ఐపీఎల్‌: 10 నిమిషాలకు తమన్నా అంత తీసుకుందా! | Tamannaah Charging 50 Lakhs For 10 Minute Performance IN IPL | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 7 2018 4:15 PM | Last Updated on Sat, Apr 7 2018 5:39 PM

Tamannaah Charging 50 Lakhs For 10 Minute Performance IN IPL  - Sakshi

ఐపీఎల్‌ కోసం తమన్నా ప్రాక్టీస్‌

ముంబై : మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌-2018 ఆరంభోత్సవ వేడుకల్లో సౌత్‌బ్యూటీ తమన్నా చిందేయనుంది. పదినిమిషాల ప్రదర్శనకు ఈ అమ్మడు ఏకంగా 50 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో తమన్నాతో కలిసి డ్యాన్సింగ్ మ్యాస్ట్రో ప్రభుదేవా ప్రేక్షకులను అలరించనున్నాడు. నాలుగు దక్షిణాది పాటల్లో చిందేసే వీరి నృత్యాన్ని శైమక్‌ దేవర్‌ కొరియోగ్రఫి చేసినట్లు సమాచారం.

ఇక ఈ అవకాశంపై తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. తొలిసారి క్రీడా ఈవెంట్‌లో ప్రదర్శన చేస్తున్నానని సంబరపడిపోయింది. ఇంతకముందు ఇలాంటి వేడుకల్లో ఎప్పుడు పాల్గొనలేదని, ఐపీఎల్‌ వంటి అద్భుతమైన టోర్నీకి అవకాశం రావడం సంతోషంగా ఉందని ఈ మిల్కీబ్యూటీ చెప్పుకొచ్చింది. సినిమాల్లో నటించడం వేరు స్టేడియంలో ప్రేక్షకుల ముందు చేయడం వేరని, మనమంతా పిచ్చిగా ఆరాధించే క్రికెట్‌ పండుగ ఈ రాత్రి మొదలవుతుందని ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఈ వేడుకల్లో​ తమన్నా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ప్రదర్శన చేయనుంది. దీనిపై స్పందిస్తూ.. ముంబై, హైదరాబాద్‌, చెన్నైలు తన సొంత నగరాలని తెలిపింది.  తాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ నాలుగు భాషలకు చెందిన నాలుగు పాటలకు డ్యాన్స్‌ చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే ఈ వేడుకల్లో తమన్నా, ప్రభుదేవాలతో పాటు స్టార్ హీరోలు హృతిక్ రోషన్, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు డ్యాన్సులతో అభిమానులను కనువిందు చేయనున్నారు. అయితే ఈ వేడుకల నుంచి భుజగాయంతో రణవీర్‌సింగ్‌, షూటింగ్‌ బిజీతో పరణితీ చోప్రాలు తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ ఆరంభ వేడుకలు అనంతరం చెన్నైసూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్ మొదలవుతుంది.

It's time for some great adrenaline, it's time for IPL!! #vivoipl

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement