
సాక్షి,విశాఖ: కూటమి పాలనలో మహిళలు,చిన్నారులకు రక్షణ లేకుండా పోతుంది. రాష్ట్రంలో మహిళలపై రోజుకో దాడులు, హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా, విశాఖలో దారుణం చోటు చేసుకుంది. యువతి దారుణ హత్యకు గురైంది. హత్య అనంతరం యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు.
బీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దాకమర్రి ఫార్చ్యూన్ లే అవుట్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.