
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ షాక్‌కు గురై సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందింది. మురళీనగర్‌లో ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండో అంతస్తు నుంచి కేబుల్ వైర్ ద్వారా పై అంతస్తు నుండి పాల ప్యాకెట్ తీస్తున్న క్రమంలో జీవీ పద్మావతి(29) విద్యుత్ షాక్‌కు గురైంది. ఆమె భర్త అజయ్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
మరో విషాద ఘటనలో..
ప్రేమ వివాహానికి అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ చెందిన యువకుడు గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అక్కయ్యపాలెంలోని జగన్నాథపురానికి చెందిన కొణతాల లోకనరేంద్ర(29) సొంతంగా క్యాబ్ నడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. యువతి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఫోర్త్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.
ఇరు కుటుంబాల సమక్షంలో ఇరువురికి సంబంధం లేనట్టు ఉంటామని ఒప్పకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 9న యువతికి పెళ్లి చేసేందుకు ముహూర్తం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న యువకుడు ఆ అమ్మాయినే చేసుకుంటానని తల్లిదండ్రుల్ని బతిమాలాడు. వారు నిరాకరించడంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.
ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పోలీసులకు తెలిపి, యువతితో మాట్లాడించి బయటకు రప్పించేందుకు ప్రయతి్నంచారు. అయినా స్పందన లేకపోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని, మరణించి ఉన్నాడు. తండ్రి చంద్రరావు ఫిర్యాదు మేరకు సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.