తెలుగు తల్లికి జరిగిన పదపుష్ప పాదార్చనలతో విశాఖ పులకించింది. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన 'ఉత్తరాంధ్ర శతక' ఆవిష్కరణ కార్యక్రమం వైజాగ్‌లో ఘనంగా జరిగింది. తానా పూర్వాధ్యక్షులు, తానా విశ్వ సాహితీవేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్ సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. పది శతకాలు ప్రచురణచేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో సభలు చేయాలని అమెరికాలోని తెలుగు భాషాభిమానులు పూనుకున్నారు.
24వ తేదీ ఉదయం జొన్నవిత్తుల స్వయంగా రాసిన 108 పద్యాల రాతప్రతిని సముద్రునికి సమర్పించారు. అనంతరం సాగరతీరంలో చిన్నారులు అక్షర మాలను రాసి, పూలతో పూజించి, తెలుగు పద్యాలను పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యశాస్త్రి, కలశపూడి శ్రీనివాసరావు, సూరపనేని విజయకుమార్, పైడా కృష్ణప్రసాద్, పరవస్తు ఫణిశయన సూరి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment