుడు శింబుతో కలిసి ఇదునమ్మఆళు చిత్రంలో నటించి ఎంతగా ఆశ్చర్యం కలిగించారో తెలిసిందే. తాజాగా మరో మాజీ ప్రియుడితో నటిస్తూ మరో షాక్ ఇవ్వనున్నారా? నయనతార ప్రస్తుతం నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కొలైయుధీర్ కాలం ఒకటి. టాలీవుడ్ దర్శకుడు, ఉన్నైపోల్ ఒరువన్, బిల్లా–2 చిత్రాల ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న దీన్ని హిందీ లోనూ రీమేక్ చేయనున్నట్లు, అందులో నయనతార పాత్రను నటి తమన్నా పోషించనున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అదే విధంగా హిందీ వెర్షన్లో తమన్నకు విలన్‌గా నటుడు ప్రభుదేవా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే తమిళంలో ఆ పాత్రను పోషిస్తున్నదెవరన్న ప్రశ్న తలెత్తింది. ఈ అంశాన్ని దర్శక నిర్మాతలు రహస్యంగానే ఉంచారు. ప్రభుదేవాకు హిందీలో మాదిరిగానే దక్షిణాదిలోనూ మంచి మార్కెట్ ఉందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. అందువల్ల తమిళంలో కొలైయుధీర్ కాలం చిత్రంలో నయనతారకు విలన్‌గా ప్రభుదేవానే నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సంచలన చిత్రం ద్వారా ప్రముఖ సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా నిర్మాతగా మారుతున్న విషయం తెలిసిందే. ఆయన గానీ, దర్శకుడు చక్రీ తోలేటిగానీ సరైన వివరణ ఇచ్చే వరకూ ఇలాంటి ఊహాజనిత ప్రచారాలు కొనసాగుతూనే ఉంటాయి మరి. -
జోడీ కుదరలేదు
ప్రభుదేవా, తమన్నా మరో సినిమా చేస్తు్తన్నారు. గతేడాది వచ్చిన హారర్ కామెడీ ‘అభినేత్రి’లో వీళ్లిద్దరూ జంటగా నటించిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే... ఈసారి జోడీ కుదరలేదు. ఆశ్చర్యంగా ఉందా? మరేం లేదు. ఇందులో ప్రభుదేవా విలన్‌గా నటిస్తున్నారు. మరి, హీరో ఎవరంటే.. ఎవరూ లేరు. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ కదా, తమన్నాదే మెయిన్ క్యారెక్టర్. సో.. తనే హీరో కింద లెక్క. తమిళంలో నయనతార నటిస్తున్న ‘కొలైవుదిర్ కాలమ్’ సినిమా హిందీ రీమేక్‌లోనే ప్రభుదేవా–తమన్నా నటించనున్నారు. చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్న ‘కొలైవుదిర్...’ ఇంకా విడుదల కాలేదు. కానీ, హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనతో దర్శక–నిర్మాతలు ప్రభుదేవా, తమన్నాలకు కథ వినిపించగా... గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆల్రెడీ లండన్‌లో షూటింగ్ ప్రారంభమైంది. హిందీ వెర్షన్‌కూ చక్రి తోలేటియే దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార పాత్రను హిందీలో తమన్నా చేస్తున్నారు. సంగీత దర్శకుడు యువన్‌శంకర్ రాజాతో కలసి ‘కొలైవుదిర్ కాలమ్’ను నిర్మిస్తున్న వశూ భగ్నానీయే హిందీ చిత్రానికి కూడా నిర్మాత. ‘‘ఫస్ట్ టైమ్ నేను విలన్‌గా నటిస్తున్నాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు విభిన్నంగా ఉంటుంది. ఎవరూ ఊహించని పాత్రలో కనిపిస్తా’’ అన్నారు ప్రభుదేవా. సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా కూడా హిందీ వెర్షన్లో ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇది కాకుండా... తమిళ దర్శకుడు శీను రామసామి.. ప్రభుదేవా, తమన్నా జంటగా ఓ సినిమా తీయాలనుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. మరి, ఆ సినిమా ఏమైందో? -
లక్ష్మీమీనన్‌కు లక్కీచాన్స్
అదృష్టం ఉండాలేగానీ ఒక ద్వారం మూసుకుంటే మరో ద్వారం తెరుచుకుంటుందన్నది నానుడి. ఇప్పుడు నటి లక్ష్మీమీనన్ది ఇదే పరిస్థితి. సక్సెస్ఫుల్ నాయకిగా పేరు తెచ్చుకున్న ఈ కేరళాకుట్టి కెరీర్లో విజయాలున్నా, అవకాశాలు లేవు. కారణాలేమైనా ఇటీవల రాకరాక ఒక మంచి అవకాశం వచ్చింది. ఏఎం.రత్నం అంత పెద్ద నిర్మాత చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా నటించే అవకాశం వచ్చింది. కాస్త ఆలస్యమైనా సూపర్ ఆఫర్ వచ్చిందని లక్ష్మీమీనన్ తెగ సంబరపడి పోయారు. అయితే విధి వక్రించి గాయాల పాలవ్వడంతో ఆ చిత్రాన్ని వదులు కోవలసిన పరిస్థితి. ఆ చింతలో ఉన్న ఈ అమ్మడికి మరో లక్కీచాన్స్ వచ్చింది. అదే ప్రభుదేవాతో రొమాన్స్ చేసే అవకాశం. దేవి వంటి విజయవంతమైన చిత్రం తరువాత ప్రభుదేవా ఎంగ్ మంగ్ సుంగ్ అనే చిత్రంలో నటించనున్నారు. చైనీస్ టైటిల్ తరహాలో ఉన్న ఈ చిత్రంలో ప్రభుదేవా కుంగ్‌ఫూ మాస్టర్‌గా నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఎంఎస్.అర్జున్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నాయకిగా నటి క్యాథరిన్ ట్రెసా నటించనుందనే ప్రచారం జరిగింది. తాజాగా ఆ అవకాశం నటి లక్ష్మీమీనన్‌ను వరించింది. దీని గురించి దర్శకుడు అర్జున్ తెలుపుతూ ప్రభుదేవాకు జంటగా లక్ష్మీమీనన్ నటించనున్నారని తెలిపారు. ఆమె ఇందులో భరతనాట్య డాన్సర్‌గా గ్రామీణ పాత్రలో నటించనున్నారని చెప్పారు. ఇది 1970–80 ప్రాంతంలో జరిగే పిరియడ్ కథా చిత్రంగా ఉంటుందని అన్నారు. ప్రభుదేవాకు తండ్రిగా దర్శకుడు తంగర్‌బచ్చన్, స్నేహితుడిగా ఆర్జే.బాలాజీ నటించనున్నారని చెప్పారు. చిత్ర షూటింగ్ ఈ నెల చివరిలో ప్రారంభం కానుందని దర్శకుడు వెల్లడించారు. -
ఎన్ మన్ సన్ అంటున్న ప్రభుదేవా
ప్రఖ్యాత నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా హీరోగా తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు. ఆయన నటించనున్న చిత్రానికి ఎన్ మన్ సన్ టైటిల్‌ను నిర్ణయించారు. దేవి వంటి విజయవంతమైన చిత్రం తరువాత ప్రభుదేవా కథానాయకుడిగా నటించనున్న చిత్రం ఇదే. ప్రస్తుతం బాలాజీ ధరణీ ధరణ్ దర్శకత్వంలో కాళిదాస్ జయరాం హీరోగా ఒరు పక్క కథై చిత్రాన్ని, సంతానం కథానాయకుడిగా ఓడి ఓడి ఉళైక్కనుం చిత్రాలను నిర్మిస్తున్న వాసన్ విజువల్స్ వేంచర్ సంస్థ అధినేతలు కేఎస్.శ్రీనివాసన్, కేఎస్.శివరామన్ ప్రభుదేవా హీరోగా చిత్రం రూపొందించనున్నారు. ఇందులో దర్శకుడు తంగర్‌బచ్చన్ ఒక కీలక పాత్రను పోషించనున్నారట. ఆర్జే.బాలాజి, బాహుబలి ప్రభాకర్ కాళికేయన్, చిత్రాలక్ష్మణన్, కుంకీ అశ్విన్ ముఖ్య పాత్రలను పోషించనున్న ఈ చిత్రానికి ఆర్పీ.గురుదేవ్ ఛాయాగ్రహణం, అమ్రేష్ సంగీతాన్ని అందించనున్నారు. హీరోయిన్, ఇతర సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా రొమాన్స్ చేసే అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. దీనికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను ఎంఎస్.అర్జున్ నిర్వహించనున్నారు. ఈయన ముండాసిపట్టి, ఇండ్రు నేట్రు నాళై చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. ఈ ఎన్ మన్ సన్ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
వన్స్‌మోర్ విత్...!
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ఎవరంటే... ప్రభుదేవా పేరు గుర్తొస్తుంది. మరి, హీరోయిన్లలో ఆ స్థాయిలో డ్యాన్స్ చేసేది ఎవరంటే వినిపించే ముగ్గురు నలుగురు కథానాయికల జాబితాలో తమన్నా పేరు తప్పకుండా ఉంటుంది. ఈ ఇద్దరూ డ్యాన్స్ బేస్డ్ హారర్ కామెడీ ‘అభినేత్రి’లో జంటగా నటించారు. సినిమా రిజల్ట్ పక్కన పెడితే... అందులో ప్రభుదేవా, తమన్నాల డ్యాన్స్‌ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడీ జోడీ మరోసారి కలసి నటించడానికి సిద్ధమవుతుందని చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. ప్రభుదేవా, తమన్నా జంటగా శీను రామసామి దర్శకత్వంలో అమ్మ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. గతేడాది నటిగా తమన్నాకి మంచి పేరు తెచ్చిన తమిళ సినిమా ‘ధర్మదురై’ దర్శకుడు శీను రామసామియే. ప్రస్తుతం తాజా చిత్రానికి సంబంధించిన కథాచర్చలు జరుగుతున్నాయట. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. -
దేవికి సీక్వెల్ ?
దేవి చిత్రానికి సీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. దేవి చిత్ర కథానాయకుడు, నిర్మాత ప్రభుదేవా అన్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం దక్షిణాదిని విడిచి ఉత్తరాదికి వెళ్లి అక్కడ పలు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రముఖ దర్శకుడిగా పేరు సాధించిన ప్రభుదేవా ఈ మధ్యనే మళ్లీ కోలీవుడ్‌కు తిరిగొచ్చి నిర్మాతగా అవతారమెత్తారు. ప్రభుదేవా స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి విజయ్ దర్శకత్వంలో దేవి చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించి అందులో కథానాయకుడిగా నటించారు. తమన్నా నాయకిగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జయంరవి, హన్సిక జంటగా బోగన్ చిత్రంతో పాటు సిల సమయంగళ్, వినోదన్ చిత్రాలు ఈయన నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో బోగన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. హీరోగా రీఎంట్రీలో మంచి విజయాన్ని అందించిన దేవి చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించే పనలో ప్రభుదేవా ఉన్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన పనులు ఇప్పటికే మొదలయ్యాయని తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ గా మళ్లీ తమన్నానే నటిస్తారా? దర్శకుడెవరు? దేవి చిత్రం మాదిరిగానే ఈ చిత్రాన్ని మూడు భాషల్లో నిర్మిస్తారా? లాంటి ప్రశ్నలకు సమాధానంతో పాటు ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతికవర్గం వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
మాజీ ప్రేమికులు కలిశారా?
నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా, నటి నయనతార ఒకప్పటి ప్రేమికులన్న విషయం తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వం వహించిన విల్లు చిత్రంలో నయనతార నాయకిగా నటించారు. అప్పుడు వారి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం వరకూ వచ్చింది. నయనతారను పెళ్లి చేసుకోవడానికి ప్రభుదేవా తన మొదటి భార్య రమలత్‌తో విడాకులు తీసుకున్నారు. అదే విధంగా ప్రభుదేవా కోసం నయనతార క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతానికి మారారు. నటనకు కూడా స్వస్తి చెప్పారు. ఇక పెళ్లే తరువాయి అనుకున్న సమయంలో ప్రభుదేవా, నయనతారల మధ్య మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. ఆ తరువాత ప్రభుదేవా బాలీవుడ్లో ప్రవేశించి అక్కడ దర్శకుడిగా సెటిలయ్యారు. నటి నయనతార మళ్లీ నటనపై దష్టి సారించారు. అలా ఇద్దరూ వారివారి పనుల్లో బిజీ అయ్యిపోయారు. ఆ తరువాత ప్రేమ అనే విషయానికి ఆమడ దూరంలో ఉన్న నయనతార ప్రస్తుతం నంబర్‌వన్ నాయకిగా వెలుగొందుతున్నారు. కాగా నానూమ్ రౌడాదాన్ చిత్రంలో నటించిన నయనతార ఆ చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌శివతో ప్రేమాయణం జరుపుతున్నట్లు, వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ప్రభుదేవా, నయనతార అనూహ్యంగా ఒక నక్షత్ర హోటల్లో ఒకరికొకరు తారసపడినట్లు, ఆ సమయంలో ఇద్దరు చాలా సమయం మనసు విప్పి మాట్లాడుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం కోడంబాక్కంలో హట్ టాపిక్‌గా మారిన ఈ సంఘటన వాస్తవమా? లేక వదంతా?అన్నది తెలియాల్సి ఉంది. -
ఆ ఇద్దరి చిత్రానికి కథ రెడీ
నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ సంఘ భవన నిర్మాణ నిధి కొరకు ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఇంతకు ముందే వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో తాను, కార్తీ కలిసి నటించనున్నట్లు తెలిపారు. ఆ చిత్రానికి కథ ఏమిటి? దర్శకుడెవరు అన్న విషయాలపై చాలా ఆసక్తి నెలకొంది. అలాంటి వాటన్నింటికి నటుడు విశాల్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 23వ తేదీన సినీయర్ దర్శకుడు కే.సుభాష్ కన్నుమూసిన విషయం తెలిసిందే. క్షత్రియన్, అభిమన్యు, ఏలైయిన్ సిరిప్పిల్, సుభాష్ పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన కే.సుభాష్ పలు తమిళ, హిందీ చిత్రాలకు కథలను అందించారు. ఆయన రాసిన చివరి కథ కరుప్పురాజా వెళ్‌లైరాజాలో నటుడు విశాల్, కార్తీ కలిసి నటించనున్నారు. ఈ విషయం గురించి విశాల్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. మరణించిన సుభాష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన విషయం తెలిసిందే. తాను నటుడవుతానని చెప్పిన తొలి వ్యక్తి సుభాష్ అని, ఈ విషయాన్ని తానెప్పుడూ మరచి పోనని విశాల్ అన్నారు. సుభాష్ రాసిన చివరి కథ కరుప్పురాజా వెల్లైరాజాలో తాను, కార్తీ హీరోలుగా నటించనున్నామని, ప్రభుదేవా దీనికి దర్శకత్వం వహించనున్నారని పేర్కొన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే కరుప్పురాజా వెల్లైరాజా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పదు. -
ఎక్కువిస్తే ఆడేస్తా!
