ప్రభుదేవా నా తప్పులను సరిదిద్దాడు! | Prabhu Deva corrected my dance steps, says Tamannaah | Sakshi
Sakshi News home page

ప్రభుదేవా నా తప్పులను సరిదిద్దాడు!

Published Sat, Sep 10 2016 2:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

ప్రభుదేవా నా తప్పులను సరిదిద్దాడు!

ప్రభుదేవా నా తప్పులను సరిదిద్దాడు!

ప్రభుదేవా, సోనూ సూద్‌, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా డెవిల్. హిందీలో 'తుటక్‌ తుటక్‌ తుటియా'గా, తెలుగులో ఈ సినిమా అభినేత్రిగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా ద్విపాత్రాభినయంతో అదరగొట్టనుంది. తాను ఇలాంటి పాత్రల కోసమే ఎదురుచూశానని నటనకు అవకాశం ఉన్న రెండు పాత్రలు చేశానని తమన్నా చెప్పింది. ఒకేసారి రెండు పాత్రల్లో నటించడం కాస్త చాలెంజింగ్ గా కూడా ఉందని మూవీ విషయాలను పంచుకుంది.

ప్రభుదేవా లాంటి గొప్పవ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా గొప్ప అనుభూతి అని పేర్కొంది. అయితే మూవీ కోసం ఓ స్టెప్ కోసం చాలా కష్టపడ్డానని కొన్ని తప్పులు చేసిందట.  రిహార్సల్స్ స్పాట్ లో ఉన్న ప్రభుదేవా వెంటనే తమన్నా స్టెప్పుల్లోని ఆమె తప్పులను సవరించి సులువుగా స్టెప్పులు వేసేలా చిట్కాలు సూచించాడట. ఇదే విషయాన్ని తమన్నా అంగీకరించింది. మూవీలో ఓ పాటలో తాను చేసే డ్యాన్స్ హైలెట్ గా నిలుస్తుందని స్వతహగా మంచి డ్యాన్సర్ అయినా తమన్నా చెప్పుకొచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ దర్శకత్వంలో సోనూసూద్‌ తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా టీజర్‌ యూట్యూబ్ లో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement