opening ceremony
-
చెన్నై షాపింగ్ మాల్ లో మీనాక్షి చౌదరి సందడి
-
పారిస్ మళ్లీ మురిసె...
పారిస్: మొన్న రెగ్యులర్ ఒలింపిక్స్‌ను ఎంత వైభవంగా ఆరంభించారో... దివ్యాంగుల కోసం నిర్వహించే పారాలింపిక్స్‌ను కూడా అంతే అట్టహాసంగా అంగరంగ వైభంగా ప్రారంభించారు. దీంతో మరోసారి పారిస్ కలలు, కళాకారులు, నృత్యరీతులు, పాప్ గీతాలతో విశ్వక్రీడల శోభకు వినూత్న ‘షో’కులద్దింది. కనుల్ని కట్టిపడేసే వేడుకలు ఆద్యంతం అలరించాయి. పలు ఆటపాటలు, కళాకారుల విన్యాసాల అనంతరం ఫ్రాన్స్ జెండాలోని మూడు రంగుల్ని ఆరు ఫ్లయిట్లు ఆకాశానికి పూసినట్లుగా చేసిన ఎయిర్ షో వీక్షకుల్ని విశేషంగా కట్టిపడేసింది. ఆ వెంటే మార్చ్‌పాస్ట్ మొదలైంది. ఒలింపిక్స్ ప్రారంబోత్సవంలో పడవలపై మార్ప్పాస్ట్ సాగితే... పారాలింపిక్స్ మార్చ్‌పాస్ట్ పారిస్ రహదారిపై కేరింతగా రెగ్యులర్ ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా జరిగింది. రేపటి నుంచి పోటీలు జరుగుతాయి. 11 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 4000 మందికి పైగా దివ్యాంగ అథ్లెట్లు 22 క్రీడాంశాల్లో పోటీపడతారు. రెగ్యులర్ ఒలింపిక్స్‌ను ఆదరించినట్లుగానే ఈ క్రీడలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారని నిర్వాహకులు తెలిపారు. 2 మిలియన్ల (20 లక్షలు)కు పైగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవడమే ఆదరణకు నిదర్శనమని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్ మాట్లాడుతూ మరోమారు పారిస్‌ను ప్రేక్షకుల సమూహం ముంచెత్తనుందన్నారు. మూడేళ్ల క్రితం టోక్యోలో కోవిడ్ మహమ్మారి కారణంగా పారా అథ్లెట్లంతా ఖాళీ స్టాండ్ల (ప్రేక్షకులు లేక) ముందు తమ ప్రదర్శన కనబరిచారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండబోదని క్రీడాభిమానుల కరతాళధ్వనుల మధ్య పారాలింపియన్లు పోటీలను పూర్తిచేస్తారని నిర్వాహకులు చెప్పారు. గురువారం ముందుగా తైక్వాండోలో పారాలింపియన్లు పతకాల బోణీ కొట్టనున్నారు. దీంతో పాటు పోటీల తొలిరోజు టేబుల్ టెన్నిస్, ట్రాక్ సైక్లింగ్ పోటీలు జరుగుతాయి. -
ముసుగు ధరించి.. చరిత్రను చెబుతూ.. అట్టహాసంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం (ఫొటోలు)
-
10,500 మంది... ఒకటే స్వప్నం!.. నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్
పతకం... పతాకం... ఒక అథ్లెట్‌కు వీటితో విడదీయరాని బంధం... పతకం గెలిచిన వేళ జాతీయ పతాకం ఎగురుతుంటే సగర్వంగా నిలబడి ఆ అనుభూతిని పొందగలగడం ఒక్క క్రీడాకారుడికి మాత్రమే సాధ్యం... అదీ ఒలింపిక్స్‌లాంటి అత్యంత ప్రతిష్టాత్మక వేదికపై అంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు... ఆ భావోద్వేగ క్షణం కోసమే సంవత్సరాల శ్రమ, పోరాటం, పట్టుదల... ప్రణాళికలు, వ్యూహాలు, సన్నాహాలు, శిక్షణ... డైట్, ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంత్... అన్నీ అన్నీ కలగలిస్తే ఒలింపిక్స్ పతకం... ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల కల ఒలింపిక్స్‌లో మెడల్ గెలుచుకోవడమే... ఎన్ని చాంపియన్‌షిప్‌లు సాధించినా, ఎన్ని ట్రోఫీలు గెలుచుకున్నా, ఒలింపిక్ పతకం మాత్రమే అథ్లెట్‌ను ఆకాశాన నిలబెడుతుంది. ఆ కంఠాభరణం మెరుపుల ముందు ఎన్ని ఆభరణాలైనా తక్కువే. స్వర్ణం, రజతం, కాంస్యం... పేర్లు వేరు కావచ్చు... కానీ వీటిలో ఏ పతకం సాధించినా ఆయా అథ్లెట్లకు అది బంగారంతో సమానమే. ఒక్క ఒలింపిక్ పతకంతోనే చరిత్రను సృష్టించినవారు కొందరైతే ... మళ్లీ మళ్లీ గెలుస్తూ వాటిని అలవాటుగా మార్చుకున్న దిగ్గజాలు కూడా ఎందరో... ఇప్పుడు మరోసారి ఆ విశ్వ సమరానికి సమయం వచ్చేసింది. పతకం వేటలో సర్వం ఒడ్డేందుకు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. వందేళ్ల తర్వాత ‘ఫ్యాషన్ సిటీ’ పారిస్ మరోసారి మెగా ఈవెంట్ కోసం ముస్తాబైంది. ఇన్నేళ్ల ఒలింపిక్స్‌లలో ఎన్నడూ చూడని పలు విశేషాలతో ఈ సంబరాన్ని జయప్రదం చేసేందుకు నిర్వాహకులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ప్రారం¿ోత్సవ కార్యక్రమం మొదలు విజేతలకు అందించే పతకాల్లో చరిత్రను చేర్చడం వరకు అన్నింటా తమ ప్రత్యేకత కనిపించేలా సిద్ధం చేశారు. 124 ఏళ్ల క్రితం పారిస్ ఒలింపిక్స్‌లోనే తొలిసారి మహిళలు అడుగు పెట్టగా... ఇప్పుడు అదే గడ్డపై జరుగుతున్న పోటీల్లో తొలిసారి పురుషులు, మహిళలు సమాన సంఖ్యలో బరిలోకి దిగుతుండటం విశేషం. ఇంట్లో శుభకార్యాన్ని పర్యవేక్షించే పెద్ద మనిషి తరహాలో దాదాపు వేయి అడుగుల ఎత్తులో ఠీవిగా నిలబడిన ఈఫిల్ టవర్ సాక్షిగా రెండు వారాల పాటు ఒలింపిక్ వేడుకలు అంబరాన్నంటనున్నాయి. మూడేళ్ల క్రితం చుట్టూ కోవిడ్ ముసురుకున్న సమయంలో సాగిన టోక్యో ఒలింపిక్స్ అభిమానులకు అర్ధ ఆనందాన్ని మాత్రమే అందించాయి. ఇప్పుడు జరిగే పోటీలు గత గేమ్స్‌కు భిన్నంగా ఫ్యాన్స్‌కు చేరువగా వచ్చి సంబరంలో భాగం చేయనున్నాయి. హోరాహోరీ సమరాల్లో 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు 32 క్రీడాంశాల్లో పోటీ పడిన తర్వాత ఎవరు పతకధారిగా శిఖరాన నిలుస్తారో, ఎవరు గుండె పగిలి కన్నీళ్లతో తిరిగొస్తారో చూడాలి! –సాక్షి క్రీడా విభాగంతొలిసారి స్టేడియం బయట...ఒలింపిక్స్ ప్రారంబోత్సవ వేడుకలను ప్రధాన స్టేడియం లోపల పరిమిత ప్రేక్షకుల మధ్య నిర్వహించడం రివాజు. ఇన్నేళ్ల చరిత్రలో ఇది ఎప్పుడూ మారలేదు. కానీ ఈసారి పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు ఈ వేడుకలను స్టేడియం బయటకు తీసుకొస్తున్నారు. నగరం నడి మధ్యలో సెన్ నది పక్కన పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజల సమక్షంలో ఈ వేడుకలు జరగనున్నాయి. సాధ్యమైనంత ఎక్కువ మంది దీనికి హాజరయ్యేలా సాధారణ పౌరులందరినీ అనుమతిస్తున్నారు. పారిస్ నగరవాసులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి చెందినవారైనా సరే ఈ వేడుకల్లో పాల్గొనవచ్చు. ఎనభై భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే వీటిని అతి పెద్ద వేడుకలుగా చెప్పవచ్చు. దాదాపు వంద బోట్లలో వివిధ దేశాల క్రీడాకారులు సెన్ నదిపై బోటులో ప్రయాణిస్తూ పరేడ్‌లో పాల్గొంటారు. 10,500 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొననుండటం విశేషం. ఆరు కిలోమీటర్ల పొడవున సాగే ఈ పరేడ్ పారిస్ నగరం నడిమధ్యలోంచి వెళ్లి చివరకు ట్రొకాడెరో వద్ద ముగుస్తుంది. ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉండటంతో పాటు అందమైన గార్డెన్లు, ఫౌంటేన్లకు ప్రసిద్ధి. గతంలో ఎన్నడూ లేని విధంగా అథ్లెట్లందరినీ ప్రారం¿ోత్సవ వేడుకల్లో వేదికపైకి ఆహ్వావనించి పరిచయం చేయబోతున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల నుంచి వేడుకలు మొదలవుతాయి. ప్రారంబోత్సవంలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఎవరెవరు ఏం చేయబోతున్నారు అనే విషయాలను మాత్రం నిర్వాహకులు గోప్యంగానే ఉంచారు. అసలు రోజు మాత్రమే దానిని ‘సర్ప్రైజ్’గా చూపించాలని వారు భావిస్తున్నారు. ఎప్పటిలాగే పరేడ్‌లో అందరికంటే ముందు గ్రీస్ దేశపు ఆటగాళ్లు రానుండగా... ఆ తర్వాత శరణార్ధి జట్టు గ్రీస్‌ను అనుసరిస్తుంది. ఆ తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో ఆయా దేశాలు పాల్గొంటాయి. నిర్వాహక దేశం ఫ్రాన్స్ ఈ పరేడ్‌లో చివరగా వస్తుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా తమ దేశం తరఫున కాకుండా వ్యక్తిగత హోదాలో పోటీల బరిలోకి దిగుతున్న రష్యా, బెలారస్ ఆటగాళ్లు ఎవరూ పరేడ్‌లో పాల్గొనరు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ మొత్తం ఈవెంట్ సాగే అవకాశం ఉంది. » ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి పురుషులు, మహిళలు సమాన సంఖ్యలో బరిలోకి దిగుతున్నారు. ఈ పోటీల్లో 5,250 మంది పురుషులు, 5,250 మంది మహిళలు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. » ఒలింపిక్స్‌లో తొలిసారి ఆరి్టస్టిక్ స్విమ్మింగ్ పోటీల్లో పురుషులు కూడా పోటీ పడనున్నారు. » లండన్ (1908, 1948, 2012) తర్వాత మూడుసార్లు ఒలింపిక్స్ నిర్వహిస్తున్న రెండో నగరంగా పారిస్ (1900, 1924, 2024) గుర్తింపు పొందింది. 1924 జూలై 27న పారిస్‌లో ముగింపు ఉత్సవం జరగా... ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత జూలై 26న ప్రారంబోత్సవ కార్యక్రమం జరుగుతోంది. » మొత్తం క్రీడాంశాలు 32... పతకం గెలుచుకునే అవకాశం ఉన్న ఈవెంట్లు 329. » అత్యధికంగా అక్వాటిక్స్లో 49 మెడల్స్ అందుబాటులో ఉండగా... అథ్లెటిక్స్‌లో 48 మెడల్ ఈవెంట్లు ఉన్నాయి. » పారిస్ నగరం, దాని శివార్లలో కలిపి మొత్తం 35 వేదికల్లో పోటీలు జరుగుతాయి. బీచ్ వాలీబాల్ పోటీలను ఈఫిల్ టవర్ పక్కనే నిర్వహిస్తుండటం విశేషం. » ఒలింపిక్స్ ఈవెంట్లలో ఒకటైన సర్ఫింగ్ ను ‘తహితి’ దీవుల్లో నిర్వహిస్తున్నారు. ఫ్రాన్స్‌కు దాదాపు 15 వేల కిలో మీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఈ దీవి ఉంది. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌లకు ఇది దగ్గరగా ఉంటుంది. అయితే ఇది ఫ్రెంచ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న దీవి కావడంతో ఒలింపిక్స్ వేదికల్లో ఒకదానిని దీనిని కూడా ఎంపిక చేయడం విశేషం. » క్రీడా గ్రామంలో మొత్తం 14,250 మంది కోసం గదులు సిద్ధం చేశారు. ప్రతీ రోజూ కనీసం 60 వేల భోజనాలు అందిస్తారు. క్రీడల తర్వాత దీనిని ఒక బస్తీగా మారుస్తున్నారు. నిర్వహణలో సహాయకారిగా ఉండేందుకు 40 వేల మంది వలంటీర్లు ఈ గేమ్స్‌లో అందుబాటులో ఉన్నారు. -
ఆమె కోసమే కాఫీ: శర్వా
బంజారాహిల్స్: ‘నేను పెళ్లి కాకముందు టీ, కాఫీలు తాగేవాడిని కాదు.. పెళ్లయ్యాక నా భార్యకు కాఫీ అంటే ఇష్టమని తనకోసమే కాఫీని ఎంజాయ్ చేస్తున్నాను’ అని హీరో శర్వానంద్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో తన సోదరుడు ఏర్పాటు చేసిన బీన్జ్ కాఫీ షాప్‌ను వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ్మ, ఏపీ రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. 2008 సమయంలో తన కాఫీ షాప్‌లో అప్పట్లో హీరోలు రామ్‌చరణ్, అఖిల్‌తో పాటు చాలా మంది కలిసేవాళ్లమని, వారితో ఎన్నో మెమొరీలు ఉన్నాయన్నారు. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నహీరోలు ఈ వ్యాపారంలోకొస్తే క్వాలిటీ ఫుడ్ ఇస్తారని, తనకు వంట రాదని, కానీ ఏం నచి్చనా వండించుకొని తినేస్తానంటూ చెప్పుకొచ్చారు. విభిన్న రుచులతో పాటు కాంటినెంటల్ రెసిపీలను అందిస్తున్నట్లు నిర్వాహకులు అర్జున్ మైనేని తెలిపారు. పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని, డి.వంశీకృష్ణం రాజు, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
లండన్‌లో శ్రీ వేంకటేశ్వర బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
IPL 2024 Opening Photos: అట్టహాసంగా ఆరంభం.. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేయబోయేది వీరే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మెగా ఫైట్ ప్రారంభమవుతుంది. AR Rahman, Sonu Nigam, Akshay Kumar and Tiger Shroff will perform at the IPL opening ceremony. pic.twitter.com/9kR2dpyOOV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 20, 2024 సీజన్ తొలి మ్యాచ్ కావడంతో మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీ అరేంంజ్ చేశారు నిర్వహకులు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు (6:30 గంటలకు) జరుగనుంది. ఈ ఈవెంట్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. జియో సినిమాలో డిజిటల్ స్ట్రీమింగ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, సీఎస్కే-ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఈ మైదానంలో సీఎస్కే ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. -
అయోధ్య రామాలయం రెడీ
దేవతలు నిర్మించిన పవిత్ర నగరం. సాక్షాత్తు రాముడు నడిచిన పవిత్ర నేల. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఎట్టకేలకు దశాబ్దాల నాటి హిందువుల కల నెరవేరబోతోంది. రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. కింది అంతస్తు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇందులోనే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న జరిగే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి దేశంలోని 8వేల మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తన్నారు. ఇంతకీ ప్రస్తుతం అయోధ్య రామమందిర నిర్మాణం ఎక్కడి వరకు వచ్చింది ? జనవరి 22న జరిగే కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ? 2024, జనవరి 22.. దేశప్రజలకు ప్రత్యేకమైన రోజుగా మారనుంది. అయోధ్య రామ మందిర్ దర్శనం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది హిందువులకు శుభవార్త అందింది. రామాలయ ప్రారంభోత్సవ వేడుక జనవరి 22న అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరిగింది. దీంతో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్‌లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ వస్తున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరితో పాటు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఆ జాబితాలో సినీరంగం నుంచి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ తో పాటు ఇతర ప్రముఖులు.. అలాగే పారిశ్రామిక రంగం నుంచి రతన్ టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులు, భారత్ క్రికెట్ రూపురేఖలు మార్చిన దిగ్గజ క్రికెటర్లలో సచిన్, విరాట్ కోహ్లి లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. అలాగే పూజారులు, దాతలు సహా దేశంలోని పలువురు రాజకీయ నాయకులు సహా దాదాపుగా 8వేల మందికి ఈ ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. ఆహ్వానం అందుకున్న వారిలో పలువురు జర్నలిస్టులు, మాజీ ఆర్మీ అధికారులు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, పద్మ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇందులో 50 మంది కరసేవకుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపించారు. అయితే రామ్ లల్లాను ఐదేళ్ల బాలుడి రూపంలో ఆలయంలో కూర్చోబెడతారు.. ఇందుకోసం కర్ణాటక, రాజస్థాన్ల నుంచి తీసుకొచ్చిన శిలలతో మూడు విగ్రహాలను తయారుచేశారు.. ఈ విగ్రహాలు దాదాపుగా సిద్ధమయ్యాయి. మరోవైపు రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2024లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహించనున్నారు. అయోధ్యలోని రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్‌లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీ తయారు చేసింది. ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చివరి దశలో ఉంది. మరోవైపు ప్రకారం ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్‌రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్లో మార్బుల్‌ను అమర్చారు. అలాగే ఆలయ నృత్య మండపంతోపాటు రంగ మండపానికి సంబంధించిన శిఖరం సిద్ధమైంది. కాగా అయోధ్య రామమందిరాన్ని 8.64 ఎకరాల్లో యూపీ ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆలయంలో గర్భగుడితో పాటు ఐదు మండపాలు ఉంటాయి. గుధ్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఉంటాయి. ఇక జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్న సందర్భంగా.. ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామునికి సేవ చేసే భాగ్యం కలగనుందని వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక చరిత్ర విషయానికొస్తే.. దశాబ్దాలుగా కొనసాగిన బాబ్రీ మసీదు - రామ మందిరం వివాదం 2019 లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ముగిసింది.సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలిగాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, ఆలయ నిర్మాణంపై అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు 2020 ఆగస్ట్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. 1998లో అహ్మదాబాద్‌లోని సోంపురా కుటుంబం రూపొందించిన డిజైన్ ఆధారంగా రామమందిర నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత ఆ డిజైన్ కు 2020లో కొన్ని మార్పులు చేశారు. జనవరి 22న వచ్చే భారీగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి ఏర్పాటు చేసేందుకు అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు కల్పించే విషయంలో ప్రణాళికలు రచిస్తున్నారు. మాజా గుప్తర్ ఘాట్ వద్ద 20 ఎకరాల్లో 25 వేల మందికి వసతి కల్పించేలా నిర్మాణం చేస్తున్నారు. బ్రహ్మకుండ్ వద్ద 30 వేల మందికి.. బాగ్ బిజేసీ వద్ద 25 వేల మందికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కార్‌సేవక్ పురం, మణిరాం దాస్ కంటోన్మెంట్ వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఆ అయోధ్య రామయ్య సేవా భాగ్యాన్ని నోచుకునేందుకు భక్తి పారవశ్యంతో కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. ఇదీ చదవండి: అయోధ్య రామాలయానికి యాచకుల విరాళం -
కోకాపేట్ లో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైత్యన (ఫొటోలు)
-
శ్రీను వైట్ల, గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభోత్సవం
-
మామయ్య కోసం పొలిటికల్ కార్యక్రమానికి వెళ్తున్న అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నల్లగొండ జిల్లాలోని భట్టుగూడెం గ్రామానికి నేడు వెళ్లారు. తన మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్వగ్రామం వద్ద నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ఆయన ప్రారంభించారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి భట్టుగూడెం వద్ద 'కంచర్ల కన్వెన్షన్' పేరుతో ఈ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. (ఇదీ చదవండి: చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో) ఇప్పటికే ఆయన పెద్దవూర మండలం కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఆధునిక వసతులతో కూడిన 1000 మందికి సరిపడే ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవానికి తన అల్లుడైన అల్లు అర్జున్‌తోపాటు మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆయన ఆహ్వానించారు. అంతేకాకుండా నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుమారు 10 వేల మందికి భోజనాలతో పాటు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి: అక్షయ్ కుమార్ పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత) 2014 ఎన్నికల్లోనే చంద్రశేఖర్‌రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 24 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఇప్పుడు తాజాగా వచ్చే ఎన్నికల్లో తన స్వస్థలమైన నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయాలని ఆయన ఉన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా చంద్రశేఖర్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఇలా తన మామయ్య కోసం పాలిటిక్స్ వేడుకలో అల్లు అర్జున్ పాల్గొంటున్నారు. చంద్రశేఖర్‌రెడ్డికి పార్టీ నుంచి సీట్ వస్తే బన్నీ తప్పకుండా మామ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం నడుస్తోంది. -
Cannes Film Festival 2023: అట్టహాసంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఫొటోలు)
-
సుధీర్ పక్కన హీరోయిన్ ఎలా సిగ్గు పడుతుందో చూడండి
-
చాంబర్లోకి తొలుత సీఎం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30న జరిగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ భవన సముదాయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం సచివాలయం ప్రారంభం కాగానే ముందుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన చాంబర్లో ఆసీనులు కానున్నారు. ఆ తర్వాత మంత్రులు, కార్యదర్శులు సీఎంవో, సచివాలయ సిబ్బంది వారి చాంబర్లలోకి వెళ్లి కూర్చోనున్నారు. సచివాలయ ప్రారంబోత్సవం సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఉదయం శాస్త్రోక్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం జరగనుంది. సంబంధిత సమయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. సచివాలయ ప్రారంబోత్సవ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు మేయర్లు తదితరులు కలిపి దాదాపు 2,500 మంది హాజరవుతారని అంచనా. నాలుగు ద్వారాలు నూతన సచివాలయంలో రక్షణ సహా పలు రకాల పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సచివాలయం నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలున్నాయి. తూర్పు ద్వారాన్ని (మెయిన్ గేట్) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహా్వనితులు, దేశ, విదేశీ అతిథులు, ప్రముఖుల కోసం మాత్రమే వినియోగించనున్నారు. వాయవ్య (నార్త్–వెస్ట్) ద్వారాన్ని అవసరం వచ్చినప్పుడే తెరవనున్నారు. ఈశాన్య (నార్త్–ఈస్ట్) ద్వారం గుండా సచివాలయ సిబ్బంది కార్యదర్శులు, అధికారుల రాకపోకలు సాగించనున్నారు. అదే వైపు పార్కింగ్ కూడా ఉండనుంది. ఆగ్నేయ (సౌత్–ఈస్ట్) ద్వారాన్ని కేవలం సందర్శకుల కోసమే తెరవనున్నారు. సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉండనుంది. వికలాంగులు, వృద్ధుల కోసం విద్యుత్‌తో నడిచే బగ్గీల ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు వాహనాలకు సచివాలయంలోకి అనుమతి లేదు. సచివాలయ రక్షణకు సంబంధించి డీజీపీ విధివిధానాలు రూపొందించి పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో సీఎం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు... ♦ ఖాళీ జాగలున్న వారికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం అమలుకు సత్వరమే విధివిధానాలను రూపొందించాలి. ♦ పోడు భూముల పట్టాల పంపిణీని త్వరలో ప్రారంభించాలి. ♦ దళితబంధు పథకాన్ని కొనసాగించాలి. ♦ గొర్రెల పంపిణీని సత్వరమే ప్రారంభించాలి. -
ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకల్లో పాన్ ఇండియా బ్యూటీలు
మరో 8 రోజుల్లో (మార్చి 31) క్రికెట్ పండుగ ఐపీఎల్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌కు మత్తెక్కిచే ఓ వార్త తెలిసింది. ఐపీఎల్ 2023 ఎడిషన్ ప్రారంభ వేడుకల్లో పాన్ ఇండియా బ్యూటీలు రష్మిక మంధన, తమన్నా భాటియా లైవ్ పెర్ఫార్మెన్స్ చేయనున్నారని సమాచారం. కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా ప్రారంభ వేడుకలు జరగని కారణంగా ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. ఇందులో భాగంగానే సినీ గ్లామర్‌ను వాడుకోవాలని భారీ ప్రణాళికను రచించింది. రష్మిక, తమన్నా లతో పాటు మరికొంత మంది మేల్, ఫిమేల్ పాన్ ఇండియా ఆర్టిస్ట్‌లు ఈ వేడుకల్లో పాల్గొంటారని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు వెల్లడించారు. మూడేళ్ల తర్వాత హోమ్ అండ్ అవే ఫార్మాట్ తిరిగి అమల్లోకి వస్తున్నందున, ప్రేక్షకులను వేడుకతో మైదానాలకు ఆహ్వానించాలని భావిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు. కాగా, ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభ వేడుకలు మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఐకానిక్ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు అరంగంట ముందు (సాయంత్రం 7:30 గంటలకు) ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే, బీసీసీఐ.. మహిళల ఐపీఎల్ (WPL)కు ముందు కూడా ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించింది. అయితే, సినీ గ్లామర్ లేకపోవడంతో ఆ వేడుక ఫ్లాప్ అయ్యింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ భారీ తారాగణంతో ఐపీఎల్-2023 ప్రారంభ వేడుకను నిర్వహించాలని డిసైడైంది. -
WPL 2023: షురూ అయిన మహిళల ఐపీఎల్.. దుమ్మురేపిన స్టార్స్ (ఫొటోలు)
-
అదే ఆమె గొప్పతనం.. మంత్రి రోజాపై కిరణ్ ప్రశంసల వర్షం
ఏపీ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు లలితా జువెలరీస్ ఎండీ కిరణ్. చిత్తూరు జిల్లాలో నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బ్రాంచ్‌లు కలిగిన లలితా జువెలరీస్ తాజాగా 46వ షోరూంను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. 'డబ్బులు ఊరికే రావు' అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు కిరణ్. ఈ సందర్భంగా హాజరైన మంత్రి రోజాను కిరణ్ కొనియాడారు. పిలవగానే వచ్చినందుకు రోజాకు ధన్యవాదాలు తెలిపారు. కిరణ్ మాట్లాడుతూ.. 'మా ఆహ్వానం అందగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఇటీవలే రోజా ఇంటికి వెళ్లి షోరూం ప్రారంభోత్సవానికి పిలిచాం. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మాకు చాలా బాగా మర్యాదలు చేశారు. చాలా సంతోషంగా ఉంది. అది ఆమె గొప్పతనం. మనం పిలిచిన వ్యక్తి గెస్ట్‌గా వస్తే ఆనందం మాటల్లో వర్ణించలేం.' అంటూ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం రోజా కూడా లలితా జువెలరీస్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అమెరికా ప్రెసిడెంట్ కూతురు ప్రేమలో పడితే? మూవీ లాంఛింగ్
కిషోర్ తేజ హీరోగా అంకిత మూలేర్ హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం హీరో ఆఫ్ ఇండియా. ఆకుల రాఘవ దర్శకత్వంలో తుమ్మల సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ కూతురు ఇండియా వచ్చినప్పుడు ఓ తెలుగు యువకుడి ప్రేమలో ఆమె పడితే? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అన్నారు ఆకుల రాఘవ. -
ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆకట్టుకున్న జపాన్ అభిమానులు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మాములుగా మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులంతా తమ వెంట తెచ్చుకునే తిను బండారాలు సహా పేపర్లు, బ్యానర్లు, జెండాలు, పోస్టర్లను మ్యాచ్ ముగిశాక అక్కడే వదిలేసి వెళ్తుంటారు. మ్యాచ్ పూర్తయ్యాకా చూస్తే స్టేడియంలో చిన్నపాటి చెత్తకుండీ తయారవుతుంది. మ్యాచ్ తర్వాత చెత్తను క్లీన్ చేయలేక సిబ్బంది నానా అవస్థలు పడుతుంటారు. తాజాగా ఫిఫా ప్రారంభమైన నవంబర్ 20న ప్రారంభోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ఖతర్ - ఈక్వెడార్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫలితం పక్కనబెడితే ఆటముగిశాక జపాన్ కు చెందిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కొంతమంది స్టేడియం చుట్టూ కలియతిరుగుతూ ఇతర దేశాల ఫ్యాన్స్ పడేసిన చెత్తనంతా సంచుల్లోకి ఎత్తుతూ కనిపించారు. ఖతర్ కు చెందిన ఓ యూట్యూబర్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో జపనీయులు స్టేడియంలో చెత్త ఉన్న చోటకు వెళ్లి దానిని సంచుల్లో ఎత్తుతూ కనిపించారు. తమ దేశం మ్యాచ్ కాకపోయినా ఆట చూడటానికి వచ్చిన జపనీయులు తమ చుట్టూ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా కనిపించేసరికి తట్టుకోలేకపోయారు. జపాన్ ప్రజలు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తారు.అక్కడ రోడ్డు మీద వెళ్తూ చాక్లెట్ తింటే ఆ ప్యాక్ ను జేబులోనే పెట్టుకుని రోడ్డు మీద ఉన్న చెత్త డబ్బాల్లో పడేస్తారు. అందుకే జపాన్ లో వీధులు పరిశుభ్రంగా కనిపిస్తాయి. ఇదే సూత్రాన్ని జపాన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఖతర్ స్టేడియంలో కూడా పాటించారు. Japanese fans at the opening World Cup match cleaned up the stands after Qatar-Ecuador. 🇯🇵 Most respectful fans in the world. 👏 🎥 IG/qatarlivingpic.twitter.com/yZHhe0sQNw — Football Tweet ⚽ (@Football__Tweet) November 21, 2022 చదవండి: మరొక మ్యాచ్ ఓడితే అంతే సంగతి.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్ చాన్స్ ఎంత? -
అంగరంగ వైభవంగా 36వ జాతీయ క్రీడల వేడుకలు
36వ జాతీయ క్రీడా ప్రారంభోత్సవ వేడుకలు గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ టార్చ్‌ను వెలిగించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం జాతీయ క్రీడలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా, రెజ్లర్ రవికుమార్ దహియాలు పాల్గొన్నారు. అక్టోబర్ 10 వరకు జరిగే ఈ క్రీడల్లో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు భారత త్రివిధ దళాలకు చెందిన సర్వీసెస్ జట్టు నుంచి మొత్తం ఏడువేల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. మొత్తం 36 ఈవెంట్స్‌లో పతకాల కోసం పోటీలుంటాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్ నగరాల్లో మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. చివరిసారి 2015లో జరిగిన జాతీయ క్రీడలకు కేరళ ఆతిథ్యమిచ్చింది. ఆ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 33 పతకాలతో 12వ ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. The contingents of all states and UTs arrive at the opening ceremony of the 36th National Games at Narendra Modi stadium in Ahmedabad, Gujarat. pic.twitter.com/watT2xAmG8 — ANI (@ANI) September 29, 2022 -
జనవరికి సిద్ధం కానున్న కొత్త సచివాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ భవనం వచ్చే ఏడాది జనవరి నాటికి సిద్ధం కాబోతోంది. ఈ దసరా నాటికే పూర్తిచేసి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా.. పనుల్లో ఆలస్యం వల్ల కుదరని పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు మరో మూడు నెలల గడువు కావాలని నిర్మాణ సంస్థ కోరినట్టు తెలిసింది. ఇటీవల సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ పనులను తనిఖీ చేసిన సందర్భంగా అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఈ అంశంపై చర్చ జరిగింది. దసరా నాటికి సచివాలయాన్ని ప్రారంభించాలని సీఎం పేర్కొనగా.. ఆలోగా భవనం పైభాగంలో పలు పనులు పూర్తయ్యేలా లేవని నిర్మాణ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారని.. దీనిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దసరా నాటికే పూర్తికావాలని ఎన్నిసార్లు ఆదేశించినా.. తీరు మారకుంటే ఎలాగని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే కేవలం పైభాగంలో కొన్నిపనులే జరగాల్సి ఉన్నందున, దసరా నాటికి కొత్త సచివాలయాన్ని ప్రారంభించుకోవచ్చని, పైభాగంలో పనులతో పెద్దగా ఇబ్బంది ఉండదని నిర్మాణ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నట్టు సమాచారం. మూడు నెలలు సమయమిస్తే అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దసరా నాటికి భవనాన్ని ప్రారంభిస్తారా, నిర్మాణ సంస్థ కోరిన గడువిచ్చి అన్ని పనులు పూర్తయ్యాకే ప్రారంభిస్తారా అన్నదానిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధాన గుమ్మటంలో జాప్యంతో! కొత్త సచివాలయాన్ని ఏడంతస్తుల్లో, 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దిగువ భాగంలో ప్రధాన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అంతర్గతంగా తుది పనులు నడుస్తున్నాయి. కొన్ని అంతస్తుల్లో చాంబర్లను కూడా సిద్ధం చేశారు. త్వరలో ఫర్నీచర్ కూడా రాబోతోంది. భవనం వెలుపల ధోల్పూర్ ఆగ్రా ఎర్రరాతిని బేస్‌మెంట్‌గా పరిచే పని జరుగుతోంది. మరోవైపు తలుపులు, కిటికీలు, వాటికి అద్దాలు బిగించే పని కూడా మొదలైంది. ఇవన్నీ అనుకున్న సమయానికి పూర్తి కానున్నాయి. కానీ భవనంపైన ప్రధాన ఆకర్షణగా నిర్మిస్తున్న పర్షియన్ శైలి గుమ్మటం పనులు ఇటీవలే మొదలయ్యాయి. దీన్ని హడావుడిగా నిర్మిస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని.. జాగ్రత్తగా చేపట్టాల్సి ఉంటుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. వరుస ఆటంకాలతో.. కొత్త సచివాలయం నిర్మాణం ప్రారంభించినప్పుడు 2021 దసరా నాటికే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వరుస ఆటంకాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. భారీ భవనం అయినందున పునాదులను లోతుగా తవ్వారు. ఈ సమయంలో కఠినమైన రాయి రావడం, కంట్రోల్ బ్లాస్టింగ్ చేసి తొలగించాల్సి రావడంతో సమయం వృధా అయింది. తర్వాత కరోనా లాక్ డౌన్లతో పనులు ఆగిపోయాయి. కూలీలు తిరిగి వచ్చి పనులు గాడినపడేందుకు నెలల సమయం పట్టింది. రాజస్థాన్ ధోల్పూరు గనుల నుంచి ఆగ్రా ఎర్రరాయి, లేత గోధుమ రంగు రాయిని తెప్పించడం కోసం సమయం పట్టింది. వేగంగా పూర్తిచేసేందుకు కూలీల సంఖ్యను రెట్టింపు చేసి.. 2,800 మందిని వినియోగిస్తున్నారు. -
CWG 2022: అంగరంగ వైభవంగా.. కామన్వెల్త్ గేమ్స్ 2022 ప్రారంభోత్సవం (ఫోటోలు)
-
CWG 2022: ‘రవి అస్తమించని’ క్రీడలు
అమెరికా లేకపోతేనేమి, ఆస్ట్రేలియా ఆట కనువిందు చేస్తుంది... చైనా కనిపించకపోయినా ఇంగ్లండ్ స్టార్ల జోరు కట్టి పడేస్తుంది... రష్యా మెరుపులకు అవకాశం లేకున్నా... కెనడా, న్యూజిలాండ్ ఆ లోటును తీరుస్తాయి... ఇక పెద్ద సంఖ్యలో పతకావకాశాలతో సగటు భారత క్రీడాభిమానికి పన్నెండు రోజుల పాటు సరైన వినోదం ఖాయం. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల సంక్షిప్త రూపమిది. ఒకనాడు బ్రిటీష్ పాలనలో ఉండి, ఆపై స్వతంత్రంగా మారిన దేశాల మధ్య క్రీడా మైదానాల్లో సాగే సమరాలకు వేదిక ఈ ఆటలు... ప్రపంచ సంబరం ఒలింపిక్స్‌తో పోలిస్తే స్థాయి కాస్త తక్కువే అయినా... ఈ క్రీడలకు తమదైన ప్రత్యేకత ఉంది. వర్ధమాన ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇది సరైన చోటు కాగా... వనుతూ, మాల్టా, నౌరూ... ఇలా ప్రతీ చిన్న దేశం పతకంతో సందడి చేస్తుంటే కనిపించే క్రీడా స్ఫూర్తి, వేదికపై ఆ కళే వేరు...72 దేశాలకు చెందిన ఆటగాళ్లతో ఆగస్టు 8 వరకు జరిగే ఈ పండగలో చివరాఖరికి ఎవరెన్ని పతకాలను తమ ఖాతాలో వేసుకుంటారనేది ఆసక్తికరం. ►భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి గం. 11:30 నుంచి ప్రారంభోత్సవం జరగనుంది. సోనీ సిక్స్, సోనీ టెన్–1,2,3,4 చానెల్స్‌లో, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. బర్మింగ్‌హామ్: 2022 సంవత్సరంలో 22వ కామన్వెల్త్ క్రీడలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ పోటీల్లో దాదాపు ఐదువేల మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనుండగా, శుక్రవారం నుంచి పోటీలు మొదలవుతాయి. మొత్తం 20 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పతకాల కోసం పోటీ పడతారు. మహిళల క్రికెట్ తొలిసారి టి20 రూపంలో కామన్వెల్త్ క్రీడల్లో అడుగు పెట్టనుండటం విశేషం. సాధారణంగా రెండు ఒలింపిక్స్ మధ్య (రెండేళ్ల తర్వాత, రెండేళ్ల ముందు) వీటిని నిర్వహిస్తారు. అయితే కోవిడ్‌తో టోక్యో క్రీడలు ఆలస్యం కావడంతో సంవత్సరం లోపే ఈ మెగా ఈవెంట్ ముందుకు వచ్చింది. 1930లో తొలిసారి ‘బ్రిటీష్ ఎంపైర్ గేమ్స్’ పేరుతో నిర్వహించిన ఈ క్రీడలు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మినహా ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగాయి. 1934 (లండన్), 2002 (మాంచెస్టర్) తర్వాత ఇంగ్లండ్ మూడోసారి కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. వేదిక మారి... నిజానికి ఈసారి పోటీలు దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరగాలి. 2015లో ఆ ఒక్క దేశమే బిడ్ వేయడంతో హక్కులు కేటాయించారు. అయితే ఆర్థికపరమైన సమస్యలతో తమ వల్ల కాదంటూ 2017లో దక్షిణాఫ్రికా చేతులెత్తేయడంతో వేదికను మార్చాల్సి వచ్చింది. ఈ క్రీడల మొత్తం బడ్జెట్ 778 మిలియన్ పౌండ్లు (రూ. 80 వేల కోట్లు). పోటీలపరంగా చూస్తే ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇన్నేళ్ల క్రీడల చరిత్రలో మొత్తం 932 స్వర్ణాలు సహా 2,415 పతకాలతో ఆసీస్ అగ్రస్థానంలో ఉండగా... 2,144 పతకాలతో ఇంగ్లండ్ (714 స్వర్ణాలు) రెండో స్థానంలో నిలిచింది. కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలూ పతకాల పట్టికలో ముందంజలో ఉండగా... జమైకా, కెన్యావంటి దేశాలు అథ్లెటిక్స్‌లో తమ ప్రభావం చూపించగలిగాయి. ఓవరాల్‌గా భారత్ కూడా 2002 నుంచి టాప్–5లో నిలబడుతూ వస్తోంది. ప్రాభవం కోల్పోతున్నాయా! 22 సార్లు క్రీడల నిర్వహణ మొత్తంగా 9 దేశాలకే పరిమితమైంది. వచ్చేసారి కూడా ఆస్ట్రేలియాలోనే (విక్టోరియా రాష్ట్రం) జరగనున్నాయి. ఇంత భారీ మొత్తం ఖర్చు చేసే స్థితిలో చాలా కామన్వెల్త్ దేశాలు లేవు. పైగా పోటీల స్థాయి ఒలింపిక్స్‌తో మాత్రమే కాదు, ఆసియా క్రీడలతో పోల్చి చూసినా చాలా తక్కువగా ఉంటోంది. ఒక్క అథ్లెటిక్స్‌లో మాత్రం ప్రపంచస్థాయి ప్రమాణాలు కనిపిస్తుండగా, మిగతా క్రీడాంశాల్లో ఇక్కడ నమోదయ్యే అత్యుత్తమ ప్రదర్శనలకు, ఒలింపిక్ ప్రదర్శనలకు మధ్య చాలా అంతరం ఉంటోంది. వేర్వేరు కారణాలతో స్టార్ ఆటగాళ్లు కామన్వెల్త్ క్రీడలకు దూరమవుతుండటంతో ఆసక్తి ఒక్కసారిగా తగ్గిపోతోంది. భారత్ కోణంలో చూస్తే ఇక్కడి ఫలితాలు ఆటగాళ్లను, అభిమానులను ‘భ్రమల్లో’ ఉంచుతున్నాయని, ఈ ఫలితం చూసి క్రీడల్లో బాగున్నామని భావించడం సరైంది కాదని పలువురు మాజీ ఆటగాళ్లు తరచుగా వ్యాఖ్యానించడం వాస్తవ పరిస్థితి చూపిస్తోంది. అన్నింటికి మించి రాజకీయపరమైన కోణంలో ఈ క్రీడలపై అనాసక్తి కనిపిస్తోంది. ఒలింపిక్స్‌కు ప్రత్యామ్నాయంగా, అమెరికా ఆధిపత్యానికి ఎదురుగా నిలబడేందుకు తీసుకొచ్చి కామన్వెల్త్ క్రీడలు 1960ల వరకు మంచి ఫలితాలు అందించాయి. ఆ తర్వాతే వాటి స్థాయి పడిపోయింది. ఇన్నేళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఇంకా బ్రిటీష్ పాలించిన దేశాల మధ్య పోటీ ఏమిటంటూ వచ్చే విమర్శలతో పాటు... కామన్వెల్త్ దేశాల మధ్య ఒక కూటమిగా ఎలాంటి రాజకీయ సారూప్యత లేదు. సభ్య దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు, కీలక విధాన నిర్ణయాల మీద సహకారం అందించే విధానం, స్పష్టమైన పాత్ర లేకపోగా, అంతటి బలం కూడా వీటికి లేదు. దాంతో ఇవి నామమాత్రంగా మారిపోతున్నాయి. 66లో 16 పోయినట్లే! ఈసారి కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్ క్రీడాంశాన్ని తొలగించడం భారత్‌కు పెద్ద దెబ్బే. 2018లో మన దేశం సాధించిన 66 పతకాల్లో 16 (అత్యధికంగా 7 స్వర్ణాలు సహా) షూటింగ్ ద్వారా వచ్చాయి. భారత్ మూడో స్థానంలో నిలవగా, ఈసారి కిందకు దిగజారే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్‌లో మనకు ఖాయంగా మెడల్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత్ నుంచి ఈసారి 16 క్రీడాంశాల్లో కలిపి మొత్తం 215 మంది క్రీడాకారులు పతకాల వేటలో ఉన్నారు. నేడు జరిగే ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పతాకధారులుగా వ్యవహరిస్తారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను ‘ప్లాగ్ బేరర్’గా ఎంపిక చేసినా అతను గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యాడు. దాంతో 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత బృందానికి ‘ఫ్లాగ్ బేరర్’గా వ్యవహరించిన సింధుకు మరోసారి అవకాశం వచ్చింది. భారత్ @ బర్మింగ్‌హామ్ ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో 215 మంది పోటీపడుతున్నారు. అథ్లెటిక్స్ (43), హాకీ (36), మహిళలక్రికెట్ (15), వెయిట్‌లిఫ్టింగ్ (15), సైక్లింగ్ (13), బాక్సింగ్ (12), రెజ్లింగ్ (12), టేబుల్ టెన్నిస్ (12), బ్యాడ్మింటన్ (10), లాన్ బౌల్స్ (10), స్క్వాష్ (9) జిమ్నాస్టిక్స్ (7), స్విమ్మింగ్ (7), జూడో (6), ట్రయాథ్లాన్ (4), పారా పవర్‌లిఫ్టింగ్ (4). కామన్వెల్త్ గేమ్స్ షెడ్యూల్ ►ప్రారంభ వేడుకలు నేడు రాత్రి గం. 11:30 నుంచి ►అథ్లెటిక్స్: జూలై 30 నుంచి ఆగస్టు 7 ►అక్వాటిక్స్: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►బ్యాడ్మింటన్: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►3గీ3 బాస్కెట్‌బాల్: జూలై 29 నుంచి ఆగస్టు 2 ►బీచ్ వాలీబాల్: జూలై 30 నుంచి ఆగస్టు 7 ►బాక్సింగ్: జూలై 29 నుంచి ఆగస్టు 7 ►క్రికెట్: జూలై 29 నుంచి ఆగస్టు 7 ►సైక్లింగ్: జూలై 29 నుంచి ఆగస్టు 7 ►జిమ్నాస్టిక్స్: జూలై 29 నుంచి ఆగస్టు 6 ►హాకీ: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►జూడో: ఆగస్టు 1 నుంచి 3 ►లాన్ బౌల్స్: జూలై 29 నుంచి ఆగస్టు 6 ►నెట్‌బాల్: జూలై 29 నుంచి ఆగస్టు 7 ►పారా పవర్‌లిఫ్టింగ్: ఆగస్టు 4 ►రగ్బీ సెవెన్స్: జూలై 29 నుంచి 31 ►స్క్వాష్: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►టేబుల్ టెన్నిస్: జూలై 29 నుంచి ఆగస్టు 8 ►ట్రయాథ్లాన్: జూలై 29 నుంచి 31 ►వెయిట్‌లిఫ్టింగ్: జూలై 30 నుంచి ఆగస్టు 3 ►రెజ్లింగ్: ఆగస్టు 5 నుంచి 6 ►ముగింపు వేడుకలు ఆగస్టు 8 మనోళ్లు 11 మంది... కామన్వెల్త్ గేమ్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కలిపి మొత్తం 11 మంది భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జ్యోతి యెర్రాజీ, నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ, సబ్బినేని మేఘన తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడుతున్నారు. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది బరిలోకి దిగారు. ►అథ్లెటిక్స్: జ్యోతి యెర్రాజీ (ఆంధ్రప్రదేశ్; మహిళల 100 మీటర్ల హర్డిల్స్) ►బ్యాడ్మింటన్: సింధు, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), సుమీత్ రెడ్డి, గాయత్రి గోపీచంద్ (తెలంగాణ). ►బాక్సింగ్: నిఖత్ జరీన్ (తెలంగాణ; మహిళల 50 కేజీలు), హుసాముద్దీన్ (తెలంగాణ; పురుషుల 57 కేజీలు). ►మహిళల హాకీ: రజని ఇటిమరపు (ఆంధ్రప్రదేశ్; రెండో గోల్‌కీపర్) ►టేబుల్ టెన్నిస్: ఆకుల శ్రీజ (తెలంగాణ) ►మహిళల టి20 క్రికెట్: సబ్బినేని మేఘన (ఆంధ్రప్రదేశ్) -
పీవీ సింధుకు అరుదైన గౌరవం
బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు రేపటి (జులై 28) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మహా క్రీడా సంగ్రామానికి సంబంధించి ప్రారంభ వేడుకలు (ఓపెనింగ్ సెర్మనీ) కూడా రేపే ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలు భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు మొదలవుతాయి. గాయం కారణంగా భారత పతాకధారి నీరజ్ చోప్రా ఈ ఈవెంట్ నుంచి తప్పుకోవడంతో ఓపెనింగ్ సెర్మనీలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భారత ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) బుధవారం (జులై 27) వెల్లడించింది. రెండుసార్లు ఒలింపిక్ మెడల్స్ సాధించిన సింధుకు గతంలో పలు సందర్భాల్లో భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని టీమిండియాను లీడ్ చేసిన అనుభవం ఉంది. ఇదిలా ఉంటే, 72 దేశాల నుంచి 5 వేలకుపైగా అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నారు. 12 రోజుల పాటు (జులై 28- ఆగస్ట్ 8) 20 క్రీడా విభాగాల్లో అథ్లెట్లు పోటీ పడనున్నారు. 18వ సారి ఈ ఈవెంట్లో పాల్గొంటున్న భారత్.. మొత్తం 16 విభాగాల్లో 214 మంది అథ్లెట్లతో పోటీపడుతుంది. భారత్ బంగారు పతకాలు సాధించే అవకాశం ఉన్న విభాగాల్లో మహిళల బ్యాడ్మింటన్ కూడా ఒకటి. ఈ ఈవెంట్‌కు ముందే సింగపూర్ ఓపెన్ టైటిల్ నెగ్గి జోరుమీదున్న సింధు ఈసారి తప్పక గోల్డ్ సాధిస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. సింధు గత కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్‌లో సిల్వర్ మెడల్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించింది. చదవండి: పంతం నెగ్గించుకున్న లవ్లీనా.. కామన్వెల్త్ గ్రామంలోకి కోచ్‌కు అనుమతి