ఎక్కువ డబ్బు ఇస్తే ఆడడానికి నేనెప్పుడూ రెడీ అంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. ఈ అమ్మడి మంచి నటే కాదు మంచి డ్యాన్సర్ కూడా. ఇటీవలే డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో నటించి ఆయన నుంచి మంచి డాన్సర్ అనే కితాబును కూడా అందుకున్నారు.అందాలారబోత విషయంలో హద్దులు చెరిపేయడానికి ఎప్పుడూ సిద్ధమే అనే ఈమె ఇటీవల ఐటమ్ సాంగ్స్‌కూ సై అనడం చూస్తున్నాం. ఇంతకు ముందు టాలీవుడ్లో దుమ్మురేపిన తమన్నా ఇప్పుడు కోలీవుడ్‌లో సత్తాచాటుతున్నారు. దేవి చిత్రంతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లిన ఈ జాణ అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని కాస్త సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. నటులతో సమానంగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ నటీమణుల కోరికను తాను స్వాగతిస్తున్నానని పేర్కొని పెద్ద చర్చకే తెరలేపారు. కథానాయకుల పారితోషికాలు కథానాయికల కంటే పలు రెట్లు అధికంగా ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఇకపోతే తాను కొత్త నటులతో సింగిల్ సాంగ్‌లో నటించి అధిక పారితోషికం పుచ్చుకుంటున్నాననే ప్రచారం జోరుగా సాగుతోందని, అందులో తప్పేముంది ఎవరైనా డబ్బు కోసమే పని చేస్తారని అన్నారు. అయినా ప్రత్యేక గీతంలో నటించడం సాధారణ విషయం కాదన్నారు. తానే కాదు కాజల్‌అగర్వాల్, శ్రుతిహసన్ లాంటి వాళ్లూ ఐటమ్ సాంగ్స్‌లో నటిస్తున్నారని తమన్నా తనను సమర్థించుకునేలా మాట్లాడారు. -
విజయం దేవిదే!
ముక్కోణపు పోటీలో పెద్ద విజయం దేవి చిత్రానిదేనని ఆ చిత్ర యూనిట్ పేర్కొంది. సుమారు 12 ఏళ్ల తరువాత డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా తమిళంలో కథానాయకుడిగా నటించి తన సొంత బ్యానర్ ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మించిన త్రిభాషా (తమిళం,తెలుగు, హిందీ) చిత్రం దేవి. ఐసీ గణేశ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించారు. తమన్నా నాయకిగా ిహ ంది నటుడు సోనూసూద్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం మూడు భాషల్లోనూ విడుదలైంది.ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా బుధవారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చెన్నై ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, నిర్మాత ప్రభుదేవా మాట్లాడుతూ దర్శకత్వం వహిస్తూ నటించడం చాలా కష్టం అన్నారు. ఇతరుల దర్శకత్వంలో నటించడం సులభం అని పేర్కొన్నారు. ఈ దేవి చిత్రాన్ని తొలి రోజు ప్రేక్షకుల మధ్య చిత్రం చూడడానికి కాస్త భయం అని పించిందన్నారు. కారణం వారు తనను హీరోగా ఎలా రిసీవ్ చేసుకంటారన్నదేనని తెలిపారు. అయితే చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, చిత్ర యూనిట్ శ్రమకు దక్కిన మంచి ఫలితం ఇదని పేర్కొన్నారు. చిత్రాన్ని విడుదల చేసిన ఆరా సినిమాస్ అధినేత మహేశ్ మాట్లాడుతూ ఇరుముగన్ చిత్రం తరువాత తమ సంస్థకు దక్కిన అంత మంచి విజయం దేవి చిత్రం అని చెప్పారు. ఈ చిత్రాన్ని ఈ నెల ఏడో తేదీన రెమో, రెక్క చిత్రాలతో పాటు విడుదల చేశామని అన్నారు. అప్పుడు కొందరు ఆ చిత్రాలకు పోటీగా విడుదల చేస్తున్నారా? అని పరిహాసం ఆడారు. భయపెట్టారని అన్నారు. అయితే వాటికంటే పెద్ద విజయాన్ని దేవి చిత్రం సాధించిందని పేర్కొన్నారు. ఈ చిత్రం మూడు భాషల్లో ఏక కాలంలో విడుదల కావడంతో తమిళనాడులో మొదట 190 స్క్రీన్లోనే విడుదల చేశామని, చిత్రం ఇప్పుడు మంచి విజయం సాధించడంతో అదనంగా మరో 75 స్క్రీన్లను పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయ్, నటుడు ఆర్జే.బాలాజి పాల్గొన్నారు. -
ప్రభుదేవాతో తమన్నా ప్రేమలో పడిందా?
డ్యాన్సింగ్ కింగ్ ప్రభుదేవాకు మిల్కీబ్యూటీ తమన్నా క్లోజ్ అయ్యారా? వీరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందా? తాజాగా సినీ వర్గాల్లో జరుగుతున్న హాట్ హాట్ టాపిక్ ఇదే. కోలీవుడ్, టాలీవుడ్ దాటి దర్శకుడిగా బాలీవుడ్లో జెండా పాతిన నృత్యదర్శకుడు నటుడు ప్రభుదేవా. చాలా గ్యాప్ తరువాత ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి కథానాయకుడిగా నటించిన చిత్రం దేవి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా కథానాయకిగా నటించారు. సాధారణంగా తమన్నా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. అలాంటిది దేవి చిత్ర ప్రచార కార్యక్రమంలో ప్రభుదేవాతో కలిసి పాల్గొనడం పెద్ద చర్చకే దారి తీసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు దేవి చిత్ర ప్రచార కార్యక్రమంలో కలిసి పాల్గొన్న ప్రభుదేవా, తమన్నా ఒకరి నొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడంతో వారి గురించి పరిశ్రమ వర్గాల్లో ఇప్పుడు గుసగుసలు మొదలయ్యాయి. దేవి చిత్ర షూటింగ్‌లోనే ప్రభుదేవా, తమన్నాల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, ఇద్దరు చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారని రకరకాల వదంతులు హల్చల్ చేస్తున్నాయి. అంతే కాదు వీరి మధ్య ప్రేమాయణం లాంటిది జరుగుతోందని ఒక టాలీవుడ్ దర్శకుడు తెలిపినట్లు తమిళ పత్రికలు ప్రచురించడం గమనార్హం. ఇప్పటి వరకూ తమన్నాపై ఇలాంటి ప్రేమ వదంతులు పుట్టలేదు. బహుశ ఇదే ప్రప్రథమం అనుకోవచ్చు. ఇకపోతే ప్రభుదేవా ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. నటి నయనతారతో ప్రేమ పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. అదే విధంగా అంతకు ముందే పెళ్లి అయిన ఆయన తన భార్య రమలత్ నుంచి విడాకులు పొందారన్నది గమనార్హం. ప్రభుదేవాకిప్పుడు 43 ఏళ్లు. ఇంట్లో మరో పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెరుగుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. అదే విధంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రేమ వివాదంలోనూ చిక్కుకోని తమన్నా తాజాగా ప్రభుదేవాపై మనసు పడ్డట్టు వదంతులు ప్రచారం అవుతున్నాయి. మరి ఈ వ్యవహారంలో వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేగానీ అసలు విషయం తెలుస్తుంది. నిజం ఏమిటో నిలకడ మీదే తెలుస్తుంది. -
తమన్నా డాన్స్‌లో దుమ్మురేపారు
నటి తమన్నా డాన్స్‌లో దుమ్మురేపారని డాన్సింగ్కింగ్ ప్రభుదేవా అన్నారు. ఈయన నిర్మాతగా మారి తన ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తూ, కథానాయకుడిగా నటించిన చిత్రం దేవి. తమిళ్, తెలుగు, హిందీ భాషలలో ఏక కాలంలో రూపొందిన ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు. తమన్నా నాయకి. సోనూసూద్, ఆర్జే.బాలాజీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత ప్రభుదేవా మాట్లాడుతూ ఈ చిత్ర విషయంలో ఒక్క నటనపైనే దృష్టి సారించి దర్శకుడు విజయ్, నటి తమన్నా, ఆర్జే.బాలాజీల నుంచి మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని భావించానన్నారు. ముందు నుంచి ఇదే అభిప్రాయం మైండ్‌లో ఫిక్స్ అయ్యి పోయిందన్నారు. ఇదే భావనతో దేవునికి నమస్కరించుకున్నానని అన్నారు. నటుడిగా ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏమిటని అడుగుతున్నారనీ, ముందు తాను ఒక డాన్సర్‌గా పరిచయం అయ్యానన్నారు. ఆ తరువాత మాస్టర్, నటుడు, దర్శకుడుగా మారానని వివరించారు. అదే విధంగా తమిళం, తరువాత తెలుగు, హిందీ అంటూ తన పయనం సాగిందన్నారు. మళ్లీ ఇప్పుడు ఒక కొత్త నటుడిగా తమిళంలోకి వస్తున్నాననీ అన్నారు. ఇక దర్శకుడు విజయ్‌కు సహనం ఎక్కువ అన్నారు. చిన్న నటుడి నుంచి అందరికీ చాలా ఓర్పుగా సన్నివేశాలను వివరిస్తారనీ తెలిపారు. ఫారిన్ గర్ల్ అనుకున్నా ఇక నటి తమన్నా గురించి చెప్పే తీరాలన్నారు. నిజానికి తనకు తమన్నా పరిచయం లేదని, ఒక సారి ఫ్లైట్‌లో ఒక ఫారిన్ గర్ల్ తనను చూసి చేయి ఊపారన్నారు. బదులుగా తానూ చేయి ఊపానన్నారు. అప్పుడు తన స్నేహితుడితో చూశావా తనకు ఫారిన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అని గర్వంగా అన్నానని, అప్పుడు అతను ఆమె నటి తమన్న అని చెప్పారని తెలిపారు. అలాంటి ఫారిన్ గర్ల్‌లా ఉండే తమన్నాను దర్శకుడు విజయ్ ఈ చిత్రం కోసం విలేజ్ గర్ల్‌గా మారుస్తానంటే తాను నమ్మలేదన్నారు. అయితే రెండు గంటలు మేకప్ వేసి అచ్చం పల్లెటూరి అమ్మాయిగా తమన్నను మార్చేశారని చెప్పారు. తమన్నా నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనీ, తను సన్నివేశాల్లో చాలా అంకిత భావంతో నటిస్తారని ప్రశంసించారు. కాగా ఒక పాట రిహార్సల్స్ కోసం రెండు రోజులు వరుసగా రెండు రోజులు వచ్చిన తమన్న మూడో రోజు రాలేదని తెలిపారు. ఫోన్ చేస్తే కాలు నొప్పి అనీ, ఆ తరువాత నడుము నొప్పి, మెడ నొప్పి, ఒళ్లు నొప్పి, జ్వరం అంటూ ఈ రోజుకు వదిలేయండి సార్, రేపు చేద్దాం అని అన్నారన్నారు. ఆ తరువాత 15 రోజులు చిత్రీకరించిన పాటలో తమన్నా డాన్స్‌లో దుమ్ము రేపారన్నారు. సోనూసూద్, ఆర్జే.బాలాజీ అందరూ చాలా బాగా నటించారని తెలిపారు. చిత్రాన్ని అక్టోబర్ ఏడో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుదేవా వెల్లడించారు. -
దసరాకు తెరపైకి దేవి
దేవి చిత్రం దసరా సెలవులపై గురి పెట్టి అక్టోబర్ ఏడో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. డ్యాన్సింగ్ స్టార్, దర్శక, నటుడు ప్రభుదేవా తన సొంత బ్యానర్ ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తూ కథానాయకుడిగా నటించిన చిత్రం దేవి. తమన్నా నాయకిగా నటించిన ఈ చిత్రంలో సోనూసూద్ ప్రధాన పాత్రను పోషించారు. నటి ఎమీజాక్సన్ ఒక స్పెషల్ సాంగ్‌లో నటించడం విశేషం. ఇకపోతే ఇది తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కిన చిత్రం కావడంతో ఇతర ముఖ్య పాత్రల్లో ఆయా భాషల్లో ప్రముఖ నటీనటులు నటించారని చిత్ర దర్శకుడు విజయ్ తెలిపారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ సుమారు 12 ఏళ్ల తరువాత ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన చిత్రం దేవి అని తెలిపారు. ఆయనతో పనిచేయడం చిత్రంలోని ప్రతి ఒక్కరికీ సంతోషంగా ఉందన్నారు. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చిందన్నారు. చిత్ర సింగిల్ సాంగ్‌ను శుక్రవారం విడుదల చేసినట్లు చెప్పారు. చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా దసరా పండగ సందర్భంగా అక్టోబర్ ఏడవ తేదీన విడుదల చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
ప్రభుదేవా నా తప్పులను సరిదిద్దాడు!
ప్రభుదేవా, సోనూ సూద్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా డెవిల్. హిందీలో 'తుటక్ తుటక్ తుటియా'గా, తెలుగులో ఈ సినిమా అభినేత్రిగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా ద్విపాత్రాభినయంతో అదరగొట్టనుంది. తాను ఇలాంటి పాత్రల కోసమే ఎదురుచూశానని నటనకు అవకాశం ఉన్న రెండు పాత్రలు చేశానని తమన్నా చెప్పింది. ఒకేసారి రెండు పాత్రల్లో నటించడం కాస్త చాలెంజింగ్ గా కూడా ఉందని మూవీ విషయాలను పంచుకుంది. ప్రభుదేవా లాంటి గొప్పవ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా గొప్ప అనుభూతి అని పేర్కొంది. అయితే మూవీ కోసం ఓ స్టెప్ కోసం చాలా కష్టపడ్డానని కొన్ని తప్పులు చేసిందట. రిహార్సల్స్ స్పాట్ లో ఉన్న ప్రభుదేవా వెంటనే తమన్నా స్టెప్పుల్లోని ఆమె తప్పులను సవరించి సులువుగా స్టెప్పులు వేసేలా చిట్కాలు సూచించాడట. ఇదే విషయాన్ని తమన్నా అంగీకరించింది. మూవీలో ఓ పాటలో తాను చేసే డ్యాన్స్ హైలెట్ గా నిలుస్తుందని స్వతహగా మంచి డ్యాన్సర్ అయినా తమన్నా చెప్పుకొచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ దర్శకత్వంలో సోనూసూద్ తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది. -
ప్రభుదేవా డ్యాన్స్‌పై ఏమన్నా డౌటుందా!
ప్రభుదేవా దేశంలోనే ఉత్తమ డ్యాన్సర్. ఆయనకు పోటీగా ఇటీవల హృత్తిక్ రోషన్, షాహీద్ కపూర్.. ఇంకా చాలాచాలామంది వచ్చారు. కానీ ఆయనే బెస్ట్ డ్యాన్సర్. అదే విషయాన్ని తాజాగా 'తుటక్ తుటక్ తుటియా' టీజర్ ద్వారా మరోసారి చాటుడు ప్రభుదేవా. ప్రభుదేవా, సోనూ సూద్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'తుటక్ తుటక్ తుటియా'. తెలుగులో ఈ సినిమా అభినేత్రిగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సోనూ సూద్ తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రభుదేవా అదిరిపోయే స్టెప్పులు ప్రధాన ఆకర్షణగా రూపొందించిన ఈ టీజర్లో సోనూ సూద్ కొత్త అవతారంలో కనిపిస్తుండగా.. తమన్నా హాట్‌లుక్‌తో అదరగొట్టింది. -
అదిరేటి స్టెప్పు మీరేస్తే..!
‘‘స్టెప్పులు ఇరగదీయడంలో అన్నయ్యతర్వాతే ఎవరైనా! ఆయన స్టెప్పులు సూపర్. ‘వానా వానా వెల్లువాయె’ అంటూ చిరు డ్యాన్సు చేస్తుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవనుకో. ‘బంగారు కోడిపెట్ట వచ్చెనండి...’ అని స్టెప్పేస్తే కాలు కదపలేకుండా ఉండలేమనుకో’’ అని చిరంజీవి డ్యాన్సుల గురించి ఫ్యాన్స్ మురిసిపోతూ చెప్పుకుంటారు. ఈ రెండు పాటలకూ స్టెప్పులు సమకూర్చింది ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా అని తెలిసే ఉంటుంది. ఇవే కాదు.. ఇంకా చిరంజీవి చాలా పాటలకు ప్రభుదేవా స్టెప్స్ సమకూర్చారు. ఇప్పుడు మరోసారి చిరూ కోసం ప్రభుదేవా అదిరేటి స్టెప్పులు సమకూరుస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం చిరంజీవి నటించిన ‘శంకర్‌దాదా జిందాబాద్’కి దర్శకత్వం వహించింది ప్రభుదేవానే. ఆ సినిమాకి కొరియోగ్రఫీ చేసింది కూడా ఆయనే. ఇప్పుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీకి స్టెప్పులు సమకూర్చే పనిలో బిజీగా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుదేవా స్పష్టం చేశారు. ‘శంకర్‌దాదా జిందాబాద్.. ఊ...ఆ.. ’ అంటూ చిరంజీవి జోష్‌గా డ్యాన్స్ చేయడానికి వీలున్న ట్యూన్ ఇచ్చిన దేవిశ్రీప్రసాద్ తాజా చిత్రానికి పాటలు స్వరపరుస్తున్నారు. ఈ ట్యూన్స్ చిరు అభిమానులు ఆహా.. ఓహో.. అనేలా ఉంటాయని ఊహించవచ్చు. -
నేను నటిస్తా బ్రదర్
సుమారు పుష్కర కాలం తరువాత ప్రభుదేవా తమిళంలో నటిస్తున్న చిత్రం దేవి. ఆయనకు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు. సైవం, ఇదు ఎన్న మాయం చిత్రాల తరువాత చిన్న గ్యాప్ తీసుకుని ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న దేవి చిత్రం విడుదల తేదీని యూనిట్ వర్గాలు ఖరారు చేశారు. సెప్టెంబర్ తొమ్మిదో తేదీన చిత్రం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌తో చిన్న భేటీ. ప్ర: దేవి చిత్రం గురించి చెప్పండి? జ: దేవి విభిన్న హారర్ కథా చిత్రం. ముంబయిలో నివశించే తమిళ యువకుడు ప్రభుదేవా మంచి మోడ్రన్‌గా ఉండే అమ్మాయి తన జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటారు. అలాంటిది పక్కా గ్రామీణ యువతి భార్య అవుతుంది. ఈ నేపథ్యంలో జరిగే సంఘటనలే దేవి చిత్రం. ప్ర: వారానికి రెండు హారర్ చిత్రాలు వస్తున్న సందర్భంలో మీరూ ఆ ట్రెండ్‌కు మారారా? జ: నిజం చెప్పాలంటే దెయ్యాల కథల సీజన్, హారర్ చిత్రాల ట్రెండ్‌కు ముందే తయారు చేసుకున్న కథ ఇది. సరైన టీమ్ సెట్ కాకపోవడంతో చిత్ర నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభుదేవా వచ్చి చేరారు. నాలుగేళ్లుగా తయారు చేసుకున్న కథ నలభై రోజుల్లో చిత్రీకరణతో పూర్తి అయింది. ఇంతకు ముందెప్పుడూ చూడని హారర్ కథా చిత్రంగా దేవి ఉంటుంది. ప్ర: ప్రభుదేవా పెద్ద దర్శకుడు. ఆయన్ని ఎలా ఇందులో నటించడానికి ఒప్పించారు? జ: మొదటిలో నాకు అలాంటి భయం కలిగింది. చిత్రంలో తమన్నా పాత్రకే ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి కథలో ప్రభుదేవా నటిస్తారా అన్న సంశయం కలిగింది. ధెర్యం చేసి ప్రభుదేవాకు కథ చెప్పాను. బ్రహ్మాండంగా ఉంది బ్రదర్. నేను నటిస్తానంటూ ఆయన నుంచి బదులు వచ్చింది. ఇందులో ఒక పాటకు మీరే నృత్య దర్శకత్వం వహించాలని కోరగా 12 ఏళ్ల తరువాత తమిళంలోకి వస్తున్నాను.చిత్రం బాగా రాావడానికి ఏం చేయమన్నా చేస్తాను అని అన్నారు. ప్ర: ఆ చిత్రం కోసం తమన్నాను పూర్తిగా మార్చేశారటగా. జ: టైటిల్ రోల్ ఆమెదే. పక్కా గ్రామీణ యువతిగా మారిపోయారు. ఆమె మేకప్‌కే గంటన్నర పట్టేది. ప్ర: హాలీవుడ్ కథా రచయిత పాల్ ఆరోన్ ఈ కథలోకి ఎలా వచ్చారు? జ: నిజానికి ఈ చిత్రానికి ముందు ఆయన ఎవరో నాకు తెలియదు. సైవం చిత్రానికి సౌండ్ మిక్సింగ్ కోసం లాస్ఎంజిల్స్ వెళ్లినప్పుడు ఆయన తన ఇన్ టూ టిప్ చిత్ర పని కోసం అక్కడికి వచ్చారు. అప్పుడు పరిచయమయ్యారు. సినిమాకు సంబంధించిన విషయాలు చాలా చర్చించుకునేవాళ్లం.అలా దేవి చిత్ర కథలో ఆయన భాగస్వామ్యం చాలా ఉంది. -
వారిని చూస్తే బాధేస్తుంది
ఆ నిర్మాతలను చూస్తే బాధేస్తుందంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. ఇంతకీ ఈ అమ్మడు చెప్పేదేమిటి? తొలిరోజుల్లో తమన్నా కోలీవుడ్‌లో విజయ్, ధనుష్, సూర్య, కార్తీ, అజిత్ వంటి టాప్ హీరోలతో నటించారు.అయితే చిన్న గ్యాప్ తరువాత రీఎంట్రీ అయిన తమన్నాను బాహుబలి, తోళా చిత్రాలు విజయాలతో పరికరించాయి. దీంతో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్నారనే చెప్పాలి. ప్రస్తుతం బాహుబలి-2, విజయ్‌సేతుపతితో ధర్మదురై, ప్రభుదేవాకు జంటగా దేవి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. శివకార్తికేయన్ లాంటి యువనటులతో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఇలా బిజీగా ఉన్న ఈ బ్యూటీ మాట్లాడుతూ తానే కాదు ప్రతి నటి, నటుడు తాము నటించే చిత్రాలు విజయం సాధించాలన్న భావంతోనే శ్రమించి నటిస్తారన్నారు. అయినా కొన్ని చిత్రాలు అపజయం చెందుతాయన్నారు. అలాంటప్పుడు చాలా మనస్థాపం కలుగుతుందన్నారు. ఇక ఆ చిత్రాల నిర్మాతలను చూస్తే బాధేస్తుందని చెప్పారు. చిత్ర విజయాన్ని నిర్ణయించేది కథేనని అన్నారు.అందుకే తాను కథ నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తున్నానన్నారు. తనకు కథ చెప్పడానికి వచ్చిన దర్శక నిర్మాతలతో కథ నచ్చకపోతే నటించనని నిర్మొహమాటంగా చెప్పేస్తానన్నారు. తన చిత్రాలు విజయం సాధించాలి, నిర్మాతలు సంతోషంగా ఉండాలన్నదే తన భావన అని తమన్న పేర్కొన్నారు. -
బాలీవుడ్ సినిమా అయినా.. గాడిలో పెడుతుందా..?
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కోన వెంకట్ చేయి పడిందంటే ఆ సినిమా హిట్ అన్న టాక్ ఉండేంది. అయితే రాను రాను ఈ స్టార్ రైటర్ ఆ ఫాంను కోల్పోయాడు. పండగచేస్కో, అఖిల్, బ్రూస్ లీ, త్రిపుర, సౌఖ్యం ఇలా వరుస ఫ్లాప్‌లు కోక కెరీర్‌ను కష్టాల్లోకి నెట్టేశాయి. ఇక తానే నిర్మాతగా మారి దర్శకత్వం పర్యవేక్షణ కూడా చేస్తూ తెరకెక్కించిన శంకరాభరణం కోన టాలెంట్ మీద అనుమానాలు కలిగేలా చేసింది. అయితే తరువాత డిక్టేటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోన కాస్త పరవాలేదనిపించాడు. టాలీవుడ్లో అదృష్టం కలిసి రాకపోవటంతో పరభాష ఇండస్ట్రీల మీద దృష్టిపెడుతున్నాడు కోన వెంకట్. ప్రస్తుతం ప్రభుదేవా తో కలిసి కోలీవుడ్‌లో రూపొందుతున్న అభినేత్రి సినిమాకు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభుదేవాకు ఓ కథ వినిపించిన కోన, ఆ సినిమాను బాలీవుడ్లో అభిషేక్ హీరోగా తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే అభిషేక్ బచ్చన్‌కు కథ వినిపించిన కోన, ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరి బాలీవుడ్ లో అయిన కోనకు సక్సెస్ ట్రాక్ దొరుకుతుందేమో చూడాలి. -
ఇక్కడకొస్తే మాస్టర్ని... అక్కడికెళ్తే డైరెక్టర్ని!
‘‘తమన్నాతో ఇంతకుముందు రెండు చిత్రాలు చేసిన అనుభవంతో చెబుతున్నా.. ‘అభినేత్రి’ టైటిల్ తనకు బాగా సూటవుతుంది. కోన వెంకట్ ఈ కథ విని, ఎగ్జయిట్ అయి నాకు ఫోన్ చేసి చెప్పాడు. నాక్కూడా కథ బాగా నచ్చింది. ప్రభుదేవాగారు హైదరాబాద్‌లో డ్యాన్స్ స్కూల్ పెట్టాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘అభినేత్రి’. కోన ఫిలిం కార్పొరేషన్ పతాకంపై బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బిఎల్ఎన్ సినిమాతో కలిసి ఎంవీవీ సత్యనారాయణ తెలుగులో, ప్రభుదేవా తమిళ్లో, హిందీలో సోనూసూద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రభుదేవా మాట్లాడుతూ- ‘‘నేను హైదరాబాద్‌కొస్తే డ్యాన్స్‌మాస్టర్. ముంబయ్ వెళ్తే డైరెక్టర్ అనే ఫీలింగ్ నాలో ఉంటుంది. ఈ చిత్రకథ నచ్చడంతో తమిళంలో నేనే నిర్మిస్తున్నా. దర్శకుడు విజయ్ చెప్పినట్లు నటిస్తున్నా’’ అని చెప్పారు. ‘‘ప్రభుదేవాగారికి నేను ఓ కథ చెప్పేందుకు ముంబై వెళ్లా. నా కథ విన్న తర్వాత ఆయనో కథ చెప్పారు. నేను ఎగ్జయిట్ అయి నిర్మించాలనుకున్నా. మూడు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోన్న చిత్రమిది’’ అని సమర్పకుడు కోన వెంకట్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘హాలీవుడ్ రైటర్ పాల్ లారెన్, నేను కలిసి రాసుకున్న కథ ఇది. గణేశ్‌గారు నన్ను నమ్మి, ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేలా సహకరించారు. ఇందులో కొత్త ప్రభుదేవాను చూస్తారు. తమన్నా కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయి అవుతుంది’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ- ‘‘నేను నటించిన మొదటి చిత్రం ‘శ్రీ’ కథ చెప్పేందుకు తొలిసారి కోన వెంకట్‌గారు నన్ను కలిశారు. అప్పట్నుంచి ఆయనతో నా పరిచయం కొనసాగుతోంది. కేవలం పది నిమిషాలు కథ విని, వెంటనే ఒప్పేసుకున్నా. ఇది హారర్ చిత్రం కాదు. ప్రభుదేవా ‘కింగ్ ఆఫ్ డ్యాన్స్ కాదు... గాడ్ ఆఫ్ డ్యాన్స్’ అనాలి’’ అని చెప్పారు. చిత్ర నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ, నిర్మాత డి.సురేశ్‌బాబు, రచయిత విజయేంద్రప్రసాద్, నటుడు సోనూసూద్, హాస్యనటుడు సప్తగిరి పాల్గొన్నారు. -
దేవి(ల్)లో గెస్ట్‌గా ఫరాఖాన్
త్రిభాషా చిత్రం దేవి(ల్)లో బాలీవుడ్ ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరాఖాన్ గెస్ట్ రోల్లో మెరవనున్నారు. ప్రభుదేవా, తమన్నా జంటగా విజయ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ఛ్ఛీఠిజీ()అనే పేరును నిర్ణయించారు. బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్ కథారచయిత పాల్ అరూన్ విజయ్‌కి సహకార రచయితగా పని చేస్తున్నట్లు దర్శకుడు విజయ్‌నే స్వయంగా వెల్లడించారు. నిర్మాత కే.గణేశ్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొత్తగా ప్రముఖ బాలీవుడ్ నృత్య దర్శకురాలు ఫరాఖాన్ వ చ్చి చేరారు. దీని గురించి దర్శకుడు తెలుపుతూ చిత్ర కథ డిమాండ్ చేయడంతో ఫరాఖాన్‌ను నటింపజేస్తున్నామన్నారు. ఆమె హిందీలో చాలా పేరున్న నృత్య దర్శకురాలు, నటి, దర్శకురాలని అన్నారు. అయినా తాము అడగ్గానే దేవి(ల్) చిత్రంలో నటించడానికి అంగీకరించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానన్నారు. ఇందులో ఫరాఖాన్ నృత్యదర్శకురాలిగానే నటిస్తున్నారని తెలిపారు. -
ప్రభుదేవా నోట పాట
తమిళసినిమా: కథానాయకులు పాడటం అన్నది ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. కమలహాసన్ నుంచి శింబు, ధనుష్‌ల వరకూ పలువురు పాడి తమ అభిమానులను అలరించారు. ఆ కోవలో ఇప్పుడు ప్రభుదేవా చేరారు. నృత్యదర్శకుడు,నటుడు, దర్శకుడుగా దేశ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రభుదేవా ఇటీవల నిర్మాతగా కూడా అవతారమెత్తారు. బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడిగా వెలుగొందుతున్న ప్రభుదేవా ఇన్ని శాఖల్లో ప్రతిభను చాటుకున్నా గాయకుడిగా గళమెత్తలేదు. అలాంటిది ఇప్పుడు తన గొంతు సవరించుకుని ఒక ప్రయోగాత్మక పాటతో గాయకుడిననిపించుకున్నారు. ఈయన పాడింది సినిమాకు కాదు. ఎన్నికలపై అవగాహన కలిగించే సందేశాత్మక పాటను ఇటీవల ఆలపించారు .ఓటు హక్కు అవశ్యకతను వివరించే ఈ పాటను గీత రచయిత యుగభారతి రాశారు. అందరూ ఓటు వేయాలి,నూరు శాతం ఓట్లు నమోదు కావాలి అని సాగే ఈ పాటలో నోటుకు ఎందుకు నోటు అంటూ ప్రజలను ఉత్తేజపరచే పదాలు చోటు చేసుకుంటాయి.ప్రభుదేవా పాడిన ఈ పాట తరువాత శింబు కూడా ఓటుకు సంబంధించి ఒక పాట పాడనున్నారు. మొత్తం మీద తమిళనాట జరగన్ను ఈ ఎన్నికలు ప్రభుదేవాను గాయకుడిని చేశాయన్న మాట. -
పాప్ కింగ్‌కు పట్టం
వేల్స్లో మైఖెల్ జాక్సన్ విగ్రహం ప్రతిష్ట ఆవిష్కరించిన నటుడు ప్రభుదేవా విద్యార్థులతో సందడి మహదానందంగా ఉందని వ్యాఖ్య చెన్నై: పాప్ సంగీత ప్రపంచంలో రాజుగా వెలిగిన మైఖెల్ జాక్సన్‌కు వేల్స్ వర్సిటీ పట్టం కట్టింది. సంగీత ప్రియుల్ని ఓలలాడించిన పాప్‌కింగ్ నిలువెత్తు విగ్రహాన్ని తమ వర్సిటీలో ప్రతిష్టించింది. గురువారం జరిగిన వేడుకలో ఈ విగ్రహాన్ని ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా ఆవిష్కరించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ‘మైఖెల్ జాక్సన్’ అన్న ఆ పేరులోనే ఉంది ఓ వైబ్రేషన్. పాప్ సంగీత సామ్రాజ్యంలో గాయకుడిగా, నృత్యకారుడిగా ప్రపంచ స్థాయిలో పాప్ కింగ్‌గా అవతరించి అమరుడైన మైఖెల్ జాక్సన్‌ను స్మరిస్తూ వేల్స్ వర్సిటీ విగ్రహ ప్రతిష్టకు చర్యలు చేపట్టింది. ఇందుకు చెన్నైకు చెందిన ఆర్సీ గోల్డన్ గ్రానైట్స్ మేనేజింగ్ డెరైక్టర్ చంద్రశేఖరన్ ముందుకు వచ్చారు. 3.5 టన్నుల గ్రానైట్ రాతితో ఏక శిలా విగ్రహం తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. శిల్పకళాకారుడు రమేష్ 40 రోజులు శ్రమించి మైఖెల్ జాక్సన్ నిలువెత్తు ఏకశిలా గ్రానైట్ విగ్రహానికి బెంగళూరులో రూపకల్పన చేశారు. రూ.12 లక్షల ఖర్చుతో పది అడగులు ఎత్తు, 5.5 అడుగుల వెడల్పుతో పాప్‌కింగ్ స్టెప్పులు వేస్తున్నట్టుగా విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ విగ్రహం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకి సైతం ఎక్కడం విశేషం. అలాంటి ఈ విగ్రహాన్ని పల్లావరం సమీపంలోని వేల్స్ వర్సిటీలో ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన వేడుకలో ఇండియన్ మైఖెల్ జాక్సన్, ప్రముఖ నటుడు, దర్శకుడు,నిర్మాత ప్రభుదేవా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహదానందం: ఈ విగ్రహావిష్కరణ అనంతరం మీడియాతో ప్రభుదేవా మాట్లాడుతూ చెన్నై వేల్స్ వర్సిటీలో విగ్రహం ఏర్పాటు చేశారన్న సమాచారంతో షాక్‌కు గురయ్యానని వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం తనకు ఈ సమాచారం తెలియగానే, ఎప్పుడెప్పుడు మైఖెల్ జాక్సన్ విగ్రహాన్ని చూస్తానో అన్న ఉత్సాహంతో ఎదురు చూశానని పేర్కొన్నారు. అందుకే ఆ విగ్రహం తరహాలో నిలబడి తానూ ఫొటోకు ఫోజు ఇచ్చానని, ఆ ఫొటోను తన ఇంట్లో భద్ర పరచుకుంటానన్నారు. ఆ విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం మహదానందంగా ఉందన్నారు. ఇక, సినిమా విషయాలకు వస్తూ, తన సొంత బ్యానర్లో మూడు చిత్రాలు చేస్తున్నట్టు వివరించారు. వేల్స్ వర్సిటీ చాన్సలర్ డాక్టర్ ఐషరి కె గణేష్ మాట్లాడుతూ నెల రోజుల క్రితం ఇక్కడకు విగ్రహాన్ని తీసుకొచ్చామని, దీనిని ఇండియన్ మైఖెల్ జాక్సన్ చేతుల మీదుగా ఆవిష్కరించాలన్న సంకల్పంతో ముందుకు సాగామన్నారు. ప్రభు దేవా చెన్నైకు వచ్చిన సమాచారంతో ఆయన్న సంప్రదించగా తక్షణం అంగీకరించడం అభినందనీయంగా పేర్కొన్నారు. తమ వర్సిటీలో వేల్స్ నక్షత్ర పేరిట వేడుకలు జరిగాయని గుర్తు చేస్తూ, ఆ సమయంలో ఇక్కడ డ్యాన్స్, మ్యూజిక్ డిప్లొమో, డిగ్రీ కోర్సుల ఏర్పాటుకు నిర్ణయించామని పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్టుగా ప్రముఖ లక్ష్మణ్ శ్రుతి సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని ప్రకటించారు. శిల్పకళాకారుడు రమేష్ మాట్లాడుతూ మైఖెల్ జాక్సన్ విగ్రహాన్ని సిద్ధం చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అనంతరం వీ చెన్నై వారియర్స్ పేరిట జరిగిన కార్యక్రమానికి హాజరైన వలంటీర్లకు ఈసందర్భంగా ప్రభుదేవా చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. తదుపరి ఆ వర్సిటీలోని విద్యార్థులతో ముచ్చటించే విధంగా కాసేపు అక్కడే ఆనందంగా ప్రభు దేవా గడిపారు. ప్రభుదేవా రాకతో ఆయన్ను చూడడానికి ఆ వర్సిటీలోని విద్యార్థులందరూ తరలి రావడం, సెల్ఫీల కోసం ఎగబడడంతో , వారిని కట్టడి చేయడం కష్టతరంగా మారిందని చెప్పవచ్చు. -
జనతా గారేజ్కు నో చెప్పిన ప్రభుదేవా?
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో కొరియాగ్రఫీ చేసే అవకాశాన్ని వదులుకున్నాడట ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమాలో ఒక పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసే ప్రతిపాదనను ప్రభుదేవా తిరసర్కించాడట. ఎన్టీఆర్ డ్యాన్సింగ్ స్కిల్స్‌ను ఇష్టపడే ప్రభు.. ఎన్టీఆర్ ప్రతిపాదన తోసిపుచ్చడం టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. కేవలం తను దర్శకత్వం వహించే సినిమాలకే నృత్యదర్శకత్వం చేయాలని ప్రభుదేవా నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమట. దీంతో ప్రభుదేవా తిరస్కరించిన ఆఫర్‌ను ఆయన అన్నయ్య, మరో ప్రముఖ కొరియో గ్రాఫర్ రాజు సుందరం అందిపుచ్చుకున్నాడట. " జనతా గారేజ్" లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ముంబైలో చిత్రీకరించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఓ పాటకు ప్రభుదేవా డాన్స్ కంపోజింగ్ చేస్తున్నాడని, త్వరలోనే ఈ పాట చిత్రీకరణ జరగనుందని వార్తలొచ్చాయి. దీంతో ప్రభు సరికొత్త డ్యాన్స్ జనతా గ్యారేజ్ చిత్రానికి పెద్ద ఎస్సెట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ప్రభుదేవా నిర్ణయంతో వారంతా డీలాపడ్డారు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సమంతా, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా తమిళ హీరో మోహన్ లాల్ పెదనాన్న పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
కొత్త కాంబినేషన్‌తో...
రచయిత కోన వెంకట్ సారథ్యంలో ఇప్పుడు ఓ కొత్త ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైంది. ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ కలసి ఒక తమిళ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నీ నిజమే నని తెలిసేలా కోన వెంకట్ తాజాగా ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని (తెలుగు వెర్షన్‌ను) ఎం.వి.వి. సినిమా పతాకంపై అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో ‘నాన్న’ లాంటి చిత్రాల ద్వారా సుపరిచితుడూ, హీరోయిన్ అమలా పాల్ భర్త అయిన ఎల్. విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘దర్శకుడు విజయ్ చాలా ప్రతిభావంతుడు. ఆయనే ఈ చిత్రానికి కథ కూడా రాశారు. ఈ కథపై నాకు చాలా నమ్మకం ఉంది. శివ తుర్లపాటి ప్రారంభించిన ‘బ్లూ సర్కిల్ కార్పొరేషన్’తో కలసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాం. ఈ సినిమాను సమర్పిస్తూ, తెలుగు డైలాగ్స్ రాస్తున్నందుకు గర్విస్తున్నా’’ అని కోన వెంకట్ వ్యాఖ్యానించారు. హార్రర్ నేపథ్యంలో కథ నడుస్తుందని భోగట్టా. సప్తగిరి కూడా ఇందులో ఒక పాత్రధారి. వీటన్నిటికీ తగ్గట్లే కోన కూడా, ‘‘మీకు గనక ‘గీతాంజలి’ సినిమా నచ్చితే, అంతకు పదింతలు ఈ సినిమా మీకు నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు. కథాంశం మాటెలా ఉన్నా, చాలా రోజుల తరువాత ప్రభుదేవా మళ్ళీ నటించడం, తమన్నా, సోనూసూద్ తదితరులు సహనటులు కావడం లాంటివి ఆసక్తికరమే. టైటిల్‌తో సహా ఇతర విశేషాలు తెలుసుకోవడానికి లెటజ్ వెయిట్! -
ఇక తమన్నా భయపెడుతుంది
హార్రర్ కామెడీలకు ఇప్పుడు మంచి గిరాకీ నడుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ - ఇలా ఏ భాషలోకి వెళ్ళినా బాక్సాఫీస్ వద్ద ఇవి మినిమమ్ గ్యారంటీ అయిపోయాయి. నయనతార (‘మాయ’), త్రిష (‘కళావతి’, రానున్న ‘నాయకి’), హన్సిక (‘చంద్రకళ’), రాయ్ లక్ష్మి (తెలుగులో ‘శివగంగ’గా వస్తున్న తమిళ ‘షావుకార్ పేట్టై’) లాంటి పలువురు పేరున్న తారలు ఆ స్క్రిప్టులు ఎంచుకుంటున్నది అందుకే! తాజాగా, మన మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఆ లిస్టులో చేరిపోయిందని కోడంబాకమ్ వర్గాల భోగట్టా. నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడైన ప్రభుదేవాతో కలసి తమ్మూ బేబీ ఒక హార్రర్ సినిమాలో నటిస్తోందట! రెండు రోజుల క్రితమే ఈ చిత్రా నికి సంబంధించిన ప్రత్యేక ఫోటోషూట్‌ను ముంబయ్‌లో తీసినట్లు సమాచారం. నటి అమలాపాల్‌ను పెళ్ళి చేసుకున్న యువ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ చిత్రానికి డెరైక్టర్. ఇటీవలే ‘ప్రభుదేవా స్టూడియోస్’ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన ప్రభుదేవా ఈ సినిమాను సొంతంగా నిర్మిస్తారట. విశేషం ఏమిటంటే, ప్రస్తుతమున్న బాక్సాఫీస్ సూత్రాలకు తగ్గట్లే తమిళ, తెలుగు, హిందీ భాషలు మూడింటిలో ఈ హార్రర్ కామెడీని తెరకెక్కించడం! సినిమాలో ఒకరికొరకు జంటగా నటిస్తారో, లేదో కానీ ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుదేవా, తమన్నా కీలక పాత్రధారులు. అలాగే, ‘అరుంధతి’లో ‘వదల బొమ్మాళీ వదల...’ అని మెప్పించిన సోనూ సూద్ అత్యంత కీలక పాత్ర ధరిస్తారు. విభిన్నమైన కథాంశంతో తయారవుతున్న సినిమా ఇదని సన్నిహిత వర్గాల మాట.‘బాహుబలి-2’, తమిళ ‘ధర్మదురై’ లాంటి సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా అవి అయిపోగానే ఈ సినిమా పనిలో పడతారట! మొత్తానికి, నటుడు - కొరియోగ్రాఫర్ - దర్శకుడు లారెన్స్ ఇప్పటికే ‘ముని’, ‘కాంచన’ లాంటి సినిమాలతో భయపెడితే, ఇప్పుడు ప్రభుదేవా అదే బాటలో వెళుతున్నట్లు కనిపిస్తోంది -
ప్రభుదేవాతో తమన్న
ప్రభుదేవాకు జంటగా తమన్న అనగానే ఇదేదో హింది చిత్రం అనుకునేరు. నృత్య దర్శకత్వం నుంచి, నటన, దర్శకత్వం అంటూ ఎదగడమే కాకుండా తమిళోడి సత్తా ఏమిటన్నది దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాది చిత్ర పరిశ్రమకు చాటి చెప్పిన కొద్దిమంది దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రభుదేవా. అయితే ఈయన తమిళంలో నటించి చాలా కాలమే అయ్యింది. బాలీవుడ్లో దర్శకుడిగా బిజీ అవ్వడంతో తమిళ చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారనే చెప్పాలి. అయితే ఇటీవల సొంతంగా చిత్ర నిర్మాణం ప్రారంభించి తమిళంలో చిత్రాలు చేస్తున్నారు. కాగా తాజాగా తమిళంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. మదరాసు పట్టణం, తాండవం, దైవ తిరుమగళ్, తలైవా చిత్రాల దర్శకుడు విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీన్ని ప్రభుదేవా తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. కాగా ఇందులో ప్రభుదేవాతో రొమాన్స్ చేయిం చడానికి నటి తమన్నను ప్రయత్నిస్తున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారిక పూర్వకంగా వెలువడే అవకాశం ఉంద ని తెలిసింది. -
లుంగీ డ్యాన్స్‌తో దుమ్మురేపిన ధోనీ, ప్రభుదేవా!
మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ.. క్రికెట్ ఆడటంలో ఆయనది ప్రత్యేకమైన ధనాధన్ శైలి. హెలికాప్టర్ షాట్లతో మైదానంలో రెచ్చిపోవడమే కాదు.. లుంగీ కట్టుకొని ప్రభుదేవాతో పోటీపడి స్టెప్పులు కూడా వేయగలనని తాజాగా ఆయన నిరూపించాడు. ఓ మోటార్ బైక్ వాణిజ్య ప్రకటన కోసం ధోనీ దక్షిణ భారతీయులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ యాడ్‌లో దక్షిణాది స్టైల్లో లుంగీ కట్టడే కాదు.. గ్రేట్ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో కలిసి స్టెప్పులు వేశాడు. రజనీకాంత్ గౌరవార్థం 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొన్ చేసిన 'లుంగీ' డ్యాన్స్ సూపర్‌హిట్. ఇప్పుడే అదే స్టైల్లో ధోనీ, ప్రభుదేవా లుంగీ మోకాళ్లపైకి కట్టుకొని డ్యాన్స్ చేశారు. ఒకప్పుడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నేతృత్వం వహించిన ఈ జార్ఖండ్ డైనమేట్ ధోనీ.. దక్షిణాది వారికి సన్నిహితుడే. ఇప్పుడు చెన్నై జట్టు లేకపోవడంతో ధోనీ ఐపీఎల్లో పుణెకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయినప్పటికీ ధోనీకి దక్షిణ భారతంలోనూ భారీ అభిమానులు ఉన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని తెలుగుభాషలో ఈ యాడ్‌ను మోటార్ బైక్ కంపెనీ రూపొందించింది. అనుకున్నట్టుగానే అభిమానులను అలరించేలా ధోనీ, ప్రభుదేవా తమ 'లుంగీ డ్యాన్స్' స్టెప్పులతో దుమ్మురేపారు. -
గాయకుడిగా ప్రభుదేవా
మల్టిపుల్ టాలెంటెడ్ కళారులు అతి కొద్ది మందిలో ప్రభుదేవా ఒకరని చెప్పొచ్చు. చిన్న వయసు నుంచే నృత్యకళారంగంలో తన పనితనంతో సినీ వర్గాలను అబ్బుర పరచిన ప్రభుదేవా అంతటితోనే ఆగిపోకుండా ఇతర శాఖలపై మక్కువ చూపారు. ఫలితం నటన, దర్శకత్వం రంగాల్లోనే తన ప్రతిభను చాటుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ అంటూ బహుభాషా దర్శకుడిగా విజయాలను సాధిస్తున్నారు. ఇవాళ భారతీయ సినిమాలో ప్రభుదేవా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రతిభ అన్నది ఎవరి సొత్తు కాదు. శ్రమ, పట్టుదల, కృషి ఈ మూడూ ఉంటే ఎవరైనా సాధించవచ్చుననడానికి ప్రభుదేవా ఒక ఉదాహరణ. నృత్యదర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తాజాగా నిర్మాతగా మారి ఒకేసారి ఏకంగా మూడు చిత్రాలు నిర్మిస్తున్నారు. ప్రభుదేవా అంతటితో సంతృప్తి చెందలేదు. ఇప్పుడు కొత్తగా గాయకుడిగా అవతారమెత్తారు. తాను దర్శకత్వం వహిస్తున్న సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రం కోసం ఒక పాటను అలవోకగా పాడేశారు. ఈయనలోని గాయకుడ్ని కనుగొన్నది బాలీవుడ్ సంగీత దర్శకుడు సందీప్శిరోద్కర్ ప్రభుదేవా పాత హిందీ పాటల్ని లయబద్ధంగా పాడేస్తుండడం చూసిన సందీప్శిరోద్కర్ సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రంలోని పాటను పాడమన్నారట. ప్రభుదేవా పాట చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు ఆ చిత్ర వర్గాలు.